మూడేళ్లలో చాలా నేర్చుకున్నాను: రోషన్‌ | Roshan about Champion movie | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో చాలా నేర్చుకున్నాను: రోషన్‌

Dec 21 2025 3:06 AM | Updated on Dec 21 2025 3:06 AM

Roshan about Champion movie

‘‘నా సినిమాల కథలను ముందు నేనే వింటాను. నాకు నచ్చిన స్క్రిప్ట్స్‌ గురించి నాన్నతో (నటుడు శ్రీకాంత్‌) చర్చిస్తాను. నాన్న పూర్తి కథ వినరు కానీ స్టోరీ లైన్‌ వింటారు. అయినప్పటికీ  కథ, సినిమాల ఎంపికలో తుది నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ‘చాంపియన్‌’ సినిమా కథ కూడా ఒక లైన్‌లా విన్నారు’’ అని రోషన్‌ చెప్పారు. ఆయన హీరోగా, అనస్వరా రాజన్‌ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘చాంపి యన్‌’. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్‌ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోషన్‌ పంచుకున్న విశేషాలు. 

నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్‌లోనే ఇండస్ట్రీకి వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేశాను. ‘పెళ్లి సందడి’ (2021) సినిమా తర్వాత నేను బ్రేక్‌ తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ, కమ్‌ బ్యాక్‌ ఇవ్వడానికి ఇదే సరైన వయసు. ఈ విరామం తీసుకోవడం కూడా పూర్తిగా నా నిర్ణయమే. యాక్టింగ్‌ అంటే హ్యూమన్‌ ఎమోషన్స్‌ తెలియాలి... దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్‌ చేశాను... ఆ విధంగా చాలా నేర్చుకున్నాను. 

⇒  1948లో జరిగే కథ ‘చాంపియన్‌’. చరిత్రలో బైరాన్‌ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్‌ అనే ఒక ఫిక్షనల్‌ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేసి ‘చాంపియన్‌’ కథని చూపించడం జరిగింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్‌కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ‘చాంపియన్‌’. నాపాత్ర ప్రాపర్‌ హైదరాబాదీ... అందుకోసం ఆ యాస స్పష్టంగా నేర్చుకున్నాను. ఈ మూవీ కోసం ప్రదీప్‌గారు, స్వప్నగారు, ఆర్ట్‌ డైరెక్టర్‌ తోటగారు ప్రతిదీ పరిశోధించారు. పీటర్‌ హెయిన్స్‌గారు అద్భుతమైన యాక్షన్‌ డిజైన్‌ చేశారు. షూటింగ్‌లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. 

⇒  మా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ అన్న నా గురించి, మా టీమ్, సినిమా గురించి అంత బాగా మాట్లాడటం హ్యాపీ అనిపించింది. అఖిల్‌ అన్న కూడా నాకు మంచి ఫ్రెండ్‌. అలాగే తమన్‌ అన్న... మేమందరం కలిసి క్రికెట్‌ ఆడతాం. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు రాజీ పడకుండా ‘చాంపియన్‌’ నిర్మించారు. నేను చాలా మొహమాటంగా ఉంటాను. ‘కొంచెం ఓపెన్‌గా ఉండు, మాట్లాడు’ అని నాగ్‌ అశ్విన్‌గారు చె΄్పారు. 

⇒  నేను క్రికెటర్, మా చెల్లి డాక్టర్, మా తమ్ముడు ఐఏఎస్‌ కావాలనుకున్నారు నాన్న. నాకు కూడా క్రికెటర్‌ కావాలనే ఉండేది. అయితే నటుడయ్యాను. నా కొత్త సినిమాల ప్రకటన తర్వలోనే ఉంటుంది. ఇకపై రెండు సంవత్సరాలకి కనీసం మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement