మళ్లీ మనసంతా నువ్వే.. | Manasantha Nuvve Film Rereleasing on Feb 14th | Sakshi
Sakshi News home page

మళ్లీ మనసంతా నువ్వే..

Feb 9 2026 12:43 AM | Updated on Feb 9 2026 12:43 AM

Manasantha Nuvve Film Rereleasing on Feb 14th

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ‘మనసంతా నువ్వే’ సినిమా రీ రిలీజ్‌ కానుంది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్, తనూ రాయ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్‌ డ్రామా ‘మనసంతా నువ్వే’. వీఎన్‌ ఆదిత్య దర్శకత్వంలో ఎమ్‌.ఎస్‌. రాజు నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ నెల 14న ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి,  చైతన్యా రెడ్డి, రఘురామ్‌ రెడ్డి, రవికాంత్‌ రెడ్డి రీ రిలీజ్‌ చేస్తున్నారు. ‘‘ఈ సినిమా ఈ తరం యువతను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement