‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు.. సత్య కోసం మరోసారి | Megastar Chiranjeevi Praises Korean KanakaRaju Movie Team | Sakshi
Sakshi News home page

‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు.. సత్య కోసం మరోసారి

Aug 11 2026 10:54 PM | Updated on Aug 12 2026 12:26 AM

Megastar Chiranjeevi Praises Korean KanakaRaju Movie Team

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

‘‘కొరియన్‌ కనకరాజు’ని ఇండియా నుంచి కొరియాకి వెళ్లిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్‌ మూవీ చూసినట్టు ఉంటుంది. ఇందుకు చాలా ఖర్చు అయి ఉంటుందనుకున్నాను. కానీ లిమిటెడ్‌ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు మేర్లపాక గాంధీ. విజువల్స్‌ మీద, ఎడిటింగ్‌ సెన్స్‌ ఉండాలి డైరెక్టర్‌కి. కొరియా వెళ్లినా అంత ఖర్చు కాలేదంటే అది గాంధీ ప్లానింగ్‌... తన భయం, భక్తి. నిర్మాతలు బతకాలి... మనతో పాటు నిర్మాతలూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకోవాలి. అంతేకానీ నిర్మాతలను నలిపేసి సినిమా తీయకూడదు. తక్కువ రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేయగలగాలి. ప్రతి ఒక్కరూ ఇది అమలు చేయాలి. ఇక 2026 సెకండ్‌ హాఫ్‌ ‘పెద్ది’ సినిమా హిట్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం, చెన్నై లవ్‌ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్‌ కనకరాజు’... ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. 


‘‘ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. అది మరోసారి ‘కొరియన్‌ కనకరాజు’తో పునరావృతమైంది’’ అని చెప్పారు. ముఖ్యంగా నటుడు సత్య కామెడీ తనను ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి తెలిపారు. ఈ సినిమాకి “మేర్లపాక గాంధీ ఇంజనీర్ అయితే.. వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడని ఆయన ప్రశంసించారు. ఈ చిత్రంలో సత్య నటన నాకు చాలా నచ్చింది. అతని కోసం ఈ సినిమాను మరోసారి చూడాలనిపిస్తుందన్నారు.

అలాగే హీరోయిన్‌ రితిక గ్లామర్, ఎనర్జీ, మురళీధర్ గౌడ్ సహజ నటనను ప్రశంసించారు. మంచి కంటెంట్, కొత్తదనం, హెల్దీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు తప్పకుండా వస్తారని చిరంజీవి పేర్కొన్నారు. ‘కొరియన్‌ కనకరాజు’ సక్సెస్‌ పట్ల వరుణ్‌ తేజ్, తమన్, మేర్లపాక గాంధీ, రితిక తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement