వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఈవెంట్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ చిత్రంలో పొట్టి మామగా మెప్పించిన నటుడు మెగాస్టార్ కాళ్లపై పడబోయారు. ఇది గమనించిన చిరు అతన్ని వెంటనే దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అతనితో ఫోటో దిగి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్‌కు హిట్ పడడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
A Fan Emotional moment ❤️@KChiruTweets #KoreanKanakaraju
pic.twitter.com/tP2BZUHdRb— ⛩️GHANI BHAI 🗡️🐉 (@Ghanibhaipspk) August 11, 2026
Tears of pure joy! 🥺 Seeing Megastar @KChiruTweets live on stage became an emotional moment for one of the Korean Kanakaraju artists .... pic.twitter.com/nCSq5ypX0S
— Let's X OTT GLOBAL (@LetsXOtt) August 11, 2026


