breaking news
Korean Kanakaraju Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
రెండో వీకెండ్ అయిపోయినా సరే ఇంకా 'ఇరుముడి' సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. గతవారం రిలీజైన 'టాక్సిక్' మాత్రం సైలెంట్ అయిపోయింది. ఇక ఈ వారం చాలానే మూవీస్ రాబోతున్నాయి. వాటిలో అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక', సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 'రోమాంచకం' చిత్రాలు ఉన్నంతలో కాస్త బజ్‌తో విడుదలవుతున్నాయి. వీటితో పాటు దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్', మమిత బైజు 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్', మీర్జాపూర్, మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం, సహ లాంటి మూవీస్ కూడా బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)మరోవైపు ఓటీటీల్లోనూ 18 వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రీసెంట్ హిట్స్ అయిన డిసి, కొరియన్ కనకరాజు, ఉన్మాదం లాంటి చిత్రాలు ఉన్నాయి. అలానే 'జగమే సంగీతం' అనే సిరీస్ కూడా చూడాలనే ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ వీకెండ్ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 06 వరకు)సన్ నెక్స్ట్డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 04అమెజాన్ ప్రైమ్జగమే సంగీతం (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 04హాట్స్టార్ద కోర్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - సెప్టెంబరు 04సోనీ లివ్క్రైమ్ పాట్రోల్ (హిందీ సిరీస్) - ఆగస్టు 31ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 04నెట్ఫ్లిక్స్అన్టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 01జారెడ్ ఫ్రైడ్ (ఇంగ్లీష్ కామెడీ షో) - సెప్టెంబరు 011000 ఎల్బీ సీజన్ 9 (ఇంగ్లీష్ రియాలిటీ షో) - సెప్టెంబరు 01లవ్ సిక్ (మెక్సికన్ సిరీస్) - సెప్టెంబరు 02టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 02ఫిటో పాయెజ్: ద వరల్డ్ వితిన్ ఏ సాంగ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 03గాంధారి (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 03ద జెంటిల్మెన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 03ధమాల్ 4 (హిందీ మూవీ) - సెప్టెంబరు 04కొరియన్ కనకరాజు (తెలుగు సినిమా) - సెప్టెంబరు 04ఎర్లీ మీట్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 04టీనేజ్ వేస్ట్ ల్యాండ్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 04ఆపిల్ టీవీ ప్లస్మే డే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 04(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ) -
ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు'. గత నెలలో థియేటర్లలో రిలీజైంది. సూపర్ కాకపోయినప్పటికీ ప్రేక్షకుల్ని మంచి స్పందన రాబట్టుకుని చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా సాధించింది. ఇదే ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ఆకలిరాజ్యం 2026' తెలుగు రివ్యూ)సాధారణంగా హారర్ అంటే మన దేశ నేపథ్యంగానే తీస్తుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో ఒంటిలోకి కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. తద్వారా వచ్చే కామెడీని బేస్ చేసుకుని తెరకెక్కించారు. వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ నటించింది. సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఆగస్టు 07న థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు సెప్టెంబరు 04 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ అప్డేట్ ఇచ్చేసింది.'కొరియన్ కనకరాజు' విషయానికొస్తే.. ఓ వ్యక్తి చనిపోతాడు. అతడి అస్తికల్ని కొరియన్ కుండలో ఉంచుతారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం లాంటిది జరిగి ఆ కుండ కనిపించకుండా పోతుంది. అది అలా అలా చేతులు మారి అనూహ్యంగా అనంతపురం చేరుతుంది. కట్ చేస్తే పెనుకొండలో ఉండే కనకరాజు (వరుణ్ తేజ్)కి కోపం ఎక్కువ. ఆ కోపంలో ఎవర్నైనా చితకబాదుతాడు. అదే ఊరిలో చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఇదిలా ఉండగా ఆ అనంతపురం వచ్చిన అస్తికల కుండ ఒక బార్కి చేరుతుంది.అయితే ఒకరోజు గొడవలో కనకరాజు.. ఆ అస్తికల కుండతో ఒకడిని కొట్టడంతో దాని మూత ఊడుతుంది. దాని డిజైన్ ఎదో బాగుందనుకుని అందులో మందు మిక్స్ చేసుకుని తాగుతాడు. అంతే అందులో ఉన్న కొరియన్ ఆత్మ కనకరాజుని ఆవహిస్తుంది. తర్వాత ఏమైంది? ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? అది చేసే పనులేంటి? కనకరాజు ఆ ఆత్మ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా) -
OTTలోకి కోరియన్ కనకరాజు.. రిలీజ్ ఎప్పుడంటే?
-
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు)
-
‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
-
‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు.. సత్య కోసం మరోసారి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.‘‘కొరియన్ కనకరాజు’ని ఇండియా నుంచి కొరియాకి వెళ్లిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ మూవీ చూసినట్టు ఉంటుంది. ఇందుకు చాలా ఖర్చు అయి ఉంటుందనుకున్నాను. కానీ లిమిటెడ్ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు మేర్లపాక గాంధీ. విజువల్స్ మీద, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి డైరెక్టర్‌కి. కొరియా వెళ్లినా అంత ఖర్చు కాలేదంటే అది గాంధీ ప్లానింగ్... తన భయం, భక్తి. నిర్మాతలు బతకాలి... మనతో పాటు నిర్మాతలూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకోవాలి. అంతేకానీ నిర్మాతలను నలిపేసి సినిమా తీయకూడదు. తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయగలగాలి. ప్రతి ఒక్కరూ ఇది అమలు చేయాలి. ఇక 2026 సెకండ్ హాఫ్ ‘పెద్ది’ సినిమా హిట్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’... ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘‘ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. అది మరోసారి ‘కొరియన్ కనకరాజు’తో పునరావృతమైంది’’ అని చెప్పారు. ముఖ్యంగా నటుడు సత్య కామెడీ తనను ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి తెలిపారు. ఈ సినిమాకి “మేర్లపాక గాంధీ ఇంజనీర్ అయితే.. వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడని ఆయన ప్రశంసించారు. ఈ చిత్రంలో సత్య నటన నాకు చాలా నచ్చింది. అతని కోసం ఈ సినిమాను మరోసారి చూడాలనిపిస్తుందన్నారు.అలాగే హీరోయిన్ రితిక గ్లామర్, ఎనర్జీ, మురళీధర్ గౌడ్ సహజ నటనను ప్రశంసించారు. మంచి కంటెంట్, కొత్తదనం, హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు తప్పకుండా వస్తారని చిరంజీవి పేర్కొన్నారు. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ పట్ల వరుణ్ తేజ్, తమన్, మేర్లపాక గాంధీ, రితిక తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. -
చిరంజీవిని చూసి పొట్టిమామ ఎమోషనల్.. వీడియో వైరల్..!
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ చిత్రంలో పొట్టి మామగా మెప్పించిన నటుడు మెగాస్టార్ కాళ్లపై పడబోయారు. ఇది గమనించిన చిరు అతన్ని వెంటనే దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అతనితో ఫోటో దిగి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్‌కు హిట్ పడడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.A Fan Emotional moment ❤️@KChiruTweets #KoreanKanakaraju pic.twitter.com/tP2BZUHdRb— ⛩️GHANI BHAI 🗡️🐉 (@Ghanibhaipspk) August 11, 2026 Tears of pure joy! 🥺 Seeing Megastar @KChiruTweets live on stage became an emotional moment for one of the Korean Kanakaraju artists .... pic.twitter.com/nCSq5ypX0S— Let's X OTT GLOBAL (@LetsXOtt) August 11, 2026 -
లాభాల్లోకి 'కొరియన్ కనకరాజు'.. కలెక్షన్ ఎంతంటే?
మెగాహీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. హారర్ కామెడీగా తీసిన ఈ చిత్రం గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే రూ.35 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. అలానే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)గత కొన్నాళ్లుగా గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలతో వరస డిజాస్టర్లు అందుకున్న వరుణ్ తేజ్.. ఈ మూవీతో మళ్లీ దారిలో పడ్డాడు. ఈ వీకెండ్ వరకు 'కొరియన్ కనకరాజు' జోరు ఉండేలా అనిపిస్తుంది. కొరియన్ బ్యాక్ డ్రాప్ హారర్ కథతో తీసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్. కమెడియన్ సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
కొరియన్ కాంట్రవర్సీ పై వరుణ్ తేజ్ రియాక్షన్
-
‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ .. అన్ని కోట్లా?
చాలా రోజుల తర్వాత మెగాహీరో వరుణ్ తేజ్ డీసెంట్ హిట్ కొట్టాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. నిన్న(ఆగస్ట్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథగా చూస్తే ఈ హారర్ కామెడీ రొటీన్ అయినప్పటికీ.. కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లనే సాధించింది. (చదవండి: 'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్)మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్యకాలంలో వరుణ్ నటించిన చిత్రాలేవి ఫస్ట్‌డే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదనే చెప్పాలి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయర్ హీరోయిన్గా నటించింది. సత్య, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు. 10.20 CRORES+ GROSS for the NON-STOP ENTERTAINER #KoreanKanakaraju on Day 1 including Premieres 🤎🤎🤎ALL TIME HIGHEST OPENING GROSSER FOR @IamVarunTej 🔥🔥🔥The entire team is Truly grateful to the audience for showering the film with such incredible love and support at the… pic.twitter.com/3QHHtRQjRn— UV Creations (@UV_Creations) August 8, 2026 -
‘కొరియన్ కనకరాజు’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ (ఫొటోలు)
-
ప్రతి ఎపిసోడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్
‘‘కొరియన్ కనకరాజు’ సినిమాకి గురువారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు (వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి) బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని హీరో వరుణ్ తేజ్ తెలిపారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’.యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లో మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘నాకు కావాల్సిన హిట్ ‘కొరియన్ కనకరాజు’గా వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాల తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ చిత్రంతో చూడడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.‘‘మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్టైనర్ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రితికా నాయక్. ‘‘గమ్యం’ సినిమా సమయంలో థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు చూసిన ఆనందం ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో మళ్లీ కనిపిస్తోంది’’ అని నిర్మాత రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘వరుణ్ తేజ్ విజయంలో మేం భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత శిరీష్ తెలిపారు. -
కొరియన్ కనకరాజుతో మరో హిట్.. టాలీవుడ్ లక్కీ ఛార్మ్ రితికా!
తెలుగు సినీ ప్రియులను తన అందం, అభినయంతో కట్టిపడేస్తోంది భామ రితికా నాయక్. ఇటీవల వచ్చిన 'కొరియన్ కనకరాజు చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఓ వైపు మెస్మరైజ్ చేసే అందం, మరోవైపు పాత్రలో లీనమయ్యే నటనతో రితికా థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతుండటంతో, టాలీవుడ్లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను నిర్మాతలు లక్కీ ఛార్మ్‌గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాదని.. ప్రాజెక్ట్‌కి ప్లస్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందం ఉన్నచోట అభినయం ఉండదు అంటారు, కానీ రితికా నాయక్ ఆ మాటను తప్పుగా నిరూపించింది. 'కొరియన్ కనకరాజు' మూవీలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. క్యూట్ లుక్స్, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో తన పాత్రకు ఒదిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ భామ మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో మెరిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
ఎన్టీఆర్ డైలాగ్పై వివాదం.. వరుణ్ తేజ్ రియాక్షన్ ఇదే..!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ డైలాగ్ చుట్టు వివాదం మొదలైంది. దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయన డైలాగ్పై క్లారిటీ ఇచ్చారు.అయితే ఇందులో తాము సీనియర్ ఎన్టీఆర్‌ను అగౌరపరచలేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆయనపై మేము ట్రోల్ చేయలేదని.. కేవలం ఇమిటేట్ మాత్రమే చేశామని క్లారిటీ ఇచ్చారు. ట్రోలింగ్‌కు.. ఇమిటేషన్‌కు చాలా తేడా ఉందన్నారు. గొప్ప గొప్ప నటులను ఇమిటేట్ చేస్తారని అన్నారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇందులో ఫన్నీ మాత్రమే చూడాలని ఆడియన్స్‌ను వరుణ్ తేజ్ కోరారు. కాగా.. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
కొరియన్ కనకరాజు హిట్టా? ఫట్టా?
-
'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)
-
'కొరియన్ కనకరాజు' మూవీలో స్పెషల్ సాంగ్ ట్రెండింగ్ లో దక్షా నగార్కర్ (ఫొటోలు)
-
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: కొరియన్ కనకరాజునటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయర్, సత్య, సునీల్ తదితరలునిర్మాణ సంస్థ: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు :రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడిరచయిత, దర్శకుడు: మేర్లపాక గాంధీసంగీతం: తమన్ ఎస్.ఎస్సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డిఎడిటర్: సత్య జివిడుదల తేది: ఆగస్ట్ 7, 2026మెగా హీరో వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘కొరియన్ కనకరాజు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 7) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే?కొరియాలో ఓ వ్యక్తి చనిపోతాడు. అతని అస్తికలు అనంతపూర్‌లోని పెనుగొండకు వస్తాయి. ఆ ఊర్లోనే కనకరాజు (వరుణ్ తేజ్) ఉంటాడు. తన ఫ్రెండ్ కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలోనే తన చెక్క భజన బృందాన్ని కూడా నిర్వహిస్తుంటాడు. అక్కడ చెంగా రెడ్డి (సునీల్) మనుషులు, మేనల్లుడు కర్రి శీను (టెంపర్ వంశీ)తో కనకరాజుకి నిత్యం గొడవలు జరుతుంటాయి. అదే ఊరికి చెందిన చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో పని చేస్తూ, కొరియాకి వెళ్లి సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటుంది. అలాంటి చైత్రని కనకరాజు ఇష్టపడతాడు. కనకరాజు ఒంట్లోకి ఆ కొరియా ఆస్థికలు వెళ్తాయి. అక్కడి నుంచి కనకరాజు కొరియాలో మాట్లాడేస్తుంటాడు. కొరియా భాషను అర్థం చేసుకునే చైత్ర ఆ ఆత్మ చివరి కోరికను తెలుసుకుంటుంది. దీంతో కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియాకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కనకరాజు ఒంట్లో నుంచి ఆ కొరియన్ ఆత్మ బయటకు వెళ్తుందా? ఆ కొరియన్ డాన్‌ను చంపింది ఎవరు? చివరకు ఆ ఆత్మ నుంచి కనకరాజుకి విముక్తి లభించిందా? లేదా? అన్నది కథ.ఎలా ఉందంటే..‘కొరియన్ కనకరాజు’ కథని చూస్తే మేర్లపాక గాంధీ ఇంకా ఏ కాలంలో ఉన్నాడా? అని అనిపిస్తుంది. ఎప్పుడో అరిగిపోయిన ఆత్మల కథను తీసుకు వచ్చి ఇప్పుడు మళ్లీ ఆడియెన్స్‌కి అందించాడు. అయితే ఇక్కడ కొరియా ఆత్మని తీసుకోవడం...దానికి పెనుగొండ బ్యాక్ డ్రాప్ పెట్టడం కాస్త కొత్తదనం. మిగతాదంతా రోటీన్. ఊహకందలే సాగుతుండటం ప్రధానంగా మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే కథ ఎలా రాసుకున్నా కూడా కామెడీ ట్రాక్ మాత్రం అదిరిపోయింది. సత్యతో చేయించిన కామెడీనే ఈ సినిమాని నిలబెడుతుంది.ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. ఆ ఎంట్రీలోనే పాట, ఫైట్ అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్.. కాసేపటికి మళ్లీ ఫైట్, ఆ తర్వాత కామెడీ సీన్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కనకరాజులోకి ఆత్మ వచ్చిన తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది.అయితే ఇంటర్వెల్ బ్లాక్ కాస్త ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే కొరియన్ డాన్ ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మలు, పూజలు అంటూ చేసే సీన్లలోనూ లాజిక్స్ కనిపించవు. అవి మరీ సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఇలాంటి సీన్లన్నీ కూడా సత్య కామెడీతో కనిపించకుండా పోతాయి. క్లైమాక్స్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఆ ఏఐ షాట్స్, ఆత్మలు కొట్టుకునే సీన్లు ట్రోలింగ్ మెటీరియల్ అయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్ మాత్రం నిరాశ పర్చేలానే ఉంది. ఎవరెలా చేశారంటే..ఇందులో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రలను పోషించి మెప్పించాడు. రాయలసీమలోని పల్లెటూరి కుర్రాడు కనకరాజుగా, , కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత గ్యాంగ్ స్టర్‌గా.. రెండు విభిన్న పాత్రలో కనిపించిన వరుణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. ఇక రితికా నాయర్ తెరపై అందంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తర్వాత బాగా పండిన పాత్ర సత్యది. తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. వరుణ్, సత్య కాంబోలో వచ్చే కామెడీ సీన్లు బాగా నవ్విస్తాయి. బుల్లిరాజు కూడా మరోసారి నవ్వులు పూయించాడు. సిునీల్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రెండున్నర గంటలు నవ్వుకుంటారు: వరుణ్ తేజ్
‘‘ఎప్పటి నుంచో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ఉండేది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘కొరియన్ కనకరాజు’ చేశాను. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా, సత్య కీలక పాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ⇒ నేను ఏ కథ విన్నా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. మేర్లపాక గాంధీ ‘కొరియన్ కనకరాజు’ కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇందులోని ఎంటర్టైన్మెంట్ నాకు చాలా నచ్చింది. నటుడిగా వెవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అబీప్రాయం ఉంది... అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. ‘కొరియన్ కనకరాజు’లో కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది. రెండు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే చాన్స్ రావడం సంతోషంగా అనిపించింది. ఈ పాత్ర నటుడిగా చాలా తృప్తినిచ్చింది. ⇒ గాంధీ పాత్ర రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఆ యాసపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. మరో పాత్ర కోసం కొరియన్ భాష నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పాత్రలో నేను కనిపించకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించేలా ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఈ సినిమాలో నాది, సత్య పాత్ర చాలా కీలకం. మేమిద్దరం రాయలసీమ యాస నేర్చుకుని, వర్క్ చేశాం.⇒ రాజీవ్‌గారు, వంశీగారు చాలా ప్యాషన్ ఉన్న ప్రోడ్యూసర్స్. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు. ఇక పర్సనల్‌గా మాకు అబ్బాయి పుట్టిన తర్వాత షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాను. నేను నటించనున్న ‘బరి’ సినిమా ప్రీ- ప్రోడక్షన్ జరుగుతోంది. అది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. నేను చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్‌డ్రాప్‌తో ఈ కథ ఉంటుంది. -
ఆ ఇద్దరికి 'కొరియన్ కనకరాజు' హిట్ అవసరం
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా, రితికా నాయక్‌తో కలిసి నటిస్తున్న చిత్రం కొరియన్ కనకరాజు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లో ఈసారి కొరియన్ కనకరాజు సినిమా అత్యంత కీలకంగా మారింది. వరుసగా వచ్చిన ఫ్లాపుల కారణంగా అతడి మార్కెట్ బాగా పడిపోయింది. మట్కా, ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున వంటి సినిమాలు ఒక్కదాన్ని మించి ఇంకోటి ఫ్లాప్ కావడంతో వరుణ్ మార్కెట్ దెబ్బతింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా అంగీకరించాడు. అవన్నీ తనకు అనుభవాలుగా మిగిలాయని చెప్పాడు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. కొరియన్ కనకరాజు టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పాటు యూనిట్ చేసిన ప్రచారం ప్రేక్షకులకు విస్తృతంగా చేరింది. విడుదలకు ముందే సినిమాకు బజ్ రావడం కొంత వరకు వరుణ్ తేజ్‌కు అదృష్టమనే చెప్పాలి. ఈ సినిమా దర్శకుడికి కూడా ఇటీవల కాలంలో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకపోవడంతో ఈ సినిమా విజయం అతనికి అత్యవసరం. ఇక ఈ చిత్ర హీరోయిన్ రితికా నాయక్ ఇప్పటికే హిట్ల మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రధానంగా హీరో-దర్శకుడి భవిష్యత్తును నిర్ణయించనుంది. వరుణ్ తేజ్ కు ఈసారి హిట్ తప్పనిసరి. బజ్, ప్రచారం, అంచనాలు అన్నీ కలిసొచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల తీర్పే కీలకం. ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియా బ్యాక్ డ్రాప్లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఇందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించాడు. -
అనంతపురం అబ్బాయిని కొరియన్ ఆత్మ ఆవహిస్తే...
వరుణ్ తేజ్, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా మేర్ల పాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ సినిమా ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేర్ల పాక గాంధీ విలేకరులతో మాట్లాడుతూ–‘‘నా స్నేహితులతో కలిసి ఓ పెళ్లికి వెళుతున్నప్పుడు అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. అక్కడ కొరియన్ల కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ, వాళ్ల సంస్కృతికి తగ్గ రెస్టారెంట్లు, మార్కెట్లు ఉండటం ఆసక్తిగా అనిపించింది.అనంతపురంలోని ఒక అబ్బాయిని ఒక కొరియన్ ఆత్మ ఆవహిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ‘కొరియన్ కనకరాజు’ కథ రాసుకున్నాను. కనకరాజు పాత్రతో పాటుగా కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్‌కు వరుణ్ కరెక్ట్‌గా సరిపోయారు. కియా ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిగా రితికా కనిపిస్తుంది. ఆమెకు కొరియన్ భాష కూడా తెలుసు. కొరియాలో చిత్రీకరణ కాస్త ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. మా నాన్నగారి కథతో ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉంది. అదేవిధంగా కామెడీ థ్రిల్లర్ జానర్లో మరో సినిమా చేయనున్నాను’’ అని తెలి పారు. -
‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ రిలీజ్
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. సత్య కామెడీ సీన్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.కొరియా బ్యాక్ డ్రాప్ లో హారర్ యాక్షన్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ ఇందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో నటించాడు. -
ముక్క లేనిదే ముద్ద దిగదు.. పరీక్షనే ఫెయిల్ అయ్యా : వరుణ్ తేజ్
సినీ తారలు డైట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆర్యోగంగా, ఫిట్‌గా ఉండేందుకు కొలతలు వేసుకొని మరీ ఆహారం తీసుకుంటారు. అయితే కొంతమందికి మాత్రం విచిత్రమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొంతమంది నాన్‌వెజ్ సైడే చూడరు. మరికొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకడు. ఈ హీరో ప్రతి రోజు చికెన్ లేదా మటన్ తింటాడట. రెగ్యులర్ డైట్లో అది కచ్చితంగా ఉండాల్సిందేనట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెబుతూ.. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.‘నాన్ వెజ్ లేకుండా నేను తినలేను. చిన్నప్పుడు ఒక్క పూట చికెన్ పెట్టలేదని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నా. దీంతో మరుసటి రోజు పరీక్ష సరిగా రాయక ఫెయిల్ అయిపోయా. చికెన్ అంటే అంత ఇష్టం. వీటితో పాటు పీతలు, చేపలు, రొయ్యలు కూడా బాగానే తింటా’అని వరుణ్ చెప్పుకొచ్చాడు.సినిమా విషయాలకొస్తే.. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కొరియన్ కనకరాజు రిలీజ్‌కి రెడీగా ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించాడు. ఆగస్ట్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. -
'కొరియన్ కనకరాజు' బ్యూటీ.. అచ్చం అలానే ఉందే! (ఫొటోలు)
-
‘కొరియన్ కనకరాజు’ మీడియా చిట్-చాట్‌లో హీరోయిన్ రితిక నాయక్ (ఫొటోలు)
-
ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు: రితిక నాయక్
‘‘డైరెక్టర్ మేర్లపాక గాంధీగారు ‘కొరియన్ కనకరాజు’ కథ చెప్పినప్పుడు షూటింగ్‌కి కొరియా వెళతాం అన్నది నన్ను మొదట బాగా ఆకట్టుకుంది(నవ్వుతూ). ఎందుకంటే నాకు కొరియన్ సంస్కృతి, అక్కడి సినిమాలు, కొరియన్ డ్రామాలు అంటే చాలా ఇష్టం. ‘కొరియన్ కనకరాజు’లో నేను చేసిన పాత్రకు, నా వ్యక్తిత్వానికి కొన్ని పోలికలు ఉన్నాయి. చాలా మోడ్రన్ అమ్మాయిగా కనిపిస్తాను. ఫైనల్ ఔట్పుట్ చూస్తున్నంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో నవ్వుతూనే ఉంటారు’’ అని హీరోయిన్ రితిక నాయక్ తెలిపారు.వరుణ్ తేజ్, రితిక నాయక్ జోడీగా, నటుడు సత్య కీలకపాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో యువీ క్రియేష న్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా రితిక నాయక్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ మూవీ షూటింగ్ కొంత భాగం అనంతపురంలో చేశాం.. అక్కడి జనాలు, ఆ వాతావరణం అందమైన అనుభూతిగా నిలిచిపోయింది.వరుణ్ తేజ్‌గారికి గాయం ఉన్నప్పటికీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు షూటింగ్ చేశారు. యువీ క్రియేషన్స్ తో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ . షూటింగ్ సమయంలో ఒకసారి నేను అనారోగ్యానికి గురయ్యాను. ఆ సమయంలో నిర్మాతలు నా గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. తమన్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం ‘మిరాయ్ 2’ సినిమా ప్రీ–ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. -
కొరియన్ కనకరాజు.. రిలీజ్‌కు ముందే బిగ్ డీల్..!
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న సినిమా 'కొరియన్ కనకరాజు'. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్‌కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్డెట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. -
విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట
మెగాహీరోల్లో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద, ఫిదా, తొలిప్రేమ, కంచె లాంటి సినిమాలతో కెరీర్ ప్రారంభంలో సమ్‌థింగ్ డిఫరెంట్ అనిపించుకున్నాడు. తర్వాత నుంచి వరసపెట్టి ఫ్లాప్స్ పడ్డాయి. 2019లో వచ్చిన 'గద్దలకొండ గణేశ్' ఓ మాదిరిగా ఆకట్టుకోగా.. తర్వాత వచ్చిన గని, గాంఢీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మాట్కా చిత్రాలు ఒకదానిని మించి మరొకటి డిజాస్టర్స్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఎప్పటికీ నువ్వు నా లిటిల్ స్టార్‌వే.. సితార గురించి మహేశ్)దీంతో రెండేళ్లు గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సినిమా 'కొరియన్ కనకరాజు'. వచ్చే నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. వారం క్రితం టీజర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రసగుమ్మడి' అంటూ ఓ పాట వదిలారు. విలేజ్ స్టైల్లో సాగే మాస్ బీట్తో ఉన్న ఈ గీతం కలర్ఫుల్గా బాగుంది. తమన్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. రితికా నాయక్ హీరోయిన్.(ఇదీ చదవండి: అక్క 'జబర్దస్త్' కమెడియన్.. చెల్లి ఏమో రాకెట్ ఇంజినీర్) -
ఆగస్టులో పండగే పండగ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాల పండగ అంటే సంక్రాంతి అని ఠక్కున చెప్పేస్తారు. తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి వంటి పండగలకు కూడా పలు చిత్రాలు రిలీజ్‌కి ముస్తాబవుతుంటాయి. అదే విధంగా వేసవి సెలవుల్లోనూ సినిమాల సందడి నెలకొంటుంది. ఈ ఏడాది వేసవి పూర్తయింది.అయితే ఈసారి ఆగస్టు నెలలో కూడా వెండితెరపై సినిమాల సందడి ఓ రేంజ్లో ఉండనుంది. ఇప్పటికే రవితేజ ‘ఇరుముడి’, యశ్ ‘టాక్సిక్’, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, నాని ‘ది ప్యారడైజ్’, శర్వానంద్ ‘భోగి’, వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ వంటి సినిమాలతో పాటు ‘అగధ, అనకాపల్లి, హుషారు పిట్టలు’ వంటి సినిమాలు ఆగస్టు స్లాట్‌ను బుక్ చేసుకున్నాయి. అదేవిధంగా మహేశ్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘దూకుడు’ కూడా రీ రిలీజ్ కానుంది. మరి... ఆగస్టులో వెండితెరపై సందడి చేయనున్న ఆ సినిమాల విశేషాలు ఏంటో చూద్దాం... 7న కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్–ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందింది. హారర్, కామెడీ, ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషించారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా వాతావరణాన్ని చక్కగా బ్లెండ్ చేస్తూ వినోదాత్మకంగా మేర్లపాక గాంధీ ఈ కథను తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సౌత్ కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటలు, ముఖ్యమైన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి. హీరో ప్రభాస్ విడుదల చేసిన మా మూవీ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. 7న అనకాపల్లి విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ముఖ్య పాత్రను పోషించారు త్రినాథరావు నక్కిన. తారక్ పొన్నప్ప, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ ఇతర పాత్రలు పోషించారు. భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు.కాండ్రేగుల కుమార్ రాజా కోప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదల కానుంది. ‘‘రా అండ్ రస్టిక్ మూవీగా ‘అనకాపల్లి’ రూపొందింది. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దేవ్ జండ్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అమ్మోరు దిగినాది...’, ‘లబ్బరు బొమ్మ...’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయ్యాయి. అలాగే రొమాంటిక్, ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ‘ఎలగే పిల్ల...’కి అనూహ్యమైన స్పందన వస్తోంది. మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. 14న అగధ ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్. రాజు రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అగధ’. కామాక్షీ భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గు΄్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది. ‘‘ఈ మూవీలో మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల నటించగా ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే నటుడు శ్రవణ్ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్‌కి, జోవిక విజయ్ కుమార్ నటించిన హరిణి పాత్ర క్యారెక్టర్ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చింది.‘అగధ’ నా కలల ప్రాజెక్ట్. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్ వండర్లా అనిపించే సినిమా ఇది. భావోద్వేగాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా పని చేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గు΄్తా, జోవిక తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. మైథలాజికల్ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన మా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. 14న పళ్ళ బురుసు ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని శుక్రవారం విడుదల చేశారు మేకర్స్. ‘ఆ... ఏందిరా పళ్ళ బురుసా? తేలేదురా, ఈడు పళ్ళ బురుసు తేడు... నా నొప్పి తక్కువ కాదు’ అంటూ సుధాకర్ రెడ్డి, ‘నా బిడ్డ పెళ్లి... మా అయ్య లొల్లి... ఏందో ఈ పళ్ళ బురుసు’ అంటూ మురళీధర్ గౌడ్ చెప్పే డైలాగ్స్ గ్లింప్స్‌లో ఉన్నాయి. 15న హుషారు పిట్టలు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు బిక్ష, నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే కొంతమంది తెలియక బ్యాడ్ కామెంట్లు పెట్టారు. కానీ, సినిమా విడుదల తర్వాత మా చిత్రంలో ఉన్న అసలు కథ అందరికీ తెలుస్తుంది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఎంతో ఫ్రొఫెషనల్‌గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదల తర్వాత అందరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ఇతర భాషల వాళ్లు ‘హుషారు పిట్టలు’ గురించి మాట్లాడుకుంటారు’’ అని తెలిపారు. 21న ఇరుముడి... రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తోంది. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ‘ఇరుముడి’ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్ వంటి అంశాలు ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. 21న దిప్యారడైజ్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘దిప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించినా వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఫైనల్‌గా ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రత్యేకించి ఆ తేదీకి ఎందుకంటే వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్–ఉన్–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసి వస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీని ఫిక్స్ చేసిందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘‘పాన్ వరల్డ్ మూవీ ‘దిప్యారడైజ్’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన ప్రతి అప్డేట్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాని ఒక్కో అడుగు విస్తరిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచారు’’ అని మేకర్స్ పేర్కొన్నారు. 26న టాక్సిక్ ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత యశ్ హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, కేవీఎన్ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్ కంపెనీపై రూపొందిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో ఆగస్టు 26న విడుదల కానుంది.ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... 2026 మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్ పోన్ చేసి, జూన్ 4న విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ వాయిదా పడి, ఫైనల్‌గా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ మిశ్రా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘తబాహీ...’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. 14న విశ్వనాథ్ అండ్ సన్స్సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ‘‘సార్ (వాత్తి), లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాల తర్వాత నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సూర్య పాత్ర సరికొత్తగా ఉంటుంది. ‘సార్, లక్కీ భాస్కర్’ వంటి హిట్స్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ స్థాయిలో రూపొందిన మా చిత్రం కుటుంబ భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే అంశాలతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘నేనో బటర్ ఫ్లై...’కి మంచి స్పందన వచ్చింది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందే ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. 30న దూకుడు రీ రిలీజ్మహేశ్బాబు హీరోగా నటించిన చిత్రం ‘దూకుడు’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రశాష్రాజ్, ఎమ్మెస్ నారాయణ, నాజర్, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుమన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా 2011 సెప్టెంబరు 23న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ మూవీని ఆగస్టు 30న 4కె వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్ క్వాలిటీతో వస్తున్న ‘దూకుడు’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఫుల్ క్రేజ్ నెలకొంది. ఇదిలా ఉంటే... మహేశ్ బాబు హీరోగా నటించిన ‘ పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్ మేన్’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. 28 న భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న పాన్–ఇండియా పీరియడ్ యాక్షన్ మూవీ ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో రక్షా బంధన్ పండగ సందర్భంగా ఆగస్టు 28న ఈ చిత్రం విడుదల కానుంది.‘‘1960ల నాటి నేపథ్యంలో సాగే ‘భోగి’ చిత్రం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఫిక్షనల్ విలేజ్‌లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకు పోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు, ఈ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ తొలిసారి కలిసింది.ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, పుట్టినరోజు పోస్టర్లకు అదిరి పోయే రెస్పాన్స్ వచ్చింది. పల్లెటూరి యువతిగా అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు. మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆగస్టులో విడుదలకు ముస్తాబవుతున్నాయి.– డేరంగుల జగన్ మోహన్ -
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మా ఊరు పెనుకొండ అంటూ వరుణ్ తేజ్ డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. కొరియన్ దెయ్యం కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కమెడియన్ సత్యతో కామెడీ సీన్స్ ఆకట్టకుంటున్నాయి. ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. -
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. వచ్చేది ఎప్పుడంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూవీ క్రియేషన్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీని హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ... 😎💥Get ready for the wildest Indo-Korean horror comedy ride of the year with #KoreanKanakaraju 🐉😈#KOKA GRAND RELEASE WORLDWIDE IN CINEMAS ON AUGUST 7th, 2026 ❤️🔥@IamVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy… pic.twitter.com/BhgLFQN73g— UV Creations (@UV_Creations) July 10, 2026 -
సీమ రమ్మంది... స్టోరీ ఉందంది
రాయలసీమ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇంకా ఎన్నో సినిమాలు చేయొచ్చంటూ రచయితలను–దర్శకులను ‘సీమ రమ్మంది... స్టోరీ ఉందంది’. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, విడుదలకు సిద్ధమైన ‘రాయలసీమ’ బ్యాక్‌డ్రాప్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.నవ్వుల కోలాటం వచ్చే సంక్రాంతికి థియేటర్స్‌లో నవ్వుల కోలాటం అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘వెంకీఅనిల్5 అండ్ ఎన్‌కేఆర్‌ఏఆర్2’ (వర్కింగ్ టైటిల్) అనే ఎంటర్టైనింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ నేడు ఆరంభం కానుంది.‘కత్తిలాంటి ఐడియా’ అంటూ ఓ వినోదాత్మక కాన్సెప్ట్ వీడియోను ఆదివారం రిలీజ్ చేసి, ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని ఈ వీడియోతో స్పష్టం చేశారు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి ‘జనవరి 13న రిలీజ్, బామ్మర్ది బాల్‌రెడ్డి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్, అర్చనల సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.ప్రేమ కోసం లెనిన్ ‘ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు’ అనే క్యాప్షన్‌తో ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తన ప్రేమ కోసం లెనిన్ ఏ స్థాయిలో పోరాటం చేస్తాడో ఈ క్యాప్షన్ స్పష్టం చేస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, కుటుంబం, రాజకీయ అంశాలతో రూరల్ యాక్షన్ డ్రామాగా ‘లెనిన్’ సినిమా రూపొందింది. ఈ చిత్రకథలో ‘ప్రేమ’ ప్రధానాంశంగా ఉంటుందని ఆ మధ్య విడుదలైన ‘సోల్ ఆఫ్ లెనిన్’ వీడియో కూడా స్పష్టం చేసింది.లెనిన్పాత్రలో అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించనంత మాస్ లుక్‌లో ఈ చిత్రంలో అఖిల్ కనిపించనున్నారు. రాయలసీమ కుర్రాడిగా ఒదిగి΄ోవడానికి అఖిల్ చిత్తూరు యాసలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తనపాత్రకు డబ్బింగ్ కూడా చె΄్పారు. జూలై 10న ‘లెనిన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.యోధుడు రణబాలి అది 19వ శతాబ్దం... ముఖ్యంగా 1854 – 1878 మధ్యకాలం. బ్రిటిష్‌పాలనలో కరువు కాటకాలతో రాయలసీమ అల్లాడుతోంది. అప్పుడే జనాల్లోంచి ఓ యువకుడు ధైర్యంగా ముందుకు వచ్చాడు. బ్రిటిష్‌వారిపై ఆ యోధుడు తిరగబడ్డాడు. ఈ కథతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. ఇందులో యోధుడు రణబాలిపాత్రను విజయ్ దేవరకొండ, అతనికి జోడీగా జయమ్మపాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాలు, తిరుగుబాట్ల ఆధారంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం నాటి రాయలసీమ యాసలో శిక్షణ తీసుకోవడమే కాకుండా, గుర్రపు స్వారీలోనూ శిక్షణ పొందారు విజయ్ దేవరకొండ. ఈపాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొరియన్ దెయ్యం వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ కథానాయికగా నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా అనంతపురం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఈ చిత్రంలో కనకరాజు అనేపాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నారని తెలిసింది. ఓ కొరియన్ దెయ్యానికి, కనకరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది మాత్రం సినిమాలో చూడాలి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.మంగాపురంలో ప్రేమసూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘శ్రీనివాసా మంగాపురం’. రవీనాటాండన్ కుమార్తె రాషా తడానీ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధానంగా తిరుపతికి దగ్గర్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది.ఈ విలేజ్ లవ్‌స్టోరీ సినిమాలో శ్రీనుపాత్రలో జయకృష్ణ, మంగపాత్రలో రాషా నటిం చారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా జూలై 9న రిలీజ్ కానుంది. ఇంకా సాయిదుర్గా తేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’తోపాటు రాయలసీమ నేపథ్యంలో రానున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
విడుదల ఎప్పుడు?
చిత్ర పరిశ్రమలో పలు సినిమాల విడుదల విషయంలో సందిగ్ధం నెలకొంది. ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పుడే ఆయా చిత్రాల రిలీజ్ డేట్స్‌ని అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శక–నిర్మాతలు. మరికొందరేమో చిత్రీకరణ జరుగుతున్న తీరు,పోస్ట్ ప్రోడక్షన్ పనులు వంటి వాటి ఆధారంగా ఫలానా తేదీకి విడుదల చేస్తామని చెబుతుంటారు. ఇంకొందరేమో ఫలానా తేదీకి తప్పుకుండా వస్తాం... రిలీజ్ పక్కా... ఇందులో ఎలాంటి మార్పులు ఉండవు అని బలంగా చెబుతుంటారు. అయితే షూటింగ్స్ ఆలస్యం కావడం..పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం... కంటెంట్, క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం... సరైన విడుదల తేదీ కుదరకపోవడం... బాక్సాఫీస్ వద్ద తీవ్రమైనపోటీ ఉండటం... ఇలా కారణాలు ఏవైనా కావొచ్చు... విడుదల తేదీల్లో అనివార్యంగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కొన్ని సినిమాల విడుదల తేదీలు ముందుగా ప్రకటించినప్పటికీ వాయిదా పడటం... మరికొన్ని చిత్రాల షూటింగ్స్,పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తి అయినప్పటికీ ఎలాంటి రిలీజ్ డేట్స్ ప్రకటించకుండా ప్రమోషన్స్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘విశ్వంభర, స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్, స్వయంభు, ఆపరేషన్ అరుణా రెడ్డి, చెన్నై లవ్‌స్టోరీ, సంబరాల ఏటిగట్టు, కొరియన్ కనకరాజు’ వంటి సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఎలాంటి స్పష్టత లేదు. ఈ చిత్రాల విడుదల ఎప్పుడు? అన్నది సగటు సినీ ప్రేమికుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఎదురు చూడాల్సిందే. ఇక వాయిదా పడుతూ వస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం...విశ్వంభరుడి రాక కోసం...చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ మూవీ కోసం అటు మెగా ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపా ట ఈ మూవీ నిర్మించారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలుత అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే 2025 సంక్రాంతి బరిలో సందడి చేయాల్సి ఉంది.జనవరి 10న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తప్పకుండా సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అనుకున్నారంతా. అయితే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన పా న్ ఇండియన్ ఫిల్మ్ ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వాయిదా పడిన ‘విశ్వంభర’ కొత్త విడుదల తేదీపై ఇప్పటి వరకూ చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పటికీ వీఎఫ్ఎక్స్ పనులు ఓ కొలిక్కి రాకపోవడంతో మూవీ విడుదల తేదీ విషయంలో చిత్రబృందం సందిగ్ధతను కొనసాగిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ‘చందమామ కథలాంటి ‘విశ్వంభర’ సినిమాని 2026 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అంటూ తన పుట్టినరోజు సందర్భంగా 2025 ఆగస్టు 22న చిరంజీవి ఓ వీడియో విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయిదే వేసవి మొదలై ఇప్పటికే సగానికి పైగా అయినప్పటికీ ఈ చిత్రం విడుదల తేదీపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇంద్ర’ (2002 జూలై 24 రిలీజైంది) విడుదల తేదీ అయిన జూలై 24ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. మరి ఆ తేదీకి అయినా ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేకుంటే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టులో విడుదలవుతుందా? అదీ కుదరకుంటే దసరా కానుకగా అక్టోబరులో రిలీజ్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే ‘విశ్వంభర’ రిలీజ్‌పై మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. టెంపుల్ రోడ్లో...దర్శకుడు పూరి జగన్నాథ్ శైలి ప్రత్యేకమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాని శరవేగంగా అనుకున్న సమయంలో పూర్తి చేయగలరనే పేరుంది ఆయనకు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ కూడా ఆయన స్టైల్లో స్పీడుగానే సాగిందని టాక్. అయితే విడుదల తేదీ విషయంలోనే సందిగ్ధం నెలకొందట. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించారు. టబు, బ్రహ్మాజీ, దునియా విజయ్‌కుమార్ ఇతర కీలక పాత్రలుపోషించారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోహన్ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల నిర్మించారు. ఈ మూవీ చిత్రీకరణ,పోస్ట్ ప్రోడక్షన్, రీ–రికార్డింగ్ పనులు పూర్తి అయినప్పటికీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు.‘‘పూరి మార్క్ యాక్షన్ థ్రిల్లర్, ఎంటర్టైనర్, ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ‘స్లమ్ డాగ్’కి తనదైన శైలిలో స్వరాలు అందించారు. ప్రత్యేకించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ పా న్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. చిత్ర పరిశ్రమలో డైరెక్టర్‌గా 26 ఏళ్లు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ కెరీర్లో ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ స్పెషల్ ఫిల్మ్‌గా గుర్తుండిపోతుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.స్వయంభు... ‘కార్తికేయ 2’(2022)వంటి పా న్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత నిఖిల్ హీరోగా నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మించారు. భారీ పీరియాడికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ‘స్వయంభు’.ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్ఫుల్ వారియర్ పా త్రలో కనిపించనున్నారు. 1000 ఏళ్ల క్రితం రాయలసీమలోని చిత్తూరు ప్రా ంతంలో కృష్ణ అనే యోధుడు ఉండేవారు. అల్లరిగా తిరిగే అతను అండర్ డాగ్ రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందట. ఈ క్యారెక్టర్లో సహజంగా ఒదిగిపోవడానికి నిఖిల్ ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రెండు సంవత్సరాలు వెచ్చించి, ఫిజికల్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. తన కెరీర్లో ‘స్వయంభు’ని ఒక మైలురాయిగా భావించి ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు నిఖిల్. ఈ మూవీ టీజర్‌లోని విజువల్స్, భారీతనం, ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరుకు అద్భుతమైన స్పందన రావడంతో పా టు సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.‘కేజీఎఫ్, సలార్’ మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఏప్రిల్ 16న విడుదల చేసిన తొలి పా ట ‘రా రా ధీవర’కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘స్వయంభు’ని తొలుత 2026 ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 10కి విడుదల వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్ కాలేదు. అలాగే ఆ తర్వాత ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మూవీ 2డీ, త్రీడీ ఫార్మాట్లో విడుదల కానుంది.పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్న ఈ మూవీ రిలీజ్‌కి కేవలం తెలుగులో సరైన విడుదల తేదీ కుదిరితే సరిపోదు. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలకు గట్టిపోటీ లేకుండా ఉండే తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అక్కడి మార్కెట్‌ని కూడా జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంటుంది మేకర్స్. మరి వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని ‘స్వయంభు’ కొత్త విడుదల తేదీ ఎప్పుడన్నది చిత్రయూనిట్ ప్రకటించే వరకు వేచి చూడాలి.ఆపరేషన్ అరుణారెడ్డినటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత... ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారుపోసాని కృష్ణమురళి. శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘దుశ్శాసన’. 2011 మే 27న ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీ తర్వాత నటుడిగా బిజీ అయినపోసాని కృష్ణమురళి కొన్నేళ్ల పా టు దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మూవీ ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఆయన కీలక పా త్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది.ఈ చిత్రానికి ఆయన కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టడంతో పా టు తొలిసారి రెండు పా టలు కూడా రాయడం విశేషం. హిందోళ చక్రవర్తి టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలోపోసాని కృష్ణమురళి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, ఎంపీ రఘునందన్ రావు ఇతర ప్రధాన పా త్రలుపోషించారు. 3 ఇడియట్స్ మూవీస్ సమర్పణలో యూపీ సినిమా లైన్స్ , కుసుమ ఎంటర్టైన్మెంట్స్పై రూపొందిన ఈ చిత్రంపోస్ట్ ప్రోడక్షన్, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటికీ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు.‘‘నిజాయితీపరులైన జర్నలిస్టుల కథతో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ రూపొందింది. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సమాజం బాగుపడుతుందనేది కథాంశం. అరుణారెడ్డి అనే జర్నలిస్ట్‌గా హిందోళ చక్రవర్తి నటించారు. కొందరు చేసిన రాజకీయాలకు ఓ మంచి జర్నలిస్ట్ రోడ్డున పడే పరిస్థితి వస్తే.. ఇలాంటి నిజాయతీ కలిగిన అమ్మాయి జర్నలిజంలో ఉండాలని ముఖ్యమంత్రి అండగా నిలబడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథనం ఆసక్తిగా ఉంటుంది. సినిమా ప్రా రంభం నుంచి చివరి దాకా తర్వాత ఏం జరుగుతుంది? అన్నది ప్రేక్షకుల ఊహకు కూడా అందదు. స్క్రీన్‌ప్లే అంత అద్భుతంగా ఉంటుంది. ఈ నెలాఖరులో లేదా జూన్‌లో మా సినిమాని విడుదల చేస్తాం’’ అంటూపోసాని కృష్ణమురళి పేర్కొన్నారు.కొరియన్ కనకరాజు... వరుణ్ తేజ్ హీరోగా నటì ంచిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ మూవీ ఫేమ్ మేర్లపా క గాంధీ రచన–దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ‘మిరాయ్’ మూవీ ఫేమ్ ‘రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, నటుడు సత్య కీలకపా త్రపోషించారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయినప్పటికీ విడుదల ఎప్పుడు? అన్నది ఇప్పటి వరకూ ప్రకటించలేదు. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ , మేర్లపా క గాంధీ హిలేరియస్ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్ –ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంది.హారర్, కామెడీ, ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పా త్రపోషించారు. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారాయన. రితికా నాయక్ చక్కని నటనతో ఆకట్టుకుంటారు. సత్య కామెడీ టైమింగ్‌తో మరోసారి నవ్వులు పండిస్తారు. వినోదం, యాక్షన్, హారర్‌ని మేళవిస్తూ మేర్లపా క గాంధీ ఈ మూవీ తెరకెక్కించారు.కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. తమన్ సంగీతం అందించిన మా సినిమా నుంచి విడుదల చేసిన ‘కమ్సాహం నిదా...’ పా టకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ వేసవిలో సినిమాని విడుదల చేస్తాం’’ అంటూ చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే... వేసవిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.చెన్నై లవ్ స్టోరీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘కలర్ ఫొటో, బేబి’ చిత్రాల దర్శకుడు సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించారు. అమృత ప్రోడక్షన్స్ , మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించారు. చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కానప్పటికీ మేకర్స్ మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ‘‘మణిశర్మ సంగీతం అందించిన మా మూవీ నుంచి విడుదల చేసిన తొలి పా ట ‘గుర్తుందా...’ కి అనూహ్యమైన స్పందన వచ్చింది.మా సినిమాను జూన్ 26న విడుదల చేయాలనుకున్నాం. అయితే కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తాం’’ అంటూ సాంగ్ లాంచ్ ఈవెంట్లో ఎస్కేఎన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ డాల్బీలో చేయడం సంతోషంగా ఉంది. రవి నంబూరితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ‘గుర్తుందా...’ పా ట కోసం కోటి రూపా యలు ఖర్చు చేసి సెట్ వేశారు. ‘రాజా వారు రాణి గారు’ మూవీ తర్వాత నేను ఈ సినిమాలో సెటిల్డ్‌గా ఉండే క్యారెక్టర్ చేశాను.మా మూవీ ప్రమోషన్ కంటెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ , సినిమా మీద ఏర్పడిన క్రేజ్, మా మూవీ గురించి అందరూ మాట్లాడుకోవడం సంతోషంగా ఉంది. మణిశర్మగారు ఏడు పా టలు కంపోజ్ చేశారు. ఆ పా టల్ని అందరూ థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు. మా మూవీ రిలీజ్ అయిన రోజు థియేటర్స్‌లో మ్యూజిక్ కన్సర్ట్ జరిగినట్లు ఉంటుంది. ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లవ్ స్టోరీస్‌లో ఒకటిగా మా ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.సంబరాల ఏటిగట్టు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఎస్వైజీ’(సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పా త్రలుపోషించారు. ‘హను–మాన్’(2024) వంటి పా న్ ఇండియన్ హిట్ మూవీ నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘సంబరాల ఏటిగట్టు’ నిర్మించారు.యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా కోసం సాయిదుర్గా తేజ్ ప్రత్యేకంగా కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో ఫుల్‌గా మేకోవర్ అయ్యారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2025 సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్రబందం తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్పోస్ట్పోన్ అయింది. అనంతరం పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల విషయంపై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే సందిగ్ధం నెలకొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.టాక్సిక్...‘కేజీఎఫ్ 1, 2’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత యశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటించారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ , మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత ‘దిల్’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే... ఈ మూవీని తొలుత మార్చి 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో మార్చి 19 నుంచి జూన్ 4కు రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ, జూన్ 4న విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా మరోసారి మారనుంది. త్వరలోనే కొత్త డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. ‘‘సినిమాకాన్ లో ‘టాక్సిక్’ని ప్రదర్శించిన తర్వాత ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూటర్స్, పరిశ్రమ భాగస్వాముల నుండి అద్భుతమైన స్పందన లభించింది. అక్కడ వచ్చిన స్పందన చూసిన తర్వాత ఇది వరల్డ్ వైడ్‌గా అందరికీ చేరాల్సిన సినిమా అని మాకు అర్థమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్త పంపిణీ, భాగస్వామ్యాలను కాంటాక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో మా సినిమా విడుదల తేదీని పునఃసమీక్షించాలని నిర్ణయించుకున్నాం. గతంలో ప్రకటించినట్లుగా జూన్ 4న విడుదల చేయలేకపోతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన తదుపరి విడుదల తేదీని త్వరలోనే చెబుతాం. భారతీయ సినిమా తన సత్తాను వరల్డ్‌వైడ్‌గా చాటుతూ గొప్ప భవిష్యత్తుతో ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో దాని స్థాయిని మరింత పెంచాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిపై ఉంది.ఒక నటుడిగా, నిర్మాతగా భారతీయ చిత్ర పరిశ్రమ కోసం, మనందరి కోసం నా వంతు పా త్రపోషించడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. కొన్ని కథలకు సహనం అవసరం. కొన్ని ప్రయాణాలకు అది తప్పనిసరి. మీరు ఆస్వాదించి, వేడుక చేసుకునే ఒక చిత్రాన్ని మీకు అందిస్తామని వాగ్దానం చేస్తున్నాం. భారతీయ సినిమా చరిత్రలోనే ఒక గర్వకారణంగా నిలిచే చిత్రం ఇది’’ అని యశ్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాల విడుదల తేదీల పైనా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. – డేరంగుల జగన్ మోహన్ -
కొరియన్ కనకరాజు ఫస్ట్ సాంగ్
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై వరుణ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తాజాగా విడుదలైన పాటను కాసర్ల శ్యామ్ రచించగా సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సంగీతం తమన్ అందించారు. -
కొరియాలో కనకరాజు
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్‌ని కొరియాలో ప్రారంభించినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ స్టోరీ టెల్లింగ్, యువీ క్రియేషన్స్–ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలతో ‘కొరియన్ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది.హారర్, కామెడీ ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌ని సౌత్ కొరియాలో ప్రారంభించాం. వారం పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనగా కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఈ షూట్ ప్లాన్ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని. -
కొరియన్ కనకరాజు గా వరుణ్ తేజ్ టీజర్ మామూలుగా లేదుగా
-
హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మెగా హీరో హారర్ మూవీ.. గ్లింప్స్ రిలీజ్
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కాస్త డిఫరెంట్ సినిమాలతో హిట్స్ అందుకున్న హీరో వరుణ్ తేజ్.. గత మూడు చిత్రాలతో దారుణంగా నిరాశపరిచాడు. చివరగా 2024లో 'మట్కా' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా కనిపించడమే మానేశాడు. అయితే హారర్ సినిమాలో నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర గ్లింప్స్, టైటిల్ అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్)వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి 'కొరియన్ కనకరాజు' అనే పేరు ఖరారు చేశారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా తదితర కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రితికా నాయక్ హీరోయిన్ కాగా సత్య కీలక పాత్ర చేశారు. గ్లింప్స్ సింపుల్‌గా కామెడీగా బాగుంది.కొరియన్ పోలీస్ స్టేషన్లో సత్యని కట్టేసి ఉంటే.. కత్తితో వచ్చిన వరుణ్ తేజ్, పోలీసుల్ని చంపేస్తాడు. కట్ చేస్తే అతడిని ఓ దెయ్యం ఆవహించి ఉంటుంది. మరి ఆ దెయ్యం ఎవరు? అసలు కొరియాలో వీళ్లు ఏం చేస్తున్నారనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది వేసవిలో థియేటర్లలోకి సినిమాని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.(ఇదీ చదవండి: దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్ చేశా.. అందరిముందే అరిచాడు!)


