కొరియాలో కనకరాజు | Varun Tej Korean Kanakaraju Final Schedule in Korea | Sakshi
Sakshi News home page

కొరియాలో కనకరాజు

Mar 15 2026 12:43 AM | Updated on Mar 15 2026 12:43 AM

Varun Tej Korean Kanakaraju Final Schedule in Korea

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ నిర్మిస్తున్న ఈ మూవీ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ని కొరియాలో ప్రారంభించినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ‘‘వరుణ్‌ తేజ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ స్టోరీ టెల్లింగ్, యువీ క్రియేషన్స్‌–ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాణ విలువలతో ‘కొరియన్‌ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

హారర్, కామెడీ ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్‌ షెడ్యూల్‌ని సౌత్‌ కొరియాలో ప్రారంభించాం. వారం పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో పాటలు, కథలో ముఖ్యమైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తాం. వరుణ్‌ తేజ్, రితికా నాయక్, సత్య పాల్గొనగా కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఈ షూట్‌ ప్లాన్‌ చేశాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్‌ రెడ్డి కాటసాని.

Advertisement
 
Advertisement
Advertisement