పాతికేళ్ల 'లగాన్‌' వేడుకలో..స్పెషల్‌ అట్రాక్షన్‌గా కరీనా కపూర్‌! | Kareena Kapoor Stunning Looks At Lagaan 25th Anniversary Event Grabs Attention With Banarasi Kurta, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

పాతికేళ్ల 'లగాన్‌' వేడుకలో..స్పెషల్‌ అట్రాక్షన్‌గా కరీనా కపూర్‌! ఏకంగా రూ. 1.3 లక్షల..

Jun 15 2026 1:42 PM | Updated on Jun 15 2026 4:05 PM

25 year bash Aamir Khan Productions Kareena Kapoor Stuns In Suit Heels

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) కెరీర్‌లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిపోయింది ‘లగాన్‌. ఈ మూవీ ఒకవైపు దేశభక్తిని, మరోవైపు యువతను విశేషంగా ఆకర్షించే క్రికెట్ సన్నివేశాల మేళవింపుతో భావోద్వేగభరితంగా తెరకెక్కించిన క్లాసిక్‌ చిత్రంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. 

దర్శకుడు అశుతోష్‌ గోవారికర్‌ (Ashutosh Gowariker) తెరకెక్కించిన ఈ మూవీ  2001 జూన్‌ 15న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతూ.. సూపర్‌ హిట్‌గా నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సరిగ్గా ఈ నెల 15తో 25 ఏళ్లు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా ఈ మైలురాయిని పురస్కరించుకుని, నటుడు ఆమిర్‌ ఖాన్‌, దర్శకుడు అశుతోష్ గోవారికర్ జూన్ 13న ముంబైలో ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో సహా బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కరీనా కపూర్‌ తనదైన గ్లామరస్‌ లుక్‌తో అలరించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే బేబో పింక్‌ కుర్తాలో గులాబీలా మెరిసింది. ఈ వేడుకలో ఆమె ధరించి డ్రస్‌, హైహిల్స్‌ ధర వింటే విస్తుపోవాల్సిందే. ఇది ఎకాయ బనారస్‌ బ్రాండ్‌కి చెందిన సిల్క్‌ కుర్తా. 

డిజైనర్‌ అమృత గిల్‌ షేర్‌ రూపొందించారు. కరీనా డిజైనర్‌వేర్‌పై క్లిష్టమైన, చేనేత కట్‌వర్క్ బనారసీ డిజైన్లు ఉన్నాయి. ఫ్లేర్డ్ కుర్తాను స్ట్రెయిట్ ప్యాంట్లు, దానికి సరిపోయే షీర్ దుపట్టాతో జత చేశారు. ఈ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా అక్వాజురా హీల్స్‌ను ఎంచుకుంది. ఇక కరీనా ధరించిన ఈ అందమైన కుర్తా ధర వచ్చేసి రూ. రూ. 41,000 కాగా, హీల్స్‌ ధర వచ్చేసి ఏకంగా రూ. 92,000 పైనే పలుకుతుందట. 

ఇక హెయిర్‌స్టైల్‌ కోసం క్లాసిక్‌ నీట్‌ బన్‌ను ఎంచుకున్నారు. అలాగే సింపుల్‌ మేకప్‌ టోన్స్‌, గ్రీన్‌ కళ్లు అందంగా కనిపించే కాజల్‌, చిన్న బొట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేశారామె. అంతేగాదు ఈ బ్యూటీ బేబో స్టైలిష్‌గా ఆకర్షణీయంగా కనపించే అవకాశాన్ని ఎప్పుడు వదులుకోదామె. ఎల్లప్పుడూ ఓ కొత్తలుక్‌తో కరీనా తన అభిమానులను ఆశ్చర్యపరస్తుంటుందామె.

 

(చదవండి: సాంగ్‌ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement