సముద్రపు గుండెల్లో సెగలు డాల్ఫిన్ల సాహసయాత్ర!  | Dolphins adventurous journey in the depths of the ocean | Sakshi
Sakshi News home page

సముద్రపు గుండెల్లో సెగలు డాల్ఫిన్ల సాహసయాత్ర! 

Aug 1 2026 1:14 AM | Updated on Aug 1 2026 1:14 AM

Dolphins adventurous journey in the depths of the ocean

ఎల్‌ నినో

నీలి రంగు పసిఫిక్‌ మహాసముద్రం... అలల పైనుంచి ఎగిరిపడుతూ గుంపులు గుంపులుగా ఈదుకుంటూ వెళ్తున్న వందలాది డాల్ఫిన్లు! 2026 జూలై ఆఖరు వారంలో అమెరికాలోని లాంగ్‌ బీచ్‌ (కాలిఫోర్నియా) తీరంలో టూరిస్ట్‌ బోటుపై ఉన్న జనాలు ఈ అద్భుతాన్ని చూసి కేరింతలు కొట్టారు. కానీ, పైకి ఎంత అందంగా కనిపిస్తున్నా ఆ డాల్ఫిన్ల పరుగు వెనుక సముద్ర గర్భం లో జరుగుతున్న ఒక పెద్ద పోరాటం దాగి ఉంది. సాధారణంగా డాల్ఫిన్లు ఇంత పెద్ద సంఖ్యలో తీరానికి దగ్గరగా రావు. కానీ ప్రస్తుతం సముద్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

‘అక్వేరియం ఆఫ్‌ ది పసిఫిక్‌’ శాస్త్రవేత్తల ప్రకారం తీవ్రమైన ఎల్‌నినో వాతావరణ మార్పులు, సముద్రపు తీవ్ర ఉష్ణ తరంగాలు పసిఫిక్‌ జీవరాశులను అతలాకుతలం చేస్తున్నాయి. సముద్రం పైభాగం వేడెక్కడంతో డాల్ఫిన్లకు, తిమింగలాలకు, సముద్ర పక్షులకు ఆహారమైన చిన్న చిన్న చేపలు, జీవులు  ప్రాణాలు కాపాడుకోవడానికి లోతైన చల్లటి నీటిలోకి వలసపోతున్నాయి. దాంతో తిండి కోసం డాల్ఫిన్లు తమ రూట్‌ను మార్చి వేటాడాల్సి వస్తోంది. దీనికి తోడు వేడి పెరగడం వల్ల సముద్రంలో ‘టాక్సిక్‌ ఆల్గల్‌ బ్లూమ్స్‌’ (విషపూరిత నాచు) విపరీతంగా పెరిగిపోతోంది. ఇది సముద్రపు నీటిని విషమయం చేస్తోంది. పైకి చూసేవాళ్లకు డాల్ఫిన్ల ఆటలు సరదాగా అనిపించవచ్చు. కానీ నిజానికి అవి వాతావరణ మార్పులతో పోరాడుతూ, తమ మనుగడ కోసం చేస్తున్న సముద్రపు సాహసయాత్ర ఇది! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement