breaking news
El Nino
-
ఎల్ నినో ముప్పు.. కానీ భారత్‌పై మేఘాల మాయాజాలం!
ఎల్ నినో ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. రుతుపవనాలు మరోసారి బలాన్ని పుంజుకుంటున్నాయి. ఆకాశం నుంచి తీసిన ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని చాలా ప్రాంతాలు దట్టమైన మేఘాలతో కప్పుకున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం తూర్పు, మధ్య భారతంలో వర్షాలకు ఊతమిస్తోంది.ప్రస్తుతం వాతావరణ నిపుణుల దృష్టి మొత్తం బంగాళాఖాతం వైపే ఉంది. అక్కడ ఏర్పడే అల్పపీడనాలు రుతుపవనాలకు కీలకమైన ఇంధనంలా పనిచేస్తాయి. సముద్రం నుంచి తేమను తీసుకువచ్చి భూభాగంపైకి వర్షాలను తీసుకువస్తాయి. తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.శాటిలైట్ చిత్రాల్లో..భారత ఉపగ్రహాలు, అంతర్జాతీయ వాతావరణ ఉపగ్రహాలు పంపిన చిత్రాల్లో అరేబియా సముద్రం నుంచి మధ్య భారతం మీదుగా గంగా మైదానాలు, ఈశాన్య రాష్ట్రాల వరకు మేఘాల విస్తరణ కనిపిస్తోంది. ముఖ్యంగా బంగాళాఖాతం పరిసరాల్లో దట్టమైన మేఘాలు ఉండటం బలమైన వర్ష వ్యవస్థకు సంకేతంగా భావిస్తున్నారు. తూర్పు భారతంపై కనిపిస్తున్న చల్లటి మేఘ శిఖరాలు బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు సూచనగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల స్థానికంగా వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.ఎల్ నినోతో ఎందుకు టెన్షన్?సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణ గాలుల మార్పులు చోటుచేసుకుని వర్షపాతంపై ప్రభావం చూపుతాయి. అయితే ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ కచ్చితంగా కరవే వస్తుందని చెప్పలేం. ఇతర వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వరుసగా ఏర్పడుతున్న వర్ష వ్యవస్థలు రుతుపవనాలకు కొంత ఊరటనిస్తున్నాయి.కీలకమైన ఆగస్టు వర్షాలుభారత వ్యవసాయానికి రుతుపవనాలు ఎంతో కీలకం. దేశంలోని కోట్లాది మంది రైతులు వర్షాధార పంటలపై ఆధారపడుతుంటారు. జూన్, జూలైలో వర్షాల తీరును బట్టి పంటల సాగు ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో వచ్చే వర్షాలు పంటల ఎదుగుదలకు చాలా అవసరం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపించగా.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవుతున్నాయి. ఈ అసమాన పరిస్థితులను సమతుల్యం చేయడంలో బంగాళాఖాతం నుంచి వచ్చే అల్పపీడనాలు కీలకంగా మారుతున్నాయి.రుతుపవనాలకు కొత్త ఊపుప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణ పరిస్థితులు రుతుపవనాలు పూర్తిగా బలహీనపడలేదని సూచిస్తున్నాయి. ఎల్ నినో ముప్పు ఉన్నప్పటికీ.. బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు వర్షాలకు బలాన్ని ఇస్తున్నాయి.ఆగస్టు రెండో భాగంలో తూర్పు, మధ్య, ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎల్ నినో ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది రాబోయే వారాల్లోని వాతావరణ మార్పులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఆకాశంలో కనిపిస్తున్న మేఘాలు.. రుతుపవనాలకు మరోసారి ఆశలు రేకెత్తిస్తున్నాయి. -
10 రోజులు.. 10 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వానాకాలం (ఖరీఫ్) సాగు ఊపందుకుంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లోనే దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 41.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65.96 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 63 శాతం పూర్తయింది. మొత్తం పంటల విషయానికొస్తే.. 132.38 లక్షల ఎకరాల సాధారణ సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 107.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. అంటే 81 శాతం సాగు పూర్తయింది. నిజానికి వర్షాలు ఆలస్యం కావడంతో జూన్, జూలైలో సాగుపై కొంత సందిగ్ధత నెలకొంది. ఎల్‌నినో ఆందోళనకు గురిచేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి మారింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత, భూముల్లో తేమ పెరగడంతో రైతులు పంటల సాగు, వరి నాట్లు ముమ్మరం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి 30 లక్షల లోపు ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెపుతుండగా..తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఈ విస్తీర్ణం సుమారు 10 లక్షల ఎకరాలు పెరిగింది. మరో వారం రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగా పత్తి సాగు ఇతర పంటల సాగులోనూ మంచి పురోగతి కనిపిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 47.72 లక్షల ఎకరాల్లో (101 శాతం) సాగైంది. పప్పుధాన్యాల సాగు 6.38 లక్షల ఎకరాలకు చేరి 98 శాతం పూర్తయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే కంది 93 శాతం, పెసర 149 శాతం, మినుము 95 శాతం సాగయ్యాయి. మొక్కజొన్న 5.31 లక్షల ఎకరాల్లో (86 శాతం), నూనెగింజలు 3.79 లక్షల ఎకరాల్లో (85 శాతం) సాగయ్యాయి. సోయాబీన్ 3.72 లక్షల ఎకరాల్లో వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 100% మించి.. జిల్లాల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో పంటల సాగు వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో సాధారణ సాగులో 101 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 102 శాతం, నిర్మల్‌లో 102 శాతం నమోదైంది. నిజామాబాద్‌లో 98 శాతం, కామారెడ్డిలో 96, పెద్దపల్లిలో 92, సంగారెడ్డిలో 96 శాతం చొప్పున సాగు పూర్తయింది. తద్వారా ఈ జిల్లాల్లో సాధారణ సాగు లక్ష్యం దాదాపుగా పూర్తయింది. మరోవైపు ఉమ్మడి వరంగల్, దక్షిణ తెలంగాణలో సాగు ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు. వరంగల్‌లో 61 శాతం, హనుమకొండలో 73, మహబూబాబాద్‌లో 62, ములుగులో 60, జనగామలో 79, సిద్దిపేటలో 75, మెదక్‌లో 84 శాతం చొప్పున సాగు నమోదు అయ్యింది. దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్ 66 శాతం, వనపర్తి 66, జోగుళాంబ గద్వాల 63, వికారాబాద్ 72, రంగారెడ్డి 74 శాతంతో వెనుకబడి ఉన్నాయి. సూ ర్యాపేటలో అత్యల్పంగా 59 శాతం సాగైంది. వెంటాడుతున్న ఎల్‌నినో భయం ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రైతులు భారీగా పంటలు సాగు చేసినా.. ముందున్న వా తావరణ పరిస్థితులపై ఆందోళన కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నది రైతు లను, ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. పంట లు కీలక దశకు చేరుకునే సమయంలో వర్షాలు ముఖం చాటేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భయం నెలకొంది. ముఖ్యంగా వరి సాగుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎల్‌నినో ప్రభావా న్ని అంచనా వేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్‌లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్‌ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
జిల్లా నీటిపారుదల సలహా మండళ్ల పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండళ్లను తక్షణమే పునరుద్ధరించాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అటవీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్ శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ప్రతి పంట కాలానికి ముందు, పంట సీజన్లో ఈ మండళ్లు తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భవిష్యత్ నీటి ప్రవాహాలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, ఆయకట్టు పరిస్థితులను సమీక్షించి ఏయే పంటలు వేయాలో రైతులకు శాస్త్రీయ సూచనలు ఇవ్వాలన్నారు. శనివారం నుంచే సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలే మేలు.. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలను రైతులు సాగు చేయవద్దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఒకసారి నీరు అందినా పంటల తర్వాతి దశలో నీరు అందించడంపై అనిశ్చితి నెలకొందని.. అందువల్ల ప్రతి ఆయకట్టులో ఎంత సాగునీరు అందించగలమో, ఎక్కడ నీటి పరిమితులు ఉన్నాయో కలెక్టర్లు, అధికారులు రైతులకు ముందే తెలియజేయాలని ఆదేశించారు.నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరుకోనందున ఆయా ఆయకట్టు ప్రాంతాల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన నీటి నిల్వలను పరిరక్షించాలని గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. -
2,000 నౌకలతో ఎల్ నినోపై యుద్ధం.. సైంటిస్టుల సంచలన నిర్ణయం..!
-
మహా రాక్షసి 'సూపర్ ఎల్ నినో' ఆగస్టు-అక్టోబర్ మధ్య ప్రపంచానికి ప్రళయం!
-
నేటి నుంచి బియ్యం పంపిణీ
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి సన్నబియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు. ఈ మేరకు మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి జూలై 28వ తేదీ నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతున్నాయి. చిన్న దుకాణాలకు ఒకేసారి, పెద్ద దుకాణాలకు రెండుసార్లు బియ్యం రవాణా చేసి నిల్వ చేయనున్నారు. ఇందుకోసం జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రేషన్‌కార్డుదారుడు మూడుసార్లు వేలిముద్రలు వేసి బియ్యం పొందాల్సి ఉంటుంది. గతంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యం అందజేసిన విషయం తెలిసిందే. డీలర్లకు స్థలం కొరత జిల్లాలో చాలామంది డీలర్లకు మూడు నెలల బియ్యం కోటా నిల్వ చేసుకునేందుకు సరిపడా స్థలం లేక ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ తమకు శక్తికి మించి భారమవుతుందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ–పాస్ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వినియోగదారులు మూడుసార్లు వేలిముద్రలు పెట్టడంతో పంపిణీ ఆలస్యం అవుతుంది. దీంతో ఒక్కో వినియోగదారుడికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని డీలర్లు వాపోతున్నారు. -
సముద్రపు గుండెల్లో సెగలు డాల్ఫిన్ల సాహసయాత్ర!
నీలి రంగు పసిఫిక్ మహాసముద్రం... అలల పైనుంచి ఎగిరిపడుతూ గుంపులు గుంపులుగా ఈదుకుంటూ వెళ్తున్న వందలాది డాల్ఫిన్లు! 2026 జూలై ఆఖరు వారంలో అమెరికాలోని లాంగ్ బీచ్ (కాలిఫోర్నియా) తీరంలో టూరిస్ట్ బోటుపై ఉన్న జనాలు ఈ అద్భుతాన్ని చూసి కేరింతలు కొట్టారు. కానీ, పైకి ఎంత అందంగా కనిపిస్తున్నా ఆ డాల్ఫిన్ల పరుగు వెనుక సముద్ర గర్భం లో జరుగుతున్న ఒక పెద్ద పోరాటం దాగి ఉంది. సాధారణంగా డాల్ఫిన్లు ఇంత పెద్ద సంఖ్యలో తీరానికి దగ్గరగా రావు. కానీ ప్రస్తుతం సముద్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ‘అక్వేరియం ఆఫ్ ది పసిఫిక్’ శాస్త్రవేత్తల ప్రకారం తీవ్రమైన ఎల్‌నినో వాతావరణ మార్పులు, సముద్రపు తీవ్ర ఉష్ణ తరంగాలు పసిఫిక్ జీవరాశులను అతలాకుతలం చేస్తున్నాయి. సముద్రం పైభాగం వేడెక్కడంతో డాల్ఫిన్లకు, తిమింగలాలకు, సముద్ర పక్షులకు ఆహారమైన చిన్న చిన్న చేపలు, జీవులు ప్రాణాలు కాపాడుకోవడానికి లోతైన చల్లటి నీటిలోకి వలసపోతున్నాయి. దాంతో తిండి కోసం డాల్ఫిన్లు తమ రూట్‌ను మార్చి వేటాడాల్సి వస్తోంది. దీనికి తోడు వేడి పెరగడం వల్ల సముద్రంలో ‘టాక్సిక్ ఆల్గల్ బ్లూమ్స్’ (విషపూరిత నాచు) విపరీతంగా పెరిగిపోతోంది. ఇది సముద్రపు నీటిని విషమయం చేస్తోంది. పైకి చూసేవాళ్లకు డాల్ఫిన్ల ఆటలు సరదాగా అనిపించవచ్చు. కానీ నిజానికి అవి వాతావరణ మార్పులతో పోరాడుతూ, తమ మనుగడ కోసం చేస్తున్న సముద్రపు సాహసయాత్ర ఇది! -
కూరగాయల సాగును ప్రోత్సహించండి
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖతోపాటు ఇతర అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను భారీ సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ల పరిసర ప్రాంతాల్లో కూరగాయల ఆర్గానిక్ పద్దతిలో సాగును ప్రోత్సహించాలని, అక్క డ పండే తాజా కూరగాయలను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి కిచెన్లకు సరఫరా చేసే వ్యవస్థను అభివృద్ధి చేయా లని సూచించారు. దీంతో రైతులకు గిట్టు బాటు ధర లభించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన, తాజా ఆహారం అందుబాటులోకి వస్తుందన్నారు.గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రికి ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం, వ్యవసాయంపై దాని ప్రభావం, తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై డాక్టర్ చిన్నారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను సమరి్పంచింది. ఈ సందర్భంగా కమిటీ చేసిన సిఫార్సులపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల ఆదాయానికి భరోసా కలి్పంచడంతోపాటు ఆహార భద్రతను కాపాడే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక ప్రతి గ్రామానికి ప్రత్యేక అత్యవసర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కమిటీ సూచించింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో వరి, సాగు తగ్గిందని, అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను ప్రోత్సహించాలని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఆయా ప్రాంతాల భూస్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరు ధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని పేర్కొంది.ఈ పంటలకు అవసరమైన విత్తనాలను 75% సబ్సిడీపై అందించడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు కొత్త పంట రుణాలు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రత్యేకంగా ప్రోత్సహించాల ని పేర్కొంది. నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృత కూరగాయల ఉత్పత్తి కేంద్రాలను అభివృద్ధి చేయాలని తెలిపింది. పశుగ్రాసం, డెయిరీపై దృష్టి వ్యవసాయంతోపాటు పశుసంవర్ధక రంగాన్ని కూడా బలోపేతం చేయాలని కమిటీ సూచించింది. పశుగ్రాస విత్తనాలను సబ్సిడీపై అందించి పశుగ్రాస సాగును పెంచాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సాంకేతిక సూచనలు అందించాలని, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల నిర్వహణపై ప్రత్యేక సలహాలు ఇవ్వాలని సూచించింది. ఆయా బృందాలు పంటల పరిస్థితి, నీటి లభ్యత, రైతుల సమస్యలను నిరంతరం పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రూ.803 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు తదితర రంగాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమని కమిటీ అంచనా వేసింది. సీఎంకు నివేదిక సమర్పించిన అనంతరం జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుల నష్టాన్ని తగ్గించడం, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలకు నివేదికలో ప్రాధాన్యం ఇచి్చనట్లు తెలిపారు. జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలమట్టం తగ్గడంతో నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలను గ్రామాల వారీ కార్యాచరణతో ప్రోత్సహించాలన్నారు. -
ఊట బావులు.. ఉబికొచ్చే జలాలు
రేగోడ్(మెదక్): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి..భూగర్భ జలాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో బావులు, బోర్లు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఒక ఊరిలో మాత్రం ఊటబావులు ఇప్పటికీ నిరంతరాయంగా నీటిని అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఈ సహజ జలవనరుల ద్వారానే పంటలను కాపాడుకుంటూ గ్రామ రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని టి.లింగంపల్లి గ్రామం సహజ సిద్ధమైన ఊట బావులకు ప్రసిద్ధి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో భూమి అడుగు నుంచి నిరంతరం ఉబికి వచ్చే ఈ బావులు తరతరాలుగా ప్రజలకు తాగునీరు అందిస్తూ , సాగునీటి అవసరాలు కూడా తీరుస్తున్నాయి. గ్రామంలో 5 ఊట బావులు ఉండగా, వ్యవసాయ క్ష్రేత్రాల్లో 200లకు పైగా ఊట బావులు ఉన్నట్టు గ్రామస్తులు చెప్పారు. పంటలు సాగు గ్రామంలో వరి, కూరగాయలు, ఇతర పంటలకు అవసరమైన నీటిని ఈ ఊట బావుల నుంచే అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయినా, ఇక్కడ సహజంగా ఉబికి వచ్చే నీటి కారణంగా పంటలు ఎండిపోకుండా సాగు కొనసాగుతోంది. దీంతో ఈ బావులు రైతులకు నిజమైన జీవనాధారంగా మారాయి. ఎన్నో దశాబ్దాలుగా ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పూర్తిగా ఎండిపోలేదని రైతులు అంటున్నారు. అందుకే గ్రామ ప్రజలు ఇప్పటికీ ఈ బావులపైనే అత్యధికంగా ఆధారపడుతున్నారు. 30 ఏళ్లుగా బావినీటితో సాగు ముప్పై ఏళ్లుగా మూడు బావుల నీటితో పదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను. నా పొలంలో మిర్చి, వరి, వేరుశనగ వేశాను. ఈ ఏడాది వర్షాలు పెద్దగా లేకపోయినా ఊట బావుల్లో నీరు పుష్కలంగా ఉండటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. – మారుతీరావు, రైతు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి వర్షాలు లేకపోయినా ఊటబావుల్లో ఎప్పటికీ నీరు ఉండటం మా గ్రామానికి గొప్ప వరం.బావుల వల్ల ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రావడం లేదు. ప్రభుత్వం కూడా ఇలాంటి సహజ నీటి వనరులను సంరక్షించి అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుంది. –చంద్రయ్య, గ్రామస్తుడు -
ఎల్ నినో ఎఫెక్ట్: భూమికి పొంచి ఉన్న మరో ముప్పు?!
ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల సెగను ఎదుర్కొంటోంది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమవుతున్న వేడిగాలులు, కరవు పరిస్థితులు.. మరోవైపు ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్న తుపాన్లు, వరదలు అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఓ పరిణామం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. సూపర్ ఎల్‌నినో.. గాడ్జిల్లా ఎల్‌నినో అంటూ చర్చకు వచ్చిన ఈ వాతావరణ ప్రభావం 2026పైనే అందరి దృష్టిని మళ్లించింది. అయితే శాస్త్రవేత్తల తాజా అంచనాలు మాత్రం అసలు ప్రభావం మరింత ఆలస్యంగా కనిపించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే.. 2026 ప్రపంచంలో రెండో అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉందని అంటోంది. మరి మొదటి ఏడాది?. దానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు. 2027 మాత్రం గత శతాబ్దానికి పైగా ఉన్న ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేసే స్థాయికి చేరవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో పరిస్థితులను పేర్కొంటున్నారు.సముద్రంలో దాగిన వేడి.. భూమిపై ప్రభావంఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో సహజంగా సంభవించే వాతావరణ మార్పు. సాధారణ పరిస్థితుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. ఆ వేడి ప్రపంచవ్యాప్తంగా గాలుల కదలికలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో భారీ స్థాయిలో వేడి నిల్వ ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. సముద్రం లోపల పేరుకుపోయిన ఈ వేడి క్రమంగా పైకి వచ్చి వాతావరణ వ్యవస్థలోకి చేరినప్పుడు.. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.ప్రస్తుత ఎల్ నినోను 1997-98లో నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోతో శాస్త్రవేత్తలు పోలుస్తున్నారు. అప్పట్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు, వరదలు, కరువులు సంభవించాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు భూమి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో మరింత వేడెక్కిపోయింది.2026లో మొదలై.. 2027లో తీవ్ర ప్రభావం?ఎల్ నినో ప్రభావం ఏర్పడిన వెంటనే బయటపడదు. సముద్రంలో మార్పులు చోటుచేసుకున్న తర్వాత వాటి ప్రభావం వాతావరణ వ్యవస్థపై పడేందుకు కొంత సమయం పడుతుంది. అందుకే సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన ఏడాది కంటే.. తర్వాతి ఏడాదిలో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే కారణంగా 2026లో బలపడుతున్న ఎల్ నినో ప్రభావం 2027లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెరిగిన గ్రీన్హౌస్ వాయువులు వేడిని బంధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎల్ నినో ప్రభావం కలవడంతో ఉష్ణోగ్రతలు గత అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మారనున్న ప్రపంచ వాతావరణ ముఖచిత్రం!బలమైన ఎల్ నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను ప్రభావితం చేయగలదు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర పొడి పరిస్థితులు ఏర్పడవచ్చు. దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో ఎండలు, కరవు పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తుఫాన్ల తీవ్రత, వాటి ప్రయాణ మార్గాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?ఎల్ నినో ప్రభావం భారత వాతావరణంపై కూడా పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం కనిపించే సందర్భాలు గతంలో ఉన్నాయి. కొన్ని బలమైన ఎల్ నినో పరిస్థితుల సమయంలో వర్షపాతం తగ్గిన ఉదాహరణలు నమోదయ్యాయి. అయితే భారత రుతుపవనాలను ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ ఎల్ నినో బలపడితే వ్యవసాయం, నీటి వనరులు, వేసవి ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సహజ మార్పా? మానవ తప్పిదాల ప్రభావమా?ఎల్ నినో అనేది సహజంగా జరిగే ప్రక్రియే అయినప్పటికీ.. ప్రస్తుతం దాని ప్రభావం తీవ్రంగా కనిపించడానికి గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బొగ్గు, చమురు, సహజ వాయువుల వినియోగం వల్ల పెరుగుతున్న కార్బన్ ఉద్గారాలు భూమి ఉష్ణోగ్రతలను నిరంతరం పెంచుతున్నాయి. దీంతో సహజ వాతావరణ మార్పులు వచ్చిన ప్రతిసారి వాటి ప్రభావం గతంతో పోలిస్తే మరింత తీవ్రంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతోంది.మరో వేడి రికార్డుకు రంగం సిద్ధమా?ప్రస్తుత అంచనాలు నిజమైతే.. 2027 భూమి చరిత్రలోనే అత్యంత వేడిగల సంవత్సరంగా నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం ఉష్ణోగ్రతల రికార్డు మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఒక ముందస్తు హెచ్చరికగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో పేరుకుపోతున్న వేడి రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.. భూమి వేడెక్కే వేగం ఇంకా తగ్గడం లేదు. కొత్త ఉష్ణోగ్రత రికార్డులకు వాతావరణం మరోసారి వేదికగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
వాతావరణంలో పెను మార్పులు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఎల్‌నినో ప్రభావమో..వాతావరణం మార్పులో.. రుతుపవనాలు రాకో.. వాయుగుండం ప్రభావమో తెలియదు గాని ఇటీవల కాలంలో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విభిన్న పరిస్థితులు కానవస్తున్నాయి. వర్షాకాలం వచ్చినా ఉదయం, మధ్యాహ్నాం ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే ఉన్నాయి. వేసవిని తలపించే విధంగా ఎండలు కాస్తున్నాయి. మధ్యాహా్నం సమయంలో గాల్పులు వీస్తున్నాయి. వాతావరణం వేడిగా ఉండి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి పూట ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. కార్యాలయాలు వద్ద జనసంచారం తగ్గుతుంది. జ్యూస్ షాపులు వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయంత్రం అయ్యే సరికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడం కొన్ని సందర్భాలలో ఈదురు గాలులు వీచి మేఘాలు వర్షం పడకుండానే దూరంగా వెళ్లిపోవడం, కొన్ని సందర్భాలలో తేలికపాటి చిరు జల్లులు పడుతూ విచిత్రమైన, విభిన్నమైన పరిస్థితులు కానవస్తున్నాయి. మేఘాలు వస్తే వర్షాలు భారీగా పడుతాయన్న ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. ఉక్కపోత తప్పడం లేదు. ఇటువంటి వాతావరణ పరిస్థితులు కొత్తగా చూస్తున్నట్లు ఉందని పలువురు అంటున్నారు. రాత్రి సమయాల్లో వేడి కారణంగా ఉక్కపోత, దోమల బెడదతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. వర్షాలు పడాలని, ఇటువంటి పరిస్థితులు గతంలో చూడలేదని, ఎంత కాలం ఇలా కొనసాగుతుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
లక్షల ఎకరాలు బీళ్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి లక్షలాది ఎకరాలు బీడు భూములుగానే మారిపోనున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జలాశయాలు, ప్రాజెక్టులు, కాలువల కింద పొలాలన్నీ ఇప్పటికీ బీళ్లుగానే కనిపిస్తున్నాయి. నిరుటి ఖరీఫ్‌తో పోలిస్తే వరి సాగు ఏకంగా 32 లక్షల ఎకరాలకు పైగా తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అందులో ముప్పావు వంతు భూములు బీళ్లుగానే మిగిలే పరిస్థితి. ప్రత్యామ్నాయ పంటల పేరుతో వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలను రైతులు పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. వచ్చే ఆగస్టు 15 వరకు వరి సాగు చేసుకునే అవకాశం ఉందనే కారణంగా రైతులు వేచి చూసే ధోరణితోనే ఎక్కువగా ఉన్నారు. దీంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఇతర అధికారులు రోజూ సమీక్షలు నిర్వహిస్తూ, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తగ్గుతుందంటున్న వ్యవసాయశాఖ రాష్ట్రంలో సాధారణంగా సాగయ్యే విస్తీర్ణంతో పోలిస్తే ఈసారి ప్రధాన పంటల సాగు 23.12 శాతం తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి సాగయ్యే 30 లక్షల ఎకరాలు బీళ్లు కానున్నాయి. అయితే ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసినా, ఇతర ప్రాంతాల్లో ఉండి వరి సాగు చేసుకునే రైతులు, కౌలు రైతులు ముందుకు రావడం లేదు. శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38,446 ఎకరాలు కాగా, గత ఏడాది ఇది 1,39,28,853 ఎకరాలకు చేరింది. అయితే ఈసారి ప్రధాన పంటలు కేవలం 1,07,08,617 ఎకరాల్లోనే సాగవుతాయని అంచనా వేశారు. మిగిలిన 32,20,233 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటల సాగుకు అవసరమైన నీరు దొరికే పరిస్థితి లేదు. దీంతో సుమారు 32 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండదని భావిస్తున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి పంటలు వేసే సమయం దాటిపోయింది. ప్రత్యామ్నాయ పంటల కింద పెసర, బొబ్బర్లు, కంది వంటి వాటిని పండించేలా ప్రయత్నిస్తోంది. అయితే ఆగస్టు 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చని భావిస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టడం లేదు. భారీగా తగ్గనున్న వరి ఎల్ నినో ప్రభావం అత్యధికంగా వరిపైనే పడుతోంది. గత ఏడాది వానాకాలంలో 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, ఈసారి 38.51 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా. ఆగస్టు 15 వరకు మరో 15 లక్షలకు పైగా ఎకరాల్లో నాట్లు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాగే గత ఏడాది 50.70 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి ఈసారి 45.93 లక్షల ఎకరాలకు పరిమితం కానుంది. మొక్కజొన్న కూడా 6.90 లక్షల ఎకరాల నుంచి 6.49 లక్షల ఎకరాలకు తగ్గనుంది. అయితే, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చేయిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కంది, పెసర, మినుము, జొన్న, సన్‌ఫ్లవర్, ఆముదం, కూరగాయలు వంటి పంటలను మరింత పెంచుతామని అధికారులు నివేదికలు తయారు చేయడం విమర్శలకు తావిస్తోంది. రాబోయే రెండు నుంచి మూడు వారాల్లో కురిసే వర్షాలే రాష్ట్ర ఖరీఫ్ వ్యవసాయాన్ని నిర్ణయించనున్నాయి. -
892 గ్రామాలకు ఎల్‌నినో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం తెలంగాణలో మరింత తీవ్రమయ్యే సంకేతాల నేపథ్యంలో అత్యంత ప్రభావానికి గురయ్యే 892 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాల్లో వర్షాభావం, భూగర్భ జలాల క్షీణత, సాగునీటి కొరత, పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. గ్రామ స్థాయిలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, నీటి లభ్యతపై నిరంతర సమాచారం అందించడం, విత్తనాల సరఫరా, సూక్ష్మ సేద్యం, పంటల యాజమాన్యంపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. మిగతా 261 మండలాల్లో సాధారణ స్థాయిలోనే వర్షపాతం ఉంటుందని లెక్కలు వేసింది. 23 జిల్లాల్లో వర్షాభావం.. 360 మండలాల్లో లోటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 621 మండలాల్లో 360 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉండగా, 39 మండలాల్లో తీవ్ర వర్షాభావం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంతో పోలిస్తే 24 శాతం వర్షపాతం లోటు నమోదైంది. మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, జనగామ, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.39 కోట్ల ఎకరాల నుంచి 1.07 కోట్ల ఎకరాలకు పడిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది.అంటే 23.12 శాతం తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అత్యధిక ప్రభావం వరిపైనే పడనుంది. గత ఏడాది 69.89 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈసారి 38.51 లక్షల ఎకరాలకు పరిమితం కావచ్చని అంచనా వేశారు. అంటే దాదాపు 31.38 లక్షల ఎకరాలు తగ్గనున్నాయి. వరి తగ్గే ప్రాంతాల్లో రైతులను ఇతర పంటల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించింది. మొత్తం 32.20 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మంలోనే అత్యధిక ప్రభావిత గ్రామాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 892 గ్రామాల్లో అత్యధికంగా ఖ మ్మం జిల్లాలో 189 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత కుము రం భీం–ఆసిఫాబాద్ జిల్లాలో 151, వనపర్తిలో 89, మహ బూబాబాద్‌లో 72, జనగామలో 72, హనుమకొండలో 69 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో వర్షపాతం, భూగర్భ జలాలు, పంటల పరిస్థితిపై ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చోట ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను వెంటనే మళ్లించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఇతర పంటల సాగు లక్ష్యం..వరికి బదులు మొక్కజొన్న 9.23 లక్షల ఎకరాలు, కంది 8.69 లక్షల ఎకరాలు, కూరగాయలు 1.16 లక్షల ఎకరాలలో సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకొంది. మినుము, పెసర, జొన్న, చిరుధాన్యాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. అలాగే పొద్దుతిరుగుడు, ఆముదం, నూనెగింజల పంటలు, ఉద్యాన పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని కూడా భావిస్తోంది. నీటి అవసరం తక్కువగా ఉండే పంటల వైపు రైతులను మళ్లించేందుకు జిల్లా వారీ లక్ష్యాలను కూడా నిర్ణయించారు. విత్తనాలు.. డ్రిప్.. గ్రామాల్లోనే పంపిణీ ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను తెలంగాణ స్టేట్ సీడ్స్, జాతీయ విత్తన సంస్థ, ప్రైవేటు సంస్థల ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే రైతు వేదికలను విత్తనాల పంపిణీ కేంద్రాలుగా వినియోగించనుంది. సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ల సరఫరా, సబ్సిడీలు, రుణాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అత్యంత ప్రమాద గ్రామాల్లో గ్రామస్థాయి అధికారుల ద్వారా రైతులకు వాతావరణ హెచ్చరికలు, నీటి లభ్యత, పంటల యాజమాన్యంపై ప్రతిరోజూ సమాచారం అందించనున్నారు. భూగర్భ జలాల పర్యవేక్షణ, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పూడికతీత, ఫార్మ్పాండ్లు, చెక్‌డ్యాంల నిర్మాణం, నేల తేమ సంరక్షణ, పశుగ్రాసం, పశువైద్య సేవలు, జిల్లా–మండల స్థాయి కంట్రోల్రూముల ఏర్పాటు వంటి చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, ఉద్యాన, నీటిపారుదల, భూగర్భజలాలు, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. -
తెలంగాణలో ఎల్-నినోపై మంత్రి కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఎల్-నినో కంటింజెన్సీ ప్రణాళికపై ఇంచార్జి మంత్రుల ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు నిర్వహించినట్లు వ్యవసాయ, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ రోజు (గురువారం) సచివాలయంలో జిల్లాల వారీగా వచ్చిన సూచనలు, ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, రానున్న నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వచ్చే నెలలో కూడా ఎల్-నినో పరిస్థితులు కొనసాగనున్నాయని, సెప్టెంబర్ నాటికి దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, డిసెంబర్ నాటికి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్‌పై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఎగువ రాష్ట్రాల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడంతో అక్కడి నుంచి గోదావరి, కృష్ణా నదులకు పెద్దఎత్తున వరదలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 23 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, ఒకటి రెండు జిల్లాలు మినహా ఎక్కడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు. గత రెండు రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు చేయాలని నిర్ణయించుకోవద్దని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గిపోతున్నాయని, బోరుబావుల కింద కూడా వరి సాగు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఉన్న నీరు ప్రధానంగా తాగునీటి అవసరాలకే సరిపోయే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాలోని ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వ సామర్థ్యంపై మండలాల వారీగా రైతులకు నిరంతరం సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కొంతమంది రైతులు ఇంకా వర్షాలు పడతాయనే ఆశతో వరి సాగు చేయాలని భావిస్తున్నారని, వారికి వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరించి ఎలాంటి నష్టాలు జరగకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత వర్షాకాలంతో పోలిస్తే ఈ సీజన్లో దాదాపు 23 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన విధంగానే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై కలెక్టర్లతో చర్చించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచించారు. ఈ అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో రైతులందరికీ ఎల్-నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలు, నీటి లభ్యత, ప్రభుత్వ సూచనలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ సమావేశాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని ఆయా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి రాష్ట్రస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముఖ్యమంత్రి గారికి అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు,ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కె. సురేంద్రమోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా, కర్నాటి వరుణ్ రెడ్డి, భారత వాతావరణ శాఖ , ఇక్రిశాట్, క్రిడా, ఐఐఎంఆర్, ఎస్.ఎల్.బి.సి, నాబార్డు, నేషనల్ సీడ్ కార్పొరేషన్ తదితర సంస్థల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఎల్‌నినో ఎఫెక్ట్: రైతులకు తెలంగాణ సర్కార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని.. ఈ సీజన్ వరి పంట వేయొద్దని సర్కార్ హెచ్చరించింది. బోరు బావుల కింద సైతం వరి సాగు చేయొద్దని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎల్‌నినోపై ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.కాగా, నైరుతి సీజన్ రెండో మాసం కూడా వర్షాభావ పరిస్థితులే నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. సాధారణంగా జూన్‌లో పెద్దగా వర్షాలు కురవకున్నా జూలై రెండో వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వానలు ఊపందుకుంటాయి. కానీ ఈసారి నైరుతి సీజన్లో వానల నమోదు లోటులో ఉంది.ఎల్‌నినో పరిస్థితులున్నప్పటికీ జూన్, జూలై నెలల్లో వానలు సాధారణ స్థితిలో నమోదవుతాయని ఐంఎండీ ముందస్తు అంచనాల్లో ప్రకటించినప్పటికీ... వరుసగా రెండు నెలలు లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 12శాతం లోటు వర్షపాతం నమోదు కాగా... ఈనెల 20 నాటికి 49 శాతం లోటు నమోదు కావడం... ఈ వారాంతం వరకు కూడా వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్న ప్రకటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. -
గాడ్జిల్లా ఎల్ నినో భయపెట్టింది.. మరి ఈ మేఘాలు ఎలా వచ్చాయి?
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. బలమైన ఎల్ నినో భారత్‌లో వర్షాలను తగ్గిస్తుందని చెప్పారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు 95 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగుతుందని తేల్చేశారు. మరి ఎల్ నినో ఉన్నా ఈ మేఘాలు, వర్షాలు ఎందుకు వస్తున్నాయి?ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిణామం. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. భారత రుతుపవనాల విషయంలో ఎల్ నినో సాధారణంగా వర్షాలకు ప్రతికూలంగా పనిచేస్తుంది. అయితే ఇది ప్రతిరోజు వాతావరణాన్ని నియంత్రించదు. ఒక వారం లేదా కొన్ని రోజుల వర్షాలను ఆపే శక్తి దీనికి ఉండదు. మొత్తం రుతుపవనాల కాలంలో వర్షపాతం ఎలా ఉండొచ్చనే అంచనాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది.స్థానిక వాతావరణ పరిస్థితులే కారణంప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండటానికి స్థానిక వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండు సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్‌నినో ఈ స్థానిక పరిస్థితులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది.మళ్లీ పుంజుకున్న రుతుపవనాలుఇటీవల కొంతకాలం ఉత్తర దిశగా వెళ్లిన రుతుపవన ద్రోణి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. బంగాళాఖాతం నుంచి తేమ సరఫరా పెరగడంతో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఇండియన్ ఓషన్ డైపోల్ ప్రభావం ఎంత?భారత వర్షాలను ప్రభావితం చేసే మరో కీలక అంశం ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). ఇది హిందూ మహాసముద్రంలోని పశ్చిమ, తూర్పు ప్రాంతాల సముద్ర ఉష్ణోగ్రతల తేడాలను సూచిస్తుంది. పాజిటివ్ IOD ఉన్నప్పుడు భారత్‌వైపు అదనపు తేమను తీసుకురావడంలో సహకరిస్తుంది. 1997లో బలమైన ఎల్ నినో ఉన్నప్పటికీ పాజిటివ్ IOD భారత్‌ను కరువు నుంచి కాపాడింది. అయితే ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలో ఉంది. దీంతో ఎల్ నినో ప్రభావాన్ని అడ్డుకునే బలమైన సహకారం అందడం లేదు.మరి వర్షాల లోటు ముగిసినట్టేనా?ప్రస్తుతం దేశమంతా మేఘాలతో కప్పుకున్నా.. రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేమని నిపుణులు చెబుతున్నారు. ఒకటి రెండు వారాల వర్షాలు మొత్తం సీజన్ పరిస్థితిని నిర్ణయించవు. కొన్ని రోజుల పాటు సాధారణ వాతావరణ వ్యవస్థలు బలమైన ఎల్ నినో ప్రభావాన్ని అధిగమించగలవు. అయితే రుతుపవనాల మొత్తం గమనాన్ని తెలుసుకోవాలంటే రాబోయే నెలల్లో వర్షపాతం ఎలా ఉంటుందన్నదే కీలకం. -
ఎల్ నినో అంతం, వర్షాల 'మేఘాలు' వచ్చేశాయ్!
-
‘ఎల్‌నినో’ సవాళ్లపై పక్కా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలోని వర్షపాతం, చెరువులు, వాగులు, వ్యవసాయంపై ఎలా ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తలతో విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు ‘జరిగిన అంశంపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సమస్య తీవ్రతను ముందుగానే అర్థం చేసుకుంటే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం స్వయంగా తగిన ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాగునీరు, సాగునీటితోపాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సోలార్ విద్యుత్‌తో భారం తగ్గింపు ఎల్ నినో కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం సమర్థవంతమైన ఎనర్జీ మేనేజ్మెంట్ అమలు చేస్తోందని భట్టి తెలిపారు. పగటి పూట తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, భూగర్భ జలాలు తదితర శాఖల సమన్వయంతో సదస్సు నిర్వహించడం ప్రభుత్వ సమగ్ర ప్రణాళికకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అవగాహన సదస్సులను జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావారణ మార్పులకు అనుగుణంగా.. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి కాకుండా ఆరు తడి పంటలు వేయాలని పలువురు శాస్త్రవ్తేలు సూచించారు. ఇది ఒక ప్రాంతమో, ఒక రాష్ట్రమో ఎదుర్కొంటున్న సమస్య కాదని, ప్రపంచం మొత్తం ఉందన్నారు. దీంతో ధరల ప్రభావం, నీటి కొరత, పశువులకు, పక్షులకు, అడవులు, యావత్ ప్రపంచానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే వర్షాలు రెండు మూడు నెలల తర్వాత పడే అవకాశం లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్‌నినో 2027 వరకు కొననసాగే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి గోపి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ప్రణాళికా శాఖ డైరెక్టర్ రూఫస్ దత్తం, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
ఎల్ నినో రిస్క్‌ను జయించండిలా!
పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణోగ్రతల మార్పులు (ఎల్ నినో) వాతావరణ సమతుల్యతతోపాటు భారతదేశం వంటి వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వర్షాభావం, కరవు పరిస్థితులు, పంట దిగుబడులు తగ్గడం వల్ల నేరుగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ పౌరుల నుంచి బడా పరిశ్రమల వరకు ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ తరహా వాతావరణ రిస్క్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను కాపాడుకోవడానికి బీమా రంగం కీలకమైన రక్షణ కవచంగా మారుతోంది.ఎల్ నినో తెచ్చే ఆర్థిక సవాలురుతుపవనాలు దెబ్బతినడం వల్ల వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి క్షీణిస్తుంది. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. మరోవైపు రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గి జలవిద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ వినియోగ సామర్థ్యం పడిపోతాయి.రిస్క్ నివారణలో బీమా పాత్రప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు వాతావరణ వైపరీత్యాల వల్ల పంట కోల్పోయిన రైతులకు తక్షణ పెట్టుబడి భరోసానిస్తాయి. 85 శాతానికి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి బీమా లేకుండా నడుస్తున్నాయి. సప్లై చైన్, బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్ ద్వారా వీటిని దివాలా తీయకుండా కాపాడవచ్చు.పారామెట్రిక్ బీమాసాంప్రదాయ బీమాలో నష్ట అంచనాకు సమయం పడుతుంది. కానీ కొత్తగా వస్తున్న ‘పారామెట్రిక్ ఇన్సూరెన్స్’ మోడల్లో ఒక ప్రాంతంలో వర్షపాతం నిర్దిష్ట స్థాయి కంటే తగ్గితే నష్టంతో సంబంధం లేకుండా తక్షణమే లబ్ధిదారుల ఖాతాల్లోకి పరిహారం జమ అవుతుంది. ఇది రైతులకు, వ్యాపారులకు త్వరిత ఊరటనిస్తుంది.ఎల్ నినో సవాలును అధిగమించడానికి ప్రభుత్వం బీమా ప్రీమియంల్లో సబ్సిడీలను పెంచి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి. బీమా సంస్థలు కూడా తక్కువ ఖర్చుతో కూడిన వాతావరణ బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలి. ముందస్తు రిస్క్ మేనేజ్మెంట్తో కూడిన బీమా కవరేజ్ ద్వారానే ఎల్ నినో ఆర్థిక ప్రతికూలతల నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడుకోగలమని గమనించాలి.ఇదీ చదవండి: బంగారం, వెండిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? -
Telangana: ఈ వారం వానలు అంతంతే..!
సాక్షి, హైదరాబాద్: నైరుతి సీజన్ రెండో మాసం కూడా వర్షాభావ పరిస్థితులే నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. సాధారణంగా జూన్‌లో పెద్దగా వర్షాలు కురవకున్నా జూలై రెండో వారం నుంచి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో వానలు ఊపందుకుంటాయి. కానీ ఈసారి నైరుతి సీజన్లో వానల నమోదు లోటులో ఉంది. ఎల్‌నినో పరిస్థితులున్నప్పటికీ జూన్, జూలై నెలల్లో వానలు సాధారణ స్థితిలో నమోదవుతాయని ఐంఎండీ ముందస్తు అంచనాల్లో ప్రకటించినప్పటికీ... వరుసగా రెండు నెలలు లోటు వర్షపాతమే నమోదైంది.రాష్ట్రవ్యాప్తంగా జూన్‌లో 12శాతం లోటు వర్షపాతం నమోదు కాగా... ఈనెల 20 నాటికి 49 శాతం లోటు నమోదు కావడం... ఈ వారాంతం వరకు కూడా వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్న ప్రకటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సగటున 31 శాతం లోటు ఎల్‌నినో ప్రభావం మే నెల నుంచే ఉంది. మేలో ఒక్కరోజు కూడా చినుకు రాలలేదు. సాధారణంగా హైదరాబాద్ సమీప జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల్లో నైరుతి సీజన్‌కు ముందే అడపాదడపా వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మేలోనే కాకుండా జూన్ నెల మొత్తంగా అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్ర రూపం దాలి్చందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్‌లో 13.03 సెం.మీ. వర్షపాతానికిగాను 11.53 సెం.మీ. నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 12శాతం లోటు నమోదైంది.జూలైలో ఇప్పటివరకు 14.01 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 7.16 సెం.మీ. నమోదైంది. సాధారణం కంటే 49 శాతం లోటు నమోదైంది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 27.04 సెం.మీ. సగటు వర్షపాతానికి గాను 18.69 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం కంటే 31 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు చెబుతున్నారు. వానలు సాధారణం కంటే తక్కువగా కురవడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనలో పడేసింది. వరి నాట్లు, పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగుపై ఈ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటికే విత్తనాలు వేసిన ప్రాంతాల్లో వానల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నిచోట్ల విత్తనాలు భూమిలోనే మాడిపోయాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వర్షాల కోసం ఎదురుచూస్తూ సాగు పనులను వాయిదా వేసుకున్నారు.బలమైన ఉపరితల గాలులురాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడ్డప్పటికీ... వానలు మాత్రం కురవడం లేదు. దట్టమైన వర్ష మేఘాలు ఏర్పడటం లేదు. ఎల్‌నినో ప్రభావంతోపాటు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో బలమైన అల్పపీడన వ్యవస్థలు ఏర్పడకపోవడంతో వానలు చాలా పరిమితంగానే కురుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మేఘాలు ఏర్పడుతున్నప్పటికీ... బలమైన ఉపరితల గాలుల ప్రభావంతో ఆయా మేఘాలు వేగంగా చెదిరిపోతున్నాయి. రాష్ట్రంపై దిగువ ట్రోపోస్ఫియర్లో వేగంగా వీస్తున్న ఉపరితల గాలులు తేమను నిలువనివ్వకపోవడం వల్ల ఉరుములు, భారీ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడటం లేదు. గత పక్షం రోజులుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. దట్టమైన మేఘాలు ఏర్పడిన ప్రాంతాల్లో వర్షం వస్తుందని భావించినా... ఆ పరిస్థితి నిమిషాల వ్యవధిలో మారిపోతోంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, రాష్ట్రంలో గణనీయమైన వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం ఏర్పడి తెలంగాణ వైపు కదలాలి. అలాంటి వ్యవస్థ ఏర్పడే వరకు నైరుతి రుతుపవనాలు బలపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారంలో అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో లోటు వర్షపాతం కొనసాగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
Telangana: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లలో నిమగ్నం అయింది. ఒక్కొక్కరికి 18 కిలోలు జిల్లాలో ఉన్న 520 రేషన్ దుకాణాల ద్వారా తెల్లకార్డుదారులకు మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఆగస్టులో ఇవ్వనున్నారు. వేసవికి ముందు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యం లబి్ధదారులకు ఒకేసారి పంపిణీ చేశారు. ఇక ఈ నెలకు సంబంధించి బియ్యం ఒకసారి ఇచ్చారు. మళ్లీ ఆగస్టులో మరో మారు మూడు నెలల కోటా ఇవ్వనున్నారు. ఈనెలకు సంబంధించిన రేషన్ కోటా పంపిణీ పూర్తి కావడంతో 20 నుంచి నెలాఖరులోగా జిల్లా పరిధిలో ఉన్న రేషన్ దుకాణాలకు బియ్యం స్టాక్ పంపిస్తామని అధికారులు వెల్లడించారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 18 కిలోల సన్నబియ్యం అందజేయనున్నారు. ఆందోళనలో రేషన్ డీలర్లు మూడు నెలల రేషన్ బియ్యం కోటా ఒకే సారి విడుదల చేస్తుండటంతో తమకు శ్రమ అధికమవుతుందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న షట్టర్లలో ఉన్న రేషన్ దుకాణాల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడం, మూడు నెలల కోటా పట్టకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. దీంతో పాటు తూకంలో తరుగు వస్తుందని వారు వాపోతున్నారు. గతంలో కూడా రెండుసార్లు ఇచి్చన రేషన్ కోటాలో తరుగు వచ్చి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్వర్క్ సమస్యతో ఈ– పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో వినియోగదారులు మూ డుసార్లు వేలిముద్రలు పెట్టడం కష్టతరమవుతుంది. దీంతో ఒక్కో వినియోగదారుడికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు చేస్తున్నాం వినియోదారులకు జూలై నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ పూర్తయింది. ఆగస్టులో మూడు నెలల కోటా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల 20 నుంచి జిల్లా పరిధిలోని రేషన్ దుకాణాలకు బియ్యం స్టాక్ తరలిస్తాం. వినియోగదారులు సహకరించాలి. – జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి -
ఎల్ నినో నుంచి ఊరట? నైరుతి రీ ఎంట్రీ! వర్షాలు ఎక్కడంటే..
వర్షాల కోసం ఎదురుచూస్తున్న దేశానికి ఊరటనిచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. జూలైలో కొంత మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతాన్ని మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రుతుపవనాలకు కొత్త ఊపునివ్వనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.జూలై 19న ఇస్రోకు చెందిన ఇన్శాట్-3డీఆర్ (INSAT-3DR) ఉపగ్రహం తీసిన చిత్రాల విశ్లేషణలో దేశ భూభాగంలో దాదాపు 60 నుంచి 70 శాతం ప్రాంతం మేఘాలతో కప్పుకున్నట్లు కనిపించింది. జమ్మూకశ్మీర్ నుంచి గంగా మైదానాల మీదుగా ఈశాన్య రాష్ట్రాల వరకు భారీ మేఘాలు విస్తరించాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోనూ వర్షాలను మోసుకొచ్చే మేఘాలు కదులుతున్నాయి. మరోవైపు అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు రావడంతో పశ్చిమ తీర ప్రాంతాల్లో కూడా మేఘాల ప్రభావం కనిపిస్తోంది.అయితే ఉపగ్రహ చిత్రాల్లో మేఘాలు కనిపించడమే ప్రతిచోటా భారీ వర్షాలు పడతాయని అర్థం కాదు. కొన్ని ప్రాంతాల్లో మేఘాలు ఉన్నా అవి కేవలం వాతావరణాన్ని చల్లబరిచే స్థాయిలోనే ఉంటాయి. భారీ వర్షాలు కురవాలంటే మేఘాల ఎత్తు, వాటిలోని తేమ, గాలుల వేగం వంటి అంశాలు కీలకంగా మారతాయి. ప్రస్తుతం అత్యంత చల్లటి మేఘ శిఖరాలు కనిపిస్తున్న ప్రాంతాల్లోనే భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు నమోదయ్యే అవకాశం ఉంది.జూలైలో రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణం బ్రేక్ మాన్సూన్ దశ. సాధారణంగా ఈ సమయంలో రుతుపవన ద్రోణి ఉత్తర దిశగా హిమాలయాల వైపు కదులుతుంది. దీంతో మధ్య భారతం, ఉత్తర మైదానాల్లో వర్షాలు తగ్గిపోతాయి. అదే సమయంలో హిమాలయాల పాద ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతాయి. ఈసారి కూడా ఇదే పరిస్థితి కనిపించింది. గంగా మైదానాలు, మధ్య భారతంలోని అనేక ప్రాంతాలు వర్షాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.ఇప్పుడు పరిస్థితి మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తాజా అల్పపీడన వ్యవస్థ రుతుపవనాలను మళ్లీ చురుగ్గా మార్చనుంది. సముద్రం నుంచి తేమ గాలులను తనవైపు లాగుకునే ఈ వ్యవస్థ తూర్పు తీరం నుంచి మధ్య భారతం వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో రుతుపవన ద్రోణి మళ్లీ సాధారణ స్థానానికి చేరుకుని విస్తృత వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.ఈ వారం ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే చురుగ్గా ఉన్న రుతుపవనాలు మరింత బలపడే సూచనలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంటుంది.ఈ వర్షాల ప్రభావం ఒక్కరోజుకే పరిమితం కాకుండా దాదాపు 3 నుంచి 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన వ్యవస్థ కదలిక, రుతుపవన ద్రోణి స్థితిని బట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగవచ్చు. ముఖ్యంగా మధ్య, ఉత్తర, తూర్పు భారతంలో విస్తృత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ తీర ప్రాంతాల్లో మరింత ఎక్కువ కాలం వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో వర్షాలు ఉండవు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులతోనే సరిపోవచ్చు.ఉత్తర భారత మైదానాలకు కూడా ఈ వర్షాలు కొంత ఉపశమనం ఇవ్వనున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో ఈ వారం విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఊరటనివ్వనున్నాయి. మధ్య భారతంలోనూ వర్షాల జోరు పెరగనుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తూర్పు మహారాష్ట్ర ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావంతో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు వేగం పుంజుకోవడానికి ఈ వర్షాలు కీలకంగా మారనున్నాయి.ఇటు దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాలు, కొంకణ్ ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దక్షిణ ద్వీపకల్పంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే స్థాయిలో వర్షాలు ఉండకపోవచ్చు.మరోవైపు పశ్చిమ రాజస్థాన్, తమిళనాడులోని కొన్ని అంతర్గత ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో మేఘాల కదలిక పరిమితంగా ఉండటంతో పొడి వాతావరణం కొనసాగవచ్చు.ఎల్ నినో పరిస్థితి ఏంటి?ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కూడా చర్చనీయాంశంగా మారింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏర్పడే ఎల్ నినో సాధారణంగా భారత రుతుపవనాలను బలహీనపరిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పట్టింది. దీంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అయితే రుతుపవనాల తీరును ఎల్ నినో ఒక్కటే నిర్ణయించదు. సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల మార్పులు, అల్పపీడనాల సంఖ్య వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.జూలైలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు కొనసాగుతోంది. సాధారణంగా ఈ కాలంలో 323.1 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 244.6 మిల్లీమీటర్ల వర్షమే నమోదైనట్లు అంచనాలు చెబుతున్నాయి. వర్షాలు తగ్గడంతో భూమి వేడెక్కి, గాలిలో తేమ పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా మారింది. వర్షాలు లేకపోయినా తేమ తగ్గకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.ప్రస్తుతం కురిసే వర్షాలు రైతులకు ఎంతో కీలకంగా మారనున్నాయి. వరి, పత్తి, సోయాబీన్, పప్పుధాన్యాల సాగుకు ఈ వర్షాలు ఊతమివ్వనున్నాయి. అయితే జూలైలో ఏర్పడిన వర్ష లోటు పూర్తిగా భర్తీ కావాలంటే ఆగస్టులోనూ రుతుపవనాలు స్థిరంగా కొనసాగాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే.. ఎల్ నినో ప్రభావం కాస్త తగ్గడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం, ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో విస్తృతంగా మేఘాలు కనిపించడం.. ఇవన్నీ రుతుపవనాలు మళ్లీ బలపడుతున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ వారం దేశంలోని పలు ప్రాంతాలకు వానల ఊరట లభించే అవకాశం ఉంది. అయితే ఆగస్టులో రుతుపవనాల ప్రదర్శనే ఈ ఏడాది వర్షపాత తీరును నిర్ణయించనుంది. -
ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్: ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా జి.చిన్నారెడ్డిని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఉంటారు. ఎల్‌నినో ప్రభావంపై కమిటీ అంచనా వేయనుంది. కరవు నివారణ చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది.మరోవైపు, శనివారం విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన వేళ ఎల్‌నినో సవాళ్లపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాభావంతో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, సాగు నీటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీలో ఏఐ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు. డీటీఆర్ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు. -
‘సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం’
హైదరాబాద్: వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న "సూపర్ ఎల్ నినో" పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో "సింపోజియం" సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాతావరణ మార్పులు (Climate Change) అంశంపై సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ, తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందన్నారు.గతంలో నమోదైన వర్షపాతం నమూనాల ఆధారంగా ఇకపై జలవనరుల ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నర సంవత్సరాల పాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని, సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని తెలిపారు.అయితే ప్రస్తుత వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. నిపుణులు సూచిస్తున్న "సూపర్ ఎల్ నినో" పరిస్థితులను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.ముందస్తు నీటి నిర్వహణపై దృష్టివర్షాభావం తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే పరిస్థితులను అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, తాగునీరు, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని చెప్పారు. రిజర్వాయర్ల నిర్వహణలో రియల్‌టైమ్ డేటా వినియోగం, శాస్త్రీయ నిర్ణయాలు, శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.పాలనకు ఇదే అసలైన పరీక్షవాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల నుంచి రైతులను రక్షించగలగడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష అని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు జలవనరులపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎంత వేగంగా మారుతున్నాయన్నదే అసలు సవాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నీరే పునాదినీటిని కేవలం పంపిణీ చేసే వనరుగా కాకుండా, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా చూడాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నీటి నిర్వహణలో లోపాలు ఏర్పడితే వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.హైదరాబాద్‌కు దీర్ఘకాలిక తాగునీటి భద్రతహైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి తాగునీటిని అందించే దీర్ఘకాలిక ప్రణాళికలను గత ప్రభుత్వాలు అమలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఒకప్పుడు 50 నుంచి 100 అడుగుల లోతులో లభించిన భూగర్భ జలం, ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు చేరుకుందని చెప్పారు. వర్షపు నీటిని భూగర్భంలోకి చేరేలా భారీ స్థాయిలో రైన్వాటర్ హార్వెస్టింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీటీకరణ వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ తగ్గిపోవడంతో వర్షపు నీటి సంరక్షణ అత్యవసరమైందన్నారు. హైదరాబాద్‌లో చెరువులు, నీటి వనరులు, సహజ కాలువలను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా హైడ్రా (HYDRA) వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గతంలో జరిగిన ఆక్రమణల వల్ల నగరంలో వరద ముప్పు పెరిగిందని, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, సహజ డ్రైనేజీ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. -
ఎల్ నినో దెబ్బ.. గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్!
వానాకాలంలోనూ ఎండల సెగ తగ్గడం లేదు. ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పడిపోకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో.. విద్యుత్ వినియోగం భారీగా పెరిగి మీటర్లు రయ్ రయ్ అంటూ పరుగులు పెడుతున్నాయి. దీంతో జీరో బిల్లు పొందుతున్న గృహజ్యోతి లబ్ధిదారులకు ఊహించని షాక్ తగులుతోంది.గృహజ్యోతి పథకం(Telangana Gruha Jyothi Scheme) కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుంది. అయితే పెరిగిన కరెంట్ వినియోగంతో పలువురు లబ్ధిదారులు ఈ పరిమితిని దాటుతున్నారు. ఫ్యాన్లు, కూలర్ల వినియోగం తగ్గడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, నీటి మోటార్లను ఎక్కువ సమయం నడపాల్సి వస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేని కుటుంబాలు.. ఒక్కసారిగా పూర్తి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్ నెలలోనే సుమారు 4 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు పథక ప్రయోజనానికి దూరమయ్యారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 26.54 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా.. జూన్‌లో 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. వీరికి ప్రభుత్వం రూ.99.18 కోట్ల సబ్సిడీని భరించింది.మార్చి నుంచి జూన్ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 6.49 కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,355 కోట్ల సబ్సిడీని అందించింది. అయితే వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో జీరో బిల్లు పొందే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇక ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. గత మూడు నెలల్లో 5,384 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇందులో ఒక్క జూన్ నెలలోనే 1,612.270 మిలియన్ యూనిట్ల కరెంట్ వినియోగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం దాదాపు 70 శాతం పెరగడం గమనార్హం.ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, విద్యుత్ వినియోగం ఇదే స్థాయిలో కొనసాగితే.. జూలైలోనూ 200 యూనిట్ల పరిమితిని దాటే కుటుంబాల సంఖ్య పెరిగి, మరింత మంది గృహజ్యోతి ప్రయోజనానికి దూరమయ్యే అవకాశం ఉంది. -
ఆశలన్నీ ఆకాశంపైనే..!
అర కిలోమీటర్ పైప్‌లైన్‌తో పత్తికి నీరుజనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లికి చెందిన ఈ రైతు పేరు బానోతు నరసింహ. 3 ఎకరాలు కౌలుకు తీసుకుని నెల క్రితం పత్తి విత్తనాలు నాటాడు. అప్పట్నుంచి సరైన వర్షాలు లేవు. దీంతో ఎండిపోయే దశకు చేరుకుంటున్న పత్తిని కాపాడుకునేందుకు.. నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి సుమారు అర కిలోమీటర్‌పైగా పైప్‌లైన్ వేసి నీటిని అందిస్తున్నాడు. ఇప్పటికే పైప్ లైన్‌కు రూ.50 వేలు, ఇతరత్రా కలిపి రూ.60 వేలకు పైగా ఖర్చు చేశాడు. 3 ఎకరాలకు కౌలు రూ.15 వేలు, దున్నడానికి రూ.12 వేలు, విత్తనాలకు రూ.5 వేలు, కలుపుతీతకు రూ.12 వేలు, పురుగుల మందుకు రూ.1,500 పెట్టుబడి పెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నాడు. వర్షాలు కురవక, కాలువకు నీరు రాకపోతే పెట్టిన పెట్టుబడి, పడుతున్న కష్టం మొత్తం వృ«థా అవుతుందని, ఆర్థికంగా నష్టపోతానని వాపోతున్నాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎల్‌నినో బూచి భయపెడుతున్న వేళ..ఆకాశం కొద్దిరోజులుగా చుక్క రాల్చకపోవడం, కరువు మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. తీవ్ర వర్షాభావంతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు సైతం ఖాళీగానే ఉన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పంటలే వేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని వాగులు, కాలువల నుంచి పైప్లైన్లు వేసి నీటిని తరలిస్తున్నారు. వట్టిపోతున్న బోర్ల నుంచి అరకొరగా వచ్చే నీటితో పంటలు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. రాని వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. లోటు వర్షం..సాగు దాదాపుగా సగం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 60, జోగుళాంబ గద్వాలలో 52, వనపర్తి, నిజామాబాద్‌లలో 51 శాతం మైనస్ వర్షపాతం ఉంది. ఈ జిల్లాల్లో సీజన్లో వర్షపు రోజులు కూడా ఐదు నుంచి తొమ్మిది మాత్రమే నమోదు కావడం గమనార్హం. కాగా రాష్ట్రంలో 621 మండలాలకు 548 మండలాల్లో వర్షమే నమోదు కాలేదు. దీంతో పొలాల్లో పగుళ్లు కన్పిస్తున్నాయి. వానాకాలం సాగు అంచనా 1,32,38,446 ఎకరాలు కాగా ఇప్పటివరకు 59,83,971 (45.20 శాతం)ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవడం కరువు పరిస్థితిని కళ్లకు కడుతోంది. కాగా జూన్ చివరి, జూలై ప్రారంభంలో కురిసిన వర్షాన్ని నమ్ముకుని రైతులు పత్తి, మక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, నువ్వులు తదితర ఆరుతడి పంటలు వేశారు. కానీ ఆ తర్వాత వానలు పూర్తిగా ఆగిపోవడంతో మొలకలు ఎండిపోగా, చాలాచోట్ల విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు రీచార్జ్ కావడం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేయిస్తున్నారు. చాలాచోట్ల అవి విఫలం కావడం, ఒకవేళ నీళ్లు పడినా అవి కూడా క్రమంగా తగ్గిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 9.26 మీటర్లు కాగా, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాలు 13–14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. నీరు లేక ఎండిపోతున్న ఈ వరి నారు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డిది. తనకు బావి ఉన్నా నీరు లేకపోవడంతో నారు ఎండిపోతోంది. సాగర్ ఎడమకాలువ ద్వారా నీరు వస్తే ఈపాటికి వరి నాట్లు వేసే వారమని వాపోతున్నాడు. తనకున్న ఏడెకరాల్లో ఎకరాల్లో ఇప్పుడు ఒకటీ రెండెకరాల్లో కూడా సాగు చేసే పరిస్థితి లేదని చెప్పాడు. 30 శాతం పత్తి విత్తనాలే మొలకెత్తాయి నాకున్న ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేశా. అందులో కేవలం 30 శాతం విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి. దున్నడం, విత్తనాలకు రూ.లక్ష పెట్టుబడి పెట్టా. మొత్తం డబ్బంతా నష్టపోయినట్లే. వర్షాలు కురిస్తే మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు పెట్టాలి. మళ్లీ రూ. లక్ష పెట్టుబడి కావాలి. – బండారి శ్రీశైలం, కట్కూర్, బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గాందీనగర్ తండాకు చెందిన ఈ రైతు పేరు మూడ్ లక్ష్మణ్. ఆయనకున్న ఎకరం భూమితోపాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని నారు పోశాడు. ఎకరానికి రూ.4 వేల చొప్పున 10 ఎకరాలకు రూ.40 వేల వరకు ఖర్చయింది. తర్వాత వర్షం పడలేదు. నాగార్జునసాగర్ కాలువ పరిధిలోని సిరిపురం మేజర్‌కు మరమ్మతుల కారణంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు విడుదల కాలేదు. దీంతో పోసిన వడ్లు అక్కడక్కడ మొలకొచ్చినా నీటితడి లేక వడబడి చనిపోతున్నాయి. చివరి ఆశగా నారును బతికించుకునేందుకు బావికి ఆయిల్ ఇంజన్ పెట్టి నీళ్లు పెడుతున్నాడు. ‘బోరు’మంటున్న వరి రైతులు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల తండాకు చెందిన రైతు బానోతు హరికుమార్ గత ఏడాది తమకు ఉన్న వ్యవసాయ బావి ద్వారా వరి సాగు చేశాడు. ఈ ఏడాది కూడా అదే బావిని ఆధారంగా చేసుకుని పంట వేశాడు. కానీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో సాగు ఆందోళనకరంగా మారింది. దీంతో రూ.1.30 లక్షలు ఖర్చు చేసి 300 ఫీట్ల మేరకు బోరు వేయించాడు. దానికి 5 హెచ్‌పీ విద్యుత్ మోటారును ఏర్పాటు చేశాడు. ఈ నెల 5వ తేదీన కొత్తగా బోరు వేయించగా ఇప్పుడు అందులో కూడా నీరు తక్కువగా వస్తుండటంతో లబోదిబోమంటున్నాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన రైతు కాసర్ల రాములుదీ ఇదే పరిస్థితి. 3ఎకరాల్లో వరినాట్లు వేస్తే నీటి కొరత కారణంగా 2 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. మరో ఎకరాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసినా నీళ్లు లేక వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రెండు బోర్ల నుంచి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు మాత్రమే వస్తున్నాయని రాములు వాపోతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మలో రైతు బత్తుల దినేష్ తన 5 ఎకరాల మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. చేను పక్కన ఉన్న వాగులో మోటార్‌ను దించి కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్పార్మర్నుంచి వైరు లాగి చేనులోకి స్ప్రింక్టర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. భార్య రుక్మిణి, కుమారుడు చరణ్ ఇలా ఇంటిల్లిపాది పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లూనావాత్ తండా రైతు లూనావత్ స్వామి తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో 20 రోజుల క్రితం పత్తి సాగు చేశాడు. విత్తనాలు మొలకెత్తినా చినుకు జాడ లేకపోవడంతో మాడిపోయే దుస్థితి నెలకొంది. దీంతో పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతు బావినీటిని పత్తి చేనుకు పారిస్తున్నాడు. రోజుకు అర ఎకరం చొప్పున నీరు కడుతూ మొలకలకు ప్రాణం పోస్తున్నాడు. -
ఎల్-నినో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించి, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందించిన *"రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్–2026 (వానాకాలం)"*ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్రిశాట్ (ICRISAT), భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (IIMR), ఐఐఓఆర్, సిఆర్ఐడిఎ (CRIDA), భారత వాతావరణ శాఖ (IMD), వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు కలిసి అత్యంత సమగ్రంగా ఈ కంటింజెన్సీ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. రైతులకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఈ ప్రణాళికలో పొందుపరిచామని చెప్పారు.ఈ కంటింజెన్సీ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్లు అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి రైతుకు సవివరంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.రాష్ట్రాన్ని భౌగోళిక, వాతావరణ, నేలల స్వభావం ఆధారంగా మూడు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఈ కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించామని మంత్రి వివరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం పరిస్థితులు, రానున్న రెండు నుంచి మూడు వారాల వాతావరణ అంచనాలు, భారత వాతావరణ శాఖ (IMD) వారపు సూచనలను ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు.రైతులు ఏ పంటను ఏ సమయంలో విత్తడం అనుకూలమో తెలియజేసే విధంగా 18 ప్రధాన పంటలకు సంబంధించిన శాస్త్రీయ మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. భూమి స్వభావాన్ని బట్టి ప్రస్తుతం ఇంకా ఏ పంటలను సాగు చేయవచ్చో, ప్రత్యామ్నాయంగా ఏ పంటలు అనుకూలమో కూడా స్పష్టంగా సూచించినట్లు తెలిపారు.అదేవిధంగా ప్రతి జిల్లాలోని భూగర్భ జలాల లభ్యత, ప్రధాన, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, ఇంకా సాగుకు అందుబాటులో ఉన్న నీటి పరిస్థితులపై సమగ్ర సమాచారం కూడా ఈ ప్రణాళికలో పొందుపరిచినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను రైతులకు రోజువారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు.ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా జిల్లా కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా సాగునీటి శాఖ కార్యదర్శితో చర్చించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం నెలకొన్న పొడి వాతావరణ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగవచ్చని అంచనాలు ఉన్నందున ఇప్పటికే సాగులో ఉన్న పంటలను ఎలా సంరక్షించుకోవాలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కంటింజెన్సీ ప్లాన్‌లో పంటల వారీగా నిర్వహణ చర్యలు, ఇప్పటికే సాగైన విస్తీర్ణం, ఇంకా సాగు చేసే అవకాశాలు, ప్రత్యామ్నాయ పంటలు, ఆయా పంటలకు అవసరమైన విత్తనాల లభ్యత వంటి అన్ని అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు తెలిపారు.అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భావించే పరిస్థితి లేదని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు మంత్రికి తెలిపారు. భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకునే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా బోర్ వేల్స్ పై ఆధారపడి వరి సాగు చేయడం ప్రస్తుతం అనుకూలం కాదని, అలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.వర్షాభావ పరిస్థితులు రానున్న నెలల్లో కూడా కొనసాగితే ఇప్పటికే సాగుచేసిన పంటలు మరియు ఉద్యానపంటల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకు సాగాలని మంత్రి సూచించారు. రైతులకు అవసరమైన ప్రతి సూచన, సలహా సమయానుకూలంగా అందేలా వ్యవసాయ యంత్రాంగం గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని చెప్పారు. ప్రస్తుతం రైతుల్లో కూడా వర్షాలపై ఆశలు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని మంత్రి పేర్కొన్నారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానయ్య, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి మరియు ICRISAT, IIMR, IIOR, CRIDA, IMD ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎల్ నినో ఉగ్రరూపం!.. ఫసిఫిక్ వేడితో డేంజర్ బెల్స్
భూమి వాతావరణాన్ని తలకిందులు చేసే శక్తివంతమైన ఎల్ నినోమరోసారి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి కేవలం సముద్ర ఉపరితలంలోనే కాదు.. పసిఫిక్ మహాసముద్రం లోతుల్లోనే భారీగా వేడి నీటి నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ అసాధారణ మార్పులను నాసా ఉపగ్రహాలు గుర్తించడంతో ప్రపంచ వాతావరణ నిపుణులు అప్రమత్తమయ్యారు. సముద్రం అడుగున నుంచి తూర్పు పసిఫిక్ వైపు కదులుతున్న ఈ వేడి ప్రవాహాలు భవిష్యత్‌లో అత్యంత శక్తివంతమైన(గాడ్జిల్లా) ఎల్ నినోకు సంకేతాలా? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా కనిపించే ఎల్ నినో (El Niño) పరిస్థితులతో పోలిస్తే.. ఈసారి సముద్రం వేడెక్కుతున్న వేగం, తీవ్రత భిన్నంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే 2026లో ఏర్పడే అవకాశం ఉన్న ఈ ఎల్ నినోను కొందరు నిపుణులు ‘గాడ్జిల్లా ఎల్ నినో’గా అభివర్ణిస్తున్నారు.150 ఏళ్ల రికార్డును బద్దలయ్యేనా?2026-27 కాలానికి సంబంధించి వెలువడుతున్న తాజా వాతావరణ నమూనాలు సంచలన అంచనాలను చూపిస్తున్నాయి. ఈసారి ఏర్పడే ఎల్ నినో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన ఘటనలను అధిగమించే అవకాశం ఉందని కొన్ని మోడల్స్ సూచిస్తున్నాయి. గతంలో 1997-98లో నమోదైన ఎల్ నినో ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత 2015-16 ఎల్ నినో కూడా రికార్డు స్థాయి వేడితో చరిత్రలో నిలిచింది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సముద్ర మార్పులు.. 2026 ఎల్ నినో వీటిని మించే స్థాయికి చేరవచ్చనే అంచనాలకు కారణమవుతున్నాయి.ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. 14 ప్రధాన వాతావరణ నమూనాల నుంచి సేకరించిన వందలాది అంచనాల్లో ఎక్కువ భాగం ఈసారి ఎల్ నినో బలంగా మారే అవకాశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల పసిఫిక్‌లోని నినో-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.6 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని కొన్ని నమూనాలు అంచనా వేస్తున్నాయి.ఇది 2015-16లో నమోదైన దాదాపు 2.75 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల కంటే ఎక్కువ. ఈ అంచనాలు నిజమైతే.. గత 150 ఏళ్ల వాతావరణ రికార్డుల్లోనే ఇది అత్యంత అసాధారణమైన ఎల్ నినోగా నిలిచే అవకాశం ఉంది.నాసా ఉపగ్రహాల్లో కనిపించిన వేడి అలలుపసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పులను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సెంటినెల్-6 మైఖేల్ ఫ్రైలిచ్ ఉపగ్రహం పరిశీలిస్తోంది. ఉపగ్రహ డేటాలో సముద్రం లోతుల్లో ప్రయాణించే కెల్విన్ తరంగాలు (Kelvin Waves) భారీ మొత్తంలో వేడి నీటిని తూర్పు పసిఫిక్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎల్ నినో ఏర్పడటంలో ఈ తరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి.సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో గాలుల ప్రవాహం, సముద్ర ఉష్ణోగ్రతల మధ్య సమతుల్యత ఉంటుంది. అయితే ట్రేడ్ గాలులు బలహీనపడినప్పుడు.. సముద్రం లోతుల్లో దాగి ఉన్న వేడి నీరు తూర్పు వైపు కదులుతుంది. దీంతో సముద్ర ఉపరితలం వేడెక్కి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడతాయి.వేగం కూడా శాస్త్రవేత్తలకు షాక్ఈసారి ఎల్ నినో తీవ్రత మాత్రమే కాదు.. అది అభివృద్ధి చెందుతున్న వేగం కూడా నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. 1997-98 ఎల్ నినో అత్యంత వేగంగా బలపడిన ఘటనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుత పరిణామాలు అంతకంటే వేగంగా మారుతున్నట్లు కొన్ని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. 2026 ప్రారంభంలో లా నినా తరహా పరిస్థితుల నుంచి ఈ ఎల్ నినో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి సముద్ర మార్పులకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి తక్కువ వ్యవధిలోనే పసిఫిక్ వేడెక్కడం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు ఎల్ నినో అంటే..పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా తూర్పు నుంచి పడమరకు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని పశ్చిమ ప్రాంతాలకు తరలిస్తాయి. అదే సమయంలో సముద్రం లోతుల్లోని చల్లని నీరు పైకి వస్తుంది. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు పరిస్థితి మారుతుంది. సముద్రం అడుగున ఉన్న వేడి నీరు తూర్పు పసిఫిక్ వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ పరిణామాన్నే ఎల్ నినో అంటారు. ఇది కేవలం ఒక సముద్ర ప్రాంతానికి పరిమితమైన మార్పు కాదు. ప్రపంచ వాతావరణ వ్యవస్థపై ప్రభావం చూపించే శక్తివంతమైన ప్రకృతి ప్రక్రియ.ప్రపంచ వాతావరణంపై ప్రభావం ఎలా?శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, వేడి గాలులు పెరగొచ్చు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, నీటి కొరత, అటవీ అగ్నిప్రమాదాలు, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?భారత్‌కు ఎల్ నినో ప్రభావం అత్యంత కీలకం. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం, నీటి వనరులు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడొచ్చు. వర్షాలు తగ్గితే పంట దిగుబడులు తగ్గడం, నీటి కొరత పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే భారత రుతుపవనాలపై ఎల్ నినోతో పాటు హిందూ మహాసముద్ర డైపోల్ (IOD), స్థానిక వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.వాతావరణ మార్పులతో కలిస్తే మరింత ముప్పు?ప్రపంచ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరుగుతున్న సమయంలో.. ఇలాంటి శక్తివంతమైన ఎల్ నినో మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. 2023, 2024లో ప్రపంచం రికార్డు స్థాయి వేడిని చూసింది. ఇప్పుడు మరో బలమైన ఎల్ నినో కూడా తోడైతే.. ప్రపంచ ఉష్ణోగ్రతలు మరోసారి కొత్త రికార్డులను తాకుతాయా? అనే అంశంపై నిపుణులు దృష్టి సారించారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం లోతుల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న వేడి.. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారుతుందా? అన్నదే కీలక ప్రశ్న. ‘గాడ్జిల్లా ఎల్ నినో’ నిజంగా బలపడితే.. దాని ప్రభావం పసిఫిక్ తీరాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనిపించే అవకాశం ఉంది. -
‘ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి’
హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ రోజు నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. రైతులతో నేరుగా మాట్లాడి వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతోందన్నారు. దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, భూగర్భ జలాల శాఖ, భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని చెప్పారు.వర్షపాతం తక్కువగా ఉన్నందున జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. అలాగే శాస్త్రవేత్తలు సూచించిన విధంగా తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే అధిక దిగుబడి పంట రకాలను ఎంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఐఐఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును పెంచాలని రైతులకు సూచించారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హైదరాబాద్ సంచాలకురాలు స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. వచ్చే మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని సూచించారు.భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ జిల్లాల వారీగా భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. రాబోయే రోజుల్లో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. -
దేశవ్యాప్తంగా వరుణుడి బీభత్సం.. జులైలోనే రికార్డు వర్షపాతం..!
-
వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో.. జులైలో ఏప్రిల్-మే ఎండలు!
జులైలో జల్లులు కురవాల్సిన వేళ.. ఏప్రిల్, మే నెలలను తలపించే ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులను ఆకాశం నిరాశపరుస్తోంది. ఇదే సమయంలో ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఎల్ నినో వేగంగా బలపడుతోందన్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే తగ్గుతున్న వర్షాలు, పెరుగుతున్న వేడి.. రాబోయే నెలల్లో దేశం మరో తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.1950 తర్వాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచే అవకాశం ఉందని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (NOAA) హెచ్చరించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య 81 శాతం అవకాశంతో 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో'గా మారవచ్చని తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఈ పరిణామం భారత్‌లో వర్షపాతం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని నినో Niño-3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది మోడరేట్ ఎల్ నినో దశలో ఉన్నప్పటికీ, మరో రెండు మూడు నెలల్లో వేగంగా బలపడే అవకాశం ఉందని NOAA పేర్కొంది. సాధారణంగా 0.5 డిగ్రీలు దాటితే ఎల్ నినోగా, 1.5 డిగ్రీలు దాటితే స్ట్రాంగ్ ఎల్ నినోగా, 2 డిగ్రీలు దాటితే వెరీ స్ట్రాంగ్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న వేడి ధోరణి కొనసాగితే అక్టోబర్-డిసెంబర్ నాటికి ఇది 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో' స్థాయికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని NOAA అంచనా వేస్తోంది.ఈసారి ఎల్ నినో ఇంత వేగంగా బలపడటానికి పలు కారణాలు ఉన్నాయని పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరాలజీ (IITM) శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కోల్ వివరించారు. తూర్పు పసిఫిక్‌లో సముద్ర గర్భంలో వేడి పెరగడం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో ఉష్ణశక్తి అధికంగా నిల్వ కావడం, ట్రేడ్ విండ్లు బలహీనపడటం వంటి అంశాలు కలిసి ఈసారి ఎల్ నినోను అసాధారణంగా బలపరుస్తున్నాయని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే తొలి ప్రభావం భారత్‌లోని నైరుతి రుతుపవనాలపైనే పడే అవకాశం ఉందని.. 76 ఏళ్ల రికార్డు బద్ధలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత వాతావరణ శాఖ (IMD) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకారం.. గతంలో నమోదైన బలమైన ఎల్ నినో సంవత్సరాల్లో 60 శాతం సందర్భాల్లో సాధారణం కంటే తక్కువ లేదా లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో దేశవ్యాప్తంగా 40 శాతం వర్షలోటు నమోదైంది. మొత్తం సీజన్లో కూడా దీర్ఘకాల సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.ఎల్ నినో ప్రభావం తెలుగు రాష్ట్రాల వాతావరణంలోనూ కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణలో జులై రెండో వారంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ఆదివారం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, ఇది సాధారణం కంటే 3.5 డిగ్రీలు ఎక్కువ. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, కోస్తా జిల్లాల్లో వడగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.అయితే ఎల్ నినో అంటే కేవలం వర్షాభావమే కాదు. సముద్రాల వేడి పెరగడం వల్ల గాలిలో తేమ కూడా పెరుగుతుంది. దీంతో ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంటే, మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో స్వల్ప వ్యవధిలోనే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే వాతావరణం మరింత అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలోనూ ప్రపంచం చూసింది. 2015-16లో నమోదైన 'గాడ్జిల్లా ఎల్ నినో' ప్రపంచవ్యాప్తంగా వాతావరణ రికార్డులను బద్దలు కొట్టింది. భారత్‌లో 2014, 2015 సంవత్సరాలు ఈ శతాబ్దంలో అత్యల్ప వర్షపాతం నమోదైన సంవత్సరాలుగా నిలిచాయి. ఈసారి కూడా అదే స్థాయిలో తీవ్రత పెరిగితే వ్యవసాయం, జలాశయాలు, తాగునీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, ఆహారధరలపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.NOAA అంచనా ప్రకారం ప్రస్తుత ఎల్ నినో 2027 వసంతకాలం వరకు కొనసాగే అవకాశం 97 శాతం ఉంది. దీంతో 2027 ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే సంవత్సరాల్లో ఒకటిగా నిలిచే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జులైలోనే వేసవిని తలపించే ఎండలు, తగ్గుతున్న వర్షాలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో మరింత బలపడితే రాబోయే నెలలు వ్యవసాయం, నీటి వనరులు, ఆహార భద్రత, ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం దృష్టంతా పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిణామాలపైనే నిలిచింది. -
కరెంట్‌కు ఎల్‌నినో కష్టం
సాక్షి, అమరావతి: దేశంలో ఎల్‌నినో ప్రభావం ఈసారి వ్యవసాయంపైనే కాదు... విద్యుత్ రంగంపైనా తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు పవన విద్యుత్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కాలం. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో గాలులు బలహీనపడితే పవన విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం 56.8 గిగావాట్ల పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది. ఇది దేశంలోని మొత్తం ఉత్పత్తి సామర్థ్యం అయిన 520 గిగావాట్లలో 10.9 శాతం. పవన విద్యుత్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం సాధారణంగా 38 శాతం వరకు ఉంటుంది. కానీ, ఈ ఏడాది అది 31 శాతానికి పడిపోవచ్చని అంచనా. అంటే దాదాపు 7 శాతం పాయింట్ల తగ్గుదల, లేదా ప్రస్తుతం లభించే విద్యుత్‌తో పోలిస్తే 18 నుంచి 20 శాతం తక్కువగా ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విద్యుత్ డిమాండ్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 272 గిగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ ప్రాథికార సంస్థ (సీఈఏ) అంచనా వేసింది. ఇప్పటికే ఈ ఏడాది మే నెలలో 270.8 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదై కొత్త రికార్డు నెలకొంది. జల విద్యుత్‌పైనా ప్రభావం ఎల్‌నినో కారణంగా వర్షాలు కూడా తక్కువగా కురిసే అవకాశం ఉండటంతో జలవిద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని ఇంధన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 39.8 శాతం తక్కువగా నమోదైంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దానికితోడు పవన విద్యుత్ కూడా తగ్గితే... విద్యుత్ అవసరాల కోసం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై మరింతగా ఆధారపడాల్సి వస్తుంది. 1997–98, 2015–16లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఆయా సంవత్సరాల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు విద్యుత్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తే విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరగడం, బొగ్గు వినియోగం అధికమవడం, డిస్కంలపై ఆర్థిక భారం పెరగడం ఖాయమని చెబుతున్నారు. పవన విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. ఎలా తగ్గుతుందంటే.. » పవన విద్యుత్ ఉత్పత్తి గాలి వేగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గాలి వేగం 3–4 మీటర్లు/సెకన్ ఉంటే విండ్ టర్బైన్ తిరగడం ప్రారంభమవుతుంది. » గాలివేగం సెకనుకు 6–9 మీటర్లు ఉంటే విద్యుత్ బాగా ఉత్పత్తి అవుతుంది. » అదే గాలివేగం సెకనుకు 12–15 మీటర్లు ఉంటే చాలా టర్బైన్లు తమ గరిష్ట సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. » సెకనుకు 25 మీటర్ల కంటే ఎక్కువగా గాలి వేగం ఉంటే భద్రత కోసం టర్బైన్లను నిలిపివేస్తారు. » భారత వాతావరణ పరిస్థితులపై చేసిన పలు అధ్యయనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం వల్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన గాలి వేగం సగటున 5 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. » గాలి వేగం తగ్గితే దానికి అనుగుణంగా పవన విద్యుత్ ఉత్పత్తి మరింతగా తగ్గుతుంది. గాలి వేగం 10 శాతం తగ్గితే విద్యుత్ ఉత్పత్తి సుమారు 25 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. » గాలి వేగం 15 శాతం తగ్గితే విద్యుత్ ఉత్పత్తి 35 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ గణాంకాలు మారుతుంటాయి. పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 56.8 గిగావాట్లుపవన విద్యుత్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం 38 శాతంపవన విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని అంచనా 20 శాతం -
ఎల్ నినో ఉన్నా ముంబైలో కుండపోత వర్షాలు ఎలా?
-
ఉఫ్.. ఖరీఫ్
వ్యవసాయానికి వాతావరణం అనుకూలించడం లేదు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. తీవ్రమైన కరువు తలెత్తే ప్రమాదం పొంచి ఉందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో మరింత ఆందోళన చెందుతున్నారు. అరకొర జల్లులతో సేద్యం చేయలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటి పోతున్నాయని వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇప్పటికే సాగు చేసిన పంటలను సైతం నష్టపోతామని దిగాలుపడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : వ్యవసాయంలో ఆరుద్ర నక్షత్రం, మృగశిర కార్తె వర్షాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది, ఆరుద్ర కరుణిస్తే దారిద్య్రం ఉండదని అన్నదాతల నమ్మకం. ఆరుద్ర నక్షత్రంలో వర్షాలకు కురిస్తే.. వరుసగా ఆరు కార్తెలు వానలు ఉంటాయని పల్లెల్లో సామెతలు ఉన్నాయి. పంటలు సాగు చేసేందుకు అదే సమయంలో దుక్కులు సిద్ధం చేసే పనిలో రైతులు బిజీబిజీగా గడుపుతారు. కానీ, ఈ సారి ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవక పోవడంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లాయి. అందులో భాగంగానే ఖరీఫ్ సాగు నెమ్మదించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూలైతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో చాలా తేడా కనిపిస్తోంది. వరుణుడు ఊరించి ముఖం చాటేస్తున్నాడు. మబ్బులు కమ్ముకున్నప్పటికీ చిన్నపాటి జల్లులకే పరిమితం అవుతున్నాడు. నిత్యం భారీ వర్షాలు అని వాతావరణ శాఖ చేస్తున్న ప్రకటలను సైతం తలకిందులు చేస్తున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడా ఆశించిన స్థాయిలో వానలు పడడం లేదు. దీంతో పంటలపై భారీ ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉప్ణోగ్రతలు నేపథ్యంలో పంటకు వదిలిన నీరు వెంటనే ఆవిరైపోతున్నాయి. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలుతోపాటు పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరిపంట సాగుచేశారు. అయితే పంటకు నీరు అందక ఎండిపోతున్న క్రమంలో ఆందోళన చెందుతున్నారు. చెరువులు సైతం నీరు లేక బావురుమంటున్నాయి.. సమీప ప్రాంతాల్లోని చిన్న చిన్న బావుల్లో ఉన్న నీటిని వరిపంటను తడుపుకోవడానికి ప్లాస్టిక్ పట్టల ద్వారా రైతులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నీరు అవిరైపోపోతోది. ఒక్క ముచ్చివోలు గ్రామంలోనే 500 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సూపర్ ఎల్‌నినోతో కరువు? ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఎల్‌నినో మరింత ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శీతాకాలం నాటికి సూపర్ ఎల్నినోగా మారే అవకాశముందని వాతావరణ శాఖ, వ్యవసాయశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు బలహీనంగా ఉన్నా యని చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 ప్లస్ డిగ్రీలకు చేరుకోవడాన్నే సూపర్ ఎల్‌నినో అంటారని వివరిస్తున్నారు. పడిపోతున్న నీటి నిల్వలు తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వర్షాలు లేక అడవుల నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేక పోవడంతో జలాశయాలు అడుగంటిపోతున్నాయి. కల్యాణీ, తెలుగుగంగ, కండలేరు, స్వర్ణముఖి, నీవా నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అదే విధంగా చెరువుల్లో నీరు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇప్పటి వరకు సాగైన పంటలు గట్టెక్కుతాయా?లేదా? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయోమయంలో అన్నదాతలుఓ వైపు వాతావరణం అనుకూలించక తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అన్నదాతలు మరిన్ని ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,267 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు కేవలం 7,374 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఇందులో వేరుశనగ 21వేల హెక్టార్లకుపైగా సాగవ్వాల్సి ఉంది. అందుకు తగ్గట్టే జిల్లాకు 27వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కేటాయించినట్లు ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించింది.. అయితే ఇప్పటి వరకు పంపిణీ చేసింది కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే. విత్తనాల గురించి అధికారులను అడిగితే.. రాలేదనే సమాధానం వస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 21వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయలేక చేతులెత్తేశారని చెప్పొచ్చు. తిరుపతి జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3,456 హెక్టార్లు ఉంటే.. ఇప్పటి వరకు సాగైంది 1,106 హెక్టార్లు మాత్రమే. వరి సాధారణ విస్తీర్ణం కంటే.. అధికంగా సాగైనా రైతులకు యూరియా కష్టాలు తప్పలేదు. ప్రైవేటు ఎరువు దుకాణాల్లో యూరియా బస్తా కావాలంటే రెండు నానో డీఏపీ ప్యాకెట్లు లేదా నానో యూరియా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. -
పుంజుకున్న నైరుతి..
న్యూఢిల్లీ: జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి భారీ వర్షాలు నమోదు కావడంతో ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. తాజా వర్షాలతో లోటు కాస్తా 12 శాతానికి తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రుతుపవనాల పురోగతి, ఎల్–నినో పరిస్థితులపై ప్రధానమంత్రి ప్రధాన సలహాదారు పి.కె.మిశ్రా మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, తాగునీరు, పారిశుద్ధ్యం, వాణిజ్య వ్యవహారాలు, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ, జలవనరుల శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమీక్ష సమావేశంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జూన్, జూలై నెలల్లో దేశవ్యాప్తంగా రుతుపవనాల పరిస్థితి, ప్రభావాల గురించి వివరించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్రల్లో రుతుపవనాల రాక సాధారణం కంటే పది రోజులు ఆలస్యమైనప్పటికీ జూలై ఏడవ తేదీ వరకూ 30 శాతం వర్షం అధికంగా పడిందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. అయితే.. ఎల్–నినో పరిస్థితులు అన్నిసార్లూ వార్షభావానికి కారణం కాదని స్పష్టం చేసింది. పరిస్థితిని నిత్యం గమనిస్తూ ఉన్నామని తెలిపింది.ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో పరిస్థితులను తట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసు కున్నారో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివరించారు. రాష్ట్రాలతోపాటు పంటలు, వాతావరణ శాఖలతో వారం వారం సమావేశాలు నిర్వహిస్తున్నామని, వర్షపా తం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, వ్యవ సాయ పనులు, మార్కెట్ ధోరణలు, పంటలను ఆశిస్తున్న చీడపీడల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు తెలి పారు. సమస్యాత్మకం కాగల 262 జిల్లాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను అందుబా టులో ఉంచామని చెప్పారు. ఎల్–నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రామాణిక పద్ధతులు కొన్నింటిని సిద్ధం చేసిందని వివరించారు. అనానుకూల వాతావరణాన్ని తట్టుకోగల విత్తన వెరైటీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పాడిపశువులకు దాణ లభ్యతను పరిశీలిస్తున్నామని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలపగా.. రిజర్వాయర్లు, భూగర్భ జలాల పరిస్థితిని నిత్యం గమనిస్తున్నామని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. వడగాడ్పుల వంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలన్నదానిపై సూచనలను సిద్ధం చేశామని ఆరోగ్య శాఖ వివరించింది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలు, ఖరీఫ్, రబీ సీజన్లకు తగినన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని వాణిజ్య వ్యవహారాలు, ఎరువుల శాఖ తెలిపింది. వికసిత్ భారత్ పథకం కింద జూలై ఒకటవ తేదీ కింద చేపట్టిన పనులను గ్రామీణాభివృద్ధి శాఖ వివరించింది. -
ఎల్‌నినో విశ్వరూపం రెడ్ లిస్ట్‌లో రాయలసీమ
సాక్షి, అమరావతి: పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాలుస్తున్న ఎల్‌నినో మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో రాయలసీమ జిల్లాలున్నాయి. ఇప్పటికే మొదలైన ఎల్‌నినో పరిస్థితులు జూలై–సెప్టెంబర్ మధ్య మరింత బలపడతాయని ఐక్యరాజ్యసవిుతికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజాగా హెచ్చరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం పుణ్యమా అని రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా ఇవి కంటితుడుపేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.కృష్ణాడెల్టా, సాగర్ ఆయకట్టు, రాయలసీమ ప్రాజెక్టులన్నింటికీ ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసే వర్షాలే ఆధారం. కానీ జూలై ఒకటో తేదీ నాటికి మహారాష్ట్ర, కర్ణాటక సహా పశ్చిమ భారతంలో 71 శాతం ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుందని గాంధీనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని నేషనల్ డ్రాట్ మానిటర్ తాజాగా అంచనా వేసింది. దీన్నిబట్టి కృష్ణా పరీవాహకంలో ఎగువన వానల్లేకపోతే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41.2 శాతం భూభాగం కరువు ఛాయల్లో ఉంది. నెల కిందట ఇది 19.6 శాతమే. నెలలోనే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చిందంటే కరువు పరిస్థితులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో గమనించవచ్చు. కర్నూలు జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 77.7 మిల్లీవీుటర్లు కాగా 46.1 మిల్లీవీుటర్లు మాత్రమే నమోదైంది. నంద్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 77 మిల్లీవీుటర్లు కాగా 8.4 మిల్లీవీుటర్ల వర్షం మాత్రమే కురిసింది. కేంద్రం రెడ్‌లిస్ట్‌లో మన జిల్లాలుదేశంలోని 724 జిల్లాల్లో 315 జిల్లాలు వర్షాభావంతో ప్రభావితమవుతాయని కేంద్రం గుర్తించింది. అందులో సాగునీటి సదుపాయం 25 శాతం కంటే తక్కువ ఉన్న 111 జిల్లాలను అత్యంత అప్రమత్తతగా ఉండాల్సిన జిల్లాలుగా కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. ఆ జాబితాలో మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతం అల్పపీడనంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఎల్‌నినో జూన్‌లో బలహీనంగా మొదలై సీజన్ రెండో సగంలో బలపడుతుందని వాతావరణశాఖ ముందే తెలిపింది. అంటే జూలై చివరి నుంచి ఆగస్టు, సెప్టెంబర్లలో వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందుకే భారత వాతావరణశాఖ సీజన్ మొత్తం వర్షపాతం అంచనాను తగ్గించింది. వచ్చే వేసవి చాలా హాట్ ఎల్‌నినో అంటే కేవలం వర్షాభావం ఒక్కటే కాదు. జూన్‌లోనే రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పులు ఉన్న రోజులు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు జూన్ అంతా వేడిగాలులు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఈ ఎల్‌నినో 2026–27 శీతాకాలం వరకు కొనసాగే అవకాశం 96 శాతం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2027 వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువ ఉంటుందని చెబుతున్నాయి. -
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో డెంగీ..
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, వర్షాకాలంలో ఎక్కువ విరామాలు ఉండటం డెంగీ వ్యాప్తికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తోందని తాజా అధ్యయనం వెల్లడించింది. సరైన వర్షాలు కురవకపోతే డెంగీ జ్వరంకారక ఏడిస్ ఈజిప్టి దోమల గుడ్లు, లార్వాలు నాశనం కాకుండా ఎక్కువకాలం జీవించి, వర్షాలు మొదలయ్యాక భారీ స్థాయిలో దోమలుగా మారే అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డెంగీ ముప్పును రెండు నెలల ముందే గుర్తించే కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థను పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (ఐఐటీఎం) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి.12 ఏళ్ల డేటాతో అధ్యయనం ఈ పరిశోధనకు ఐఐటీఎం శాస్త్రవేత్త డాక్టర్ రోహిత్ మాథ్యూ కోల్ కరస్పాండింగ్ రచయితగా, సోఫియా యాకోబ్ తొలి రచయితగా వ్యవహరించారు. 2004 నుంచి 2015 వరకు పుణేలో నమోదైన డెంగీ మరణాల వివరాలను, అదే కాలానికి సంబంధించిన ఉష్ణోగ్రత, వర్షపాతం, సాపేక్ష తేమ (రిలేటివ్ హ్యుమిడిటీ) వంటి వాతావరణ సమాచారాన్ని విశ్లేషించారు. సాధారణ గణాంక పద్ధతులతోపాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను ఉపయోగించి వాతావరణ పరిస్థితులు డెంగీపై చూపే ప్రభావాన్ని అంచనా వేశారు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన 2 నుంచి 5 నెలల తర్వాత డెంగీ మరణాలు పెరుగుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.ఎల్‌నినోతో పెరిగే ముప్పువర్షాకాలమంతా మోస్తరు వర్షాలు కురిసిన సంవత్సరాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఒక వారంలో 15 సెం.మీ.కుపైగా భారీ వర్షాలు కురిస్తే దోమల గుడ్లు, లార్వాలు కొట్టుకుపోవడంతో వ్యాప్తి తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గినప్పుడు ఈ గుడ్లు, లార్వాలు సురక్షితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. అలాగే 27 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత, 60–78 శాతం సాపేక్ష తేమ ఉన్నప్పుడు ఏడిస్ దోమలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గుర్తించారు. ఈ దోమల గుడ్లు పొడి వాతావరణంలో 8 నెలల వరకు జీవించగలవని కూడా అధ్యయనం పేర్కొంది.రెండు నెలల ముందే హెచ్చరిక సగటు ఉష్ణోగ్రత, మొత్తం వర్షపాతం, సాపేక్ష తేమ వంటి వాతావరణ సూచీల ఆధారంగా రూపొందించిన ఏఐ–మెషీన్ లెర్నింగ్ మోడల్ డెంగీ ముప్పును సుమారు 2 నెలల ముందే అంచనా వేయగలదని పరిశోధకులు వెల్లడించారు. దీంతో ఆరోగ్య శాఖలు ముందుగానే ఫాగింగ్, లార్వా నిర్మూలన, పారిశుద్ధ్య చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు డెంగీ నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
వరి ‘సాగు’తలేదు!
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌కు అత్యంత కీలకంగా భావించే ఆరుద్ర కార్తె ఆదివారంతో ముగుస్తున్నా.. రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు ఊపందుకోలేదు. వర్షాలు ఓ మోస్తరులో కూడా కురవకపోవడంతో రైతులు వరి నారుమళ్లను సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినా... అవి సాగుకు సరిపోక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బావులు, బోర్ల కింద నీటి సౌకర్యం ఉన్న రైతులు మాత్రమే నార్లు పోస్తుండగా, వర్షాధార రైతులు ఇంకా ఎదురుచూపులకే పరిమితమయ్యారు. సాధారణంగా ఆరుద్ర కార్తెలోనే వరి నార్లు వేయడం, నాట్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆరుద్ర దాటితే ‘కాలం ఎత్తిపోయింది’అనే మాట ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వినబడుతుంది. గత సంవత్సరం కూడా వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూలై మొదటి వారం తరువాతే వరి నార్లు పోసే ప్రక్రియ వేగం అందుకోగా, ఈసారి మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. నార్లు పోయకపోయినా, దుక్కులు దున్ని పొలాల కోసం సిద్ధం చేసుకునే రైతులు ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముందుగానే నార్లు పోసి వర్షాలు లేకపోతే మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉండటంతో చాలామంది రైతులు రిస్క్ తీసుకోవడం లేదు. కాలం ఎత్తిపోతే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టే యోచనతో ఉన్నారు. వరి 1.94 లక్షల ఎకరాల్లోనే.. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 132 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 62.47 లక్షల ఎకరాల్లో సాగు కావలసి ఉండగా, ఇప్పటివరకు 1.93 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు కాగా.. గత ఏడాది ఇదే సమయానికి 5 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువగా సాగైనట్లు తెలుస్తోంది. ఈ ఖరీఫ్‌లో పత్తి 49 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 30 లక్షల ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 36,30,988 ఎకరాల్లో సాగైంది. వర్షాధారమైన పత్తికి ఎల్‌నినో దెబ్బ తగిలితే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి, పత్తి పోగా మిగిలిన అక్కడక్కడా మొక్కజొన్న, సోయాబీన్, కంది తదితర పంటల సాగు కొనసాగుతోంది. గోదావరి, ప్రాణహితపై ఆశలు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే ప్రాణహిత నదిలోకి వరద వచ్చి చేరుతోంది. గోదావరికి కూడా ఇన్‌ఫ్లో పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల్లో కొంత మేర ఆశలు మొలకెత్తుతున్నాయి. ప్రాణహితకు వరద పెరిగితే ఆ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకు ఉపయోగపడే అవకాశం ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు ఈసారి వరిపై ఆశలు వదిలేసుకునే పరిస్థితిలో ఉన్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతాంగం దృష్టి ఇప్పుడు రాబోయే రెండు వారాలపైనే నిలిచింది. ఈ సమయంలో విస్తృతంగా వర్షాలు కురిస్తేనే వరి నాట్లు ఊపందుకునే అవకాశం ఉంది. లేకపోతే ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. -
డేంజర్ బెల్స్.. ప్రపంచాన్ని కుదిపేసే ఎల్‌నినో సిగ్నల్!
భూమిపై అతిపెద్ద మహాసముద్రం.. దాని లోతుల్లో వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఒక భారీ వేడి నీటి ప్రవాహం.. అదే ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తోంది. ఏకంగా 14,500 కిలోమీటర్ల పొడవున్న ‘కెల్విన్ వేవ్ (Kelvin Wave)’ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు దిశగా కదులుతోంది. ఈ ఒక్క పరిణామం ప్రపంచ వాతావరణాన్ని నెలల తరబడి ప్రభావితం చేసే ఎల్‌నినో (El Nino) తిరిగి బలపడుతున్న సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అమెరికా వాతావరణ సంస్థ NOAA ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు తిరిగి ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఈ భారీ వేడి నీటి అలను నాసా–యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న Sentinel-6 Michael Freilich ఉపగ్రహం అత్యంత స్పష్టంగా నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మాన్స్టర్ వేవ్.. కానీ సునామీ కాదు!సముద్రంలో 14,500 కిలోమీటర్ల అల అని వినగానే భయంకరమైన కెరటం కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఇది అలాంటి అల కాదు. ఇది సముద్రం లోతుల్లో ప్రయాణించే వేడి నీటి ప్రవాహం. దీన్ని శాస్త్రవేత్తలు కెల్విన్ వేవ్ అంటారు. ఇది సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా కదులుతూ, ఉపరితలంలోని నీటిని కూడా వేడెక్కిస్తుంది. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్‌కు చేరుకున్నప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి.🌊 A 14,500-km “monster wave” of warm water is moving across the Pacific.Tracked from space by NASA’s Sentinel-6 satellite, the massive Kelvin wave is pushing heat eastward — a major signal of a strengthening El Niño. pic.twitter.com/SkZ0ebXIs0— StarSnap 🌟 (@StarSnap_1) July 4, 2026ఎందకంత ప్రమాదకరం?సాధారణంగా పసిఫిక్‌లో తూర్పు నుంచి పడమర వైపు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. అయితే ఆ గాలులు బలహీనపడితే, ఆ వేడి నీరు తిరిగి తూర్పు వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం 15 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరిగినట్లు ఉపగ్రహాలు గుర్తించాయి. ఇది చిన్న మార్పుగా కనిపించినా, ప్రపంచ వాతావరణ వ్యవస్థకు ఇది ఒక పెద్ద సంకేతం.ప్రపంచానికి ఎందుకు టెన్షన్?ఎల్‌నినో అనేది ఒక దేశానికి లేదా ఒక సముద్రానికి మాత్రమే సంబంధించిన పరిణామం కాదు. ఇది భూమి మొత్తం వాతావరణ సమతుల్యాన్ని మార్చగల శక్తి. దీని కారణంగా ఒక దేశంలో రికార్డు స్థాయిలో వర్షాలు.. మరో దేశంలో తీవ్ర కరువు.. ఎక్కడో అడవి మంటలు.. మరెక్కడో శక్తివంతమైన తుఫాన్లు వస్తాయి. అలాగే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు అవతాయి. ఇవన్నీ ఎల్‌నినోతో ముడిపడి ఉండే అవకాశాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని అత్యంత నిశితంగా గమనిస్తుంటారు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?భారత్‌కు ఎల్‌నినో పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది రుతుపవనాలు. ఎల్‌నినో బలంగా ఉంటే సాధారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గవచ్చు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడొచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే విద్యుత్ ఉత్పత్తి నుంచి తాగునీటి వరకు అనేక రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. అయితే ఈసారి మరో అంశం కొత్త ఆశను కలిగిస్తోంది. అదే భారత మహాసముద్ర డైపోల్ (IOD). ఇది అనుకూలంగా ఉంటే ఎల్‌నినో ప్రభావాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.‘సూపర్ ఎల్‌నినో’ వస్తుందా?శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇదే. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. NOAA అంచనాల ప్రకారం, ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం 63 శాతం వరకు ఉంది. అది జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ ఘటనలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.🚨 A 14,500-km "monster wave" is crossing the Pacific as El Niño strengthensNASA's Sentinel-6 satellite detected a vast subsurface warm-water (Kelvin) wave stretching nearly 14,500 km across the tropical PacificThe heat pulse raised sea-surface height by up to 15 cm#SSTVI pic.twitter.com/2QKrSoVcEh— Geo Politics Desk (@GeoPoliticsDesk) July 4, 2026 -
పోర్టల్‌లో లేకుంటే బోనస్ పాయే!
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇచ్చే విషయంలో సర్కార్ ఆంక్షల పరంపర కొనసాగుతోంది. 2024–25 ఖరీఫ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత రెండు ఖరీఫ్ సీజన్లలో బోనస్ ఇచ్చిన ప్రభుత్వం రెండు రబీలలో ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల సన్నాలు పండించిన రైతులకు మాత్రమే బోనస్‌గా క్వింటాలుకు రూ. 500 చొప్పున చెల్లిస్తామని వ్యవసాయ, పౌరసరఫరా శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. తాజాగా మరో నిబంధన ఏంటంటే వరి విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే ఏ రకం విత్తనాలను రైతు కొనుగోలు చేశాడో ఆ రైతు వివరాలతో పాటు విత్తనాల వివరాలను కూడా ‘సీడ్స్ సేల్స్ పోర్టల్’లో విత్తనాలు అమ్మిన డీలర్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో రైతు సన్నాలు పండించినప్పటికీ, కొనుగోలు చేసేటప్పుడు బోనస్ పొందేందుకు అనర్హుడు అయ్యే ప్రమాదం ఉంది. దీంతో సన్నాలు సాగు చేసిన ప్రతి రైతుకు బోనస్ లభిస్తుందనే కచ్చితమైన పరిస్థితి లేకుండా పోయింది. డీలర్ నమోదు చేయకపోతే..? రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి బావులు, బోర్ల కింద ఉన్న పొలాలనే రైతులు సాగుచేశారు. చెరువులు, కాలువలు, ప్రాజెక్టుల కింద పొలాలలో దుక్కులు కూడా దున్నలేదు. పత్తి వేసిన రైతులే వరణుడి రాక కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరో రెండు రోజుల్లో ‘ఆరుద్ర కార్తె’వెళ్లిపోతుంది. ఆరుద్ర కార్తె దాటితే నార్లు పోయడం దాదాపుగా నిలిచిపోతుంది. కాగా ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో మెజారిటీ రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఏడు రకాల సన్నాల గురించి చెప్పడంతో రైతులు తమ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జైశ్రీరాం, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 రకాలనే ఎక్కువగా కొనుగోలు చేశారు. అయితే తాజాగా డీలర్లు రైతులు కొనుగోలు చేసిన విత్తనాల వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెపుతుండడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో డీలర్లు, కొనుగోలు చేసిన రైతులు ఉన్నారు. సీడ్ సేల్స్ పోర్టల్ https:// seedsgrowerp.com/ seedsales/ login.phpలో రైతుల వివరాలను నమోదు చేయాలని అధికారులు డీలర్లకు చెపుతున్నారు. రైతు పేరు, ఆధార్, మొబైల్ నంబర్, సాగు చేయనున్న పంట, విత్తన కంపెనీ, లాట్ నంబర్, జిల్లా వివరాలతో పాటు ఏ సన్న వరి రకాన్ని కొనుగోలు చేశారో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను డీలర్ తనకు ఇచ్చిన లాగిన్‌తో పోర్టల్‌లో నమోదు చేసి సేవ్ చేయాలి. తదనుగుణంగా రైతులు ధాన్యం విక్రయించే సమయంలో ఈ వివరాలను సరిచూసుకొని , సంబంధిత రైతులకే బోనస్ కింద రూ. 500 చొప్పున చెల్లించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల విత్తనాలకే డిమాండ్ ప్రస్తుతం ప్రభుత్వం ఆర్ఎన్ఆర్–15048, బీపీటీ–5204, కేఎన్ఎం–1638, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూజీఎల్–44, కేఎన్ఎం–7715 రకాల సన్న విత్తనాలనే సాగు చేయాలని, ఈ విత్తనాలకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని కంపెనీలు ఆయా వంగడాలను 10, 20 కిలోల బ్యాగుల్లో విక్రయిస్తున్నాయి. కేఎంఎం 1638 రకం విత్తనాల 20 కిలోల బస్తాకు రూ.1050 ఉంటే, జై శ్రీరాం విత్తనాల 10 కిలోల బ్యాగు ధర రూ. 1100 పైగా పలుకుతోంది. మిగతా విత్తనాల రకాలను రైతులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని కరీంనగర్‌కి చెందిన ఓ డీలర్ తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), బీపీటీ 5204 కొనుగోలు చేస్తున్నట్లు డీలర్లు తెలిపారు. అయితే విత్తనాల కొనుగోళ్లు చాలా వరకు తగ్గాయని విక్రయదారులు చెపుతున్నారు. ఇప్పటికే విత్తనాలు విక్రయించాం – డీలర్, పెద్దపల్లి రైతులు విత్తనాల కోసం వచ్చినప్పుడు ఫోన్ కూడా తీసుకురారు. ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను మేమెలా సీడ్స్ సేల్ పోర్టల్‌లో నమోదు చేస్తాం. మా దగ్గర కంప్యూటర్లు లేవు. చాలా మందికి చదువులు కూడా రావు. మమ్ములను రైతులకు అమ్మిన విత్తనాల వివరాలు ఫీడ్ చేయమంటే ఎలా? వ్యవసాయ శాఖ అధికారులు చేయాల్సిన పనులను మాకు చెపితే మేం ఎట్లా చేస్తాం. అయినా విత్తనాలన్నీ ఇప్పటికే అమ్మేసినం. అమ్మినప్పుడు రైతుకు బిల్లు ఇస్తం. అది తప్ప మేం ఏమీ ఆన్లైన్లో ఎంటర్ చేయలేం. -
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయ్!
సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉష్ణోగ్రతలు జూన్ నెలలో రికార్డు సృష్టించాయి. 2023–24 ఎల్‌నినో పరిస్థితుల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావం నుంచి బయట పడినా వచ్చే ఏడాది కూడా రికార్డు స్థాయి దు్రష్పభావాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల సముద్ర ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ ల సెల్సియస్ వరకూ ఉండగా 1870లో ఇది 19.6 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. తేడా 1.4 డిగ్రీ సెల్సియస్ మాత్రమే అయినప్పటికీ విస్తృతమైన సముద్ర ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. ఎంతో శక్తిని ఉపయోగిస్తే కానీ.... ఇంత విశాలమైన స్థాయిలో సముద్రం వేడెక్కదు. పెట్రోల్, డీజిళ్ల వంటి శిలాజ ఇంధనాలు మండించడం వల్ల పుట్టిన వేడిలో 90 శాతం కంటే ఎక్కువ సముద్రాలే గ్రహించాయన్నమాట. దీంతో సముద్రాలు వేగంగా వేడెక్కుతున్నాయి. ఒక్క 2025లో మాత్రమే సముద్రం శోషించుకున్న వేడి... సెకనుకు ఒకటి చొప్పున 12 అణుబాంబులు పేలిస్తే పుట్టేంత శక్తికి సమానమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గతంలో పోల్చాలంటే కనీసం 1,20,000 ఏళ్ల క్రితం నాటి కాలానికి వెళ్లాలి. భూమి కక్ష్యలో జరిగిన చిన్న మార్పుల కారణంగా కొన్ని వేల సంవత్సరాల్లో సముద్రాలు వేడెక్కాయి. శిలాజ ఇంధనాల వాడకం, ఇతర మానవ చర్యల పుణ్యమా అని ఇప్పుడు మాత్రం అంతేస్థాయి వేడి వందేళ్లలోనే చేరుకున్నాం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఏదో ఒక ఏడాదికి మాత్రమే పరిమితం కాకపోవడం. సముద్రనీటి ఉష్ణోగ్రతలు పెరిగితే తుపానులు మరింత బలంగా వస్తాయి. వాతావరణంలో తేమ ఎక్కువ అవుతుంది. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు సాధారణమవుతాయి. ఈ పరిణామాలు కాస్తా సముద్రాలపై ఉండే గాలి మరింత వేడెక్కేందుకు కారణమవుతుంది.ఫలితంగా భూమ్మీద వడగాడ్పులు ఎక్కువవుతాయి. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడుతున్న ఎల్‌నినో మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగానే హిందూ మహా సముద్ర పశ్చిమ ప్రాంతం, ఉష్ణమండల అట్లాంటిక్ మహా సముద్ర ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతాల్లో వడగాడ్పులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అనూహ్య స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలోని సముద్ర జలాలు కూడా బాగా వేడెక్కాయి. మధ్యధరా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది దీర్ఘకాల సగటు కంటే 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. నార్త్ సీలోని కొన్నిచోట్ల ఇది 3 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. సముద్ర జలాలు నిరంతరం వేడెక్కడం వల్ల పగడపు దీవుల వంటి సముద్ర జీవవ్యవస్థలకు ప్రమాదకరమన్నది తెలిసిందే. 2023–24 ఎల్‌నినో ఏడాదితోపాటు, 2024 నాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పులు, కరువులు, వర్షాల ముప్పున్యూఢిల్లీ: రాబోయే నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ‘ఎల్‌నినో’పరిస్థితులు వేగంగా బలపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కరువులు, భారీ వర్షాలు, ఇతర తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. డబ్ల్యూఎంఓ గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ ప్రకారం.. ఈ సంవత్సరం జూలై–సెపె్టంబర్ మధ్యకాలంలో ఎల్‌నినో వేగంగా అభివృద్ధి చెంది బలమైన ఎల్నినోగా మారనుంది.ఎల్‌నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వెంబడి సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు, దానిపై ఉన్న వాతావరణంలో హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించే ఒక వాతావరణ దృగి్వషయం. ‘‘ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇవి వేగంగా బలపడి ఒక శక్తివంతమైన ఎల్నినోగా మారుతాయని అంచనా వేస్తున్నాం. ఇది అనేక ప్రాంతాల్లో కరువు, భారీ వర్షపాతం సంభవించే అవకాశాలను, అలాగే భూమిపై వడగాడ్పులు, సముద్రపు వేడిగాలుల ముప్పును తీవ్రతరం చేస్తుంది’’అని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో చెప్పారు. ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని జూన్ 12న భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాల కాలంలో అవి మరింత బలపడతాయని ఐఎండీ పేర్కొంది. -
వాన నీరు ఇంకిస్తే చాలు!
ఎల్ నినోతో రుతుపవనాలు అస్తవ్యస్థంగా మారుతున్న పరిస్థితుల్లో బోర్‌వెల్స్ కింద వ్యవసాయం చేసే రైతులు వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకునే పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దానికంటే ఎక్కువ నీటిని తోడటం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో 200 నుంచి 400 మీటర్ల (650–1300 అడుగుల) లోతు వరకు కూడా బోర్వెల్లు, ట్యూబ్వెల్లు తవ్వడం సర్వసాధారణమైంది. భూగర్భ జలాల లభ్యత రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి తగినంత వాన నీటిని ఇంకింపజేసే (రీఛార్జ్) ప్రయత్నాలు చెయ్యకుండా భూగర్భ జలాలను నిరంతరం ఎక్కువగా తోడుతుండటమే సమస్య. బోరుబావులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే వాటి దగ్గర రీఛార్జ్ గుంతలు లేదా నీటి కుంటలు నిర్మించుకోవటం మేలు అంటున్నారు నిపుణులు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని భూగర్భంలో గట్టి రాతి జల పొరలు విస్తరించి ఉన్నాయి. మట్టి కింద 5 నుంచి 15 మీటర్ల లోతు వరకు రాతి పొరలు ఉంటాయి. నీటిని ఎక్కువగా నిల్వ చేయగల సామర్థ్యం ఈ పొరలకే ఉంటుంది. రాతి సమూహాల మధ్య ఉండే పగుళ్లు భూగర్భ జలాల నిల్వకు, కదలికలకు దోహదపడతాయి. ఒక బోర్వెల్ ద్వారా రీఛార్జ్ అయ్యే వర్షపు నీటి పరిమాణం, అక్కడి భూగర్భంలోని జల పొరల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాళ్లలో పగుళ్లు, చీలికలు బాగా ఉంటే బోర్‌వెల్స్ ద్వారా ఎక్కువ వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతాయి. కొన్నిసార్లు, ఈ పగుళ్ల అనుసంధానం చాలా పరిమితంగా ఉంటే వాన నీరు ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. సాధారణ వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సుమారు 15% మాత్రమే భూగర్భంలోని పైపైన ఉండే నీటి పొరల్లోకి ఇంకుతోంది. సుమారు 20–40% ఆవిరైపోవచ్చు. లోతైన భూగర్భ జల పొరలు తిరిగి నిండటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ కాలం పాటు కురిసే భారీ వర్షాలను ఈ నిర్మాణాలు సమర్థవంతంగా సంగ్రహించలేకపోవచ్చు. ఇటీవలి కాలంలో లోతైన బోర్వెల్లను రీఛార్జ్ చేయడానికి, వాటి దిగుబడిని పెంచడానికి, సహేతుకంగా తక్కువ ఖర్చుతో ‘బోర్వెల్ రీఛార్జ్’ అనే పద్ధతి ఒక సమర్థవంతమైన విధానంగా ఆవిర్భవించింది.ఎండిన బోర్లకు తిరిగి జలకళఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దమగట్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న రెండు ఎండిపోయిన బోరుబావులకు చుట్టూ వాన నీరు ఇంకేలా రీఛార్జ్ గుంతను నిర్మించారు. దీంతో ఆ బోరుబావులు వర్షపు నీటిని 70% వరకు భూమి లోపలికి ఇంకింపజేశాయి. ఆ బోర్లు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. రోజంతా అపరిమితంగా నీటిని అందించడం ప్రారంభించాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ ప్రగతిశీల రైతు, బోర్ రీచార్జ్ గుంత ద్వారా నీటి భద్రత పొందటంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ పద్ధతి ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి అనువైన ప్రాంతమని తమ పరిశీలనలో తేలిందని వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ (డబ్ల్యూఎల్ఎఫ్) వ్యవస్థాపకులు డా. రామ్మోహన్ అన్నారు. నీటి కుంటలతో బోర్ల రీఛార్జ్నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, దాని పరిసర ప్రాంతాల్లో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటల సాగు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. బోరుబావులు విఫలమైనప్పుడు, వారు అధిక ఖర్చుతో రైతులు కొత్త బోరుబావులను వేయిస్తుంటారు. ప్రత్యక్ష రీఛార్జ్ ప్రయోజనం కోసం బోరుబావులకు దగ్గరగా వర్షపు నీటి నిల్వ కుంటలను నిర్మించుకుంటే భూమిలోకి నీరు బాగా ఇంకుతుందని డబ్ల్యూఎల్ఎఫ్ చెబుతూ రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెస్తోంది. ఉన్న బోరుబావులను కాపాడుకోవడానికి బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకోవటానికి గత 2–3 సంవత్సరాలుగా చిన్న రైతులకు తోడ్పాటునందిస్తోంది. రైతులు తమ వంతుగా కొంత మొత్తం చెల్లిస్తే పొలంలో బోరుకు దగ్గరగా నీటి కుంటను ఏర్పాటు చేయిస్తోంది. తమ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఇప్పటివరకు 74 మంది రైతులు వర్షపు నీటి కుంటల నిర్మాణంతో లబ్ది పొందారని డా. రామ్మోహన్ తెలిపారు. బోరుకు 5 అడుగుల దూరంలో నీటి కుంట తవ్వుకుంటే బోరు నిండుగా నీరు పోస్తోందని నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అ΄్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్కం రాములు యాదవ్ తెలిపారు. ఈ కుంటలో భవిష్యత్తులో చేపలు కూడా పెంచుతానన్నారు. 70% వాననీటి సంరక్షణబోర్వెల్ చుట్టూ వాన నీటి రీఛార్జ్ గుంతల నిర్మాణం, బోర్లకు దగ్గర్లో వ్యవసాయ చెరువుల నిర్మాణం వంటి పద్ధతులు కొద్దిపాటి వర్షం కురిసినా భూగర్భ జలాల పెంపుదలకు ఉపయోగపడతాయి. ఎల్‌నినో గడ్డు కాలాన్ని తట్టుకోవటానికి ఇవి ప్రభావశీలంగా పనిచేస్తాయి. పొలంలో కురిసిన వర్షపు నీటిలో 30 నుంచి 70% వరకు రీఛార్జ్ చేయడానికి వీలుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, బోరుబావిలో నీటి మట్టం తక్షణమే పెరుగుతుంది. స్థానికంగా లభించే వస్తువులతో బోర్ రీఛార్జ్ గుంతలను, బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించవచ్చు. ఇవి సాపేక్షంగా చౌకైనవి. రైతులు సులభంగానే వీటిని నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి.– డా. ఆర్. రామ్మోహన్ (94401 94866), భూగర్భ జల నిపుణులు, వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్, సికింద్రాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
గత 146 ఏళ్లలో భారత్‌లో అత్యంత దయనీయ స్థితి!
భారతదేశ వ్యాప్తంగా జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే 42 శాతం తక్కువగా నమోదైంది. గత 146 ఏళ్లలో అత్యంత పొడి వాతావరణాన్ని జూన్ నెల ఎదుర్కోవడం గమనార్హం. గత దశాబ్దన్నర కాలంలో వేసవి రుతు పవనాలకు ఇది అత్యంత బలహీనమైన ఆరంభం. దీని ఫలితంగా దేశంలోని 76 శాతం ప్రాంతాల్లో వర్షపాతం ‘లోటు’, లేదా ‘తీవ్ర లోటు’గా ఉంది. జూలై కూడా సాధారణం కంటే పొడిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం పర్యవేక్షించే దేశంలోని 166 ప్రధాన జలాశయాలు జూన్ 25 నాటికి మొత్తం నిల్వ సామర్థ్యంలో 26 శాతాన్ని కలిగి ఉన్నాయి. నీటి మట్టాలు ఇందిరా సాగర్‌లో 14 శాతానికి, నాగార్జున సాగర్‌లో 5 శాతానికి, తెహ్రీలో 2 శాతానికి పడిపోయాయి. పసిఫిక్‌లో పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల(ఎల్‌నినో అనే పరిస్థితి) కారణంగా ఆ నెలలో రుతుపవన వర్షపాతం మళ్లీ పుంజుకున్నప్పటికీ జూలై నెలలో చాలావరకు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఉత్తర ఆఫ్రికా నుండి వేడి గాలిని రప్పించే స్థిరమైన అధిక పీడన వ్యవస్థ కారణంగా ఏర్పడిన వడగాడ్పులు మానవ ప్రేరిత వాతావరణ మార్పుల వల్ల మరింత తీవ్రమయ్యాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ అనే బహుళ దేశాల పరిశోధక బృందం శుక్రవారం తెలిపింది. ఐరోపా వేసవి వాతావరణంపై ఎల్ నినో ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది భారత రుతుపవనాలపై ఇది ప్రధాన ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
తొలిమాసం.. లోటు వర్షపాతం..
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్ మొదటి నెల నిరాశే మిగిల్చింది. ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకున్న కాలాన్ని నైరుతి రుతుపవనాల సీజన్‌గా పరిగణిస్తారు. సీజన్లో తొలి మాసమైన జూన్‌లో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 14 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 8న రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తొలివారం కొంత చురుకుగా ముందుకు సాగినప్పటికీ... ఆ తర్వాత మందగించడంతో రుతుపవనాల వ్యాప్తి జూన్ మూడో వారం నాటికి రాష్ట్రమంతటికీ విస్తరించగా... ఆ తర్వాత వర్షాలు నమోదయ్యాయి. జూన్‌లో రాష్ట్రంలో 13.03 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఇ ప్పటివరకు 11.3 సెం.మీ. వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 14 శాతం తక్కువగా వానలు కురిశాయి. గతేడాది జూన్‌లో 9.37 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా... 21 శాతం లోటు నమోదైంది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. ఇక్కడ 75 శాతం లోటు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో లోటు వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా... మరో 5 జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. గతేడాదితో పోలిస్తే సగటు వర్షపాతం మెరుగ్గా కనిపిస్తున్నా... వర్షాలు ఆలస్యం కావడం... కీలకమైన జిల్లాల్లో తేలికపాటి వానలే కురవడంతో సాగు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జూన్‌లో అరకొర వర్షాలు నమోదుకాగా.. వచ్చే నెల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు ఆశించినస్థాయిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.ఏ జిల్లాలో ఎలా ఉందంటే... తీవ్ర లోటు: హనుమకొండ లోటు: ఆదిలాబాద్, మంచిర్యాల, ని జామాబాద్, జగిత్యాల, వరంగల్, క రీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్–మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల, వనపర్తి సాధారణం: కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట్ అధికం: రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంజూన్.. అసాధారణందేశంలో వర్షపాతం కేవలం 85.2 మి.మీ. గత 125 ఏళ్లలో ఇలా జరగడం ఐదోసారి దక్షిణాది రాష్ట్రాల్లో 31 శాతం లోటు న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అసాధారణ వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది జూన్ నెల ప్రజలను అల్లాడించింది. ఈ నెలలో వాతావరణం సాధారణానికి భిన్నంగా, ఆందోళనకరంగానే కనిపించింది. దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 28 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 149.8 మి.మీ. కాగా, కేవలం 85.2 మి.మీ. మాత్రమే నమోదైంది. సుమారు 43 శాతం లోటు ఏర్పడింది. భార త వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా నివేదిక ప్రకారం, ఇలాంటి వాతావరణ పరిస్థితు లు ఏర్పడటం గత 125 ఏళ్లలో ఇది ఐదోసారి. జూన్‌లో 100 మి.మీ. కంటే తక్కువగా వర్షపాతం నమోదుకావడమనేది గతంలో 1905, 1926, 2009, 2014 సంవత్సరాలలో మాత్రమే జరిగింది. నైరుతి రు తుపవనాలు కేరళను కొంచెం ఆలస్యంగా జూన్ 4న తాకినప్పటికీ, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి విస్తరణ పూర్తిగా మందగించింది. భారీ లోటు వర్షపాతం... ప్రాంతాల వారీగా చూస్తే, మధ్య భారతదేశంలో అత్యధికంగా 56 శాతం లోటు ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో 43 శాతం, దక్షిణాదిలో 31 శాతం, వాయవ్య రాష్ట్రాల్లో 29 శాతం లోటు నమోదైంది. వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం, 1901 సంవత్సరం తర్వాత ఈ జూన్ మూడవ అత్యంత పొడి నెలగా నిలిచింది. ఇంతటి తీవ్ర వర్షపాత లోటు ఏర్పడటం 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే నమోదైంది. ఎల్‌నినో ప్రభావం కొంతమేర ఉన్నప్పటికీ... హిందూ మహాసముద్ర డైపోల్ తటస్థంగా ఉండటం, భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ఇచ్చే మేఘాల వ్యవస్థ భారత్‌కు అనుకూలమైన దిశలో లేకపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం, వాయవ్య భారతం నుంచి వీచిన వేడిగాలులు క్లౌడ్ ఫార్మేషన్‌ను అడ్డుకోవడం వంటి పరిస్థితుల వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 315 జిల్లాలు ప్రభావితం దేశంలో 724 జిల్లాలకుగాను 315 జిల్లాలు తక్కువ వర్షపాతం వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని కేంద్రం గుర్తించింది. వాటిలో 25 శాతం కంటే తక్కువ నీటి పారుదల సౌకర్యం ఉన్న 111 జిల్లాలను ‘అత్యంత అప్రమత్తత’జిల్లాలుగా ప్రకటించింది. ఆ జిల్లాల జాబితాలో తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు చెందిన జిల్లాలు ఉన్నాయి. వాటి కోసం ‘డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కాంటింజెన్సీ ప్లాన్స్’సిద్ధం చేశారు. -
ఖరీఫ్.. బహుపరాక్!
వాన కోసం..వర్షాలు కురవాలని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రం, ఎల్కతుర్తి మండలం సూరారం, కోతులనడుమ, ఆరెపల్లి, కమలాపూర్ మండలంలోని దేశరాజుపల్లిలో శుక్రవారం మహిళలు, గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ మహిళలు బోనాలు, నీటిబిందెలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. గ్రామదేవతలు పోచమ్మ తల్లి, రేణుకాఎల్లమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.– ఎల్కతుర్తి/భీమదేవరపల్లి/కమలాపూర్సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో వరి సాగు అధికంగా ఉండే జిల్లాల్లో ముందస్తు కార్యాచరణ చేపట్టాలని సూచించింది. గతంలో ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపిన సంవత్సరాల్లో నమోదైన దిగుబడి నష్టాలను విశ్లేషించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) అన్ని రాష్ట్రాలకు జిల్లాల వారీ కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు హైదరాబాద్‌లోని సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (క్రిడా) కూడా ఇప్పటికే తెలంగాణ సహా వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలతో సమీక్షలు నిర్వహిస్తూ రైతులు అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది. గత కరువుల ఆధారంగా విశ్లేషణ ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎక్కువ నష్టం చవిచూసిన జిల్లాలను గుర్తించేందుకు ఐసీఏఆర్ 2002, 2004, 2009 సంవత్సరాల వ్యవసాయ ఉత్పత్తి గణాంకాలను పరిశీలించింది. ఈ మూడేళ్లలో దేశంలో తీవ్రమైన వర్షాభావం నమోదైంది. తెలంగాణలోనూ కరువు ప్రభావం అధికంగా కనిపించింది. సాధారణంతో పోలిస్తే 2002లో 19%, 2004లో 13%, 2009లో 23% లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావంతో 2002లో ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 శాతానికి పైగా తగ్గగా, 2004, 2009లో సుమారు 12 శాతం చొప్పున తగ్గింది. ఈ అధ్యయనం ఆధారంగానే కేంద్రం ముందస్తు కార్యాచరణ సూచనలు జారీ చేసింది. వరి అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాల్లో.. దేశంలో ప్రధాన వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ముఖ్యంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ వంటి సాగునీటి వనరులు పెరిగినా, వర్షాభావ పరిస్థితులు ఎదురైతే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటిపోతాయి. వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో దీర్ఘకాల విరామం ఏర్పడితే, అవసరమైన సమయంలో నీరందక వరి పొలాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల కింద ఉండే చివరి ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం రోజుల్లో సైతం నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులు ఉత్తర తెలంగాణలో వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగుతో పాటు పశ్చిమ తెలంగాణ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట వంటి ప్రధాన వరి జిల్లాలపై అధిక ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్టు తేల్చింది. క్రిడా.. కీలక సూచనలు హైదరాబాద్‌లోని క్రిడా రూపొందించిన కంటింజెన్సీ ప్రణాళికల్లో రైతులు అనుసరించాల్సిన పలు కీలక సూచనలు ఉన్నాయి. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక వరి రకాలను ఎంపిక చేయడం, అవసరమైతే మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం, పుషి్పంచే దశలో రక్షణ నీటి తడులు ఇవ్వడం, ఆకులపై పోషక ద్రావణాలు పిచికారీ చేయడం ఇందులో ఉన్నాయి. గ్రామస్థాయిలో విత్తన నిల్వలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి 24 వరకు సాధారణంతో పోలిస్తే సుమారు 42 శాతం వర్షలోటు నమోదైంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 21 శాతం ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
సూపర్ ఎల్ నినో.. ఈ ప్రభావం 2027 వరకు వర్షాలు కష్టమే..!
-
డేంజర్ లో తెలుగు రాష్ట్రాలు ఎల్ నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే?
-
Godzilla El Nino ఉగ్రరూపం! పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి...
-
సూపర్ ఎల్‌నినో వెనుక బంగారు రహస్యం!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న "సూపర్ ఎల్‌నినో" పేరు వినగానే కరువు, వరదలు, పంటనష్టం, ఆహార సంక్షోభమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వాతావరణ దృగ్విషయం అందరికీ శాపమేనా? ఆశ్చర్యకరంగా, కొన్ని దేశాలకు మాత్రం సూపర్ ఎల్‌నినో బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడో పంటలు ఎండిపోతుంటే.. మరెక్కడో రికార్డు దిగుబడులు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో ఆనకట్టలు నిండిపోతాయి. ప్రకృతి సృష్టించే ఈ అసమాన సమీకరణంలో విజేతలు ఎవరు? ఓటమిపాలయ్యే దేశాలు ఏవి?.ప్రపంచ వాతావరణ వ్యవస్థలో అత్యంత ప్రభావశీలమైన ఘటనల్లో ఎల్‌నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఎల్‌నినో ఏర్పడుతుంది. ఈ వేడిమి మరింత తీవ్రరూపం దాల్చినప్పుడు దానిని "సూపర్ ఎల్‌నినో"గా పిలుస్తారు. 1982-83, 1997-98, 2015-16లో నమోదైన సూపర్ ఎల్నినోలు ప్రపంచవ్యాప్తంగా వందల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం కేవలం వర్షాలకే పరిమితం కాదు. మనం ఉదయం తాగే కాఫీ నుంచి సాయంత్రం తినే చాక్లెట్ వరకు, రైతు పొలం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వాతావరణ నిపుణులు సూపర్ ఎల్‌నినోను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి’గా అభివర్ణిస్తుంటారు.అయితే ప్రకృతి ఇక్కడే తన విచిత్రాన్ని చూపిస్తుంది. ఒకే వాతావరణ పరిణామం కొన్ని దేశాలకు విపత్తుగా మారితే, మరికొన్ని దేశాలకు అది వరంలా మారుతుంది. ముఖ్యంగా అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే వంటి వ్యవసాయాధారిత దేశాలు ఎల్‌నినో సంవత్సరాల్లో అధిక వర్షపాతం కారణంగా భారీ పంట దిగుబడులను నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. సోయాబీన్, మొక్కజొన్న, గోధుమల ఉత్పత్తి పెరగడంతో ఈ దేశాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వీటికి మరింత డిమాండ్ పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుంది.ఇక అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రాంతాలకు కూడా ఎల్‌నినో కొన్నిసార్లు ఊరటనిస్తుంది. సాధారణంగా కరువుతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో వర్షపాతం పెరిగి జలాశయాలు నిండుతాయి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. వ్యవసాయ రంగానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది. హైడ్రోపవర్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఎల్‌నినో ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చేస్తుంది. ఒక దేశంలో పంటలు విఫలమైతే, మరో దేశం ఆ కొరతను భర్తీ చేస్తూ భారీ ఎగుమతుల ద్వారా లాభపడుతుంది. 1997-98 సూపర్ ఎల్‌నినో సమయంలో కొన్ని దక్షిణ అమెరికా దేశాల వ్యవసాయ ఎగుమతులు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే ఈ లాభాల వెనుక కూడా ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక దేశంలో పంటలు బాగా పండినా, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ధరల అస్థిరత ఏర్పడుతుంది. సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఆహార ధరలు పెరగడం వంటి పరిణామాలు చివరికి లాభపడిన దేశాలపైనా ప్రభావం చూపుతాయి. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు, వర్షాభావం, పంట నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్‌లో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం పడితే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.వాతావరణ మార్పుల కారణంగా ఎల్‌నినో ప్రభావాలు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దశాబ్దాలకు ఒకసారి కనిపించే తీవ్ర ఎల్‌నినో పరిస్థితులు ఇప్పుడు మరింత తరచుగా సంభవించే అవకాశముందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని అర్థం ప్రపంచం భవిష్యత్తులో మరిన్ని వాతావరణ షాక్‌లను ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాట.చివరగా.. సూపర్ ఎల్‌నినో అనేది కేవలం సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి. ఎక్కడో రైతు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే, మరో దేశంలో అదే వర్షాలు బంగారు పంటలుగా మారతాయి. ఎక్కడో ఆనకట్టలు ఎండిపోతుంటే, మరెక్కడో నీరు పొంగిపొర్లుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఎల్‌నినోను ప్రకృతి నిర్వహించే ప్రపంచ స్థాయి లాటరీగా అభివర్ణిస్తారు. కానీ ఈ లాటరీలో కొందరు గెలిచినా, చివరికి చెల్లించాల్సిన మూల్యం మాత్రం మొత్తం ప్రపంచానిదే. -
ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్ బి’!
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో భారత వ్యవసాయ రంగాన్ని ‘ఎల్ నినో’ భయం వణికిస్తోంది. సుమారు 9 నుంచి 10 రాష్ట్రాలపై ఈసారి ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న ముందస్తు అంచనాలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షభావ పరిస్థితులు ఎదురైతే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా ముందే ‘ప్లాన్ బి’ (ప్రత్యామ్నాయ ప్రణాళిక)ను సిద్ధం చేస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.ఆ 10 రాష్ట్రాలపైనే నజర్రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న 9 నుంచి 10 రాష్ట్రాలను కేంద్రం గుర్తించింది. ఆయా రాష్ట్రాల్లోని అత్యంత వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే జిల్లాలకు ప్రత్యేక వ్యూహాలను, పంటల వారీ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోని దాదాపు 326 జిల్లాల్లో వర్షపాతం తగ్గవచ్చని, పంట నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.క్షేత్రస్థాయికి శాస్త్రీయ సలహాలురైతులను ఆందోళనకు గురిచేసేలా కాకుండా, వారికి ధైర్యాన్నిస్తూ, సమస్యలను పరిష్కరించేలా శాస్త్రీయ సలహాలను అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగాలు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, విస్తరణాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రత్యామ్నాయ మార్గాలను చూపే బాధ్యతను వీరికి అప్పగించారు.నీటి పొదుపు.. తేమ నిర్వహణే కీలకంవర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటి పరిరక్షణ, భూమిలో తేమ నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. మల్చింగ్ పద్ధతులు, అంతర పంటల సాగు, స్థానిక వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల రకాలను ప్రోత్సహించాలని సూచించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థల పరిశోధనలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, సకాలంలో రైతులకు చేరినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.పప్పుధాన్యాల స్వయంసమృద్ధిపై ఫోకస్భారతదేశం పప్పుధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘పప్పుధాన్యాల స్వయంసమృద్ధి మిషన్’ కింద కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఎల్ నినో ముప్పు నేపథ్యంలో దేశీయంగా పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కంది, మినుము, పెసర పంటల సాగును విస్తరింపజేయాలని, పంటల మార్పిడి పద్ధతులను పెంచడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సహాయం అందించాలని రాష్ట్రాలను కోరింది.ఎరువుల నిల్వలు సిద్ధంవర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సమీక్షలో వెల్లడించారు. అయితే, రుతుపవనాల గమనాన్ని బట్టి స్థానికంగా ఎక్కడైనా కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడికి ముందే ఎరువుల స్టాక్‌ను చేర్చాలని అధికారులను మంత్రి చౌహాన్ ఆదేశించారు. దేశంలోని జలాశయాల నీటి మట్టాలు, మార్కెట్ ధరలపై కూడా నిరంతర నిఘా ఉంచామన్నారు.నిరంతర సమీక్షలు.. ఫీడ్బ్యాక్ఈ సవాలుతో కూడిన ఖరీఫ్ సీజన్‌ను విజయవంతంగా అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సమన్వయం అవసరమని కేంద్రం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి ప్రతి వారం నివేదికలను, రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించాలని నిర్ణయించింది. వాతావరణ ముప్పులను ముందే అంచనా వేస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం ద్వారా ఖరీఫ్ పంటలను, రైతుల ఆదాయాన్ని కాపాడవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ భరోసా ఇస్తోంది. -
కంపెనీల ఆదాయాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపనున్నాయి. వీటికి ఎల్‌నినో ఎఫెక్ట్ కూడా తోడు కావడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉంది. సుమారు 100–150 బీపీఎస్ మేర తగ్గొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎల్ నినో పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతినవచ్చు. అలాగే కార్పొరేట్ రంగంలో పలు సంస్థల ఆదాయాలపైనా ప్రభావం పడొచ్చు. ‘క్రూడాయిల్ రేట్లు భగ్గుమనడం, రూపాయి క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరిగిపోవడం కారణంగా 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నిర్వహణ లాభాల మార్జిన్ (ఓపీఎం) 100–150 బేసిస్ పాయింట్ల (ఒకటి–ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉంది‘ అని ఇక్రా వెల్లడించింది. సమీప భవిష్యత్తులో కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్నినోపరంగా డిమాండ్‌కి రిసు్కలు పొంచి ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తోడై కార్పొరేట్ల ఆదాయాల మీద ప్రభావం పడొచ్చని వివరించింది. 2026–27లో కార్పొరేట్ ఇండియా ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కి పరిమితం కావొచ్చని తెలిపింది. 2025–26 క్యూ4లో వార్షిక ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 13.2 శాతంగా నమోదైంది.ధరల పెంపుతో కాస్త ఊరట..పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధనాలు, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. అలాగే రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే ముడి వస్తువుల ధరలూ పెరిగాయి. ఇవన్నీ వెరసి సమీప భవిష్యత్తులో లాభాల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. అయితే, పాక్షికంగానే అయినప్పటికీ ధరలను పెంచడం వల్ల మార్జిన్లపై ఒత్తిడిని కంపెనీలు కొంత మేర అధిగమించవచ్చు. కాకపోతే, హఠాత్తుగా ధరలను పెంచేస్తే డిమాండ్ దెబ్బతిని, పోటీ సంస్థలతో పోలిస్తే వెనుకబడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వేతన జీవుల ఆదాయాలు స్థిరంగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో వినియోగం కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా ఓవరాల్ డిమాండ్‌కి మాత్రం సవాళ్లు తప్పేలా లేవు. క్రూడాయిల్ ధరలు ఎగియడం, రూపాయి క్షీణించడంలాంటి అంశాల వల్ల వినియోగ ఆధారిత రంగాల్లో అమ్మకాల పరిమాణం.. ఆశించినంత స్థాయిలో పెరగకపోవచ్చు. ‘బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పశ్చిమాసియా సంక్షోభం వల్ల నిర్వహణ పరిస్థితులనేవి పెట్టుబడులకు అనువైనవిగా ఉండటం లేదు. తయారీ (డిఫెన్స్, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇతరత్రా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వర్తించే సెగ్మెంట్లు), పవర్ పరికరాలు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లలాంటి కొన్ని నిర్దిష్ట రంగాల్లో మాత్రమే ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి‘ అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ (కార్పొరేట్ రేటింగ్స్) కింజల్ షా తెలిపారు. మధ్యకాలికంగా చూస్తే, అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీల ధరలపరమైన హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ రిసు్కలు మొదలైన అనిశ్చితులను ఎదుర్కొనేందుకు రంగాలవారీ పరిణామాలు, విధానపరమైన చర్యలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నాయనే దానిపై దేశీ కార్పొరేట్ల రుణ పరపతి ఆధారపడి ఉంటుందని షా చెప్పారు. -
ఎల్ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ఎల్ నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ, శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు..పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతలో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తక్కువ పీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్ష మేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది.ఇక ఉత్తర భారతంపై తరచూ ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడి గాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి, తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూరిస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది.అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీని వల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయి, నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురవాల్సిన అవకాశం తగ్గిపోయింది.కాబట్టి ఎల్ నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. అది ఒక్కటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణంలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక వ్యవస్థల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్ నినో అనే ఒకే కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడడం, భూమధ్యరేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతుందన్నదే కీలకంగా మారింది.మొత్తానికి ఈసారి రుతుపవనాల నిలకడ వెనుక ఒకే కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. -
2026 ఎల్ నినో హెచ్చరిక..ఉన్న భయాలు - అసలు నిజాలు
-
ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ: భారతదేశంలో బలహీనమైన రుతుపవనాలకు కారణమయ్యే ఎల్ నినో ప్రభావం ఖరీఫ్ సీజన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో ఎల్ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి సమన్వయంతో కూడిన చర్యలు చేపట్టాలని మంగళవారం ఆదేశించింది. ఎల్ నినో ప్రభావం సాపేక్షంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇతర విభాగాలతో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచించారు. ఖరీఫ్–2026 ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో ముందస్తు అత్యవసర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. వర్షపాతం లోటును దృష్టిలో పెట్టుకొని పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి 12 ఎల్ నినో ప్రభావిత రాష్ట్రాల్లోని 326 జిల్లాలకు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. -
మోగుతున్న ఎల్ నినో ఘంటికలు
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారతదేశంపై ఉండదని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. పసిఫిక్ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కే దశలోకి ప్రవేశిస్తోంది. పసిఫిక్‌లో వేగంగా బలపడుతున్న ఎల్ నినోను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో, ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. మధ్య పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి ‘నినో 3.4’అనే ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్ఎస్టీ) వరుసగా 16వ రోజు కూడా కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్లైమేట్ రీఅనలైజర్ డేటా ప్రకారం.. నినో 3.4 జోన్లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం గమనార్హం. చరిత్రలోనే అత్యంత ప్రతికూల వాతావరణ ఘటనలలో ఒకటిగా నిలిచిన 2015–16 నాటి సూపర్ ఎల్ నినో’ప్రారంభ దశల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, కానీ, ఈ ప్రాంతం అప్పటికే ఎల్ నినో పరిస్థితులకు సంబంధించిన స్థాయికి చేరుకుంది. పొడి వాతావరణమే పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్ నినో ముఖ్య లక్షణం. ఈ వేడి జలాలు వాతావరణ ప్రసరణ సరళిని మార్చేస్తాయి. భారత ఉపఖండంలో రుతుపవన వర్షపాతానికి సహాయపడే వాకర్ సర్క్యులేషన్‌ను బలహీనపరుస్తాయి. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ.. నేడు అనేక ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయింది. వర్షపాతం తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్షాధార ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వేగాన్ని కోల్పోతున్న రుతుపవనాలు ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన కచ్చితంగా దేశంలో కరువు వస్తుందని చెప్పలేమని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. హిందూ మహాసముద్ర డైపోల్, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలతో సహా ఇతర వాతావరణ కారకాలు కొన్నిసార్లు ఎల్ నినో ప్రభావాలను తగ్గించగలవు. అయితే.. ఈ ఏడాది పసిఫిక్ వేడెక్కే వేగం, తీవ్రత అధికంగా ఉండడంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్ నినో ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శక్తివంతమైన ఎల్ నినో, సాధారణం కంటే తక్కువ స్థాయి రుతుపవనాల గమనంతో కూడిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరవచ్చు. పసిఫిక్ మహాసముద్రం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండగా.. దాని ప్రభావంతో భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలోనే రుతుపవనాలు తమ వేగాన్ని, ప్రభా వాన్ని కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మేఘాల జాడలేదు నైరుతి రుతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించడం పరిపాటి. ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు అసాధారణంగా పలుచగా కనిపిస్తున్నాయి. ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. యూరోపియన్ వాతావరణ ఉపగ్రహం మెటియోశాట్ ఐఓడీసీ, అమెరికాకు చెందిన ఎన్ఓఏఏ వాతావరణ ఉపగ్రహం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఇన్సాట్–3డీఎస్ మంగళవారం తీసిన చిత్రాలను గమనిస్తే మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిగా దర్శనిమిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలో కొన్నిచోట్ల మాత్రమే అక్కడక్కడా పలుచటి మేఘాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా రుతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైన పొడి గాలిని సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాలతో కూడిన ‘రుతుపవన ప్రధాన ప్రాంతం’లో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!
ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్‌నినో ప్రారంభమైందని భారతీయ వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ. వర్షం ఎప్పుడు, ఎంత పడుతుందో తెలియదు.. వర్షాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో తెలియదు.. ఉన్నట్టుండి ఎప్పుడు కుండపోత వర్షం పడుతుందో తెలియదు.. ఇటువంటి కరువు పరిస్థితులను రైతులు కొంతమేరకైనా తట్టుకునేందుకు ఉపయోగపడే వ్యవసాయ, నీటి సంరక్షణ పద్ధతులపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.. విత్తన గుళికలుతక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవడానికి విత్తనాలను గుళికలుగా మార్చడం ఎంతో లాభదాయకం. ఈ పద్ధతిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో, రైతులు ఇప్పటికే అనుసరిస్తున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు పొరలుగా (గోనె పట్టా సహాయంతో ఒక ప్రత్యేక పద్ధతిలో) లేపనం చేయడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3–5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మట్టిలో కేవలం 10–15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25–40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగలవు. పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొన్ని రకాల నూనె గింజలు, కొన్ని రకాల కూరగాయ విత్తనాలు విత్తన గుళికల తయారీకి అనువైనవి. కచ్చితంగా 5 సెం.మీ. (2 అంగుళాల) లోతులో మాత్రమే విత్తుకోవాలి.కందకాలుకురిసిన వర్షపు నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపజేసుకుంటే పంటలకు నీటి భద్రత దొరుకుతుంది. అందుకు కందకాలు ఉపయోగపడతాయి. పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. 1 మీటరు లోతు, 1 మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున కందకం తవ్వాలి. రెండు కందకాల మధ్య 5 మీటర్లు ఖాళీ వదలాలి. తవ్విన మట్టిని కందకం లోతట్టు వైపు కట్టగా పోయాలి. ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఎర్ర చల్కా చేను సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్ల రేగడి నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సీనియర్ నేతలను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ – రిటైర్డ్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – రిటైర్డ్) 99638 19074.ఎత్తు మడులుసాగు చేసే పంట ఏదైనా సరే ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పైనే పంటలు విత్తుకోవటమే రైతుకు అన్ని విధాలా మేలని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకుంటే రైతుకు ఆదాయ భద్రత చేకూరుతుందని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు. పత్తి + కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో పాటు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే అనావృష్టి / అతివృష్టి వంటి వైపరీత్యాల నుంచి పంటలను రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుమడులపై పంటల సాగుపై అనేక ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. అనుసరిస్తున్న రైతులు సైతం చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే ఒక పంట దెబ్బతింటే, మరో పంటైనా రైతును ఆదుకుంటుందన్నారు. ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్‌ను 91822 67666 నంబరులో సంప్రదించవచ్చు.లాం ఫారంలో అమ్మకానికి మేలు రకం మిరప విత్తనాలు గుంటూరు సమీపంలోని లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఎల్.సి.ఎ–625, ఎల్.సి.ఎ–643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్ముతున్నట్లు లాం ఫారం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ టి. సుశీల తెలిపారు. ఎల్.సి.ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైనది. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకంలా ఉంటాయి. బెట్టను బాగా తట్టుకొంటుంది. కొంతవరకు జెమిని వైరస్‌ను కూడా తట్టుకొంటుంది. నల్లతామర పురుగు ఉధృతి ఉన్నా కొద్దిపాటి పురుగు మందుల పిచికారీతో అధిక దిగుబడినివ్వగలిగిన రకం. ఎల్.సి.ఎ–625 రకం ఎండు మిరపకు అనువైనది. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటు (45,000–50,000 ఎస్.హెచ్.యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60–65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు చాలా తక్కువగా వస్తాయి.లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రోజు ఉ. 9 గం.–సా. 4 గం. లోపు రైతులు నేరుగా వచ్చి కొనుక్కోవచ్చు. ఒక్క రైతుకు 250 గ్రాముల విత్తనం మాత్రమే రూ. 300లకు అమ్ముతారు. ఇవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపితే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని డా. సుశీల విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 99898 09554 / 94405 92982సేంద్రియ సేద్యంపై ‘అక్షయకల్ప’ ఫెలోషిప్వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపు ణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ’అక్షయకల్ప –రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, నాటు కోళ్ల పెంపకం,బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరు వాత 6 నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకార వేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యం. వివరాలకు.. 89043 96761 / 91132 03476 / 70222 77155 / 89043 96761 నిర్వహణ: పంతంగి రాంబాబు,సాక్షి సాగుబడి డెస్క్ -
మనకు ఎల్ ని‘నో’!
సాక్షి స్పెషల్ డెస్క్ : పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రమైన ‘సూపర్ ఎల్ నినో’పరిస్థితులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. దీనివల్ల సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనా లు బలహీనపడి, వర్షాలు తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. కానీ ప్రస్తుతం ఆ ముప్పు తప్పే అవకాశం ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఒక అరుదైన వాతావరణ పరిస్థితి మనల్ని కాపాడనున్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ పరిస్థితినే శాస్త్రవేత్తలు ‘పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్’ (పాజిటివ్ ఐఓడీ) లేదా ‘ఇండియన్ నినో’అని పిలుస్తున్నారు. ఏమిటీ పాజిటివ్ ఐఓడీ?: హిందూ మహాసముద్రం తూర్పు, పశ్చిమ భాగాల మధ్య ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పునే ‘ఐఓడీ’అంటారు. ఈ పరిస్థితులో పశ్చిమ భాగం (భారత్/ఆఫ్రికా వైపు) సముద్రపు నీరు సాధారణం కంటే బాగా వేడెక్కుతుంది. దీనివల్ల భారీగా తేమతో కూడిన మేఘాలు ఏర్పడతాయి. తూర్పు భాగం (ఇండోనేసియా వైపు)లో నీరు సాధారణం కంటే చల్లబడుతుంది. పసిఫిక్‌లోని ఎల్ నినో మన దేశానికి వచ్చే రుతుపవన గాలులను వెనక్కి లాగేస్తుంటే.. హిందూ మహాసముద్రంలోని ‘ఇండియన్ నినో’ఆ గాలులను అంతే బలంగా మన దేశం వైపు నెడుతుంది. ఫలితంగా ఎల్ నినో తెచ్చే పొడి గాలులు తటస్థంగా మారి, దేశంలో సాధారణ వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 1997 నాటి వాతావరణ అద్భుతం!: ఇలాంటి పరిస్థితి 1997లోనూ చోటు చేసుకుంది. ఆ ఏడాది.. శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్ నినో రావడంతో భారత్‌లో తీవ్ర కరువు ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. కానీ సరిగ్గా అదే సమయంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ‘పాజిటివ్ ఐఓడీ’... ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తిప్పికొట్టింది. ఆ ఏడాది కరువు రాకపోగా.. దేశంలో సాధారణం కంటే 2 శాతం ఎక్కువే వర్షాలు కురిశాయి. వాస్తవానికి ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ దేశంలో కరువు రావాలనేమీ లేదు. అయితే ఈ ఏడాది మనకు ‘ఇండియన్ నినో’రక్షణగా నిలవబోతున్నదన్న అంచనాలు, భారతీయ రైతాంగానికి, సాధారణ ప్రజలకు ఇది పెద్ద ఊరట అనే చెప్పాలి. -
కృష్ణమ్మ ఎడారి!
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ తడారిపోయింది. పరీవాహక ప్రాంతాల్లో ఆశించిన వర్షాలు లేకపోవడంతో నీళ్లు లేని ఎడారిని తలపిస్తోంది. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ జలాశయం వరకు ప్రాజెక్టులన్నింటికీ సగటున 10 వేల క్యూసెక్కుల వరద ప్రారంభం కాగా, ఎల్‌నినో ప్రభావంతో.. ఈ ఏడాది అక్కడి నుంచి ఇక్కడి వరకు అలాంటి పరిస్థితే లేకుండా పోయింది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 12,134 క్యూసెక్కుల వరద నమోదు కాగా.. ఈ ఏడాది జూన్ 13 ఉదయం 9 గంటల సమయానికి కూడా చుక్క నీరు రాకపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఆల్మట్టి వెలవెల: ఆల్మట్టి గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. గతేడాది ఈ సమయానికే నిల్వలు 64.12 టీఎంసీలకు చేరాయి. అయితే ప్రస్తుతం 22.8 టీఎంసీలే ఉండటం గమనార్హం. కృష్ణమ్మ జన్మస్థానమైన మహారాష్ట్రలోని మహాబళేశ్వర్‌లో ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఆల్మట్టి ప్రాజెక్టు వరకు ఉన్న 518 కి.మీ.ల నిడివిలోని పరీవాహక ప్రాంతం నుంచి ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు జలాశయానికి చుక్క నీరు రాకపోవడం ఎగువ పరీవాహక ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు అద్దం పడుతోంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు గతేడాది 10,661 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 1,287 క్యూసెక్కులే వస్తున్నాయి. కృష్ణా ఉప నది భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయినీ జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 5,884 క్యూసెక్కుల వరద రాగా, ఈ ఏడాది ఇప్పటివరకు చుక్క రాలేదు. కృష్ణా మరో ఉప నది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి గతేడాది ఈ సమయానికి 8,269 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం కేవలం 365 క్యూసెక్కులే వచ్చిచేరుతున్నాయి. ఇక తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు గతేడాది 13,967 క్యూసెక్కుల ప్రవాహం రాగా, ప్రస్తుతం 2,596 క్యూసెక్కులే వస్తుండటం గమనార్హం. జూరాల గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా గతేడాది 8.77 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 7.48 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రస్తుత సీజన్లో ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు 3.1 టీఎంసీల వరద వచ్చి చేరగా, 1,500 క్యూసెక్కులు కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం, సాగర్‌లో కరువు ఛాయలు తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కరువు ఛాయలు కమ్మేస్తున్నాయి. పశ్చిమ కనుమలకు 985 కి.మీ.ల దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి గతేడాది ఇదే సమయానికి 12,104 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,352 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, గతేడాది ఈ సమయానికి 56.59 టీఎంసీలకు నిల్వలు చేరితే ప్రస్తుతం 40.87 టీఎంసీలకే పరిమితమయ్యాయి. ప్రస్తుత సీజన్లో శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరిన వరద కేవలం 2.29 టీఎంసీలే కావడం గమనార్హం. ఇక నాగార్జునసాగర్‌కు గతేడాది ఈ సమయానికి 10,890 క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 2,987 క్యూసెక్కులే వస్తున్నాయి. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా గతేడాది ఈ సమయానికి 136.47 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 144.58 టీఎంసీలున్నాయి. ఇందులో ప్రస్తుత సీజన్లో వచ్చి చేరింది 6.04 టీఎంసీలే కాగా మిగతా నిల్వలు గతేడాది వాడుకోగా మిగిలిన జలాలే కావడం గమనార్హం. దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 4,734 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 32.8 టీఎంసీలకు చేరాయి. పశ్చిమ కనుమల నుంచి 1,107 కి.మీ.ల దిగువన ఉన్న సాగర్ వరకు నదీ పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, ఉజ్జయినీ జలాశయాలు నిండిన తర్వాతే దిగువన రాష్ట్రంలో ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్‌కు వరదలు ప్రారంభం కానుండగా, తాజా పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి. నీళ్లు లేకున్నా విద్యుదుత్పత్తి! ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం అంతటా వర్షాలు కురవకపోవచ్చని, కొన్ని విడతల వారీగా వర్షాలు కురిసినా ఆ తర్వాత వర్షాభావం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్‌లో మిగిలి ఉన్న కొద్ది నిల్వలను విద్యుదుత్పత్తి అవసరాలకు తోడిపారేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సాగర్ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా శనివారం తెలంగాణ జెన్కో 3,601 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ 3,378 క్యూసెక్కులు తరలించుకుంటోంది. రోజూ సగటున 2 ఎంయూల చొప్పున.. జూన్ 1 నుంచి 12 మధ్యకాలంలో 25.99 ఎంయూల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కిందికు నీళ్లను విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను తాగునీటి అవసరాలకు సంరక్షించుకోవాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జలాశయాల్లోని నిల్వలు ఆగస్టు వరకు సరిపోతాయని, ఆ తర్వాతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటే మాత్రం తాగునీటికీ ఇబ్బందిపడక తప్పదని అధికారులు అంటున్నారు. -
ఎల్‌నినో ప్రభావం మొదలైంది..!
న్యూఢిల్లీ: ఎల్‌నినో ముప్పు ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంపై ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న నైరుతి రుతుపవన కాలంలో ఈ ఎల్‌నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు 2026 జూన్‌కు సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ఎల్నినోగా పరిగణిస్తారు. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిస్థితులకు అవసరమైన పరిమితిని దాటిపోయినట్లు ఐఎండీ పేర్కొంది. సముద్రం వేడెక్కడంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. సముద్ర–వాతావరణ అనుసంధాన వ్యవస్థ ఇప్పుడు ఎల్‌నినో స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్(ఎంఎంసీఎఫ్ఎఫ్) అంచనాల ప్రకారం.. రుతుపవన కాలం గడుస్తున్న కొద్దీ ఎల్‌నినో తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. మధ్య ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్‌నినో పరిమితిని దాటాయి. ఉపరితలం కింద బలమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎల్‌నినో పరిస్థితిని గణించడానికి ఉపయోగించే ‘నియో 3.4’సూచీకి సంబంధించిన తాజా మూడు నెలల సగటు విలువ +0.5 సెంటీగ్రేడ్ స్థాయిని దాటింది. ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని దీన్నిబట్టి చెప్పొచ్చు. పసిఫిక్ మహాసముద్రంలోని చాలా భాగాల్లో ఉపరితలం కింద కూడా బలమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. రాబోయే రోజుల్లో కిందిభాగంలోని వేడి నీరు ఉపరితలానికి చేరుకోవడం కొనసాగుతుందని, దాంతో ఎల్‌నినో ఉధృతి మరింత పెరుగుతుందని స్పష్టంచేసింది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. జూన్–ఆగస్టు నెలల్లో మధ్య పసిఫిక్ అంతటా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కొనసాగుతాయి. జూలై నుంచి మధ్య, తూర్పు పసిఫిక్ ఎల్‌నినో పరిస్థితులు విస్తరించి, మరింత బలపడతాయి. నైరుతి రుతుపవనాల కాలంలో ఎక్కువ భాగం మితమైన, బలమైన ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. సానుకూల ఐఓడీతో.. ఎల్‌నినో కారణంగా భారతదేశంలో బలహీనమైన రుతుపవన వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, సుదీర్ఘ పొడి వాతావరణ పరిస్థితులు, కరువు ముప్పు పెరగడం వంటివి తలెత్తే అవకాశం ఉంది. అయితే, దేశంలో రుతుపవనాలను ప్రభావితం చేసే అంశం కేవలం ఎల్‌నినో మాత్రమే కాదని ఐఎండీ స్పష్టంచేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంపై తటస్థ ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐఓడీ) పరిస్థితులు నెలకొని ఉన్నాయని, రుతుపవన కాలమంతటా ఇవి కొనసాగే అవకాశం ఉందని తెలియజేసింది. తటస్థ ఐఓడీ అంటే, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావాలను ఇది గణనీయంగా తీవ్రతరం చేయడం లేదా సమతుల్యం చేయడానికి జరిగే అవకాశం తక్కువ అని అర్థం. జూన్ 11న ఎల్‌నినో ఆరంభమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇండియా విషయంలో ఒక సానుకూల అంశాన్ని కూడా ప్రస్తావించింది. జూలైలో సానుకూల ఐఓడీ ఏర్పడే అవకాశం ఉందని, ఇది దేశంలోని రుతుపవన వర్షపాతంపై ‘సూపర్ ఎల్‌నినో’చూపే ప్రతికూల ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడవచ్చని పేర్కొంది. రుతుపవన కాలం కొనసాగుతున్న కొద్దీ, పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూ, నెలవారీ తాజా సమాచారాన్ని జారీ చేస్తామని ఐఎండీ తెలిపింది. -
ఏఐపై పట్టుసాధించండి
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ 11వ పాలకవర్గ సమాశంలో రాష్ట్రాలకు దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్లు, రాబోయే సువర్ణావకాశాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశంచేశారు. 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో గంటల తరబడి సుదీర్ఘంగా మోదీ సమావేశమై పలు అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించి ఫిర్యాదులు, అభిప్రాయాలను స్వీకరించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. వార్షిక సమావేశంలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీఎంలనుద్దేశించి ఆయా రాష్ట్రాల్లో చేపట్టాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై మోదీ ప్రసంగించారు. ‘‘గోప్యత, పారదర్శకత, సామాజిక విలువలను పాటిస్తూనే కృత్రిమ మేధను విరివిగా ఉపయోగించండి. ఏఐతో అందివచ్చే అవకాశాలను ఒడిసిపట్టండి. అత్యంత తీవ్రమైన ఎల్ నినో వాతావరణ ఉపద్రవాన్ని తట్టుకునేలా విధానపర నిర్ణయాలు తీసుకోండి. నీటి సంరక్షణ చర్యలు చేపట్టండి. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూనే పలు రంగాల్లో దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు కృషిచేయండి. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో స్వావలంబనకు బాటలువేయండి. పలు దేశాలతో భారత్ కొత్త వాణిజ్య ఒడంబడికలు చేసుకుంది. ఈ మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల పునరుజ్జీవనానికి పాటుపడండి. తద్వారా ఆయా రంగాల భాగస్వామ్యంతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించండి. సమాఖ్య స్ఫూర్తిని మరోసారి చాటండి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయానికి పాటుపడండి. అప్పుడే రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశంగా సాకారమవుతుంది. ‘వికసిత్ భారత్’ఆవిర్భావం కోసం అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామాల సంకల్పం తీసుకోవాలి. పౌర అవగాహన, సుపరిపాలన ద్వారా మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు వంటి వాటిని కట్టడిచేయండి. చక్కటి పరిపాలన, పారదర్శకత, మౌలిక వసతుల కల్పనతో పెట్టుబడులను ఆకర్షించవచ్చు. స్థానిక వస్తూత్పత్తుల బ్రాండింగ్‌పై దృష్టిపెట్టండి. సులభతర వాణిజ్యానికి తగ్గట్లు విధానపర నిర్ణయాలు తీసుకోండి. డేటా సెంటర్లు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో కొత్త అవకాశాలను ఒడిసిపట్టండి. నవతరం ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనివ్వండి. భవిష్యత్ ఆర్థికవ్యవస్థకు నిపుణ మానవవనరుల అవసరం అత్యావశ్యకం. ఏఐను ఆ కోణంలో అవకాశాల గనిగా భావించండి. మన 70 కోట్ల యువత మనకు అతిపెద్ద ఆస్తి. ఇంతపెద్ద ఆస్తిని దేశాభివృద్ధి ఫలాలిచ్చే ఆదాయ వృక్షాలుగా మార్చండి. దేశంలో రక్షణరంగ ఉపకరణాల తయారీ రంగం వేగంగా విస్తరిస్తోంది. తగు మౌలికవసతుల్ని కల్పించి ఈ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచండి. జిల్లాకో విభిన్న ఉత్పత్తి తరహాలో ఎగుమతులే లక్ష్యంగా వ్యూహాలు రచించండి’’అని రాష్ట్రాలకు మోదీ సూచించారు. సమ్మిళిత మానవాభివృద్ధి ఇతివృత్తంతో సమావేశం జరిగిందని తర్వాత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ లాహిరి తెలిపారు. ‘‘ప్రాథమిక మానవ వనరులు, నవ్యనూతన నైపుణ్యాలు, ఫలవంతమైన ఉపాధి, పరిశ్రమలను స్థాపించే సత్తా, వికేంద్రీకరణ అభివృద్ధి, ఆరోగ్యం, పోషణ, సమానత్వం, అందరికీ గౌరవమర్యాదలు లక్ష్యసాధనగా ఈ సమావేశం జరిగిందని లాహిరి తెలిపారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, జమ్మూకశీ్మర్ ముఖ్యమంత్రులతో మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల సమస్యలపై ఆయా రాష్ట్రాల సీఎంలు చెప్పిన విషయాలను మోదీ విన్నారు. -
తక్కువ కరెంట్‌తో ఎక్కువ కూలింగ్
ఎల్ నినో నేపథ్యంలో వర్షాకాలం మొద లైంది. వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉండగలదని భారత వాతావరణ పరిశోధనా శాఖ (ఐఎండీ) అంచనా. పసిఫిక్ సముద్రంలో రూపుదిద్దుకుంటున్న ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా, భారత్‌లో వర్షపాతం ఈసారి దీర్ఘకాలిక సగటు (ఎల్.పి.ఏ.)లో 90% మేరకు మాత్రమే ఉండగలదని భావిస్తున్నారు. ఎల్ నినో ఉష్ణ ధోరణులు తేమతో నిండిన పవనాలను బలహీనపరుస్తాయి. ఫలితంగా వర్షపాతం కొన్నిచోట్ల మరీ ఎక్కువ, కొన్నిచోట్ల మరీ తక్కువగా ఉంటుంది. దక్షిణాసియాలో సగటుకన్నా తక్కువ వర్ష పాతం ఎల్ నినో ప్రపంచ ప్రభావాలలో ఒకటిగా ప్రపంచ వాతా వరణ సంస్థ (డబ్లు్య.ఎం.ఓ.) పేర్కొంది. మారుతున్న వాతావరణ పరిస్థితి అనివార్యంగా కొన్ని సమస్యలను సృష్టిస్తుంది. దోమలు, ఈగల వంటి ద్వారా సోకే బ్యాక్టీరియా, వైరస్ల జబ్బులు మొదలవుతాయి. ఆహారం, నీటి లభ్యతపై ఒత్తిడి పెరుగుతుంది. విద్యుదుత్పాదన దెబ్బతింటుంది. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వడగాడ్పులు, రాత్రిపూట కూడా ఉష్ణో గ్రతలు ఎక్కువగానే ఉండటానికి సంబంధించిన వార్తలు చూస్తు న్నాం. ఇవన్నీ కలిసి శీతలీకరణ సాధనాలు, పద్ధతుల వైపు ప్రజలు మొగ్గేటట్లు చేస్తాయి. ఫ్యాన్లు, డిజర్ట్ కూలర్లు, సంచార ఎయిర్ కండిషనర్లు (కార్లు, బస్సులు, రైళ్ళలో), చిల్లర్లు, శీతల గిడ్డంగులు వంటివాటికి గిరాకీ పెంచుతాయి. గృహాలు, ఆఫీసులు, ఫ్యాక్టరీలకు వాటి డిమాండ్లకు అనుగుణంగా కూలింగ్ సిస్టంలు అవసరమవు తాయి. దీనికి విండో, స్లి్పట్, సెంట్రలైజ్డ్ ఏసీలను పెంచుకుంటూ పోవడం స్థిరమైన పరిష్కారం అనిపించుకోదు. కొత్త రూమ్ ఏసీలకు 2025–2035 కాలానికి మరో 13–15 కోట్ల యూనిట్లు జోడు కాగలవని అంచనా. ఇవి విద్యుత్ పంపిణీ వ్యవస్థపై భారాన్ని పెంచుతాయి. 2035లో ఉండగలదని భావిస్తున్న లోడులో వీటి వాటాయే దాదాపు 180 గిగావాట్లు! ప్రస్తుతం, వేసవిలో వినియోగం పతాక స్థాయిలో ఉన్న దశలో ఏసీ యూనిట్లు స్వాహా చేస్తున్న విద్యుత్తు సుమారు 60–70 గిగావాట్లని తేలింది. అంతటా వేడి వాడలే!పట్టణాలు, నగరాల్లో కొన్ని ప్రాంతాలు ‘వేడి వాడలు’గా పేరు మోస్తున్నాయి. జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలకన్నా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది. నగరాల్లో ఏసీలు పరిసరాల్లోకి మరింత వేడిని విడుదల చేస్తున్నాయి. ఫలితంగా, శీతలీకరణ యంత్రాలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. అదొక విష వలయం. వీలైనంత తక్కువ విద్యుత్తును గ్రహించి వాతావరణాన్ని చల్లబరచే సిస్టంలను గుర్తించేందుకు మన దేశంలో స్టార్ రేటింగ్ కొలమానం ఉంది. ఏసీలకు ఈ రేటింగ్ సిస్టంను 2009లో ప్రవేశ పెట్టారు. మొదట్లో ఇది స్వచ్ఛంద లేబుల్గా ఉండేది. తర్వాత, తప్పనిసరిగా పేర్కొనాలని నిబంధన తెచ్చారు. తదనంతరం, కనిష్ఠ శక్తి వినియోగ ప్రమాణాల (ఎం.ఇ.పి. ఎస్.)ను ప్రవేశపెట్టారు. తర్వాత, ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషి యన్సీ నిష్పత్తి (సీర్)ని 2015లో అమలులోకి తెచ్చారు. ఈ ప్రమా ణాలు ఏసీ మార్కెట్‌పై కొంత ప్రభావాన్ని చూపాయి. సదరు సాధ నానికి లభించిన స్టార్లను బట్టి వినియోగదారులు రకరకాల ఏసీలు కొనడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వస్తూత్పత్తి సంస్థలు కూడా ఇన్ వెర్టర్ టెక్నాలజీ వంటి మెరుగుదలలతో కొత్త వస్తువులను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాతావరణం పట్టని ఏసీలుఅంతవరకు బాగానే ఉందిగానీ, సాంకేతికపరంగానూ, అమలు లోనూ కొన్ని లోపాలు కొనసాగుతున్నాయి. బర్కిలీలోని యూనివ ర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్ పరిశోధకులు 2025లో ఒక అధ్యయనం నిర్వహించారు. పరీక్షా విధానాలు ప్రాథమికంగా పొడి వాతావరణంలో శీతలీకరణను మదింపు చేస్తున్నాయనీ, భారతదేశంలోని హాట్–హ్యూమిడ్ వాతా వరణంలో కీలకమైన అంశంగా మారే గాలిలో వేడితేమను తగ్గించే లేదా తొలగించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదనీ వారు పేర్కొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, ల్యాబొరేటరీ పరీక్షల్లో ఏసీలు బాగా పనిచేస్తాయి. వాస్తవిక పరిస్థితుల్లో పనితీరు పేలవంగా ఉంటుంది. లేదా విద్యుత్తును ఎక్కువ స్వాహా చేసి ప్రదేశా లను అతి శీతలంగా మారుస్తాయి. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అమలుచేస్తున్న ఎం.ఇ.పి.ఎస్.ల విషయంలో కూడా ఇండియా వెనుకబడే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్‌లోని సగటు యూనిట్‌తో పోలిస్తే ఆ దేశాల్లోని ఏసీలు దాదాపు రెండింతల ఇంధన వినియోగ సామర్థ్యాన్ని కనబరుస్తున్నా యని అధ్యయనంలో వెల్లడైంది. కేంద్రీకృత కూలింగ్ మెరుగుఇండియా కూలింగ్ కార్యాచరణ ప్రణాళిక అనేది మరో ప్రయత్నం. దీనికి 2019లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రణాళిక కింద వివిధ ఐడియాలను పరీక్షించి చూస్తున్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టం (డీసీఎస్) వాటిలో ఒకటి. కొన్ని ఐరోపా నగరాల్లో వాడుకలో ఉన్న సెంట్రలైజ్డ్ హీటింగ్ సిస్టంల తరహాలో దానికి రూపకల్పన చేశారు. డీసీఎస్ కింద కొన్ని భవనాల సముదాయానికి సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం పెడతారు. నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా చేసే పైపుల మాదిరి గానే కూలింగ్ కూడా గొట్టాల ద్వారా పంపిణీ అవుతుంది. అది సమర్థమైన సిస్టంగా పేరు తెచ్చుకుంది. వ్యర్థ జలాలను శుద్ధి చేసి ఆ నీటిని సెంట్రల్ ప్లాంట్ వినియోగించుకుంటుంది. వ్యర్థంగా బయట కొచ్చే వేడిని చిల్లర్లు గ్రహించుకుంటాయి. అదే ఇంట్లోని ఏసీలకైతే రిఫ్రిజిరెంట్ గ్యాసులు అవసరమవుతాయి. కేంద్రీకృత వ్యవస్థ కావడం వల్ల, కూలింగ్ డిమాండ్‌ను మరింత సమర్థంగా నిర్వహించవచ్చు. విమానాశ్రయాలు, ఐటీ సంస్థల సముదాయాలు, పారిశ్రామికవాడలు, విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు వంటిచోట్ల డీసీఎస్ అనువైనది. సింగపూర్, దుబాయ్, ఖతార్, యూఏఈలలో ఇది ప్రయోజనకరమైనదిగా తేలింది. మన దేశంలో ‘శీతలీకరణను కూడా ఒక సేవ’ కింద మార్చడానికి రెగ్యులేటరీ, లీగల్, ఫినాన్షియల్ పరంగా, ఇతరత్రా కొన్ని ప్రతిబంధకాలున్నాయి. కొన్నేళ్ళ క్రితం ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో డీసీఎస్ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగాయిగానీ, వివిధ క్షేత్ర స్థాయి సమస్యల వల్ల అవి ఫలించలేదు. సాపేక్షంగా చూస్తే, గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మాదిరిగా కొత్త ప్రాజెక్టులలో వాటిని అమలులోకి తేవడం తేలిక. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కూడా డీసీఎస్‌ను పొందుపరచనున్నారు. వివిధ నగరాల్లో ఆకాశ హార్మ్యా లతో కొత్త జనావాస ప్రాంతాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో డీసీఎస్‌ను ప్రోత్సహించేందుకు ఇది సరైన సమయం. దేశానికి ఒక సమగ్ర శీతలీకరణ విధానం అవసరం. అది తక్కువ విద్యుత్తుతో ఎక్కువ శీతలీకరణను అందించేందిగా ఉండాలి. వివిధ ప్రాంతాల్లోని పరిస్థితులకు తగ్గట్లుగా శీతలీకరణ సాధనాలకు కొత్త డిజైన్లు అవసరం. నూతన శీతలీకరణ టెక్నాల జీలపై పరిశోధన సాగాలి. అదే సమయంలో, వడగాడ్పులకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతాల్లో చల్లదనాన్ని ఇచ్చే పైకప్పుల వంటి కొత్త ప్రయత్నాలకు సామూహిక స్థాయిలో ప్రయత్నాలు చేయాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
నైరుతి వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. జోగుళాంబ గద్వాల జిల్లా భూభాగంలోకి సోమవా రం ఉదయం రుతుపవనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ రెండో వారంలో ప్రవేశిస్తాయి. గతేడాది రెండు వారాల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించగా... ఈసారి సాధారణ సగటు సమయానికి రెండ్రోజుల ముందు చేరుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారింది.గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో ఉక్కపోత కూడా కాస్త తగ్గింది. రానున్న నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయి. అదేవిధంగా రానున్న 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం, అంతకంటే తక్కువగా నమోదు కావొచ్చని అధికారులు చెబుతున్నారు.పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఎల్‌నినో పరిస్థితులు ఉన్నాయని, ఇవి క్రమంగా బలపడి నైరుతి సీజన్ సమీపించిన తర్వాత ఎల్‌నినో పరిస్థితులు పూర్తిగా కేంద్రీకృతమవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని చెప్పింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కూడా లోటు వర్షపాతం ఉంటుందని శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పలుచోట్ల తేలికపాటి వానలు సోమవారం రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కొనసాగిన ద్రోణి ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో తూర్పు ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం వరకు విస్తరించి ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
గాడ్జిల్లా వచ్చేస్తోంది! భారత్‌పై దాని నీడ పడితే..
గాడ్జిల్లా సముద్రం నుంచి బయటకు వస్తే నగరాలు వణికిపోతాయి. ఎందుకంటే అది సృష్టించే విధ్వంసం కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుంది. అది సినిమా కథ. కానీ ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్జిల్లా’ మాత్రం సైంటిస్టులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం మొత్తం దానివైపు చూస్తుంటే.. భారత్‌కు మాత్రం మరో భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఈ దాని నీడ గనుక పడితే జరిగిన నష్టం.. పెను సంక్షోభానికి దారి తీస్తుంది కాబట్టి!. వాతావరణ ప్రపంచంలో ప్రస్తుతం ఒక్కటే చర్చ నడుస్తోంది. అదే "గాడ్జిల్లా ఎల్ నినో". సాధారణంగా రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి కనిపించే ఎల్ నినో ఈసారి.. అసాధారణంగా బలపడే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), యూరప్‌కు చెందిన ప్రముఖ వాతావరణ అంచనా కేంద్రాలు విడుదల చేసిన తాజా నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి.ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పు. సాధారణంగా పసిఫిక్‌లో వీచే ట్రేడ్ విండ్స్ వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తుంటాయి. కానీ ఎల్ నినో సమయంలో ఆ గాలులు బలహీనపడతాయి. ఫలితంగా వేడి నీరు మధ్య, తూర్పు పసిఫిక్ వైపు వ్యాపిస్తుంది. ఈ ఒక్క మార్పు ప్రపంచ వాతావరణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా గమనించే "నినో-3.4" ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి. ఎల్ నినో ప్రకటించేందుకు అవసరమైన 0.5 డిగ్రీల పరిమితిని ఇది దాటేసింది. డిసెంబర్ నాటికి ఈ వ్యత్యాసం 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉందని యూరోపియన్ ఫోర్కాస్ట్ మోడళ్లు సూచిస్తున్నాయి.అదే జరిగితే 1997-98, 2015-16 సూపర్ ఎల్ నినో రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. అందుకే దీనికి "గాడ్జిల్లా ఎల్ నినో" అనే పేరు పెట్టారు. గాడ్జిల్లాలా.. ఈ ఎల్ నినో కూడా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై భారీ ప్రభావం చూపవచ్చని భావించి ఆ పేరు పెట్టారు. భారత్‌పైనే ఎక్కువ ఎందుకు?గాడ్జిల్లా ఎల్‌నినో గురించి భారత్ ఎక్కువగా ఆందోళన చెందడానికి బలమైన కారణాలే ఉన్నాయి. దేశంలో ఏడాది మొత్తం కురిసే వర్షాల్లో దాదాపు 70 శాతం నైరుతి రుతుపవనాల ద్వారానే వస్తుంది. వ్యవసాయ భూముల్లో సగానికి పైగా ఇప్పటికీ వర్షాధారంగానే సాగవుతున్నాయి. అందుకే వర్షాకాలంలో చిన్న మార్పు వచ్చినా దాని ప్రభావం కోట్లాది మంది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా పడుతుంది.సాధారణంగా ఎల్‌నినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వర్షాలను తీసుకొచ్చే గాలి ప్రవాహాలు తూర్పు వైపుకు మళ్లుతాయి. దీంతో భారత ఉపఖండానికి చేరాల్సిన తేమ తగ్గిపోతుంది. ఫలితంగా రుతుపవనాలు బలహీనపడటం, సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదవడం జరుగుతుంది.ఇప్పటికే భారత వాతావరణ శాఖ (IMD) ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. 1971-2020 మధ్యకాల సగటుతో పోలిస్తే ఈసారి కేవలం 90 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, లోటు వర్షాలు నమోదయ్యే అవకాశం 60 శాతం వరకు ఉందని హెచ్చరించింది.అయితే సమస్య కేవలం వర్షాలు తగ్గడమే కాదు. వర్షాలు తగ్గితే ముందుగా దెబ్బతినేది వ్యవసాయ రంగం. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాల వంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రైతుల ఆదాయం పడిపోవచ్చు. భూగర్భ జలాల నిల్వలు తగ్గవచ్చు. జలాశయాలు పూర్తిస్థాయిలో నిండకపోతే తాగునీటి, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.దీని ప్రభావం చివరికి సాధారణ ప్రజలపై కూడా పడుతుంది. పంటల ఉత్పత్తి తగ్గితే కూరగాయలు, ధాన్యాలు, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్‌నినోను కేవలం వాతావరణ ఘటనగా కాకుండా.. వ్యవసాయం, ఆహార భద్రత, ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక పరిణామంగా చూస్తున్నారు.గతం ఏం చెబుతోందంటే..1997-98లో ప్రపంచం అత్యంత శక్తివంతమైన ఎల్ నినోను చూసింది. 2015-16లో మరోసారి సూపర్ ఎల్ నినో నమోదైంది. ఆ సమయంలో భారత్‌లో సాధారణం కంటే కేవలం 86 శాతం వర్షపాతం మాత్రమే నమోదైంది. పలు రాష్ట్రాలు కరువు బారిన పడ్డాయి. వ్యవసాయ దిగుబడులు తగ్గాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. అయితే అప్పట్లో భారత్‌కు ఒక రక్షణ కవచం లభించింది. అదే ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD). 1997లో బలమైన పాజిటివ్ IOD ప్రభావంతో ఎల్ నినో దెబ్బ కొంతవరకు తగ్గింది. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఐవోడీ తటస్థ స్థితిలోనే ఉండే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించే సహజ మిత్రుడు ఈసారి భారత్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు.ఎల్ నినోను భారత్ వర్షాకాలానికి విలన్‌గా భావిస్తే.. ఐవోడీని హీరోగా చెప్పొచ్చు. ఎల్ నినో వల్ల తగ్గే వర్షాలను కొంతవరకు భర్తీ చేసి, దేశాన్ని కరువు ముప్పు నుంచి కాపాడే శక్తి దీనికి ఉంటుంది. అదెలాగంటే.. ఎల్ నినో వల్ల భారత్‌లో వర్షాలు తగ్గే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో భారత మహాసముద్రంలో ఏర్పడే ఐవోడీ వాతావరణ పరిస్థితి కొన్నిసార్లు రక్షకుడిలా పనిచేస్తుంది. ఇది అనుకూలంగా ఉంటే ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించి, భారత్‌కు అదనపు వర్షాలు కురిసేలా సహాయపడుతుంది.ప్రపంచంపై ప్రభావం..అలాగని గాడ్జిల్లా ఎల్ నినో ప్రభావం భారత్‌కే పరిమితం కాదు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అడవి మంటలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా, పెరూ, ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ప్రపంచ ఆహార ఉత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంట దిగుబడులు తగ్గితే ఆహార ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సరఫరా సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.కరువు ఖాయమేనా?కచ్చితంగా కాదు. ఎల్ నినో ఒక ప్రమాద సంకేతం మాత్రమే. అది తుది ఫలితం కాదు. వర్షాకాలాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్థానిక వాతావరణ పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాల తీరు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయినా సరే.. ప్రపంచ వాతావరణ నిపుణులు ఇప్పుడు పసిఫిక్‌పై ప్రత్యేక నిఘా పెట్టడానికి కారణం ఉంది. ఎందుకంటే ఇది సాధారణ ఎల్ నినో కాదనే సంకేతాలు కనిపిస్తుండడమే. నోట్: ఇది వివిధ వాతావరణ సంస్థలు, శాస్త్రవేత్తల అంచనాల ఆధారంగా రూపొందించిన విశ్లేషణాత్మక కథనం మాత్రమే. వాతావరణ పరిస్థితులు మారే కొద్దీ అంచనాలు, ప్రభావాలు కూడా మారే అవకాశం ఉంటుంది. -
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
ఇక అనుమానాలు అక్కరలేదు. ఈ ఏడాది ప్రపంచదేశాలకు మాత్రమే కాదు.. భారతదేశానికీ గడ్డుకాలమే. చుట్టపుచూపుగా కరవు కాటకాలను పరిచయం చేసి వెళ్లిపోయే ఎల్–నినో ఈ సారి తన విశ్వరూపాన్ని చూపనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు పెచ్చరిల్లుతాయని, సూర్యుడి ప్రతాపం కూడా ఎక్కువ కానుందని తాజాగా ప్రపంచ వాతావరణ సంస్థ సైతం హెచ్చరించింది. ఎక్కడో దక్షిణ అమెరికా ఖండంలోని పసఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు పెరిగితే వచ్చే వాతావరణ మార్పులను ఎల్–నినో అని, చల్లబడితే లా–నినా అంటారని మనకు తెలుసు. భారత్ లాంటి దేశాల్లో లా–నినా అధిక వృష్టికి కారణమవుతూంటుంది. ఈ రెండూ సాధారణంగా 3 నుంచి ఏడేళ్లకు ఒకసారి వచ్చి పోతూంటాయి. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ పరిస్థితిలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తరచూ రావడం ఒక సమస్య అయితే... ఒక్కోసారి ఒక్కోలా ప్రభావం చూపడం రెండో సమస్య. భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ఈ రెండు వాతావరణ అంశాల తీవ్రత పెరిగిపోయింది. వర్షపాతంలో విపరీతమైన తేడాలు నమోదవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎల్–నినో ఏర్పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో కరవు కాటకాలు.. కొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. లా–నినా సందర్భంలోనూ అధిక వర్షపాతాల స్థానంలో నగరాలను ముంచెత్తే క్లౌడ్‌బరస్ట్‌లు తరచూ నమోదు అవుతూండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సూపర్ ఎల్–నినో ఏర్పడుతుందన్న ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సెప్టెంబరు లోగా... ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణ స్థాయిలో ఉంటుందని భారత వాతావరణ సంస్థ ఇప్పటికే తెలిపిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ప్రస్తావించాలి. ఎందుకంటే ఈ అంచనాల్లో సూపర్ ఎల్–నినో ప్రస్తావన లేదు. జూన్ నెలలో ప్రపంచ వాతావరణ సంస్థ వెలువరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకూ సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడేందుకు 80 – 90% అవకాశం ఉంది. ఇప్పటికే అగ్ని గుండాన్ని తలపిస్తున్న వాతావరణానికి ఈ సూపర్ ఎల్–నినో ఆజ్యం పోయనుందని, దీన్ని అత్యవసర వాతావరణ హెచ్చరికగా పరిగణించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ స్వయంగా ప్రకటించడం సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. రెండేళ్ల క్రితం 2023–24 లోనూ సూపర్ ఎల్–నినో ఏర్పడినా ఆ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో ఐదవదిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టెంబరు – నవంబరుల మధ్య సూపర్ ఎల్–నినో పరిస్థితులు ఏర్పడితే దాని ప్రభావం తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకూ ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది కూడా మాడు పగిలే ఎండలు, వడగాడ్పులు తప్పవన్నమాట. ఎండలు పెరిగితే దాని ప్రభావం పంట దిగుబడులపై కూడా ఉంటుందన్నది నిర్వివాద అంశం.మనపై ప్రభావం ఇలా... సూపర్ ఎల్–నినో ప్రభా వం 2026 నైరుతి రుతుపవనాలపై జూలై నెల నుంచి కనిపించడం ప్రారంభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ ఒకటవ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు ముందుకు కదలడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జూలైలో ఉత్తర, మధ్య, పశ్చిమ భారత దేశ ప్రాంతాల్లో వర్షపాతంలో లోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో కరవు పరిస్థితులు రావొచ్చు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో వర్షపాతం తక్కువగా ఉంటుంది. ఆసక్తికరంగా జూలై – ఆగస్టు నెలల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురిసి వరదలు రావచ్చునని అంచనాలు చెబుతున్నాయి. సెప్టెంబరులో ముఖ్యంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఈ సమస్య ఎదురు కావచ్చునని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సూపర్ ఎల్–నినో ప్రభావం కారణంగా 2026– 27 రబీ సీజన్ పంటలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం పడుతుంది. -
ఎల్‌నినో వస్తే ఏమవుతుంది?
పిల్లలూ... ఇటీవల పేపర్లలో, టీవీల్లో ‘ఎల్‌నినో’ అనే మాట వినిపిస్తూ ఉంది. ‘ఎల్‌నినో’ ఉందని, జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎల్‌నినో అంటే ఏమిటి? అది ఎందుకు రాబోతూ ఉంది... ఆ సంగతులు మనకు తెలియాలి కదా.ఎల్‌నినో అంటే?ఎల్‌నినో అనేది స్పానిష్ మాట. అర్థం ‘చిన్న పిల్లవాడు’ అని. కాని ఈ చిన్న పిల్లవాడు తెచ్చేది రాక్షస కరువు. అందుకే ఎల్‌నినో అంటే కరువు రాక్షసుడు. 400 ఏళ్ల క్రితం పెరూ, ఈక్వడార్ దేశాల్లో సముద్రం ఒడ్డున ఉండే జాలర్లు ఒక విషయం గమనించారు. ఒక్కో సంవత్సరం డిసెంబర్ నెలలో, అంటే క్రిస్మస్ టైంకి, సముద్రం నీళ్లు ఒక్కసారిగా వేడెక్కిపోయేవి.అలా వేడెక్కితే చేపలు దొరకవు. సముద్రం ఒక చిన్నపిల్లవాడిలా చేసే ఈ అల్లరిని ముద్దుగా ‘ఎల్‌నినో’ అన్నారు. డిసెంబర్‌కు ముందు ఇలా జరుగుతుంది కాబట్టి డిసెంబర్లో జీసెస్ పుట్టినరోజు కాబట్టి ‘బేబీ జీసస్’ అని కూడా ముద్దుగా పిలిచారు. ప్రకృతి అల్లరి చేస్తే గట్టి తిట్లు తిట్టుకోలేము కదా. అందుకే ఇలా.కారణం ఏమిటి?పసిఫిక్ మహాసముద్రం ఉంది కదా. సౌత్ అమెరికా దగ్గర ఆ సముద్రం నీళ్లు కొన్నిసార్లు బాగా వేడెక్కిపోతాయి. ఒక డిగ్రీ, రెండు డిగ్రీలు ఎక్కువ వేడిగా అయిపోతాయి. సముద్రం వేడెక్కితే దాని పైన ఉన్న గాలి, మేఘాలు, వానలు అన్నీ గందరగోళం అవుతాయి. అది మన దేశం వరకు వచ్చి వాతావరణాన్ని మార్చేస్తుంది. సాధారణంగా పసిఫిక్ సముద్రం మీద తూర్పు నుంచి పడమరకి గాలులు వీస్తాయి. ఆ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు తోసేస్తాయి. దాంతో మన ఇండియా వైపు వాన మేఘాలు వస్తాయి. కానీ 2 నుంచి 7 ఏళ్లకి ఒకసారి ఆ గాలులు బలహీనం అయిపోతాయి. లేదా రివర్స్‌లో వీస్తాయి. అప్పుడు వేడి నీళ్లు తిరిగి సౌత్ అమెరికా వైపు, అంటే పెరూ, ఈక్వడార్ దగ్గర చేరిపోతాయి. వేడి నీళ్లు ఒకచోట కుప్పగా చేరితే సముద్రం వేడెక్కుతుంది. అదే ఎల్‌నినో మొదలు. ఎల్‌నినో వస్తే ఏమవుతుంది?మన ఇండియాలో వానలు తగ్గిపోతాయి. మనకి వానలు తెచ్చే రుతుపవనాలు బలహీనం అవుతాయి. కరువు వస్తుంది. బోర్లు ఎండిపోతాయి. చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. 2026లో హీట్‌వేవ్స్ ఎక్కువయ్యి పంటలు దెబ్బతింటాయి: వరి, గోధుమ, కూరగాయలు పండవు. కూరల రేట్లు పెరిగిపోతాయి. సౌత్ అమెరికాలో మాత్రం వరదలు వస్తాయి. ఆస్ట్రేలియాలో అడవులు తగలబడతాయి. 2015–16లో చాలా పెద్ద ఎల్నినోలు వచ్చాయి. ఇప్పుడు 2024–2026 ఎల్‌నినో వచ్చింది. అందుకే ఈ రెండేళ్లు ఎండలు ఎక్కువ, వానలు తక్కువ. -
ఇంధన ధరల షాక్
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలను ఎదుర్కొంటోందని.. దీనికితోడు ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయరంగం ఉత్పాదకతను దెబ్బతీయొచ్చని ఆర్బీఐ తెలిపింది. అయినప్పటికీ కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, ప్రభుత్వం నుంచి మూలధన వ్యయాలు మెరుగ్గా ఉండడం, పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు, వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని 2025–26 సంవత్సరం ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. ఆర్థిక వృద్ధి.. 2025–26లో విదేశీ వాణిజ్యానికి సంబంధించి ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేసింది. బలమైన ప్రైవేటు వినియోగం, స్థిరమైన పెట్టుబడులు, పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు అనుకూలించాయి. 2026–27 సంవత్సరానికి సైతం బలమైన స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వృద్ధిపై అంచనాలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే పశ్చిమాసియా ఘర్షణ ఎక్కువ కాలం పాటు కొనసాగితే వృద్ధి తగ్గిపోయే రిస్క్ ఉంది. అధిక ఇంధన ధరలు, సరఫరా సమస్యలు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు, వాతావరణ సంబంధిత ప్రతికూలతలు స్వల్పకాలంలో వృద్ధి తగ్గేందుకు, ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీయొచ్చు. వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్ నైరుతి రుతుపవనాల పురోగతి, విస్తరణపైనే 2026–27లో వ్యవసాయ రంగం వృద్ధి ఆధారపడి ఉంటుంది. ఎల్‌నినో పరిస్థితులు వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేయొచ్చు. జూన్–సెప్టెంబర్ నైరుతి కాలంలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 90 శాతంగా ఉండొచ్చంటూ వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించడం గమనార్హం. అదుపులోనే ధరలు.. ద్రవ్యోల్బణం లకి‡్ష్యత శ్రేణిలోనే (4ప్లస్2) ఉండొచ్చు. సరిపడినన్ని ఆహార నిల్వలు, రిజర్వాయర్లలో తగినంత నీటి వనరులు ఉన్నందున ఎల్‌నినో తదితర అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ధరలు అదుపులోనే ఉండొచ్చు. అయితే, అంతర్జాతీయంగా చమురు ధరలు, కమోడిటీ ధరలు పెరిగిపోవడం, తయారీ, వేతన వ్యయాలు అధికం కావడం, కరెన్సీ మారకం విలువపై ప్రభావం పడడం వంటివి ద్రవ్యోల్బణాన్ని పెంచే రిస్క్ కూడా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకుని చూస్తే 2026–27లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతం స్థాయిలో ఉండొచ్చు. ఇంతకంటే కొంత అధికమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రూ.48,021 కోట్ల మోసాలు 2025–26లో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల్లో రూ.48,021 కోట్ల విలువకు సంబంధించి 10,114 మోసం కేసులు నమోదయ్యాయి. 2024–25లో 23,722 కేసులకు సంబంధించి మోసపోయిన మొత్తం రూ.32,803 కోట్లుగా ఉంది. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఆర్థిక మోసాల కేసులు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. మోసపోయిన మొత్తం పెరుగుతూ పోతోంది. కార్డు/ఇంటర్నెట్/డిజిటల్ చెల్లింపులకు సంబంధించి మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. రూపాయి వర్తకం రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు ఆర్బీఐ గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రూపాయి వర్తకం పెరుగుతోంది. 2022 ఆగస్ట్ నుంచి 2025 జూలై మధ్యకాలంలో దిగుమతులకు సంబంధించి ఏటా 20.9 శాతం, ఎగుమతులకు సంబంధించి రూపాయి ఇన్వాయిసింగ్ ఏటా 12.7 శాతం చొప్పున పెరిగింది. 2025–26లో రూపాయి ఇన్వాయిసింగ్ విలువ రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. 2023–24లో ఇది రూ.1.94 లక్షల కోట్లు కావడం గమనార్హం. రూ.20, రూ.500 నకిలీ నోట్లు ఎక్కువ గత ఆర్థిక సంవత్సరంలో 2,29,746 నకిలీ నోట్లను బ్యాంకులు గుర్తించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 5.7 శాతం పెరిగాయి. వీటిల్లో రూ.20, రూ.500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇతర డినామినేషన్ నోట్లలో నకిలీలు తగ్గాయి. వ్యవస్థలో అన్ని నోట్లలోకి రూ.500 నోట్ల చలామణి ఎక్కువగా ఉంది. 2025–26లో 11.2 శాతం పెరిగింది. -
ముంచిన ఎల్‌నినో భయాలు
ముంబై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది 11 ఏళ్ల కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నివేదిక వెల్లడితో ట్రేడింగ్ చివర్లో ఫైనాన్స్, చమురు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాకపోవడం, ఎంఎస్సీఐ సూచీ మార్పులు అమలులోకి రావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,092 పాయింట్లు క్షీణించి 74,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 359 పాయింట్లు పతనమై 23,548 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్ ఒకటిన్నర శాతానికిపైగా పతనంతో, ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.77 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ.465 లక్షల కోట్లకు దిగివచి్చంది. లాభాల్లోంచి భారీ నష్టాల్లోకిఅమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు వార్తలతో క్రూడాయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రథమార్థంలో 352 పాయింట్లు పెరిగి 76,220 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 24,003 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్ సెషన్ నుంచి అమ్మకాలతో తలెత్తడంతో పాటు ట్రేడింగ్ చివర్లో అనూహ్య లాభాల స్వీకరణతో సూచీలు లాభాల్లోంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు క్షీణించి 74,589 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు పతనమై 23,4845 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. రంగాల వారీ ఇండెక్సుల్లో బీఎస్ఈలో ఆయిల్ అండ్ గ్యాస్ 2.75%, మెటల్ 2.30%, వినిమయ 2.23%, హాస్పిటల్స్ 2.16%, ఇంధన 2.08%, కమోడిటీస్ 1.94%, ఆటో 1.90%, సరీ్వసెస్ 1.58 శాతం పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 1.26%, మిడ్ క్యాప్ ఇండెక్సు 0.73 శాతం నష్టపోయాయి. నాలుగు షేర్లకు మాత్రమే లాభాలు: సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), హెచ్‌సీఎల్‌టెక్ (1.65%), ఎల్అండ్టీ (0.76%), ఇన్ఫోసిస్ (0.05%) మాత్రమే లాభపడ్డాయి. మరోవైపు, అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్( –2.18%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (–1.81%), ఐసీఐసీఐ బ్యాంక్ (–1.32%), ఎంఅండ్ఎం(–2.72%), బజాజ్ ఫైనాన్స్ (–2.82%) షేర్లు నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ కోల్పోయిన పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 600 పాయింట్లు కావడం విశేషం.నష్టాలు ఎందుకంటేఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువగా, గత 11 ఏళ్ల కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నివేదికలో వెల్లడి కావడం మార్కెట్‌ను నిరాశపరిచింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఆహార ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న ఆందోళనలు అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ 60 రోజులు పొడిగింపు ఒప్పందం కుదిరినా, ట్రంప్ ఆమోదం లభించలేదు. ఇరాన్ యురేనియం నిల్వల అంశంపై స్పష్టత కొరవడడంతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ మేలో 19 సెషన్లలో 14 రోజులు నికర అమ్మకందారులుగా నిలిచి, శుక్రవారం రూ.21,106 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎంఎస్సీఐ సూచీల పునర్వ్యవస్థీకరణ ప్రభావం కనిపించింది. ఎంసీఎక్స్, ఇండియన్ బ్యాంక్ ప్రధాన సూచీలో చేరగా, ఆర్వీఎన్ఎల్, కల్యాణ్ జ్యువెలర్స్‌తో పాటు 12 స్మాల్‌క్యాప్ స్టాక్‌లు వైదొలిగాయి. -
IMD బిగ్ షాక్ నైరుతి వర్షాలపై ఎల్-నినో ఎఫెక్ట్
-
అగ్నికి ఆజ్యం.. ఎల్‌నినోకు ‘లూ’ గాలుల తోడు
సాక్షి, అమరావతి: ఎల్‌నినో పరిస్థితులకు తోడు ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోకి వాయవ్య దిశ నుంచి తీవ్రమైన పొడి వేడి గాలులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఈ గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయానికి తీవ్రమైన వడగాలులుగా మారుతున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే ఈ గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. ఇవి సముద్రం నుంచి కాకుండా పూర్తిగా భూమి మీదుగా ప్రయాణిస్తూ దారిలో ఉన్న తేమను పూర్తిగా లాగేసుకుంటున్నాయి. మన వద్దకు వచ్చేటప్పుడు తూర్పు కనుమలను దాటే సమయంలో ఈ గాలులు కిందకు దిగడంతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. సైన్స్ పరిభాషలో దీన్ని కంప్రెషనల్ హీటింగ్గా పిలుస్తారు. చల్లని గాలుల్ని అడ్డుకుంటున్న వాయువ్య గాలులు పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే ఈ తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలులు భూమి మీదకు రావడంలేదు. దీంతో తీరప్రాంతాల్లో గాలిలో తేమ 80 శాతానికిపైగా తగ్గిపోతోంది. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటివల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివేమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు వెళుతూ సముద్రంలోని చల్లని గాలుల్ని తీసుకుపోయింది. దీంతో మన ప్రాంతం మరింత వేడెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్న రోజులు వేడిసెగలే ఉండనున్నాయి. ఎల్‌నినోతో తలకిందులైన వాతావరణ చక్రం ప్రస్తుత ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్‌నినో అని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినోగా పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. ఇంకా సూపర్ ఎల్‌నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోకపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్లు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా మన వాతావరణ చక్రం తలకిందులైంది. నైరుతి ఆలస్యమే ఈ ప్రభావం నైరుతి రుతుపవనాలపైనా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి బలహీనంగా మారతాయని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల కిందటే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలడంలేదు. అవి అక్కడే నిలిచిపోవడంతో ఈ నెలాఖరుకు అవి కేరళను తాకడం అనుమానమే. దీంతో ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా అవి విస్తరించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండదని ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. లూ గాలులు అంటే.. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. -
పంటల దిగుబడులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం : ఐసీఏఆర్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీని కారణంగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వెల్లడించింది. గతంలో ఇదేమాదిరి ఎల్‌నినో పరిస్థితులు తలెత్తినప్పుడు వరి సహా మొక్కజొన్న, సజ్జ వంటి వర్షాధార పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఈసారి పంటల దిగుబడులు కనీసం 10 శాతం మేర తగ్గుతాయని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలతో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. జూన్– సెప్టెంబర్ మధ్య కాలంలో తక్కువ వర్షాల కారణంగా నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2002, 2004, 2009 సీజన్లలో ఎల్‌నినో ఏర్పడినప్పుడు 77 జిల్లాల్లో వరి దిగుబడి 10 శాతానికి పైగా పడిపోగా, మొక్కజొన్న ఉత్పత్తి 65 జిల్లాల్లో ఇదే స్థాయిలో తగ్గినట్లు గుర్తించింది. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో వరిపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపించి నట్లు తెలిపింది. ఇదే సమయంలో జొన్న, సజ్జ దిగుబడులు కూడా 36 జిల్లాల్లో 10 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించామంది. వర్షాధార ప్రాంతాలే ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని వివరించింది. ఈ ఏడాది సైతం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఐసీఏఆర్ సూచించింది. కరువును తట్టుకునే విత్తనాల ప్రోత్సాహం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ, ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల అమలు ద్వారా రైతుల నష్టాలను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్? -
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్‌ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భారత్‌లోనూ సూపర్ ఎల్‌నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్‌లో సూపర్ ఎల్ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్‌లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్‌లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్ లేదా జూలైకల్లా సూపర్ ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు. 1997, 2015లో ఎల్‌నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి ఎలా ఉండొచ్చు? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్–సెప్టెంబర్(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్‌లో ఈసారి జూన్‌లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్ ఎల్ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్‌లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్‌లో వర్షపాతం తగ్గొచ్చు. లద్దాఖ్, రాజస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్‌లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
ముంచుకొస్తున్న మహా కరువు
-
సూపర్ ఎల్‌నినో వస్తోందా?
పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా బహుశా ‘సూపర్ ఎల్‌నినో’ అనే వాతావరణ సన్నివేశం వస్తున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా వాతావరణం గురించి పరిశోధనలు జరుగుతున్న చోట్ల చాలా బలమైన ఎల్ నినో పరిస్థితి ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో రావచ్చు అన్న సూచనలు అందుతున్నాయి.అది మరి ముందు ఎప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ఈ పరిస్థితిని కొందరు ‘గాడ్జిల్లా ఎల్ నినో’ అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరవులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవ త్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా. అసాధారణమైన వాతా వరణ పరిస్థితులు రాబోతున్నాయని ఈ విషయం గురించి వ్యాఖ్యానించిన యునైటెడ్ కింగ్డమ్ వారి నేషనల్ వెదర్ సర్వీసెస్ పరిశోధకులు ఆడం స్కైఫే అంటున్నారు. ఎల్‌నినో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఎల్‌నినో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తుంది అనుకుంటున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితి అప్పుడపుడూ వస్తూ ఉంటుంది. 1982–83, 1997–98 ఆ తరువాత 2015–16లలో వచ్చింది ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగితే దానిని సూపర్ ఎల్నినోగా భావిస్తారు. మార్చి నెలలోనూ, ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతున్నది. బలమైన ఎల్‌నినో రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు.సెప్టెంబర్ మాసం కల్లా ఉష్ణోగ్రతలో తేడా రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. ‘యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్ట్’ వారు బలమైన ఎల్ నినో వచ్చే పరిస్థితి 50 శాతం వరకు ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వారు ఆ అవకాశం 25 శాతం మాత్రమే అంటున్నారు. యూరప్‌లోని గ్రూపులు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతా మార్పులు వస్తాయనీ, వేడి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుతుందనీ అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్‌నినో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. జూన్ మాసం సగం గడిచిన తరువాత ఈ విషయం గురించి కచ్చితంగా చెప్పే వీలు ఉంటుంది.ప్రభావం ఎలా ఉంటుంది?ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోతాయి. ఫలితంగా పంటలు సరిగా పండకపోవడం, సముద్ర తీరాలలోని పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు... ఆ యా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. ‘పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు’ అంటారు పరిశోధకులు టిమ్ స్టాక్‌డేల్. ‘పెద్ద ఎత్తున తుపానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకు ముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు’ అంటారాయన.ఉత్తర, దక్షిణ అమెరికాలలో, అటు ఆఫ్రికా, చైనా లలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమ యంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలు, భారతదేశం, అమెజాన్ ప్రాంతాల్లో పొడి వాతావరణం బాగా పెరిగి కరవులు, హీట్ వేవ్‌లు, అడవులు తగలబడటం లాంటివెన్నో జరగవచ్చు. యూకే, ఇతర యూరప్ దేశాలలో ప్రభావాలు మరింత బలంగా ఉంటాయి. అక్కడ వేసవి వేడి మరింత తీవ్రంగా ఉండే వీలుంది. చలికాలంలో తేమ ఎక్కువయ్యి అననుకూల పరిస్థితులు ఎదురు కావచ్చు. వాతావరణం మారుతున్నది, ప్రపంచం వేడెక్కుతున్నది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. ఈ పరిస్థితి సముద్రంలో తీరానికి తోసుకువస్తున్న ఒక అల లాంటిది అయితే, ఈ ఎల్ నినో అన్నది ఉవ్వెత్తున వచ్చి ముంచెత్తే చాలా పెద్ద అల అని చెప్పవచ్చు.వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత. -
'మే' లో మహా ప్రళయమే.. సూపర్ మెగా ఎల్ నినో వచ్చేస్తోంది జాగ్రత్త
-
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’
మన చుట్టూ ఉన్న పర్యావరణంలో అతి త్వరలో ఊహకందని పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రపంచ జనాభాలో కోట్లాది మందిని బలితీసుకున్న ఆ ‘చీకటి రోజులు’ మళ్లీ రాబోతున్నాయా? అవునంటున్నాయి.. వాతావరణ శాస్త్రవేత్తల తాజా హెచ్చరికలు. ఈ ఏడాది (2026)లో సంభవిచబోయే ‘సూపర్ ఎల్ నినో’ కేవలం ఉష్ణోగ్రతలను పెంచడమే కాదు, గ్లోబల్ ఎకానమీని కూడా కుదిపేసే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ ఈ ముప్పును ఎలా ఎదుర్కోబోతోంది? పసిఫిక్ సముద్రపు అలల వెనుక దాగి ఉన్న ఆ నిగూఢ వాతావరణ రహస్యాలపై ప్రత్యేక విశ్లేషణ..ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మాన్ (Ryan Maue) 2026లో అత్యంత శక్తివంతమైన ‘ఎల్ నినో’ (El Niño) ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని 1877లో సంభవించిన భయంకరమైన ఎల్ నినోతో పోలుస్తున్నారు. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా కరువుకాటకాలు వచ్చి, సుమారు మూడు నుండి 4 శాతం జనాభా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజా విశ్లేషణల ప్రకారం 2026లో కూడా అలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.ఎల్ నినో అంటే ఏమిటి?ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కే ప్రక్రియ. దీనివల్ల ప్రపంచవ్యాప్త గాలి దిశలు, వర్షపాత పద్ధతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా ఎల్ నినో సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలు తగ్గి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం, ప్రస్తుతం తటస్థంగా ఉన్న పరిస్థితులు మే-జూలై నాటికి ఎల్ నినోగా మారే అవకాశం 61 శాతం మేరకు కనిపిస్తున్నాయి.2026 అంచనాలు: రికార్డు స్థాయి వేడిప్రస్తుత అంచనా వివరాల ప్రకారం ఈసారి ఎల్ నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం (25 శాతం) వరకు ఉంది. అక్టోబర్ 2026 నాటి ఉష్ణోగ్రతల మ్యాప్‌లను గమనిస్తే, ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలో (Northern Hemisphere) సగటు కంటే ఎక్కువ వేడి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటలపై, వాతావరణంపై తీవ్ర ప్రభావం పడి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది.1877- 2026 మధ్య వ్యత్యాసం1877-78 కాలంలో వచ్చిన ఎల్ నినో సమయంలో సరైన సాగునీటి సౌకర్యాలు, వాతావరణ ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల కోట్లాది మంది ఆకలితో మరణించారు. అయితే 2026లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనుంది. ఆధునిక నీటిపారుదల వ్యవస్థలు, వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలు, ప్రభుత్వాల అప్రమత్తత వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం చాలా తక్కువ. 1877లో జరిగింది.. మానవ తప్పిదాల వల్ల సంభవించిన విపత్తు అయితే, 2026లో వాతావరణ పరమైన సవాళ్లు ప్రపంచాన్ని వెంటాడనున్నాయి.భారతదేశంలో ఏం జరగనుంది?భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి వర్షాధారిత ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మెరుగైన సాగునీటి ప్రాజెక్టులు ఉండటం వల్ల కొంత ఊరట లభించనుంది. ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడితే ఆహార ధరలు పెరగడం, గ్రామీణ పరపతి రంగంపై ఒత్తిడి పడటం వంటి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో కేవలం ఆహార సంక్షోభమే కాకుండా, విపరీతమైన హీట్‌వేవ్‌లు (వడగాల్పులు), తుపానులు, ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. ఇది గ్లోబల్ సప్లై చైన్‌పై ప్రభావం చూపి, ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. ఏదిఏమైనప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకలి చావుల వంటివి సంభవించే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా చదవండి: పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్లో హై టెన్షన్ -
చావుకబురు ‘చల్లగా’.. అక్టోబర్ నుంచే ఎముకలు కొరికే చలి..
ఈ సంవత్సరం చివర్లో లా నినా పరిస్థితులు తిరిగి రావచ్చని, ఇది ప్రపంచ వాతావరణ నమూనాలను నిర్ధేశ్యించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన శీతాకాలాన్ని సాధారణం కంటే చాలా చల్లగా మార్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. రానున్న అక్టోబర్ డిసెంబర్ 2025 మధ్య లా నినా అభివృద్ధి చెందడానికి 71 శాతం అవకాశం ఉందని సెప్టెంబర్ 11న నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఇది అలాగే కొనసాగి డిసెంబర్ 2025 నుంచి తగ్గడం మొదలవుతుందని ఫిబ్రవరి 2026 మధ్యకు వచ్చేసరికి 54%కి తగ్గుతుందని వెల్లడించింది. కానీ లా నినా వాచ్ అప్పటికీ ప్రభావం చూపుతూనే ఉంటుందంది.ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (ఇఎన్‌ఎస్‌ఓ) శీతలీకరణ దశ అయిన లా నినా, భూమధ్యరేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను మారుస్తుంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై చాలా గాఢమైన ప్రభావాలను చూపుతుంది. ఈ ప్రభావం భారతదేశంపైన ఎలా ఉంటుంది అనే విషయానికొస్తే, ఇది తరచుగా సాధారణం కంటే చల్లగా ఉండే శీతాకాలాలను మనం ఎదుర్కోవలసి రావచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారత పౌరాణిక విభాగం (ఐఎమ్‌డి) తన ఇటీవలి తన ఇఎన్‌ఎస్‌ఓ బులెటిన్‌లో భూమధ్యరేఖ పసిఫిక్‌పై ప్రస్తుతం తటస్థ పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది అంటే ఎల్ నినో లేదా లా నినా పరిస్థితి లేదు). ఐఎమ్‌డి కి చెందిన మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ (ఎమ్ఎమ్సిఎఫ్ఎస్) ఇతర అంచనాలు, ఈ తటస్థ పరిస్థితులు రుతుపవనాల సీజన్ మొత్తం కొనసాగుతాయని తేల్చాయి. అయితే రుతుపవనాల తర్వాత నెలల్లో లా నినా ఆవిర్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేశాయి.ఈ నమూనాలు ఈ సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ (50% కంటే ఎక్కువ) మధ్య లా నినా అభివద్ధి చెందే అవకాశాలను చూపిస్తున్నాయని ఐఎమ్‌డి శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. వాతావరణ మార్పులు భూ ఉపరితలం వేడెక్కడం ప్రభావం కొంతవరకు దీనిని భర్తీ చేయగలదు, లా నినా ఉన్న శీతాకాలాలు అది లేని సంవత్సరాలతో పోలిస్తే మరింత చల్లగా ఉంటాయని స్పష్టం చేశారు.ప్రైవేట్ ఫోర్కాస్టర్ స్కైమెట్ వెదర్ అధ్యక్షుడు జిపి శర్మ మాట్లాడుతూ స్వల్పకాలిక లా నినా ఎపిసోడ్‌ను తోసిపుచ్చలేమని అన్నారు. ‘పసిఫిక్ మహా సముద్రం ఇప్పటికే సాధారణం కంటే చల్లగా ఉంది, అయినప్పటికీ లా నినా పరిమితుల వద్దకు ఇంకా రాలేదు. అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు –0.5నిఇ కంటే తక్కువగా పడిపోయి అదే విధంగా కనీసం మూడు త్రైమాసికాల పాటు కొనసాగితే, దానిని లా నినాగా ప్రకటిస్తారు.2024 చివరిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నవంబర్ నుంచి జనవరి వరకూ లా నినా పరిస్థితులు కాస్త కనిపించి, మళ్ళీ తటస్థంగా మారిందన్నారు. కొనసాగుతున్న పసిఫిక్ శీతలీకరణ ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని శర్మ అన్నారు. ‘లా నినా ప్రారంభమైతే ఏర్పడే పొడి శీతాకాలాల కోసం అమెరికా ఇప్పటికే అప్రమత్తంగా ఉంది. భారత దేశానికి, చల్లటి పసిఫిక్ జలాలు సాధారణంగా కఠినమైన శీతాకాలాలుగా మారతాయి.ముఖ్యంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలలో హిమపాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది‘ అని ఆయన అంచనా వేస్తున్నారు. మొహాలి (పంజాబ్)లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) బ్రెజిల్‌లోని నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ చేసిన 2024 అధ్యయనం ప్రకారం, ఉత్తర భారతదేశంపై తీవ్రమైన చలి తరంగాలను ప్రేరేపించడంలో లా నినా పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ‘లా నినా సమయంలో దేశంలోకి చల్లని గాలి ప్రవేశిస్తుంది. ‘ఎల్ నినో, తటస్థ సంవత్సరాలతో పోలిస్తే లా నినా సంవత్సరాల్లో శీతల తరంగ సంఘటనల ఫ్రీక్వెన్సీ వ్యవధి కూడా ఎక్కువగా ఉన్నాయి‘ అని అధ్యయనం తేల్చింది. -
‘ఊపిరితిత్తు’లకు చిల్లు!
ఎండి పగుళ్లిచ్చిన నేల. నీటిచుక్క ఆనవాలు కూడా లేని తీరాల్లో బారులు తీరిన బోట్లు. కొంతకాలంగా బ్రెజిల్‌లోని ప్రధాన నదులన్నింట్లోనూ కనిపిస్తున్న దృశ్యాలివి. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు. మరోవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులు. వీటి దెబ్బకు ఈ సీజన్లో దాదాపుగా ప్రతి నదీ రికార్డు స్థాయిలో కుంచించుకుపోయింది. రాజధాని బ్రెజీలియాతో పాటు పలు ప్రధాన నగరాలు వరుసగా 140 రోజులుగా వాననీటి చుక్కకు కూడా నోచుకోని పరిస్థితి! దేశంలో 60 శాతానికి పైగా వరుసగా రెండో ఏడాది కరువు గుప్పెట్లో చిక్కింది. గతేడాదితో పోలిస్తే పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి చందంగా విషమిస్తున్నాయి. ఫలితంగా 1950 తర్వాత అతి పెద్ద కరువుతో బ్రెజిల్ అల్లాడుతోంది. దీన్నిప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించారు. అమెజాన్ వర్షారణ్యాలకు పుట్టిల్లయిన బ్రెజిల్లో ఈ అనూహ్య పరిస్థితి సైంటిస్టులను ఆందోళనపరుస్తోంది. అయ్యో.. రియో... అమెజాన్ ఉపనదుల్లో అతి పెద్దదైన రియో నెగ్రో అయితే ఎన్నడూ లేనంతగా ఎండిపోయింది. నదిలో నీటిమట్టం కొద్ది నెలలుగా ఏకంగా రోజుకు ఏడంగుళాల చొప్పున తగ్గిపోతూ కలవరపెడుతోంది. దాంతో నలుపు రంగులో నిత్యం అలరించే అపార జలరాశి మాయమై ఏకంగా నదీగర్భమే బయటపడింది. రియో నిగ్రోలో కలిసే సొలిమెస్ నదిదీ ఇదే దుస్థితి. దాని నీటిమట్టం ఈ నెలలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ రెండు నదులు కలిసిన మీదట అమెజాన్‌గా రూపొందుతాయి. వీటిలో నిత్యం తిరగాడే రవాణా నౌకలు కొంతకాలంగా నదీగర్భాల్లోని విస్తారమైన ఇసుకలో కూరుకుపోయి కని్పస్తున్నాయి. సొలిమెస్ తీరాన ఉండే టెఫ్ సరస్సులో కూడా నీళ్లు దాదాపుగా నిండుకున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఈ సరస్సు ఊహాతీతంగా చిక్కిపోయిన తీరు పర్యావరణ నిపుణులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతేడాది రికార్డు ఎండలు, కనీవినీ ఎరగని కరువు దెబ్బకు ఈ సరస్సులో 200కు పైగా డాలి్ఫన్లు మృత్యువాత పడ్డాయి. ఈసారి పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా కనీసం రోజుకొకటి చొప్పున డాల్ఫిన్లు మరణిస్తున్నాయి. మరో నెలన్నర దాకా ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ఫలితంగా బ్రెజిల్ చరిత్రలోనే తొలిసారిగా జల వనరుల్లో అత్యధికం పూర్తిగా ఎండిపోయినా ఆశ్చర్యం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దారుణ పర్యవసానాలు బ్రెజిల్లో నదులు, సరస్సులు అడుగంటితే పర్యవసానాలు దారుణంగా ఉండనున్నాయి. ఆహారం మొదలుకుని రవాణా దాకా అన్నింటికీ వీటిపైనే ఆధారపడే స్థానికుల పరిస్థితి దయనీయంగా మారుతుందన్నారు అమెజాన్ పర్యావరణ పరిశోధన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆండ్ర్ గుయ్మే ర్స్. ఇలాంటి పరిస్థితిని తన జీవితకాలంలో ఎన్న డూ చూడలేదని చెప్పుకొచ్చారు. నదీ ప్రవాహాలు దాదాపుగా ఎండిపోతున్న పరిస్థితులు చరిత్రలో బహుశా ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. మరోవైపు తీవ్రమైన వేడి పరిస్థితులు అమెజాన్ అడవులతో పాటు పొరుగునే ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చిత్తడి నేలలైన పంటనల్స్లో కూ డా కార్చిచ్చులకు కారణంగా మారుతున్నాయి.అమెజాన్. ఈ పేరు వింటూనే సతత హరితారణ్యాలు, అపారమైన జీవవైవిధ్యం, అంతులేని జలవనరులు గుర్తుకొస్తాయి. ప్రపంచానికే ఊపిరితిత్తులుగా అమెజాన్‌కు పేరు. కానీ వాటికిప్పుడు నిలువెల్లా చిల్లులు పడుతున్నాయి. ప్రపంచ నదుల్లోకెల్లా పెద్దదైన అమెజాన్ క్రమంగా కుంచించుకుపోతోంది. దాని ప్రధాన జల వనరులైన అతి పెద్ద ఉపనదులన్నీ కనీవినీ ఎరగనంతగా ఎండిపోతున్నాయి. అమెజాన్ పరీవాహక ప్రాంతాల్లో ప్రధాన దేశమైన బ్రెజిల్లో ఈ ధోరణి కొట్టిచి్చనట్టుగా కాన్పిస్తోంది. ఈ పరిణామం పర్యావరణవేత్తలనే గాక ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులను కూడా ఎంతగానో కలవరపెడుతోంది... – సాక్షి, నేషనల్ డెస్క్ కారణమేమిటి?కరువు పరిస్థితులకు దారి తీసే ఎల్ నినో గతేడాది బ్రెజిల్‌ను అల్లాడించింది. ⇒ ఈ ఏడాది దాని తీవ్రత తగ్గినా దేశవ్యాప్తంగా వాతావరణంలో వేడి పరిస్థితులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ అసాధారణ వేడి పరిస్థితులు సమస్యను మరింత పెంచుతున్నాయి. ⇒ అమెజాన్ అంతటా విచ్చలవిడిగా కొనసాగుతున్న అడవుల నరికివేత తాలూకు దుష్పరిణామాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లుగా కన్పిస్తున్నాయి. ⇒ పచ్చదనం విపరీతంగా తగ్గిపోతుండటంతో ఎండలు పెరుగుతున్నాయి. వానల క్రమం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ⇒ అమెజాన్ బేసిన్లో గతేడాది వచ్చిన తీవ్ర కరువుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్వర్క్ తేల్చింది. ⇒ బ్రెజిల్లో జరుగుతున్నది ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పుల తాలూకు స్థానిక ప్రభావమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. -
జూలై–సెప్టెంబర్‌కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
AP: రోహిణి ప్రభావం లేనట్టే!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం:ఎల్‌నినో ప్రభావం తగ్గి.. లానినో పరిస్థితులు ఏర్పడడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గిపోయింది. అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్లబడింది. ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకు ఎల్‌నినో కొనసాగింది. ఏప్రిల్ నుంచి తగ్గుతూ లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గింది. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె మొదలవుతున్నా.. దాని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతలు ఉన్నా 40 డిగ్రీలలోపే నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనాల్లో ఏమైనా మార్పులు ఉంటే ఒకటి, రెండు రోజులు ఎండలు పెరిగే అవకాశం ఉంటుందని, మార్పులు లేకపోతే ఆ ఎండలు కూడా ఉండవని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండటం, అరేబియన్ మహాసముద్రం నుంచి గాలులు వీస్తుండటం, తమిళనాడు, బంగాళాఖాతం వైపు నుంచి కూడా గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, కోస్తాలోని కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ముందుగానే నైరుతి రుతుపవనాలుఅనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన ద్రోణి తుపానుగా మారకుండా ఉంటే.. రుతుపవనాలు ముందే కేరళను తాకవచ్చని చెబుతున్నారు. ఆ ద్రోణి బలపడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఒకవేళ అది బలపడి తుపానుగా మారితే రుతుపవనాలు కొంత ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే బంగాళాఖాతంలో అండమాన్ పరిసరాల్లో ఈ నెలాఖరుకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది బలపడితే నైరుతి రుతుపవనాలు ఇంకా వేగంగా విస్తరించవచ్చని చెబుతున్నారు. ఏదైనా ఈ నెలాఖరుకల్లా రుతు పవనాలు కేరళను తాకవచ్చని.. జూన్ 1కల్లా ఏపీకి విస్తరించవచ్చని అంచనా వేస్తున్నారు.నేటి నుంచి వర్షాలుద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శనివారం ప్రకాశం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. ఈ మూడు రోజులు వానలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని తెలిపింది. గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కాగా.. శనివారం శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో ఆరు, పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. -
India Meteorological Department: ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎండలు, వడగాడ్పులతో అల్లాడుతున్న వేళ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు మోసుకొచ్చింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో దేశంలో సమృద్ధిగా వానలు కురుస్తాయని శుభవార్త చెప్పింది. ‘లా నినో’ వాతావరణ పరిస్థితులు కలిసిరావడంతో దేశంలో ఈసారి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనావేసింది. వాతావరణ శాఖ అంచనా వివరాలను కేంద్ర భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ సోమవారం ఢిల్లీలో వెల్లడించారు. ‘‘దీర్ఘకాల సగటు వర్షపాతం 106 శాతం మేర పడొచ్చు. అంటే 87 సెంటీమీటర్లకు మించి నమోదు కావచ్చు. ప్రస్తుతం భూమధ్య రేఖ పసిఫిక్ ప్రాంతంలో మధ్యస్థ ఎల్‌నినో పరిస్థితులున్నాయి. ఈ ఎల్ నినో (వర్షాభావ పరిస్థితులు) నైరుతి రుతుపవనాల ప్రవేశం (జూన్) నాటికి బలహీనపడి, ద్వితీయార్థంలో లా నినో (వర్షాలకు అనుకూల) పరిస్థితులు ఏర్పడనున్నాయి. గడచిన మూడు నెల్లో ఉత్తరార్థ గోళం, యూరేసియాలో మంచు సాధారణం కన్నా తక్కువగా ఉంది. దీంతో ఈసారి భారత్‌లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదు కావచ్చు’’ అని పేర్కొన్నారు. దేశ సాగు విస్తీర్ణంలో 52 శాతం పంటలు వర్షాధార పంటలే. రిజర్వాయర్లు అడుగంటి తాగునీటికి సైతం జనం కష్టాలు పడుతున్న ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రకటన రైతాంగాన్ని భారీ ఊరటనిస్తోంది. అయితే వాయవ్య, తూర్పు, ఈశాన్య భారతావనిలోని కొన్ని ప్రాంతాత్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనావేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్లలో వర్షపాత వివరాలను ఐఎండీ వెల్లడించలేదు. గత 50 ఏళ్ల సగటున అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతంలో 96 శాతం నుంచి 104 శాతాన్ని ‘సాధారణ వర్షపాతం’గా ఐఎండీ గణిస్తోంది. దీర్ఘకాల సగటులో 90 శాతం కన్నా తక్కువ వర్షపాతం కురిస్తే దానిని వర్షాభావ పరిస్థితిగా లెక్కిస్తారు. 90–95 శాతం కురిస్తే దానిని సాధారణ వర్షపాతంగా, 105–110 శాతం కురిస్తే సాధారణం కన్నా ఎక్కువగా పరిగణిస్తారు. 1951–2023 కాలంలో పరిశీలిస్తే ఎల్ నినో తర్వాత వచ్చే లా నినో సందర్భాల్లో తొమ్మిదిసార్లు దేశంలో రుతుపవన కాలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. లా నినో సంభవించిన 22 సంవత్సరాల్లో 20 సార్లు సాధారణం/సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. -
ఎల్‌నినో ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మొత్తమ్మీద సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ ముగిసిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. నాలుగు నెలల వర్షాకాలంలో దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, ఈసారి ఎల్‌నినో పరిస్థితులను నిలువరించే సానుకూల కారకాల ప్రభావంతో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది 94.4 శాతమని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 94–106 శాతం మధ్య నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల్లో అస్థిరత ఏర్పడినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం మీడియాతో అన్నారు. దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్లకుగాను మూడింటిలో అధిక వర్షపాతం, 26 సబ్ డివిజన్లలో సాధారణ, ఏడింట్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, జార్ఖండ్, బెంగాల్, బిహార్, యూపీలో కొంత భాగం, కర్ణాటక దక్షిణ ప్రాంతం, కేరళ ఉన్నాయన్నారు. అదేవిధంగా, దక్షిణాది రాష్ట్రాల్లో 8% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు (హిందూ మహా సముద్రం డైపోల్), గాల్లో మేఘాలు, వర్షాలు తూర్పు దిశగా కదిలే తీరు(మాడెన్–జులియన్ ఆసిలేషన్) ఈ దఫా రుతుపవనాలను ప్రభావితం చేశాయని మహాపాత్ర విశ్లేషించారు. ఈ రెండు పరిస్థితులు ఎన్ నినో ప్రభావాన్ని తగ్గించాయని వివరించారు. నైరుతి రుతు పవనాల సమయంలో ఏటా సాధారణంగా 13 వరకు అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి, ఈసారి 15 అల్ప పీడనాలు ఏర్పడినప్పటికీ వాటి వృద్ధి సక్రమంగా లేదన్నారు. ఎల్‌నినో కారణంగానే 1901 తర్వాత అత్యంత వేడి మాసంగా ఈ ఏడాది ఆగస్ట్ రికార్డు సృష్టించిందన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈసారి 8 రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 25వ తేదీన పశ్చిమ రాజస్తాన్ నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. -
ధరల కట్టడే లక్ష్యం... కానీ సవాళ్లు ఉన్నాయ్!
ముంబై: కేంద్రం నిర్దేశిస్తున్నట్లు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నిస్తుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ఆర్బీ ఐ ప్రయత్నాలకు ఎల్ నినో సవాలుగా నిలుస్తో ందని వెల్లడించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి సాధిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఉద్ఘా టించారు. గత ఏడాది మే నుంచి 2.50 శాతం పెరిగిన రెపో రేటు (బ్యాంకులకు తాని చ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం), సరఫరాలవైపు సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.25 శాతానికి (2022 ఏప్రిల్‌లో 7.8 శాతం) దిగిరావడా నికి కారణమని ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొన్నారు. గోధుమలు, బియ్యం నిల్వల వి డుదల వంటి ఫుడ్ కార్పొరేషన్ చర్యలు ధరలు దిగిరావడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రొడక్టులపై సుంకాల తగ్గింపూ ఇక్కడ సానుకూలమయ్యింది. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► 2023–24లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతం ఉంటుందని భావిస్తున్నాం. 4 శాతానికి దీనిని కట్టడి చేయడానికీ ప్రయతి్నస్తున్నాం. ఎల్ నినో సవాళ్లు నెలకొనే ఆందోళనలు ఉన్నాయి. (పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులకు గురికావడమే ఎల్ నినో. ఇది భారత్, ఆ్రస్టేలియాలో భారీ వర్షపాతం, పంట ఉత్పాదకతకపై ప్రభావం, కరువు పరిస్థితులను సృష్టించడం వంటి పరిణామాలకు దారితీయవచ్చు.) ► ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తే, ప్రజలు తక్కువ వడ్డీరేటు వ్యవస్థను ఆశించవచ్చు. ► ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఇది కమోడిటీ ధరలను పెంచే అంశం. అయితే ప్రస్తుతం బ్యారల్‌కు 76 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధర వల్ల ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు. ► ప్రాజెక్ట్ రుణాలుసహా కార్పొరేట్ల నుండి క్రెడిట్ కోసం చాలా డిమాండ్ ఉంది. మొత్తం రుణ వృద్ధి అన్ని రంగాల విస్తృత ప్రాతిపాతిపదికన నమోదవుతోంది. ► 2023 క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి తక్కువ అస్థిరతను కలిగి ఉంది. డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ బలపడింది. అస్థిరతను తగ్గించడానికి ఆర్బీఐ తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ► అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ రేట్లను పెంచినప్పటికీ రూపాయిపై ప్రభావం పడదని విశ్వసిస్తున్నాం. అమెరికాలో ఫెడ్ ఫండ్ రేటు 5 శాతం పెరిగినప్పటికీ దేశీయ కరెన్సీ స్థిరంగా ఉంది. ► దేశానికి వచీ్చ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వలకు మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) 2023–24 ఆర్థిక సంవత్సరంలో ‘‘పటిష్ట నిర్వహణ స్థాయిలో’’ ఉంటుందని భావిస్తున్నాం. సేవా రంగం నుంచి అధిక ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. ఈ ప్రయత్నాలకు ఎల్ నినో ప్రధాన విఘాతం – శక్తికాంత్‌దాస్, ఆర్బీఐ గవర్నర్ -
నీటి నిల్వలు తగ్గుతున్నాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్న వేళ...ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలకు పెరిగిన వినియోగం, లోటు వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం కారణంగా రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పర్యవేక్షణలో 146 ప్రధాన జలాశయాలున్నాయి. వీటిల్లో నీటి నిల్వలు గత ఏడాది కన్నా 5శాతం తక్కువగా ఉన్నట్లు సీడబ్ల్యూసీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ రిజర్వాయర్ల వాస్తవ నిల్వ సామర్ధ్యం 178 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా ప్రస్తుతం 70 బీసీఎంల నిల్వలు ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 74 బీసీఎంలతో పోలిస్తే 5 శాతం తక్కువని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో మొత్తం 53 బీసీఎంల నిల్వ సామర్థ్యం కలిగిన 40 రిజర్వాయర్లుండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం ప్రత్యక్ష నిల్వ కేవలం 16.737 బీసీఎంలని వివరించింది. రిజర్వాయర్ల మొత్తం ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంలో ఇది 32 శాతం కాగా, గత ఏడాది కన్నా 7% తక్కువని తెలిపింది. ఇక ఏపీ, తెలంగాణలలోని 11 ప్రధాన రిజర్వాయర్లలో 20 బీసీఎంల నీటి నిల్వలకు గాను కేవలం 5.5 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాది నిల్వ 8 బీసీఎంలతో పోలిస్తే 11శాతం తక్కువని వెల్లడించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 11.12 బీసీఎంల నిల్వలకు గానూ కేవలం 1.65 బీసీఎంల నిల్వలు మాత్రమే ఉన్నాయని, ఇవి గత ఏడాదితో పోలిస్తే 9% తక్కువని తెలిపింది. -
ఏసీ అమ్మకాలపై అకాల వర్షాల దెబ్బ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తున్న అసాధారణ వర్షాలతో ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) అమ్మకాలు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫిబ్రవరి మధ్య నుంచి ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, ఏప్రిల్ నుంచి ఏసీల అమ్మకాలు పెరుగుతా యనే అంచనాలు కంపెనీల్లో నెలకొన్నాయి. వర్షాలతో మార్చి రెండో వారంలో ఏసీల అమ్మకా లు తగ్గాయి. ఇది కొన్ని రోజుల పరిణామమేనని, తిరిగి ఏప్రిల్ ద్వితీయార్థం నుంచి పెరిగే ఉష్ణోగ్రతలతో డిమాండ్ గరిష్టానికి వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 2022లో మొత్తం మీద 82.5 లక్షల యూనిట్ల ఏసీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సీజన్లో అమ్మకాల పరంగా రెండంకెల వృద్ధి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వేసవి కాలం ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావచ్చన్న అంచనాలు విక్రయాలకు మద్దతుగా నిలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంత తగ్గాయి.. అకాల వర్షాలకు తమ ఏసీల అమ్మకాలు కొంత తగ్గాయని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ తెలిపింది. ‘‘అయినప్పటికీ అధిక వేసవి కాలం ముందుంది. ఈ తరహా వాతావరణ ప్రతికూలతలు మరిన్ని లేకపోతే మాత్రం మా అమ్మకాల లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ గౌరవ్ షా అన్నారు. అమ్మకాలు తగ్గితే అది 5–6 రోజులే ఉంటుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా తెలిపారు. దీని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన) బలంగా ఉన్నందున బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఏసీల మార్కెట్ 20 శాతం వృద్ధి చెందుతుందున్న అంచనాను వ్యక్తం చేశారు. అలాగే డైకిన్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరగొచ్చన్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో ఏసీల అమ్మకాలు పెరగడం గమనార్హం. దీంతో రిటైలర్లు నిల్వలను పెంచుకున్నారు. ప్రస్తుత వర్షాలు తమ వ్యూహాత్మక విధానాన్ని మార్చుకునేందుకు సరైన సమయం ఇచ్చినట్టు హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని వారాల్లో వాతావరణ పరిస్థితులు సాధారణంగా మారతాయని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇండోర్, గృహ కూలింగ్ ఉత్పత్తులు తప్పనిసరిగా పేర్కొన్నా రు. మార్కెట్ ధోరణులు చూస్తుంటే 30–40 శాతం మేర అమ్మకాలు పెరగొచ్చని, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల మార్కెట్లో హయర్ ఈ మేర ప్రగతి సాధిస్తుందని చెప్పారు. విక్రయాలు తగ్గాయని, అయినా ఇది తాత్కాలికమేనని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయ న్సెస్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) పేర్కొంది. ఈ ఏడాది మేలో తీవ్రమైన వేసవి సీజన్‌ను చూస్తామని, నివేదికలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. మరో వారం రోజుల తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు పెరగడం మొదలవుతాయని, అమ్మకాలు కూడా పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఏప్రిల్‌లో తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే తప్ప అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండబోదన్నారు. ‘‘మొత్తం మీద వేసవి అమ్మకాలపై ఇప్పుడే అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి విక్రయాలు జూన్, జూలై వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతాయి’’అని వోల్టాస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చానల్ భాగస్వాములు కూలింగ్ ఉత్పత్తులను ముందుగా నిల్వ చేసి పెట్టుకోవాలని, అప్పుడు పెరిగే ఉష్ణోగ్రతలతో ఒక్కసారిగా డిమాండ్ వచ్చి నా, ఎదుర్కోవడానికి ఉంటుందన్నారు. -
ఎల్‌నినో ఉన్నా మంచి వానలే! భారత వాతావరణ శాఖ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత్‌లో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ‘ఎల్ నినో’ దాపురించే అవకాశాలు ఉన్నాసరే ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణస్థాయిలో కొనసాగి వ్యవసా య రంగానికి మేలుచేకూర్చనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం అంచనావేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ సోమవారం ప్రకటించిన మరుసటి రోజే వాతావరణ శాఖ మరోలా అంచనాలు వెల్లడించడం గమనార్హం. భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడింది. మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు 52 శాతం భూభాగం వర్షాధారం. దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం.. ఈ భూభాగంలో పండించే పంట నుంచే వస్తోంది. ఇది దేశ ఆహారభద్రతకు, ఆర్థిక సుస్థిరతకు కీలక భూమికగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనావేసి వ్యవసాయరంగానికి ఐఎండీ తీపికబురు మోసుకొచ్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కితే ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో రుతుపవన గాలులు బలహీనమై పొడిబారి వర్షాభావం తలెత్తుతుంది. సగటు వానలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా నైరుతి సీజన్లో దాదాపుగా సుదీర్ఘకాల సగటు అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్ర భూ శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు. సాధారణం, అంతకు ఎక్కువ వానలు పడేందుకు 67 శాతం ఆస్కారముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర అంచనావేశారు. ‘‘రెండో అర్ధభాగంపై ఏర్పడే ఎల్‌నినో ప్రభావం చూపొచ్చు. అంతమాత్రాన వర్షాభావం ఉంటుందని చెప్పలేం. ఎన్నోసార్లు ఎల్‌నినో వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైంది’’ అని ఆయన వివరించారు. -
ఏప్రిల్–జూన్‌లో వేడి సెగలు!
న్యూఢిల్లీ: వాయవ్య ప్రాంతం మినహా దాదాపు భారతదేశమంతటా ఈ ఏప్రిల్ నుంచి జూన్ నెలదాకా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సంబంధిత వివరాలను శనివారం ప్రకటించింది. ‘ 2023 ఎండాకాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్ రోజులు కొనసాగవచ్చు. దేశవ్యాప్తంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికం కావచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో, ఇంకొన్ని వాయవ్య ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా, సాధారణం కంటే తక్కువగా నమోదుకావచ్చు’ అని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటినా, ఆ సీజన్లో ఆ ప్రాంతంలో సాధారణంగా నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. భారత్‌లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును గణిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి.. అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకెక్కడం గమనార్హం. అయినాసరే సాధారణం కంటే ఎక్కువగా(29.9 మిల్లీమీటర్లకు బదులు 37.6 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదవడం, ఏడుసార్లు పశ్చిమ అసమతుల్యతల కారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలోనే కొనసాగిన విషయం విదితమే. గత ఏడాది మార్చి నెల మాత్రం గత 121 సంవత్సరాల్లో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా రికార్డును తిరగరాసింది. భారత్‌లో రుతుపవనాల స్థితిని ప్రభావితం చేసే దక్షిణఅమెరికా దగ్గర్లోని పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లబడే(లా నినో) పరిస్థితి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. లా నినో పరిస్థితి లేదు అంటే ఎల్ నినో ఉండబోతోందని అర్థం. ఎల్ నినో అనేది అక్కడి సముద్ర జలాలు వేడెక్కడాన్ని సూచిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలుల కారణంగా భారత్‌లో రుతుపవనాల సీజన్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. అయితే మే నెలకల్లా పరిస్థితులు మారే అవకాశముందని భిన్న మోడల్స్ అంచనాల్లో తేలిందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఈ ఏడాది మండిపోనున్న ఎండలు..
-
అప్పుడే దేశంలో కరవు తాండవం!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు భారత్‌లోని 42 శాతం భూభాగంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్)’ వెల్లడించింది. మొత్తం దేశ జనాభాలో 40 శాతం జనాభా అంటే, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించకపోవడం శోచనీయం. అయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలోని అనేక జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించాయి. వర్షాలు పడాలంటే మరో రెండు, మూడు నెలలు పడుతుంది కనుక కరవు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ డెవలపర్, గాంధీనగర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, రెండూ వైఫల్యం చెందడం వల్ల ఈ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని మిశ్రా తెలిపారు. దేశంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో నైరుతి రుతుపవాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతు పవనాల వల్ల 20 శాతం వర్షాలు కురుస్తాయి. 2018, జూన్–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కురవాల్సిన వర్షపాతంలో 9.4 శాతం తగ్గినట్లు, అదే ఈశాన్య రుతుపవాల వల్ల అక్టోబర్–డిసెంబర్ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 44 శాతం తగ్గినట్లు భారత వాతావరణ పరిశోధన కేంద్రం లెక్కలే తెలియజేస్తున్నాయని మిశ్రా వివరించారు. రుతుపవనాల కన్నా ముందు అంటే, మార్చి–మే నెలల మధ్య కురవాల్సిన వర్షపాతం కూడా ఈ సారి బాగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య కురిసే వర్షపాతంలో కూడా 36 శాతం తగ్గింది. ఫలితంగా దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 32 శాతం పడిపోయింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని 31 రిజర్వాయర్లలో నీటి మట్టం 36 శాతం పడిపోయింది. మున్ముందు కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, పర్యవసానంగా గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయని మిశ్రా హెచ్చరించారు. ఎల్‌నైనో పరిస్థితుల కారణంగా 2015 నుంచి (2017 మినహా) వరుసగా దేశంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది. -
ఎల్‌నినో ప్రమాదంతో తక్కువ వర్షాలు: స్కైమెట్
వ్యవసాయం కీలకమైన భారత ఆర్థిక వ్యవస్థకు, అన్నదాతలకు నిజంగా బ్యాడ్ న్యూస్. ప్రయివేట్ రంగ సంస్థ స్కైమెట్ వర్షపాతానికి సంబంధించిన నిరాశాజనక అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం సాధారణం తక్కువ నమోదవుతుందని తెలిపింది. సగటుకంటే అధికం లేదా అధిక వర్షపాతానికి అవకాశాలు కనిపించడంలేదంటూ ముందస్తు వాతావరణ అంచనాల్లో స్కైమెట్ పేర్కొంది. 2019 సంవత్సరంలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 55 శాతం ఉందని తెలిపింది. అంతేకాదు కరువు సంభవించే అవకాశాలు 15 శాతం ఉన్నాయంటూ సంచలన అంచనాలను వెల్లడించింది. ఎల్పీఏ వర్షపాతం జూన్‌లో 77 శాతం, 91 శాతం, ఆగస్టులో 102 శాతం, సెప్టెంబరులో 99 శాతంగా వుంటుందని అంచనా వేసింది.ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎల్పీఏ 96-104 శాతం మధ్య రుతుపవనాలు సాధారణమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా వర్షాకాలమైన (జూన్ -సెప్టెంబరు) నాలుగునెలల కాల వ్యవధిలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపింది. అధిక లేదా సాధారణ వర్షపాతం అన్న ఊసేలేదని వ్యాఖ్యానించింది. లాంగ్ పీరియడ్ రేంజ్(ఎల్పీఏ)లో రుతుపవనాల ప్రభావం 93 శాతం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది సాధారణం కంటే తక్కువే. 1951 నుంచి 2000వరకు ఎల్పీఏ సగటున 89 సెంటీమీటర్లు ఉందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర బాగా ప్రభావితం కానుందన్నారు. అయితే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏప్రిల్ మధ్యలో అంచనాలను ప్రకటించనున్నది. మరోవైపు వేసవి పొడవునా ఎల్‌నినో కొనసాగుతున్నందున వచ్చే వానాకాలంలో వర్షాలు కురిసే అవకాశం 60శాతమేనని అమెరికా వాతావరణశాఖ ఇటీవల హెచ్చరించింది. దీని ప్రభావం భారత్‌పైనా ఉంటుందని తెలిపింది. El Nino reason for below normal Monsoon https://t.co/exF7cAGVAG — SkymetWeather (@SkymetWeather) April 3, 2019 -
కేరళలో ఎందుకీ వరదలు?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భారీ వరదలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇందుకు కారణం ఏమిటని ఎవరిని ప్రశ్నించిన ‘భారీ వర్షాలు’ అని సమాధానం ఇస్తారు. భారీ వర్షాలకు కారణం ఏమిటని అడిగితే అల్పపీడనం అనో, పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు వల్లనో అనో సమాధానం ఇస్తారు. ఇక వర్షాలు ఎక్కువ పడినా, తక్కువ పడినా ‘ఎల్ నైనో’ లేదా ‘లా నైనో’ ప్రభావమని ఇటు ప్రభుత్వం అటు అధికార యంత్రాంగం చెబుతోంది. ఇందులో సగం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధాన లోపం కారణంగానే వరదలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎక్కువగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఆగస్టు 15 నాటికి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా పడాల్సిన వర్షపాతం కన్నా మూడు రెట్లు వర్షపాతం ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కురిసిన వర్షపాతం ఎంతో ఇదుక్కి, వేయనాడ్ జిల్లాల్లో అంత వర్షపాతం కురిసింది. కేరళను ఆనుకొని ఉన్న కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తమిళనాడులోని ఈరోడు, నమ్మక్కల్ ప్రాంతాల్లో, కర్ణాటక కొడగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి భారీగా వరదలు వచ్చాయి. కేరళలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. సహజ సిద్ధమైన కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కేరళలో ఇంత ఎక్కువ వర్షపాతం కురిసినంత మాత్రాన ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాల్సిన అవసరం లేదు. అయిన జరిగిందంటే మానవ తప్పిదమే. పాలకులు విధాన నిర్ణాయక లోపమే. 11 రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన కోచి విమానాశ్రయం ఎక్కడుందంటే ఇప్పటికే ఎంతో బక్క చిక్కిన పెరియార్ నదికి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రమ్మంటే రావా? ఇక భారీ వర్షాలు కురిసిన ఈరోడు, నమ్మక్కాల్ ప్రాంతాలను తీసుకుంటే కావేరి నది ఒడ్డున కార్మికులు నిర్మించిన ఇళ్లన్ని కొట్టుకుపోయి ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. కావేరి నదికి నాలుగు కిలోమీటర్ల దూరంలో వరిపొలాలకు నీరందక రైతులు ఆందోళన చెందుతుంటే కావేరీకి వరదలొచ్చి ప్రాణ నష్టం సంభవించిందటే ఎవరి తప్పు? ఇవి ఉదాహరణలు మాత్రమే. కేరళలో కొండ చెరియలు విరిగి పడి ప్రాణ నష్టం సంభవించడానికి క్వారీలు కారణం. ఇటు క్వారీలు, అటు నదీ ప్రవాహాల పక్కన జనావాసాలు, మానవ నిర్మాణాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. -
ఎల్‌నినో ఉన్నట్టా? లేనట్టా?
ఉందంటున్న స్కైమెట్, అంతర్జాతీయ సంస్థలు అలాంటిదేమీ లేదన్న ఐఎండీ ఈ ఏడాది రుతుపవనాల తీరుతెన్నులపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తన ముందస్తు అంచనాలు విడుదల చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఎల్‌నినోతో వచ్చిన ముప్పేమీ లేదని భరోసానిచ్చింది. అయితే ఇది ఎంత వరకు వాస్తవమన్న విషయంపై ఇప్పుడు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా మొదలుకొని అనేక విదేశీ వాతావరణ సంస్థలు 2015–16లో వచ్చిన తీవ్ర ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది కూడా రానున్నాయని స్పష్టం చేశాయి. దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ కూడా గతనెల ఆఖరులో ఇదే విషయాన్ని తెలిపింది. జూన్సెప్టెంబర్ మధ్య కాలంలో రుతుపవనాల సీజన్ రెండో అర్ధభాగంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని తెలిపింది. ఐఎండీ అప్పట్లో ఎల్‌నినో ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పింది. తాజాగా అసలు ఉండబోదని అంటోంది. వీటిల్లో ఏది నిజమన్న విషయం తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌నినో అంటే ఏమిటో? దాని ప్రభావం ఎక్కడ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్‌నినో ఏర్పడితే...?: దక్షిణ అమెరికాకు సమీపంలో భూమధ్య రేఖకు కొంచెం అటుఇటుగా సముద్ర ఉపరితల నీరు వెచ్చబడితే దాన్ని ఎల్‌నినో అని పిలుస్తారన్నది తెలిసిందే. ఉపరితల నీటి ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల అక్కడ నీటి ఆవిరి ఎక్కువవుతుంది. అంటే ఆ ప్రాంతంలోని గాలి వేడెక్కడంతోపాటు తేమ శాతం ఎక్కువవుతుంది. ఇలా వేడెక్కిన గాలి భూవాతావరణ పై పొరల్లోకి చేరి... మేఘాలను మోసుకెళ్లే జెట్స్ట్రీమ్స్ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు నమోదైతే.. ఆస్ట్రేలియా మొదలుకొని భారత్ వరకూ వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు పెరుగుతాయి. సాధారణంగా ఎల్‌నినో అనేది సగటున నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంటుంది. అయితే భూ తాపోన్నతి ఫలితంగా వాతావరణం మారిపోతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో తరచూ ఎల్‌నినో తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది ఉష్ణోగ్రతలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. 2015–16 సీజన్లో ఎల్‌నినో తీవ్రత గరిష్టంగా ఉండగా... ఆ రెండేళ్లలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది మాటేమిటి?: ఇప్పటివరకున్న పరిస్థితులను బేరీజు వేస్తే ఎల్‌నినో ఏర్పడేందుకు యాభై శాతం అవకాశాలున్నాయి. పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఇప్పటికైతే ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. అయితే దక్షిణ అమెరికా>కు అవతలి వైపున పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో మాత్రం ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు హెచ్చాయని, ఫలితంగానే ఇటీవల ఈక్వెడార్, పెరూలలో అధిక వర్షపాతం నమోదైందని అమెరికా వాతావరణ సంస్థ చెబుతోంది. దీని ప్రభావం వల్ల ఎల్‌నినో బలం పుంజుకుంటుందా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వాతావరణ సంస్థలు కూడా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండవచ్చని హెచ్చరించాయి. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై ఇప్పటికీ కొన్ని సందేహాలు ఉన్నాయడంలో సందేహం లేదు. భారత వాతావరణ సంస్థ రెండ్రోజుల క్రితం విడుదల చేసింది ముందస్తు అంచనాలే కాబట్టి.. త్వరలో విడుదల చేసే అసలు అంచనాల్లో ఎల్‌నినో ప్రస్తావన ఉంటుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎల్‌నినోకు 72 మంది బలి
-
ఎల్‌నినోకు 72 మంది బలి
పెరూలో ఎమర్జెన్సీ లిమా: పెరూలో కురుస్తున్న భారీ వర్షాలకు 72 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ ప్రధాని ఫెర్నాండో జవాల ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలు మరో రెండువారాలు కొనసాగుతాయని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరద తాకిడితో దేశంలోని 811 నగరాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.జల దిగ్బధంతో రాజధాని లీమాకు గత వారంరోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. 1998లో ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావంతో తుఫాన్లు ఏర్పడి దేశంలో 374 మంది చనిపోయారని, ప్రస్తుతం అలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. వరద వల్ల దేశంలో నిత్యావసరాల ధరలు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది. -
ఈసారి ఆశించిన వర్షాలు పడవా ?
-
ఎల్‌నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!
తటస్థ స్థితిలో వాతావరణం ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే రుతుపవనాలకు ఊపు: శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో హోరెత్తించిన ఎల్‌నినో కనుమరుగైంది. వాన లతో ముంచెత్తాల్సిన లానినా రాకకు మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు! ప్రస్తుతం లానినా దశలోకి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎల్‌నినో కానీ లానినా కానీ లేదని... తటస్థ స్థితి మాత్రమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే లానినా రావాల్సి ఉన్నా.. తటస్థ స్థితి నుంచి నెల రోజుల్లో లానినా ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలపై ఎల్‌నినో, లానినాల ప్రభావం ఉంటుంది. రుతుపవనాలు వచ్చాక అవి వేగంగా ముందుకు కదలడానికి, వర్షాలు కురవడానికి లానినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లానినా ఏర్పడ్డాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. జూలై, ఆగస్టు నాటికి లానినా 26% నుంచి 52%నికి చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67%నికి, అక్టోబర్ చివరకు 71%నికి చేరుకోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవర్తనం లేకే ఆలస్యం.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులు కావస్తున్నా ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఈ నెల 15 నాటికే రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఏపీని రుతుపవనాలు తాకినా బలహీనపడడంతో అక్కడ కూడా వర్షాలు కురవడం లేదు. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల కారణంగా విసృ్తతంగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకోలేదు. ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే తప్ప రుతుపవనాలు రావని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఫలితంగా నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం రామగుండంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.3, హన్మకొండ 39.7, నల్లగొండ 39.4, నిజామాబాద్ 39.3, ఖమ్మం 39.2, భద్రాచలంలో 39.0, హైదరాబాద్ 37.3, మెదక్ 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి..
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారబోతున్నాయి.. ఉదయం పది దాటితేచాలు వడగాడ్పులు పంజా విసరబోతున్నాయి.. నోరు తెరిస్తే చాలు గొంతెండిపోనుంది. అదే మూడు నెలల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోనుంది.. కుండపోత వానలతో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కానుంది.. భారీ వర్షాలతో కొత్త ఆశలకు బీజం వేయనుంది. ఈ విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణం ఎల్‌నినో, లానినా పరిస్థితులే. ఏమిటీ ఎల్ నినో? సూర్యుడి తాపానికి భూమధ్య రేఖా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే 0.5 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉన్న పరిస్థితిని ‘ఎల్‌నినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలుడు’ అని దీనికి అర్థం. ఇది నాలుగున్నరేళ్లకోసారి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల విపరీతమైన వర్షాలు కురిస్తే... కొన్నిచోట్ల తీవ్రమైన వర్షాభావం, కరువు పరిస్థితులకు కారణమవుతుంది. ఎల్‌నినో కారణంగా బ్రెజిల్ సహా దాని చుట్టుపక్కల దేశాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. అదే భారత్‌లో, దక్షిణాసియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను సృష్టిస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఎల్‌నినో కారణంగా వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో గత పదేళ్లలో లేనంత అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు 50 ఏళ్లలో సంభవించిన ఎల్‌నినో రికార్డుల ప్రకారం కరువు, వర్షాభావ పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. 2002, 2004, 2009, 2014లలో ఎల్‌నినో రావడంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 1953, 1969, 1997 సంవత్సరాాల్లో ఎల్‌నినో ఉన్నా సాధారణ వర్షాలే నమోదయ్యాయి. లానినో అంటే.. భూమధ్య రేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉన్న పరిస్థితిని ‘లానినో’ అంటారు. స్పానిష్ భాషలో ‘చిన్న బాలిక’ అని దీనికి అర్థం. ఎల్‌నినో క్రమంగా బలహీనపడితే.. ఆ ప్రాంతంలో లానినా ఏర్పడుతుంది. దీంతో దక్షిణాసియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఎల్‌నినో ఎంత తీవ్రంగా ఉంటే.. లానినా కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఈ లెక్కన ఈసారి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో పాటు జూలై తొలి వారం నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకు ఏర్పడుతాయి? కాలుష్యం పెరగడం, రకరకాల కారణాలవల్ల అడవులు, చెట్ల సాంద్రత తగ్గి పచ్చదనం తగ్గిపోవడమే వాతావరణలో పెను మార్పులకు కారణం. దీనికితోడు వివిధ రసాయనాలు, క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్ పొర మందం తగ్గిపోతోంది. భూమిపై పడిన సూర్యరశ్మి కాలుష్య మేఘాల కారణంగా తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందడం తగ్గిపోతోంది. దీంతో భూమి విపరీతంగా వేడెక్కుతోంది. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎల్‌నినో, లానినో వంటి విపరీతమైన మార్పులకు ఇదే కారణం. ఒక ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావం, మరో ప్రాంతంలో భారీ వర్షాలు, అత్యధిక ఉష్ణోగ్రతలు వంటి అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. 1961 నుంచి 1990 వరకున్న సరాసరి ఉష్ణోగ్రత కంటే 2015 నాటికి భూమిపై 0.73 డి గ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సదస్సు తేల్చింది. 0.73 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడమనేది అసాధారణం. ఇటీవల చెన్నైలో ఒకేరోజు 50 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురవడానికి, ఆంధ్రప్రదేశ్‌లోనూ కుండపోత వర్షాలకు గ్లోబల్ వార్మింగే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రైతు గుండెల్లో ఎల్‌నినో గుబులు
కడప అగ్రికల్చర్ : ఎల్‌నినో...రైతును వెంటాడుతున్న వాతావరణ భూతం.. 2014-15లో కరువుతో అల్లాడిన రైతన్న 2015-16 ఖరీఫ్ సాగుపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది సకాలంలో రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పినా, మరోవైపు ఎల్‌నినో ప్రభా వం వల్ల వర్షపాతం తగ్గవచ్చని, అందులోనూ సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తగ్గుతుం దని చెబుతున్నారు. ఈ ఏడాది కరువు తప్పదా అనే ప్రశ్న..? రైతన్నను వెంటాడుతోంది. ఎల్‌నినో అంటే....: మహాసముద్రాలపై ఉపరితల ఉష్ణోగ్రతలు(వేడిమి) పెరగడం వల్ల నీళ్లు అమిత వేడిగా మారిపోతాయి. సముద్రాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయి. ఇలాఉష్ణోగ్రతలు అనుకోకుండా పెరగడం వల్ల, సముద్రపు నీరు ఆవిరి రూపంలో వెళ్లి నీరులేని మేఘాలు ఏర్పడతాయి. దీని మూలంగా మేఘాలలో తేమ లేకపోవడం వల్ల వాతావరణంలోను, వర్షపాతంలోను స్థిరత్వం ఉండదు. దీంతో కరువు వస్తుంది. దీన్నే ఎల్‌నినో అంటారని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎల్‌నినో వల్ల ఒక్కోసారి కరువు కాట కాలు రావచ్చు, అనుకోకుండా అకాల వర్షాలు, ఉన్న మేఘాలన్నీ ఒకే ప్రాంతంలో నీటిని కుమ్మరించడం వల్ల వరదలు రావడం భారీగా నష్టం సంభవించడం జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చినుకురాలితే చిరునవ్వు...లేదంటే కన్నీరే... జిల్లాలో మెజార్టీ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వ్యవసాయంలో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ కష్ట నష్టాలకోర్చి వ్యవసాయాన్ని చేపడుతూనే ఉన్నారు. జిల్లాలో 85 శాతం మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తున్నారు. చినుకురాలితే రైతన్న మోములో చెప్పలేనంత చిరునవ్వు...లేదంటే కంట కన్నీరు తప్పని పరిస్థితి. తాజాగా వినిపిస్తున్న ఎల్‌నినోతో అన్నదాతను భయం వెంటాడుతోంది. జిల్లాలో వ్యవసాయం తీరు తెన్నులు.. జిల్లాలో ప్రధానంగా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, పులివెందుల, ముద్దనూరు, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్లు పూర్తిగా, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు డివిజన్లలో కొన్ని మండలాల్లో వర్షం వస్తేనే భూములు పచ్చని పైర్లతో కళకళలాడేది. లేకపోతే బీళ్లుగానే ఉంటాయి. జిల్లాలో మొత్తం 3,84,679 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఏటా 1,27,394 హెక్టార్లలో వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కొర్ర, రాగి, మినుము, పెసర, అలసంద, కూరగాయలు తదతర ఆహార పంటలు సాగవుతుండగా, ఆహారేత పంటలు 1,07,763 హెక్టార్లలో సాగవుతున్నాయి. మిగిలిన భూమిలో పలురకాల పంటలున్నాయని వ్యవసాయశాఖ అంచనాలు చెబుతున్నాయి. సకాలంలో వర్షాలు కురిస్తే రైతులు పంటలసాగుకు తెచ్చిన పెట్టుబడితోపాటు నాలుగు రూపాయలు కళ్లజూస్తారు. లేదంటే పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక నరకయాతన తప్పదు. మూడేళ్లుగా...వర్షపాతాల్లో హెచ్చుతగ్గులు...: జిల్లాలో సాధారణ వర్షపాతానికి, కురుస్తున్న వర్షపాతానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. వర్షపాతం రికార్డులను పరిశీలిస్తే మూడేళ్లుగా కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సాధారణ వర్షపాతం 699.6 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉంటుంది. 2012-13 లో ఖరీఫ్‌లో 570.5 మిల్లీ మీటర్లు కురిసింది. 2013-14లో అకాల వర్షాలతో 708.7 మిల్లీ మీటర్లు కురిసి పంటలను నష్టపోయారు. 2014-15లో 464.9 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో 2015-16 ఈ ఖరీఫ్‌లోను వర్షపాతంలో 10 శాతం లోటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తుండడంతో జిల్లా రైతుల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. ఈనెల సాధారణ వర్షపాతం 69.0 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు 47.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గత ఏడాది ఖరీఫ్ కన్నీటీ గాథ ఇది... గత ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1,79,536 హెక్టార్లు కాగా అరకొర వర్షాల కారణంగా కేవలం 43,576 హెక్టార్లలోను, రబీలో సాధారణ సాగు భూమి 2,05,143 హెక్టార్లు ఉండగా ఇందులోను అరకొర వర్షాలకు కేవలం 56,433 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఆ సీజన్లో దాదాపు నెల రోజులపాటు వర్షం కురవకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 28 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రకటించింది. -
కరువుపై అప్రమత్తం..!
సాక్షి, హైదరాబాద్: ఎలినినో కారణంగా ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను కరువు కమ్మే అవకాశాలుండడం వ్యవసాయ శాఖను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కరువు హెచ్చరికలతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని కేంద్ర మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రిడా) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. మూడు విడతల ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసి, రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం కలిగించాలని నిర్ణయించింది. రైతులలో చైతన్యం ద్వారా కరువు పరిస్థితుల్లో నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ఈసారి వర్షపాతం గణనీయంగా పడిపోయి కరువు పరిస్థితులు తలెత్తనున్నాయని జాతీయ వాతావరణశాఖ అంచనా. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. గత ఖరీఫ్‌లో 30 శాతం లోటు నమోదు కాగా, ఈసారి 67 శాతం వరకు ఉంటుందని అంచనా. మూడు విడతల ప్రత్యామ్నాయం... వర్షాభావ పరిస్థితులు నెలకొంటే అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలపై వ్యవసాయశాఖ కసరత్తు చేసింది. వ్యవసాయశాస్త్రవేత్తలో కలిసి మూడు విడతల ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది. జూలై 15 వరకు వర్షాలు లేకుంటే ఒక ప్రణాళిక, జూలై 31 వరకు రాకుంటే రెండో ప్రణాళిక, ఆగస్టు 15 నాటికి కురియకుంటే మూడో ప్రణాళిక అమలు చేస్తారు. ఆగస్టు 15 నాటికి వర్షాలు కురవకుంటే వరి పంటను పూర్తిగా మినహాయిస్తారు. వర్షాభావాన్ని ఎదుర్కొంటాం: క్రిడా వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొంటామని, అలాంటి సాంకేతిక పరి జ్ఞానం తమ వద్ద ఉందని కేంద్ర మెట్ట వ్యవసా యపరిశోధన సంస్థ(క్రిడా) సంచాలకులు సీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. క్రిడా కార్యాలయంలో సోమవారం తెలంగాణ జిల్లాల వ్యవసాయశాఖ సంచాలకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ కో-ఆర్డినేటర్లు సహా ఇతర అధికారులతో ఖరీఫ్, రబీ సన్నద్ధతపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో ఏర్పడనున్న వాతావరణ అంచనాలను వివరించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ రూపొందించుకున్న ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. -
గాలివాన, గాడ్పు ఎల్ నినో ముఖాలే
వాతావరణాన్ని పద్ధతి ప్రకారం రికార్డులలో నమోదు చేయడం మొదలైన తరువాత భారతదేశంలో నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటున్న సంగతిని గమనించారు. అధికశాతం ఎల్‌నినో సంవత్సరాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కూడా. చెట్టు కాయకూ సముద్రంలో ఉప్పుకూ లంకె కుదిరితే నోరూరించే ఆవకాయ అవుతుందేమోగానీ ఎక్కడో పసిఫిక్ మహా సముద్రంలో నీరు వెచ్చబడి, దానికి వాతావరణ మార్పు తోడైతే మాత్రం మన దేశంతోపాటు, చాలా ఆసి యా దేశాల్లో కరువు భయాలు కమ్ముకుంటాయి. అప్పుడ ప్పుడూ వచ్చి... కొందరికి ఖేదం మరికొందరికి మోదం కలి గించిపోయే వాతావరణ వ్యవస్థ ఎల్ నినో దుష్పరిణామం ఇది. దురదృష్టవశాత్తూ ఈ ఏడాది కూడా ఎల్ నినో దాపురిం చడానికి అవకాశాలు ఉన్నాయని అనవచ్చు. ఆ అవకాశాలు 70 - 80 శాతమని అనవచ్చు కూడా. దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వాన కురుస్తుందా? కరువు కాటేస్తుందా? గత అనుభవాలను చూస్తే రెండో ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. రికార్డు లను బట్టి చూస్తే ముంచెత్తే వానలకూ అవకాశం లేకపో లేదు. పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ అమెరికా దగ్గర భూ మధ్య రేఖకు ఇరువైపులా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి పోవడమనే దృగ్విషయాన్ని ఎల్ నినోగా వ్యవహరిస్తామ న్నది తెలిసినదే. ఇలా అక్కడ నీరు వెచ్చబడినప్పుడు సము ద్రపు అట్టడుగు భాగాల్లో ప్రవహించే అంతర్వాహినుల్లోనూ తేడాలొస్తాయి. ఇంతకీ, ఎల్ నినో వచ్చిందనగానే.. ఈ మార్పులన్నీ జరిగిపోతాయని అర్థం కాదు. ఎల్ నినోలు రెండు రకాలు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు డిసెంబరి సమయం నుంచి కొంచెం కొంచెంగా పెరుగుతూ మే నెల నాటికి అకస్మాత్తుగా పెరిగితే దాన్ని బలమైన ఎల్ నినోగా పిలుస్తారు. మే నెలలో ఉష్ణోగ్రతల పెరుగుదల చెప్పుకోదగ్గ స్థాయిలో లేకుండా ఉన్నప్పుడు దాన్ని బలహీనమైందని అంచనా వేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత వాతావరణ విభాగంతోపాటు, కొన్ని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థలు ఈసారి బలహీనమైన ఎల్ నినో రానున్నదని అంచనాకు వచ్చాయి. దాని ఆధారంగానే ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే కొంచెం తక్కువగా ఉంటాయని ప్రకటించారు. అయితే అప్పటికి మే నెల ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని కూడా లెక్కించి చూసిన తరువాత తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షాభావం, కరువు వచ్చేందుకు 23 శాతం అవకాశముందని లెక్కకట్టారు. ఎల్ నినో రాకకు ఉన్న అవకాశాలు 60 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయి. వాతావరణాన్ని పద్ధతి ప్రకారం రికార్డులలో నమోదు చేయడం మొదలైన తరువాత భారతదేశంలో నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి ఎల్ నినో పరిస్థితులు నెలకొంటున్న సంగతిని గమనించారు. అధికశాతం ఎల్ నినో సంవత్స రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కూడా. 1871 నుంచి 1978 మధ్యకాలంలో దాదాపు 22 సార్లు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఐదుసార్లు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఏర్పడగా... బలహీన ఎల్ నినో పరిస్థితు లున్న నాలుగేళ్లు వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. 2009 నాటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఆ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కాగా.. ఆ తరువాత కూడా దేశ వ్యాప్తంగా వానలు పలు అంతరాయాల మధ్య కురిశాయి. అదే సమయంలో ఆ ఏడాది అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి లో నిండింది. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక వారం రోజులు ఆలస్యమైంది. జూన్ 8వ తేదీ నాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించాల్సిన మేఘాలు దక్షిణం కొస వద్ద తారాడుతున్నాయి. బంగాళాఖాతం నుంచి తగు మోతాదులో తేమ అందకపోవడం వల్ల రుతుపవన మేఘా ల విస్తరణ, విస్తృతిల్లో తేడాలు ఉంటాయని, అడపాదడపా కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని ఇప్పటికే కొన్ని వాతావరణ సంస్థలు హెచ్చరించాయి. జూన్ నుంచి సెప్టెం బర్ వరకు, ఒక్క ఆగస్టులోనే సాధారణం కంటే కొంచెం ఎక్కువగా వానలు కురిసే అవకాశముందని కూడా ఈ సం స్థలు అంచనా వేశాయి. అయితే బంగాళాఖాతంలో తీవ్ర స్థాయి అల్పపీడనమేదైనా ఏర్పడి రుతుపవనాలు వేగంగా ముందుకు కదిలేందుకు సహకరిస్తే పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశముంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు హెచ్చ రికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, పశుగ్రాసం కొరతలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
నీటి కష్టాలు తప్పవా?
సాక్షి, ముంబై: ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. ఏప్రిల్ నెలాఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 33 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నీటితోనే దాదాపు రెండు నెలలపాటు గడపాల్సి ఉంటుంది. అదీ సకాలంలో వర్షాలు కురిస్తేనే. గత ఏడాది ఏప్రిల్ మాసాంతానికి 27 శాతం నిల్వలే ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా సాధారణస్థాయిలో వర్షపాతం నమోదైంది. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు మరింత తక్కువగా కురిసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... రాష్ట్రంలో రోజురోజుకు భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నిన్నమొన్నటిదాకా 40 డిగ్రీల లోపు నమోదైన ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యతాపం పెరిగితే జలాశయాల్లోని నీరు మరింత వేగంగా ఆవిరవుతుందని, దీంతో అవి వర్షాకాలం రాకముందే అడుగంటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే ఈ ఏడాది కూడా కరువు తప్పదంటున్నారు. గత ఏడాదికంటే ఆరుశాతం నీటి నిల్వలు ఎక్కువగానే ఉన్నా ఎల్‌నినో ప్రభావమే ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఆరు రెవెన్యూ విభాగాల్లో 84 భారీ నీటి ప్రాజెక్టులున్నాయి. వీటిలో పుణే, మరాఠ్వాడా విభాగాల్లో అత్యల్పంగా 30 శాతం నీటి నిల్వలుండగా, అత్యధికంగా నాగపూర్ విభాగంలో 53 శాతం నీటి నిల్వలున్నాయి. -
కృత్రిమ వర్షాలవైపు బీఎంసీ చూపు
సాక్షి, ముంబై: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో నగర పాలక సంస్థ(బీఎంసీ) అప్రమత్తమైంది. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కృత్రిమ వర్షం వైపు దృష్టిసారించింది. నగరంలో సుమారు కోటిన్నర జనాభా ఉంది. వీరందరికి ప్రతిరోజూ దాదాపు 450 ఎమ్మెల్డీల నీరు అవసరముంటుంది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఉన్న జలాలను సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రత్యామ్నాయాలపై బీఎంసీ దృష్టిపెట్టింది. నగరానికి నీటిని సరఫరా చేస్తున్న ఏడు జలాశయాల్లో మూడు నెలలకు సరిపడేంత నీరు మాత్రమే నిల్వ ఉంది. ఒకవేళ సమయానికి అనుకున్నంత మేర వర్షాలు కురవకపోతే పరిస్థితిని ఎలా గట్టెక్కాలనే ఆలోచన నేపథ్యంలో బీఎంసీ ఈ కృత్రిమ వర్షాలవైపు మొగ్గు చూపుతున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మేఘమథనం చేసి, కృత్రిమ వర్షాలను కురిపించే ప్రక్రియ భారీ వ్యయం, రిస్క్‌తో కూడుకున్నది కావడంతో పరిపాలన విభాగం తుది నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే నిపుణులతో కూడా చర్చించినట్లు సమాచారం. 2009లో వర్షాలు ముఖం చాటేయడంతో భాత్సా, అప్పర్ వైతర్ణ జలాశయాల ప్రాంతాల్లో కత్రిమ వర్షాల కోసం ప్రయత్నాలు చేశారు. కాని ఈ ప్రయోగం ఊహించిన స్థాయిలో సఫలీకృతం కాలేకపోయింది. కృత్రిమ వర్షం కోసం వినియోగించిన విమానాలు సరిగా పనిచేయకపోవడం, రాడార్ కారణంగా 160 సార్లు మేఘాలపై రసాయనాలు పిచికారి చేసినప్పటికీ చెదురుమదురు జల్లులు మినహా పెద్ద వర్షాలేవీ కురవలేదు. అయితే అదృష్టం బాగుండి ఆ తరువాత వర్షాలు కురవడంతో అప్పట్లో నీటి కొరత సమస్య పరిష్కారమైంది. గత మూడు సంవత్సరాల నుంచి సాధారణస్థాయిలో వర్షాలు కురవడంతో కృత్రిమ వర్షాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం బీఎంసీకి రాలేదు. కాని ఈ ఏడాది వర్షాపాతం కొంత తక్కువ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో బీఎంసీ అప్రమత్తమైంది. భవిష్యత్తులో నీటి కొరత సమస్య తెరమీదకు రాకుండా జాగ్రత్త పడుతోంది. గత సంవత్సరం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు లేక కరవు తాండవించింది. అనేక పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామాలకు గ్రామాలే వలసలు పోయాయి. కాని ముంైబె నగరానికినీటిని సరఫరాచేసే జలాశయాల పరిధిలో మాత్రం పుష్కలంగా వర్షాలు కురవడంతో కరవు ప్రభావం ముంబైకర్లపై పెద్దగా కనిపించలేదు. జలాశయాల్లో నీటి నిల్వలను బట్టి బీఎంసీ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. ఆ ప్రకారం ఏటా వర్షాకాలానికి కొద్ది రోజుల ముందు నుంచి నగర ప్రజలకు 10-15 శాతం వరకు నీటి కోత అమలు చేస్తుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 25 శాతం కోత విధిస్తుంది. కాని ఈ సారి వాతావరణ శాఖ చాలా రోజుల ముందే హెచ్చరికలు జారీ చేయడంతో కోతలు కూడా భారీగానే ఉండే అవకాశముందని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. -
ముంచుకొస్తున్న కరువు
సింగపూర్: భారత్‌కు మళ్లీ కరువు ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో గత నాలుగేళ్లుగా వర్షాలను సమృద్ధిగా కురిపించిన రుతుపవనాలు ముఖం చాటేయనున్నాయి. ఈ ఏడాది నుంచి మళ్లీ వర్షాభావంతో పంటలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, గోధుమ, చెరకు ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న భారత్ ఆ పంటల దిగుబడులు తగ్గి కరువును ఎదుర్కోనుంది. పసిఫిక్ మహా సముద్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగి ‘ఎల్ నినో’ వాతావరణ పరిస్థితులు ఏర్పడనుండటమే ఈ గడ్డు కాలానికి కారణం కానుంది. ఈ ఏడాది రెండో సగం నుంచి ఎల్ నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్యూరో ఆఫ్ మెటియరాలజీ’, అమెరికాకు చెందిన ‘యూఎస్ క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ఎల్ నినోతో భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా తీర ప్రాంతాలు, ఆఫ్రికాలోనూ తీవ్ర కరువు ఏర్పడనుంది. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియా, తదితర ప్రాంతాలు, బ్రెజిల్ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎల్ నినో తీవ్రతపై వాదనలు కొనసాగుతున్నాయని, దీనిని తీవ్రమైనదిగా నిర్ధారిస్తే గనక.. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడి వివిధ సరుకుల ధరలు కూడా నింగినంటుతాయని అంటున్నారు. ఇంతకుముందు 2009లో ఏర్పడిన ఎల్ నినో వల్ల.. భారత్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లోనే అతిపెద్ద కరువును దేశం చవిచూడాల్సి వచ్చింది. చక్కెర ధరలు సైతం 30 ఏళ్లలో అత్యధికంగా పెరిగాయి. 1990లలో తీవ్ర ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువుకు వివిధ దేశాల్లో 2 వేల మంది మృత్యువాతపడ్డారు. వందల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. ప్రస్తుత ఎల్ నినో వల్ల థాయిలాండ్, ఇండోనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, చైనా దేశాల్లో వరి, కాఫీ, మొక్కజొన్న పంటలు కరువుతో ఎండిపోనున్నాయి. వరదలు రావడం లేదా రవాణాకు ఆటంకం కలగడం వల్ల బంగారం, నికెల్, టిన్, కాపర్ (రాగి), బొగ్గు వంటి ఖనిజాల ధరలూ భారీగా పెరిగే అవకాశమూ ఉంది. ఎల్ నినో.. ‘బ్యాడ్’బోయ్! స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే బాలుడు అని అర్థం. పసిఫిక్ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితినే ఎల్ నినోగా పిలుస్తారు. ఇది ప్రతి 4 నుంచి 12 ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎల్ నినో-దక్షిణ డోలనం అనే సహజ వాతావరణ వలయంలో భాగంగా జరుగుతుంది. ఎల్ నినో వల్ల రుతుపవనాలు ప్రభావితమై ఆయా దేశాల్లో తీవ్ర కరువు ఏర్పడే ముప్పు ఉంటుంది కాబట్టి.. దీనిని బ్యాడ్ బోయ్‌గా అభివర్ణిస్తారు. ఇది ముఖ్యంగా మనదేశంలో నైరుతి రుతుపవనాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. అలాగే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గి.. ఎల్ నినోకు వ్యతిరేక ంగా ఏర్పడే వాతావరణ పరిస్థితిని ‘లా నినా’(స్పానిష్‌లో లిటిల్ గర్ల్)గా పిలుస్తారు. దీని వల్ల అమెరికా, తదితర చోట్ల కరువు ఏర్పడుతుంది. భారత్, ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి.


