డ్యూటీలో పాడపాడటమే శాపమై ఉపాధిని కోల్పోయేలా చేసింది. విధి ఒకడోర్ మూసేస్తే మరో దారి తెరుచుకుంటుంది అనేలా అతడికి మరో అవకాశం వెత్తక్కుంటూ వచ్చి..తనకు నచ్చిన విధంగా బతకేలా చేసింది.
ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. సుమారు 40 ఏళ్ల వయసున్న షోవోన్ చక్రవర్తి, సాల్ట్ లేక్‌లోని సెక్టార్ Vలో ఒక ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్వతహాగా అతడు సంగీత కళాకారుడు. అతను శాంతినికేతన్‌లోని సంగీత్ భవన్‌లో విద్యార్థులకు సంగీతం బోధించేవాడు. అయితే ఆ చక్రవర్తికి సంగీతం ద్వారా వచ్చే ఆదాయం అతని ఖర్చులను తీర్చలేకపోయింది. అదీగాక కరోనా మహమ్మారి అతడి జీవితాన్ని పూర్తిగామార్చేసింది. ఆ టైంలో బోధించే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమై..జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేయక తప్పలేదు.
అలా అతడు విధి నిర్వహణలో ఉండగా ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ పాటను ఆలపిస్తుండగా ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతడు సంగీత విద్వాంసుడు కావడంతో చాలా అలవోకగా ఆ ప్రసిద్ధ సంగీతాన్ని సునాయాసంగా ఆలపించాడు. పైగా నెటిజన్లు కూడా అతడి గాత్రానికి మంత్రముగ్ధలై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ అతడు పనిచేసే చోట యజమానులకు ఇదంత నచ్చలేదు. పైగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు. అతడి కథను చిత్రనిర్మాత ప్రతీమ్ డి గుప్తాకి నెట్టింట షేర్ చేయడంతో..యూనిఫాం ధరిస్తే..ప్రతిభను వదిలేయమనడం సరైంది కాదంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి.
అయితే చిత్ర నిర్మాత ప్రతీమ్ మాత్రం ఆయన ఆర్థికపరిస్థితులు అనుకూలించక ఈ వృత్తిలో వచ్చారే తప్ప ఆయన సెక్యూరిటీ గార్డు కాదు. పైగా పిల్లలకు సంగీత నేర్పించాలనేది అతడి ధ్యేయం. పైగా ఎవరినీ వ్యక్తి ఎలాంటి ఆర్థిక సాయం కూడా కోరలేదు. అతడి కథ వైరల్ వీడియో ద్వారా చాలామందికి చేరింది, పైగా అతడికి మద్దతిచ్చేందుకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారు.
కానీ అతడికి కావాల్సింది అది కాదంటూ బెంగాలీ గాయకుడు రూపంకర్ బాగ్చి రంగంలోకి దిగి అక్టోబర్‌లో కోల్‌కతాలోని కళా మందిర్ ఆడిటోరియంలో చక్రవర్తి కోసం సంగీత కచేరిని ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. ఇలాంటి సాయం అతడికి తిరిగి సంగీతకారుడిలా జీవించే గొప్ప అవకాశంగా ఉంటుందని అన్నారు రచయిత, చిత్ర నిర్మాత ప్రతీమ్. అంతేగాదు షిప్ట్‌లో ఉండి సెక్యూరిటీ గార్డు పాటపడటం తప్పుకాదు..అతడు కొద్దిసేపు కళకారుడిగా ఉండాలని ఆశపడటమే తప్పు అని అన్నారు.
(చదవండి: పర్యావరణహిత బెలూన్‌లు..! జస్ట్ తొమ్మిది నెలల్లో..)


