చాట్‌జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్‌ | Indian-Origin Teen Arjun Aravind Arrested for Murdering Mother & Brother in US After Using ChatGPT | Sakshi
Sakshi News home page

చాట్‌జీపీటీ సాయం : తల్లి, తమ్ముడ్ని హత్య చేసిన 17 ఏళ్ల టీనేజర్‌

Aug 13 2026 12:48 PM | Updated on Aug 13 2026 1:17 PM

Indian Origin Teen Murders Mother Brother In US Home

అమెరికాలో జంట హత్యలు కలకలం  రేపాయి. అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబాన్ని ఎలా హత్య చేయాలనే  విషయాలను ఏఐలో  వెతికి మరీ ఈ దురాగతానికి పాల్పడటం మరింత ఆందోళ రేపింది. చాట్‌ జీపీటీని ఉపయోగించినట్లు తేలింది. గోతిక్ నవల (Gothic novel) తరహా కథలు, పాత్రలను రూపొందించడంలో సాయం చేయాలని AI ఛాట్‌బాట్‌ను కోరినట్లు  పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

మసాచుసెట్స్ డిస్ట్రిక్ట్ అటార్నీకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికాలోని మాసాచుసెట్స్‌ సబర్బన్ ఏరియాలో భారతీయ సంతతికి చెందిన టీనేజర్‌ అర్జున్ అరవింద్,  తల్లి  సుధా వెంకటేశన్‌  (45), సోదరుడు సిద్ధార్త్‌ (14) దారుణంగా హత్య చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు.

 మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చిన ట్యూటర్ లోపలికి వెళ్లలేక అర్జున్ తండ్రికి సమాచారం అందించారు. తండ్రి ఫోన్ చేసినా  ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి ‘వెల్ బీయింగ్ చెక్’ చేయాల్సిందిగా కోరారు.  పోలీసులు వచ్చి చూడగా తల్లీ కొడుకులిద్దరూ మృతి చెంది ఉన్నారు. ఆక్టన్ ప్రాంతంలోని వారి ఇంట్లోనే ఈ హత్యలు జరిగాయి.

నేరం జరిగిన తర్వాత అర్జున్ తన తల్లికి చెందిన హోండా కార్‌లో పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మృత దేహాలపై తీవ్రమైన గాయాలున్నాయనీ, తల్లి మృతదేహం బేస్‌మెంట్‌లో, తమ్ముడి మృతదేహం మొదటి అంతస్తులో లభ్యమయ్యాయనీ వెల్లడించారు. దీంతో అర్జున్‌పై రెండు హత్య కేసులు, కుటుంబ సభ్యులపై దాడి, కారు దొంగతనం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గాలింపు చర్యల అనంతరం వేలాండ్ (Wayland) ప్రాంతంలోని ఒక పార్కింగ్ లాట్‌లో కారులో అర్జున్‌ను  అదుపులోకి తీసుకున్నారు.

ఛాట్‌జీపీటీ వాడకంపై పోలీసుల ప్రకటన
అర్జున్ కొంతకాలంగా విచిత్రమైన ప్రవర్తన కనబరుస్తున్నాడు. కుటుంబాన్ని చంపేందుకు సంబంధించిన ఊహాజనిత కథనాలు, ఆలోచనల కోసం ఇంటర్నెట్, ChatGPTని ఉపయోగించినట్లు విచారణలో తేలిందని మిడిల్‌సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement