వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) విద్యుత్ వ్యవస్థలో మార్పుల కోసం భారతీయ సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన మొదటి స్పేస్‌వాక్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని సౌర ఫలకాలను అమర్చేందుకు అవసరమైన కిట్ ఒకదాన్ని మరో వ్యోమగామి జెస్సికా మీర్ కలిసి బిగించారు. ఐఎస్‌ఎస్ కార్యక్రమాల్లో ఇది 281వ స్పేస్‌వాక్ కాగా...జెస్సికా మీర్‌కు ఆరోది.
ఈ స్పేస్‌వాక్ గురువారం భారతీయ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.03 గంటలకు మొదలై శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు పూర్తయ్యింది. ఇద్దరు వ్యోమగాములు క్వెస్ట్ ఎయిర్‌లాక్ నుంచి బయటకు వచ్చి ఆర్బిటల్ లా»ొరేటరీకి సంబంధించిన పనులు చేపట్టారు. ఐఎస్‌ఎస్ ట్రస్ విభాగంలోని స్టార్‌బోర్డ్ – 6పై ఉన్న స్టేషన్ 3బీ పవర్ ఛానల్‌పై పరికరాలను బిగించడం ఈ స్పేస్‌వాక్ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఐరోసా అని పిలిచే సరికొత్త సౌరఫలకాల అమరిక సులువు అవుతుంది.
మడత పెట్టగల ఈ సౌర ఫలకాల వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆర్బిటల్ లాబొరేటరీకి, అందులోని కీలక వ్యవస్థలకు చాలా అవసరం. అంతేకాకుండా స్పేస్ స్టేషన్ మొత్తాన్ని సురక్షితంగా కక్ష్యలోంచి కిందకు దించేందుకూ సాయపడుతుంది. ఐరోసా సౌరఫలకాలను 2021 నుంచి దశలవారీగా అమరుస్తూ వస్తున్నారు. వ్యోమగాములు గతంలో స్పేస్‌వాక్‌లు నిర్వమించి ఆరు ఐరోసా సౌర ఫలకాలను అమర్చారు. ఏడాది చివరలో మరో రెండు యూనిట్లు ఐఎస్‌ఎస్‌కు చేరనున్నాయి.
మీనన్, మిర్‌లు ఐరోసా నుంచి 3బీ పవర్ ఛానల్‌కు కేబుళ్లను అమర్చారు. స్ట్రట్‌లపై ఇన్సులేషన్ పొరలు కప్పారు. మొత్తం ఆరుగంటల 27 నిమిషాలపాటు సాగిన ఈ స్పేస్‌వాక్‌లో మీర్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా... ఆమె అనిల్‌తో మాట్లాడుతూ ‘‘అనిల్, నీకు చంద్రుడు కనిపిస్తున్నాడా? నువ్వు ఏ వైపు చూస్తున్నావో నాకు తెలియడం లేదు,’’అని అడగ్గా... మీనన్.. ‘‘నా కుడివైపు. అవును, కనిపిస్తోంది. ముందుగా చెప్పినందుకు ధన్యవాదాలు. అక్కడ భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే స్థావరాన్ని ఊహించగలను’’అని సమాధానమిచ్చారు.
మీనన్, మిర్‌లు ఈ నెలలో చేపట్టనున్న స్పేస్‌వాక్‌లలో ఇది మొదటిది. ఆగస్టు 13న జరిగే రెండో స్పేస్‌వాక్‌లో వీరిద్దరూ ఆర్బిటల్ కాంప్లెక్స్‌లోని స్పేస్–టు–గ్రౌండ యాంటెన్నాను మార్చేయనున్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న కంట్రోల్ స్టేషన్‌కు, ఐఎస్‌ఎస్‌కు మధ్య డేటా ప్రసారానికి, కమ్యూనికేషన్స్‌కు ఈ యాంటెన్నా అత్యవసరం. మూడో స్పేస్‌వాక్‌లో భాగంగా ఆగస్టు 25న ఐఎస్‌ఎస్ సిబ్బంది వపర్ ఛానెల్ కేబుళ్లను, డేటా రిలే వ్యవస్థలను కలుపుతారు. ఇదంతా ఐఎస్‌ఎస్ మెయింటెన్స్‌లో భాగం. అలాగే 2030 నాటికి ఐఎస్‌ఎస్‌ను సురక్షితంగా సముద్రంలోకి కూల్చేయాలన్న నాసా ప్లాన్‌లో భాగం కూడా.


