న్యూ మెక్సికో కోర్టు తీర్పు
56.7 కోట్ల డాలర్ల చెల్లింపునకు ఆదేశం
శాంటా ఫే: సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటాకు దెబ్బపై దెబ్బ పడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో నిలిపివేతపై మెటా అధినేత జుకర్‌బర్గ్ సారీ చెప్పిన ఘటన సమసిపోకముందే అమెరికా న్యాయస్థానం ఈ కంపెనీపై భారీ జరిమానా విధించింది.
ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువతకు జరుగుతున్న నష్టాన్ని 56.7 కోట్ల డాలర్లతో భర్తీ చేయాలని న్యూమెక్సికో న్యాయస్థానం ఒకటి తీర్పునిచ్చింది. ఈ మొత్తంలో 42 కోట్ల డాలర్లను యువత చికిత్సకు ఉపయోగించాలని న్యాయమూర్తి బ్రయన్ బైడ్‌ఛైడ్ ఆదేశించారు. మిగిలిన 14.7 కోట్ల డాలర్లను రానున్న ఐదేళ్లలో సోషల్ మీడియాతో కలిగే నష్టాలపై యువతలో అవగాహన పెంచేందుకు నివారణ, స్క్రీనింగ్ సేవలు, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు.


