ప్రజ్ఞానంద అద్భుత విజయం.. టైటిల్‌ సొంతం | R Praggnanandhaa Wins Saint Louis Rapid & Blitz Title | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞానంద అద్భుత విజయం.. టైటిల్‌ సొంతం

Aug 7 2026 12:40 PM | Updated on Aug 7 2026 1:11 PM

Indian GM Praggnanandhaa wins maiden Saint Louis Rapid Blitz title

PC: ChessBaseIndia X

భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. తొలిసారిగా సెయింట్‌ లూయీస్‌ రాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే అతడు ఈ ఘనత సాధించడం విశేషం.

చెన్నైకి చెందిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. తాజాగా సెయింట్‌ లూయీస్‌ రాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ (Saint Louis Rapid & Blitz title) టోర్నీలోనూ అదరగొట్టాడు. అమెరికాలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జొవోఖిర్‌ సిందరోవ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. మొత్తంగా 23.5 పాయింట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు.

అగ్రస్థానంలో
మిగతా ఆటగాళ్ల కంటే ఒకటిన్నర పాయింట్లు ఎక్కువగా కలిగి ఉండటంతో.. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే ప్రజ్ఞానంద విజేతగా అవతరించాడు. పాయింట్ల పరంగా ప్రజ్ఞానంద అగ్రస్థానంలో నిలవగా.. సిందరోవ్‌ 22 పాయింట్లతో రెండు, అమెరికా గ్రాండ్‌ మాస్టర్‌ విస్లే 20.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

ఇక సెయింట్‌ లూయీస్‌ రాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టైటిల్‌ గెలుపుతో ఓవరాల్‌ గ్రాండ్‌ చెస్‌ టూర్‌ (GCT) పాయింట్ల పట్టికలో ప్రజ్ఞానంద రెండో స్థానానికి చేరుకున్నాడు. తద్వారా జీసీటీ ఫైనల్స్‌కు చేరుకునే మార్గం సుగమం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రజ్ఞానంద నార్వే చెస్‌ టైటిల్‌ కూడా గెలిచిన విషయం తెలిసిందే.

చదవండి: స్వర్ణం గెలిచినా అస్మితకు నిరాశేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement