PC: BCCI X
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్ జట్టుతో మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది.
కొలంబోలోని నాండెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
గిల్‌కు గాయం.. సారథిగా రాహుల్
ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు బదులు.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. నెట్స్‌లో గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో గిల్‌కు విశ్రాంతినిచ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారిక అప్‌డేట్ అందించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గిల్ తొలి రోజు వామప్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని తెలిపింది.
భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.
శ్రీలంక ఎలెవన్ జట్టు
నిశాన్ మధుషాంక (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.
చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్


