టీమిండియాతో తొలి టెస్టు.. శ్రీలంకకు భారీ షాక్‌! | Sri Lankas Kusal Mendis All But Ruled Out Of 1st Test Against India | Sakshi
Sakshi News home page

టీమిండియాతో తొలి టెస్టు.. శ్రీలంకకు భారీ షాక్‌!

Aug 6 2026 4:44 PM | Updated on Aug 6 2026 4:58 PM

Sri Lankas Kusal Mendis All But Ruled Out Of 1st Test Against India

భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆగ‌స్టు 15న ప్రారంభ‌య్యే తొలి టెస్ట్‌కు  స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కుశాల్ మెండిస్ గాయం కార‌ణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. 31 ఏళ్ల కుశాల్ మెండిస్ లంక ప్రీమియర్ లీగ్‌-2026లో తొడ కండ‌రాల గాయం బారిన ప‌డ్డాడు.

దీంతో అత‌డు టోర్నీ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. అయితే భార‌త్‌తో టెస్టు సిరీస్ స‌మ‌యానికి కుశాల్ కోలుకుంటాడ‌ని లంక సెలక్టర్లు భావించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు  శ్రీలంక ప్రముఖ జర్నలిస్ట్ దనుష్క అరవింద పేర్కొన్నారు.

ఒకవేళ మెండిస్ దూరమైతే శ్రీలంకకు భారీ షాక్ అనే చెప్పాలి. కుశాల్ సొంత గడ్డపై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు శ్రీలంకలో 59 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన మెండిస్ 41.49 సగటుతో 2365 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 75 టెస్ట్‌ల్లో 4836 రన్స్ చేశాడు. 

తొలి టెస్ట్ సమయానికి మెండిస్ ఫిట్‌నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో  నిషాన్ మదుష్క వికెట్ కీపర్‌గా వ్యవహరించే అవకాశముంది. మరోవైపు కుశాల్‌కు ప్రత్నామ్యాయంగా మరో యువ ఆటగాడు పాసిందు సూరియబండార పేరును లంక సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

గత నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక టెస్టు జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. కానీ తుది జట్టులో అతడికి అవకాశం లభించలేదు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి మంచి రికార్డు ఉంది. లోయర్-మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి దూకుడుగా ఆడడం అతడి స్పెషాలిటి. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో   సూరియబండార 102 ఇన్నింగ్స్‌లలో 4893 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement