భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పులు | CSA revises schedule to include three T20Is for India series | Sakshi
Sakshi News home page

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మార్పులు

Aug 6 2026 3:54 PM | Updated on Aug 6 2026 3:56 PM

CSA revises schedule to include three T20Is for India series

భారత మహిళల జట్టు ఈ ఏడాది డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం..  ఈ టూర్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఓ టెస్ట్ ఆడాల్సి ఉంది. అయితే తాజాగా ఈ షెడ్యూల్‌ను సౌతాఫ్రికా క్రికెట్ (CSA) సవరించింది. టెస్టు, వన్డే సిరీస్‌లతో పాటు అదనంగా మూడు మ్యాచ్‌ల టీ20లను జోడించిన‌ట్లు సీఎస్ఎ వెల్ల‌డించింది.

2027 ఫిబ్రవరిలో శ్రీలంక వేదికగా జరగనున్న తొలి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ఇరు జట్లను సిద్ధం చేయడంలో భాగంగా ఈ టీ20 సిరీస్‌ను చేర్చిన‌ట్లు సీఎస్ఎ అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ పర్యటన డిసెంబర్ 9 నుంచి 30 వరకు జరగనుంది.

పూర్తి షెడ్యూల్ వివరాలు (డిసెంబర్ 2026):
ఏకైక టెస్టు: డిసెంబర్ 9 - 12: గెబెర్హా (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు)

వన్డే సిరీస్: 
1వ వన్డే: డిసెంబర్ 16, పార్ల్ (ఉదయం 10 గంటలకు) 
2వ వన్డే: డిసెంబర్ 19, కేప్ టౌన్ (మధ్యాహ్నం 2 గంటలకు) 
3వ వన్డే: డిసెంబర్ 22, బ్లూమ్‌ఫోంటెయిన్ (మధ్యాహ్నం 2 గంటలకు)

టీ20 సిరీస్: 
1వ టీ20: డిసెంబర్ 26, బెనోని (సాయంత్రం 6 గంటలకు) 
2వ టీ20: డిసెంబర్ 29, పోచెఫ్‌స్ట్రూమ్ (సాయంత్రం 6 గంటలకు) 
3వ టీ20: డిసెంబర్ 30, పోచెఫ్‌స్ట్రూమ్ (సాయంత్రం 6 గంటలకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement