విండీస్‌ ప్లేయర్‌ అరుదైన రికార్డు | 5 TROPHIES FOR ROMARIO SHEPHERD IN LAST 14 MONTHS | Sakshi
Sakshi News home page

విండీస్‌ ప్లేయర్‌ అరుదైన రికార్డు

Aug 6 2026 3:16 PM | Updated on Aug 6 2026 3:25 PM

5 TROPHIES FOR ROMARIO SHEPHERD IN LAST 14 MONTHS

వెస్టిండీస్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ రొమారియో షెపర్డ్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. గత 14 నెలల కాలంలో ఏకంగా ఐదు ఛాంపియన్‌షిప్ టైటిళ్లు సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో బహుశా ఏ ఆటగాడు ఇలాంటి ఘనత సాధించి ఉండడు. 

షెపర్డ్‌ ఆడిన ప్రతి టైటిల్‌ గెలిచి 100 పర్సెంట్‌ స్ట్రయిక్‌ రేట్‌ మెయింటైన్‌ చేశాడు. తాజాగా అతడు గయానా అమెజాన్‌ వారియర్స్‌ తరఫున టైటిల్‌ సాధించాడు. ఈ జట్టు ఈ టైటిల్‌ గెలవడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాదే షెపర్డ్‌ ఆర్సీబీ తరఫున కూడా టైటిల్‌ సాధించాడు. 

ఈ ఫ్రాంచైజీ కూడా టైటిల్‌ గెలవడం వరుసగా ఇది రెండోసారి. షెపర్డ్‌ తన జాతీయ జట్టుకు ఏమో కానీ, ఫ్రాంచైల పాలిట లక్కీ లెగ్‌గా మారాడు.  

షెపర్డ్‌ గెలిచిన 5 టీ20 టైటిళ్లు
2025- IPL (ఆర్సీబీ) 
2025- Global Super League (గయానా అమెజాన్‌ వారియర్స్‌)
2025- Major League Cricket (ఎంఐ న్యూయార్క్‌)
2026- IPL (ఆర్సీబీ)    
2026- Global Super League (గయానా అమెజాన్‌ వారియర్స్‌)

ఇదిలా ఉంటే, తాజాగా షెపర్డ్‌ టైటిల్‌ గెలిచిన గ్లోబల్‌ సూపర్‌ లీగ్‌లో వివిధ దేశాలకు చెందిన ఫ్రాంచైజీలు పోటీపడతాయి. తాజా ఎడిషన్‌ ఫైనల్లో వారియర్స్‌ శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 6 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండోసారి టైటిల్‌ ఎగరేసుకుపోయింది. 

వారియర్స్‌కు 47 ఏళ్ల ఇమ్రాన్‌ తాహిర్‌ టైటిల్‌ గెలిపించాడు. ఈ టోర్నీలో షెపర్డ్‌ వ్యక్తిగతంగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement