breaking news
GSL
-
విండీస్ ప్లేయర్ అరుదైన రికార్డు
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. గత 14 నెలల కాలంలో ఏకంగా ఐదు ఛాంపియన్షిప్ టైటిళ్లు సాధించాడు. ప్రపంచ క్రికెట్లో బహుశా ఏ ఆటగాడు ఇలాంటి ఘనత సాధించి ఉండడు. షెపర్డ్ ఆడిన ప్రతి టైటిల్ గెలిచి 100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్ మెయింటైన్ చేశాడు. తాజాగా అతడు గయానా అమెజాన్ వారియర్స్ తరఫున టైటిల్ సాధించాడు. ఈ జట్టు ఈ టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాదే షెపర్డ్ ఆర్సీబీ తరఫున కూడా టైటిల్ సాధించాడు. ఈ ఫ్రాంచైజీ కూడా టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. షెపర్డ్ తన జాతీయ జట్టుకు ఏమో కానీ, ఫ్రాంచైల పాలిట లక్కీ లెగ్గా మారాడు. షెపర్డ్ గెలిచిన 5 టీ20 టైటిళ్లు2025- IPL (ఆర్సీబీ) 2025- Global Super League (గయానా అమెజాన్ వారియర్స్)2025- Major League Cricket (ఎంఐ న్యూయార్క్)2026- IPL (ఆర్సీబీ) 2026- Global Super League (గయానా అమెజాన్ వారియర్స్)ఇదిలా ఉంటే, తాజాగా షెపర్డ్ టైటిల్ గెలిచిన గ్లోబల్ సూపర్ లీగ్‌లో వివిధ దేశాలకు చెందిన ఫ్రాంచైజీలు పోటీపడతాయి. తాజా ఎడిషన్ ఫైనల్లో వారియర్స్ శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 6 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. వారియర్స్‌కు 47 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ టైటిల్ గెలిపించాడు. ఈ టోర్నీలో షెపర్డ్ వ్యక్తిగతంగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. -
47 వయస్సులో సంచలనం.. కెప్టెన్‌గా కప్ కొట్టాడు
గ్లోబల్ సూపర్ లీగ్ (GSL)-2026 సీజన్ విజేతగా గయానా అమేజాన్ వారియర్స్ నిలిచింది. శనివారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో శాన్ ఫ్రాన్సిస్కోను 6 పరుగుల తేడాతో ఓడించిన గయానా.. వరుసగా రెండో సారి జీఎస్ఎల్ టైటిల్‌ను ముద్దాడింది.85 పరుగులే చేసినాఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమేజాన్ వారియర్స్ కేవలం 85 పరుగులకే ఆలౌటైంది. టాప్-8 బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఒకానొక దశలో 29 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కనీసం 40 పరుగులైనా చేస్తుందో లేదో అనిపించింది.అయితే చివర్లో మాథ్యూ ఫోర్డ్ (23 బంతుల్లో 28 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో గయానా ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. అనంతరం బౌలింగ్‌లో మాత్రం ఇమ్రాన్ తహీర్ సారథ్యంలో గయానా వారియర్స్ అద్భుతం చేసింది. యూనికార్న్స్ బ్యాటర్లలో ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ ఆలివర్ పీక్ (28 బంతుల్లో 31 పరుగులు) మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.యూనికార్న్స్ విజయానికి చివరి ఓవర్లో 7 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో కల్లమ్ స్టో అనూహ్యంగా రనౌట్ కావడంతో యూనికార్న్స్ 79 పరుగులకే ఆలౌటైంది. గయానా బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ మూడు, మహ్మద్ నబీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ తహీర్ రెండు వికెట్లు సాధించాడు.చరిత్ర సృష్టించిన తహీర్ఈ విజయంతో అమేజాన్ వారియర్స్ కెప్టెన్, సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 టోర్నీ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా(47) తహీర్ నిలిచాడు.చదవండి: రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే? -
అగ్రిగోల్డ్ కేసులో కొత్త మలుపు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.రూ.10 కోట్ల డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వాలన్న అభ్యర్థనను జీఎస్ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. కోర్టు సమయాన్ని వృథా చేసిన జీఎస్‌ఎల్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్, న్యాయమూర్తిని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జీఎస్ఎల్ గ్రూప్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో 10 ఆస్తులను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. సీఐడీ సమర్పించిన 10 ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని హైకోర్టు, ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా జిల్లాల వారీగా ఆస్తుల విక్రయానికి త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. కార్పస్ ఫండ్‌ను ఏపీ ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించింది. అగ్రిగోల్డ్ కేసుపై తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ కేసుపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ..20 వేల ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరు. రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం అడ్వాన్స్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలల్లో బాధితులకు డబ్బులు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. త్రిసభ్య కమిటీ ద్వారా ఇప్పటివరకూ జమ అయిన నగదును జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని చెప్పారు. -
చికిత్సలో ఆధునిక పద్ధతులు అనుసరించండి
* వైద్యులకు ఆరోగ్యమంత్రి కామినేని హితవు * జీఎస్‌ఎల్‌లో దంతవైద్య సదస్సు ప్రారంభం రాజానగరం : వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులతో రోగులకు మేలైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ, జీఎస్ఎల్ డెంటల్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న థర్డ్ ఏపీ రాష్ట్ర అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డెంటల్ కాన్ఫరెన్స్ని శుక్రవారం రాత్రి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్ వైద్య కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ కామినేని మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం తాను వైద్య విద్యను అభ్యసించన నాటికీ, నేటికీ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. నాడు పంటినొప్పి వస్తే పీకేయడమే చికిత్సని, కానీ నేడు పనికి రాని పంటిని కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక ప్రక్రియ ద్వారా పటిష్టం చేస్తున్నారని చెప్పారు. అంతేకాక వైద్య విద్యార్థుల్లో బాలుర కంటే బాలిక ల శాతం ఎక్కువగా ఉండటం హర్షణీయమన్నారు. పీహెచ్‌సీల్లో దంతవైద్యులు.. స్టేట్ డెంటల్ కౌన్సిల్ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు. వివిధ దంత వైద్య కళాశాలల ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి పై విధంగా స్పందించారు. పీహెచ్సీలలో దంత వైద్యుని పోస్టు ఉండేలా ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల పోస్టుల భర్తీలో పూర్తి పారదర్శకతను చూపించామన్నారు. తాము అధికారంలోకి వచ్చే సరికి ఈ వ్యవస్త పూర్తిగా పాడైందని, డీఎంఅండ్‌హెచ్‌ఓలు బాధ్యతగా విధులు నిర్వర్తించే స్తితిలో లేరని అన్నారు. ఆయుష్ బదిలీలలో అవినీతి జరిగిందని గ్రహించి పూర్తిగా నిలిపివేశామన్నారు. వైద్యులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ : నంబరు 411ను మరో 15 రోజుల్లో రద్దు చేయడం లేదా సవరించడం చేస్తామన్నారు. తమ పదవులు శాశ్వతం కాదని, మీ సేవలే శాశ్వతమంటూ వైద్య విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 24 దంత వైద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు. కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు వి.సూర్యనారాయణరాజు, ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, స్పందన వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ గన్ని కృష్ణ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్.అమరసింహారెడ్డి , కార్యదర్శి డాక్టర్ కె.అజయ్బెనర్జీ, సదస్సు అధ్యక్షుడు డాక్టర్ పి.కరుణాకర్, కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఘంటా సునీల్, జీఎస్ఎల్ కార్యదర్శి డాక్టర్ గన్ని సందీప్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ శర్మ, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కల్పన, సభ్యులు డాక్టర్ బీవీవీ సతీష్, డాక్టర్ సతీష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రద ర్శించారు. 28ఆర్జెసీ166: జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ 28ఆర్జెసీ170: విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన


