సాక్షి, హైదరాబాద్: నటుడు ప్రకాష్‌రాజ్ మరోమారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో శనివారం మాట్లాడిన ఆయన గణేష్ నిమజ్జనం అయింది.. ఎన్నికల అధికారి జ్ఞానేష్ విసర్జనం కావాలంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ ఏర్పాటు అయిన నాటి నుంచి ఓటర్ లిస్ట్ మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అప్ డేట్ వర్షన్ తొ సర్ ను ఇంత హడావుడి గా చేపట్టడం ఏంటి అని ప్రశ్నించారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా రాగానే ఏదో జరుగుతుంది అనే అనుమానం మాకు కలిగిందన్నారు.
ఎలా నిరూపించుకోవాలి?
ప్రతీ పౌరుడికి ఓటు ఉండాలని అంబెడ్కర్, నెహ్రూ పోరాడారని ప్రకాశ్‌రాజ్ అన్నారు. నాకు ఓటు ఉందని నేను ఎలా నిరూపించుకోవాలి? ఆధార్ కాదన్నారు... మరి ఇంకా ఏ పేపర్ చూపించాలి? 14 రాష్ట్రాలలో సర్ పూర్తయిన తర్వాత అసలు కథ బయటపడింది. ఎన్నికలకు 6 నెలల ముందు ఓట్లు తొలగించడం ఏంటి? అని ప్రశ్నించారు.నెక్ట్స్ టైం ఓటు వేసుకోండని కోర్ట్ తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సర్ తొ బెంగాల్ లొ ప్రభుత్వం నే మార్చేసారు. ఎన్నికల కమిషన్ దగ్గర సిబ్బంది లేదు... ఇంత దొందరగా సర్ ను కంప్లైంట్ చేయడం సాధ్యం కాదు. స్వఛ్ఛ్ భారత్ పబ్లిసిటీ కి మోడీ పెట్టిన ఖర్చు కంటే...సర్ పబ్లిసిటీ కి పెట్టిన ఖర్చు తక్కువ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. సర్ పై ప్రజలకు ఏ మాత్రం అవగాహన కల్పించలేదు. కర్ణాటకలొ ఇంకా ఎన్నికల సమయం ఉంది... కాస్త లేటయినా సర్ ను పర్ఫెక్ట్ గా చేయాలని అడిగాం అయినా వినలేదు. సర్ సక్రమంగా జరిగిందా లేదా అన్నది వంద బూతుల్లో ఇన్వెస్టిగేషన్ చేద్దాం అన్నాం....అయినా వినలేదు. ట్రాన్స్ జెండర్లకు ఇల్లు లేదు.. కుటుంబం లేదు...వాళ్లు ఏ పేపర్ చూపించాలని ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించారు. ఎవరు ఓటెయ్యాలనేది రాజకీయ పార్టీ లు డిసైడ్ చేస్తాయా అని ప్రకాశ్ రాజ్ అడిగారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు డిసైడ్ చేసుకోవాలి
17 కోట్ల ఓట్ల గల్లంతు ఎలా జరుగుతుంది? ఒక చోట నుంచి ఒక చోట కు మారితే లెక్క ఎలా మారుతుంది. ఫామ్ 6 అనేది కొత్త ఓటర్ కోసం మాత్రమే... ఓటు పోయిన వారికి ఫామ్ 6 ఇవ్వండి ఏంటి? దళిత, ఆదివాసి, ముస్లిం ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతున్నది. బీజేపీ ఆఫీస్ ల నుంచి ఓటర్ లిస్ట్ వస్తుంది.. ఎవరెవరి ఓట్లు తొలగించాలో బీజేపీ ఆఫీస్ లు డిసైడ్ చేస్తున్నాయి. బీజేపీ తొ పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే బీజేపీ, ఎన్నికల కమిషన్ కు మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజల వైపు ఉంటారో, ఎన్నికల కమిషన్ వైపు ఉంటారో డిసైడ్ చేసుకోవాలని ప్రకాశ్‌రాజ్ సూచించారు.
మనుస్మృతి సిద్దాంతం అమలు చేస్తున్నారు
అమిత్ షా, మోడీ బిల్లా రంగా లు. జ్ఞానేష్ కుమార్ వెనక ఉంది... బిల్లా రంగాలే. జ్ఞానేష్ కుమార్ తీసుకునే నిర్ణయాల పై ఎవరూ కోర్ట్ కూ వెళ్లకుండా చట్టం తెచ్చారు. ముందే వ్యూహం రచించి... ఈ చట్టం తెచ్చారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఒకటి, రెండు సార్లు జరగాల్సిన ఎన్నికలు 6,7 షెడ్యూల్ చేశారు. ప్రాంతీయ పార్టీ లను చంపేశారు. మనుస్మృతి సిద్దాంతం ను అమలు చేస్తున్నారు. ఇద్దరు కమిషనర్ లు చెప్పింది భిన్నాభిప్రాయమా... ఒక్కడు జ్ఞానేష్ చెప్పింది సరైందా అని ప్రకాశ్ రాజ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల కమిషన్ యాప్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని, హంతకుడు మర్డర్ చేసేటప్పుడు దొరకడు... సాక్షాలు తారుమారు చేసెటప్పుడు దొరుకుతాడని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ దొరికాడని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీ లు తమ ఓటు ను మాత్రమే కాపాడుకుంటున్నాయి.. కానీ అందరివి కాదు. రాజకీయ పార్టీ లు ప్రజల వైపు నిలబడుతాయా లేదా తేల్చుకోవాలి. కర్ణాటక లొ జరిగిన తప్పిదాలను సీఎం కు వివరించా... వాళ్లు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ దేశం డేంజర్ లొ ఉంది...నాతొ అభిప్రాయ భేదాలు ఉన్న వారు కూడా కలసి రావాల్సిన అవసరం. ఉంది..సర్ ను రద్దు చేయాలి అని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు విచారణ చేపట్టాలి
ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసే కమిటీ నిబంధనలు మార్చాలి. 2023 నుంచి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల పై సుప్రీంకోర్టు విచారణ జరపాలి. ఈ దేశంలో ఎప్పుడు ఏ ఆఫీస్ లొ ఫైల్ కాలిపోతుందో తెలియదు. జ్ణానేష్ కుమార్, మోడీ, అమిత్ షా పై కేసు పెట్టాలని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. 2018 లో నాకు 4 ఓట్లు ఉన్నాయని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. నేను 20 సంవత్సరాలు తమిళనాడులొ ఉన్నా ..అక్కడే ఓటేశాను. ఆ తర్వాత బెంగళూరుకు షిఫ్ట్ అయ్యా.. నా ఓటును తమిళనాడు నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయింది. ఎన్నికల కమిషన్ కూడా నాకు ఓటు ఒక్కటే అని తేల్చింది. నాకు నాలుగు ఓట్లు ఉంటె...ఆ నాలుగు ఓట్ల ఎపిక్ నెంబర్ ఎందుకు బయటపెట్టడం లేదు. ఉన్న ఓటే పోయింది... నాలుగు ఓట్లు ఎక్కడివి అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.
జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రక్రియ వల్ల దేశవ్యాప్తంగా ఏం జరిగిందో అందరికీ తెలుసని, దాదాపు 13 కోట్ల మంది ఓటర్లు ప్రభావితమయ్యారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం తప్పని పేర్కొంటూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రస్తుతం ప్రధాన రాజకీయ అంశంగా మారింది. పలు నివేదికల ప్రకారం ముసాయిదా జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారు. అర్హులైనప్పటికీ పేర్లు జాబితాలో లేకుండా పోయిన ఓటర్ల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు, పౌరహక్కుల కార్యకర్తలు పారదర్శకత, నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే ఓటర్ల జాబితాలను మరింత కచ్చితంగా రూపొందించడమే ‘సర్’ లక్ష్యమని ఎన్నికల సంఘం వివరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు ఎన్నికల్లో జవాబుదారీతనం, ఓటు హక్కు, ఎన్నికల సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అంశాలపై కొనసాగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి.
ఇదీ చదవండి: ‘క్లాడ్’కు ఆధునిక వివేకానందుని నైతిక శిక్షణ


