బెంగళూరు: నెలకు రూ.లక్ష వేతనం లేకుంటే బెంగళూరులో జీవించడం కష్టమంటూ ఐటీ ఉద్యోగి శివాంక్ గోయల్ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బెంగళూరులో జీవనశైలి, ఖర్చులపై తన అనుభవాలను ఆ వీడియోలో పంచుకున్నారు. ‘నెలకు కనీసం రూ.లక్ష వేతనం ఉండాలి. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ బెంగళూరుకు రావాలనుకునేవారు ఈ విషయంపై ఒకసారి పరిశీలించుకోవాలి’ అని సూచించారు. ‘బెంగళూరులో ఇంటి అద్దెలు అధికం. రూ.2 లక్షల వరకు అడ్వాన్స్ ఇవ్వాలి. ట్రాఫిక్‌లో 5 కిలోమీటర్ల దూరం క్యాబ్‌లో వెళ్లాలంటే రూ.600 అవుతుంది’ అని పేర్కొన్నారు.


