రిషబ్‌ శెట్టి.. ఆడిషన్స్‌కు పోటెత్తిన ఔత్సాహికులు.. వీడియో షేర్‌ చేసిన హీరో | Rishab Shetty Shares Audition Video After Receiving Massive Response to Casting Call | Sakshi
Sakshi News home page

రిషబ్‌ శెట్టి కాస్టింగ్‌ కాల్‌కు భారీ స్పందన.. వీడియో షేర్‌ చేసిన హీరో

Oct 2 2026 9:23 PM | Updated on Oct 2 2026 9:23 PM

Rishab Shetty Shares Audition Video After Receiving Massive Response to Casting Call

‘కాంతార’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి.. ప్రస్తుతం కొత్త ప్రతిభను ప్రోత్సహించే పనిలో ఉన్నారు. తన నిర్మాణ సంస్థ ‘రిషబ్‌ శెట్టి ఫిల్మ్స్‌’పై తెరకెక్కనున్న ఓ కొత్త చిత్రం కోసం ఇటీవల కొత్త నటీనటుల నుంచి దరఖాస్తులు కోరుతూ కాస్టింగ్‌ కాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు భారీ స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో ఆడిషన్స్‌కు హాజరయ్యారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను రిషబ్‌ శెట్టి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

 ఉత్సాహాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు
‘నేను నిర్మిస్తున్న ఓ కొత్త ప్రయాణం త్వరలో ప్రారంభం కానుంది. ఆడిషన్స్‌కు హాజరై ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీ ప్రతిభను, ఉత్సాహాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు. నేను నిర్వహించిన కాస్టింగ్‌ కాల్‌కు లభించిన స్పందన, ఉత్సాహం నిజంగా అద్భుతమైనది. ఎంతోమంది ప్రతిభావంతులు తమ కలలు, అభిరుచితో ముందుకు రావడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆడిషన్స్‌ మొదటి రౌండ్‌ పూర్తైంది. ఈ ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు’’ అని రిషబ్‌ శెట్టి తెలిపారు.

కొత్తవారికి అవకాశం కల్పించేలా రిషబ్‌ శెట్టి చేస్తున్న ఈ ప్రయత్నంపై ఆసక్తి నెలకొంది. మొదటి రౌండ్‌ ఆడిషన్స్‌ పూర్తవడంతో తదుపరి దశలో ఎవరెవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ధనుష్‌ కొత్త సినిమా వాయిదా.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement