బాలీవుడ్ హీరోయిన్‌కు ప్రమాదం | Bollywood Actress Nushrratt Bharuccha Injured in Bali Accident | Sakshi
Sakshi News home page

Nushrratt Bharuccha: హీరోయిన్‌ నుస్రత్ బరుచాకు ప్రమాదం

Oct 2 2026 5:32 PM | Updated on Oct 2 2026 5:59 PM

Bollywood Actress Nushrratt Bharuccha Injured in Bali Accident

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ బరుచాకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోనేషియాలోని బాలి వెళ్లిన ఆమె వెన్నెముక ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబయికి తరలించి, అక్కడ సర్జరీ చేయనున్నట్లు ఆమె టీమ్ తెలిపింది. శస్త్రచికిత్స అవసరమని ధృవీకరిస్తూ ఆమె బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమెకు మద్దతుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా.. నుస్రత్ వారం క్రితమే తన బాలి పర్యటన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతలోనే ఇలా ప్రమాదానికి గురైంది.

కాగా.. నుస్రత్ 2006లో 'జై సంతోషి మా' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత నుస్రత్ తెలుగులోనూ సినిమాలు చేసింది. తాజ్‌ మహల్ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది. అలాగే బాలీవుడ్‌లో ‘సోను కే టిటు కి స్వీటీ’, ‘ఛత్రపతి’ రీమేక్,  'లవ్ సెక్స్ ఔర్ ధోకా, ప్యార్ కా పంచనామా', 'ప్యార్ కా పంచనామా 2'  వంటి చిత్రాల్లో మెప్పించింది. ఆమె ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ఒక యాక్షన్ చిత్రంలో కనిపించనుంది. టైగర్ ష్రాఫ్‌తో  కలిసి నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement