ది ప్యారడైజ్‌లో కేసీఆర్‌ రోల్.. ప్రియదర్శిని చూసి కన్నీటి పర్యంతం | A women Fan Of KCR tears After Seing Priyadarshi in Paradise Movie role | Sakshi
Sakshi News home page

Paradise Movie: కేసీఆర్‌లా ప్రియదర్శి.. మహిళా అభిమాని కన్నీటి పర్యంతం

Oct 2 2026 4:12 PM | Updated on Oct 2 2026 4:30 PM

A women Fan Of KCR tears After Seing Priyadarshi in Paradise Movie role

నాని హీరోగా వచ్చిన లేటేస్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్.  శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా ఫర్వాలేదనిపిస్తోంది. సవారీలు అనే జాతి తమ మనుగడ చేసే పోరాటం ఆధారంగా ఈ కథను తెరకెక్కించారు.

అయితే ఈ చిత్రంలో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు కనిపించడం ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే శంకరన్న పాత్రను కేసీఆర్‌లా చేయడం ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీలో కేసీఆర్ రోల్‌ను ప్రియదర్శి చేయడం మరో విశేషం. అచ్చం కేసీఆర్‌లాగే ప్రియదర్శి చెప్పిన డైలాగ్స్ అభిమానులను కట్టిపడేశాయి.

'చావు నోట్లో తలకాయ పెట్టైనా సరే మీకు గుర్తింపు తీసుకొస్తా' అనే డైలాగ్‌ అభిమానులను ఆకట్టుకుంది.  ఈ పాత్రలో కనిపించిన ప్రియదర్శిని ప్రతి ఒక్కరూ అభినందించారు. కేసీఆర్‌ లుక్‌లో ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారంటూ ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రియదర్శిని చూసిన ఓ మహిళా అభిమాని కన్నీటి పర్యంతమైంది. కేసీఆర్‌లా అద్భుతంగా చేశావంటూ భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement