నయా ట్రెండ్‌ వృద్ధులకు వెల్కమ్‌ కిట్‌ | International senior citizen day special story | Sakshi
Sakshi News home page

International senior citizen day నయా ట్రెండ్‌ వృద్ధులకు వెల్కమ్‌ కిట్‌

Oct 1 2026 7:00 PM | Updated on Oct 1 2026 7:10 PM

International senior citizen day special story

ముసలివారంటే ముఖం తిప్పుకోవడం, రిటైర్‌ అయిన వారిని భారంగా భావించడం సమాజంలో ఎప్పుడూ చూస్తున్న తీరే. కానీ క్రమంగా ట్రెండ్‌ మారుతోంది. పలు రంగాలకు చెందిన ఎన్నో సంస్థల్లో దశాబ్దాల కాలం పాటు పనిచేసిన అనుభవజ్ఞులైన సీనియర్‌–రిటైర్డ్‌ ఉద్యోగుల విలువను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి.

రెండున్నర దశాబ్దాలుగా ప్రతి రంగంలోనూ క్రమంగా ఇంటర్నెట్‌ ఆధారిత కంప్యూ టర్‌ ఆపరేషన్స్‌ మొబైల్‌ యాప్స్‌ వినియోగం గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో గత దశాబ్దపున్నర, ఆ పైన విభిన్నరంగాల్లో పనిచేస్తూ రిటైర్మెంట్‌ దశకు వచ్చిన చాలామంది వృద్ధులు కంప్యూటర్స్, మొబైల్‌ ఆధారిత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, రిమోట్‌ ఆపరేషన్స్‌లో మంచి అవగాహన కలిగినవారయ్యారు. వీరికి అటు మేన్యు వల్‌ వ్యవస్థల పైనా, డిజిటల్‌–ఆన్‌లైన్‌ కార్యకలా పాలలోనూ ప్రవేశం, అవగాహన, నైపుణ్యం ఉన్నాయి. ఫలితంగా ఇటీవల రిటైర్‌ అయిన సీనియర్‌ ఉద్యోగులు ఏ పనయినా హ్యాండిల్‌ చెయ్యగలరనే నమ్మకాన్ని పెంపొందించుకున్నారు.

సీనియర్ల సామర్థ్యానికి కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, పుణేకి చెందిన దివంగత డాక్టర్‌ బల్వంత్‌ ఘట్‌పండే తన 102వ ఏట కూడా వైద్య సేవలందించారు. ఏపీకి చెందిన దివంగత కర్రె మస్తానమ్మ తన 106 ఏళ్ల వయసులోనూ కంటెంట్‌ క్రియేటర్‌గా యూట్యూబ్‌ చానల్‌కు వీడియోలిచ్చారు. హైదరాబాదులో డాక్టర్‌ సూరి శ్రీమతి తన 92వ ఏళ్ల వయసులోనూ గైనకాలజిస్టుగా స్త్రీలకు చికిత్సలు చేస్తూ, పురుళ్ళు పోస్తున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన చిలుకూరి శాంతమ్మ తన 95 ఏళ్ళ వయసులోఆంధ్రా యూనివర్సిటీలో ఫిజిక్స్‌ పాఠాలు బోధిస్తున్నారు. 

చాలామంది వృద్ధులు తగిన ఆరోగ్యంతో తమ వృత్తి ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. యువతరంలా దూకుడుగా పనిచెయ్యక పోయినా, అన్ని కోణాల్లోనూ ఆలోచించి సమస్యలు తలెత్తకుండా సంపూర్ణంగా చేస్తారనే విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. వీరికి ఉన్న దశాబ్దాల అనుభవం, జ్ఞానం, జవాబుదారీతనం, ప్రాబ్లమ్‌ హ్యాండ్లింగ్‌ వంటివి కొత్త ఉద్యోగులకు రావాలంటే కొన్నేళ్ళు పడుతుంది. మరి నేటి యువతరాన్ని చూస్తే గట్టిగా రెండు మూడేళ్ళు ఒకే సంస్థలో పనిచేస్తే ఎక్కువ అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఇలాంటప్పుడు అర్హతలున్న ఉద్యోగులు దొరకనప్పడు ఆ రంగంలో పనిచేసి రిటైర్‌ అయిన పాత ఉద్యోగులను మళ్ళీ పిలిపించుకుని పని ఇస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన పెద్దవారిలో 45 శాతం మంది కెరీర్‌ పరుగులో చకచకా ముందడుగు వేస్తున్నారని హెచ్‌ఆర్‌ సంస్థల అంచనా. అందుకే సిన్సియారిటీ, సింప్లిసిటీకి ప్రతిబింబాలైన రిటైర్డ్‌ సీనియర్లను నెట్‌వర్క్‌ చేసి, రిటైర్‌మెంట్‌జాబ్స్, లింక్డ్‌ఇన్, నౌక్రీ, ఆఫ్సర్‌ వంటి మొబైల్‌ యాప్స్, వెబ్‌సైట్స్‌ అవకాశాలు కల్పిస్తున్నాయి.

– గుళ్ళపూడి ‘ సీనియర్‌ జర్నలిస్ట్‌
(నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement