breaking news
special story
-
దిమాగీ నక్సల్ అంటే మాకు మెదడు ఉన్నట్టే కదా!
ప్రశ్న: ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంత మైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త పర్యటన ఎందుకు?ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం. జార్ఖండ్‌లో విద్యార్థులు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం. కోల్‌కతాలో ఐఎస్ఐ విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం. తర్వాత జైపూర్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఏబీవీపీ హింసకు వ్యతి రేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. సీజేఐని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వారితో కలిసి పోరాడుతున్నాం.జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పింది?ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం. అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడు తున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి.మీ తక్షణ లక్ష్యం ఏమిటి?ప్రత్యేకంగా ఏమీ లేదు. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను సంఘటితం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని అర్థమయ్యేలా చేయడం– ఇవే మా లక్ష్యాలు. నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు. నేను ఏఐఎస్‌ఏలో భాగం. అదే నా సంస్థ. అభిజీత్ దీప్కే సీజేపీలో భాగం. అదే ఆయన సంస్థ. సోనమ్ వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వారా కలిసి పోరాడవచ్చు.మీరు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. ప్రధాన స్రవంతి రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం. కాబట్టి నేను ఆ రాజకీయాల్లో చేరను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను – నాకు సాధ్యమైనంత లోతుగా. నా భావజాలాన్ని కొనసాగిస్తాను. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించవచ్చు.మోదీ అంటించిన ‘దిమాగీ నక్సల్’ లేబుల్‌పై మీ స్పందన?అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్’ అనేది ఒక జోక్ మాత్రమే. అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా ‘నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి’ అనుకుని ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది. కానీ ఇందులో మరో విషయం ఉంది. ‘దిమాగీ నక్సల్’ అంటే మనందరికీ మెదడు ఉంది. మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు. కాబట్టి ‘దిమాగీ నక్సల్స్’ అని పిలిస్తే పిలవనివ్వండి!– డానీ, సమాజ విశ్లేషకులు -
రుచుల విందుకు ఈ మూడు వంటకాలు చాలా స్పెషల్!
వేడివేడి బీటెన్ కాఫీ నుంచి ఘుమఘుమలాడే కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ వరకు.. చివర్లో నోట్లో కరిగే ధార్వాడ్ పేడాతో ఈరోజు మీ రుచుల పండుగను పూర్తి చేసుకోండి. సులభమైన తయారీ విధానంతో ఇంట్లోనే చేసుకోగలిగే ఈ మూడు వంటకాలు రుచితోపాటు ప్రత్యేకతను కూడా అందిస్తాయి. మరి ఈ వంటకాల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..బీటెన్ కాఫీ..కావలసినవి:ఇన్ స్టంట్ కాఫీ పొడి: 2 టేబుల్ స్పూన్లు,పంచదార: 2 టేబుల్ స్పూన్లు,వేడి నీళ్లు: 2 టేబుల్ స్పూన్లు,పాలు: 2 కప్పులు (చిక్కటివి),గార్నిష్ కోసం: కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి.తయారీ:ఒక కప్పులో లేదా గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి, 2 టేబుల్ స్పూన్ల పంచదార, రెండు టేబుల్ స్పూన్ల వేడి నీళ్లు పోయాలి.మొదట్లో ఇది చిక్కటి నల్లని ద్రవంలా కనిపిస్తుంది.ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ లేదా విస్కర్‌తో వేగంగా తిప్పుతూ చిలకాలి.తిప్పుతున్న కొద్దీ కాఫీ రంగు నలుపు నుంచి క్రమంగా లేత గోధుమ వర్ణంలోకి మారి, చిక్కటి నురగలాగా తయారవుతుంది.ఒక పాత్రలో రెండు కప్పుల పాలను బాగా మరిగించాలి.పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.ఇపుడు మనం తయారుచేసి పెట్టుకున్న కాఫీ క్రీమ్‌ను రెండు సర్వింగ్ కప్పులలో సమానంగా వేయాలి.దానిపై వేడివేడి పాలను కొద్దిగా పైనుంచి ధారగా పోయాలి.ఇలా పోయడం వల్ల కాఫీ క్రీమ్ పైన తేలుతూ మంచి నురగలా వస్తుంది.స్పూన్ తో మెల్లగా ఒకసారి కలిపి, పైన కొద్దిగా కోకో పౌడర్ లేదా కాఫీ పొడి జల్లి వేడివేడిగా సర్వ్ చేయడమే! కాఫీ చిలికేటప్పుడు బాగా చిక్కగా అనిపిస్తే, చుక్కల చొప్పున వేడి నీళ్లను మాత్రమే చేర్చుకోవాలి.కాశ్మీరీ మటన్ రోగన్ జోష్కావలసినవి:మటన్: 1/2 కేజీ,నెయ్యి : 4–5 టేబుల్ స్పూన్లు,పెరుగు: 1/2 కప్పు,ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి),అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్,కశ్మీరీ మిర్చి పౌడర్: 2 టేబుల్ స్పూన్లు,సోంపు పౌడర్: టేబుల్ స్పూన్,సొంటి పొడి: అర టీస్పూన్,హోల్ గరం మసాలాలు: ఏలకులు (4), లవంగాలు (4), దాల్చిన చెక్క (2 ముక్కలు), బిర్యానీ ఆకు (2), గరం మసాలా పొడి 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి, అందులో చిలికిన పెరుగు, కొద్దిగా కశ్మీరీ కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగించాలి.అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి.ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ను వేసి మీడియం ఫ్లేమ్‌పై 8–10 నిమిషాలు బాగా వేయించాలి.మటన్ నుంచి నీరు బయటకు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి.అందులో సోంపు పొడి, సొంటి పొడి, మిగిలిన కాశ్మీరీ కారం వేసి బాగా కలపాలి.తగినంత నీరు పోసి మూత పెట్టి మటన్ మెత్తగా ఉడికించుకోవాలి.చివరగా పైన గరం మసాలా చల్లుకొని, నెయ్యి పైకి తేలే వరకు సన్నని మంటపై 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే! ఘుమఘుమలాడే వేడివేడి కాశ్మీరీ మటన్ రోగన్ జోష్ సిద్ధమైనట్లే! దీనిని వేడివేడి అన్నం, నాన్ లేదా పరాటాతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.ధార్వాడ్ పేడాకావలసినవి:చిక్కటి పాలు: ఒకటిన్నర లీటరు (తాజా పనీర్ కోసం),నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు,చక్కెర: ముప్పావు కప్పు (తీపికోసం), మరో 2 టేబుల్ స్పూన్లు క్యారమెల్ కోసం,నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు,పాలు: పావు కప్పు,ఏలకుల పొడి: అర టీస్పూన్,చక్కెర పొడి: 3 టేబుల్ స్పూన్లు.తయారీ:ముందుగా పాలను మరిగించి, అందులో కొద్దికొద్దిగా నిమ్మరసం వేస్తూ కలపాలి.పాలు విరిగి నీరు వేరయ్యాక, కాటన్ క్లాత్‌లో వడకట్టి, తిరిగి చల్లని నీటితో కడిగి నీళ్లన్నీ పిండేయాలి.వడకట్టిన పనీర్‌ను ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి కలుపుతూ ఎక్కడా గడ్డలు లేకుండా మెత్తటి ముద్దలా చేసుకోవాలి.ఆ తరువాత ఒక బాణలిలో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పనీర్ తురుమును వేయాలి.సన్నని మంటపై కలుపుతూ వేయించాలి.పనీర్ పొడిగా మారుతున్నప్పుడు మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి, పాలు చల్లుతూ వేయించాలి.పనీర్ గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.ఆ తరువాత మరొక చిన్న పాత్రలో 2 స్పూన్ల చక్కెర వేసి సన్నని మంటపై నీళ్లు పోయకుండా కరగనివ్వాలి.చక్కెర బ్రౌన్ కలర్ క్యారమెల్గా మారిన వెంటనే వేయించిన పనీర్‌లో పోయాలి.అలాగే చక్కెర, ఏలకుల పొడి, 2 స్పూన్ల పాలు వేసి చక్కెర కరిగే వరకు కలపాలి.మిశ్రమం దగ్గరపడి డార్క్ రంగులోకి వస్తుంది. ఇపుడు దీనిని కొద్దిగా చల్లారనిచ్చి, మిక్సీ జార్లో వేసి ఒక్కసారి పల్స్ చేసి తీస్తే మెత్తగా తయారవుతుంది.చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా తీసుకుంటూ కోలగా తయారుచేసుకోవాలి.తర్వాత చక్కెర పొడిలో దొర్లించి కోటింగ్ ఇవ్వాలి. అంతే ధార్వాడ్ పేడా రెడీ! వీటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచితే వారం రోజులకు పైగా తాజాగా ఉంటుంది. -
పుడమితల్లి వేడుక 'పాచామామా'!
దక్షిణ అమెరికా దేశమైన పెరూ ‘పాచామామా’ వేడుకకు సిద్ధమైంది. పుడమితల్లికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుకలను ఆగస్టు మాసమంతా అండీస్ పర్వత ప్రాంతాల్లోని ప్రాచీన తెగలు, గ్రామీణ ప్రజలు, పెరూ పౌరులందరూ ఏకమై ఘనంగా నిర్వహిస్తారు. స్పానిష్ వలస పాలకుల రాకకు శతాబ్దాల ముందు నుంచే కొనసాగుతున్న ఈ సంప్రదాయం నేటికీ ఆండియన్ క్యాలెండర్లో అత్యంత ముఖ్యమైన పండుగగా నిలుస్తోంది.పాచామామా అంటే...‘పాచా’ అంటే ప్రపంచం, భూమి, స్థలం, సమయం, విశ్వం అని అర్థం. ‘మామా’ అంటే తల్లి అని అర్థం. అంటే ‘విశ్వానికి మూలమైన నేలతల్లి’అని అర్థం. ఆండియన్ ప్రజల దృష్టిలో భూమి అనేది అందరినీ పోషించే ఒక జీవ వ్యవస్థ.ఆగస్టులోనే ఎందుకు?ఆండియన్ సంప్రదాయాల ప్రకారం, ఆగస్టు నెలలో భూమాత తన నోరు తెరుస్తుందని, మానవులు సమర్పించే నైవేద్యాలను స్వీకరిస్తుందని నమ్ముతారు. పంటల కాలం పూర్తయి, కొత్త వ్యవసాయ చక్రం ప్రారంభమయ్యే సమయం కాబట్టి, భూమి సారవంతంగా ఉండాలని, కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని, వ్యాపారంలో అభివృద్ధి ఉండాలని కోరుకుంటూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ప్రధాన ఆచారాలుఈ ఉత్సవాల్లో షామన్లుగా పిలిచే ప్రాచీన పూజారుల నేతృత్వంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముందుగా భూమి తల్లికి పూలు, పండ్లు, జొన్నలతో నైవేద్యం సమర్పించే ‘దేశ్పాచో’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం ‘పాగో అ లా తియెర్రా’ అని నిర్వహించే ‘నేలతల్లికి చెల్లింపు’ కార్యక్రమంలో అనేక ప్రత్యేక కానుకలను అగ్నిదేవునికి సమర్పించి, పాటలు, ప్రార్థనల ద్వారా భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. చివరగా వనమూలికలతో ధూపం వేసి వాతావరణాన్ని, మనుషులను శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఇది దుష్టశక్తులను పారద్రోలి, నూతనోత్తేజాన్ని ఇస్తుందని ఆండియన్ ప్రజల నమ్మకం.ఆండియన్ సంస్కృతిలో ప్రపంచాన్ని మూడు లోకాలుగా విభజించారు. ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించడమే ‘పాచామామా’ పూజ ప్రధాన ఉద్దేశం. మొదటిది ‘హనన్ పాచా’– అంటే ఆకాశం, సూర్యుడు, నక్షత్రాలు, వాతావరణాన్ని సూచించే ఊర్ధ్వలోకం. రెండోది ‘కే పాచా’ అంటే మానవులు సహా సమస్త జీవజాలం నివసించే నేల ఉపరితలం. మూడవది ‘ఉఖు పాచా’ అంటే భూమి లోపలి భాగం. విత్తనాల మొలకెత్తే శక్తికి ప్రతిరూపం.ఈ పాచామామా ఉత్సవాలు కేవలం స్థానికులకే కాక, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునేవారు ఈ ప్రాంత ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఉత్సవాల్లో అందరిపట్ల గౌరవంగా మెలగడం, ఫొటోలు, వీడియోలు తీసుకోవాలనుకుంటే స్థానికుల అనుమతి తీసుకోవడం వంటి నిబంధనలుంటాయి. పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. అంటే ప్రకృతి మనకు జీవనాన్ని ఇచ్చినపుడు, మనం తిరిగి కృతజ్ఞతగా నైవేద్యాలను సమర్పించి ప్రకృతి సమతుల్యతను కాపాడాలి అనేది వీరి సిద్ధాంతం. ∙ రమా జంబుల -
మూగవాని పిల్లనగ్రోవి!
‘నేను ఒంటరిగా కూర్చుని రాసుకునే సమయంలోనే నాకు ఇతరులతో సంభాషిస్తున్నట్లు అనిపిస్తుంద’న్న పాపానికి ఆ కవి, నాటకకర్త, నవలా రచయిత, సినిమా దర్శకుడు– రచయిత, నోబెల్ సాహిత్య పురస్కార విజేత ‘ఉలిపికట్టె‘ అనే బిరుదు సంపాదించుకున్నాడు. ‘గడ్డకట్టించే చల్లదనం లాంటిది ఒంటరితనం; అది వేధించే శూన్యతలాంటిది.అలాంటి సందర్భాల్లో, మనం మరీ అంత దిగజారిపోలేదని నచ్చజెప్పే తోడొకటి అవసరమ’ని చెప్పిన ఆ రచయితను పట్టుకుని ‘ఉలిపికట్టె‘గా జమకట్టడం సరైందేనా? ‘కళాకారుల సృజనలో జీవనగమనం ప్రతిఫలించినప్పుడే, వాళ్ళు ఆదర్శవ్యక్తులు కాగలుగుతార’న్న ఆ పెద్దమనిషిని పదిమందితో కలవడానికి ఇష్టపడని ‘నామాల కాకి’గా పరిగణించడం భావ్యమేనా? కానీ జెర్మన్ రచయిత పీటర్ హాంట్కె మొహాన యూరపియన్ పీఠాధిపతులు అవే ముద్రలు కొట్టారు. అలా మనుషుల మొహాలపై ముద్రలు కొట్టే పీఠాధిపతుల్లో చాలామందికి – సాధారణంగా – స్పందించే హృదయం ఉండదంటారు. హాంట్కె కథ వింటే ఆ మాట నిజమేననిపిస్తుంది! ముందు అతని కథ చెప్పుకుని, అప్పుడతని కళాకౌశలం గురించి చెప్పుకుందాం.దాదాపు వెయ్యిన్నర సంవత్సరాలుగా ఆగ్నేయ యూరపులోని బాల్కన్ ద్వీపకల్పం సమీపంలో నివసిస్తున్నది సెర్బు జాతి. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, తదనంతర మారణకాండల్లోనూ తీవ్రంగా నష్టపోయిన జాతుల్లో అదీ ఒకటి. మొదటి ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 45 లక్షలు. వాళ్ళలో 17శాతం– ఎనిమిది లక్షల వరకు– ఆ యుద్ధానికి బలయ్యారు. రెండో ప్రపంచయుద్ధం నాటికి సెర్బుల జనసంఖ్య 55 లక్షలు కాగా, వారిలో పదిశాతం ఆ యుద్ధంలో తుడిచిపెట్టుకు పోయారు. అటు తర్వాత 1990 నాటికి సెర్బుల జనాభా 85 లక్షలకు చేరుకుంది.ఆ దశకంలో జరిగిన మారణకాండల్లో దాదాపు యాభైవేలమంది సెర్బులు బలైపోయారు; ఏడు లక్షలమంది ఇల్లూ వాకిలీ పొలమూ పుట్రా లేకుండాపోయారు. అలాంటి బాధిత జాతిలో పుట్టినవాడు పీటర్ హాంట్కె! ఇప్పుడు మనం ఆస్ట్రియాగా పిలిచే ప్రాంతమంతా ఒకప్పుడు ఐక్య జెర్మన్ సామ్రాజ్యంలో భాగంగా వుండేది. ఆరోజుల్లో– 1942లో– హాంట్కె అక్కడ పుట్టాడు. దక్షిణ ఆస్ట్రియాలో, కొండలూ కొలనులకు నెలవై వుండే ప్రాంతం కెరెంథియా. అందులో భాగంగా వుండే గ్రిఫిన్ అనే పట్టణం హాంట్కె స్వస్థలం.హాంట్కె కుటుంబ జీవనం స్థిమితంగా సాగిన సందర్భం లేదనే చెప్పాలి. అతని తల్లి ప్రపంచయుద్ధాలూ– ఆర్థికమాంద్యం– ద్రవ్యోల్బణం తదితర పరిణామాల నేపథ్యంలో తెగిన గాలిపటంగా మారిన మనిషి. కాకుల్లా పొడిచే పలుగాకుల మధ్యన అలాంటి బతుకు బతకలేక 1971లో అతని తల్లి మారియా ఆత్మహత్య చేసుకుంది. ‘పుర్రచేతి వాటం స్త్రీ’ అనే నవలికను 1972లో తన తల్లి జ్ఞాపకంగా హాంట్కె రాశారు; తర్వాత నాలుగేళ్ళకు ఆ నవలికనే ‘కలలను మీరిన ఖేదం’ పేరిట స్వీయ దర్శకత్వంలో సినిమాగానూ రూపొందించారు. సినిమా రంగంతో అతనికి అంతకు పదేళ్ళకు ముందు నుంచీ సంబంధముంది.తనే స్వయంగా నాలుగు సినిమాలు తీసిన హాంట్కె, 1969 నుంచి ’87 వరకూ విమ్మ్ వెండెర్స్ తీసిన నాలుగు సినిమాలకు స్క్రిప్టులు రాశాడు. వ్లాదిమిర్ గెరిక్ దర్శకత్వంలో రూపొందిన యుగోస్లావీన్ టీవీ ఫిల్మ్ ‘క్యాస్పర్’ స్క్రిప్టును కూడా హాంట్కెయే రచించారు. ‘క్యాస్పర్ హాసర్ జీవితకథ’గా పందొమ్మిదో శతాబ్దిలో ప్రచురమైన కల్పితగాథ ఆధారంగా హాంట్కె ముందో రూపకం రాశాడు. దాన్నే తర్వాత టీవీ స్క్రిప్టుగా రూపొందించాడు. (రడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘జంగిల్ బుక్’లోని మౌగ్లీ కూడా క్యాస్పర్ హాసర్ కోట్ జేబులోంచే ఊడిపడ్డాడంటారు! –అదలా వుంచండి.)దృశ్యమాధ్యమాల కోసం హాంట్కె రూపొందించిన ఈ రెండు స్క్రిప్టులకూ కొంత సామ్యముంది– కొంత వైరుద్ధ్యమూ వుంది. హాంట్కె తల్లి లోకరీతి ప్రకారం బతికిన మనిషి కాదు; అలా బతకాలని ఆమె అనుకోనూ లేదు! క్యాస్పరుకు ‘నాగరికుల’ భాష రానట్లే, ఆమెకి లోకం పోకడ తెలీదు. వాళ్ళిద్దరూ– ఓ రకంగా– మూగవాళ్ళే! సామాజిక కట్టుబాట్లను ఖాతరు చెయ్యనివాళ్ళే!! అయితే, క్యాస్పర్ లోకంపోకడ ఒంటబట్టించుకుని, సామాజిక జీవనంలో కలిసి పోవాలనుకున్నాడు. కానీ, అలా చెయ్యలేకపోయాడు.అతని మృతికి కారణమైన గాయం ఇతరులు చేసిందా? స్వయంగా తనను తానే పొడుచుకున్నాడా అనే ప్రశ్నకు గత రెండువందల యేళ్ళుగా సమాధానం దొరకనే లేదు! పోతే– మారియా మాత్రం తనకు నచ్చినట్లే బతకాలని ప్రయత్నించి, పదేపదే విఫలమై విసిగిపోయిన మనిషి. వాళ్ళ మూగ ఆవేదనలే ఇతివృత్తంగా హాంట్కె ఈ రెండు స్క్రిప్టులూ రచించాడు. కట్టుబాట్ల అరదండాల మధ్య ఊపిరిసలపని మూగవాళ్ళ మూలుగులను మనకు వినిపించిన పిల్లనగ్రోవే హాంట్కె కలం.వాస్తవానికి, హాంట్కె రాసిన 40 నవలల్లోనూ, 15 రూపకాల్లోనూ, అసంఖ్యాకమైన అతని స్క్రీన్ ప్లేలలోనూ అంతర్లీనంగా వుండే సామాన్య సూత్రమిదే! ‘కళ అటు ఆనందంలోంచీ, ఇటు ఆవేదనలోంచీ కూడా పుడుతుంది; అయితే చాలామటుకు ఉత్తమ కళాఖండాలు వేదనలోంచే రూపుదిద్దుకుంటాయ’న్నాడు నార్వీజియన్ పెయింటర్ ఎడ్వాడ్ మూంక్. 2019లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న హాంట్కె అలాంటి అభిప్రాయాలను అంత సూటిగా ఎప్పుడూ చెప్పలేదు. కానీ అతని సాహిత్యమంతటా అలముకుని వున్న తాత్త్వికత అదే!- మందలపర్తి కిషోర్ -
పుణ్యఫలం: ధర దగ్గరే మొదలైన అసలు పంచాయితీ..!
‘‘రేపు ఉదయమే కార్యక్రమం. ఇంకా గోవు సిద్ధం కాకపోతే ఎలా?’’‘‘మీరేం ఆందోళన చెందకండి. అనుకున్నట్టుగానే కార్యక్రమం పూర్తవుతుంది’’.‘‘పదిరోజుల నుంచి మీ వెంట పడుతున్నాను. ఇప్పటి వరకూ ఏదీ ముడిపడలేదు. అందుకే భయంగా ఉంది.’’‘‘మీకిది మొదటిసారేమో! మేము ఎన్ని కార్యక్రమాలు చేయలేదు. ఉదయం చెప్పి ఆవు పంపమని అడిగినా క్షణాల్లో సిద్ధం చేసేస్తాం’’.‘‘ఏదో మిమ్మల్నే నమ్ముకున్నాను... ’’.‘‘మనకు ఎప్పుడూ సప్లై చేసేవాడి దగ్గర ఆవు చనిపోయింది. మనుషుల్లాగానే ఇప్పుడు ఆవులకు కూడా ఇన్సూరెన్సు ఉంటోంది. ఆ గొడవల్లో మునిగి ఉన్నాడతను.’’.‘‘అతను కాకపోతే, ఇంకెవరయినా...’’.‘‘మొన్న రెండు ఆవుల ఫొటోలు పంపాను కదండీ..’’‘‘ఆ... తెల్లటిచర్మం పైన నల్లటి మచ్చలున్న ఆవు... చూడగానే అదోలా ఉంది. అందుకే...’’‘‘ఫరవాలేదు. మీకు నచ్చిన ఆవునే అనుకున్న బడ్జెట్లో వచ్చేలా చూసే పూచీ నాది. మీరేం ఫికర్ కాకండి’’.‘‘తెల్ల ఆవు అయితే బావుంటుందని చెప్పాను తప్ప రంగు పట్టింపు అంత లేదు. మంచి ఆరోగ్యంగా ఉన్న ఆవుని చూసి పంపండి.’’‘‘సరేనండి...’’‘‘మధ్నాహ్నం 12.30 కల్లా మీకు ఫొటోలు వచ్చేస్తాయి. మీకు నచ్చిన ఆవును ఎంపిక చేసుకోండి. మరణించిన మీ బంధువుల ఆత్మశాంతి కోసం ఈ పనికి పూనుకుంటున్నారు. మిమ్మల్ని అభినందించాలి’’.‘‘అంతా సజావుగా జరిగితే ఫరవాలేదు, లేకపోతే నలుగురి ముందూ నవ్వుల పాలవుతాను.’’‘‘ఆ విషయం నాకు వదిలెయ్యండి. మీరు చెప్పిన టైమ్ కంటే ఓ అర్ధగంట ముందే సత్రం దగ్గర ఆవు ఉంటుంది. నా మాట నమ్మండి’’.∙∙ ‘‘అయ్యా, సమయం 5.30 దాటుతోంది. ఆవు సంగతి తేలలేదు. అనుకున్న పని సజావుగా పూర్తవుతుందా లేదా అని భయంగా ఉంది?’’‘‘నాకొదిలెయ్మన్నా కదా... జహీరాబాద్ వాడు ఫోన్ ఎత్తటం లేదు. చాలాసార్లు ట్రై చేశా. ఇప్పుడు చింతలకుంట మార్కెట్ అతను మాట్లాడాడు. ఇప్పుడే ఫొటోలు వచ్చాయి. పంపుతున్నాను.’’‘‘మరి ధర విషయం?’’‘‘కాస్త ఎక్కువ చెబుతున్నాడు.’’‘‘మీరే మాట్లాడి నా బడ్జెట్ ప్రకారం తెగ్గొట్టండి.’’‘‘నా వంతు ప్రయత్నం చేస్తాను.’’‘‘మధ్యాహ్నం అనగా మాట్లాడాను. ఇప్పుడు రాత్రి 7.30 దాటింది. కొన్ని గంటల్లో కార్యక్రమం పెట్టుకుని ఆవు సిద్ధం కాకపోతే ఎలా?’’‘‘తను ఆవు ధర చెప్పాడు. తగ్గటం కుదరదని బిగుసుకుపోయాడు. ఏం చేయాలో తోచక..’’‘‘ఇంతకీ ఎంత చెబుతున్నాడేమిటి?’’‘‘మీకు మెసేజ్ పెట్టాను. వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి.’’‘‘అమ్మో.. ఇంతా? బడ్జెట్ పదివేలు దాటుతుంది’’.‘‘అందుకే నేనే తగ్గించమని బతిమాలుతున్నా’’.‘‘ఎలాగోలా అయ్యేటట్టు చూడండి’’.‘‘చూద్దాం. మనకు బానే పరిచయం ఉన్నవాడు. తగ్గుతాడనే అనుకుంటున్నాను’’.‘‘ప్లీజ్. ఏదో రకంగా సెటిల్ చేయండి.’’∙∙ ‘‘రెండు గంటల నుంచి మీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ టెన్షన్ భరించటం నా వల్ల కావటం లేదు. ఎంతో కొంతకి సెట్ చేయండి. ఇప్పుడు రాత్రి 9 అవుతోంది’’‘‘చాలాసార్లు మాట్లాడి చూశాను. ధర తగ్గించటం కుదరదంటున్నాడు. మీరే ఆలోచించి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి.’’‘‘ఇప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏముంది?’’‘‘అలా కాదు. మీ ఇద్దరికీ కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటు చేస్తాను. మీరు కూడా మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తే బావుంటుంది.’’‘‘ఆ అవసరం ఎంత మాత్రం లేదు. మీపైన బాధ్యత పెట్టాను. అతను తగ్గనంటే నేను మాత్రం ఏం చేస్తాను. ఆ రేటుకే కానిచ్చేయండి.’’‘‘సరే. వాట్సాప్‌లో లొకేషన్ పంపితే వచ్చి మీ ఇంటికొచ్చి డబ్బులు తీసికెళతాడు. పురోహితుడు కూడా కావాలన్నట్టున్నారు. మాకు తెలిసిన ఓ పెద్దాయన్ని పంపుతాను.’’‘‘ఆయనకు సంభావన, ఇతర ఖర్చులు..’’‘‘గోదానానికి రెండువేల నుంచి మూడువేల వరకూ తీసుకుంటారు. దానితో పాటు పెట్రోలు ఖర్చులు నాలుగైదు వందలు ఉంటుందేమో? అంత వరకూ ముట్టచెప్పండి చాలు...’’‘‘అలాగే. సత్రం చిరునామా పంపుతాను. ఉదయం 8, 8.30 కల్లా వచ్చెయ్యమని చెప్పండి.‘‘అలాగే..’’∙∙ ‘‘అదేంటి? ఉదయం ఆరుగంటలకే బయలుదేరతానన్నావు కదా?’’‘‘మీరు చెప్పిన ధరకయితే రాలేను.’’‘‘అదేంటి? బేరం మాట్లాడుకున్న తర్వాత ఇలా చేస్తారా ఎవరైనా?’’‘‘ఓసారి మీరన్నది గుర్తు చేసుకోండి. ఆవుకు డబ్బులిచ్చాను. మళ్లీ ట్రాన్సుపోర్టుకు అదనమని నాకు తెలీదు అని మీరు వాదించారు..’’‘‘అవును, గుర్తుంది. ఆవు అమ్మిన అతన్ని దగ్గర నంబరు తీసుకుని నీతో మాట్లాడాను. ఇప్పటికే ఖర్చు తడిసిమోపెడయ్యింది. నేను ఇంతే ఇస్తాను. మిగతా ఎమౌంట్ అతని దగ్గర తీసుకోమన్నాను.’’‘‘ఆ..’’‘‘అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా, ఇప్పుడు పంచాయతీ చేస్తున్నావేంటి?’’‘‘బాడుగ గిట్టదు..’’‘‘సరే, ఏం చేస్తాం? నువ్వడిగినదంతా ఇస్తాను, ఆవు, దూడలతో వచ్చెయ్యి’’‘‘డబ్బులు ఫోన్ పే చెస్తే.. బయలుదేరతా.’’∙∙ ‘‘అయ్యా, కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆవుని, దూడని పసుపు, కుంకుమలతో చక్కగా అలంకరించండి.’’రామశర్మ కారు దిగి అక్కడ అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.నుదుటిన పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్ష మాల, చేతికి బంగారు కడియాలు, వేళ్లకు తళతళా మెరుస్తున్న ఉంగరాలు, ఖరీదైన సిల్కులాల్చీ... బాగా ఖరీదయిన మనిషిలాగా కనిపించాడు.నిన్న ఉదయం నుంచి పడిన శ్రమ సార్థకమయ్యే సమయం వచ్చింది. క్రతువు ఘనంగా చేయాలనే సంకల్పంతో ఉన్నా. అందుకే మనసులో ఆందోళనగా ఉన్నా, మిగతా అన్ని ఆలోచనలను పక్కకు నెట్టి చేస్తున్న పనిమీద మనసు నిలిపాను. చుట్టూ ఉన్న వాళ్లని హుషారు చేశాను. ఆవు అలంకరణ పూర్తి కావటానికి ఎంతో సమయం పట్టలేదు. పసుపు, కుంకుమ అలంకరించిన తర్వాత కొత్తగా కొన్న చీర, బ్లౌజ్ పైన పరిచాం. రామశర్మ పెదవులు కదులుతున్నాయి. బయటకు వినిపించటం లేదు గానీ ఆయన ఏవో మంత్రాలు చదువుతున్నాడని అర్థమైంది. ఓ పదినిముషాల తర్వాత ‘‘మీ కుటుంబ సభ్యులంతా దంపతులుగా వచ్చి ముమ్మారు ప్రదక్షిణ చేయండి’’ గట్టిగా చెప్పారు.ఆయన ఆదేశాలు తు.చ. తప్పకుండా అమలు చేశాం. అపరకర్మల కోసం అక్కడకు వచ్చిన వాళ్లు, సత్రం గదుల్లో ఉన్న వాళ్లు బిలబిలమంటూ బయటకు వచ్చి ఈ తంతు చూడటం ప్రారంభించారు. యూట్యూబ్ వచ్చిపడ్డ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. దానిని భక్తి అనాలో, మరొకటనలో.. అంతమందిని చూడగానే రామశర్మలో ఎక్కడలేని హుషారు వచ్చింది.‘‘మీకు గోదానం ప్రాశస్త్యాన్ని వివరిస్తాను’’ ఆయన కంఠం ఖంగుమంది.‘‘గోవులను దానం చేయటం వల్ల దారిద్య్రం తొలగి సంపదలు కలుగుతాయి. అనారోగ్య, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. గృహదోషాలు మాయమవుతాయి. జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. మరణానంతరం ‘వైతరణి’ దాటే క్రమం సులభమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమగతులు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.’’రామశర్మ చెప్పేది అందరూ సావధానంగా వింటున్నారు. టీవీ కార్యక్రమాల్లో ప్రయోక్త మాదిరిగా హావభావాలను ప్రదర్శిస్తూ ఆయన సంభాషణను రక్తికట్టిస్తున్నాడు.‘‘గోవు సకల దేవతా స్వరూపం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తర్వాత, కన్నతల్లి తర్వాత, ఒక్క ఆవును మాత్రమే గోమాత అని పిలుస్తారు...’’ అని వివరించిన తర్వాత.. కాస్త విరామం ఇచ్చి.. ‘‘గోమాత నమోనమో నమోనమో నమః’’ అన్నాడు రామశర్మ.‘‘ఈ నామాన్ని మీరంతా మూడుసార్లు అనండి’’ అని అందరి చేత అనిపించాడు.అందరి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఈ క్షణంలో ఇక్కడ లేకపోయుంటే ఎంత పుణ్యాన్ని కోల్పోయేవాళ్లమో అనుకున్నారు.‘‘మీలో చాలా మందికి గోదానం చేయాలని ఉంటుంది. అదెలాగో తెలియదు. అలాగే కొందరికి ఆసక్తి ఉంటుంది కాని, ఆర్థికంగా స్తోమత ఉండదు. అలాంటి వాళ్లందరి కోసం నా దగ్గర చిట్కా ఉంది. మీరు నెలనెలా వెయ్యి రూపాయలు ఖర్చుపెడితే చాలు, మీ పేరుతో ఆవుకి మేత వేస్తాం. ఆవుల సంతతి పెరుగుతుంది. మీకు పుణ్యం వస్తుంది. వెయ్యి అనే కాదు. ఇవ్వగలిగిన వాళ్లు అంతకంటే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు.’’‘‘మీకు ఆవులు ఉన్నాయా పంతులు గారూ?’’ ఎవరో ఒకావిడ అడిగింది.‘‘ఎంతమాట అన్నావమ్మా! పెద్ద గోశాలనే నడుపుతున్నా. అక్కడ చాలా ఆవులు ఉంటాయి. దానాలు అవసరం అయిన వాళ్లు ఫోన్ చేయవచ్చు. కావాలనుకుంటే వచ్చి చూడొచ్చు’’.లాల్చీ జేబులో నుంచి విజిటింగ్ కార్డుల కట్ట బయటకు తీశాడు. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా మీద పడ్డారు.‘‘వెయ్యి కష్టం అనుకున్న వాళ్లు కనీసం ఐదు వందలయినా ఇవ్వండి. పుణ్యం మూటకట్టుకోండి.’’ అప్పటికప్పుడు రాయితీ కూడా ప్రకటించారు.రామశర్మ మాటలతో మైకం కమ్మిందో, అప్పటికే పుణ్యం అన్న మాట చాలాసార్లు విని ఉండటం వల్లనో తెలియదు అందరికీ పూనకం వచ్చిందో తెలియదు గాని, వెనకా ముందు చూసుకోలేదు. జేబుల్లో నుంచి నోట్లు తీసి రామశర్మ చేతుల్లో కుక్కారు. మరికొందరు డిజిటల్ పేమెంట్ మోడ్‌లోకి వెళ్లారు. రామశర్మ ఓ వైపు నోట్లు సరిచూసుకుంటూ దాతలకు అక్షతలు వేసి ఘనంగా దీవించారు. అందరూ తలో వైపు వెళ్లిపోయారు. ఇది ప్రైవేటు కార్యక్రమం. మా కుటుంబానికి పరిమితమైన వ్యవహారం. దానిని పక్కన పెట్టి ఆయన తన సొంత బిజినెస్‌లో నిమగ్నం కావటం నాకు ఇబ్బంది అనిపించింది. అయినా నోరు మెదపలేకపోయాను. మా కుటుంబంలో మిగతావాళ్లదీ దాదాపుగా అదే పరిస్థితి. అంతలోనే ఆయన నా వైపు చూస్తూ ‘కార్యక్రమం ముగిసింది’ అన్నట్టుగా కళ్లతోనే చెప్పాడు. నేను పర్సులో నుంచి డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టాను.వాటిని లెక్క పెట్టుకుని ‘‘ఇదేంటి?’’ అన్నాడు సీరియస్‌గా.‘‘నేను ఒప్పుకున్నది అంతకేగా.. ఆవు పంపిన వ్యక్తి.. పేరు చెప్పాను. ఆయన చెప్పిన మొత్తం ఇదేగా?’’ అన్నాను అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తూ.‘‘ఈ చిల్లర తీసుకోవటానికి నేనేం ఆషామాషీ వ్యక్తిని కాదండీ.’’ఎంత ఇవ్వాలో అంకె చెప్పాడు. అది వినేసరికి నా కళ్లు బైర్లు కమ్మాయి.‘‘జంటనగరాల్లో నేను ఫేమస్. సినిమావాళ్లు, పొలిటీషియ¯Œ ్స, బిజినెస్ బిగ్ షాట్స్ అందరూ నా క్లయింట్స్. వాళ్లందరికీ నా మాట మీద గురి. నేను చెప్పినట్టల్లా నడుచుకుంటారు. నా నాలిక మీద సరస్వతి నాట్యం చేస్తుంది. నేను ఒక మాట అన్నానంటే అంతే...’’ప్రవాహంలా ఆయన మాటలు సాగుతున్నాయి. ఆ సొద వినటం నాకు ఇబ్బందిగా ఉంది.‘‘నేను సోషల్ మీడియా చూడను. నాకు ఇవేమీ తెలియవు’’ అన్నాను చికాకు బయటకు కనపడకుండా.‘‘నా యూట్యూబ్ చానల్‌కి లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.’’ అన్నాడు దర్పాన్ని ప్రదర్శిస్తూ.అప్పటి వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ పన్నెండేళ్ల కుర్రాడు మొబైల్లో వీడియో తీయటాన్ని ఇంతకు ముందు గమనించాను. ఇప్పుడు ఆయన చెబుతుంటే అర్థం అవుతోంది. ఒకేసారి స్వామికార్యం, స్వకార్యం పూర్తి చేస్తున్నాడన్నమాట. డబ్బు పుచ్చుకుని కార్యక్రమాలు చేయటానికి వస్తాడు. వాటిని షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టి తిరిగి డబ్బు సంపాదిస్తాడు.ఆయన నా ఆలోచనలు తుంచేస్తూ. ‘‘సర్సరే. అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. డబ్బులిస్తే బయలుదేరతాను’’ అన్నాడు దబాయించినట్టుగా. ఆయన అడిగిన మొత్తం చేతిలో పెట్టి నమస్కారం చేశాను. ఆ డబ్బుల్ని లాల్చీలోకి నెట్టుకుని క్షణాల్లోనే మాయమయ్యాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికే నాకు ఓర్పు సడలింది. పని ముగించుకుని ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తోంది. కాని అదంత సజావుగా ముగిసేటట్టు లేదు.∙∙ ‘‘ఉదయం 8గంటలకు రమ్మని పిలిచారు. నాలుగు గంటలు వెయిట్ చేయించారు. ఇంకో వెయ్యి అదనంగా ఇవ్వండి’’ ఆవును వెంట తెచ్చిన వ్యాన్ డ్రైవర్ డిమాండ్ చేశాడు.‘‘ఓ ఐదొందలు.. కాదంటే అదనంగా ఇంకో వంద.. తప్ప అంత కంటే ఎక్కువ ఇవ్వలేను. అంతా లెక్క వేసుకుని డబ్బులు తెచ్చాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు’’ బతిమాలుతున్నట్టుగా అడిగాను.‘‘మీరిచ్చే దానిలో రెండు వందలు చీటీకే పోతుంది’’ నిర్లక్ష్యంగా చెప్పాడతను.‘చీటీ అంటే..?’’‘‘సంతలో ఆవును కొన్నప్పుడు దానికి రిసీప్టు ఇస్తారు. మీ పేరుతో తీసుకున్నాను. కావాలంటే చూడండి’’ చీటీ తీసి నా చేతిలో ఉంచాడు.‘‘పరిస్థితి చాలా అన్యాయంలా ఉందే. ఆవు కొన్నందుకు డబ్బు చెల్లించటం కాకుండా మళ్లీ అదనంగా ఇంకో ఖర్చా? నా దగ్గర ఉన్నవి ఇవే. వీటితో సర్దుకో. విసిగించొద్దు’’.‘‘మిగిలిన డబ్బులు గూగుల్ పే చేయండి’’.‘‘బాబూ, నీకో దండం. ఈ పని తలకెత్తుకుని నేను పడ్డ నరకయాతన చాలు. ఇచ్చింది పుచ్చుకుని వెళ్లు’’.‘‘ఛీ... వెధవ బేరం’’అతని నోటి నుంచి వచ్చిన బూతులు విన్న తర్వాత డబ్బులు ఇచ్చినా బావుండేదని అనిపించింది.∙∙ ఈ తంతులో ఆఖరి ఘట్టంలోకి ప్రవేశించాం. ఓ వైపు భోజనాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, మునిమనవరాళ్లు... అటూ ఇటూ ఐదు తరాల వాళ్లు ఒకచోట చేరారు. అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు.‘‘ఆవిడ పరిపూర్ణ జీవితాన్ని గడిపింది. ఇన్ని తరాల వాళ్లను చూసుకుంది అదృష్టవంతురాలు...’’‘‘పెట్టుపోతలంటే ఆవిడ తర్వాతనే ఇంకెవరయినా. ఇంటికొస్తే ఎంగిలిపడకుండా తిరిగి వెళ్లనిచ్చేది కాదు..’’‘‘ఎవరు ఎన్ని మాటలన్నా మౌనంగా ఊరుకునేది. పరుషంగా ఒక్కరిని నిందించటం చూళ్లేదు..’’‘‘ఇంత పెద్ద సంసారాన్ని ఒంటి చేతిమీద నెట్టుకొచ్చింది.’’నాకు తెలిసి నిన్న మొన్నటి వరకూ వీళ్లంతా ‘ఈ ముసలమ్మ నస భరించలేకపోతున్నాం’ అని విసుక్కున్న వాళ్లే. మరి ఇప్పుడేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు? వ్యక్తుల మరణంతో అన్నీ తుడిచిపెట్టుకుపోయాయా? ఈ సంభాషణ ఒక వైపు సాగుతూండగానే మాకు కొద్ది దూరంలో.. తోడికోడళ్లు నలుగురు పోగయి మాట్లాడుకుంటున్నారు. అక్షరం పొల్లుపోకుండా అవన్నీ నా చెవిలో పడుతున్నాయి.‘‘ఇదంతా పెద్ద షో అక్కా? నెలనెలా జీతం రాళ్లతో బతికేవాళ్లు... వేలకు వేలు పోసి ఆవు కొనగల సత్తా ఉందా? ఎక్కడో ఆవును, దూడను తెచ్చి తంతు ముగించేసి ఉంటారు. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదట!’’‘‘ఈ ముసల్ది కూతురికి పెద్ద మూట ఇచ్చి ఉంటుంది. అందుకే ఘనంగా గోదానం చేస్తున్నారు. ’’‘‘అమ్మ బతికున్నప్పుడు ఉన్న ఊళ్లోనే అయినా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు గానీ, టింగురంగా అంటూ ఇప్పుడొచ్చి ప్రేమ ఉన్నట్టు వేషాలేస్తోంది చూడు. ఆ అల్లుడుగాడు ఏదో గొప్ప పని చేసినట్టు ఫోజు కొడుతున్నాడు. పాపం ఊరికే పోతుందా? వీళ్లను కట్టి కుడపదూ?’’‘‘అత్తగారి వైపు నుంచి బాగా ఆస్తి వచ్చి ఉంటుంది? కొడుకు అమెరికాలో ఉన్నాడుగా.. నెలనెలా డాలర్లు పంపుతూ ఉండుంటాడు. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక, నలుగురి ముందు గొప్ప చాటుకోవాలని..’’‘‘ఇవన్నీ కాదు అక్కా... ముసలమ్మ వాటా కొట్టెయ్యటానికి ప్లాన్ చేశారేమో?’’‘‘మేం చేతగాని వాళ్లమా? అదెలా జరగుతుందో చూస్తాం...’’మా దంపతుల్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి కొనసాగుతోంది. ఇతరుల ప్రశంసల కోసమో, గొప్ప కోసమో ఈ పని చేయలేదు. అసలు గోదానం కొడుకులు చేయవలసిన పని అన్న స్పృహ కూడా నాకు లేదు. నా సమక్షంలో గోదానం గురించి చర్చ సాగుతున్నప్పుడు ‘నేను చూసుకుంటాను’ అని చెప్పి ఇందులోకి దిగాను. అంతకు తప్ప... పక్కనే ఉన్న నా భార్య ఈ మాటలు విన్నట్టుంది. గట్టిగా శోకాలు అందుకుంది. ఆమెను అక్కడ నుంచి పక్కకు తీసికెళ్లి ఓదార్చాక గాని తను మామూలు కాలేకపోయింది. భోజనాలు ముగిశాయి. ఆ తర్వాత ఆశీర్వచన కార్యక్రమం పూర్తయ్యింది.‘‘ఎవరికీ వెళ్లొస్తామని చెప్పకూడదు. పొద్దుగూకక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’’అక్కడున్న వాళ్లెవరో చెప్పారు. ఒక్కొక్కళ్లు లేవటం మొదలుపెట్టారు.ఏ కర్మఫలం నన్ను ఇందుకు పురిగొల్పిందో? నా పుర్రెకు పుట్టిన బుద్ధి... నా భార్యతో సహా మిగిలిన వాళ్లందరినీ ఆశ్చర్యపరచి ఉండొచ్చు. నాకు మా అత్తగారి వైపు వాళ్లతో అంత సాన్నిహిత్యం లేదు. పండగలు, పెట్టుపోతలు లాంటి వాటికి దూరంగా ఉన్న వాడిని. ఇప్పుడిలా.. ఓ మంచి పని చేయటంలో ఉండే తృప్తిని మిగుల్చుకోవాలన్న తాపత్రయం తప్ప దీని వెనక నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఈ మాటలు బయట పెట్టి నేను చేసిన పని విలువను దిగజార్చుకోదలచుకోలేదు.‘‘మరణించిన పెద్దావిడకు భగవంతుడు సద్గతులు ప్రసాదించాలి’’ అనుకున్నాను.రామశర్మ చెప్పినట్టు.. ‘‘ఆమె హాయిగా వైతరణి దాటాలి. దానం చేసిన ఈ గోవు ఆమెకు దీపధారిగా నిలవాలి’’ అని వేడుకున్నాను.ఓ సత్కార్యం చేయటానికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని మనసారా ధన్యవాదాలు చెప్పుకుని నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటపడ్డాం.సూర్యుడు పడమటి కొండల్లోకి దిగుతున్నాడు.- డాక్టర్ పార్థసారథి చిరువోలు -
సినిమాలో పాట లేదని కోర్టు మెట్లు ఎక్కిన మహిళ
ట్రైలర్లో ఉన్న పాట సినిమాలో లేకపోతే ఏం చేస్తారు? తిట్టుకుంటూ బయటకు వస్తారా? డబ్బులు వృథా అయ్యాయని బాధపడతారా? అయితే ఓ మహిళా ప్రేక్షకురాలు ఇలా చేయలేదు. కోర్టుకెక్కింది... వినియోగదారుగా తన హక్కుల కోసం పోరాడింది. ఆ పాట కోసం ఔరంగాబాద్ నుంచి ఢిల్లీ వరకు న్యాయ పోరాటం సాగించింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సమస్యకు శుభం కార్డు పడింది.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా యశ్‌రాజ్ ఫిలిమ్స్(వైఆర్ఎఫ్) 2016లో ‘ఫ్యాన్’ సినిమాను నిర్మించింది. సినిమా విడుదలకు ముందు టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రమోషనల్ ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్‌లోని ‘జబ్రా’ ఫ్యాన్ పాట సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఔరంగాబాద్‌కు చెందిన ఓ స్కూల్ టీచర్ ఈ ట్రైలర్ చూసి కుటుంబంతో సినిమాకు వెళ్లారు. సినిమా పూర్తయినా ఆ పాట మాత్రం రాలేదు. దీంతో ఆమె నిరుత్సాహానికి గురై జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.ట్రైలర్‌లోని పాటను తొలగించి చిత్ర నిర్మాణ సంస్థ మోసం చే సిందని , దీనివల్ల తాను మానసిక వేదనకు గురయ్యానని జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. రూ. 60,500 నష్టపరిహారం కోరారు. టికెట్ కొనుగోలు చేసినంత మాత్రాన నిర్మాత నేరుగా సేవలందించే సంస్థగా మారడని ఫోరం పేర్కొంది. వినియోగదారుడికి..సంస్థకు మధ్య ఎలాంటి చట్టబద్ధమైన హామీ లేదని.. కేసు చెల్లదని కేసు తిరస్కరించింది.ఫిర్యాదుదారుకు అనుకూలంగా..ఆ తీర్పుపై ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. .సినిమా ప్రదర్శన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంలోని ‘సేవ’ నిర్వచనం పరిధిలోకి వస్తుందని, వైఆర్ఎఫ్ ఆ సేవను అందించే సంస్థగా కమిషన్ పేర్కొంది. జబ్రాఫ్యాన్ పాటను తొలగించి సంస్థ ప్రేక్షకులను పక్కదోవ పట్టించింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని అభిప్రాయపడింది. . పరిహారంగా రూ. 10,000, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ.5,000 పిర్యాదుదారుకి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ)ను సంస్థ ఆశ్రయించింది. రాష్ట్ర కమిషన్ అభిప్రాయాన్నే ఎన్సీడీఆర్సీ కూడా సమర్థించింది.ఆఫర్.. అంగీకారం ఉండాలి..ఈ తీర్పుపై వైఆర్ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రైలర్ సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రమే అని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కింద రక్షణ ఉంటుందని పేర్కొంది. అయితే మోసపూరితమైన, అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు రాజ్యాంగ రక్షణ ఉండదని స్పష్టం చేసింది. ట్రైలర్ చూసి ప్రేక్షకుడు ప్రభావితం కావొచ్చు..కానీ చట్టబద్ధమైన హామీగా దీన్ని భావించలేమని కోర్టు వివరించింది. టికెట్ కొని సినిమా చూసే ప్రతీ వ్యక్తి వినియోగదారుడే అనడంలో సందేహం లేదని పేర్కొంది. సేవల్లో లోపం జరిగిందా? లేదా? అనేదే ఈ కేసులో కీలకాంశమని చెప్పింది.అసంపూర్ణత, నాణ్యతలో నాసిరకం, పనితీరు సక్రమంగా లేకపోవడం, తయారీలో తగిన ప్రమాణాలు పాటించకపోవడాన్నే సేవల్లో లోపంగా గుర్తించాలని పేర్కొంది. సినిమాలో ఆ పాట తప్పనిసరిగా ఉంటుందనేది ఫిర్యాదుదారు వ్యక్తిగత అంచనా మాత్రమే అని తెలిపింది. దీన్ని చట్టపరంగా సేవల్లో లోపంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధమైన ఒప్పందం ఏర్పడాలంటే ‘ఆఫర్’ ఉండాలి..ఆ ఆఫర్‌ను మరో పక్షం అంగీకరించాలని చెప్పింది. ట్రైలర్‌ను ‘ఆఫర్’గా భావించలేమని అందువల్ల కాంట్రాక్టు చట్టం ప్రకారం ఈ వాదన సరైంది కాదని తేల్చింది. ప్రతి చిన్న తేడా లేదా ప్రతి నిరాశ ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ నిర్వచనం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రచారం, ప్రకటన, వాస్తవానికి విరుద్ధంగా ఉన్నప్పుడే అది ‘అన్యాయ వాణిజ్య పద్ధతి’ కిందకు వస్తుందని పేర్కొంది. ఈ కేసులో ఇవేవీ రుజువు కాలేదని వివరించింది.యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకులను మోసం చేసిందని, తప్పుదోవ పట్టించిందని నిరూపించే బలమైన ఆధారాలను ఫిర్యాదుదారు సమర్పించలేదని కోర్టు పేర్కొంది. సినిమా నిర్మాణ ప్రక్రియలో ఉన్న పలు అంశాలు చివరి దశలో మారడం సహజమేనని కళాత్మక సేవలను సాధారణ సేవలతో పోల్చలేమని వివరించింది. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీంకోర్టు ఎన్సీడీఆర్సీ ఉత్తర్వును రద్దు చేసింది. ప్రచార ట్రైలర్లో కనిపించిన పాట సినిమాలో లేకపోవడం సేవల్లో లోపం, అన్యాయ వాణిజ్య పద్ధతి కిందకు రాదని తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
సమావేశాలు సరే, సమస్యల మాటేంటి?
భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేది, నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండేది, 143 కోట్ల భారతీయుల తలరాతలను మార్చేది పార్లమెంట్. తమ తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న సమస్యలను ఎంపీలు ప్రస్తావించేందుకు పార్లమెంటు ఓ కీలకమైన వేదిక. ఇప్పుడు కేవలం ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది.దేశంలో పెద్ద గుంతలతో నిండిన రహదారులను దాటడం, మునిగి పోయిన నగరాల్లో నడవడం, అంతులేని ఉద్యోగ దరఖాస్తు లతో చెమటలు పట్టడం, దొంగతనాల వల్ల కోట్లు నష్టపోయే విద్యుత్ రంగానికి ధర చెల్లించడం దేశంలో సాధారణ దృశ్యాలు అయ్యాయి. ప్రతి వారం ప్రజల తెరలపై ఒక వంతెన వంగిపోవడం, ఒక కారును రహదారి మింగేయడం వంటి దృశ్యాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు చూస్తే దేశంలో పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.‘ఎన్ని రహదారులు కూలిపోయాయి?’ అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 49 అని. ఇది 2014 నుండి 2025 వరకు ఉన్న డేటా. ప్రతి వర్షాకాలం కల్లోలం సృష్టిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టణ వరదల బాధ్యతను రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై మోపుతుంది. ఇది రాజ్యాంగపరంగా సరైనదే. అయితే, అతి పెద్ద పట్టణా భివృద్ధి కార్యక్రమం ఢిల్లీ నుండి నిర్వహించబడుతోంది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కింద 8,064 ప్రాజెక్టులలో 7,790 పూర్తయ్యాయి. ఖర్చు రూ. 1,56,257 కోట్లు. ఖర్చు అంటే కేవలం డబ్బు కదలిక మాత్రమే, పరిష్కారం కాదు.ఈ వారం ఎంపీలు నీటి కాలుష్యం, అంచనాలు, ప్రమాణాలు, పరిష్కారాలపై కూడా గొంతెత్తారు. 2023–24 నుండి 2.52 కోట్ల ప్రయోగశాల నమూనాల సేకరణ జరిగిందనీ, 2.87 కోట్ల ఫీల్డ్ పరీక్షలు జరిగాయనీ, ట్యాంకర్ మాఫియా నీటి కొరత నిజమనీ ప్రభుత్వం అంగీకరించింది.ఇక ప్రాథమిక విద్య విషయానికి వస్తే, భవిష్యత్తు ఆశల వెన్నె ముక విరిగిపోయింది. ప్రభుత్వం 10.05 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 11.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. ప్రైవేట్ రంగం 3.42 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 8.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. విధానాలు, కంప్యూటరైజేషన్ గురించి చర్చల మధ్య ఈ వివరాలు వెల్లడయ్యాయి. 73,481 పాఠశాలలకు విద్యుత్ లేదు. 1,00,843 పాఠశాలల్లో ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందుకే యువత వ్యవస్థలోని సమస్యలతో పోరాడు తున్నారు. మొన్న జంతర్ మంతర్‌లో, ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకల్లో కనిపిస్తున్న ఆగ్రహం చదువు, ఉపాధి రంగా లపై అసంతృప్తిని ఎలుగెత్తి చాటుతున్నది.ఇంతలోపే ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడం మామూలే. కానీ రోజురోజుకూ రూపాయి మరింత బలహీనమవుతోంది. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆర్థిక లోటు పెరుగుతోంది. దివాళా చట్టం కింద 2020 నుండి డిసెంబర్ 2025 వరకు 25,900 కేసులు దాఖలయ్యాయి. పాలనలో బాధ్యత, సమర్థత లోపించడం వల్లనే ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. – కృష్ణ తేజ, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి -
ఉన్నత విద్యలో అసలు సవాలు
జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్‌లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్ఈ ర్యాంకింగ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.ఎక్కడ వెనుకబడ్డాం?భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్‌కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి -
అబద్ధం డేగలా... నిజం నత్తలా!
ఒకప్పుడు ఒక వార్త ప్రజల ముందుకు రావాలంటే సమాచారం సేకరించడం, దాన్ని పరిశీలించడం, ధ్రువీకరించడం వంటి ప్రక్రియలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక ప్రచురణ వేదికగా మారింది. దీంతో సమాచారం వేగంగా చేరుతోంది. అదే సమయంలో ధ్రువీకరించని సమా చారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఏది ఎక్కువ మందికి చేరాలనేదాన్ని ఇప్పుడు ఎడిటర్ కాదు; ఎక్కువ స్పందన వచ్చే కంటెంట్‌ను ముందుకు నెట్టే అల్గోరిథమ్లే నిర్ణయిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. 2026 మార్చి 16న, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యంపై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసినట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నిజానికి అది మార్చి 14న పీటీఐ రికార్డ్ చేసిన అసలైన ప్రసంగం– ‘భవిష్యత్ భద్రతా సవాళ్లపై సైన్యం సంసి ద్ధత’ గురించి మాట్లాడిన వీడియో. దాని దృశ్యాలను అలాగే ఉంచి, ఏఐ సాయంతో పూర్తిగా వేరే ఆడియో జోడించారు. పీఐబీ ఫ్యాక్ట్–చెక్ యూనిట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్–చెక్ విభాగం రెండూ దీన్ని డీప్ ఫేక్‌గా ధ్రువీకరించి, పాకిస్తాన్ ఆధారిత ప్రచార ఖాతాల నుంచి ఇది వ్యాపించిందని అధికారులు గుర్తించేలోపే, వీడియో లక్షల మందికి చేరి పోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజమైన వీడియో వచ్చినా ‘ఇది ఏఐతో సృష్టించిందేమో’ అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ వారి 2025 నివేదిక ప్రకారం 48 దేశాల్లో వార్తలపై ప్రజల నమ్మకం సగటున 40 శాతమే. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు వార్తలను నమ్మడం లేదు. ఇది పదేళ్ల క్రితం కంటే చాలా తగ్గింది. ఎడెల్మన్ వారి సర్వేలో 69 శాతం మంది– ఇది ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం అని నమ్ముతున్నారు. యునెస్కో కూడా ఇదే విషయం చెబుతోంది– ధ్రువీకరణ లేని సమాచారం భయంకరంగా వ్యాపిస్తోందని!భారత్‌లో ఇంకా పెద్ద సమస్య. మన దగ్గర అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవి, షార్ట్ వీడియోలు– ఇవే చాలామందికి వార్తలు. ఎప్పటివో పాత దృశ్యాలు, సంఘటనలు ఇప్పటి వార్తలుగా ప్రచారం జరగడం సాధారణ విషయం అయ్యింది. ఇందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏదైనా వీడియో లేదా పోస్ట్ చూడగానే ఫార్వర్డ్ బటన్ నొక్కే ముందు, ‘ఇది ఎవరు పోస్ట్ చేశారు, మూలం ఏంటి’ అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అధికారిక ఫ్యాక్ట్–చెక్ వేదికలు, విశ్వసనీయ ధ్రువీకరణ సేవలను ఉపయోగించడం అలవాటు చేసు కోవచ్చు. సమాచారం విషయంలో ఏమాత్రం అస్పష్టత ఉండకూడదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంచలనం కంటే నమ్మదగిన సమాచారాన్ని ప్రోత్సహించాలి. నిజం నత్తలా నడిచినా... దాని బరువు తెలిసిన వాళ్లు దాని వెనుకే ఉంటారు!– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
జీవ ఇంధనాలే భారత భవిష్యత్ శక్తి
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత, పశ్చిమాసియాలో చమురు సరఫరాపై నెలకొంటున్న అనిశ్చితి– ఈ మూడు అంశాలు నేడు ప్రతి భారతీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారమే జీవ ఇంధనాల వాడకం.ప్రపంచం ఇప్పుడు జీవ ఇంధనాలను కేవలం ప్రత్యామ్నాయ ఇంధనంగా కాకుండా, పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, రైతు ఆదాయం, గ్రామీణ ఉపాధి వంటి వాటిని కలిపే భవిష్యత్ అభివృద్ధి మార్గంగా చూస్తోంది.భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిలో ప్రత్యా మ్నాయ ఇంధనాల విస్తరణ దేశ ఇంధన స్వావ లంబనకు కీలకం. జీవ ఇంధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి మన దేశంలోనే లభించే వ్యవసాయ, సేంద్రియ వనరుల నుంచి ఉత్పత్తి చేయగలగడం. చెరకు మొలాసిస్, మొక్కజొన్న, పాడై పోయిన ధాన్యాలు, వరి గడ్డి, పంట అవ శేషాలు ఇప్పుడు ఇంధన ముడి సరుకుగా మారు తున్నాయి. అంటే, వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి.జీవ ఇంధనాల్లో బయో–ఇథనాల్, బయో– డీజిల్, బయో–గ్యాస్, బయో– సీఎన్జీ, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ వంటి పలు రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో తరం ఇథనాల్ సాంకేతికత వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతోంది. 2014లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సుమారు 1.5 శాతం మాత్రమే ఉండగా, 2024–25 నాటికి అది 19.05 శాతానికి చేరింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంలో సగటు మిశ్రమం 20 శాతానికి చేరువ కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది.భారత్‌కు కొత్త అవకాశాలుఇటీవల కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకాన్ని’ ఆమోదించడం జీవ ఇంధన రంగంలో కీలక మలుపు. పశువుల పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో–స్లర్రీగా మార్చి గ్రామీణ ప్రాంతాలను శుభ్రమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిద్దడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రంగం ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా, 1.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు, 10 మిలియన్ మెట్రిక్ టన్నుల శిలాజ ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయం సాధ్యమవుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జీవన్ యోజన’ ద్వారా 2జీ ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందుతోంది. ‘సతత్’ పథకం ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని విస్తరిస్తున్నారు.2023లో జి–20 వేదికపై ప్రారంభమైన గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి... జీవ ఇంధ నాల ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, వాణిజ్య సహకారానికి ప్రపంచ వేదికగా మారుతోంది. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్, భవిష్యత్ బయో ఎనర్జీ రంగాల్లో భారత్‌కు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే జీవ ఇంధనాల విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.భూమి వినియోగం, నీటి అవసరాలు, ముడి సరుకు సరఫరా, సాంకేతిక వ్యయాలు వంటి అంశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చమురు బావుల నుంచి మాత్రమే కాదు, మన పొలాల నుంచి కూడా దేశ భవిష్యత్ శక్తి ఉత్పత్తి కావచ్చని జీవ ఇంధనాలు మనకు గుర్తుచేస్తున్నాయి.– ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా–కమ్యూనికేషన్స్ అధికారి (రేపు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం) -
బడబానల తీర్థం.. పూర్వం ఒకానొక కాలంలో..
పూర్వం ఒకానొక కాలంలో మహర్షులందరూ నైమిశారణ్యంలో సుదీర్ఘ సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ యాగంలో మృత్యువును శమితృ పదవిలో నియోగించారు. ఆ సత్రయాగం కొనసాగుతున్న కాలంలో మృత్యువు యజ్ఞకార్యంలో నియుక్తమై ఉన్నందున మానవులు మృత్యువాత పడకుండా, అమరులుగా మారిపోయారు. భూలోకంలో మరణాలు పూర్తిగా లేకుండా పోయి, జననాలు అంతకంతకు పెరగసాగాయి. మర్త్యుల రాకడ ఆగిపోవడంతో స్వర్గలోకం వెలవెలబోసాగింది.మృత్యువు తన విధి నిర్వర్తించడంలో ఉపేక్ష వహిస్తూ, యజ్ఞకార్యంలో నిమగ్నం కావడం వల్ల దేవతలు దిక్కుతోచనివారయ్యారు. చివరకు దేవతలందరూ కలసి రాక్షసుల వద్దకు వెళ్లి, ‘మీరంతా వెళ్లి మునులు సాగిస్తున్న సత్రయాగాన్ని ధ్వంసం చేయండి’ అని చెప్పారు.‘మునుల యాగాన్ని నిష్కారణంగా ధ్వంసం చేస్తే మాకు ఒరిగేదేమిటి?’ అని అడిగారు రాక్షసులు.‘మీకు యాగార్ధభాగాన్ని ఇస్తాం’ అని చెప్పారు దేవతలు.అప్పుడు మునుల యాగభంగం చేయడానికి రాక్షసులు అంగీకరించారు. మహర్షులకు ఈ సంగతి తెలిసింది. అప్పుడు వారు, ‘ఓ మృత్యువా! రాక్షసులు యాగభంగం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? తరుణోపాయం నువ్వే చెప్పు!’ అని అడిగారు.‘యాగ సామగ్రినంతా ఇక్కడే విడిచిపెట్టి, అగ్నిని మాత్రం తీసుకుని గౌతమీ తీరానికి వెళ్లండి. అక్కడ పరమశివుడిని ప్రార్థించండి’ అని మృత్యువు చెప్పాడు.మహర్షులు యాగసామగ్రిని ఎక్కడివక్కడే విడిచిపెట్టి, కొంత అగ్నిని తీసుకుని గౌతమీ తీరానికి తరలి వెళ్లారు. యాగకార్యంలో నియుక్తమై ఉన్నందున మృత్యువు కూడా వారిని అనుసరించాడు.మహర్షులందరూ పవిత్ర గౌతమీ నదిలో స్నానమాచరించారు. అనంతరం మహాదేవుడైన పరమేశ్వరుని వేనోళ్ల స్తుతిస్తూ ప్రార్థించసాగారు.అప్పుడు మృత్యువు కూడా మహాదేవుని ప్రార్థించింది. ‘పరమేశ్వరా! శంభో శంకరా! నీవు మహాకాయుడవు, మహానలుడవు, మహానీలుడవు. మహేశ్వరా నీవే మమ్ము రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు వారి ప్రార్థనలకు ప్రసన్నుడై అక్కడ ప్రత్యక్షమయ్యాడు.‘వరమేమి కావాలో కోరుకోండి’ అన్నాడు పరమశివుడు.అప్పుడు మృత్యువు ‘పరమేశ్వరా! రాక్షసుల వలన మా యాగానికి మహాపద వాటిల్లింది. మహర్షులు తలపెట్టిన ఈ సత్రయాగం సఫలమయ్యేంత వరకు మమ్మల్నందరినీ నువ్వే రక్షించాలి’ అని ప్రార్థించాడు.పరమశివుడు ‘తథాస్తు!’ అని అనుగ్రహించాడు.పరమశివుడి వరానుగ్రహంతో మృత్యువు సాయంతో మహర్షులు తమ సత్రయాగాన్ని విజయవంతంగా పరిసమాప్తి చేశారు.యాగం పూర్తవుతూనే దేవతలు హవిర్భాగాల కోసం ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.మృత్యువు వారిని చూసి, ‘మా యాగ విధ్వంసానికి మీరు రాక్షసులను ప్రేరేపించారు. హవిర్భాగాహారులైన మీరు అకార్యానికి పాల్పడ్డారు. ఇప్పటి నుంచి మీకు రాక్షసులతో శత్రుత్వం తప్పదు’ అని శపించాడు.మృత్యువు శాప ఫలితంగా దేవతలకు, రాక్షసులకు అప్పటి నుంచి బద్ధవైరం ఏర్పడింది.అప్పుడు మహర్షులు మృత్యువు పట్ల సంప్రీతులయ్యారు. వారు బడబ అనే కృత్యను సృష్టించి, ఆమెతో మృత్యువుకు వేదోక్తంగా వివాహం జరిపించారు. వివాహ సమయంలో బడబకు మంగళస్నానం జరిపించినప్పుడు ప్రవహించిన నీరు అక్కడ బడబానదిగా ప్రవహించింది. వివాహానంతరం మృత్యువు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగం మహానలేశ్వరుడి పేరిట ప్రసిద్ధి పొందింది. అప్పటి నుంచి ఆ తీర్థానికి బడబానల తీర్థమనే పేరు వచ్చింది. మహానలేశ్వరుడు వెలసిన బడబానల తీర్థం భక్తులకు భుక్తి ముక్తిప్రదమైనది. - సాంఖ్యాయనపురావిశేషం..ఈశాన్య రాష్టమైన మేఘాలయలో ఉన్న అరుదైన శివాలయం ఇది. తూర్పు ఖాసీ కొండల ప్రాంతంలోని మావ్సిన్రామ్ గ్రామానికి చేరువలో దట్టమైన అడవిలోని ఒక కొండ గుహలో సహజసిద్ధంగా వెలసిన శివలింగాన్ని ఇక్కడి ప్రజలు తరతరాలుగా పూజిస్తున్నారు. సున్నపురాతి గుహ పైకప్పు నుంచి రాలిన నీటిబిందువులు గట్టిబడి శివలింగం ఆకారం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, స్థానికులు మాత్రం దీనిని స్వయంభూ లింగంగానే భావించి, పూజిస్తున్నారు. స్థానిక ఖాసీ ప్రజలు దీనిని ‘మావ్జిన్ బుయి’ శివలింగంగా వ్యవహరిస్తారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే, మహాశివరాత్రి పూజలు కూడా ఘనంగా జరుగుతాయి. -
తనలో తానే పాడుకున్న తత్త్వజ్ఞ!
‘మన మాటల్లో అత్యుత్తమమైనవి మనతో మనం చెప్పుకునేవే!’నన్నారు పోలిష్ రచయిత్రి ఓల్గ తొకార్చుక్. ‘మిగతా విషయాలెలా వున్నా, వాటిని ఎవరూ అపార్థం చేసుకోర’ని కూడా అన్నారామె. ఈ మాటలన్న మనిషి, ‘జైళ్ళు మన లోపలే వుంటాయి– బయట వుండవు; ఎటొచ్చీ మనలో చాలామందికి ఈ అంతర్గత కారాగారాల్లో ఎలావుండాలో తెలియదంతే!’ అనడంలో విడ్డూరమేముంది? అయినా, మానసిక చికిత్స పద్ధతుల్లో –క్లినికల్ సైకాలజీలో– పట్టా పొందిన ఓల్గా మాటతీరు మరోలా ఎందుకుంటుంది?ఆమె తల్లి వాండా, తండ్రి జోసెఫ్ ఇద్దరూ ‘పీపుల్స్ యూనివర్సిటీ’లో అధ్యాపకులే. వాస్తవానికి అది ఓ విశ్వవిద్యాలయం కాదు– హైస్కూల్ మాత్రమే. పోలండ్ వాయవ్య ప్రాంతంలోని శివారు నగరం మ్యేర్జిన్లో వుండే జానపద విజ్ఞాన కేంద్రాన్నే ‘పీపుల్స్ యూనివర్సిటీ’గా పిలుస్తారు. జెర్మన్ సరిహద్దులకు కొద్ది నిమిషాల దూరంలో ఉంటుంది మ్యేర్జిన్. పైగా, అప్పట్లో జోసెఫ్ ఆ స్కూల్ లైబ్రరీ కూడా నడిపేవాడు. అలా, చిన్న వయసు నుంచీ ఓల్గ ఆడుకున్నదీ– పాడుకున్నదీ పుస్తకాలతోనే!బాల్యంలో ఓల్గకు నచ్చిన పుస్తకం హెన్రిక్ సియెంకియేవిచ్ రాసిన ప్రేమకథ ‘క్వో–వాడిస్’. 1905లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న తొలినాటి రచయిత సియెంకియేవిచ్ రాసిన ఈ ప్రేమకథకే ‘ఎడారి–అడవి’ అనేది మరోపేరు. లాటిన్ భాషలో ఈ ప్రశ్నకు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అనే అర్థం! నీరో చక్రవర్తి రోమ్ నగర రాజ్యాన్ని పాలించే రోజుల్లో జరిగిన ప్రేమకథగా ఈ నవలను రచించాడు సియెంకియేవిచ్. మరో 113 సంవత్సరాల తర్వాత ఓల్గ కూడా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకోవడానికి వున్న చారిత్రక నేపథ్యం ఇదన్నమాట. ఈ పరిసరాలే, రచయిత్రిగా ఆమె సొంత గొంతు సవరించడానికి అవసరమైన స్వరాన్నిచ్చాయి.పదహారేళ్ళ ప్రాయంలోనే కలంపట్టి కథనరంగంలోకి దిగింది ఓల్గ! అయితే యువరచయితలకు సహజమైన బెరుకు కారణంగా ఆమె ‘నతాషా బరోదిన్’ అనే మారుపేరును ఆశ్రయించారు. యువ రచయితల కోసం ఉద్దేశించిన ‘కాలిబాట’ అనే చిన్నపత్రికలో అచ్చయిన మొదటి రెండు కథలనూ ఆ పేరుతోనే ప్రచురించారామె. దాదాపు దశాబ్దకాలం ఓల్గ కథలూ కాకరకాయలూ పక్కన పెట్టి సైకో థెరపిస్టుగా ఉద్యోగం చేసుకున్నారు. అప్పట్లో ఆమె విస్తృతంగా కవిత్వం రాశారు; అనేక పత్రికల్లో ప్రచురించారు; విస్తారమైన గుర్తింపు కూడా పొందారు. అప్పట్లోనే ఆమె ఓ కవితా సంపుటి కూడా అచ్చు వేసుకున్నారు. మూడు పదుల వయసు దాటిన తర్వాత, 1996లో ఓల్గ ‘ఆదిమ యుగం– ఇతర యుగాలు’ అనే ప్రయోగాత్మక నవల రాసి పదిమంది దృష్టిలో పడ్డారు. ఈ నవలను ఓల్గ 60 ఖండికలుగా విభజించారు. ఈ ప్రయోగం జాతీయ స్థాయిలో కన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెద్దపేరు తెచ్చుకుంది. ఈ పరిణామం వెనుక చిన్న నేపథ్యం లేకపోలేదు!ఇరవయ్యో శతాబ్ది చివర్లో పోలండ్ రాజకీయ– సామాజిక వ్యవస్థ సమూలమైన మార్పులకు గురైంది. అంతర్జాతీయంగా గొర్బచ్యేఫ్, జాతీయ స్థాయిలో పోలిష్ కార్మిక నేత వవుంజా (వలేజా) పరిచయం చేసిన భావాలే ఆ మార్పులకు ప్రాతిపదికలు. పోలండ్ సమాజంలో పడమటి గాలులు బలంగా వీస్తున్న పోకడ కనిపెట్టి ఎందరో సాహిత్యవేత్తలు తమ రంగు మార్చారు. ఎందుకైనా మంచిదని ఓల్గ తొకార్చుక్ కూడా వారిని అనుసరించారు. అలాంటి పెద్దల ప్రోత్సాహంతోనే ఆమె 1990 దశాబ్ది తొలినాళ్ళలో ఓల్గ కొన్నాళ్ళు ఇంగ్లండులో ఉండి, ఆంగ్లభాషా ప్రావీణ్యం సాధించారు. మరో అయిదేళ్ళ తర్వాత ఆమె రెండు స్కాలర్షిప్పులు సంపాదించి అమెరికాలోనూ– జెర్మనీ (బెర్లిన్)లోనూ రెండేళ్ళు గడిపి రావడం ఓల్గ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆనాటి నుంచీ ఆమెకి స్వదేశంలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ గుర్తింపు దక్కుతూ వచ్చింది. 1999లో ఓల్గ ‘పోలిష్ పెన్ క్లబ్’లో చేరడంతో ఈ మార్పు పరిపూర్ణమైంది. 2014లో ఓల్గ రాసిన ‘ద బుక్స్ ఆఫ్ జేకబ్’ అనే సుదీర్ఘ నవల ఆమె రచనలన్నింట్లోకీ ఉత్తమమని విమర్శకులు అంటారు. పదిహేడో శతాబ్దానికి చెందిన జేకబ్ ఫ్రాంక్ అనే ‘అవతార పురుషుడి’ జీవితకథ నేపథ్యంగా రాసినదీ 900 పేజీల నవల. ఈ నవల రాయడానికి ఓల్గ ఏడేళ్ళపాటు పరిశోధన చేశారట! ఈ నవల రాయడానికి ఏడేళ్ళ ముందు, ఓల్గ ‘దిమ్మరులు’ అనే చారిత్రక నవల పోలిష్ భాషలో వెలువరించారు. ‘ప్రాచీన విశ్వాసులు’గా ప్రసిద్ధులైన ఓ క్రై స్తవ శాఖకు చెందిన సంచారజీవన సమూహాల కథనే ఈ నవలకు ఇతివృత్తంగా తీసుకున్నారు ఓల్గ. 116 ఖండికలుగా ఈ నవలను నిర్మించి ఓల్గ తన ముద్ర గట్టిగానే వేశారు. చిత్రమేమిటంటే, కొన్ని ఖండికలు, ఏకవాక్య నిర్మాణాలే! 2008లో నైకీ సాహిత్య పురస్కారం ఓల్గ రచనకు తొలిసారి దక్కింది.అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ దాని ఆంగ్లానువాదం వెలువరించే వరకూ ఓల్గ రచనకు అంతర్జాతీయ స్థాయిలో పెద్దగుర్తింపు దక్కలేదు (2018 మే నెల్లో ఓల్గ తొకార్చుక్– అమెరికన్ అనువాదకురాలు జెనిఫర్ క్రాఫ్ట్ మ్యాన్ బుకర్ బహుమతి సొమ్మును పంచుకున్నారు– అది అలా వుంచండి!) అదే సంవత్సరం అక్టోబర్‌లో ఓల్గ నోబెల్ సాహిత్యపురస్కారం గెల్చుకోవడానికి మ్యాన్ బుకర్ పురస్కారం ఎంతగానో సహకరించింది. ఈ రెండూ పురస్కారాలు దక్కిన తర్వాతనే, ఓల్గ రచనలకు అనేక భాషల్లో అనువాదాలు వెలువడ్డాయి. అయినా, నోబెల్ పురస్కారం పొందిన వాళ్ళ రచనలను సొమ్ముచేసుకునే సువర్ణావకాశాన్ని పెంగ్విన్ లాంటి వాణిజ్య ప్రచురణ సంస్థలు వదులుకుంటాయా?- మందలపర్తి కిషోర్ -
ప్రేమయాత్ర.. చివరి రోజు ఊహించని మలుపు!
ఇంటర్ ఫస్టియర్ చదివే అతనికి ఇంకొన్ని వారాల్లో పదిహేడు వస్తుంది. ఆ వయసులో శరీరంలోని హార్మోన్స్ ఉత్పత్తి వల్ల మానసిక, శారీరక అవసరమైన కోరిక పుడుతుంది. ఆ సమయంలో టీనేజర్ ప్రేమలో పడతాడు. అతని ప్రేమయాత్ర మొదలవుతుంది.అతను తన క్లాస్మేట్ వాల్గంటితో ప్రేమలో పడ్డాడు. క్లాస్‌లోని ఇరవై ఏడుమంది అమ్మాయిల్లో వాల్గంటే అతన్ని ఎందుకు ఆకర్షించింది? ఇది సమాధానం లేని ప్రశ్న. ఎవరు ఎవరితో ఎందుకు ప్రేమలో పడతారనే దానికి ఇదమిత్థమైన కారణం పడ్డవాడితో సహా ఎవరూ చెప్పలేరు. దానికి ‘కెమిస్ట్రీ’ అనే ఆధునిక జవాబు స్థిరపడింది.ఆమె తనని ప్రేమిస్తోందా అనే ప్రశ్న అతన్ని తొలచసాగింది. వాల్గంటి అతని మీద ఎలాంటి ప్రత్యేక ఆసక్తిని చూపించలేదు. ప్రేమయాత్రలో ఒకరు తమ ప్రేమని తెలియచేస్తే, రెండోవారు దాన్ని అంగీకరించాలి. అప్పుడు అది కొనసాగుతుంది. తిరస్కరిస్తే ఆ ప్రేమయాత్ర అంతటితో ముగుస్తుంది.అతనికి తన ప్రేమని ఆమెకి తెలియచేయాలని ఉంది. కాని ఆ ధైర్యం చేయలేకపోయాడు. టీచర్‌కి చెప్తే? తిరస్కరిస్తే? తనని చెడ్డవాడిగా భావిస్తే లాంటి భయాలు అతనిలో కలిగాయి.క్లాస్‌లోకి రాగానే ఆమె వచ్చిందా అని చూస్తాడు. కనపడకపోతే ‘అసలు ఇవాళ వస్తుందా?’ అనే అనుమానం అతన్ని బాధిస్తుంది. ఆమె వస్తే ఆనందం కలుగుతుంది. ఆమె ఎదురు పడినప్పుడు రెండు మూడు సార్లు చిరునవ్వులు నవ్వాడు. ఆమె అతనివైపు చూడకపోవడంతో అది గమనించలేదు. ఆమెకి తన ప్రేమ గురించి ఎలా తెలియచేయాలో అతనికి తోచలేదు. మధ్యవర్తి ఆలోచన వచ్చింది. కాని మిత్రుడి దగ్గర మాటలు నోట్లోంచి బయటికి రాలేదు.ఓరోజు వాల్గంటి లంచ్‌లో కాలేజీ బయట బండి దగ్గర పానీపూరీ తింటూ కనిపించింది. అతను కూడా వాటిని తిన్నాడు. మొదటిసారి ఆమెతో మాట్లాడాడు.‘‘నీ డబ్బు కూడా నేను పే చేస్తాను.’’ అతను చెప్పాడు.‘‘ఒద్దు.’’ ఆమె జవాబు చెప్పింది.తన డబ్బు చెల్లించి ఆమె వెళ్ళిపోయింది.చివరికి అతను ఆమెకి ఉత్తరం ద్వారా తన ప్రేమని తెలియచేయాలని అనుకున్నాడు. నోట్ బుక్‌లోంచి ఓ కాగితం చింపి రాశాడు.‘డియర్ వాల్గంటి,నువ్వు నాకు ఎందుకు నచ్చావ్ అని అడక్క. నా దగ్గర జవాబు లేదు. కాని నువ్వు నాకు బాగా నచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు క్లాస్‌కి రాకపోతే నాకు చాలా డల్‌గా ఉంటుంది. నీకు నా ప్రేమని తెలియచేయకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యు వెరీ మచ్...’’తర్వాత ఏం రాయాలో తెలీలేదు. దాన్ని మడిచి జేబులో ఉంచుకున్నాడు. ఆ ఉత్తరం ఎప్పుడు ఆమెకి ఇద్దామా అని తహతహగా ఉంది. అది అతని జేబులోనే ఉంది. అంతా చూస్తూండగా దాన్ని ఆమెకి ఇవ్వలేకపోతున్నాడు. ఆమె ఒంటరిగా చిక్కడం లేదు. ∙∙ మర్నాడు ఓ సంఘటన జరిగింది. క్లాస్‌లోని టీచర్ ఓ విద్యార్థితో చెప్పాడు.‘‘నువ్వు ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళు. ఆయన పిలుస్తున్నారు.’’‘‘దేనికి సర్?’’ అతను లేచి నించుని అడిగాడు.‘‘తిరిగి వచ్చాక నువ్వే దానికి జవాబు చెప్పు.’’ ఆయన చెప్పాడు.అతను వెళ్ళిన పావుగంట తర్వాత వచ్చాడు. అతని మొహం వాడిపోయి ఉండటం అంతా గమనించారు. అతను తలవంచుకొని కూర్చున్నాడు. టీచర్ అతన్ని ఎందుకని అడగలేదు. అతనూ చెప్పలేదు. తర్వాత తోటి విద్యార్థులకి ఆ విషయం తెలిసింది. తమ క్లాస్మేట్ మరో క్లాస్ అమ్మాయికి ప్రేమలేఖని రాస్తే ఆమె దాన్ని తన తండ్రికి చూపించింది. ఆయన దాంతో ప్రిన్సిపాల్ దగ్గరకి వచ్చాడు. ఆవిడ ఆ ఉత్తరం చూసి మండిపడి, వెంటనే అతని తల్లితండ్రులని పిలిపించి వారి ముందే నానా చివాట్లు వేసింది.‘‘ఇంకోసారి ఇలా జరిగితే టీసీ ఇచ్చి పంపిస్తాను.’’ హెచ్చరించింది.‘‘ఇష్టం లేకపోతే ఉత్తరం చింపేయాలి కదా?’’ కొందరు చెప్పారు.‘‘నోటితో చెప్తే అంత దూరం వచ్చేది కాదుగా.’’ మరికొందరు చెప్పారు.అతను తన జేబులోని లేఖని చింపి డస్ట్ బిన్ లో పడేశాడు. ఆ తర్వాత తన ప్రేమని వాల్గంటికి తెలియచేసే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అతని ప్రేమయాత్రకి అంతరాయం కలిగింది. ప్రేమ ఉద్ధృతి మాత్రం తగ్గలేదు. ప్రేమలో పడి దాన్ని వ్యక్తం చేయకపోవడం ఎంత దుర్భర పరిస్థితి అనేది అతనికి అర్థమైంది.త్వరలోనే ఇంటర్ ఫస్టియర్ చివరికి వచ్చింది. విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా పరీక్షలయ్యాక వాళ్ళ ప్లాన్స్ గురించి చెప్పుకుంటున్నారు. అతనికి మాత్రం సంతోషంగా లేదు. ఆఖరి క్లాస్ అయ్యాక అతను కాలేజీ ఆవరణలోంచి బస్ స్టాప్‌కి వెళ్ళాడు.అక్కడ వాల్గంటి, మరికొందరు అమ్మాయిలు, అబ్బాయిలు నిల్చుని ఉన్నారు. అతన్ని చూడగానే వాల్గంటి చిరునవ్వు నవ్వింది. అతనూ బదులుగా నవ్వాడు.‘‘కాఫీ తాగుదామా? కెఫేకి వెళ్దాం రా.’’ ఆమె అతని దగ్గరికి వచ్చి చెప్పింది.‘‘కెఫేకి?’’ తడబడుతూ అడిగాడు.‘‘అవును. ఐ థింక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యు.’’ఆమె నవ్వింది. ఆ బస్ స్టాప్ నుంచి ‘‘24/7 కెఫే’’ కి అతని చేతిని పట్టుకుని నిర్భయంగా నడిచింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
విమానం కాలిపోతోంది... కాపాడండి! అర్ధరాత్రి బాలుడి కేకలు..
1945 మార్చి 3 – జపాన్ రాజధాని టోక్యో సమీపంలోని ఇవోజిమా ద్వీపం...రెండో ప్రపంచ యుద్ధం ఉద్ధృతంగా సాగుతున్న సమయం... అప్పుడే అమెరికాకు చెందిన యుద్ధ విమాన పైలట్ జేమ్స్ హూస్టన్– యుద్ధనౌక నుంచి టేకాఫ్‌కు సిద్ధమయ్యాడు.‘జాక్! ఈరోజు శత్రువుల పీచమణిచి విజయంతో తిరిగొస్తా. పార్టీ చేసుకుందాం’ అని తన సహచరుడికి చెప్పి ఇవోజిమా ద్వీపం వైపు దూసుకెళ్లాడు జేమ్స్ హూస్టన్. జపాన్ సేనలపై బాంబుల వర్షం కురిపించాడు. అయితే, జపాన్ సైన్యం చేసిన దాడిలో ఇంజిన్‌కు మంటలంటుకుని విమానం సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న జేమ్స్ చనిపోయాడు.2000 ఏప్రిల్ 10 – అమెరికాలోని లూసియానాలో నివసించే బ్రూస్ లైనింజర్, ఆండ్రియా లైనింజర్ దంపతులు తమ రెండేళ్ల కుమారుడు జేమ్స్ లైనింజర్తో కలిసి ఎప్పటిలాగే నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు.‘విమానం కాలిపోతోంది! మంటలు అంటుకున్నాయి! ఆ చిన్న మనిషి బయటకు రాలేకపోతున్నాడు... కాపాడండి!’ అంటూ అరిచాడు. దీంతో ఉలిక్కిపడ్డ అతడి తల్లిదండ్రులు జేమ్స్‌ను దగ్గరకు తీసుకుని బుజ్జగించి నిద్రపుచ్చారు. ఇక ఆ రోజు నుంచి వారికి నిద్ర కరువైంది. ప్రతిరోజూ రాత్రివేళ నిద్రపోతున్న బాలుడు ఉన్నట్టుండి గాల్లో కాళ్లు, చేతులు విసిరేస్తూ, ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోయేవాడు. చెమటలతో తడిసిపోతూ గట్టిగా కేకలు వేసేవాడు.వారంలో నాలుగైదు రోజులు ఇదే సీన్. మొదట్లో తల్లిదండ్రులు ఏదో పీడకల అనుకున్నారు. కానీ అంతకంతకూ ఆ చిన్నారి ప్రవర్తన విచిత్రంగా మారింది. బొమ్మ విమానాలతో ఆడుకుంటూ, వాటిని నేలకేసి కొడుతూ ‘విమానం క్రాష్ అయిపోయింది’ అని అరిచేవాడు.రోజులు గడిచేకొద్దీ ఆ చిన్నారి చెబుతున్న మాటలకు తల్లిదండ్రులు షాకయ్యేవారు. ఆ వయసు పిల్లలకు అస్సలు తెలియని ‘విమాన çపరిభాష’ గురించి జేమ్స్ మాట్లాడటం చూసి నిర్ఘాంతపోయేవారు. విమానం కింద ఉండే ‘డ్రాప్ ట్యాంక్’ గురించి, దాన్ని ఎలా డిస్కనెక్ట్ చేయాలో స్పష్టంగా చెప్పేవాడు. దీంతో ఒకరోజు తండ్రి బ్రూస్ తన కొడుకుని దగ్గరకు తీసుకుని నెమ్మదిగా ఆరా తీశాడు.‘నాన్నా, అసలు ఆ విమానం ఎక్కడి నుంచి ఎగిరేది?’ అని అడిగితే, ‘అది నటోమా అనే పెద్ద యుద్ధనౌక మీద నుంచి ఎగిరేది డాడీ’ అని బదులిచ్చాడు. ఆ చిన్న మనిషి ఎవరు నాన్నా అని ప్రశ్నిస్తే, ‘అది నేనే.. నా పేరు కూడా జేమ్సే’ అని సమాధానమిచ్చాడు. ‘నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా?’ అంటే.. ‘నా బెస్ట్ ఫ్రెండ్ జాక్ లార్సన్ నాతోనే ఉండేవాడు’ అని చెప్పాడు. ‘జపాన్ సైనికులు తన విమానం ఇంజిన్ పై దాడి చేసి కూల్చివేశారు. విమానానికి మంటలు అంటుకుని సముద్రంలో పడిపోయి చనిపోయాను’ ఆ పసివాడు కళ్లు పెద్దవి చేసి మరీ వివరించాడు.ఇదంతా పసివాడి ఊహాజనిత కథ అని నిరూపించాలని బ్రూస్ నిశ్చయించుకున్నాడు. సైనిక రికార్డులు, రెండో ప్రపంచ యుద్ధ పత్రాలను జల్లెడ పట్టాడు. అవి చూసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు పుట్టింది.పసిఫిక్ మహాసముద్రంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరు యూఎస్ఎస్ నటోమా బే అని, ఆ నౌకపై జాక్ లార్సన్ అనే పైలట్ పనిచేశాడని, అప్పటికి ఆయన ఇంకా జీవించే ఉన్నాడని తెలుసుకున్నాడు.1945 మార్చి 3న జేమ్స్ హూస్టన్ జూనియర్ అనే 21 ఏళ్ల పైలట్ విమానంపై జపాన్ సైనికులు దాడి చేయడంతో అది సముద్రంలో కూలిపోయి అతడు మరణించాడని మిలిటరీ రికార్డులను బట్టి బ్రూస్ నిర్ధారణకు వచ్చాడు. ఈ నమ్మలేని నిజాలను ప్రత్యక్షంగా నిరూపించుకోవడానికి లైనింజర్ కుటుంబం– చనిపోయిన పైలట్ జేమ్స్ హూస్టన్ సోదరి యాన్ బారన్ దగ్గరకు వెళ్లింది. అప్పటికి వృద్ధురాలైన యాన్ బారన్ ను చూడగానే జేమ్స్– పరిగెత్తుకుంటూ వెళ్లి ‘అక్కా’ అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. వారి చిన్నతనంలో ఆడుకున్న ఆటలు, హూస్టన్ ఇంట్లో ఉన్న బొమ్మల పేర్లు, కేవలం ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన కుటుంబ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు.అవన్నీ విన్న తర్వాత ఆనందబాష్పాలతో యాన్ బారన్ అన్న మాట: ‘ఇతడు నా తమ్ముడు జేమ్స్ హూస్టన్... నా తమ్ముడే మళ్లీ పుట్టాడు’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అనంతరం అప్పటికి బతికి ఉన్న సహచర పైలట్ జాక్ లార్సన్ను కలిసినప్పుడు కూడా చిన్నారి జేమ్స్ ఆయనను గుర్తుపట్టి, నాటి యుద్ధ జ్ఞాపకాలను పంచుకున్నాడు.చిన్నారి జేమ్స్ లైనింజర్ కథ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియాను, పారాసైకాలజీ పరిశోధకులను ఆకర్షించింది. గత జన్మ వివరాలన్నీ చెప్పిన జేమ్స్... తను మరణించిన జపాన్ సముద్ర తీర ప్రాంతానికి వెళ్లి నివాళులర్పించాడు. అంతే, అప్పటి నుంచి అతడికి పీడకలలు రావడం ఆగిపోయాయి. శాస్త్రవేత్తలు, డాక్టర్లు దీనికి ఎటువంటి శాస్త్రీయ వివరణ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం సాధారణ యువకుడిలా జీవితం గడుపుతున్న జేమ్స్ లైనింజర్ కథ– ‘పునర్జన్మ’ ఉందనే నమ్మకానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన, సజీవ ఆధారంగా ఉంది.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
ఫొటోలు సరిగా తీయలేదని...
పెళ్లంటే పందిళ్లు ... సందళ్లు... తప్పెట్లు... తాళాలు... రెండు మనసుల కలయికే కాదు, జీవితంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల వేడుక. ఆ జ్ఞాపకాలను పదిలంగా ఉంచి కలకాలం గుర్తుండేలా వాటికి శాశ్వత రూపం ఇచ్చేవి ఫొటోలు, వీడియోలు. ప్రీ వెడ్డింగ్ షూట్ల నుంచి పెళ్లిలో బంధువుల సందడి, ఆప్యాయ ఆలింగనాలు, వధువును అత్తారింటికి పంపే తల్లిదండ్రుల కంటతడి వరకు ప్రతి ఆనంద క్షణాలూ భావోద్వేగాలూ కాలగర్భంలో కలిసి పోకుండా అవి పదిలంగా ఉంచుతాయి. అందుకే నేటి పెళ్లి తంతులో ఈ ఖర్చు తప్పని సరైంది. లక్షలకు చేరింది.అయితే వీటి చిత్రీకరణలో పొరపాటు జరిగితే; ఆ జ్ఞాపకాలను సరిగా బంధించకపోతే; ఫొటోలు, వీడియోలు ఆశించిన స్థాయిలో రాకపోతే; ఒప్పందం అమలు చేయకపోతే; మానసిక వేదనే మిగులుతుంది. అయితే ఓ జంట ఇలా వేదనతో సరిపుచ్చుకోలేదు. ఒప్పంద ఉల్లంఘనపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. తమ మనో వేదనకు మూల్యం చెల్లించేలా ఆదేశించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పరిహారాన్ని ఇప్పించాలని వేడుకుంది. సేవల్లో లోపంతో పాటు భావోద్వేగాలను ఫోరం అర్థం చేసుకుని తీర్పు వెలువరించింది.కేరళకు చెందిన ఓస్టిన్ ఊమచెన్, కావ్య సంతోష్ ఇద్దరూ వైద్యులు. వీరిద్దరికి పెళ్లి నిశ్చయం అయింది. కొచ్చిలోని పికోలో వెడ్డింగ్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పెళ్లి ఫొటోలు, వీడియోలు చూశారు. తమ వివాహ వేడుకను అలాగే పదిలపరుచుకోవాలని భావించి, ఆ సంస్థను సంప్రదించారు.ఒప్పందం... ఉల్లంఘన...బ్రైడ్ అండ్ గ్రూమ్ సైడ్ ప్యాకేజీని ఆ జంట ఎంచుకుంది. ఆ ప్యాకేజీ కింద అందించే సేవలను సంస్థ వివరించింది. మొత్తం రూ.95 వేలకు వారి మ«ధ్య ఒప్పందం కుదిరింది. రూ.10 వేలు అడ్వాన్స్‌గా, పెళ్లిరోజు మరో రూ. 70 వేలు చెల్లించారు. 2024లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం డ్రోన్ కెమెరా ద్వారా పెళ్లిని షూట్ చేయలేదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయలేదు. దీంతో మరొకరిని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆ జంట వాదన. మరోవైపు వధువు ఇంట్లో జరిగే వివాహ తంతును చిత్రీకరించేందుకు వెళ్లాల్సిన క్యాండిడ్ ఫొటోగ్రాఫర్ వెళ్లలేదు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన మూడు వెడ్డింగ్ రీల్స్ ఊసే ఎత్తలేదు. వివాహం జరిగిన ఆరు నెలల తర్వాత హైలైట్స్ వీడియోను వాట్సాప్ ద్వారా పంపారు. యూఎస్బీలో ఇచ్చిన వెడ్డింగ్ స్టోరీ కరెప్ట్ అయింది. ఫొటోలు, వీడియో ఎడిటింగ్ పరమ నాసిగా ఉన్నాయి. ముఖ్యమైన వేడుకల ఫొటోలు, ఆనంద క్షణాలు క్యాప్చర్ కాలేదు. ఇలా ఒప్పందంలోని పలు అంశాలను సంస్థ ఉల్లంఘించింది.ఫోరంలో ఫిర్యాదుఒప్పందాన్ని సంస్థ ఉల్లంఘించిందంటూ ఆ జంట కొట్టాయంలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. అయితే కమిషన్ జారీ చేసిన నోటీసులకు పికోలో వెడ్డింగ్స్ సంస్థ స్పందించలేదు. చివరకు ఓ దినపత్రికలో పబ్లిక్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ సంస్థ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. దీంతో ఎక్స్‌పార్టీగా ఫోరం కేసును కొనసాగించింది. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది. హెలీకామ్(డ్రోన్) సేవలను అందించనందుకు బిల్లులో ఆ మేరకు తగ్గిస్తూ సంస్థ రశీదు ఇవ్వడాన్ని కోర్టు గుర్తించింది. యూఎస్బీ కరెప్ట్ అయిన విషయాన్ని పరిశీలించి నిర్ధారించింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం ఇటువంటి చర్య ‘సేవల్లో లోపం’ పరిధిలోకి వస్తుందని ఫోరం స్పష్టం చేసింది.తీర్పు ఇలా...సంస్థకు చెల్లించిన మొత్తాన్ని ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వాలని ఫోరం ఆదేశించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2.50 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో 10,000 చెల్లించాలని ఆదేశిస్తూ ఫోరం తీర్పు వెలువరించింది. నిర్ణీత గడువులోగా ఈ మొత్తం అందించకపోతే 9% వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పు కేవలం ఓ జంటకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించిన కేసు మాత్రమే కాదు. వృత్తి పరమైన సేవలు అందించే ప్రతి సంస్థపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే తీర్పు. ఈ తరహా ఒప్పందాలు కేవలం వ్యాపార లావాదేవీలు కావని, విశ్వాసం, జవాబుదారీతనం, ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.- దిలీప్ మాదిరెడ్డి -
డిజిటల్ మైండ్ గేమ్.. కూతురి పెళ్లికి 24 గంటల ముందు కిడ్నాప్!
హోమ్ మినిస్టర్ బెనర్జీ ఇల్లు..టెర్రస్ మీద వున్నాడు హోమ్ మినిస్టర్ బెనర్జీ. అతని ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న.‘ప్రద్యుమ్న! ఇది డిపార్ట్మెంట్ ఆర్డర్ కాదు. ఒక తండ్రిగా అడుగుతున్న సాయం. నా కూతురు నీల పెళ్లి మరో 24 గంటల్లో ఉంది. కానీ ఆమెను ‘విక్టర్’ అనే వంచకుడు మాయమాటలతో లొంగదీసుకుని ఎత్తుకెళ్లాడు. వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇదిగో వాడి క్రిమినల్ డేటా ఫైల్’ అని ఒక ఫైల్ అందించాడు.ఆ ఫైల్లో విక్టర్ క్రిమినల్ రికార్డ్ వుంది. అతని ఫోటో కూడా వుంది. ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న క్రైమ్ ఆపరేషన్ మొదలుపెడితే ముందు కీలక ఆధారాలేవో చూస్తాడు. క్రాస్ వెరిఫికేషన్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ ఇచ్చిన విక్టర్ ఫైల్ ఓపెన్ చేశాడు. ఫైల్ ఓపెన్ చేయగానే అతని పదునైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రెయిన్ పనిచేయడం ప్రారంభించింది.క్రైమ్ బ్రాంచ్ సెంట్రల్ డేటాబేస్‌తో ప్రద్యుమ్న క్రాస్ వెరిఫికేషన్ చేశాడు. అందులో విక్టర్ ఫోటో అతికించిన పేజీ దగ్గర పిక్సెల్ వ్యత్యాసం, మార్ఫింగ్ గుర్తులు స్పష్టంగా కనిపించాయి. విక్టర్ ఫోటోను మార్ఫింగ్ చేసి తగిలించాడు. ప్రద్యుమ్న హ్యాకింగ్ టీమ్‌తో ఇంటర్‌పోల్ డేటాను స్కాన్ చేయించగా, ఆ క్రిమినల్ రికార్డ్ అంతా విక్టర్‌ది కాదు, ‘బెన్నీ’ అనే కిల్లర్‌ది అని తేలిపోయింది. విక్టర్ కేవలం ఒక విద్యాధికుడైన సామాన్య యువకుడని, బెనర్జీ డ్రైవర్‌గా పనిచేస్తూ నీలను ప్రేమించాడని ప్రద్యుమ్న కనిపెట్టాడు. ఇక్కడ ప్రద్యుమ్న తన మైండ్ గేమ్‌ను మొదలుపెట్టాడు.∙∙ కొత్త సిమ్ సిగ్నల్ ఏ టవర్ పరిధిలో ఉందో తెలుసుకోవడానికి ప్రద్యుమ్న ‘టవర్ ట్రయాంగులేషన్’ సాంకేతికతను వాడాడు. మూడు వేర్వేరు మొబైల్ టవర్ల సిగ్నల్ రేడియస్‌ను విశ్లేషించి, వారు కచ్చితంగా నగర శివార్లలోని పాత వంతెన పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారని కనిపెట్టి, వారి లైవ్ లొకేషన్ ను లాక్ చేశాడు. సిగ్నల్ క్లోనింగ్ లొకేషన్ దొరకగానే ప్రద్యుమ్న వారి సిగ్నల్‌ను తన రూట్ మ్యాప్‌కు క్లోన్ చేసుకుని, అక్కడికి వెళ్ళాడు. అక్కడ బిక్కుబిక్కుమంటూ వున్నారు విక్టర్... నీల..అదే సమయంలో హోమ్ మినిస్టర్ సుపారీ ఇచ్చి పంపిన కిల్లర్ బెన్నీ కంటే ముందే అక్కడికి చేరుకోగలిగాడు.కిల్లర్ బెన్నీ తుపాకీ గురిపెట్టి విక్టర్‌పై కాల్పులు జరపబోయాడు. సరిగ్గా అదే సమయంలో ప్రద్యుమ్న తన సర్వీస్ రివాల్వర్‌ను బయటకు తీశాడు. బుల్లెట్లు కిల్లర్ బెన్నీ బాడీలోకి దూసుకువెళ్లాయి.∙∙ ‘సార్, మీరు చెప్పినట్టే మీ కూతురు నీలను ఎత్తుకెళ్లిన పేరుమోసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను షూట్ చేసి చంపేశాను. కాకపోతే అతని పేరు విక్టర్ కాదు, బెన్నీ. మీరు ఫైల్లో ఇచ్చిన అన్ని వివరాలు మ్యాచ్ అయ్యాయి, ఫోటో తప్ప... అన్నట్టు ఈ ఆపరేషన్‌లో మీ కూతురు నీల, ఆమెను ప్రేమించిన విక్టర్ సాయపడ్డారు...’ అంటూ తల వెనక్కి తిప్పాడు.నీల, విక్టర్ లోపలికి వచ్చారు.బెనర్జీ తన టేబుల్ సొరుగులో ఉన్న రివాల్వర్ తీశాడు పట్టరాని కోపంతో...ప్రద్యుమ్న కూల్‌గా టేబుల్‌పై ఒక పెన్ డ్రైవ్ పెట్టాడు. ‘సార్, చనిపోయింది మీ హిట్‌మ్యాన్ బెన్నీ... ఇంటర్‌పోల్ క్రిమినల్ ఫైల్‌ను మీరు మార్ఫింగ్ చేసిన సాక్ష్యం, బెన్నీతో మీరు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఇందులో ఉన్నాయి. మీరు నోరు తెరిస్తే ఈ నిజం బయటపడి మీ పరువు, పదవి రెండు పోతాయి. విక్టర్ యోగ్యుడు. వాళ్ళను ఆశీర్వదిస్తే మీరు చేసిన పాపం, నేరం కొంతవరకైనా తగ్గుతాయి. లేదంటే మీ ఇష్టం’ అని వెనుదిరిగాడు.∙∙ హోమ్ మినిస్టర్ కూతురిని కిడ్నాప్ చేసిన పేరుమోసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బెన్నీని వెంటాడి ఎదురు తిరగడంతో షూట్ చేసిన ప్రద్యుమ్న.. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి సహకరించిన హోమ్ మినిస్టర్ కారు డ్రైవర్ విక్టర్ తో పెళ్లి జరిపించిన హోమ్ మినిస్టర్ గొప్ప మనసు.మీడియాలో బ్రేకింగ్ న్యూస్...అంతకు మించి ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ‘డిజిటల్ మైండ్ గేమ్’లో నుంచి బయట పడడానికి మరో ఆప్షన్ లేదు హోమ్ మినిస్టర్‌కు.- శ్రీసుధామయి -
దొంగలున్నారు జాగ్రత్త!
దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి -
కూలీ నుంచి రాజకొలువుకు... కారణం ఇదే!
కోసల రాజ్యంలోని ముకుందపురం గ్రామంలో కేశవుడు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతికేవాడు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ రాత్రి ఊరి గుడి దగ్గర అరుగు మీద పడుకునేవాడు. చిన్ననాటి నుంచి గుడి పూజారి దగ్గర ధర్మబద్ధంగా జీవితం ఎలా గడపాలో నేర్చుకున్నాడు. తను ఒక చోట కూలీ పనికి ఒప్పుకుంటే మరొకరు వచ్చి ఎక్కువ కూలీ ఇస్తామన్నా ససేమిరా ఒప్పుకునే వాడు కాదు. ఊరి వాళ్ళు, తోటి కూలీలు ఇతని నిజాయతీని చూసి నవ్వుకునే వాళ్ళు. కేశవుడు మాత్రం ధర్మం, నిజాయతీ ఎప్పటికైనా గెలుస్తాయని నమ్మేవాడు.ఒకరోజు కోసల రాజు విక్రమసేనుని ఉద్యానవనంలో తోటపని చేయడానికి ముకుందపురం నుంచి కూలీలతో పాటు కేశవుడు కూడా వెళ్ళాడు. కేశవుడు తోటలో పని చేస్తున్నప్పుడు ఒక రంగురాయి దొరకటంతో దాని గురించి ఎవరికీ చెప్పకుండా బొడ్లో జాగ్రత్తగా దాచుకున్నాడు. సాయంత్రం వరకు తోటలో పనిచేసి, కూలి డబ్బులు తీసుకున్నాడు. ఇంటికి బయలుదేరుతూ, మెల్లగా రాజప్రాసాదంవైపు అడుగులు వేశాడు. సింహద్వారం వద్ద భటులతో తను రాజుగారిని కలవాలి అని చెప్పాడు. విషయం ఏమిటని భటులు ప్రశ్నిస్తే విషయం కేవలం రాజుగారికి మాత్రమే చెబుతాను అనటంతో ఒక భటుడు అంతఃపురంలోకి వెళ్ళి వచ్చి, ‘‘రేపు ఉదయం వరకు రాజుగారిని కలవటం కుదరదు, పొద్దున్నే రాపో’’ అని చెప్పారు.కేశవుడు చేసేది లేక ఊరికి వెళ్లకుండా, సింహద్వారం పక్కగా ఒక చోట ఒదిగి కూర్చొని రాత్రంతా అక్కడే గడిపాడు. అలసిపోయి అక్కడే పడుకున్న కేశవుడిని ఉదయాన్నే ఒక భటుడు నిద్రలేపి, ‘‘రాజుగారు పిలుస్తున్నారు’’ అని చెప్పటంతో భయం భయంగా కోటలోకి అడుగు పెట్టాడు. కోసల రాజు విక్రమసేనుడు కేశవుడిని చూసి ‘‘నన్ను ఎందుకు కలవాలనుకున్నావు?’’ అని అడిగాడు. కేశవుడు రాజుగారికి నమస్కరించి, ‘‘మహారాజా! నిన్న తమరి తోటలో పనిచేస్తుంటే, నాకు ఈ రంగురాయి దొరికింది. తమరి వస్తువు తమరికే అప్పగించి పోదామని వచ్చాను’’ అని చెప్పి, తన బొడ్లో జాగ్రత్తగా దాచుకున్న రంగురాయిని విక్రమసేనుడికి అప్పగించాడు. రంగురాయిని తీసుకున్న విక్రమసేనుడు ‘‘దీని విలువ ఎంతో నీకు తెలుసునా?’’ అని అడిగాడు. ‘‘నాది కాని వస్తువు విలువ ఎంత అయితే నాకెందుకు మహారాజా!’’ అన్నాడు కేశవుడు వినయంగా.ఇంతలో అక్కడకు వచ్చిన మహామంత్రి సూరవర్మ ‘‘ప్రభూ! మన ఖజానాలో పని చేయటానికి నిజాయతీ గల వ్యక్తి కావాలన్నారు కదా, అందుకు ఇతనే సరైన వ్యక్తి. నిజాయతీ గల వ్యక్తి కోసం వెదుకులాటలో భాగంగా తమరి తోటలో చాలా రంగు రాళ్లని నేనే కావాలని భూమిలో పాతించి, కూలీలను అందులో పనికి పురమాయించి, దూరం నుంచి గమనిస్తూనే వున్నాను. ఇతనితో పాటు మరికొందరికి ఈ రంగురాళ్ళు దొరికాయి.ఇవి విలువ చేయని రంగురాళ్ళు అని తెలియక మిగతా అందరూ లోలోపల సంతోషపడుతూ వాటిని తీసుకుని వెళ్లిపోయారు. కాని, ఇతను మాత్రం ఆశకు లోను కాకుండా నిజాయతీగా ఈ రంగురాయిని తమకు అప్పగించడానికి వచ్చాడు. నిన్న రాత్రి కూడా నేను కావాలనే ఇతనికి తమ దర్శన భాగ్యం కలిగించలేదు. ఆ రంగురాయి ఒక రాత్రంతా ఇతని దగ్గర వుంటే ఇతని మనసు ఏమైనా చాంచల్యానికి లోనవుతుందేమో అనుకున్నాను. అయినా, ఇతను తన నిజాయతీని కోల్పోలేదు’’ అని చెప్పాడు.‘‘మహామంత్రీ! మీరు చెప్పింది నిజమే, తక్షణమే ఇతనిని మన ఖజానా ఉద్యోగిగా నియమించండి. వెంటనే ఇతని నివాసానికి రాజోద్యోగుల భవంతిని ఒకటి సిద్ధం చేయండి’’ అని చెప్పి విక్రమసేన మహారాజు లోనికి వెళ్లిపోయాడు.ముకుందపురం చేరుకున్న కేశవుడు గుడి పూజారిని కలుసుకొని, తనకు వచ్చిన కొలువు గురించి చెప్పి, పాదాలకు నమస్కరించాడు. ‘‘నీ నిజాయతీనే నిన్ను కాపాడింది. లే నాయనా!’’ అని కేశవుడిని లేవదీసి, ఆలింగనం చేసుకున్నాడు పూజారి.- ఎన్.వి.శ్రీధర శర్మ -
9 ఏళ్ల చిన్నారి.. రెండు జన్మల కథ!
సూర్యుడు నడినెత్తి మీదకు వస్తున్నాడు. మధుర పట్టణంలోని ద్వారకాధీశ్ ఆలయ పరిసరాల్లో రద్దీ ఓ మోస్తరుగా ఉంది. అప్పుడే అక్కడ అడుగుపెట్టిన తొమ్మిదేళ్ల శాంతిదేవి కళ్లలో ఒక విచిత్రమైన శూన్యం, అంతకంటే వింతైన వెలుగు కనిపిస్తున్నాయి.ఆమె ఆ ఊరికి రావడం ఇదే మొదటిసారి. కానీ, ఆమె అడుగులు మాత్రం వడివడిగా ముందుకు పడుతున్నాయి. ఆమెతోపాటు ఉన్న 15 మంది ప్రముఖులు ఒకింత ఆశ్చర్యం, మరికొంత ఉత్కంఠతో వెనకే వెళ్తున్నారు. ఆ బాలిక ఓ ఇంటి ముందు ఆగి, ‘ఇదే నా ఇల్లు..’ అని చెప్పి తలుపు తట్టింది. లోపలి నుంచి వచ్చిన వ్యక్తిని చూసి.. ‘ఏవండీ ఎలా ఉన్నారు’ అని అడిగేసరికి వారంతా నిర్ఘాంతపోయారు.1926 డిసెంబరు 11న ఢిల్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది శాంతిదేవి. నాలుగేళ్ల వయసు వచ్చే వరకు అందరిలాగా ఆటపాటలతో గడిపింది. కానీ, మాటలు స్పష్టంగా వస్తున్న కొద్దీ ఆమె ప్రవర్తనలో మార్పు రాసాగింది. అద్దం ముందు నిలబడి.. ‘ఇది నేను కాదు, నా ముఖం ఇలా ఉండదు’ అని విచారంగా అనుకునేది.మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె చెప్పే మాటలు వారిని భయాందోళనలకు గురిచేశాయి. ‘నా పేరు శాంతిదేవి కాదు, నేను లుగ్దీదేవిని. మధుర నా సొంతూరు. నాకు పెళ్లయింది. నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే. ఒక బాబుకు జన్మనిచ్చిన తొమ్మిది రోజులకే నేను కన్నుమూశాను’ అంటూ ఏడ్చేది. ఈ విషయం శాంతిదేవి చదువుకునే స్కూలు టీచరుకు తెలియడంతో ఆయనకు ఆసక్తి కలిగి ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కేదార్‌నాథ్‌కు లేఖ రాశారు.ఆశ్చర్యం.. అక్కడ నుంచి జవాబు వచ్చింది. తన పేరు కేదార్నాథ్ చౌబే అని, లుగ్దీదేవి తన భార్యే అని, ఆమె 1925లో చనిపోయిందని చెప్పడంతో ఆ టీచరుకు నోటమాట రాలేదు. వెంటనే కేదార్‌నాథ్‌కు విషయాలన్నీ వివరించి ఢిల్లీ రావాలని కోరారు. ఈ విషయాలేవీ శాంతిదేవికి చెప్పకుండా కేదార్‌నాథ్‌ను తీసుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆయన్ను చూసిన శాంతిదేవి– ఎంతో ఉద్విగ్నతకు లోనై, ‘ఏవండీ..’ అంటూ పిలిచేసరికి కేదార్నాథ్ బిత్తరపోయారు. ఎందుకంటే తనను అలా పిలిచే ఏకైక వ్యక్తి ఆయన భార్య మాత్రమే. కానీ ఆమె మరణించిన పదేళ్ల తర్వాత ఓ చిన్నారి అలా పిలిచేసరికి ఆయన షాక్‌లో ఉండిపోయారు. తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఎన్నో వ్యక్తిగత విషయాలను శాంతిదేవి ప్రస్తావించడంతో ఆమె గత జన్మలో తన భార్యే అని కేదార్నాథ్ నిర్ధారణకు వచ్చారు.ఈ వార్త మహాత్మా గాంధీ వరకు చేరింది. దీంతో 1935లో శాంతిదేవిని, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. చిన్నారి చెప్తున్న విషయాల్లోని నిజాయతీని గమనించిన ఆయన.. లోతైన విచారణ కోసం 15 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.కమిటీ సభ్యులు శాంతిదేవిని తీసుకొని 1935 నవంబరులో ఢిల్లీ నుంచి మధురకు రైలులో బయలుదేరారు. ఢిల్లీ దాటి ఎప్పుడూ వెళ్ళని ఆ బాలిక మధుర స్టేషన్ రాగానే స్థానిక ‘బ్రజ్’ యాసలో అనర్గళంగా మాట్లాడటం మొదలుపెట్టింది. స్టేష¯Œ లో దిగగానే, గత జన్మలో తన భర్తకు పెద్దన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టింది. అక్కడి నుంచి తన పాత ఇంటికి వారందరినీ తీసుకువెళ్లింది.ఒక గదిలో నేల కింద తాను దాచిన డబ్బు గురించి చెప్పింది. అయితే అక్కడ తవ్వగా ఖాళీ డబ్బా మాత్రమే దొరికింది. కమిటీ సభ్యులు శాంతిదేవి వైపు అనుమానంగా చూశారు. ఆ క్షణంలో కేదార్నాథ్ కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘ఆ డబ్బు లుగ్దీదేవి చనిపోయాక నేనే తీశాను’ అని అంగీకరించడంతో అందరూ నోరెళ్లబెట్టారు. అలాగే తమ కుమారుడి చిన్నప్పటి గుర్తులు కూడా చెప్పి అందరినీ విస్తుపోయేలా చేసింది.శాంతిదేవి చెప్పిన చాలా అంశాలు వందకు వంద శాతం సరిపోయాయని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పలువురు పారానార్మల్ పరిశోధకులు కూడా శాంతిదేవి కేసును పునర్జన్మలకు సంబంధించిన బలమైన ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే, దీనిపై శాస్త్రీయంగా ఏకాభిప్రాయం రాలేదు. కొందరు దీనిని పునర్జన్మకు ఆధారంగా పేర్కొన్నారు. మరికొందరు మెదడులోని పాత జ్ఞాపకాల పొరలని వాదించారు.ఓవైపు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు.. మరోవైపు గత జన్మ తాలూకు జ్ఞాపకాలు.. ఇలా జీవితాంతం రెండు జన్మల మధ్య బతికిన శాంతిదేవి వివాహం చేసుకోకుండా తన 61వ ఏట 1987లో మరణించారు.- కె.సత్యకిశోర్ -
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్‌కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్‌తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్‌గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్‌ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్‌లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ -
నకిలీ వారసుడు! తల్లి అనుమానమే నిజమైంది!
‘కావమ్మ మొగుడు... కావమ్మ మొగుడు అని అందరూ అంటుంటే... కామోసనుకున్నాను నాకేం తెలుసు’ అన్నాడట ఒకడు. అలా అందరూ ‘అతడు తప్పిపోయిన మీ కొడుకే, అచ్చం అలాగే ఉన్నాడ’ని చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి నిజమే అని నమ్మాడు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొడుకు తిరిగొచ్చాడని, ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. కానీ, కన్నపేగు కదా! ఆ తల్లి ఆ వ్యక్తిని తన కొడుకుగా అంగీకరించలేకపోయింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు చేరింది. 41 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎవరో తేలింది.‘వారసుడొచ్చాడు’ సినిమాలో వెంకటేష్‌లా, ‘అతడు’లో మహేష్‌బాబులా... కొడుకుగా ఆ వ్యక్తి మరొకరి ఇంటికెళ్లాడు. ఆ సినిమాల్లో హీరోలు ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు వారసులుగా వెళ్లారు. కానీ ఈ వ్యక్తి ఆస్తులు కొట్టేసి, విలాసంగా జీవించేందుకు నకిలీ వారసుడిగా ఆ ఇంట అడుగుపెట్టాడు. అయితే నిజం నిలకడమీద తెలిసింది. అతని మోసం బట్టబయలైంది. ఆ తల్లి నమ్మకమే నిజమని రుజువైంది.బీహార్‌లోని నలందా జిల్లా ముర్గావస్ గ్రామానికి చెందిన కామేశ్వర్ సింగ్ ఓ భూస్వామి. 1977లో అతని ఏకైక కుమారుడు కన్హయ్య పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతగా గాలించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి జాడ తెలియలేదు. చివరికి కామేశ్వర్ సింగ్ ఓ మంత్రగాడిని కలిశాడు. కొడుకు ఆచూకీ కోసం ఆరా తీశాడు. ‘మీ కొడుకు బతికే ఉన్నాడు. త్వరలోనే తిరిగొస్తాడ’ని అతడు చెప్పాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొడుకు తిరిగి రాలేదు. ఆ బెంగతో కామేశ్వర్ ఆరోగ్యం క్షీణించింది. అయితే తన కొడుకు తిరిగొస్తాడనే ఆశ చావలేదు. కన్హయ్య తప్పిపోయిన నాలుగేళ్లకు అతడి ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి ఓ యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. తాను ముర్గావస్ గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామస్థులు అతడే కన్హయ్య అని భావించారు. ఆ విషయాన్ని కామేశ్వర్సింగ్కు చెప్పారు. ‘వయోభారంతో నా చూపు మందగించింది. అతడ్ని సరిగా గుర్తించలేకపోతున్నాను. మీరందరూ నాకొడుకే అని చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి అతడ్ని నా ఇంటికి తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు.అంగీకరించని తల్లి..తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్న కామేశ్వర్ సింగ్ భార్య రామ్సఖీదేవికి కుమారుడు తిరిగొచ్చాడనే విషయం తెలిసింది. ఆ వ్యక్తిని చూసి తమ కుమారుడు కాదని స్పష్టంగా చెప్పింది. అయితే అతడు వచ్చిన తర్వాత నుంచి తన భర్త ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో కొంతకాలం వేచి చూసింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి తల ఎడమ వైపున గాయం గుర్తు ఉండేదని, ఈ యువకుడి తలపై అలాంటి గుర్తులేవీ కనిపించడం లేదని తెలిపింది. తమ బంధువులు, ఉపాధ్యాయుల్ని సైతం ఆ వ్యక్తి గుర్తించలేదని పేర్కొంది. తమ కుమారుడి వేషంలో వచ్చిన అతడు ఓ మోసగాడని తేల్చి చెప్పింది.నాలుగు దశాబ్దాలు అదే కుటుంబంలోతల్లి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తానే కన్హయ్యను అంటూ తిరిగి అదే ఇంటికి వెళ్లాడు. తండ్రి అతడ్ని నమ్మి ఇంట్లోనే ఉంచుకున్నాడు. అక్కడే ఉంటూ క్రమంగా ఆ కుటుంబంలో సభ్యుడిగా మారాడు. కన్హయ్య పేరుతో గుర్తింపు కార్డులు పొందాడు. డిగ్రీ పూర్తి చేశాడు. వివాహం చేసుకున్నాడు. నాలుగు దశాబ్దాల పాటు నకిలీ గుర్తింపుతో కొనసాగాడు. ఈలోగా భూస్వామికి చెందిన కొంత భూమిని సైతం విక్రయించాడు.చివరికి మిస్టరీ వీడిందిదయానంద్ గోసాయి పేరుతో జముయి జిల్లాలోని అతడి స్వగ్రామం చిరునామాతో ఉన్న ఓ లేఖ పోలీసులకు లభించింది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి విచారించారు. అతడి ఫొటో చూసిన కొందరు గ్రామస్థులు అతడు దయానంద్ గోసాయిగా గుర్తించారు. దీంతో అతడు దయానంద్ పేరుతో మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. అందులో 1982లో మరణించినట్టు నమోదు చేశారు. అయితే డెత్ సర్టిఫికెట్ 2014లో జారీ చేశారు. 32 ఏళ్ల తర్వాత జారీ చేయడంతో కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి తోడు కన్హయ్య పేరుతో జారీ అయిన గుర్తింపు పత్రాల్లోనూ పుట్టిన తేదీ వేర్వేరుగా ఉండడాన్ని కోర్టు గుర్తించింది.డీఎన్ఏ పరీక్షలకూ నిరాకరణకామేశ్వర్ సింగ్ కుటుంబ వారసుడా? కాదా? అని తేల్చేందుకు ఆధారమైన డీఎన్ఏ పరీక్షకు సైతం అతడు నిరాకరించాడు. తానే కన్హయ్య అని నిరూపించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అతడు ఉపయోగించుకోలేదు. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు అతడు కన్హయ్య సింగ్ కాదు దయానంద్ గోసాయి అని నిర్ధారించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఐపీసీ సెక్షన్ 419 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 420 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్ 120 బి కింద ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2022లో ఈ తీర్పు వెలువడింది. అప్పటికే ఆ తల్లిదండ్రులిరువురూ మృతి చెందారు. అయితే అసలు కన్హయ్య ఏమయ్యాడనే మిస్టరీ మాత్రం వీడలేదు.- దిలీప్ మాదిరెడ్డి -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్‌చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్‌రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్‌ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్‌తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్‌కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్‌వాచ్‌లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పోర్ట్స్‌వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్‌ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్‌లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్‌ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్‌హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్‌పూల్స్, పూర్తిస్థాయి జిమ్‌లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్‌స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్‌కో, వాకింగ్‌కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్‌ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్‌వేర్, బాటా, రిలాక్సో ఫుట్‌వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్‌కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్‌లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్‌కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్‌కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్‌లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్‌ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్‌లు. రెండు యాక్టివ్ లైఫ్‌స్టయిల్‌ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్‌ఫిట్ జిమ్‌లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్‌హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్‌కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
జామపండ్లలో మనమే టాప్!
జామపండ్లు మన స్థానికమైనవే అనుకుంటాం గాని, ఇవి పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా మన దేశానికి వచ్చాయి. అప్పటి నుంచి తోటల్లోనే కాదు, ఇళ్ల పెరళ్లలోనూ జామచెట్లను విరివిగా పెంచడం మొదలైంది.జామపండ్లను పండించడంలో ఇప్పుడు మన భారత దేశం అగ్రస్థానంలో కొనసాగుతోంది. జామపండ్లలో నాలుగువందలకు పైగా రకాలు ఉన్నాయి. వీటిలో 160 రకాలు మన దేశంలో పండుతాయి. పోషకాల గని అయిన జామపండ్లు ఎక్కువగా ఆగస్టు–ఏప్రిల్ మధ్యకాలంలో దొరుకుతాయి. కొన్ని రకాలు ఏడాది పొడవునా దొరుకుతాయి. జామపండ్ల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...జామపండ్లలో పోషకాలుజామపండ్లలో పిండిపదార్థాలు, చక్కెర, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు సహా కీలకమైన విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ప్రతి వందగ్రాముల జామపండ్లు 68 కిలోకేలరీల శక్తినిస్తాయి. వీటిలో నీరు 80 శాతానికి పైగా ఉంటుంది. ప్రతి వంద గ్రాముల జామపండ్లలో ఉండే పోషకాల వివరాలను గణాంకాల్లో చూద్దాం... -
నాస్తికోద్యమ నిర్మాత
ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరు గుతూ ఉంది. దానితో విద్వే షాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తు డిగా కాకుండా స్వచ్ఛమైన నీతి మంతుడైన మానవుడిగా మిగు లుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చి నప్పుడు సోదరభావం దానంతట అదే వెళ్లి విరుస్తుంది. ప్రేమ, అప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!– అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) అలోచనలు.ఎవరీ గోరా? ఒరిస్సాలో పుట్టి(1902 నవంబర్ 15), కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచినవాడు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూను కుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స– ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యతా నివార ణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే– ప్రజల్లో కుల, మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.గోరా అనేకచోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధుర లోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కాలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడ య్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో ఆధ్యాప కుడిగా చేరారు. నాస్తిక కేంద్ర స్థాపన నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి... భార్యా పిల్ల లతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అను కున్నారు. ఆ ఆలో చనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు.సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కుల మతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదు నూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందు వయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయనదే! అప్పు డాయన వయసు 70 సంవత్సరాలు.భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న గోరా తుదిశ్వాస విడిచారు. ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భ వతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. రాహు–కేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూఉండేవారు.- డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు ‘గోరా’ వర్ధంతి) -
నోబెల్ శిఖరమెక్కిన జాణపదం!
విశ్వకవి రబీంద్రనాథ్ టాగోర్ గీత రచనలో ప్రదర్శించిన ప్రతిభకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు 1913 నవంబర్ 13న స్వీడిష్ ఎకాడెమీ ప్రకటించింది. ‘ప్రగాఢమైన మార్దవమూ, నవనవలాడే తాజాదనమూ, ముగ్ధమోహన సౌందర్యమూ నిండిన కవిత’గా టాగోర్ గీతరచనను అభివర్ణించింది స్వీడిష్ ఎకాడెమీ.పరిపూర్ణమైన కౌశలంతో నిండివుండే టాగోర్ కవితావేశం ఆయన (ఆంగ్ల) గీతాలను పాశ్చాత్య సాహితిలో భాగంగా మార్చిందని స్వీడిష్ ఎకాడెమీ తన ప్రకటనలో పేర్కొంది. నాటికి నూట మూడేళ్ళు మరో పదమూడు రోజుల్లో పూర్తి అవుతాయనగా– 2016, అక్టోబరు 13న– మరో గీతరచయిత బాబ్ డిలాన్ నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నట్లు అదే ఎకాడెమీ ప్రకటించింది. ‘మహత్తరమైన అమెరికన్ గీతరచన సంప్రదాయ పరిధిలోనే కొనసాగుతూ, సరికొత్త కవితాత్మక భావప్రకటనలు చేసినందుకు’ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం ఇస్తున్నట్లు స్వీడిష్ ఎకాడెమీ తన అభినందన సందేశంలో ప్రకటించింది. అలా, నూరేళ్ళ తర్వాత, గీతరచనకు రెండోసారి నోబెల్ పురస్కారం సంపాదించిపెట్టిన వాగ్గేయకారుడిగా బాబ్ డిలాన్ చరిత్ర సృష్టించాడు.కెనడా సరిహద్దుల్లో వుండే అమెరికన్ స్టేట్ మిన్నెసోటా. అక్కడి ఆదివాసుల జానపద గీతాలు చరిత్రప్రసిద్ధాలు. పద్దెనిమిదో శతాబ్ది చివర్లో, జంతువుల చర్మాల కోసం ఇక్కడికి వచ్చే ఫ్రెంచ్ యాత్రికులు తమ గీతాల బాణీలతో ఇక్కడి స్థానిక గీతాలను మేళవించి కొత్తరకం జానపద గీతాల సంప్రదాయం సృష్టించారంటారు. బాబ్ డిలాన్ కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది ఈ జానపద గీతాలు పాడే! సాధారణంగా జానపద బాణీలో రాసిన గీతాలనగానే, మనకి విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలూ’, నండూరి ‘ఎంకి పాటలూ’, కొనకళ్ళ ‘బంగారిమామ పాటలూ’ గుర్తుకురావడం సహజం.అయితే, బాబ్ డిలాన్ గీతసాహితి ఆ బాపతు కాదు. 1960 దశకం మొదట్లో, 22 యేళ్ళ బాబ్ ‘ఉత్తరాది పల్లెటూరి పడుచు పిల్లా’, ‘కుండపోతగా వాన కురవనుంది పిల్లా’ లాంటి పాటలు రాసి పాడకపోలేదు. కానీ బాబ్ డిలాన్ బాణీకి పేరుతెచ్చిపెట్టినవి అలాంటి పాటలు కావు. అమెరికాలో యుద్ధ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న తరుణంలో బాబ్ పాడిన ‘పెనుగాలి వీస్తోంది’, ‘కాలం మారుతోంది’ లాంటివే బాబ్ డిలాన్ బాణీ ఇలాంటిదనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ పాటల్లో డిలాన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఆ రోజుల్లో సామాన్య పౌరులందరి మనస్సులనూ కలవరపరుస్తున్నవే! వాటికి ఆయన సూటిగా సమాధానాలు చెప్పలేదనే విమర్శ లేకపోలేదు. అయితే, అది కవిగారి పని కాదనే వాదన కూడా వినవచ్చింది! పాయింటేమిటంటే, అప్పట్లో– 1965 నాటికి– బీజప్రాయంగా మాత్రమేవున్న ‘ప్రత్యామ్నాయ సంస్కృతి’ (కౌంటర్ కల్చర్) చాయలు ఆ పాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించాయి. అదీ అసలు విశేషం! బాబ్ డిలాన్ అనేది కవిగారి పెట్టుపేరు– రాబర్ట్ యాలెన్ జిమ్మెర్మన్ అతగాడి పుట్టుపేరు. దాన్నిబట్టి, బాబ్ యూదు మతాన్ని అనుసరించే కుటుంబంలో పుట్టి పెరిగాడని అర్థమవుతుంది. అతని తండ్రి రష్యన్ జాతీయుడు కాగా, తల్లి లిథువేనియా జాతీయురాలు. (ఈ రెండు జాతులూ 1918 మొదలుకొని 1990 వరకూ సోవియెట్ యూనియన్‌లో భాగంగా వున్న సంగతి ఆధునిక రాజకీయ చరిత్ర తెలిసినవారికి వేరే చెప్పనవసరంలేదు! ఆ తర్వాత అవి తిరిగి ‘స్వతంత్ర’ దేశాలుగా ఆవిర్భవించాయి) రెండు ప్రపంచయుద్ధాల మధ్య కాలంలో బాబ్ తల్లితండ్రులు అమెరికా చేరి అక్కడే మనువాడారు. మతానికి సంబంధించి, బాబ్ డిలాన్ అభిప్రాయాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1970–’80 మధ్యకాలంలో బాబ్ క్రైస్తవమతంలోకి మారి, కొద్దికాలానికే తిరిగి యూదుమతంలోకి మారిపోయారు. దీనికి సంబంధించిన కథనాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయి– వాటినలా వదిలేయండి!దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర, అమెరికన్ జానపద– రాక్ సంగీత సంప్రదాయానికి చెందిన ఈ వాగ్గేయకారుడి సొంతం. పన్నెండున్నర కోట్ల రికార్డులను అమ్మి, బాబ్ డిలాన్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. అమెరికాకు పన్నెండో నోబెల్ సాహిత్య పురస్కారం సంపాదించి పెట్టిన అతగాడు. (అమెరికన్ రచయిత్రి లూయీజ్ గ్లిక్ –2020లో– పదమూడోసారి ఇదే పురస్కారాన్ని గెల్చుకున్న సంగతి చదువుకున్న మిత్రులకు తెలిసిన విషయమే!) ‘ప్రామాణిక సాహిత్యం అందించే మేధాసంపదతో సమృద్ధమైన సంస్కారం కలిగినవాడు బాబ్ డిలాన్. ఆయన 1960 దశకంలోనే, అమెరికన్ జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశార’ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా శ్లాఘించింది. 85 సంవత్సరాల వయసున్న ఈ సుప్రసిద్ధ వాగ్గేయకారుణ్ణి, ఆధునిక పాఠక–శ్రోతలకు ఇప్పుడు పరిచయం చేయాలనుకోవడం దుస్సాహసమే!- మందలపర్తి కిషోర్ -
తైలవర్ణ చిత్రం.. 'మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో..'
‘‘మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది. ‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు. సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మీ మామయ్య దుర్గ గుడిలో అకౌంటెంట్ కదా. ఆయనకి మీ బదిలీ సంగతి చెప్తే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రతంత్రాలు తెలిసిన చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు మనుషుల్ని వశీకరణ మంత్రాలతో ఆకర్షించి డబ్బు, బంగారం తీసుకోగలరట. ముఖ్యంగా నల్ల బట్టలు ధరించే అఘోరీలని అసలు నమ్మద్దని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర చాలా దుష్ట మంత్రశక్తులు ఉంటాయట.’’తన భర్త ఇంటికి రాగానే సుధీర ఆ సంగతులన్నీ చెప్పింది.‘‘అయితే మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అతను చెప్పాడు.రెండు వారాల తర్వాత వాళ్ళు వరంగల్ నించి చంబాకి బయలుదేరారు.∙∙ సుధీర భర్త కొత్త బ్రాంచ్‌లోని సిబ్బందితో మాటల్లో తన మామగారు చెప్పింది చెప్పి అడిగాడు.‘‘అది నిజమా?’’‘‘అవును. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ రాత్రికి శవాన్ని ఇవ్వమంటారు. సాధువుల్లా కనపడే కాషాయరంగు దుస్తులవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్షుద్రపూజలో వారికి శవం అవసరం అవుతుంది.’’∙∙ చంబాకి వచ్చిన రెండేళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవం కలగకపోవడంతో క్రమంగా భయంపోయింది.రోజూ రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చే సుధీర భర్త ఓరోజు బ్రాంచ్ నించి రాత్రి పదకొండైనా రాలేదు. పదకొండుకి బ్రాంచ్‌కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ చేశాడు.‘‘ఎవరూ లేరు మేడం. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.’’ చెప్పాడు.తెల్లవారుజామున మూడు దాకా ఆమె మేలుకునే ఉంది. తన భర్త రాకపోవడంతో ఉదయం పదిన్నరకి బేంక్‌కి ఫోన్ చేసింది. రాలేదని తెలిశాక పోలీసులకి ఫిర్యాదు చేసింది.ముందుగా పోలీసులు అతని బ్రాంచ్‌కి వెళ్ళి కేష్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఉందని తెలిశాక అతని కోసం వెదికారు. అతని జాడ తెలీలేదు.మర్నాడు మధ్యాహ్నం ఓ కాన్ స్టబుల్ వారింటికి వచ్చి అడిగాడు.‘‘మీవారి స్కూటర్ రోడ్ మీద ఎవరి ఇంటి ముందో ఉందట. అది దొంగిలించబడిందనే అనుమానంతో ఒకరు ఫోన్ చేశారు. చంపావతి నగర్లో మీకు బంధుమిత్రులు ఉన్నారా?’’ ‘‘లేరండి. అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారు?’’ సుధీర ఆదుర్దాగా చెప్పింది. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఎదురింట్లోంచి ఫిర్యాదు చేసిన ముసలాయన బయటికి వచ్చి చెప్పాడు.‘‘రాత్రి నించి ఇది ఇక్కడే ఉండటంతో ఎవరో దొంగిలించి ఇక్కడ వదిలారని అనుమానించాను.’’ ‘‘మీ ఎదురింట్లో ఎవరు ఉంటారు?’’ స్కూటర్ ఆ ఇంటివైపు పార్క్ చేసి ఉండటంతో పోలీస్ కానిస్టేబుల్ అడిగాడు. ‘‘అది ఖాళీ. అందులో ఎవరూ లేరు. అక్కడో సంఘటన జరిగాక ఎవరూ అద్దెకి రాలేదు.’’ ఆయన నెమ్మదిగా చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సుధీర వెంటనే అడిగింది. ‘‘నాలుగైదేళ్ళ క్రితం ఆ ఇంటావిడ అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుని మరణించింది. రాత్రుళ్ళు మగాళ్ళు ఆ ఇంటి పక్కనించి వెళ్తూంటే రమ్మని ఇంట్లోంచి ఆడవాళ్ళ పిలుపు వినిపిస్తుంది.’’కాన్ స్టబుల్ ఓ అపార్ట్మెంట్కి వీధివైపున్న సీసీటీవీ కెమెరాని గమనించి దాన్ని చెక్ చేస్తే, రెండు రోజుల క్రితం చీకటి పడుతూండగా సుధీర భర్త దాని డోర్ బెల్ నొక్కడం, తలుపు తెరుచుకున్నాక లోపలికి వెళ్ళడం కనిపించింది. తర్వాత రికార్డ్ అయినదంతా చెక్ చేశారు కాని, ఆ ఇంట్లోంచి సుధీర భర్త మళ్ళీ బయటకి రావడం కనిపించలేదు. ‘‘సందేహం లేదు. ఆయన ఏ కారణంగానో లోపలే ఉన్నారు.’’ సుధీర కంగారుగా చెప్పింది. ‘‘అదెలా జరుగుతుంది? దాని తాళంచెవులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మా బాబాయి కొన్నారు.’’ ముసలాయన ఆశ్చర్యంగా చెప్పాడు. తాళం తెరిచి అంతా లోపలికి వెళ్ళగానే సుధీర గట్టిగా అరిచింది.‘‘ఏమండీ? ఉన్నారా?’’ పాతికేళ్ళ క్రితం కట్టిన ఆ ఆరు గదుల ఇంట్లోని ప్రతీ గదిని వెతికారు. బూజు. ఎవరూ లేరు. కాన్ స్టబుల్ ప్రతి అల్మరా తలుపులు తెరిచి చూస్తే లోపలా లేడు. పడక గదిలో గోడకి వేలాడే తైలవర్ణచిత్రంలో జలతారు చీరలోని అందమైన ఏభై ఏళ్ళ స్త్రీ కనిపించింది.‘‘ఆ తైలవర్ణచిత్రం మరణించిన ఆవిడది... అరే. ఈ బొమ్మలోకి కొత్తగా ఎవరో వచ్చారే? దీన్ని ఈ బొమ్మలో ఎవరు గీశారో?’’ ఎదురింటి ఆయన సంభ్రమంగా చెప్పాడు. ‘‘అది మా వారే.’’ సుధీర కెవ్వున అరిచి చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఏమిటీ ఈ పిచ్చి? ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?
అది 1518 జూలై– ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరం– ఆకాశం నిర్మలంగా ఉంది. నగర వీథులు ఎప్పటిలాగే జనసమ్మర్దంతో సందడిగా ఉన్నాయి. హఠాత్తుగా ఒక ఇరుకైన సందులోంచి ఓ మహిళ రోడ్డుపైకి పరుగున వచ్చింది. ఆమె పేరు ఫ్రావ్ ట్రోఫియా. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం; కళ్లల్లో విపరీతమైన ఆందోళన. కానీ విచిత్రంగా ఆమె కాళ్లు మాత్రం అసంకల్పితంగా నర్తించడం ప్రారంభించాయి. చుట్టుపక్కల వాళ్లంతా ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘ఏమిటీ పిచ్చి? పండగ లేదు, పబ్బం లేదు– ఈమె ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తోంది?’ అని గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది నవ్వుకుంటున్నారు. అయినా సరే ట్రోఫియా నృత్యం ఆపలేదు. సూర్యుడు అస్తమించాడు; చీకటి పడింది; తెల్లవారింది. అయినా ట్రోఫియా కాళ్లు ఆగడంలేదు. ఆమె శరీరం చెమటతో తడిసి ముద్దవుతోంది. ఊపిరి కూడా సలపడంలేదు. స్పృహ తప్పి కింద పడిపోతోంది. కానీ కళ్లు తెరవగానే, మెదడుకు ఏదో కరెంట్ షాక్ తగిలినట్లు మళ్లీ లేచి డ్యాన్స్ చేస్తోంది. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు– ఏకధాటిగా ఆరు రోజుల పాటు ఆమె మృత్యునృత్యం చేస్తూనే ఉంది.ట్రోఫియాను చూసి నగర ప్రజలు నవ్వుకుంటుండగానే, మొదటి వారం ముగిసేసరికి మరో 34 మంది వీథిలోకి వచ్చి ఆమెతో జత కలిశారు. వాళ్లకు కూడా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరిని చూసి ఒకరు– అలా కేవలం నెల రోజులు గడిచేసరికి దాదాపు 400 మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి, పిచ్చిపట్టినట్లు నృత్యం చేయడం ప్రారంభించారు. వీరిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు, యువకులు ఉన్నారు. అదొక వింతైన అంటువ్యాధిలా మారిపోయింది. చూసేవాళ్లకు అది డ్యాన్స్‌లా లేదు. ఏదో అదృశ్య శక్తి వారి చేతులకు, కాళ్లకు దారాలు కట్టి బొమ్మలా ఆడిస్తున్నట్లు ఉంది.పగలూ రాత్రీ తేడా లేదు. ఎండా వానా తేడా అసలే లేదు. కాళ్లు అరిగిపోయి, పాదాలు చిట్లి నెత్తురోడుతున్నా, నర్తించడం మాత్రం ఆపలేకపోతున్నారు. విపరీతమైన డీహైడ్రేషన్, గుండెపోటు కారణంగా రోజుకు కనీసం 15 మంది వరకు రోడ్లపైన డ్యాన్స్ చేస్తూనే ప్రాణాలు విడిచారు. ఈ వింత పరిస్థితిని చూసి నగర పాలకులు, వైద్యులు తలలు పట్టుకున్నారు. ‘ఇది వేడి రక్తం వల్ల వచ్చే శారీరక సమస్య. దీనికి విరుగుడు ఒక్కటే– వాళ్లను ఇంకా ఎక్కువగా డ్యాన్స్ చేయనివ్వండి. రక్తం చల్లబడితే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది!’ అని కొందరు వైద్యులు సలహా ఇచ్చారు.అంతే! అధికారులు రంగంలోకి దిగారు. బాధితుల కోసం నగరంలో పెద్ద పెద్ద హాల్స్, స్టేజీలు ఏర్పాటు చేశారు. వాళ్లకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి ప్రత్యేకంగా డ్రమ్మర్స్, సంగీతకారులను పిలిపించి మరీ వాయించారు. కానీ ఈ నిర్ణయం మరింత బెడిసి కొట్టింది. హోరెత్తించే డ్రమ్స్ శబ్దాలు వినబడటంతో నగరంలోని మరికొంతమంది సాధారణ ప్రజల మెదళ్లు కూడా పాడైపోయి, ఆ డ్యాన్స్ గ్రూప్‌లో చేరిపోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగింది. చివరకు ప్రభుత్వం భయపడి నగరంలో డ్యాన్స్‌ను పూర్తిగా నిషేధించింది. బాధితులను బలవంతంగా ఒక పర్వత గుహలోని చర్చికి తరలించి, ప్రత్యేక పూజలు చేయించాక, సెప్టెంబర్‌లో ఈ కరాళ నృత్యం నెమ్మదిగా ముగిసింది.శతాబ్దాలుగా ఈ ‘డ్యాన్సింగ్ ప్లేగ్’పై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఆధునిక శాస్త్రవేత్తలు దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని గట్టిగా నమ్ముతున్నారు. అప్పట్లో ప్రజలు తినే రాగులు, గోధుమల లాంటి ధాన్యాలకు ‘ఎర్గోట్’ అనే ఒక రకమైన ఫంగస్ పట్టేది. ఈ ఫంగస్ ఉన్న ఆహారాన్ని తింటే మనుషుల్లో భ్రమలు, ఫిట్స్, విపరీతమైన నరాల కదలికలు వస్తాయి. అంటే ఇది ఇప్పటి ఎల్ఎస్డీ వంటి ప్రమాదకరమైన డ్రగ్‌లా పనిచేస్తుంది. అందువల్లే వారు అలా భయంకరంగా నర్తించి ఉంటారనే అంచనాకు వచ్చారు. అలాగే 1518 కాలంలో ఆ నగరంలో తీవ్రమైన కరవు, భయంకరమైన రోగాలు ఉన్నాయి. ఆ విపరీతమైన మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ప్రజల మెదడు ఒకేసారి ఆల్టర్నేట్ మోడ్‌లోకి వెళ్లిపోయి ‘మాస్ హిస్టీరియా’కు దారితీసి ఉండవచ్చనే వాదనలూ ఉన్నాయి.అయితే, ఒక ఫంగస్ వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల మనుషులు ఏకధాటిగా రోజులు తరబడి ప్రాణాలు పోయేంత వరకు ఎలా డ్యాన్స్ చేయగలరు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సైన్స్ దగ్గర పూర్తి స్పష్టమైన సమాధానం లేదు. తమ నియంత్రణలో లేని శరీరాలతో, మరణం వైపు అడుగులు వేస్తూ ఆనాడు ఆ నాలుగువందల మంది అనుభవించిన నరకం ఎలాంటిదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనిషి మెదడుతో ప్రకృతి ఆడిన ఈ వింత ఆట చరిత్ర పుటల్లో ఎప్పటికీ ఒక వీడని మిస్టరీనే!- సత్యకిశోర్ -
బాలి దీవిలో ఘనంగా గాలిపటాల వేడుక..
బాలి దీవిలో ఆకాశంపైకి ఎటు చూసినా రంగు రంగుల గాలిపటాలు కనువిందు చేస్తాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు ఇదే దృశ్యం బాలి దీవికి కళ తీసుకొస్తుంది. ఈ గాలిపటాల వేడుకను దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో బాలి దీవికి చేరుకుంటారు. ఇండోనేషియాలోని బాలి దీవిలో ఏటా జరిగే ‘బాలి కైట్ ఫెస్టివల్’ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది.కైట్స్ ఫెస్టివల్ బాలి అంతటా వివిధ ప్రాంతాలలో జరుగుతుంది. అయితే, ఈ కైట్ ఫెస్టివల్ ప్రారంభ, ముగింపు వేడుకలు మాత్రం సనుర్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న పడంగ్గలక్ బీచ్‌లో నిర్వహిస్తారు. ఈ వేడుకలే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు మస్కెటి బీచ్, మెర్తాసరి బీచ్, కుటా, ఉబుద్, దెన్ పసార్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో కూడా ఈ ఉత్సవాలు ఆనందోత్సాహాలతో జరుగుతాయి. ఈ వేడుకల సమయంలో ప్రతిచోటా వినిపించే బాలి సాంప్రదాయ సంగీతమైన ‘గమేలాన్ ఆర్కెస్ట్రా’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.హిందూ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం, ఈ గాలిపటాల పండుగ కేవలం ఒక వినోదం మాత్రమే కాదు. పంటలు సమృద్ధిగా పండినందుకుగాను దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి ఆశీస్సులు కోరుతూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ‘బంజర్’ అని పిలిచే స్థానిక యువజన సంఘాలు, వారి ‘సెకా లాయంగన్’ అంటే గాలిపటాల బృందాలతో కలిసి ఈ పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతి కోసం తలపడతాయి. ప్రతి బృందంలో 70 నుంచి 80 మంది సభ్యులు ఉంటారు. వీరంతా కలిసి గాలిపటాలను సిద్ధం చేయడం, వాటిని గాల్లోకి ఎగరేయడం ఒక అద్భుతమైన టీమ్‌వర్క్. ఈ పోటీలలో అత్యంత సృజనాత్మకమైన, వినూత్నమైన గాలిపటానికి ‘న్యూ క్రియేషన్’ అవార్డుతో పాటు భారీ నగదు బహుమతిని కూడా అందజేస్తారు. త్రీ–డైమెన్షనల్ రూపాలు, వివిధ రకాల మస్కట్ల ఆకృతులలోని గాలిపటాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.త్రిమూర్తుల సంకేతం..ఈ ఉత్సవాల్లో మూడు రకాల గాలిపటాలను తయారుచేస్తారు. జాంఘన్ అనే గాలిపటం పక్షి ఆకారంలో ఉంటూ, దాదాపు 100 మీటర్ల కంటే పొడవైన తోకను కలిగి ఉంటుంది. రెండవది బెబీయన్ అని పలిచే గాలిపటం. ఇది చేప ఆకారంలో ఉండి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. ఇక మూడోది పెకుకాన్ గాలి పటాలు. ఇవి ఆకు ఆకారంలో ఉండి గాలిలో స్థిరంగా ఉండవు. అందువల్ల దీన్ని గాలిలో ఎగురవేయడానికి 10 మందికి పైగా నిపుణులైన ఫ్లైయర్స్ అవసరమవుతారు.అంతేకాకుండా ఈ సాంప్రదాయ గాలిపటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఎరుపు, తెలుపు, నలుపు రంగులు హిందూ త్రిమూర్తులను సూచిస్తాయి. ఎరుపు రంగు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడిని, తెలుపు రంగు రక్షకుడైన విష్ణుమూర్తిని, నలుపు రంగు లయకారుడైన శివుడిని సూచిస్తాయి. అలాగే అష్టదిక్పాలకులను గౌరవిస్తూ పసుపు రంగును కూడా జోడిస్తారు. -
ప్రాంక్ కాల్..
బిజినెస్‌మేన్ సారథి ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. సరిగా అదే సమయంలో ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. సారథి ఫోన్ తీశాడు. అవతలి వ్యక్తి గొంతులో కరుకుదనం... ‘నీ కొడుకు రిత్విక్‌ను కిడ్నాప్ చేశాం. ఒక గంటలో పది లక్షల రూపాయలు తీసుకుని స్టార్ బేకరీ దగ్గరికి రా. పోలీసులకు చెబితే నీ కొడుకు ప్రాణాలు ఉండవు’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.రిత్విక్ తన ఫ్రెండ్ బెనర్జీ ఇంటికి వెళ్తానని చెప్పాడు. వెంటనే సారథి బెనర్జీకి ఫోన్ చేశాడు. రిత్విక్ తన దగ్గరికి రాలేదని చెప్పాడు.సారథికి కాళ్లూ చేతులూ ఆడలేదు. పెళ్ళైన పదేళ్లకు లేకలేక పుట్టిన కొడుకు. ఇంకేమీ ఆలోచించలేదు. డబ్బులు సూట్ కేసులో పెట్టుకుని స్టార్ బేకరీ దగ్గరికి వెళ్ళాడు. కానీ కిడ్నాపర్ జాడ లేదు. ఐదు... పది నిమిషాలు... అప్పుడే నవ్వుతూ ఎదురొచ్చాడు బెనర్జీ. వెంటనే ఆందోళనగా ‘నువ్వేంటి ఇక్కడ?’ అంటూ కొడుకు కిడ్నాప్ అయిన విషయం చెప్పి, పది లక్షలు ఉన్న సూటుకేసు చూపించాడు సారథి.వెంటనే బెనర్జీ నవ్వడం మొదలుపెట్టాడు.నిజానికి అది స్నేహితుడు బెనర్జీ ఆడిన ఒక క్రూరమైన ‘ప్రాంక్ కాల్’ నాటకం. రిత్విక్‌ను స్టార్ బేకరీకి తీసుకువెళ్లి, అక్కడ కూర్చోబెట్టి సారథిని భయపెట్టాలని బెనర్జీ ప్లాన్ వేశాడు.కానీ అప్పుడే అనూహ్య సంఘటన జరిగింది. రిత్విక్ నిజంగానే కిడ్నాప్ అయ్యాడు.∙∙ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న రంగంలోకి దిగాడు.ప్రాంక్ కాల్ చేసిన ఫ్రెండ్ బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారించాడు. బెనర్జీ ఏడుస్తూ, ‘సార్, నేను కేవలం సరదా కోసమే ఫోన్ చేశాను. బేకరీలోనే బాబు ఉన్నాడు, ఇంతలోనే ఏమైందో తెలియదు’ అని చెప్పాడు.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న వెంటనే బేకరీలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాడు. అందులో ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి రిత్విక్‌ను తన వెంట తీసుకువెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రద్యుమ్న చుట్టుపక్కల విచారణ మొదలుపెట్టాడు. కానీ ఎలాంటి ఆధారం లభించలేదు. అనుమానాస్పదంగా కూడా ఎవరూ కనిపించలేదు. వాడెవరా అని ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.ప్రద్యుమ్న పోలీస్ బుర్ర శరవేగంగా పనిచేయడం ప్రారంభించింది. కిడ్నాప్ చేసినవాడికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా అని అనుమానించాడు. ఆ వ్యక్తి నడక, శైలిని బట్టి ప్రద్యుమ్న తన పోలీస్ డేటాబేస్‌ను తనిఖీ చేయగా, వాడు పాత క్రిమినల్ అని క్లూ దొరికింది. రిత్విక్ ఒంటరిగా బేకరీలో కనిపించేసరికి కిడ్నాప్ చేశాడు.కానీ వాడు ఎటు వెళ్లాడో తెలుసుకోవడం ఎలా? ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. కిడ్నాపర్ బేకరీకి వచ్చినప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేసి ఉంటాడని భావించి, ఆ సమయానికి సంబంధించిన బేకరీ బిల్స్, కౌంటర్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. ప్రద్యుమ్న అనుకున్నట్లే, మాస్క్ ధరించిన ఆ క్రిమినల్ బేకరీలో బిల్లు చెల్లించడానికి తన మొబైల్ నుంచి ‘గూగుల్ పే’ చేసినట్లు గుర్తించాడు.వెంటనే ఆ ‘గూగుల్ పే’ లావాదేవీకి సంబంధించిన మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ టీమ్‌ను ఆదేశించాడు ప్రద్యుమ్న.కేవలం పది నిమిషాల్లో ఆ నంబర్ లొకేషన్ నగర శివార్లలోని ఒక నిర్జన ప్రదేశాన్ని చూపించింది. ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన టీమ్‌తో కలిసి మెరుపు వేగంతో ఆ స్థావరంపై దాడి చేశాడు. రిత్విక్ నోటికి ప్లాస్టర్ వేసి బంధించిన ఆ పాత క్రిమినల్‌ను గన్ పాయింట్లో లొంగదీసుకుని, రిత్విక్‌ను సురక్షితంగా కాపాడాడు. అసలు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత, ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న బెనర్జీ వైపు సీరియస్‌గా చూశాడు. ‘చూశావా బెనర్జీ! కుటుంబ సభ్యులతో... స్నేహితులతో సరదాగా ఆడుకునే ఈ ప్రాంక్ కాల్స్ చాలాసార్లు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. సరదాకు ఒక లిమిట్ ఉంటుంది... నీ వెర్రి సరదా ఈరోజు ఒక పాత క్రిమినల్‌కు ఎంత పెద్ద అవకాశం ఇచ్చిందో!’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న. బెనర్జీ తలదించుకుని క్షమాపణలు కోరాడు.- శ్రీసుధామయి -
దెయ్యం అనుకుని చంపాను...
మనిషి భయంతో ఉన్నప్పుడు తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనిషిని కూడా దెయ్యంలా భ్రమింప చేస్తుంది. ఆ రాత్రీ సరిగ్గా ఇలానే జరిగింది. ఎదురుగా చీకట్లో కనిపిస్తున్న మహిళలే ఆ ఊరికి పట్టిన దెయ్యాల్లా ఓ వ్యక్తి భావించాడు. చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేశాడు.ఓ మహిళ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కొంతసేపటికి అతని భ్రమ తొలగింది. వాస్తవం అర్థమైంది. భయం కారణంగా నేరానికి పాల్పడితే చట్టం రక్షిస్తుందా? భ్రమలో ప్రాణం తీస్తే శిక్ష ఉండదా? ఇదో అరుదైన కేసుగా నిలిచింది.ఆశ కేన్సర్ ఉన్న వాడ్ని కూడా బతికిస్తుంది. భయం ఏ రోగం లేని వాడిని కూడా చంపేస్తుంది. అలాంటి భయం– దెయ్యాలున్నాయనే ఓ గూర్ఖా నమ్మకం ఒక అమాయక మహిళ ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచింది. అతడ్ని నిందితుడ్ని చేసింది. భ్రమలో జరిగిన నేరంగా పరిగణించాలని నిందితుడు, ఐపీసీ సెక్షన్ 79 ఇతడికి రక్షణ కల్పించదని ప్రభుత్వం – ఇరు పక్షాలు కోర్టులో వాదించాయి. చివరకు ఈ కేసును ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది.ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని రాసగోవింద్‌పూర్ గ్రామానికి సమీపంలో ఓ పాడుబడిన విమానాశ్రయం ఉంది. అక్కడ ఉన్న పాత వస్తువులను కొనేందుకు కలకత్తాకు చెందిన ఛటర్జీ అనే వ్యక్తి తన సేవకుడు, నేపాల్‌కు చెందిన గూర్ఖా రామ్ బహదూర్ థాపాతో అక్కడికి వెళ్లాడు. ఆ విమానాశ్రయ ప్రాంతాన్ని ‘దెయ్యాలు తిరిగే ప్రదేశంగా’ ఆ సమీప గ్రామాల ప్రజలు భావించేవారు. ఆ భయంతో రాత్రిపూట ఆ దారి గుండా తమ గ్రామాలకు ఒంటరిగా వెళ్లేందుకూ భయపడేవారు.చీకట్లో ఘోరం..సమీపంలోని తేల్కుండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా తన గ్రామానికి వెళ్లేందుకు భయపడి రాసగోవింద్‌పూర్ గ్రామంలోనే ఉండిపోయాడు. ‘నీ ఊరికి వెళ్లేందుకు మేము తోడుగా వస్తామ’ని చటర్జీ, థాపా ఆ వ్యక్తికి చెప్పారు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక అటవీ ప్రాంతంలో మసక వెలుతురులో మూడు నల్లటి ఆకారాలు వీరి కంటపడ్డాయి. దీంతో వీరి పైప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికిపోయారు. అవి దెయ్యాలే అని బలంగా నమ్మారు. ఆ ఆకారాలు దగ్గరకు రాగానే వెంటనే థాపా కత్తితో ఆ ముగ్గురిపై దాడికి దిగాడు. హాహాకారాలు వినిపించడంతో తేరుకున్న థాపా– పరీక్షించి చూడగా వారు సమీప గ్రామానికి చెందిన మహిళలు. అడవిలో విప్ప పూలను సేకరించేందుకు అక్కడికి వచ్చారని తెలిసింది. అప్పటికే ఓ మహిళ చనిపోయింది. మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.కోర్టులో విచారణ..థాపాపై ఐపీసీ 302, 326,324 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ‘తాను మనుషులపై కాకుండా దెయ్యాలపై దాడి చేస్తున్నాననే భ్రమలో ఈ చర్యకు పాల్పడినట్టు సెషన్స్ కోర్టుకు థాపా వివరించాడు. ఐపీసీ సెక్షన్ 79 ప్రకారం రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడలేదు. మంచి విశ్వాసంతో జరిగిన పొరబాటు చర్యగా కోర్టు భావించింది. సెక్షన్ 79 వర్తిస్తుందని సెషన్స్ కోర్టు అతడ్ని నిర్దోషిగా విడుదల చేసింది.హైకోర్టులో వాదనలు..సెషన్స్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దాడి జరిగిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ ఘటన జరిగేది కాదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అతని చేతిలోని టార్చ్ వేసి ఆ ఆకారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించాడు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా, అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మరణానికి, మరో ఇద్దరు గాయపడడానికి కారణం అయ్యాడని కోర్టుకు వివరించాడు. ఐపీసీ సెక్షన్ 304ఏ, 336 కింద శిక్షార్హుడని వాదించాడు. సాక్షుల విశ్వసనీయతపైనా కోర్టు పలు సందేహాలు వెలిబుచ్చింది. ఛటర్జీ సాక్ష్యం మాత్రమే స్థిరంగా, విశ్వసనీయంగా ఉందని దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ‘ఒక వ్యక్తి తాను చేస్తున్న పని చట్టపరంగా సరైందే అని అతను నమ్మితే సరిపోదు; ఆ నమ్మకం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో పొరపాటు; ఆ పని నిజాయితీతో, తగిన జాగ్రత్తతో ఉండాల’ని కోర్టు పేర్కొంది. ‘జాగ్రత్త’ అనే ప్రమాణాన్ని అన్ని సందర్భాల్లో, అందరికీ ఒకేలా వర్తింప చేయలేమని పేర్కొంది. వ్యక్తులు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండొచ్చని వెల్లడించింది. వేర్వేరు కేసుల్లో ఇది మారొచ్చని చెప్పింది. ఈ కేసులో అక్కడి పరిస్థితులు, అతని మానసిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. మరింత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించి ఉంటే ఈ ఘటనను నివారించగలిగే వాడనే కారణంగా సెక్షన్ 79 రక్షణను నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తర్వులు సరైనవేనని ధ్రువీకరిస్తూ, అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
ఆ గదిలో... చీకటిలో...!
విశాలమైన మేడల్లో కాదు... ఇరుకైన ఇళ్లల్లోనే సుఖం ఉంటుందని చెప్పిందెవడో కానీ, వాడు కనిపిస్తే అడ్డంగా నరికేయాలని సూరిబాబుకి అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. కృష్ణానగర్, బీ బ్లాకులోని, పూర్ణా టిఫిన్ సెంటర్ దాటుకుంటూ వెళ్తే వచ్చే పన్నెండో నెంబరు పచ్చ రంగు బిల్డింగులో ఓ ఇరుకైన గదిలో అద్దెకు దిగినప్పటి నుంచి ఈ కోరిక మరింత బలంగా నాటుకుపోయింది. పెళ్లయి వారం తిరక్కుండానే గౌరిని తీసుకొని హైదరాబాద్ బయల్దేరబోతోంటే, అమ్మ ముత్యాలమ్మ కూడా సంచి సర్దేసుకుంది.‘కొత్తగా పెళ్లయిన జంట... మధ్యలో నువ్వెందుకు’ అని బంధువులంతా వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. ‘అమ్మకు నేను తప్ప ఎవరున్నారు.. నేనెక్కడుంటే తనూ అక్కడే’ అని సూరిబాబు అందామనుకొన్నాడు. కానీ ముత్యాలమ్మ ఆ అవకాశం తన కొడుక్కి ఇవ్వలేదు. ‘పెళ్లయి వారం అయ్యిందో లేదో.. నన్నూ నా బిడ్డనీ దూరం చేస్తారే.. ముదనష్టపు ముండల్లారా’ అని ఆరున్నొక్క రాగం అందుకుంది. అమ్మలక్కలు టీవీ సీరియల్ చూసినట్టు చూశారు. ఒకరిద్దరు ముత్యాలమ్మ నోటికి జడుసుకొని పారిపోయారు. ఓ అరగంట గ(ఏ)డిచాక.. ముత్యాలమ్మ ఏడుపులోనూ నిజం ఉందనిపించింది అందరికీ. దాంతో ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు.ఊర్లో రైలెక్కినప్పుడు ఏం అనిపించలేదు. సికింద్రాబాద్ స్టేషన్లో దిగి, 10హెచ్ బస్సు అందుకున్నప్పుడు కూడా ఏ భయమూ వేయలేదు. అరవై రూపాయల స్టీలు కోటింగు గోద్రేజ్ తాళం చాలా కష్టపడి తీస్తున్నప్పుడూ కంగారు పడలేదు. కానీ, ఒక్కసారి రూమ్‌లో అడుగుపెట్టేసరికి సూరిబాబు వాస్తవంలోకి రాలేక తప్పలేదు.‘దీన్ని కూడా ఇల్లంటారా’ అనబోయి ‘ఇదే మన ఇల్లా’ అని కాస్త డిగ్నిఫైడ్‌గా అడిగింది గౌరి.నాలుగ్గోడలు నిలబెట్టి, ఓ రేకు అడ్డంగా పరిస్తే తయారైన కుటీరం అది. దీనికంటే పిట్టలు కట్టుకొనే గూడే కాస్త పటిష్ఠంగా ఉంటుంది. మహానగరంలో మూడువేలకు ఇంతకు మించిన ఆవాసం దొరకడం ఎంత కష్టమో సూరిబాబుకి తెలుసు. బీటలు వారిన గోడలు, వాటి మధ్యే కాపురం ఉంటున్న బల్లులు, ‘ఇదే మన సామ్రాజ్యం’ అని యథేచ్ఛగా తిరిగేస్తున్న బొద్దింకలు. ఆ మూల ఎప్పుడూ మూడున్నర కేజీల గ్యాసే పట్టే ఐదు కేజీల సిలిండర్, ఈ మూల ఓ చాప, రెండు మాసిన దిండ్లు. ఆ మధ్యలో తన జీవితంలానే అస్తవ్యస్తంగా ఉన్న అల్మరా. ఇద్దరు అటూ ఇటూ తిరుగుతుంటే మూడో మనిషి నిలబడడానికే జాగా ఉండదు. అలాంటి చోట.. మూడో మనిషితో పాటు.. అది కూడా పెళ్లైన కొత్తలో కాపురానికి దిగాడంటే.. సూరిబాబుది ఎంత గట్టి గుండెనో అర్థం చేసుకోవొచ్చు.‘ఇదేం ఇల్లురా.. సూరి. ఇన్నాళ్లూ ఇక్కడే ఉన్నావా’ అంటూ ఊర్లో మధ్యలో ఆపేసిన ఏడుపు హైద్రాబాద్ మహానగరంలో కొనసాగించింది ముత్యాలమ్మ.‘నువ్వు ఏడుస్తూనే ఉండు.. నేను టిఫిన్లు తీసుకొస్తా..’ అని బయల్దేరబోతోంటే గౌరి ఆపింది. ‘ఇప్పుడు ఆ ఖర్చెందుకు.. నేను ఏదోటి చేస్తాగా’ అని చురుగ్గా కదిలింది. చిందరవందరగా ఉన్న వస్తువుల్ని చిటికెలో సర్దేసింది. చీపిరి అందుకొని చకచక ఊడ్చేసింది. తడిగుడ్డ పెట్టింది. స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించింది. డబ్బాల్లో ఏమున్నాయో వెదికింది. అవన్నీ కలిపి ఓ వంటకం సిద్ధం చేసింది. అందులోనే కొంత మిగిల్చి మధ్యాహ్నం క్యారియర్‌కి సర్దింది. ‘తొమ్మిది వేల ఆరొందల జీతంతో జీవితం హాయిగా గడిచిపోతుందిలే’ అనే భరోసా భర్తకి ఇచ్చింది. గౌరిలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తొలిసారి గర్వంగా ఫీలయ్యాడు సూరిబాబు.పొద్దస్తమానం కష్టపడి వస్తాడు సూరిబాబు. ఉన్నదాంట్లో రుచికరంగా వండుతుంది గౌరి. ‘నేనొండినట్టు ఎక్కడుంది’ అంటూ నిష్టూరపోతూనే మెతుకు మిగల్చకుండా లాగించేస్తుంది ముత్యాలమ్మ. ఆమెకు కాస్త పెందలాడే పడుకోవడం అలవాటు. చేతులు ఆరవు. కంచం కూడా తీయదు. తిన్న వెంటనే ముసుగేస్తుంది. ఆ ఇరుకైన గదిలోనే ముగ్గురికి పక్క సర్దుతుంది గౌరి. ముత్యాలమ్మ అటు తిరిగి పడుకొంటే.. ఇటు కొత్త దంపతులు సర్దుకుపోతారు.సూరి – గౌరి ఇద్దరూ కళ్లల్లో కళ్లు పెట్టి చూసుకొంటారు. మూగగా ప్రేమించుకుంటారు. అదే వారి ఏకాంతం. కాసేపు ఆ నాలుగు చేతులూ మాట్లాడుకుంటాయి. అరికాళ్లు ఆవిర్లు పంచుకుంటాయి. ఆ ఊపిర్లు వెచ్చగా పలకరించుకుంటాయి. అంతే వారి శృంగారం. గౌరిని దగ్గరకు తీసుకోవాలని ఉంటుంది. ముద్దు చేయాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై కోపం వస్తుంటుంది.బయట వాన పడుతుంటుంది. సూరి శరీరం వెచ్చబడుతుంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చిన గౌరిని చుట్టేసి కాస్త చల్లబడాలని ఉంటుంది. కానీ ఎలా?అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిని మర్డర్ చేయాలనిపిస్తుంది.సాయంత్రం వస్తూ వస్తూ బేరమాడకుండానే మూర మల్లెపూలు పట్టుకొస్తాడు. అదే తన విలాసం. అందులోనూ ముత్యాలమ్మ వాటాకొస్తుంది. ధర్మబద్ధంగా పావు మూర కోడలి కొప్పుకి చేరుతుంది. కనీసం ఆ మల్లెల వాసనైనా మనస్ఫూర్తిగా అనుభవిద్దాం అనుకుంటాడు. కానీ వెనకే ముత్యాలమ్మ నీడ వెంటాడుతూ ఉంటుంది. ఇది తన విలాపం.అందుకే ‘ఇరుకింట్లోనే సుఖం ఉంది’ అన్నవాడిపై పూట పూటకూ పగ పెరుగుతూనే ఉంటుంది.‘అసలే కొత్త జంట.. వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వూ.. అన్నీ తెలిసినదానివి ఇంతకంటే ఏం చెబుతాం’ అని ఎవరో ముత్యాలమ్మకు ఫోనోపదేశం చేశారు ఓసారి. అప్పట్నుంచి రాత్రి భోజనాల తరవాత బయటకు వెళ్లి పచార్లు చేయడం అలవాటు చేసుకొంది. అదీ కా..సే...పే.ఎంత సేపంటే.. తలుపు వేసి గౌరిని అల్లుకునేంత సేపు.ఎంత సేపంటే.. ఆ బుగ్గల నునుపెంతో చూసేంత సేపు.ఎంత సేపంటే.. ఆ విరహం దూరమెంతో కొలిచేంత సేపు. అంతే!‘మాయిదారి నిద్ర.. మాయిదారి నిద్ర.. కళ్లు మూతలు పడుతున్నాయనుకో..’ అంటూ మూసి ఉన్న తలుపుల్ని గభాల్న తోసుకొంటూ వచ్చేస్తుంటుంది. అత్తగారికి ఎక్కడ దొరికిపోతామో అన్న భయం ఆ కోడల్ని వెంటాడుతుంటుంది. ‘కన్నతల్లిని పక్కన పెట్టుకొని ఏమిటీ రాసలీలలు’ అని ఆ కొడుకు మనసు క్షోభిస్తుంటుంది. కథ మామూలే! ఇలా ఎలాంటి రసాస్వాదన లేకుండా ఎన్నో రాత్రులు గడిచిపోయాయి.‘పట్నం ఎలా ఉందో చూసి రాకూడదమ్మా.. బస్సు కూడా ఫ్రీనే..’ అన్నాడు కొడుకు ఓ ఆదివారం పూట.‘కోడల్ని కూడా తీసుకెళ్తా.. తనక్కూడా ఫ్రీనే కదా’ అని వెంటబెట్టుకుపోయింది. ‘ఏనాడు చేసుకొన్న పాపమో ఇది..’ అని తల గోడకేసి కొట్టుకోబోయి.. అది ఎక్కడ పడిపోతుందో అని భయం వేసి ఆగిపోయాడు.‘పెద్దమ్మ గుడి పక్కనే... ఓసారి దండం పెట్టుకొని వచ్చేయ్’ అంటే ‘మీ నాన్న నన్ను వదిలిపెట్టి పోయినప్పుడే దేవుడిపై నమ్మకం పోయింది’ అంటూ ట్యాపు విప్పింది. అవి కన్నీళ్లు కావు. ఎండాకాలం కూడా ప్రవహించే కుళాయి.ఆ కొత్త పెళ్లికూతురు మాత్రం ఎన్నిరోజులు భరిస్తుంది? ఎంతని సహిస్తుంది? ‘ఇక జీవితాంతం ఇంతేనా?’ అని అలక‘చాప’ ఎక్కింది. అటు తిరిగి పడుకొని, తన నిరసన తెలిపింది. పాపం.. అంతకంటే ఏం చేయగలదు?‘నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మ.. నీ కాటుక కళ్లే నవ్వకపోతే కలలే రావమ్మా..’ కింది ఫ్లోరు నుంచి పాట వినిపిస్తోంది మంద్రంగా.∙∙ రెండు గదులున్న ఇంట్లోకి మారే స్తోమత తనకు ఇప్పట్లో లేదు. అదెప్పుడొస్తుందో కూడా తెలీదు. ఈలోపు గౌరిని శాంతపరచాలి. అందుకేం చేయాలి? అందుకే బాగా ఆలోచించి.. ‘ఓయోకి వెళ్దామా..’ ఏదైతే అది అయ్యిందని తెగించి అడిగేశాడు.‘ఓయోనా.. అదేంటి?’ అని తన అమాయకమైన మొహాన్ని మరింత అందంగా మార్చేస్తూ అడిగింది ఆ కొత్త పెళ్లి కూతురు. ఓయో అనగానేమి, అక్కడ దొరికే సౌలభ్యాలేమిటి అనేవి పూసగుచ్చినట్టు వివరించేశాడు.‘ఇదేం ఖర్మండీ మనకూ. నేను రానుగాక రాను..’ అని మొదట్లో నొచ్చుకొంది. కానీ కొన్ని రాత్రుల విరహం తనని కూడా కరిగించింది.ఓయో రెంటు తొమ్మిదొందలు. సూరిబాబుకి వచ్చే ఆ అరాకొరా జీతంలో తొమ్మిదొందలు ఒక్క పూట కోసం పక్కన పెట్టడం కష్టమే.‘రేపట్నుంచి మల్లె పూలొద్దు’ ఆర్డరేసింది గౌరి. ‘టీ’ తన టైమ్ టేబుల్ మార్చుకొని, ఒక్క పూటకు కుంచించుకుపోయింది. రెండు ఆదివారాలు కోడికూర లేకుండానే గడిచిపోయాయి.‘ఎందుకిదంతా..?’ అని అడిగితే... ‘రూపాయా, రెండ్రూపాయలా? తొమ్మిదొందలు. మన జల్సాలకు ఖర్చు చేస్తున్నాం కదా, ఈ మాత్రం ఆదా చేయకపోతే ఎలా’ అంది. దిగువ మధ్యతరగతివాడి సరసం కూడా విలాస వస్తువుల ఖాతాలో చేరిపోయిందన్నమాట.నెల రోజుల ఆదాతో ఆ తొమ్మిదొందలూ పూడాయి. ఆ ఆదివారం భార్యాభర్తలిద్దరూ టిప్పుటాపుగా రెడీ అవుతుండడం మూల నుంచి ముత్యాలమ్మ గమనిస్తూనే ఉంది.‘సినిమాకెళ్తున్నాం.. పెందలాడే వచ్చేస్తాంలే..’ అని తొలిసారి అబద్ధమాడాడు సూరి.‘సినిమానా.. నేనూ వద్దును కదర్రా.. ఎన్నాళ్లయ్యిందో చూసి’ అని తెగ బాధ పడిపోయింది ఆ తల్లి. ‘టికెట్లు రెండే దొరికాయి.. కొత్త సినిమా కదా..’ అంటూ మరో అబద్ధాన్ని అప్పటికప్పుడు అల్లి బయల్దేరారు ఇద్దరూ.దారి వెంబట ఎన్ని కలల్ని, ఎన్ని ఊహల్ని, ఎన్ని కోరికల్ని మోసుకెళ్లారో. మధ్యలో ఆగి ఓ మూర మల్లెలు కొన్నాడు. ఈసారి పూర్తిగా తన భార్యకే.ఓయో వచ్చింది. భయం, బిడియం కలిసిన అడుగులు తడబడుతూ హోటల్ మెట్లెక్కాయి.‘పేరేంటి..’ అడిగాడు ఓయో అబ్బాయి.‘సూరిబాబు..’‘ఎన్ని రోజులు ఉంటారు?’‘రోజులా.. ఈ ఒక్క పూటకే..’‘ఐడీ కార్డు..’‘ఐడీ కార్డా... మర్చిపోయా..’ అంటూ జేబులు తడుముకొన్నాడు. పాపం నిజంగానే మర్చిపోయాడు.‘సర్సరేలే.. ఇలాంటివన్నీ మామూలే..’ అనుకొంటూ గౌరి వంక కాస్త వంకరగా చూశాడు. ఆ చూపుల భావమేంటో గౌరికి అర్థం కానందుకు సూరిబాబు కాస్త స్థిమితపడ్డాడు. అడ్వాన్సు అందుకొన్న ఓయో అబ్బాయి ‘రూమ్ నెంబరు 203’కి దారి చూపిస్తూ తాళం అందించాడు. లిఫ్టు రెండో ఫ్లోరులో ఆగింది. ఎవరైనా చూస్తారేమో అనే కంగారు పడుతూనే 203లోకి దిగబడింది ఆ జంట. ఓ థర్డ్ క్లాస్ లాడ్జ్ అది. గోడలకు వేసిన రంగు మాసిపోయి చాలా కాలమైంది. ఆ దుప్పటి కూడా ఎప్పుడు ఉతికారో ఏమిటో? రూమ్ నిండా అదోరకమైన వాసన. కానీ గౌరి ఇవేం పట్టించుకోవడంలేదు. సూరికి కూడా ఇవేం అక్కర్లేదు.తాము కాపురం వెలగబెడుతున్న ఆ ఇరుకు గదితో పోలిస్తే ఈ రూము విశాలంగా ఉంది.‘ఇంత పెద్ద మంచమా..’ అంటూ గౌరి కళ్లు విప్పారాయి. ఆ రూమంతా ఓసారి ఇష్టంగా కలయితిరిగింది. నెత్తి మీద ఫ్యాను తిరుగుతోంది. టీవీ కూడా ఉంది. ఇంత కంటే విలాసం.. తాను చూడగలదా? ఆనందంతో భర్తని కౌగిలించుకుంది. తొలిసారి మల్లెపూలకు ఎంతటి మహత్తు ఉందో తెలుసుకుంటున్నాడు సూరి. పెళ్లయిన ఇంత కాలానికి తనకూ, తన భార్యకూ దొరికిన ఏకాంతం అది. ప్రతీ క్షణమూ మధురమే. ఈసారి సూరిబాబు కౌగిలి బిగించాడు. గౌరికి ఊపిరి ఆడడం లేదు. అయినా బాగుంది. సూరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. అయినా హాయిగానే అనిపిస్తోంది. కాసేపు పట్టు విడిచాడు. కళ్లల్లో కళ్లు పెట్టి చూశాడు. గౌరి పెదవులు తమని ఆక్రమించుకొమ్మని ఆహ్వానలేఖ పంపాయి. వాటిని అందుకోబోతుండగా...‘టింగ్’ అంటూ మోగింది కాలింగ్ బెల్. స్వప్నలోకాల నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టు అనిపించింది. సూరి, గౌరి మొహమొహాలు చూసుకొన్నారు. తొలిసారి కంగారు పడ్డారు. గౌరి చీర సర్దుకొంది. సూరి తమాయించుకుంటూనే తలుపు తీశాడు. ఎదురుగా ఇద్దరు కానిస్టేబుళ్లు. ‘ఇద్దరు కరడుకట్టిన అల్‌కాయిదా తీవ్రవాదుల్ని పట్టేసుకున్నాం’ అనేంత గర్వం వాళ్ల కళ్లల్లో.∙∙ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎప్పటిలా చాలా రద్దీగా ఉంది. పోలీస్ స్టేషన్ చూడడం గౌరికి అదే తొలిసారి. అందుకే శరీరంలో అణువణువూ ఒణుకుతోంది. సినిమాల్లో పోలీస్ స్టేష¯Œ ని చాలాసార్లు చూశాడు సూరిబాబు. కానీ అవి ఇలా లేవు. అందుకే తాను కూడా కంగారు పడుతున్నాడు. కానీ బయటపడడం లేదు.‘మేమిద్దరం భార్యాభర్తలం సార్..’ అని హెడ్ కానిస్టేబుల్ దగ్గర వేసిన క్యాసెట్టే వేస్తున్నాడు. రైడింగ్‌లో పట్టుబడ్డోళ్లంతా ఇలానే చెబుతార్లే అన్నట్టు హెడ్డుగారు అసలు పట్టించుకోవడమే లేదు.‘ఏమిటండీ.. ఇదంతా.. ఇప్పుడు ఏం జరుగుతుంది’ గౌరి దాదాపు ఏడ్చినంత పని చేసింది. ‘నువ్వేం కంగారు పడకు.. నేను చూస్తాగా..’ అంటూ హెడ్ కానిస్టేబుల్ చుట్టూ ప్రదక్షిణాలు మొదలెట్టాడు.‘సార్.. నిజంగానే తను నా భార్య సార్’ ఈసారి దాదాపు కాళ్లు పట్టుకొన్నంత పని చేశాడు.‘మరి సాక్ష్యం’‘తాళిబొట్టు ఉంది కదా’‘అది సరిపోదు.. ఇంకేమైనా..’‘మా అమ్మ ఉంది..’‘ఎక్కడ..’సూరిబాబు అడ్రస్ చెప్పాడు. ఓ కానిస్టేబుల్ వెళ్లి కాసేపటి తరవాత ముత్యాలమ్మని వెంటబెట్టుకొచ్చాడు. స్టేష¯Œ లోకి అడుగు పెడుతూనే కొడుకూ కోడళ్లిద్దరి వైపు ముత్యాలమ్మ చూసిన చూపు ఈ హెడ్ కానిస్టేబుల్ మాటల కంటే భయంకరంగా అనిపించాయి. ఏం జరిగిందో ఇదంతా ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ముత్యాలమ్మకు ఎంతోసేపు పట్టలేదు. సంతకాలు పూర్తయ్యాక స్టేషన్ నుంచి బయటపడ్డారు ముగ్గురూ.అమ్మ కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు సూరికి. అత్తతో మాట్లాడేంత తెగువ లేదు గౌరికి. వాళ్లద్దరినీ మళ్లీ కదిపే సాహసం చేయలేదు ముత్యాలమ్మ.‘నన్ను మన ఊరి బస్సెక్కించేయ్ రా’ పావుగంట తరవాత ముత్యాలమ్మ నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట అది. సూరి ఏం మాట్లాడలేకపోయాడు.‘నేనూ మీ వయసు దాటొచ్చినదాన్నే.. మీ పరిస్థితి అర్థం చేసుకోవాల్సింది.. ఊరి నిండా మనోళ్లే కదా. నేనక్కడ బాగానే ఉంటా. అప్పుడప్పుడూ మీరే వస్తుండండి’అమీర్ పేటలో ముత్యాలమ్మని బస్సెక్కించి, ఆటోలో ఇంటికి బయల్దేరారు ఆ భార్యాభర్తలు. నెల రోజుల నుంచి పడుతున్న తపన.. ఈ రోజు జరిగిన తతంగం అంతా కళ్ల ముందు కదలాడింది. కాసేపు బాధ పడ్డారు. ఆ తరవాత చిన్నగా నవ్వుకున్నారు. స్టేషన్ నుంచి కూడా ఎలాంటి గొడవా లేకుండా బయటపడడంతో కాస్త రిలీఫ్‌గా అనిపించింది. ఇద్దరి కళ్లూ కలిశాయి. ఇంటికి వెళ్తే.. కావాల్సినంత ఏకాంతం దొరుకుతుందన్న ఆలోచన ఇంకాస్త ఆనందాన్ని కలిగించింది. మల్లెల దండ ఇంకా సువాసన వెదజల్లుతూనే ఉంది. సూరిలోని రొమాంటిక్ ఫెలో మళ్లీ నిద్ర లేచాడు. ఆటో యూసుఫ్‌గూడా రోడ్లు దాటుతూ కృష్ణానగర్‌లో ఆగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్న తలపు.. వాళ్లిద్దర్నీ మరింత తొందరపెట్టింది. అరవై మెట్లు తొలిసారి ఆయాస పడకుండా ఎక్కేస్తున్నారు. ఫ్లోరు దాటుతున్న కొద్దీ ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగి పొర్లుతోంది. త్వరగా ఒక్కటైపోవాలన్న తపన తొందర పెట్టిస్తోంది. ఐదు ఫ్లోర్లు పూర్తయ్యాయి. తమ గదికి చేరువైపోయారు. ఆఖరి మెట్టు దగ్గర ఇద్దరూ సడన్ బ్రేకు వేసినట్టు ఆగిపోయారు. ఎందుకంటే గుమ్మం ముందు ఓ శాల్తీ కాచుకొని కూర్చుంది. ఈ భార్యాభర్తల్ని చూసి ఒక్కసారిగా పైకి లేచింది.‘ఏమైపోయావ్ గౌరీ ఇంతసేపూ..’ అని రాగానే బలవంతంగా కావలించేసుకొంది.‘ఎవరీవిడ..’ అర్థం కానట్టు అడిగాడు సూరి.‘మా అనసూయత్త చిన్నప్పటి నుంచీ నన్ను పెంచి పోషించింది. మన పెళ్లికి కూడా వచ్చింది’‘ఇప్పుడిక్కడికెందుకు వచ్చినట్టు?’ మెల్లగానే అన్నా, ఆ మాట అనసూయకు వినిపించింది. ‘నాకు మీరు తప్ప ఎవరున్నారు గౌరీ.. మీ మావయ్య కూడా కాలం చేశాడు. ఒక్కదాన్నే ఊర్లో ఉండబుద్ది కాలేదు. కూతురులాంటి నువ్వు గుర్తొచ్చావు. కలో గంజో కలిసే తాగుదాం అనిపించి వచ్చేశాను..’ అంటూ ఇంకోసారి బావురు మంది.‘ఈ ఇరుకింట్లోనా?’ ఈసారి వినిపించేలానే అన్నాడు సూరి.‘సుఖమన్నది విశాలమైన మేడల్లో కాదు బాబూ.. ఇలాంటి ఇరుకైన ఇళ్లల్లోనే ఉంటుంది’ అంది పెద్ద తత్వవేత్తలా.ఆ ఒక్క మాటతో సూరిబాబు గుండెలో వంద గ్రెనేడ్లు పేలాయి.- మహమ్మద్ అన్వర్ -
సముద్రాలకు రక్షణ సైన్యం
కోస్తా తీరప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, అరుదైప వృక్షాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. చాలామందికి మడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే కొన్ని చెట్లు మాత్రమే. కానీ అవి కేవలం చెట్లు కావు. అవి ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. సముద్రం, నదులు, నేల, చేపలు, పక్షులు, మనుషులు... ఇవన్నింటినీ ఒకే దారంతో కలిపే ప్రకృతి వలయం.సముద్రపు ఉప్పునీటిలోనూ మనగలిగే ఈ అడవులు లేకపోతే తీరప్రాంత మత్స్య సంపదలో గణనీయమైన భాగం ఉండదు. అనేక చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ప్రారంభించేది ఈ మడ అడవుల్లోనే. అందుకే మడ అడవులను శాస్త్రవేత్తలు ‘సముద్రా నికి నర్సరీ’ అని పిలుస్తారు. మడ అడవుల వేర్లు సముద్ర అలల వేగాన్ని తగ్గిస్తాయి. మట్టిని నిలబెడతాయి. తుఫాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను తాకిన దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రకృతి విపత్తుల్లో ఒకటి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. సముద్రంతో యుద్ధం చేయడం కాదు... దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆ రోజు ప్రకృతి ఒక కఠినమైన పాఠం నేర్పింది. మడ అడవులను కాపాడటం ద్వారా ఇటువంటి విపత్తులను కాపాడవచ్చు.‘సముద్రాన్ని ఆపేశాము’!ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మడ మొక్కలను పెంచడం, చేపల పెంప కాన్ని మడ అడవులతో అనుసంధానం చేయడం, ఉప్పునీటిలో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు పర్యా వరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధిని కూడా బలోపేతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో కొన్ని గ్రామాలను సముద్రం మింగేస్తోంది. అయితే ‘మా ఊరికి రాకుండా సముద్రాన్ని ఆపేశాము’ అంటారు కృష్ణా జిల్లా తీరప్రాంత గ్రామం బసవాని పాలెంకు చెందిన పద్మ. సముద్ర నీటి మట్టం పెరిగినపుడల్లా తీరప్రాంతం కోతకు గురయ్యేది. ఎం.ఎస్. స్వామినా«థన్ ఫౌండేషన్ సహకారంతో ఎస్జీహెచ్ మహిళలు దశాబ్దం క్రితం నాగాయి లంక, బసవవాని పాలెంలో 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటారు. ఇపుడు అవి అడవిగా మారి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా మారాయి.వీరి కృషి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రకృతిని కాపాడితే... ప్రకృతి మనిషిని కాపాడుతుంది. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు. మడ అడవులను కాపాడటం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇది పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్యకారులు, రైతులు కలిసి చేయాల్సిన పని.ప్రతి జిల్లాలో మడ అడవుల మ్యాపింగ్ జరగాలి. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలి. తీరప్రాంత గ్రామాల యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. సముద్రాన్ని మనం ఆపలేము. తుఫాన్లను కూడా ఆపలేము. కానీ వాటి విధ్వంసాన్ని తగ్గించే సహజ రక్షణ కవచాన్ని మాత్రం కాపాడగలం.– శ్యాం మోహన్, సీనియర్ జర్నలిస్ట్ (రేపు ప్రపంచ మడ అడవుల దినోత్సవం) -
కాక్రోచ్ ఉద్యమం వెనుక పూర్తి కథ ఇదే !
-
అడ్వర్టైజ్మెంట్లు... మా రాంబాబుగాడి మూఢనమ్మకాలు!
మా రాంబాబుగాడికి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. అవి అలాంటిలాంటి మూఢనమ్మకాలు కావు. అన్నీ అడ్వరై్టజ్మెంట్స్ గురించే. పాత రోజుల్లో... అప్పట్లో ఓ డ్రింక్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేదట... ‘టేస్ట్ ద థండర్’ అంటూ! అప్పటి నుంచి పిడుగు ఎక్కడ పడుతుందో తెలుసుకుని దాన్ని కాస్తంత టేస్ట్ చూడాలన్నది వాడి తాపత్రయం. ఎక్కడో ఫలానా చోట పిడుగుపడిందంటే ఎంత ఖర్చయినా పెట్టుకుని అక్కడికి వెళ్లేవాడు. ‘‘సార్... ఇక్కడ పిడుగు పడిందట. ఏమనుకోక΄ోతే... కాస్తంత పిడుగు రుచి చూపిస్తారా? ఒకే ఒకసారి కొద్దిగా టేస్ట్ చేస్తా సార్’’ అంటూ అక్కడివాళ్లను బతిమాలాడు. దాంతో ఆ అడ్వర్టైజ్మెంట్ తాలూకు బాటిల్‌ను వాడికి ఇచ్చి,.. ‘‘ఇందులో పిడుగును బంధించాం సార్. అదెంత పవర్ఫుల్ అంటే... జస్ట్ మీరు బాటిల్ మూత రుచి చూసినా టేస్టు తెలిసిపోతుంద’’న్నారు వాళ్లు. ‘‘ఏదో గొప్పగా ఉంటుందనుకున్నాగానీ... థండర్ రుచి చాలా పేలవంగా ఉంది సార్’’ అంటూ అక్కణ్నుంచి నిరాశగా వెళ్లిపోయాడు మన రాంబాబు. ∙∙ ఇక మరో అడ్వర్టైజ్మెంట్ ఏదో వచ్చేదట... ‘ఖడ్గంతో గడ్డం చేసుకోండి’ అని! అప్పట్నుంచి వాడిలో మరో మూఢనమ్మకం మొదలైంది. ‘మామూలు చిన్న బుజ్జి బ్లేడ్‌తో చేసుకుంటేనే ఇంత బాగుంది కదా. మరి ఖడ్గంతో చేసుకుంటే ఎంత స్మూత్‌గా ఉంటుందో’ అని. ‘‘ఒరేయ్ నాయనా... కొట్టడానికి సైకిల్ చైన్ ఫ్లెక్సిబుల్‌గా ఉండనట్టే... ఖడ్గంతో గడ్డం చేసుకోవడమూ కష్టమవుతుందిరా బాబూ’’ అంటే ఎంతకీ వినడే. దాంతో వాడి ఫ్రెండ్ ఒకడు ఒక బ్లేడ్ తెచ్చిచ్చి... ‘‘నీకు తెలుసా... ఖడ్గం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్‌తోనే ఇది తయారైంది. ఖడ్గానికి మినీ వర్షన్రా ఇదీ! దీంతో గడ్డం చేసుకుంటే ఖడ్గంతో చేసుకున్నట్టే’’ అని వాడిని కన్విన్స్ చేశారు. అప్పట్నుంచి వాడు మామూలు బ్లేడ్‌నే ఖడ్గఖండమనే భ్రమలో ఉంటూ... అలా గడ్డం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ∙∙ ఇక మరో దశలో వీడి పిచ్చి ఇంకాస్త పీక్స్‌కు చేరింది. అదేదో సబ్బు రుద్దుకోవాలంటే తప్పనిసరిగా జలపాతం కిందే స్నానం చేయాలన్నది వాడి మరో మూఢనమ్మకంగా మారింది. ఆ సబ్బు వాడటానికి జలపాతానికి వెళ్లాలంటూ రోజూ పొద్దున్నే ఒకటే గొడవ. చివరకు వాళ్ల నాన్న వాళ్లింట్లో షవర్ పెట్టించాడు. ‘‘ఒరే నాన్నా... అందరూ అడవిదాకా వెళ్లి జలపాతంలోనే స్నానం చేయాలంటే కుదర్దు కదా. అందుకే ఆ కంపెనీల వాళ్లు జలపాతానికి ఆల్టర్నేట్గా షవర్లను తయారు చేశారు. షవరంటే ఏమనుకున్నావు... జలపాతాన్ని మడిచి బాత్రూమ్లో పెట్టిన టెక్నాలజీ రా ఇదీ’’ అంటూ సముదాయిస్తూ... షవర్లో వాడి చేత ఆ సబ్బు రుద్దించారు. ∙∙ వీడి మూఢనమ్మకాలకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి రాంబాబు వాళ్ల నాన్న చాలా మంది డాక్టర్లను కలిశాడు. చాలా హాస్పిటల్స్ తిరిగాడు. కానీ ఎక్కడా నయం కాలేదు. ఓరోజు రాంబాబుగాడి క్లోజ్ ఫ్రెండు దగ్గర తన గోడు వెళ్లబోసుకుంటుంటే... వాడో సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. ‘‘ఇదంతా ఎందుకు అంకుల్. వాడు ఎట్టిపరిస్థితుల్లోనూ టీవీ చూడకుండా ఉండేలా వాణ్ణి బిజీ చేసేయండి. జస్ట్ ఇది చేస్తే అంతా సర్దుకుంటుంది చూడండి’’ అంటూ సలహా ఇచ్చాడు. – యాసీన్ (చదవండి: 20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు!) -
మన్యం నుంచి పార్లమెంటు దాకా...
అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగిన మన్యం పితూరీలో ఆయనకు ప్రధాన అనుచరులుగా గాం గంటందొర, గాం మల్లుదొర పేరెన్నిక గన్నారు. వీరు గిరిజనులలో భగత తెగకు చెందినవారు. ఇందులో మల్లు దొర స్వాతంత్య్రానంతరం పార్లమెంటుకూ ఎన్నిక య్యాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి తాలూకాలోని కొయ్యూరు మండలం ‘బట్టపనుకులు’ గ్రామంలో 1900లో జన్మించాడు.గంటందొర చిన్న తమ్ముడు మల్లుదొర. బ్రిటిష్ తాబేదారుల అక్రమ చర్యలను గాం సోదరులు ప్రతిఘటించారు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడనే నేపంతో చింతపల్లి తాసిల్దార్ సెబాస్టియన్ గంటందొరను మునసబు పదవి నుంచి తొలగించాడు. అంతేగాదు, గంటందొర భూమితో పాటు మరికొందరి ఆదివాసుల భూములను ప్రభుత్వపరం చేశాడు. గాం సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మన్యం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు తెలియుజేశారు.సీతారామరాజు 1922లో మన్యం పోరాటాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను అంత మొందించడానికి 150 మంది సైనికులను సేకరించ డంలో గాం సోదరుల కృషి చెప్పుకోదగినది. వీరికి భగత తెగ గిరిజనులైన సింగన్న, పడాలు, గోవిందు, వీరయ్య దొర, గోకేరు ఎర్రేసు, అగ్గిదొర వంటి వారి సహకారం తోడైంది. సీతారామరాజు నాయకత్వంలో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చిన వారికి 10 వేలు, గంటందొర, మల్లుదొరలను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల పారితోషికం ప్రకటించింది.ఉద్యమంలో కాస్త చురుకుదనం కోల్పోయిన సందర్భంలో ఆయుధాలను అల్లూరి సైన్యానికి అప్పగించి మల్లుదొర దళాన్ని విడిచి వెళ్లాడు. 1923 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం చేరుకున్నాడు. ఒక రహస్య ప్రదేశంలో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. అల్లూరి ఆచూకీ తెలుప మని మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఏమీ చెప్పలేదు. 1924 మే 7న పట్టు బడిన అల్లూరి వీరమరణం పొందాడు. వాల్తేరు ఏజెన్సీ న్యాయమూర్తి మల్లు దొరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షణను ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1937లో అండమాన్ జైలు నుంచి విడుదౖలñ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గెలుపొంది ఆదివాసీలలో తొలి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. 1969 జూలై 21న తుదిశ్వాస విడిచారు.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు -
గురువే దేవుడి కన్నా ఉన్నతుడు..
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు. అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.– యామిజాల జగదీశ్ -
Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...
స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్‌లో ‘కస్తూర్బా హాస్పిటల్’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా అభివృద్ధి చెందింది.సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్‌లో ‘ట్యూబర్ కులోసిస్ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు. సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్ 2001 జనవరి 3న సేవాగ్రామ్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి -
వైభవంగా గియాన్ మత్సూరీ సంబరాలు..
జపాన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సాంస్కృతిక ఉత్సవం గియాన్ మత్సూరీ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూలై నెల మొత్తం అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. యాసకా ఆలయానికి సంబంధించిన ఈ చారిత్రాత్మక ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భారీ రథాల ఊరేగింపు జూలై 17న ప్రారంభమైంది. అంగరంగవైభవంగా నిర్వహించే ఈ వేడుకలను వీక్షించేందుకు ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు క్యోటో నగరానికి క్యూకట్టారు.దైవదూతగా స్థానిక బాలుడు!క్రీస్తుశకం 869లో నగరంలో వ్యాపించిన ఒక తీవ్రమైన అంటువ్యాధి నుంచి తమను రక్షించాలని దేవుళ్లను వేడుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలను నిరంతరాయంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈ పండుగలో ఇప్పటికీ ఒక విలక్షణమైన ఆచారాన్ని పాటిస్తారు. ఒక స్థానిక బాలుడిని దైవదూతగా ఎంపిక చేస్తారు. ఆ బాలుడు జూలై 13 నుంచి 17వ తేదీన ఊరేగింపు పూర్తయ్యే వరకు నేలపై కాలు మోపరాదనే కఠినమైన నియమం పాటించాల్సి ఉంటుంది.ఆకట్టుకునే భారీ రథాలుఈ ఉత్సవాల్లో ముఖ్యమైనది భారీ రథాల ఊరేగింపు. ఈ ఊరేగింపులో యమ, హొకో అనే రెండు రకాల రథాలను ఉపయోగిస్తారు. ఇందులో హోకో రథాలు సుమారు 25 మీటర్ల ఎత్తు, 12 టన్నుల బరువుతో మనుషులంత పరిమాణం ఉన్న భారీ చక్రాలతో నిర్మితమై ఉంటాయి. జూలై 17న జరిగిన మొదటి ఊరేగింపులో 23 రథాలు పాల్గొంటాయి. జూలై 24న జరిగే రెండో ఊరేగింపులో మిగిలిన 10 రథాలు నగర వీధుల్లో విహరిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రథాల తయారీలో ఒక్క మేకును కూడా ఉపయోగించకుండా కేవలం తాళ్లతోనే రథ భాగాలను అనుసంధానిస్తారు.రాత్రి వేళల్లో యోయియామా బ్లాక్ పార్టీలు!జూలై 17, 24 తేదీల్లో జరిగే ప్రధాన ఊరేగింపులకు ముందు వచ్చే మూడు సాయంత్రాలు క్యోటో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటాయి. వీటిని వరుసగా యోయి– యామా వీధి వేడుకలుగా పిలుస్తారు. వేడుకల సమయంలో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఆహార శాలలు, రంగురంగుల దుకాణాలతో వీధులలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థానికులతో పాటు పర్యాటకులు కూడా సాంప్రదాయ ‘యుకతా’ నూలు వస్త్రాలు ధరించి, వీధుల్లో నృత్యాలు చేస్తారు. ఈ సమయంలోనే స్థానిక ప్రజలు తమ ఇళ్ల తలుపులు తెరిచి, తమ వంశపారంపర్యంగా వస్తున్న పురాతన వస్తువులను ప్రదర్శించే ‘బ్యోబు మత్సూరీ’ అనే వేడుక కూడా ఈ సమయంలోనే జరుగుతుంది.- రమా జంబుల -
సోల్ మిస్టరీ..
చెన్నైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి ముత్తుస్వామి హైదరాబాద్ వచ్చాడు. కోట్ల విలువైన వజ్రాలు అతని వద్ద ఉన్నాయి. ఆధునిక స్టార్ హోటల్స్‌లో దిగితే నిఘా ఉంటుందని, ఎవరికీ అనుమానం రాకూడదని అతను హైదరాబాద్ లోని ఒక పాతకాలం నాటి లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు.పెద్ద శబ్దంతో తిరిగే పాతకాలం నాటి ఫ్యాన్... ప్లాస్టిక్ మగ్...రాత్రి పదకొండు నలభై ...ముత్తుస్వామి రూమ్ తలుపులు వేసుకుని, పడుకునే ముందు తన సూట్‌కేస్ తెరిచాడు. అందులోని చేతి సంచీని తీసి, కాసేపు ఆ వజ్రాల మెరుపులను చూసుకుని, మళ్లీ వాటిని జాగ్రత్తగా సంచీలో పెట్టి, పడుకున్నాడు. అయితే, అతను వజ్రాలు చూసుకుంటున్నప్పుడు కిటికీ సందులో నుంచి రెండు కళ్లు తనను నిశితంగా గమనిస్తున్నాయనే విషయాన్ని ముత్తుస్వామి గమనించలేకపోయాడు.తెల్లవారింది. ముత్తుస్వామి రూమ్ తలుపు కాస్త నెట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూసిన రూమ్ బాయ్ గట్టిగా కేక పెట్టాడు. ముత్తుస్వామి మంచంపై రక్తపు మడుగులో శవమై పడి ఉన్నాడు. సూట్‌కేస్ తెరిచి ఉంది, వజ్రాల సంచీ మాయమైంది.∙∙ క్రైమ్ సీన్..సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నాడు. హత్యా స్థలాన్ని పరిశీలిస్తుండగా, మంచం కింద ఒక వస్తువు దొరికింది. అది మహిళలు ధరించే ఒక సరికొత్త ‘హైహీల్’ చెప్పు. ఒకే ఒక్క చెప్పు అక్కడ పడి ఉంది.‘సార్, దీన్ని బట్టి చూస్తే రాత్రి ఎవరైనా లేడీ లోపలికి వచ్చి, ముత్తుస్వామిని చంపి వజ్రాలు ఎత్తుకెళ్లినట్టు ఉంది’ అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తల అడ్డంగా ఊపి అన్నాడు. ‘ముత్తుస్వామి గొంతును ఒక్క చేత్తో బలంగా నొక్కి, మరో చేత్తో గుండెల్లో పొడిచారు. ఆ పట్టు చూస్తే అది కచ్చితంగా ఒక బలమైన పురుషుడి పనే.’ కేవలం పోలీసుల దారి మళ్లించడానికే ఆ హైహీల్ చెప్పును అక్కడ వదిలేశారని గ్రహించాడు. అంతేకాదు, ఆ చెప్పు సైజు ‘9’. సాధారణంగా మహిళలకు అంత పెద్ద సైజు పాదం ఉండదు.చుట్టుపక్కల చూశాడు. అనుమానించదగ్గ ఆధారాలు కానీ పనికి వచ్చే క్లూస్ కానీ దొరకలేదు. చేతికి గ్లౌస్ ధరించి ఆ హైహీల్ చెప్పును చేతిలోకి తీసుకున్నాడు. లాడ్జికి చుట్టుపక్కల ఉన్న చెప్పుల షాపుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూశాడు.లాడ్జికి కొద్ది దూరంలోనే ఉన్న ఒక పెద్ద చెప్పుల షాపు సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేయగా అసలు నిజం బయటపడింది. ఒక వ్యక్తి ఆ షాపుకు వెళ్లి, తొమ్మిదో నంబర్ లేడీస్ హైహీల్ చెప్పులు కొంటున్న దృశ్యం అందులో స్పష్టంగా కనిపించింది.∙∙ లాడ్జిలో ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ఎదురుగా లాడ్జి సిబ్బంది, లాడ్జిలో బస చేసిన కస్టమర్లు నిలబడి వున్నారు.ప్రద్యుమ్న వెంటనే లాడ్జిలో ఉన్న సిబ్బంది అందరినీ లైన్లో నిలబెట్టి, వారి పాదాలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించాడు. లాడ్జిలో ఆగిన మగవాళ్ళు ‘అదేంటి ఇన్స్పెక్టర్, మమ్మల్ని అనుమానిస్తున్నారా? అయినా మేము హైహీల్ చెప్పులు వేసుకోవడం ఏమిటి?’ అన్నారు.‘ఇది హత్యకేసు. అందరూ సహకరించాల్సిందే.’ కఠినమైన స్వరంతో చెప్పాడు.అందరూ నిలబడ్డారు. తన చేతిలో ఉన్న హత్యాస్థలంలో దొరికిన హైహీల్ చెప్పును కిందపెట్టి, ఒకొక్కరిని వచ్చి చెప్పులో కాలు పెట్టమని చెప్పాడు. రూమ్ బాయ్ మొదలు అందరూ వచ్చి ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న చెప్పినట్టు ఆ హైహీల్ చెప్పులో పాదం పెట్టారు. చివరికి మిగిలిన ఒకే ఒక వ్యక్తి మెల్లిగా వెనక్కి జరిగాడు.ఆ వ్యక్తి మేనేజర్ కిరణ్... ముందుగా గింజుకున్నా ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న మొహంలో కోపం చూసి పాదం పెట్టాడు. కిరణ్ పాదాల సైజు కచ్చితంగా తొమ్మిది (9). అంతేకాదు, కిరణ్ కుడికాలి చర్మం కాస్త చిట్లిపోయి, చిన్న గాయం అయి ఉండటాన్ని ప్రద్యుమ్న గమనించాడు.‘చెప్పు మిస్టర్ కిరణ్! ఇంకో హైహీల్ చెప్పు ఎక్కడ?’ కూల్‌గా అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న. ఆ కూల్నెస్లోని సీరియస్‌నెస్ అర్థమైంది కిరణ్‌కు...‘నాకు... నాకేం తెలుసు?’ బింకంగా అన్నాడు.‘నాకేం తెలుసు అన్నావు గానీ, నేను ఈ హత్య చేయలేదు అనలేదు. కొత్త హైహీల్ చెప్పు కాబట్టి కరిచింది. చర్మం చిట్లిపోయి ఉంది. చెప్పుల షాప్‌లో సీసీ ఫుటేజ్‌లో నువ్వు హైహీల్ చెప్పులు కొంటున్న విజువల్ వుంది. మమ్మల్ని డైవర్ట్ చేయడానికి నువ్వాడిన డ్రామా– హైహీల్ చెప్పుతో తప్పుదారి పట్టించాలనుకున్నావు. అదే ఇక్కడ సాక్ష్యాధారంగా మారింది.’ అంటూ ప్రద్యుమ్న కిరణ్‌ను తన స్టైల్లో విచారించడంతో కిరణ్ నిజం ఒప్పుకున్నాడు. అతను దొంగిలించిన వజ్రాలు ఎక్కడా కనిపించలేదు. కిరణ్ రూమ్ అంతా వెతికినా లాభం లేకపోయింది. అప్పుడు ప్రద్యుమ్న చూపు కిరణ్ రూమ్‌లో ఉన్న రెండో హైహీల్ చెప్పుపై పడింది.ప్రద్యుమ్న ఆ రెండో చెప్పును తీసుకుని గట్టిగా లాగి, దాని అడుగు భాగాన్ని (సోల్) విరిచి చూశాడు. అంతే, అందరి కళ్లు బైర్లు కమ్మాయి! కిరణ్ చాలా తెలివిగా ఆ హైహీల్ చెప్పు సోల్ భాగాన్ని కట్ చేసి, అందులో కోట్ల విలువైన వజ్రాలను దాచి మళ్లీ గ్లూతో అంటించాడు. కిరణ్ వేసిన మాస్టర్ ప్లా¯Œ ను ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన చాకచక్యంతో ఛేదించి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు.- శ్రీసుధామయి -
విడుదలలో జాప్యం తగదు!
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక భరోసా కల్పించేది పెన్షన్. అయితే ద్రవ్యోల్బణం పెరుగు తున్నకొద్దీ పెన్షన్ విలువ తగ్గిపోకుండా రక్షించేందుకు డియర్నెస్ రిలీఫ్ (డి.ఆర్.) పొందే హక్కు పెన్షనర్లకు ఉంది. దీని చెల్లింపును ఆలస్యం చేయడం అంటే పెన్షనర్ల జీవన భద్రతను బలహీన పరచడమే. భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (1983) కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇచ్చే సాయం కాదనీ, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన ఆస్తి హక్కు అనీస్పష్టంగా పేర్కొంది. పెన్షన్‌కు అను బంధమైన డియర్నెస్ రిలీఫ్ కూడా అదే సూత్రానికి లోబడి ఉంటుంది.ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధాప్యంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. కాబట్టి డి.ఆర్.ను సకాలంలో చెల్లించడం సంక్షేమరాష్ట్ర బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు 37.31 శాతం డి.ఆర్. మాత్రమే అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్యోల్బణ సూచికల ప్రకారం 1.7.2024 నుండి 2.73 శాతం, 1.1.2025 నుండి 1.82 శాతం, 1.7.2025 నుండి మరో 2.73 శాతం, 1.1.2026 నుండి మరో 1.82 శాతం పెంపుదల రావలసి ఉంది. ఈ పెండింగ్ శాతం కేవలం గణాంకం కాదు; 3.60 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు కారణం కూడా. ధరల పెరుగుదల, వైద్య వ్యయాలు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బకాయిలు వారి జీవనా«న్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అందుకే డి.ఆర్. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనీ అనవచ్చు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిపాలనా విధానం కాదు. ఈ చెల్లింపు ఆలస్యం చేయరాని బాధ్యత; అమలు చేయవలసిన న్యాయం.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఆంక్షలను ధిక్కరించిన ఉక్కు సంకల్పం
భారతదేశ అణు ప్రయాణం, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక నిర్ణయాలు, చారిత్రక సవాళ్ల గురించి అభిజిత్ చావ్డా ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్.పి.టి.) వెనుక ఉన్న వివక్ష, పోఖ్రాన్ పరీక్షల ద్వారా భారత్ సాధించిన విజయం వంటి అంశాలను ప్రస్తావించారు:మొండితనం కాదు, మనుగడ నిర్ణయం‘‘అగ్ర దేశాలు 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఖరారు చేసినప్పుడు, వారు ఒక స్పష్టమైన గీత గీశారు. ‘మా దగ్గర 1967 కంటే ముందే అణ్వాయు ధాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని ఉంచుకుంటాం, కానీ మిగతా వాళ్లు ఎవరూ వాటిని తయారు చేసుకో కూడదు’ అని! నా దృష్టిలో ఇది ఆయుధాలను నియంత్రించే ఒప్పందం కాదు. కేవలం కొన్ని దేశాలకే ప్రాధాన్యం ఇచ్చే ఒక వివక్షతో కూడిన రాజకీయం. మన పొరుగు దేశాలు శత్రువులుగా మారుతున్న సమయంలో, ఇండియా తనను తాను రక్షించుకునే సార్వ భౌమ హక్కును వదులుకుంటూ ఈ ఒప్పందంపై సంతకం చేయాలని వారు ఆశించారు. ఇండియా ఎన్పీటీపై సంతకం చేయకపోవడం మొండితనం కాదు, అది మనుగడ కోసం తీసుకున్న స్పష్టమైన నిర్ణయం.భాభా ‘మరణం’ వెనుక అమెరికా!‘‘1966లో డాక్టర్ హోమీ భాభా మరణం చుట్టూ ఉన్న చీకటి కోణాలను, ఆయన అద్భుతమైన ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఇండియా అణు ప్రయాణాన్ని మనం తెలుసుకోలేం. ఆ కాలపు చారిత్రక పరిణామా లను బట్టి చూస్తే, ఆల్ప్స్ పర్వతాలపై జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్ 101 ప్రమాదంలో భాభా మరణించడం ఒక ప్రమాదం కాదని నేను గట్టిగా నమ్ముతాను. అది ఇండియా అణు సామర్థ్యాలను సాధించడానికి ఎంత దగ్గరగా ఉందో చూసి భయపడిన విదేశీ నిఘా సంస్థలు – ముఖ్యంగా సి.ఐ.ఎ. – పన్నిన ఒక కుట్ర. మనం 18 నెలల్లోనే అణు పరికరాన్ని తయారు చేయ గలమని భాభా బహిరంగంగానే ప్రకటించారు. ఆయనను నిర్మూలించడం ద్వారా, విదేశీ శక్తులు మన అణు పురోగతిని కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టాయి.ఆచితూచిన పేరు ‘స్మైలింగ్ బుద్ధ’‘‘మనం 1974లో పోఖ్రాన్–1 పరీక్షను నిర్వహించి నప్పుడు, దానికి ‘శాంతియుత అణు విస్ఫోటం’ (పి.ఎన్.ఇ.–పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్) అని పేరు పెట్టి, ‘స్మైలింగ్ బుద్ధ’ అనే రహస్య కోడ్‌ను ఉప యోగించాం. ఈ పేరు పెట్టడం ఆనాటి మన రాజకీయ నాయకత్వంలో ఉన్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లను, లోతైన సంకోచాన్ని తెలియజేస్తుంది.ముఖ్యంగా 1971 భారత్–పాక్ యుద్ధంలో పాక్‌కు అను కూలంగా భారత్‌పై ఒత్తిడి తేవటానికి అమెరికా తన ఏడవ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) బంగాళాఖాతంలో మోహరించిన తర్వాత, మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకున్నాం. కానీ మనం ఒక అణు దేశ మని బహిరంగంగా ప్రకటించుకునే ధైర్యాన్ని అప్పట్లో ప్రదర్శించలేకపోయాం. ఈ ‘వ్యూహాత్మక అస్పష్టత’ (ఎటూ తేల్చని విధానం) అనే పాలసీ వల్ల 24 ఏళ్లపాటు దౌత్యపరమైన సందిగ్ధతలోనే ఉండిపోయాం. ఆఖరికి 1998లో వాజ్‌పేయి నాయకత్వంలో జరిగిన పోఖ్రాన్ –2 పరీక్షలు మాత్రమే, ఇండియా ఒక అణు దేశం అనే నిజాన్ని ప్రపంచానికి స్పష్టం చేశాయి.‘కల్పక్కం’ మన సత్తాను చాటింది!‘‘కొరతగా ఉన్న యురేనియంకు బదులుగా, మన దేశంలో సమృద్ధిగా ఉన్న థోరియం నిల్వలపై ఆధార పడిన మన ‘మూడంచెల అణు విద్యుత్ కార్యక్రమం’ భారతీయ శాస్త్రవేత్తల స్వయం సమృద్ధికి ఒక గొప్ప నిద ర్శనం. 1974 అణు పరీక్షల తర్వాత పాశ్చాత్య దేశాలు మనపై కఠినమైన ఆంక్షలు విధించినప్పుడు, మన అణు రియాక్టర్లకు ఇంధనం అందకుండా చేసి, మనల్ని లొంగి పోయేలా చేయవచ్చని వారు భావించారు. కానీ వారి అహంకారం పూర్తిగా తిరగబడింది. కల్పక్కం వంటి కేంద్రాల్లోని మన శాస్త్రవేత్తలు ఒంటరిగానే కొత్త ఆవిష్క రణలు చేశారు. మరెవరూ ప్రాధాన్యం ఇవ్వని ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు’, ‘థోరియం వినియోగ చక్రాల’పై పట్టు సాధించారు. ప్రపంచ దేశాలు మనల్ని ఒంటరిని చేసినప్పటికీ, ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే సాంకేతికతను తన సొంత శక్తితో ఎలా నిర్మించు కోగలదో నిరూపించిన గొప్ప విజయ చిహ్నం అది.- ఎడిటోరియల్ టీమ్ -
విద్యుత్తు ప్రమాదాలు నివారించగలిగినవే!
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలు ఆధునికీకరణ దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ, విద్యుత్ భద్రత అదే వేగంతో ముందుకు సాగడం లేదు. ఫలితంగా ప్రతి సంవ త్సరం వందలాది మంది ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు బలవుతున్నారు. వరుసగా చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదాలు యాదృచ్ఛికాలు కావు; విద్యుత్ భద్రతా వ్యవస్థలో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందని సూచిస్తున్నాయి.విద్యుత్ రంగంలో నాలుగు దశాబ్దాలుగా పనిచేసిన ఒక ఇంజినీర్‌గా నా అనుభవం చెబుతున్నది ఒక్కటే– విద్యుత్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం నివారించగలిగేవే. ప్రతి ప్రమాదం వెనుక డిజైన్, నిర్వహణ, రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, శిక్షణ, భద్రతా సంస్కృతి, జవాబుదారీతనం వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రమాదాన్ని రూట్ కాజ్ ఎనాలిసిస్ (మూల హేతువు విశ్లేషణ) పద్ధతిలో విచారించి, అసలు కారణాలను గుర్తించడం తప్పనిసరి.భారతదేశంలో విద్యుత్ భద్రతకు సంబంధించిన చట్టపరమైన వ్యవస్థ స్పష్టంగానే ఉంది. ఎలక్ట్రిసిటీ యాక్ట్– 2003, అలాగే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (మెజర్స్ రిలేటింగ్ టు సేఫ్టీ అండ్ ఎలెక్ట్రిక్ సప్లై) రెగ్యులేషన్స్... విద్యుత్ సంస్థలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్దేశించాయి. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు తగ్గడం లేదు? దానికి సమాధానం ‘వ్యవస్థాపరమైన భద్రతా సంస్కృతి’ లోపించడంలో ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత విచారణ కమిటీలు వేయడం, పరిహారం ప్రకటించడం, సంతాపం తెలియ జేయడం అవసరమే. కానీ ప్రమాదం జరగకముందే దానిని నివా రించే వ్యవస్థను నిర్మించడం ఇంకా ముఖ్యమైన బాధ్యత. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యుత్ రంగం ‘జీరో ఫెటాలిటీ విజన్’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది. అంటే, విద్యుత్ ప్రమాదాల వల్ల ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వ్యవస్థలు రూపు దిద్దుకుంటున్నాయి. మన దేశంలో కూడా ఇదే లక్ష్యం కావాలి.తీసుకోవలసిన భద్రతా చర్యలుప్రతి విద్యుత్ ప్రమాదాన్ని ‘అనివార్యమైన ప్రమాదం’గా కాకుండా, ‘నివారించగలిగిన వ్యవస్థ వైఫల్యం’గా పరిగణించే దృక్పథం ఏర్పడాలి. తెగిపోయిన 11 కేవీ లేదా 33 కేవీ విద్యుత్ లైన్ నేలపై పడిన క్షణంలోనే సంబంధిత రక్షణ వ్యవస్థ స్పందించి ఫీడర్‌ను ట్రిప్ చేయాలి. అది జరగకపోతే ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదో విచారణ జరగాలి. రక్షణ పరికరాల లోపమా? నిర్వ హణ నిర్లక్ష్యమా? పరీక్షలు సకాలంలో జరగలేదా? లేక పర్యవేక్షణలో వైఫల్యమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే తదుపరి ప్రమాదాన్ని నివారించగలం.ఇక మరో ముఖ్యమైన అంశం – విద్యుత్ ప్రమాదాలను కేవలం ఉద్యోగుల సమస్యగా చూడరాదు. వీటిలో పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు, రైతులు, చిన్నారులు కూడా బలవుతున్నారు. తెగిపడిన తీగలను తాకడం, ట్రా¯Œ ్సఫార్మర్ల సమీపంలో నిర్లక్ష్యంగా తిరగడం, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలినా పట్టించుకోకపోవడం, అక్రమ విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి.ఒక ఆధునిక విద్యుత్ వ్యవస్థలో మూడు రక్షణ వలయాలు ఉండాలి – నాణ్యమైన ఇంజినీరింగ్ రూపకల్పన, సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు, కఠినమైన భద్రతా సంస్కృతి. ఈ మూడూ బలంగా ఉన్నప్పుడే విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడినా, దాని మూల్యం ఒక అమాయ కుడి ప్రాణంగా మారుతుంది.ప్రతి విద్యుత్ ప్రమాదం తర్వాత ఒకే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి – ‘ఈ ప్రమాదం నిజంగా తప్పించలేనిదేనా?’ నిజా యితీగా సమాధానం వెతికితే, చాలా సందర్భాల్లో జవాబు ‘కాదు’ అనే వస్తుంది. అప్పుడు మనం అంగీకరించాల్సిన సత్యం ఒక్కటే– ప్రాణాలను కోల్పోయిన వారు విద్యుత్ వల్ల కాదు; భద్రతా వ్యవస్థ లోని లోపాల వల్ల మరణించారు అని. ఈ సత్యాన్ని అంగీకరించిన రోజే విద్యుత్ రంగంలో నిజమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి నట్లవుతుంది.– తుల్జారాంసింగ్ ఠాకూర్, రిటైర్డ్ విద్యుత్ ఇంజినీర్ -
సామాజిక ఇతిహాసం..
ఆధునిక తెలుగు పద్యకవిత్వంలో మల్లవరపు జాన్ విశిష్టమైన కవి. ధారాళమైన పద్య రచనా ప్రజ్ఞతో, సామా జిక చైతన్యంతో ఆయన ప్రజారంజకమైన ఖండ కావ్యా లను రచించి విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ‘దురాచార మెంతేని ఖండింప కలమునాయుధముగా మలుచు కొని’ సాంస్కృతిక సమరం చేశాడు. తెలుగుదేశ చారిత్రక, సాంస్కృతిక వైభవ, ప్రాభవాలను రమణీయంగా తన కవిత్వంలో చిత్రించడమే కాకుండా, తనకాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలను ధిక్కరించి, సమానత్వాన్ని ప్రబోధించిన మల్లవరపు జాన్ పద్యకవుల్లో ప్రజాకవి. జాన్ కవిత్వం మాధుర్యగుణ భరితమైనదని, శ్రీనాథుడు చెప్పిన హర చూడాహరిణాంక వక్రతలోని సౌందర్యం ఆయన పద్యాల్లో ఉందని (అతుకుల బ్రతు కులు – పీఠిక) దాశరథి విశ్లేషించాడు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని చీమ కుర్తి గ్రామంలో మల్లవరపు దావీదు – రత్నమ్మ దంపతులకు 1927 జనవరి 22న ఆయన జన్మించాడు. పేదరికం అనే కత్తుల వంతెన మీదనడిచి, కుల, మత వివక్షల నిప్పుల వానలో తడిసి, మొక్క వోని సంకల్పంతో కఠోర శ్రమతో ‘మధుర కవి’గా, దేశికోత్తముడిగా ప్రసిద్ధిగాంచాడు. ‘చెప్పులు కుట్టి జీవనము సేయు కుటుంబము నందు బుట్టి చిన్నప్పటినుండి శారద పదార్చన జేసితి’ అని ఆయన, తన నేపథ్యాన్ని చెప్పుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం ఉపాధ్యాయు డిగా స్థిరపడినా, ఆయనలో జ్ఞానతృష్ణ చల్లార లేదు.ఒంగోలులోని శఠగోపనాచార్యుని శిష్యరికంలో సంస్కృ తాంధ్ర భాషా సాహిత్యాలను, పంచకావ్యాలను అధ్య యనం చేశాడు. జాషువానంతర తెలుగు కవిత్వంలో ప్రామాణికమైన పద్య కవిగా ప్రఖ్యాతిగాంచిన జాన్ 2006 ఆVýæస్టు 12న కన్నుమూశాడు.సజ్జనాను రక్తి జాను సూక్తి వామపక్ష, విప్లవ పోరాటాల నుండి అస్తిత్వ ఉద్య మాల వరకు సాగిన సామాజిక, సాహిత్య ఉద్యమాల ప్రభావం జాన్ కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది. 1967లోనే తన స్వీయానుభవాలను అక్షరబద్ధం చేసి, ‘కొండడు’ శీర్షికతో లఘు కావ్యం వెలువరించాడు. క్రైస్తవ కథాంశ నేపథ్యంలో రాసిన ‘సాంసన్–డెలీల’ పద్య నాటకం ఎంతగానో పేరు తెచ్చింది. విశ్వప్రకాశం, కాంతి రేఖలు, భావ విపంచి, చిరస్మరణీయులు, సరసవినోదిని, పుణ్యపురుషుడు వంటి ఖండ కావ్యాలతో తెలుగు సాహి త్యంలో పద్యకవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించు కున్నాడు. ‘సజ్జనానురక్తి జాను సూక్తి’ అనే మకుటంతో సూక్తి శతకం,‘భవ్యగుణవిచార బాలవీర!’ మకుటంతో రాసిన పద్యాల ద్వారా జీవనతాత్త్విక ఎరుకను, మూర్తి మత్వ స్ఫూర్తిని చాటి చెప్పాడు. ఆయన రాసిన చైతన్య గేయాలు, న్యాయం కావాలి, పంచముడు వంటి అముద్రితా లుగానే మిగిలిపోయాయి. అవిద్య, పేద రికం, మద్యపానం, అధిక జనాభా, కుటుంబ నియంత్రణ, అవినీతి, లంచ గొండితనం, దళిత జనోద్ధరణ, కుల నిర్మూలన, దేశభక్తి, విశ్వశాంతి లాంటి అంశాలపట్ల ప్రజల్లో సదావగా హన కల్పించడానికి జాన్ కృషి చేశాడు.మనుషులకు ‘చితులను పేర్చినది మతమా? రెటమతమా? కపటమతుల రచితమా’ అని మతోన్మాదాన్ని నిరసించాడు. ద్వేషజ్వాలలతో ‘కలుష వ్యాపార పారీణులై త్రోవల్ దప్పి’ మతకల్లోలాలు కల్పించే దురాత్ముల’ను దేశద్రోహులుగా దుయ్యబట్టాడు. చాలామంది పద్య కవుల్లో మృగ్యమైన మహిళాభ్యుదయ చింతన జాన్ పద్యాల్లో కనిపిస్తుంది.వివిధ విశ్వవిద్యాలయాల్లో జాన్ సాహిత్యంపై పరి శోధనలు జరిగాయి. జాన్ కావ్యాలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ‘అభినవ బాణ’, ‘కవిభూషణ’ వంటి అరుదైన బిరుదులను కూడా ఆయన అందు కున్నాడు. అటువంటి జాన్ శత జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.– ఆచార్య కోయి కోటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్ (మల్లవరపు జాన్ శతజయంతి సదస్సు నేడు ఒంగోలులో) -
భయం అంచులో...
కర్పూరవల్లి ఏర్ ఇండియా విమానం దిగి న్యూయార్క్ ఏర్పోర్ట్కి చేరుకున్నాక, ఇమిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కేరసోల్ దగ్గరకి వెళ్ళింది.ఓ కుక్క కిందకి దింపిన సూట్‌కేస్‌లను వాసన చూడటం గమనించింది. ఆ కుక్క ఆవిడ సూట్‌కేస్ దగ్గరకి వచ్చి వాసన చూసి, ఓదాని మీద ముందు కాళ్లు ఉంచి నిల్చుంది. వెంటనే యూనిఫాంలోని సెక్యూరిటీ గార్డ్ తన జేబులోంచి ఏదో తీసి ఆ కుక్క నోటికి అందించి దాన్ని నిమిరాడు. ఆవిడ అతన్ని నవ్వుతూ చూస్తూ అడిగింది.‘‘నైస్ డాగ్. వాట్స్ హిజ్ నేమ్?’’‘‘ఈ రెండు సూట్‌కేసులు మీవేనా?’’ అతను కర్పూరవల్లిని అడిగాడు.‘‘అవును.’’‘‘మీ సూట్కేసులని మీరే పేక్ చేసారా?’’‘‘అవును. నేనే.’’‘‘ఈ సూట్‌కేసుల్లో ఏమేం ఉన్నాయో మీకు గుర్తుందా?’’ అతని తర్వాతి ప్రశ్న.‘‘ఉంది. నా బట్టలు, మందులు, బహుమతి వస్తువులు.’’‘‘మీరు నా వెంట రావాలి.’’ అతను ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పి ఎడమ భుజం దగ్గరున్న వైర్లెస్ సెట్లో ఎవరికో ఏదో చెప్పాడు.కొద్ది క్షణాల్లో యూనిఫాంలోని ఇద్దరు సెక్యూరిటీ పోలీసులు ట్రాలీతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆవిడ సూట్‌కేసులను జాగ్రత్తగా ట్రాలీ మీదకి ఎక్కించి నడిచారు.‘‘నాతో రండి.’’ ఆ గార్డ్ ఆవిడతో చెప్పాడు.‘‘ఎందుకు?’’ ఆవిడ అతని వెంట నడుస్తూ అడిగింది.అతను ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ‘ఇ¯Œ స్పెక్షన్’ అని రాసున్న తలుపులోంచి లోపలికి తీసుకెళ్ళాడు.‘‘మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?’’ లోపల కూర్చున్న ఓ అధికారి ప్రశ్నించాడు.‘‘అవును.’’‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు?’’‘‘నా కూతురితో గడపడానికి. మీరీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?’’ కర్పూరవల్లి ప్రశ్నించింది.అక్కడికి మరొక కుక్కని తెచ్చారు. అది కూడా సూట్‌కేసుల చుట్టూ తిరిగి ఇందాకటి సూట్‌కేస్ మీద ముందు కాళ్ళు పెట్టింది. దాని శిక్షకుడు కూడా దానికి బహుమతిగా తినడానికి డాగ్ బిస్కెట్ ఇచ్చి, దాన్ని దువ్వి తీసుకెళ్ళిపోయాడు. ఆవిడకి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడింది.‘‘మీకు ఏదైనా టెర్రరిస్ట్ సంస్థ మీద సానుభూతి ఉందా?’’ ఆ అధికారి ప్రశ్నించాడు.‘‘లేదు.’’ ఆవిడ తుళ్ళిపడి జవాబు చెప్పింది.గార్డ్ ఆవిడ హేండ్‌బేగ్‌ని తీసుకుని అందులోని వస్తువులన్నీ బల్ల మీద పోశాడు.‘‘ఈ సూట్‌కేస్‌లో మీరు ఏం తీసుకొస్తున్నారు? అంగీకరిస్తే తక్కువ శిక్ష పడుతుంది. మా అంతట మేమే కనుక్కుంటే శిక్ష పెరుగుతుంది.’’ అధికారి చెప్పాడు.‘‘శిక్షా? బయటే ఉంటాడు. మా అల్లుడికి ఫోన్ చేస్తాను.’’ కర్పూరవల్లి భయంగా చెప్పింది.‘‘తర్వాత. నా ప్రశ్నకి జవాబు చెప్పండి.’’‘‘నేనే నిషిద్ధ వస్తువులు తీసుకురాలేదు.’’ ఆవిడ భయంగా చూస్తూ చెప్పింది.ఇద్దరు గార్డ్లు ఆ సూట్‌కేసులు తెరిచి ఒక్కొక్క సామాను బయటకి తీయసాగారు. ప్రతి డ్రెస్ లైనింగ్ తడిమి, లోపల ఏదైనా ఉంచి కుట్టారా అని తనిఖీ చేయసాగారు. కర్పూరవల్లి భయంగా, ఆశ్చర్యంగా జరిగేది చూస్తోంది.ఆవిడ మొబైల్ తీసుకుని పాస్వర్డ్ అడిగి తెరిచి, అందులోని కాంటాక్ట్ నంబర్లలోని వారి పేర్లు ఒకొక్కటీ అడిగి వారు ఏమవుతారు అని ప్రశ్నించాడు. అవన్నీ ఇండియాలోని పేర్లు. కొన్ని పేర్లు అతనికి నోరు తిరగలేదు కూడా. ఆవిడలో భయం అధికం అవసాగింది. వాళ్ళు వెతుకుతూంటే అధికారి ఆవిడని ప్రశ్నించసాగాడు.‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు? మీ అల్లుడు ఏం చేస్తూంటాడు? మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇదివరకు ఎప్పుడైనా అమెరికాకి వచ్చారా? మీరు వచ్చిన పని ఏమిటి? ఇండియాలో ఏం చేస్తూంటారు?’’చివరికి ఆ పెట్టెలో వారు వెతికేది కనిపించింది. వెంటనే ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.‘‘వీటిని ఎందుకు కొన్నారు?’’ ఓ గార్డ్ ఒకటి తీసి చూపిస్తూ ప్రశ్నించాడు.‘‘బహుమతిగా కొన్నాను.’’‘‘ఎవరికి?’’‘‘మా అల్లుడికి. కిందటిసారి ఇండియా వచ్చినప్పుడు అతను తెచ్చినవి వాళ్ళ స్పాటీకి బాగా నచ్చాయట. వీటిని కొని తెమ్మని మెసేజ్ ఇచ్చాడు.’’వాళ్ళు ఆ పేకెట్స్ని విప్పి క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో డ్రగ్స్ గాని, పేలుడు పదార్థాలు కాని లేవని రూఢీ చేసుకున్నాక వివిధ జాతుల కుక్కల బొమ్మలున్న డాగ్ ఫుడ్ పాకెట్స్ చూపించి నవ్వుతూ చెప్పారు.‘‘వియార్ సారీ. చిన్న పొరపాటు. మా రెండు కుక్కలు తమ ఆహారాన్ని పసికట్టాయి. మేం ఇంకేదో అని ఊహించాం.’’వాళ్ళు బయటికి తీసిన వస్తువులని లోపల ఉంచి మూత మూస్తే అది మూసుకోలేదు. అది గమనించి ఆవిడ మళ్ళీ సర్ది ఒక గార్డ్ని కోరింది.‘‘మా వారు నాతో రాలేదు. దయచేసి మీరు దీని మీద నిల్చుంటే జిప్ వేస్తాను.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
తరతరాల కళా నిబద్ధత
ఐదు దశాబ్దాలుగా ‘కడ్డి తంత్రి’ అనే అపురూప జానపద సంగీత కళారూపాన్ని సంరక్షిస్తున్న దురిశెట్టి రామయ్యకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. ఇది తెలంగాణ జానపద కళా ప్రపంచానికే గర్వకారణం. పెద్దపల్లి జిల్లా (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ఆయన అరుదైన కళాసాధకుడు. ఎస్సీ మాల సామాజిక వర్గంలోని ‘మిత్తుల అయ్య వార్లు’ లేదా ‘నిత్యులు’ అనే ఉపకులానికి చెందిన రామయ్య, చిన్నతనంలోనే తన తండ్రి రామానుజం వద్ద ఈ కడ్డి తంత్రి కళను అభ్యసించారు. రామానుజం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం విశేషం.కడ్డి తంత్రి వాయిద్యం తెలంగాణలోని అత్యంత ప్రాచీన జానపద సంగీత వాయిద్యాల్లో ఒకటి. అడ విలో లభించే టేకు చెట్టు మొద్దును లోపల ఖాళీగా తొలిచి ఈ వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. రామయ్య వద్ద ఉన్న వాయిద్యానికి దాదాపు ఆరు నుంచి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. కశ్మీర్‌కు చెందిన సంతూర్, పాశ్చాత్య దేశాల డల్పీమర్, సింబలోన్ వంటి వాటిలో అనేక తంత్రులు (తీగలు) ఉంటాయి. కానీ, కడ్డి తంత్రి లేదా కడ్డి వీణలో కేవలం మూడు లేదా నాలుగు తంత్రులే ఉంటాయి. వీటితోనే 32 స్వరాలను పలికించడం గమనార్హం. చిన్న వెదురు బద్ద చివర కొన్ని గజ్జెలు కట్టి వాటితో తీగలను కొడతారు. బద్దతో వాయించినప్పుడు వచ్చే రాగతాళాలకు అనుగుణంగా గజ్జెల శబ్దం మేళవించి శ్రోతలకు వీనులవిందు కలిగిస్తుంది.ఈ వాయిద్యం కథాగానం, పురాణ ప్రవచనాలకు మాధ్యమంగా రూపుదిద్దుకుంది. రామయ్య తన బృందంతో కలిసి భాగవతం, భారతం వంటి ఇతిహాస గాథలను విని పిస్తారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం, కీచక వధ, సతీ సావిత్రి, భక్త ప్రహ్లాద, రామదాసు చరిత్ర, విరాట పర్వం, సుందరకాండ వంటి ఘట్టాలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. కడ్డి తంత్రి వాయిద్యంతో నిర్వహించే సాధారణ ప్రదర్శనల్లో ఆరు గురు కళాకారులు పాల్గొంటారు. అదే వేషధారణతో కూడిన నాటక రూప ప్రదర్శనలైతే 12 మంది కళాకారులు భాగస్వాములవుతారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ ప్రద ర్శనలు తెల్లవారుజాము వరకు సాగుతుంటాయి. ఐదు దశాబ్దాలుగా ఎన్నో కష్టనష్టాల కోర్చి ‘కడ్డి తంత్రి’ కళను కాపాడుకుంటూ వస్తున్న దురిశెట్టి రామయ్య జీవితం... జానపద వారసత్వ పరిరక్షణకు అంకితమైన ఒక మహోన్నత ప్రస్థానం!– జంపాల ప్రవీణ్, ఔత్సాహిక పరిశోధకుడు -
జాతీయ పునర్నిర్మాణ శక్తిగా...
ఒక దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాల నిర్ణయాలతోనే సాధ్యం కాదు. సమాజంలోని ప్రతి వర్గం, ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనకు కార్య రూపమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ). 1948 జూన్‌లో ప్రారంభమైన ఈ సంస్థ 1949 జూలై 9న అధికారికంగా నమోదు అయ్యింది. ఏబీవీపీ మొదటి రోజు నుంచే జాతీయ పునర్నిర్మాణం తన లక్ష్యం అని స్పష్టంగా ప్రకటించింది.విద్యార్థులు కేవలం విద్యను పొందే వ్యక్తులు కాకుండా, సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత గల పౌరులుగా ఎదగా లని పరిషత్ భావించింది. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణా త్మక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు, విద్యార్థి వ్యవస్థల్లో భాగస్వామ్యం అనే మూడు ప్రధాన మార్గాలను అనుసరించింది.భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలపరిచే లక్ష్యంతో ఏబీవీపీ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సేయిల్ (స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ ) ఒకటి. దీని ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కుటుంబాలతో కలిసి నివసిస్తూ భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం కాకుండా భావోద్వేగపూర్వక జాతీయ ఐక్యతకు ఒక వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ అంశంపై 1998లో తీర్మానం చేయడం, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించడం, మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.కాలం మారుతున్న కొద్దీ విద్యార్థి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మారుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏబీవీపీ తన కార్యక్రమాలను విస్తరించింది. అలాగే ‘ఖేలో భారత్’ ద్వారా క్రీడాస్ఫూర్తిని, ‘రాష్ట్రీయ కళా మంచ్’ ద్వారా భారతీయ కళా సంస్కృతిని, ‘స్టూడెంట్స్ ఫర్ డెవలప్మెంట్’ ద్వారా పర్యావరణ బాధ్యతను, ‘స్టూడెంట్స్ ఫర్ సేవ’ ద్వారా సేవా భావాన్ని ప్రోత్సహిస్తోంది. మెడివిజన్, అగ్రివిజన్, టెక్నికల్ సెల్, లా సెల్, పరిశోధన, విద్యా విధానాలపై చర్చలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. యువ శక్తిని జాతీయ పునర్నిర్మాణ దిశగా నడిపించే ఈ ప్రయాణాన్ని ఏబీవీపీ నిరంతరం కొనసాగిస్తోంది.– రావుల కృష్ణ, ఏబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు, (నేడు ఏబీవీపీ ఆవిర్భవించిన రోజు) -
ఉత్తర–దక్షిణ వారధి
ఎనిమిదేళ్ల వయసులోనే విజయవాడలో త్యాగరాజ ఆరాధనలో ఓ బాలుడు తొలి కచేరీ ఇచ్చాడు. కేటాయించింది ముప్పై నిమిషాలే అయినా, శ్రోతలు కాలగమనాన్నే మరిచిపోయేలా ఆ కచేరీ మూడు గంటలపాటు సాగిందని చెబుతారు. ఆ గానం విన్న హరికథా విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ మూర్తి భాగవతార్, ఆ ‘మురళీకృష్ణ’ అన్న అతడి పేరుకు ‘బాల’ను జోడించారు. అప్పటి నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు.1930 జూలై 6న తూర్పు గోదావరి జిల్లా శంకర గుప్తం అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి, మున్ముందు భారతీయ శాస్త్రీయ సంగీతంలో శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం పదిహేనేళ్ల వయసులో 72 మేళకర్త రాగాలన్నింటినీ సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని, ప్రతి రాగంలోనూ కృతులు రచించారు. ఆ కృతుల సంకలనమే ‘జనక రాగ కృతి మంజరి’. వర్ణాలు, కృతులు, థిల్లా నాలు, భావగీతాలతో కలిపి 400కు పైగా రచనలు చేసిన ఆయన, తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాష ల్లోనూ సమానమైన సౌందర్యంతో స్వరపరిచారు.కొత్త రాగాలు–తాళాలు‘సంప్రదాయం అంటే స్తబ్ధత కాదు, అది సజీవ ప్రవాహం’ అన్నదే బాలమురళి దృక్పథం. ప్రాచీన సంప్రదాయపు మూలాలను చెక్కుచెదరనివ్వకుండానే ఆయన కొత్త సరిహద్దులను తాకారు. మహతి, లవంగి, గణపతి, సర్వశ్రీ, సుముఖం, సిద్ధి, ఓంకారి వంటి సరికొత్త రాగాలను సృష్టించారు. వీటిలో కొన్ని కేవలం మూడు లేదా నాలుగు స్వరాలతోనే రూపొందినవి. అంతేకాదు, త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖి వంటి సరికొత్త తాళ పద్ధతులకు ఆయన ప్రాణం పోశారు.మూడు అష్టకాల విస్తృతి, అపార గాంభీర్యం, స్ఫటికంలాంటి స్పష్టమైన ఉచ్చారణ, గమకాల్లో అసాధారణ నైపుణ్యం ఆయనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది కచేరీలు ఇచ్చిన ఆయన, పండిట్ భీమ్సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిశోరీ అమోన్కర్ వంటి హిందు స్థానీ దిగ్గజాలతో జుగల్బందీలు నిర్వహించి, ఉత్తరాది–దక్షిణాది సంగీతాలకు వారధిగా నిలిచారు. గాత్రంతో పాటు వయోలిన్, వీణ, మృదంగం, కంజీరా, వయోలాలను అద్భుతంగా వాయించారు. ఆకాశవాణిలో ఏడు వేర్వేరు ప్రదర్శన విభాగాల్లో ‘టాప్ గ్రేడ్’’ సాధించిన ఏకైక సంగీతకారుడిగా చరిత్ర సృష్టించారు. రవీంద్రుని ‘గీతాంజలి’ని విదేశీ గాయక బృందంతో కలిసి ఆలపించడం, రవీంద్ర సంగీతాన్ని బెంగాలీలో రికార్డు చేయడం, జాజ్ ఫ్యూజన్ ప్రయో గాలు చేయడం, ఆయన సంగీత పరిధికి హద్దులే లేవని చాటిచెప్పాయి. వెండితెరపైనా బాలమురళి తనదైన ముద్ర వేశారు. 1967లో ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో నారదుడి పాత్రలో నటిస్తూ, ‘ఆది అనాదియు నీవే దేవా’ వంటి అమర గీతాలు ఆలపించారు.పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ అందుకున్న అరుదైన కర్ణాటక సంగీత మహనీయుడు ఆయన. ఫ్రా¯Œ్స ప్రభుత్వపు ‘షెవాలియర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్’ వంటివి ఎన్నో అందుకున్న ఆయన 2016 నవంబర్ 22న చెన్నైలో కన్ను మూశారు. కానీ ఆయన స్వరం, కృతులు, రాగాలు సజీవంగా మారుమోగుతూనే ఉన్నాయి. – డా కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి) -
గొలుసు ఉత్తరం..
ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్మెంట్లో అతని మెయిల్ బాక్స్‌లో అరుదుగా ఉత్తరాలు పడుతూంటాయి. చిట్‌ఫండ్ కంపెనీ ఇంటిమేషన్, ఎల్.ఐ.సి. రసీదులు, రిమైండర్స్, నవరాత్రులలో పూజకి డబ్బు పంపమని అతని గ్రామ పూజారి నుంచి ప్రింటెడ్ బ్రోచర్ లాంటివి.ఆరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక, అలవాటుగా తన మెయిల్ బాక్స్ ట్రా¯Œ ్సపరెంట్ అద్దం తలుపులోంచి చూస్తే లోపల ఓ కవర్ కనిపించింది. తాళం తెరిచి దాన్ని తీసుకుని చూశాడు. అది ఐదు రూపాయల పోస్టల్ కవర్. ఫ్రమ్ అడ్రస్ లేదు. టు అడ్రస్ అందమైన చేతిరాతలో ఉంది.అతను దాన్ని తీసుకుని లిఫ్ట్‌లో ఆరో అంతస్తులోని తన అపార్ట్మెంట్కి చేరుకుని దాన్ని బల్ల మీద పడేశాడు. రాత్రి పడుకోబోయే ముందుదాకా అతని దృష్టి దాని మీద పడలేదు. పడుకోబోయే ముందు దాన్ని అందుకుని చింపి చదివాడు. అది చేతిరాతలో ఉన్న ఓ హెచ్చరిక. ఆ ఉత్తరాన్ని అది చదివిన 24 గంటల్లోగా మొత్తం కాపీ చేసి కనీసం ఒకరికి పంపాలని, దాన్ని కాపీ చేసి పంపకపోతే ఒకతని భార్య ఆత్మహత్య చేసుకుందని, మరొకరికి ఆస్తి నష్టం వచ్చిందని, కాబట్టి ఆ చై¯Œ ని బ్రేక్ చేయొద్దని దాని సారాంశం. అందులో షిరిడీ బాబా చెప్పిన పన్నెండు బోధనలు ఉన్నాయి.జాగృత్ కొలిచేది ఒక్క షిరిడీ సాయినే. ప్రతి ఉగాదికి షిరిడీకి వెళ్తాడు. ప్రతి నవరాత్రులలో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర చదువుతాడు. అయితే అతనిది మూఢ భక్తి కాదు. దేన్నయినా హేతువాదంతో ఆలోచిస్తాడు. తను ఆ చై¯Œ ని బ్రేక్ చేస్తే ఆపద వాటిల్లుతుందని జాగృత్ క్షణకాలం కూడా నమ్మలేదు. ఓ మనిషికి కీడుని కలిగించే గొప్ప శక్తి ఆ గొలుసు ఉత్తరానికి ఉండదని అతని స్థిరనమ్మకం.అయినా, జాగృత్ కాగితం, కలం తీసుకుని ఆ ఉత్తరాన్ని కాపీ చేశాడు. అందుకు కారణం, కొత్తవాళ్ళకి ఆ ఉత్తరం అందితే వారి దృష్టిని తను కొలిచే సాయి మీదకి మళ్ళించినవాడు అవుతాడు. వాళ్ళు సాయి భక్తులు కాకపోతే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో దాన్ని కాపీ చేశాడు.మర్నాడు దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్ళాడు. అది ఎవరికి పంపాలా అని ఆలోచించాడు. లంచ్ అవర్‌లో అతను తిరిగి తన సీట్‌కి వస్తూంటే, ఆ మల్టీస్టోరీడ్ కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ తలుపు బయట ఆ కంపెనీ ఫైనాన్షియల్ మేనేజర్ పేరు కనిపించింది. జాగృత్ తన సీట్‌కి వెళ్ళాక ఆఫీస్ కవర్ తీసుకుని, ఆ కవర్ మీద అతని పేరు, డిజిగ్నేషన్, అతని ఆఫీస్ చిరునామా రాశాడు. మధ్యాహ్నం మూడున్నరకి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచినప్పుడు డిస్పాచ్ క్లర్క్‌కి ఆ కవర్ ఇచ్చి చెప్పాడు.‘‘దయచేసి దీన్ని పోస్ట్ చెయ్యి.’’జాగృత్ ఆ సంగతి అంతటితో మరిచిపోయాడు.∙∙ కొన్ని వారాల తర్వాత జాగృత్ దగ్గరకి ఓ కొత్త వ్యక్తి వచ్చి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అడిగాడు.‘‘ఈ ఆదివారం ఫ్రీగా ఉంటారా?’’‘‘ఏమిటి విశేషం?’’ అతను అడిగాడు.‘‘ఈ ఆదివారం మా ఇంట్లో సాయి భజన జరుగుతుంది. ఎందుకో మిమ్మల్ని పిలవాలని అనిపించింది.’’‘‘నేను సాయి భక్తుడిని. తప్పకుండా వస్తాను. లొకేషన్ షేర్ చేయండి.’’ జాగృత్ చిరునవ్వుతో అంగీకరించాడు.‘‘నెహ్రూ నగర్లో ఇండియన్ బ్యాంక్ తెలుసుగా. దాని పక్కన ఫస్ట్ ఫ్లోర్. కాబట్టి తేలిగ్గా రాగలరు.’’జాగృత్ ఆదివారం కొబ్బరికాయ, పూలున్న కేరీ బ్యాగ్‌తో ఆ ఇంటికి చేరుకున్నాడు.‘‘ఇంకా ఎవరూ రాలేదు. ఐదు నిమిషాల్లో అంతా ఇక్కడ ఉంటారు. ఈలోగా మీరు దీన్ని తాగండి. అందరికీ కలిపాను.’’జాగృత్ రూహఫ్జా తాగాక అతను చెప్పాడు.‘‘మీరో ఘోరమైన పొరపాటు చేశారు.’’‘‘పొరపాటా? నేనా? ఏమిటది?’’ జాగృత్ ఆశ్చర్యంగా అడిగాడు.అతను జాగృత్ పంపిన గొలుసు ఉత్తరాన్ని చూపించాడు.‘‘ఇదే మీరు చేసిన ఘోరమైన పొరపాటు.’’‘‘ఏం పొరపాటు?’’ జాగృత్ అర్థం కాక అడిగాడు.‘‘నేను ఒరియావాడిని. నాకు తెలుగు చదవడం వచ్చి, అప్పుడే దీన్ని చదివి ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ ఉత్తరాన్ని కాపీచేసి పంపేవాడిని. కాని నిన్నటి దాకా ఇందులో ఏముందో నాకు తెలీదు. నిన్న మా ఇంటికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ బంధువు చదివి చెప్పారు. ఇది అందిన నాలుగో రోజున నా భార్య ఆత్మహత్య చేసుకుంది.’’‘‘అయ్యో. ఐ యాం వెరీ సారీ.’’‘‘ఆ తర్వాత రెండు రోజులకి ఊళ్ళోని మా ఉమ్మడి ఆస్తిలోంచి నా జ్ఞాతులు నా భాగాన్ని కొట్టేశారు.’’‘‘అరెరే.’’‘‘నన్ను నా మానాన బతకనివ్వకుండా నువ్వు అనవసరంగా నా జీవితంలో జోక్యం చేసుకున్నావు. ఈ ఉత్తరం ద్వారా నాకు నష్టాన్ని కలిగించావు.’’ అతను కోపంగా చెప్పాడు.‘‘కాదు. నేను దీన్ని నమ్మలేదు. సరదాకి దీన్ని పంపాను. ఈ ఉత్తరానికీ, మీకు జరిగిన నష్టాలకి ఎలాంటి సంబంధం లేదు. హేతువాదంతో ఆలోచించండి.’’‘‘నాకు జరిగిన నష్టాలకి నేను ఆవేదనతో కుమిలిపోతూండగా, ఈ ఉత్తరం నువ్వు పంపావని తెలిసి నా మనసు కుతకుతలాడిపోతోంది. కవర్ మీద నీ ఆఫీస్ ఎడ్రస్ పైన కేరాఫ్ అని నీ పేరు రాసి ఉండటంతో నిన్ను తేలిగ్గా కనుక్కున్నాను. అందుకే భజన నెపంతో నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు తాగిన రూహఫ్జాలో విషం ఉంది. ఇంకో పావుగంట తర్వాత నువ్వు జీవించవు.’’డిస్పాచ్ క్లర్క్ కవర్ మీద తన పేరు రాసి ఉంటాడని స్పృహ తప్పేముందు జాగృత్కి తోచింది. - మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
సాయుధ పోరాటంలో తొలి అమరుడు
తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి కొమరయ్య ప్రాణత్యాగంతోనే మొదలయ్యిందనడం అతిశయోక్తి కాదు. అప్పటి గ్రామీణ తెలంగాణలో జీవితం అంటేనే వెట్టిచాకిరి. భూమి మీద హక్కు దొరలది, శ్రమ మాత్రం రైతులది. కడవెండిలో దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రా రెడ్డి, అతని తల్లి జానమ్మ ఆధిపత్యం ప్రజల జీవితాలను కట్టుబానిసత్వంలోకి నెట్టాయి. ఈ అన్యాయాలపై గళమెత్తినవాడు కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య. ఆ గళం చుట్టూ ప్రజలు కూడబలుక్కునేసరికి, అది ఉద్యమంగా మారింది.ఆంధ్రమహాసభ ప్రభావంతో కడవెండి గ్రామం ఒక చిన్న విప్లవ కేంద్రంగా మారింది. ‘భూమి, భుక్తి, వెట్టి విముక్తి’ అనే నినాదం మార్మోగింది. యువతరం చైతన్యవంతమైంది. దేశ్‌ముఖ్ వర్గం ఉద్య మాన్ని అణిచివేయడానికి అరెస్టులు, దాడులు ప్రారంభించింది. 1946 జూలై 4న జరిగిన ఘటన తెలంగాణ చరిత్రను శాశ్వతంగా మార్చింది. ఆ రోజు గడ్డం నర్సింహారెడ్డి నేతృత్వంలో గూండాల గుంపు గ్రామంపై దాడి చేసింది. కానీ భయపడకుండా ప్రజలు ఐక్యంగా ర్యాలీ చేశారు.ఆ ర్యాలీ ముందు వరుసలో నిలిచిన యువకుడు దొడ్డి కొమరయ్యకు దేశ్‌ముఖ్ తొత్తులు పేల్చిన తూటా తగిలింది. అక్కడే నేలకూలాడు. అతడి రక్తం తెలంగాణ రైతాంగ పోరాటానికి ఎరుపు రంగు పూసింది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దొడ్డి కొమరయ్య పేరు ఒక నినాదంగా మారింది. అతని బలిదానం తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. వేలాది గ్రామాలు నిరంకుశ పాలన నుంచి విముక్తమయ్యాయి. లక్షలాది ఎకరాలు... భూమిలేని పేదలకు పంచిపెట్టడానికి కారణ మయ్యింది. ప్రపంచ విప్లవాల చరిత్రలో తెలంగాణ పోరాటాన్ని అమరం చేసింది. అతను ఈ రోజు కూడా జీవిస్తున్నాడు, ప్రతి ప్రతిఘటనలో, ప్రతి నినాదంలో, ప్రతి సమానత్వ స్వప్నంలో! – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి (జూలై 4న దొడ్డి కొమురయ్య వర్ధంతి) -
గ్రామ రక్షకి బొడ్రాయి
గ్రామానికి ఆరు బయట ఉండే నిర్మాణమే బొడ్రాయి. దీనికి దేవాలయం లాంటి ఎలాంటి నిర్మాణం ఉండదు. గ్రామంలో అన్ని వర్ణాల వారూ స్వేచ్ఛగా పూజించుకొనే అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజలందరూ కలిసి ఏడాదికి కనీసం ఒకసారైనా బొడ్రాయికి పూజలు, తిరునాళ్ళు జరిపిస్తూ సామూహిక వేడుకలు జరుపుకొంటారు. అయితే బొడ్రాయి అంటే ఏమిటో, ఆ బొడ్రాయికి పూజలు ఎందుకు జరుపుకోవాలో చాలామందికి తెలియకున్నా, పూజలు, తిరునాళ్లు వంటి కార్యక్రమాలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిస్తారు.ఈ నేపథ్యంలో బొడ్రాయిపై అవగాహన కోసం... మన గ్రామీణ సంస్కృతిలో బొడ్రాయికి ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిది. బొడ్రాయి అసలు రూపం బొడ్డురాయి. సంస్కృతంలో దీనిని నాభిశిల అంటారు. మానవ శరీరానికి గర్భస్థ పిండ దశ నుండీ రక్షణ, పోషణ తల్లి నాభినుండి ఎలా లభిస్తాయో, గ్రామాని కి రక్షణ, పోషణ సమృద్ధులను ప్రసాదించే తల్లి గనుక ఆ శిలా మాతను బొడ్డురాయి అన్నారు. శరీర మధ్యంలో నాభి అమరి ఉన్నట్లు గ్రామానికి మధ్య లో బొడ్రాయిని స్థాపిస్తారు. గ్రామ నిర్మా ణం జరుగుతున్న దశలో వాస్తు ప్రకారం పండితులను సంప్రదించి నలు ది క్కులలో గ్రామం ఎలా విస్తరించాలో, అలాగే వాస్తు శాస్త్ర వర్గులను బట్టి కొత్తగా ఏర్పడే గ్రామంలో అన్ని సౌకర్యాలూ అంటే రహదారులు, కూడళ్ళు, బా వులు, చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ భూములు, వ్యాపార సముదాయాలు, శ్మశాన వాటిక మొదలుగా అన్నిటికీ నిర్దిష్టమైన స్థల నిర్దేశం చేస్తారు. గ్రామ మధ్యంలో, నాలుగు రహదారులు కలిసే చోటులో బొడ్రాయిని ఏవిధంగా ప్రతిష్ఠించాలో కూడా ప్రణాళిక వేసుకొనేవారు.బొడ్రాయిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని గు ర్తించాక అక్కడ నేలను తవ్వి, శంకుస్థాపన చేసి, మొదట పరమేశ్వరుని అనుగ్రహ శక్తి అయిన శీతలా దేవి చక్రాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి అందులో స్థాపిస్తారు. దాని పైన నాలుగు పలకలు కలిగిన చతురస్రాకారపు నిర్మాణాన్ని, దానిపైన ఎనిమిది పలకలుగల నిర్మాణాన్ని, ఆ పై భాగాన లింగాకారం కలిగిన శిలను ప్రతిష్ఠిస్తారు.నాలుగు పలకల నిర్మాణం బ్రహ్మ స్వరూపమని, ఎనిమిది పలకల నిర్మాణం విష్ణు స్వరూపమని, ఆపైన ప్రతిష్ఠించిన లింగాకారపు శిలను శివ స్వరూపమని భావిస్తారు. ఇలా శీతలాదేవి యంత్రం స్త్రీ స్వరూపంగా, ఆ పైన ఉన్న త్రిమూర్త్యాత్మకమైన బొడ్రాయిని పురుష స్వరూపంగా భావిస్తారు. గ్రామానికి పొలిమేరలలో ఎనిమిది మంది అక్కమ్మ దేవతలు అనే స్త్రీ దేవతలకు సంబంధించిన యంత్రాలను కూడా స్థాపిస్తారు. అందువలన గ్రామానికి దుష్ట శక్తులు, చెడు గ్రహాలు, ఆధి వ్యాధుల పీడలు అంటవని విశ్వసిస్తారు.రహదారుల విస్తరణ సమయంలో కానీ, కాలక్రమేణా బొడ్రాయి రహదారికంటే చాలా దిగువకు కుంగినప్పు డు కానీ, దానిని శాస్త్రోక్తంగా వెలికితీసి పునః ప్రతిష్ఠ చేస్తారు. గ్రామం వాస్తు పురుషుని నాభి స్థానమే బొడ్రాయి. నేల అనే శయ్య పై ఆసీనుడైన బొడ్రాయి రూప పురుషునికి, మా ఇంట నిత్యమూ ధనధాన్య సమృద్ధి ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ భక్తితో నమస్కరిస్తున్నాను అనే అర్థం వచ్చే శ్లోకం చదువుకొని బొడ్రాయిని ప్రార్థించుకోవాలన్నది పెద్దల మాట.నవ వధువులు ఊరిలోకి అడుగు పెట్టినప్పుడు, అలాగే ఊరి నుండి తమ అత్త వారింటికి వెళ్ళేటప్పడు.. తప్పకుండా తొలుత బొడ్రాయికి నమస్కరించి, పసుపు కుంకుమలు, పూలతో బొడ్రాయిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఇంటి ఆడ పిల్లలకు వడిబియ్యం పెట్టినప్పుడు బొడ్రాయి వద్ద నమస్కరించి ఆశీస్సులు కోరే ఆచారమూ ఉంది.– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
ప్రజాస్వామ్యం నుంచి అనుచర గణానికి!
ప్రశ్నించే పౌరులు... అనుసరించే జనసమూహంగా మారుతున్న నేటి సామాజిక పరిణామం ఆందోళనకరం. నేటి భారత రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కేవలం ఎన్నికల ఫలితాలను చూడటం సరిపోదు. అసలు మార్పు అధికార కేంద్రీకరణలో మాత్రమే లేదు; సమాజపు ఆలోచనా నిర్మాణంలో ఉంది. ఒకప్పుడు అధికారాన్ని ప్రశ్నించే ప్రజాస్వామిక సంస్కృతి కొంతవరకు కనిపించేది. ఇప్పుడు మాత్రం ‘ఏం అడగాలి?’, ‘ఏం అడగకూడదు?’ అన్న అప్రకటిత నియమాలే సమాజాన్ని నియంత్రిస్తున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర సంకేతం.దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్య–వైద్య రంగాల అసమానతలు, కుల హింస వంటి అనేక సమస్యలు ముదురుతున్నప్పటికీ, ప్రజా చర్చల కేంద్రంలో అవి కనిపించడం తగ్గుతోంది. వాటి స్థానంలో యోగా దినోత్సవాలు, భారీ సాంస్కృతిక ప్రదర్శనలు, జాతీయ గర్వ నినాదాలు ముందుకు వస్తున్నాయి. యోగ సాధనపై ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. కానీ ప్రశ్న యోగాపై కాదు. యోగాను ఎవరు, ఎలా, ఏ రాజకీయ సందర్భంలో వినియోగిస్తున్నారు అన్నదే ముఖ్యం. ప్రజా సమస్యలపై చర్చ తగ్గిపోతూ, ప్రతీకల చుట్టూ సమాజం తిరుగు తుంటే దానిని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిందే.ఈ పరిస్థితి యాదృచ్ఛికంగా రాలేదు. దీని వెనుక దీర్ఘకాలిక భావజాల విస్తరణ ఉంది. పాలక వర్గాలు తమ భావజాల సంబంధాలను విద్య, మీడియా, మత–సాంస్కృతిక వేదికలు, ప్రచార యంత్రాంగం ద్వారా విస్తృతం చేశాయి. ఫలితంగా రాజకీయ ఆధిపత్యం క్రమంగా భావజాల ఆధిపత్యంగా మారింది. అధికా రాన్ని నిలబెట్టేది కేవలం రాజ్య యంత్రాంగం కాదు; సమాజంలో ‘ఇదే సహజం’, ‘ఇదే దేశహితం’ అనే అంగీకార వాతావరణాన్ని నిర్మించడమే.భయం నుంచి పుట్టే అనుచరత్వం ఒకటì , నమ్మకం నుంచి పుట్టే అనుచరత్వం మరొకటి. ఇప్పుడు రెండూ కలిసి పనిచేస్తున్నాయి. రాజ్యం అణచివేత భయాన్ని సృష్టిస్తే, భావజాల యంత్రాంగం నమ్మకాన్ని తయారుచేస్తోంది. ఈ రెండు శక్తులూ కలిసి పౌరుడిని అనుచరుడిగా మారుస్తున్నాయి.ఇక్కడే పౌర సమాజం, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాద శక్తులు, దళిత, బీసీ, ఎస్టీ ఉద్యమాల వైఫల్యం స్పష్టమవుతోంది. ఒకప్పుడు సామాజిక న్యాయం, కుల ఆధిపత్యం, వర్గ అసమాన తలు, హక్కుల రాజకీయాలపై ప్రత్యామ్నాయ చర్చను నిర్మించిన ఈ శక్తులు ఇప్పుడు విభజితంగా, రక్షణాత్మకంగా కనిపిస్తున్నాయి. వీరి వైఫల్యం కేవలం సంస్థాగత బలహీనత కాదు, ప్రత్యామ్నాయ భావజాలాన్ని సమాజంలో విస్తరించడంలో వచ్చిన పరాజయం.నేటి ప్రధాన సవాలు కేవలం ప్రభుత్వ మార్పు కాదు. భావ జాల ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ సామాజిక–రాజ కీయ చైతన్యాన్ని నిర్మించడం. పౌర సమాజం, ప్రజాస్వామ్య వాదులు, దళిత–బీసీ–ఎస్టీ శక్తులు, వామపక్ష ఉద్యమాలు తమ వైఫ ల్యాన్ని నిజాయితీగా సమీక్షించి కొత్త ప్రజా చైతన్యాన్ని నిర్మించా ల్సిన అవసరం ఉంది. ప్రశ్న చనిపోయిన చోట ప్రజాస్వామ్యం కూడా క్రమంగా చనిపోతుంది. – పాపని నాగరాజు, సామాజిక కార్యకర్త -
సోమశర్మ వృత్తాంతం..
‘మహర్షీ! కౌశిక పుత్రుడైన సోమశర్మ విష్ణు సాక్షాత్కారం పొందిన మహాభక్తుడని విని ఉన్నాను. అతడి వృత్తాంతం చెప్పు’ అని సూతుడిని అడిగాడు శౌనకుడు. అప్పుడు సూతుడు అతడికి సోమశర్మ వృత్తాంతం ఇలా చెప్పాడు: కౌశికుడి కుమారుడైన సోమశర్మ చ్యవనుడి కుమార్తె సుమనను పెళ్లాడాడు. అతడు ధనసంపదలు లేనందున దారిద్య్రంతో బాధపడసాగాడు. వివాహమై ఎన్నాళ్లు గడచినా సంతానం లేకపోవడంతో మరింత దుఃఖితుడై లోలోన మనోవేదన చెందసాగాడు.సోమశర్మ వేదనను గమనించిన అతడి భార్య సుమన, ‘నాథా! మనోవేదన శరీరాన్ని కూడా దహించేస్తుంది. మీరెందుకు బాధపడుతున్నారు?’ అని అడిగింది.‘దేవీ! ఈ జన్మలో నాకు ధనపుత్ర సంపదలు లేకపోవడం వల్ల దిగులు చెందుతున్నాను. పూర్వజన్మ పాపాల వల్లనే నాకీ గతి ఏర్పడినట్లుందని తలచి దుఃఖిస్తున్నాను’ అని చెప్పాడు.‘ప్రాణనాథా! సృష్టిలోని సకలజీవులు విషయాశ వల్ల సంసారబాధలు పడుతుండటం సహజమే! మోహం వల్ల లోభం; లోభం వల్ల అసత్యం; అసత్యం వల్ల పాపం; పాపం వల్ల దుఃఖం సంభవిస్తాయి. ఋణానుబంధాల కారణంగా సంతానం కలుగుతుంది. పూర్వజన్మలో మనం ఎవరి వద్ద ధనం తీసుకోలేదు. ఎవరితోనూ మనకు రాగద్వేషాదులు లేవు.’ అని చెప్పింది.‘నువ్వు చెప్పినది నిజమే! ఇది నివృత్తి మార్గం. కాని, ఎందరో సాధువులైన మహాపురుషులు సకృత కర్మలు ఆచరించి, దారాపుత్రాదులతో చతుర్విధ పురుషార్థాలను పొందారు. మనం ధన పుత్రలాభం పొందే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు’ భార్యను అడిగాడు సోమశర్మ.‘నాథా! ప్రవృత్తి, నివృత్తి మార్గాలు రెండూ శ్రుతి సమ్మతాలు. ‘పుత్రేణ లోకాన్ జయతి’ అని వేదవాక్యం. పుత్రుడు లోకజయానికి సాధనం. గుణవంతుడు, విద్వాంసుడు అయిన ఒక పుత్రుడి వల్ల వంశం తరిస్తుంది. ఎందరో మహర్షులు ప్రవృత్తిమార్గంలో చతుర్విధ పురుషార్థాలను సాధించారు.’ అంటూ అనేక ఉదాహరణలను చెప్పింది.‘దేవీ! ఇవన్నీ నువ్వెలా తెలుసుకున్నావు?’ అడిగాడు సోమశర్మ.‘నాథా! నా తండ్రి చ్యవనుడి ద్వారా కొంత జ్ఞానం పొందాను. ఆయన ద్వారానే కొన్ని పూర్వగాథలను తెలుసుకున్నాను. నాకు తెలిసినంత చెప్పాను. వసిష్ఠ మహర్షి వద్దకు వెళితే ఆయన మరిన్ని విశేషాలు చెప్పగలరు’ అని చెప్పింది సుమన.సోమశర్మ గంగాతీరంలో ఉన్న వసిష్ఠాశ్రమానికి వెళ్లాడు. వసిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశాడు. వసిష్ఠుడు అతడిని వచ్చిన కారణమేమిటని అడిగాడు.‘మహర్షీ! నా దారిద్య్ర బాధలకు, నాకింత వరకు సంతానం కలగకపోవడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘నాయనా! నువ్వు పూర్వజన్మలో కర్షకుడివి. భార్యాపుత్రులు, సిరిసంపదలతో కలిగిన వాడివి. అయినా జ్ఞానశూన్యుడివై, లోభివై, చివరకు భార్యాపుత్రులకు కూడా తగిన అన్నవస్త్రాదులు సమకూర్చక పీడించావు. నువ్వు సంపాదించిన నిక్షేపాలను రహస్య ప్రదేశాల్లో పాతిపెట్టి, వాటి సంగతి భార్యా పిల్లలకు చెప్పకుండానే కాలధర్మం చెంది, యమలోకానికి చేరుకున్నావు. దాన ధర్మాలు చేయనందునే ఈ జన్మలో దారిద్య్రాన్ని అనుభవిస్తున్నావు’ చెప్పాడు వసిష్ఠ మహర్షి.‘మరి నాకు ఈ జన్మలో విప్రత్వం లభించడానికి కారణమేమిటి?’ ప్రశ్నించాడు సోమశర్మ.‘పూర్వజన్మలో సంపన్న కర్షకుడివైన నీ వద్దకు ఒక విప్రుడు వచ్చాడు. నువ్వు అతడికి నీ గోశాలలో ఆశ్రయం ఇచ్చావు. అతడికి షడ్రసోపేతమైన భోజనంపెట్టి ఆతిథ్యమిచ్చావు. ఆ పుణ్యఫలం వల్లనే నీకు విప్రజన్మ లభించింది. నీ దారిద్య్రం తీరాలంటే లక్ష్మీనారాయణుల ధ్యానమే మార్గం’ అని చెప్పాడు వసిష్ఠుడు.వసిష్ఠుడి సలహాపై సోమశర్మ వాసుదేవ ద్వాదశాక్షర మంత్రం జపిస్తూ లక్ష్మీనారాయణుల కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సును భంగపరచడానికి దేవేంద్రుడు నానా ఆటంకాలు కల్పించాడు. అయినా సోమశర్మ నిశ్చల మనస్కుడై తపస్సు కొనసాగించాడు. సోమశర్మ తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు లక్ష్మీసమేతంగా గరుడారూఢుడై వచ్చి, అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడికి కోరిన వరాలను అనుగ్రహించాడు.శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల సోమశర్మకు దారిద్య్ర బాధ తీరి, ధన సంపదలు సమకూరాయి. కొన్నాళ్లకు పండంటి మగబిడ్డ జన్మించాడు. అతడు బాల్యం నుంచి కృష్ణభక్తుడై దినదినాభివృద్ధి చెందాడు. అతడు యుక్తవయస్కుడు కాగానే సోమశర్మ, సుమన దంపతులు అతడికి వివాహం చేసి, పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లారు.పురావిశేషం..పూరీలోని శ్రీక్షేత్రంలో జరిగే విశేషమైన వేడుక స్నానపూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఆలయ అర్చకులు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను గర్భాలయం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలయ ప్రాంగణంలోని ‘స్నానబేడి’ అనే స్నానాగారంలో పవిత్రస్నానం చేయిస్తారు. ఇందులో భాగంగా 108 కలశాల జలాలతో అభిషేకిస్తారు. ఈరోజు జగన్నాథుడు గజముఖుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నానం తర్వాత జగన్నాథుడు జ్వరం బారినపడి, ‘అనసర ఘర’ అనే జ్వరమందిరంలో పద్నాలుగు రోజులు గడుపుతాడు. - సాంఖ్యాయన -
అతడు సామాజిక న్యాయ పతాక!
శూద్ర, అతి శూద్ర కులాల అస్తిత్వమే భారతదేశ అస్తిత్వమనీ, ఆ వర్గాల విముక్తే దేశ విముక్తి అనీ, వారి హక్కులే పౌరసమాజం హక్కులనీ కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహు మహారాజ్ తేల్చి చెప్పారు. ఆయనే దేశంలో తొలి సారిగా కింది కులాలకు రిజర్వేషన్లను ఇచ్చి బహుజన రిజర్వేషన్ల పితామహు డిగా చరిత్రలో నిలిచిపోయారు.మహాత్మా జ్యోతిబాఫూలే ఆలోచనలకు ఆచరణాత్మక ప్రయోగశాలగా కోల్హాపూర్ సంస్థానాన్ని ఆయన తీర్చిదిద్దారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిబాఫూలేల ఆలోచనలు ఆయన్ని బాగా ప్రభావితం చేశాయి. డా‘‘ బాబాసాహెబ్ అంబేడ్కర్ చదువుకు సాయం చేయడంతోపాటు ఆయన స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. అంబేడ్కర్ ఆలోచనలతో దేశంలో దళిత బహుజన సూర్యోదయం జరుగుతుందని 106 ఏళ్ల క్రితమే 1920 మార్చి 22న జాగిర్థారీ మాగాణంలో జరిగిన ‘దక్కన్ అçస్పృశ్య సమాజ సమ్మేళన సభ’లో సాహూజీ ప్రకటించారు. 1918లోనే వెట్టిపని చేసే తలారీ వ్యవస్థను రద్దుచేసి రాజదర్బా రుల్లో దళితులకు ఉద్యోగాలిచ్చే ఉత్తర్వులిచ్చారు. మహర్లకు ఇనాంగా ఇచ్చిన భూములకు వారి పేరుననే పట్టాలు ఇచ్చారు.మరాఠాల బావిలో మంచినీళ్లు తోడుకున్నందుకు దళితుడు గంగారాం కాంబ్లేపై దొంగతనం నేరం ఆరోపించి నడివీధిలో కొరడా దెబ్బలు కొట్టి అవమానించిన విషయం సాహూజీ దృష్టికిరాగానే... దళితుణ్ణి కొట్టిన వ్యక్తిని పిలిపించి అతనివీపు ఎర్రబడేటట్లు కొరడాలతో కొట్టించారు. గంగారాం కాంబ్లే ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా ఆర్థికంగా అతను నిల దొక్కుకునేందుకు హోటల్ పెట్టేందుకు సాయంచేశారు. ఆ హోటల్‌కు తానే స్వయంగా వెళ్లి టీ తాగివచ్చారు. కులాధిపత్య గోడలు బద్దలు కొడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. ‘వితంతు వివాహచట్టం’ తెచ్చారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 8 దశాబ్దాలు కావస్తున్నా సగం దేశానికి చట్ట బద్ధ రిజర్వేషన్లు లేవని ఎగుస్తున్న ఉద్యమాలకు ఆయన ఆలోచనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సగానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవటం వల్లనే వారి ప్రాతినిధ్యం పార్లమెంటు, అసెంబ్లీలలో అతితక్కు వగా ఉంది. రాజ్యాంగ సవరణచేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్యమాలు రగులుకుంటున్న సందర్భంలో సాహూజీని స్మరించుకుంటూ భారత పాలకులు బీసీల చట్టబద్ధ రిజర్వేషన్లకోసం రాజ్యాంగ సవరణ చేయాలి. 1902 జూలై 26న దేశ చరిత్రలో మొదటిసారిగా వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఆయన కల్పించారు. బీసీ విప్లవానికి పాటుపడేవారు సాహూజీ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి. – జూలూరు గౌరీశంకర్, బహుజన ఉద్యమకవి (జూన్ 26న ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి) -
రక్షణ వలయాలు రహస్య వ్యూహాలు
దేశాధినేతల భద్రత వెనుక ఉండే అత్యంత రహస్య వ్యూహాలు, కఠినమైన నిబంధనల గురించి మాజీ ఐబీ అధికారి యశోవర్ధన్ ఆజాద్ ఈ ఎపిసోడ్లో మాట్లాడారు. ఒబామా పర్యటన, మోదీ కాన్వాయ్ ఉల్లంఘన; రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ హత్యల వంటి కీలక ఘటనలు భారత భద్రతా వ్యవస్థల పని తీరును ఎలా మార్చిందీ వివరించారు.ముంబైలో ఒబామా పర్యటన‘‘అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముంబైని సంద ర్శించినప్పుడు, ఒక అగ్రరాజ్యంతో కలిసి భద్రతా ఏర్పా ట్లను సమన్వయం చేసుకోవడం ఎంత పెద్ద సవాలో మాకు తొలిసారి అవగాహనకు వచ్చింది. అమెరికా భద్రతా విభాగమైన ‘యూఎస్ సీక్రెట్ సర్వీస్’ పనిచేసే విధానం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది. వారు తమ సొంత భారీ రక్షణ కవచం ఉన్న వాహనం ‘ద బీస్ట్’ను ముంబైకి తీసుకొచ్చారు. ఒబామా అడుగుపెట్టే ప్రతి ప్రాంతంలో వ్యూహాత్మక నియంత్రణను తామే చూసు కుంటామని పట్టుబట్టారు. ఒక ఉన్నతస్థాయి భారతీయ ఇంటెలిజెన్స్ అధికారిగా ఆ సమయంలో నాకున్న పెద్ద సవాలు ఏంటంటే... వారి కఠినమైన, వెనక్కి తగ్గని భద్రతా డిమాండ్లను నెరవేరుస్తూనే, మన దేశ సార్వభౌ మాధికారాన్ని గట్టిగా చాటడం! వారి ‘బీస్ట్’ వాహనం మన రోడ్లపై సులువుగా ప్రయాణించేలా చూస్తూనే, మన సొంత గడ్డపై భారతీయ బలగాలే ప్రధాన రక్షణ కవచంగా ఉండేలా మేము భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాం.పంజాబ్ ఫ్లైఓవర్‌పై మోదీ‘‘ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఎలా విఫలమవుతుందో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీద నిలిచి పోయినప్పుడు ఏం జరిగిందో చూడాలి. అది నిఘా విభాగం వైఫల్యం కాదు. స్థానిక నిర్వహణ లోపానికి నిలువెత్తు నిదర్శనం. మేము ఒక వి.వి.ఐ.పి. రూట్‌ను ప్లాన్ చేసినప్పుడు, స్థానిక రాష్ట్ర పోలీసులు కచ్చితంగా ‘క్లియరెన్స్ సిగ్నల్’ ఇవ్వడంతో పాటు, ఒక ప్రత్యా మ్నాయ బ్యాకప్ రూట్‌ను కూడా సురక్షితంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో, నిబంధనలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. నిరసనకారులు దారిని అడ్డుకోవడానికి వీలు కలిగింది. దానివల్ల ప్రధాని ఒక వంతెనపై, కదలకుండా ఆగిపోయిన వాహనంలో 15 నుండి 20 నిమిషాల పాటు ఎలాంటి రక్షణ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. భద్రత అనేది కేవలం కాగితంపై బాగుంటే సరిపోదని స్థానిక నిర్వహణ కూడా లోపరహి తంగా ఉండాలని ఆ ఘటన స్పష్టంగా నిరూపించింది.రాజీవ్ హత్య నేర్పిన పాఠం‘‘మన ఆధునిక భద్రతను మరింత పట్టిష్టం చేయటానికి మేము తరచూ గతంలో జరిగిన విషాదాలను పరిశీ లిస్తుంటాం. అందులో భాగంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతాన్ని మేము మైక్రోస్కోప్ కింద పెట్టి మరీ విశ్లేషించాం. ఆ నిర్దిష్ట సమయంలో ఆయన కేవలం ఒక అభ్యర్థి మాత్రమేనని, అందువల్ల ఎస్పీజీ రక్షణ వలయం ఆయనకు మునుపటిలా అందుబా టులో లేదనే విషయాన్ని ప్రజలు మర్చిపోతుంటారు. అక్కడ జరిగిన వైఫల్యం మానవ రక్షణ వలయానికి సంబంధించినది. ఆ ఒక్క ఘటనే ఆ తర్వాత నుంచీ మానవ సంబంధాలు, శారీరక సామీప్యత, ప్రవేశ నియం త్రణను నిర్వహించే విధానాన్ని పూర్తిగా మార్చేలా చేసింది. వీవీఐపీకీ, ప్రజలకూ మధ్య కఠినమైన భౌతిక అడ్డంకులను అమలు చేస్తూ, మేము అందరి దృష్టిలో ‘చెడ్డవాళ్లుగా’ మారడానికి కారణం ఆ దుర్ఘటనే.ఇందిర హత్య తర్వాతే ‘ఎస్పీజీ’‘‘1984లో ప్రధాని ఇందిరా గాంధీ తన అంగరక్షకుల చేతిలోనే దారుణ హత్యకు గురైనప్పుడు, అది మన నిఘా, భద్రతా వ్యవస్థలను మూలాల నుండి కుదిపేసింది. ఆ విషాదానికి ముందు, దేశంలో వీవీఐపీల ‘అత్యంత సమీప’ రక్షణ వలయం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన దళం అంటూ ఏదీ లేదు. ఆ వ్యవస్థాగత వైఫల్యం కేవలం భౌతిక భద్రతలో జరిగిన లోపం మాత్రమే కాదు, అది ప్రధాని అంగరక్షకుల ఎంపిక పరిశీలనలో జరిగిన నిఘా లోపం కూడా. ఈ హత్య తర్వాత, దేశాధినేతను అంతర్గత ముప్పుల నుండి రక్షించడానికి కేవలం సాధారణ పోలీసు పద్ధతులు సరి పోవని గ్రహించాం. ఆ గ్రహింపే బీర్బల్ నాథ్ కమిటీ ఏర్పాటుకు, 1985లో ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్’ స్థాపనకు తక్షణ ఉత్ప్రేరకంగా మారింది. -
మోడరన్ మెడిసిన్ ఇన్ డెవిల్లోకాలూ...పిశాచ ప్రపంచాలూ!!
అర్ధరాత్రి దాటాక రాంబాబుగాడి రూమ్ ముందు నుంచి వెళ్తుంటే వాడేదో రాసుకుంటూ కనిపించాడు. టేబుల్ మీద ఏదో ముగ్గులాంటిది వేసి ఉంది. ఆ బల్లమీదే నల్లకోడి బొమ్మా, నాలుగు నిమ్మకాయల్లాంటివేవో ఉన్నాయి. ‘‘ఏంట్రా ఇదంతా?’’ అడిగా. ‘‘నీకు తెలుసుగా... ఈ మధ్య నేను తాంత్రిక సాధనతో దెయ్యాల లోకంలోకి వెళ్లి... ‘‘దెయ్యాలూ... వాటికొచ్చే జ్వరాలూ – వైద్యవిధానాలు’’ అనే సబ్జెక్టు మీద పరిశోధన చేస్తున్నానని. ఆ థీసీసు రాసుకుంటున్నా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏం తేలింది నీ అధ్యయనంలో?’’ ‘‘చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయిరా. దెయ్యాలకు జ్వరం గట్రా వచ్చాయనుకో. అక్కడ ‘పారా (నార్మల్) సిటమాల్’ అనే టాబ్లెట్లు వాడతారు. అన్నట్టు దాని బ్రాండ్ ‘డెవిలో–750’ అనేది చాలా ఫేమస్ బ్రాండు అక్కడ’’ ‘‘దెయ్యాలకు జ్వరం రావడమేంట్రా?’’ అయోమయంగా అడిగా. ‘‘ఎందుకు రాదూ. చేత‘బడి’ అనే వాళ్ల నర్సరీ స్కూలెగ్గొట్టి పిల్లదెయ్యాలుగానీ శ్మశానంలో చితిమంటల దగ్గర ఎక్కువ సేపు తిరిగాయనుకో. ఆ ఉష్ణోగ్రత వల్ల దెయ్యపిల్లలకు జ్వరం వస్తుందనేది ప్రేతలోకంలోని ఓ పిచ్చి నమ్మకం. మన దగ్గర వడదెబ్బలాగే... ఈ తరహా జ్వరాన్ని వాళ్లు ‘చితిదెబ్బ’ అని పిలుస్తారు. అక్కడి భూతమాంత్రికులు మాత్రం దీన్ని ‘కాష్ట ఘాతం–ప్రేత పిత్త పైత్య ప్రకోపం’ అంటారు’’ ‘‘ఇంకా’’ ఆసక్తిగా అనిపించి కాస్త రెట్టించి అడిగా. ‘‘ఇంకా బోల్డన్ని విశేషాలు ఉన్నాయిరా. దెయ్యాల లోకంలో ఈమధ్యే ‘డరోనా’ అనే వైరస్ వ్యాపించినప్పుడు దెయ్యాలన్నీ ఈ ‘డెవిలో–750’ని చాలా ఎక్కువగా వాడేశాయి. అన్నట్టు... ఈ టాబ్లెట్లూ గట్రా వాడటానికి మనలోకంలాగే అక్కడ కూడా చాలా రూల్సూ అవీ ఉన్నాయి. ఫరెగ్జాంపుల్ టాబ్లెట్లు వేసుకునేటప్పుడు గోరువెచ్చని రక్తంతోనే వేసుకోవాలట. మరీ చల్లటి రక్తమైతే జలుబు చేస్తుందేమోనన్నది వాళ్ల భయం. అంతేకాదు... మనలోకంలోలాగే దెయ్యాలకు జలుబు చేస్తే ‘నల్లకోడి చికెన్ సూప్’ తాగితే తగ్గిపోతుందన్నది భూతలోకంలోని ఓ గట్టి నమ్మకం’’ ‘‘గోరువెచ్చటి రక్తమా? మరి కొంతమంది నీ వేడి రక్తం తాగుతా అంటారు కదా. అలా వేడి వేడి రక్తం అంటూ ఎవరూ తాగరా?’’ అడిగా. ‘‘ఎందుకు తాగరూ! మనుషుల్ని భయపెట్టడానికి ‘ఊ...ఊ...ఊ... వో...వో...వో’ అంటూ అర్ధరాత్రుళ్లు ఊళలు పెట్టే దెయ్యాలకు గొంతూ అదీ రాసుకుపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో. అప్పుడు మాత్రం దెయ్యాలు కాస్తంత గోరువెచ్చటి రక్తంలో ఉప్పు వేసుకుని పుక్కిలిస్తాయి. డ్రాక్యులా దెయ్యాలు మాత్రం నేరుగా మనుషుల మెడ దగ్గర గాటుపెట్టి వేడి వేడి నెత్తురు పీలుస్తుంటాయి కాబట్టి వాటికి థ్రోట్ ఇన్ఫెక్షన్ రాదని దెయ్యాల్లో ఓ మూఢనమ్మకం. అయితే వాటి ఆహారపు అలవాట్ల వల్ల వాటికి అనీమియా... అదే రక్తహీనత మాత్రం పెద్దగా వచ్చే అవకాశాలుండవట’’ జవాబిచ్చాడు రాంబాబుగాడు. ‘‘అంటే... మన దగ్గర డాక్టర్లలాగే దెయ్యాలకూ జ్వరాలూ జబ్బులూ వస్తే వైద్యం చేయడానికి అక్కడా డాక్టర్లుంటారా?’’ అడిగా. ‘‘ఎందుకుండరూ? మన దగ్గర డాక్టర్లను ‘డా. ఫలానాగారూ’ అంటుంటాం కదా. అలాగే అక్కడి డాక్టర్ల పేరు ముందర భూ. అని ఉంటుంది. ఉదాహరణకు ‘భూ. కొరివి ప్రేతానంద్, భూ. డెవిలానంద ప్రసాద్’ అంటూ అక్కడి వైద్యుల్ని పిలుస్తారు. మన్దగ్గర డాక్టర్‌ను డా. అన్నట్టే... అక్కడ భూ. అంటే భూతవైద్యుడికి షార్ట్‌ఫామ్ అన్నమాట’’ ‘‘మరి మన దగ్గరలాగే దెయ్యాల లోకంలోనూ నాటువైద్యమూ... మూఢనమ్మకాలూ అవీ ఉంటాయా అక్కడ కూడా?’’ అడిగా. ‘‘ఆ... ఉంటాయి. ఉదాహరణకు మనలోకంలో లాగే వేపమండలూ, నిమ్మకాయలూ, నల్లకోడి నెత్తురూ, నల్లదారాలూ... ఇవంటే దెయ్యాలకు చాలా ఇష్టమనీ, అమావాస్యలాంటి రోజుల్లో వీటిని వాడి చాలా జబ్బుల్ని దూరం చేయవచ్చని దెయ్యాల్లోకంలోని కొందరు భూతమాంత్రికులు నమ్ముతుంటారుగానీ... అక్కడి చాలామంది మోడ్రన్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు... మరీ ముఖ్యంగా భూ. డెవిలానంద్, భూ. పిశాచేశ్వర్ పైశాచిక్ లాంటి స్పెషలిస్టులు ‘ఈ భూతమాంత్రికులంతా మూఢనమ్మకాలను ్రపోత్సహిస్తున్నారం’టూ వాళ్లపై బూడిదెత్తిపోస్తుంటారు’’ ‘‘వీటన్నింటి మీదా రాసిన ఈ థీసీసును ఎవరికి పంపుతావూ, ఎవరు పబ్లిష్ చేస్తారురా?’’ అడిగా. ‘‘మన దగ్గర లాగే... అక్కడ దెయ్యాల్లోకంలోనూ ‘ద ట్రూ స్పిరిట్స్ ఆఫ్ దెయ్యాస్ అండ్ దెయిర్ జెన్యూన్ మెడికల్ప్రాక్టీసెస్’ అనే ఓ మెడికల్ జర్నల్ ఉంది. మనంగానీ ఓ కాపీ వాళ్లకు ఇచ్చామనుకో. మనుషుల లోకం నుంచీ వాళ్లకు కంట్రిబ్యూట్ చేస్తున్న మొదటివ్యక్తిగా నా ఆర్టికల్ మీద పసుపూకారాలు చిలకరించి కళ్లకద్దుకొని మరీ పబ్లిష్ చేస్తాయవి’’ అంటూ రాతలో లోతుగా మునిగిపోయాడు రాంబాబుగాడు. – యాసీన్ -
రోకటిపాట కాదు రహస్య గీతం!
‘ప్రతి మనిషీ ఓరవాకిలిగా తెరిచిన ఓ తలుపే! అందులోంచి ముందుకు పోతే– ఒక్కొక్కరి కోసం, ఒక్కో ద్వారం తెరుచుకుంటుంది!’ –అన్నారు స్వీడిష్ కవి, మనఃశాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు తోమస్ యోస్తా ట్రాన్స్‌ట్రామర్. ఏ భాషలోనైనా, మనఃశాస్త్రజ్ఞులు కవులూ, రచయితలూ, సంగీతజ్ఞులుగా మారిన ప్రతి సందర్భంలోనూ పాఠకులకు ఇలాంటి భావచిత్రాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు మన చలం, కుటుంబరావు, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ఆర్ఎస్ సుదర్శనం, త్రిపుర, ‘అంపశయ్య’ నవీన్, పతంజలి శాస్త్రి, కె.ఎన్.వై పతంజలి, వడ్డెర చండీదాస్ తదితరుల రచనల్లోనూ అలాంటి దృశ్యాలు మనం చూసినవేగా!ఇక పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటి రచయితలు కోకొల్లలుగా కనిపిస్తారు– కాఫ్కా, వూల్ఫ్, లారెన్స్, సిల్వియా ప్లాత్, థామస్ మాన్, హెమింగ్వే అలాంటివాళ్ళే! ‘కనిపించీ కనిపించని దృశ్యాల్లాంటి సంక్షిప్త పదచిత్రాల ద్వారా ఈ కవి (ట్రాన్స్‌ట్రామర్) వాస్తవదృశ్యాన్ని సరికొత్త కోణంలోంచి మన కళ్ళకు కట్టిస్తార’ని 2011లో ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో పేర్కొన్నారు, స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి.ఆ ‘కనిపించీ కనిపించని’తనాన్నే ట్రాన్స్ట్రామర్లోని మార్మికతగా అభివర్ణించారు విశ్లేషకులు. మరికొందరు ఆయన్ను ‘ఆధునిక కవి’గా పరిగణించగా, వేరే కొందరైతే ‘ట్రాన్స్‌ట్రామర్ ఓ ఎక్స్ప్రెషనిస్టు కవి’ అన్నారు.గెయార్గ్ హైం, అగస్ట్ స్ట్రాం, గాట్ఫ్రైడ్ బెన్ తదితరులనూ అదే కోవకు చెందిన కవులంటారు. ఇంకొందరు, ‘ట్రాన్స్‌ట్రామర్ ఓ అధివాస్తవిక కవి’ అనేశారు. దైనందిన జీవనంలోనూ, మనల్ని ఆవరించుకుని వున్న చరాచర ప్రకృతిలోనూ లోపలి పొరల్లో దాగిన నిగూఢతను ట్రాన్స్‌ట్రామర్ ప్రముఖంగా చిత్రించే మాట నిజం! అందుకే, ఆయన్ని ‘క్రైస్తవ కవి’గా లెక్కించారు మరికొందరు.ఈ నిర్వచనాలూ ప్రవచనాల మాటెలావున్నా, జీవన గీతం రోకటిపాట కాదనీ, అదో రహస్యగానమనీ ట్రాన్స్‌ట్రామర్ లాంటి మార్మిక కవులు నిరూపించిన మాటైతే వాస్తవం! ఈ మార్మికత ఎక్కడినుంచో ఎరువుతెచ్చుకున్నదేం కాదు. అది ఆధునిక జీవన విధానంలో భాగమే. మన మర్యాదల్లోనూ పలకరింపుల్లోనూ మొదలుపెట్టి ఒంటరిగా వున్నప్పుడు ముసురుకునే ఆలోచనల వరకూ అన్నింటా ఈ మార్మికత ఆవరించుకుని వుంటుంది. విషయమేమిటంటే, ఆధునిక మానవాళికి మార్మికత పనిగట్టుకుని నేర్పించనవసరం లేదు! బహుశా అందుకేనేమో, ట్రాన్స్‌ట్రామర్ కవిత్వం 60 భాషల్లోకి అనువాదమై, పాఠకుల ఆదరణకు పాత్రమైంది.ట్రాన్స్‌ట్రామర్ రాణించిన మరో రంగం సంగీతం. 1990లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయేంత వరకూ, ఆయన పూర్తిస్థాయి పియానో వాద్యగాడిగా ఔననిపించుకున్నవాడే! ఆ తర్వాత కూడా ఒంటిచేత్తోనే పియానో వాదనం అభ్యసించాడు ట్రాన్స్‌ట్రామర్. అలా తన విశిష్టతను మరోసారి నిరూపించుకున్నాడు. సంగీత రంగంలో ట్రాన్స్‌ట్రామర్ వారసత్వాన్ని ఆయన కుమార్తె కొనసాగించారు. గానకళలో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శకురాలు! 2011లో ట్రాన్స్ట్రామర్కు నోబెల్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తండ్రి కవితలు పద్దెనిమిదింటికి బాణీలు కట్టి ఆలపించారామె. నార్వీజియన్ శాక్సఫోనిస్ట్ యాన్ గబారెక్, స్వీడిష్– అమెరికన్ సంగీతకర్త ఊల్ఫ్ గ్రాన్, స్వీడిష్–ఫ్రెంచ్ సంగీతకారిణి మెడిలిన్ ఇసాక్సన్ తదితరులెందరో ట్రాన్స్‌ట్రామర్ గీతాలకు బాణీలు కట్టి శ్రోతలను అలరించారు.సాహిత్య ప్రక్రియలను– స్థూలంగా– కవిత్వం, వచనంగా విభజించి చూసుకుంటే, నోబెల్ సాహిత్య పురస్కారాల వరకూ కవిత్వానికి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. గత నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళలో కవులూ, వాగ్గేయకారుల సంఖ్య మూడు పదులకు కొంచెం ఎక్కువ. (అక్షరాలా ముప్పైమూడు మాత్రమే!) మరీ ముఖ్యంగా ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ కోవకు చెందిన పురస్కార గ్రహీతలు ముగ్గురంటే ముగ్గురే! 2011లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ట్రాన్స్ట్రామర్తోనే ఈ ‘జాబితా’ మొదలవుతుంది! అయితే ఆయన కవిత్వానికే ఈ పురస్కారం ప్రకటిస్తున్నామని స్వీడిష్ ఎకాడెమీ ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం.జర్మన్ కవయిత్రి లూయిజ్ గ్లూక్ ఒక్కరికే– 2020లో– కవిత్వానికి గానూ ఈ పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ. మరో నాలుగేళ్ళకు ఇదే పురస్కారం అందుకున్న దక్షిణ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ రాసింది వచనమే– అయితే దాన్ని కవిత్వంతో వేరుచెయ్యడం దాదాపు అసాధ్యం! తెలుగులో ఇలాంటి పోలిక చెప్పాలంటే రావిశాస్త్రి, కె.ఎన్.వై.పతంజలి లాంటి పేర్లు కొన్ని చూపించవచ్చు. ట్రాన్స్‌ట్రామర్ వచనం కూడా అలాంటిదే! దాన్ని మూసకట్టు వచనమనో, కవిత్వమనో జమకట్టడం కష్టం. ట్రాన్స్‌ట్రామర్ కవితల్లో ‘నీలి ఇల్లు’ సుప్రసిద్ధం. దాని ఆంగ్లానువాదం (ద బ్లూ హౌస్) నెట్లో దొరుకుతోంది– చదవండి! - మందలపర్తి కిషోర్ -
ఫీజు కోసం ఎద్దుని అమ్మి...
కాలం వక్రిస్తే ఓడలు బళ్లవుతాయి అంటారు. ఆ మాట మా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమి అకస్మాత్తుగా ఆవిరైపోతే..? బెదరకుండా పరిస్థితులకు బెదిరిపోకుండా మొండితనంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు మా నాన్న లక్షీనరసింహరావు. అది 1972 తీవ్రమైన కరువు..ఇంట్లో అమ్మతో పాటు నేను నా ఇధ్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఆకలి మంటలు మొదలయ్యాయి.వరి గింజ లేక వణుకు పుట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో దేవదారు ఆకులు తినిపించి మా ప్రాణాలను కాపాడాడు మా నాన్న..పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి కూలి పనులకు వెళ్లడం, వ్యవసాయాన్ని చూసుకోవడం కాస్త సమయం ఉంటే మాతో గడపడం. రోజుకి 18 గంటలు పొలంలోనే గడిపేసిన రోజులు లెక్కలేనన్ని.. అయినా ఎప్పుడూ ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. మా చదువుల్ని మాన్పించలేదు. ఏది కావాలన్నా వెనకడుగు వేయలేదు.కాని నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు పరీక్ష ఫీజు కట్టాల్సి వచ్చింది. కరువు పరిస్థితులు ఇంకా కుదురుకోలేదు.. ఇంట్లో దమ్మిడీ లేని పరిస్థితి. చదువుకి ఇక స్వస్తి చెప్పినట్టేనని అనుకున్నా. కాని మా నాన్న చేసిన పనిని నేను జీవితంలో మరిచిపోలేను. అసలే కరువు పరిస్థితులు, అప్పు కూడా పుట్టని రోజులు, ఉన్నవే రెండు కాడెద్దులు..అందులో ఒక ఎద్దుని 370 రూపాయలకు అమ్మేశాడు మా నాన్న.. 170 పరీక్ష ఫీజు పోను మిగిలిన 200 రూపాయలతో మరొక బక్క ఎద్దుని కొన్నాడు.దాన్ని కాస్త మేపి కాడి దున్ని వ్యవసాయం చేద్దామని అనుకున్నాడు. కాని వారం తిరక్కముందే అది కాస్తా చనిపోయింది. మా నాన్న ఆశ తిరగబడింది. అసహనం, అశక్తత ఆవహిస్తే ఏ మనిషైనా కుంగిపోక తప్పదు కాని మా నాన్న మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరింత కష్టపడ్డాడు. పరిస్థితులు అనుకూలించాయి. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఈరోజు నేను నా తమ్ముళ్లు, చెల్లెలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో రాణించినా, మా వంశ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చినా అదంతా కష్టాలకు వెన్నుచూపని మా నాన్న గుండె చలవే. - జగపతిరావు విశ్రాంత అధ్యాపకులు, మహబూబ్‌నగర్ జిల్లాతండ్రి లక్షీనరసింహారావు---పచ్చ ఇంకు కలం సాకారమైంది!మా స్కూల్ హెడ్మాస్టర్ జేబులో ఓసారి పచ్చ ఇంకు పెన్ను చూసి మా నాన్న ఏదో ఒకరోజు నువ్వు కూడా అలాంటి పెన్ను జేబులో ఉంచుకునే స్థాయికి వెళ్లాలిరా అన్నాడు. ఆయన చదువుకోలేదు.. కాని ఆయన బిడ్డ మాత్రం అందరూ గౌరవించే స్థాయిలో ఉండాలన్నదే ఆయన ఆశ. అదే నాలో పట్టుదల రేకెత్తించింది. అహర్నిశలు శ్రమించేలా చేసింది.ఈ లక్షణం కూడా మా నాన్న భవనం వెంకటేశ్వర్లు నుంచి వచ్చిందే. అర ఎకరం భూమి మాత్రమే వారసత్వంగా వచ్చినా చెమటోడ్చి వ్యవసాయం చేసి 30 ఎకరాల ఆసామిగా మారాడు మా నాన్న. ఆయనే నాకు తొలి గురువు. 21 ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చేరినా, నాన్న చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి హోదాను పొందాను. మా నాన్న కలను సాకారం చేశాను. ఆయన సేవా గుణాన్ని స్పూర్తిగా తీసుకుని 24 లక్షల వెచ్చించి పాఠశాలను అభివృద్ధి చేశాను.- భవనం బద్రిరెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, వేటపాలెం, బాపట్లతండ్రి భవనం వెంకటేశ్వర్లు -
మీరు నమ్మలేరు!! రష్యాలో ఉన్న ఆ రంధ్రం నరకానికి ద్వారం, ఇది నిజం!
-
ది డివోర్స్
ఆరోజు వాట్సప్‌లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్ నుంచి వచ్చిన నోటీస్. కారణం ఇన్ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా ఆ నోటీస్‌ని పంపాడని ఆమె మథనపడసాగింది. అది ఆమెకి నమ్మశక్యంగా లేదు. తల్లికి మైనర్ సర్జరీ జరుగుతూంటే తను వారం క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె దాన్ని తన తండ్రికి ఫార్వర్డ్ చేసింది. పావుగంట తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కంగారుగా అడిగాడు. ‘‘ఏమిటిది బేబీ విచిత్రంగా?’’ ‘‘అవును. నాకూ చిత్రంగానే ఉంది.’’‘‘ఇన్ కంపాటిబిలిటీ అంటే ఏమిటో అతగాడికి ఫోన్ చేసి కనుక్కో.’’ ఆయన కోపంగా చెప్పాడు.‘‘నేను కనుక్కోను. ఇలాంటి విషయాల్లో ముందు నాతో సంప్రదించడం మర్యాద. అతను ఆ మర్యాదని నిలబెట్టుకోలేదు.’’ ఆమె కఠినంగా చెప్పింది. ‘‘నేను కనుక్కుంటాను. మీ మధ్య పోట్లాటేదైనా జరిగిందా?’’ ఆయన అడిగాడు.‘‘వచ్చే ముందు చిన్న పోట్లాట జరిగింది. ఇల్లు కట్టుకుంటానంటే నాతో చెప్పకుండా తన తమ్ముడికి ఐదు లక్షలు పంపాడు. నేను నెలకి ఎంత చొప్పున ఎంతకాలంలో తిరిగి ఇవ్వాలో షెడ్యూల్ కూడా పంపమని సలహా ఇచ్చాను. తన తమ్ముడికి అప్పు ఇవ్వలేదని, బహుమతి ఇచ్చానని చెప్పాడు. క్రితం నెలలోనే తల్లి పుట్టినరోజుకి ఏభై వేలు పెట్టి పట్టుచీర కొన్నాడు. నేను పదివేల చీర సరిపోదా అని అడిగాను.’’‘‘రేపు పిల్లలు పుడితే అతనికే జాగ్రత్త వస్తుంది.’’ ఆయన చెప్పాడు. ‘‘లేదు. లేదు. రాదు. ఆ మనిషికి తన వాళ్ళంటే ప్రేమ. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంత దాకా పాతిక లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. ఇంకో పాతిక వేసుకుంటే మన ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేది. నెలకి రెండున్నర వేలైనా అద్దె వచ్చేది.’’‘‘ఫైనాన్స్ కాక ఈమధ్య ఇంకేమైనా పొరపొచ్చాలు ఉన్నాయా?’’ ‘‘లేవు. మా అత్తమామలు వచ్చి మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మా మామగారి డామినేషన్ భరించలేను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పూట ఏది వండాలి, ఇలా అన్నీ ఆయన శాసించినట్లే జరగాలి.’’ ‘‘అవును. పెళ్ళిలోనే అది గమనించాను.’’ అరగంట తర్వాత ఆయన కూతురికి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మాట్లాడానమ్మా. కారణం ఇదని స్పష్టంగా చెప్పలేదు. ‘మోస్ట్ ఇన్‌కంపాటిబుల్ వైఫ్‌తో జీవించలేను’ అన్నాడు. ‘మా నాన్న కోతా కాఫీ పౌడర్ని కొనమంటే బ్రూక్‌బాండ్ కొన్నది లాంటి అన్నీ సిల్లీ కారణాలే. అతని మనసులో అసలు కారణం ఏదో ఉంది. అది దాస్తున్నాడు. అతను ఇంకెవరితోనైనా క్లోజ్‌గా ఉండటం నీకు తెలుసా?’’‘‘లేదు. నాకా అనుమానమే లేదు. అతను అలాంటివాడు కాదు. నేనంటే చాలా చాలా ప్రేమ నాన్నగారు.’’కూతురి కంఠంలోని దుఃఖాన్ని ఆయన పసిగట్టాడు.‘‘నేను వీకెండ్‌కి వచ్చి పర్సనల్‌గా మాట్లాడతానని చెప్పాను. ‘మాది ప్రేమ వివాహం. మీ ప్రమేయంతో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీ ప్రమేయం వద్దు’ అన్నాడు. రాజీమార్గాలన్నీ ఖండించాడు. నాకు అంతా అయోమయంగా ఉంది.’’ ఆయన బాధగా చెప్పాడు. ఆయన భార్య మాత్రం తొణకలేదు. కూతురికి ధైర్యం చెప్తూ చెప్పింది.‘‘ఈరోజుల్లో విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం చాలా మామూలు. మీకు పిల్లల కూడా లేరు. కాబట్టి మళ్ళీ పెళ్ళి తేలిక. ఈ కాలం పిల్లలు జీవితాన్ని వృథా చేసుకోవడం లేదు. నీకు వచ్చే జీతం తక్కువేం కాదు. తన మీద నువ్వు ఆధారపడి లేవు. ’’బయటకి చెప్పకపోయినా ఆవిడ మనసులో బాధగానే ఉంది.‘‘ఏం జవాబు చెప్పావు? లాయర్ నోటీస్ వస్తే మనం జవాబు ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లు అవుతుంది అని విన్నాను.’’ ఆవిడ అడిగింది. ‘‘అతను కచ్చితంగా డైవర్స్ కోరుకుంటే నేను అతన్ని పట్టుకుని వేలాడను. మళ్ళీ లాయర్ ఖర్చు కూడా ఎందుకు? కామ్‌గా ఉందాం. ఇదే ఫైనల్ డెసిషన్.’’తల్లిదండ్రులకి కూతురు సంగతి తెలుసు కాబట్టి ఆమె మనసు మార్చటానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఆమె విపుల్ నుంచి వ్యక్తిగత మెసేజ్ కోసం ఎదురు చూసింది. కాని రాలేదు. రెండు వారాల తర్వాత కోర్ట్ నించి విడాకుల కేసుకి నోటీస్ వచ్చింది. అప్పటికే అందుకు సిద్ధపడ్డ ఆమె విచారించలేదు. వరసగా మూడు వాయిదాలకి సమన్ వచ్చినా ఆమె కోర్ట్‌కి హాజరు కాలేదు.∙∙ విపుల్ నుంచి ఆమెకి ఓ రోజు మెసేజ్ వచ్చింది. ‘ఇప్పుడే విడాకులు మంజూరయ్యాయి. ఎందుకో నీకు చెప్పాలి. ఐ లవ్ యు. అందులో మార్పు లేదు. మరి ఈ విడాకులు దేనికి? నేను మరణించాక నా ఆస్తి, పి.ఎఫ్. బెనిఫిట్స్ నా తల్లితండ్రులకి అందడానికి. భార్యగా నువ్వు హక్కుగా అవి వాళ్ళకి వెళ్ళకుండా కోర్ట్‌కి ఎక్కుతావని నాకు తెలుసు. వాళ్ళు ఆస్తిని పోగొట్టుకుంటారు తప్ప నీతో కోర్ట్‌లో ఫైట్ చేయరు. దాన్ని నివారించడానికి విడాకులని ఎన్నుకున్నాను. నీకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. నువ్వు నామీద ఆధారపడిలేవు. నీ ఉద్యోగం, నీ ఆస్తి నీకు ఉన్నాయి. ఆరు నెలల తర్వాత నేను నీకు, నా తల్లిదండ్రులకి, అసలు ప్రపంచానికే కనిపించను. ఫోర్త్ స్టేజిలోని నా కేన్సర్ ఐదారు నెలలు మించి నన్ను బతకనివ్వదని డాక్టర్ చెప్పాడు. గెట్ మేరీడ్ డార్లింగ్. ఐ లవ్ యు అండ్ గుడ్‌లక్.’’ మల్లాది వెంకట కృష్ణమూర్తి(చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
రక్తదానం ప్రాణదానమే
రక్తదానం అంటే ప్రాణదానం. సకాలంలో దొరికే రక్తం ఆపదలో చిక్కుకున్న ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడుతుంది. సకాలంలో తగిన రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది మరణిస్తున్నారని, వీరిలో సుమారు 77 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. మన దేశంలో ఏటా దాదాపు 1.80 లక్షల మంది సకాలంలో రక్తం అందక మరణిస్తున్నారు.వీరిలో సుమారు 24 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఇది విరివిగా అందుబాటులోకి వచ్చినట్లయితే, రక్తం కొరత వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ప్రసవ సమయంలో కొందరు మహిళలకు, శస్త్రచికిత్సల తర్వాత పలువురు రోగులకు రక్తం అత్యవసరం అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, హీమోఫీలియా వంటి జన్యువ్యాధులతో బాధపడేవారికి; లుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి రక్తసంబంధ క్యాన్సర్లతో బాధపడేవారికి తరచుగా రక్తం అవసరం అవుతుంటుంది. సకాలంలో రక్తం దొరకకుంటే, వీరు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందరో స్వచ్ఛంద రక్తదాతలు తరచుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినా, రక్తం అవసరమైన వారికి తగినంత రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఎదురవుతుండటమే విషాదం. మన దేశంలో పరిస్థితులు చూసుకుంటే, రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం అవసరానికి తగినంతగా ఉండటం లేదు. గడచిన ఐదేళ్లలో మన దేశంలోని పరిస్థితిని పరిశీలిద్దాం.రక్తదానంలో టాప్ –10ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్‌క్రాస్ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవలి కాలంలో పలు దేశాలలో స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం యూనిట్లలో మన దేశం రెండో స్థానంలో ఉంది. స్వచ్ఛంద రక్తదాత వల్ల ఏటా సేకరిస్తున్న రక్తం పరిమాణం పెరుగుతూనే ఉంది. అయినా, మన దేశంలో ఏడాదికి దాదాపు ఒక మిలియన్ యూనిట్ల కొరత ఎదురవుతోంది. రక్త పరిశోధనల చరిత్రరక్తం కోల్పోయినప్పుడు ప్రాణాలు పోతాయని మనుషులకు చాలాకాలం కిందటే తెలుసు. అయితే, కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసే పక్రియ తెలుసుకోవడానికే శతాబ్దాల కాలం పట్టింది. అసలు మనుషుల్లో రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే చాలాకాలం పట్టింది. తొలిసారిగా ఇంగ్లిష్ వైద్యుడు విలియమ్ హార్వే 1628లో మానవ శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో మ్యాప్ చేశాడు. హార్వే రూపొందించిన మ్యాప్ ఆధారంగా యూరోపియన్ వైద్య పరిశోధకులు రక్తం కోల్పోయిన మనుషులకు రక్తాన్ని ఎక్కించే ప్రక్రియపై రకరకాల ప్రయోగాలు చేశారు.మనుషులకు జంతువుల రక్తం ఎక్కించే ప్రయత్నం తొలిసారిగా 1667లో చేసినా, ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. తొలిసారిగా బ్రిటిష్ ప్రసూతి వైద్యుడు జేమ్స్ బ్లండెల్ 1818లో ప్రసవానంతరం అధిక రక్తస్రావానికి లోనైన ఒక మహిళకు విజయవంతంగా మనిషి రక్తాన్ని ఎక్కించాడు. అప్పటికి మనుషుల్లోని రక్తమంతా ఒకటే అనుకునేవారు. రక్తంలోని గ్రూపులను ఆస్ట్రియన్ వైద్యుడు కార్ల్ లాండ్స్టీనర్ 1900లో కనుగొన్నాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. రక్తదాన చరిత్రతగిన రక్తాన్ని ఎక్కించడం ద్వారా మనుషుల ప్రాణాలు నిలపడం సాధ్యమయ్యాక బ్రిటిష్ రెడ్‌క్రాస్ సొసైటీ కార్యదర్శి పెర్సీ లేన్ ఆలివర్ ప్రపంచంలోనే తొలిసారిగా లండన్‌లో స్వచ్ఛంద రక్తదాతల సేవలను 1921లో ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో గాయపడిన సైనికుల కోసం అమెరికన్ రెడ్‌క్రాస్ నేతృత్వంలో విస్తృతంగా రక్తసేకరణ ప్రారంభించారు. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసేందుకు షికాగోలోని కుక్ కౌంటీ ఆస్పత్రిలో 1937లో ప్రపంచంలోని తొలి బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేశారు.ఇది ఏర్పడిన రెండేళ్లకే– 1939లో మన దేశంలోని తొలి బ్లడ్‌బ్యాంకును కలకత్తాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీనిని డాక్టర్ శివ్దేవల్ సింగ్ గ్రీవల్ ప్రారంభించారు. తొలినాళ్లలో ఏర్పడిన బ్లడ్‌బ్యాంకులు రెండో ప్రపంచయుద్ధంలో గాయపడిన వేలాది సైనికుల ప్రాణాలను నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషించాయి. తొలినాళ్లలో రక్తదానం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉండేవి. ప్రజల్లోని అపోహలను తొలగించడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు రక్తదానం ఆవశ్యకత గురించి 1960లలో సమాజంలో అవగాహన కల్పించడం ప్రారంభించారు.అప్పటికి ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో బ్లడ్‌బ్యాంకులు ఏర్పడ్డాయి. క్రమంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా బ్లడ్‌బ్యాంకుల ఏర్పాటు మొదలైంది. హెచ్ఐవీ మహమ్మారి వల్ల 1980ల నుంచి రక్త సేకరణ విధానాల్లోను, రక్త మార్పిడి జాగ్రత్తల్లోను సమూలమైన మార్పులు వచ్చాయి. రెడ్‌క్రాస్ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినా, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి తగిన రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి.ప్రపంచంలోని కోట్లాది మంది స్వచ్ఛంద రక్తదాతల నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు వెల్లడించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2004లో జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇదే రోజున రక్తదాతల గౌరవార్థం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం ప్రారంభమైంది. ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ రక్తదాన దినం కోసం ‘ఒక చుక్క మానవత్వం. రక్తాన్ని ఇవ్వండి. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్‌ను ఎన్నుకుంది.కృత్రిమ రక్తం కథా కమామిషూఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైనా, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసే బ్లడ్‌బ్యాంకులే శరణ్యం. రక్తదాతలు తమ రక్తాన్ని ధారపోయాల్సిన అవసరం లేకుండా చేయడానికి, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా తక్షణమే అందించడానికి వీలుగా అన్ని రకాల గ్రూపులకు చెందిన రక్తం ఉన్నవారికి సరిపోయే కృత్రిమ రక్తాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయోగాలు సాగిస్తూనే ఉన్నారు. తొలిసారిగా 1989లో జపాన్ శాస్త్రవేత్తలు ‘ఫ్లూవోసాల్’ పేరుతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీనికి ఎఫ్‌డీఏ అనుమతి కూడా లభించింది. అయితే, దీనిని నిల్వచేయడంలో సాంకేతిక ఇబ్బందులు, తయారీ ప్రక్రియలో సంక్లిష్టతలు తదితర కారణాల వల్ల ‘ఫ్లూవోసాల్’ తయారీ 1994లో నిలిచిపోయింది.కృత్రిమ రక్తం తయారీ తొలి ప్రయత్నం శాస్త్రీయంగా విజయవంతమైనా, సాంకేతిక కారణాల వల్ల కార్యాచరణలో విఫలమైంది. అలాగని ఆశలు అడుగంటిపోలేదు. శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. అమెరికన్ కంపెనీ ‘బయోప్యూర్’ వ్యవస్థాపకులైన శాస్త్రవేత్తలు డాక్టర్ బింగ్ ఎల్ వాంగ్, డాక్టర్ కార్ల్ డబ్ల్యూ రాష్ రక్తానికి ప్రత్యామ్నాయం కాగల ‘హెమోప్యూర్–201’ అనే ఉత్పత్తిని 2001లో రూపొందించారు. ఇది ‘హెమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్’. హెమోగ్లోబిన్ ద్వారా తయారు చేసిన ఈ ఉత్పత్తి రక్తం మాదిరిగానే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా ప్రాణాలను నిలిపి ఉంచగలదు. దీనికి ఎఫ్ఏడీ అనుమతి లభించింది. ‘ఫ్లూవోసాల్’తో పోల్చుకుంటే, దీనికి అనేక సానుకూలతలు ఉన్నాయి.దీనిని నిల్వచేయడానికి రిఫ్రిజిరేటర్లు అక్కర్లేదు. సాధారణ పరిస్థితుల్లో సైతం ఇది నిక్షేపంగా రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి బ్లడ్ గ్రూపు వారికైనా చక్కగా సరిపోతుంది. ఇన్ని సానుకూలతలు ఉన్నా, దీని వాడుక పరిమితంగానే ఉంది. శస్త్రచికిత్సల తర్వాత తలెత్తే ఎనీమియా నివారణ కోసం ‘హెమోప్యూర్–201’ వాడుతున్నారు. ఇది రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల ప్లాస్మా, ప్లేట్లెట్లు వంటి ప్రత్యేక అవసరాల కోసం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.‘హెమోప్యూర్–201’ పరిమితులను గుర్తించాక శాస్త్రవేత్తలు మరింత విస్తృతంగా ప్రయోగాలు సాగించి, తొలిసారిగా బ్రిటిష్ శాస్త్రవేత్తలు 2022లో లాబొరేటరీలో ఎర్ర రక్తకణాలను తయారు చేయగలిగారు. బ్రిస్టల్ వర్సిటీ, కేంబ్రిడ్జ్ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు మూలకణాల నుంచి సేకరించిన ఎర్రరక్త కణాలతో కృత్రిమ ఎర్ర రక్తకణాలను విజయవంతంగా అభివృద్ధి చేయగలిగారు. సికిల్‌సెల్ ఎనీమియా, థలసీమియా రోగులకు నేరుగా రక్తం ఎక్కించే బదులుగా ఈ కృత్రిమ ఎర్ర రక్తకణాలను ఎక్కించడం ద్వారా వారి ప్రాణాలను నిలపవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు కృత్రిమ రక్తం తయారీకి జరిగిన ప్రయత్నాలు పాక్షిక ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. ఇవేవీ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి.పరిమితులు ఏమిటంటే..?రక్తానికి బదులుగా ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించినవేవీ పూర్తిస్థాయిలో రక్తానికి ప్రత్యామ్నాయం కాకపోవడానికి వీటి పరిమితులే కారణం. రక్తంలోని ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులలో ఎవరికైనా ఇవ్వడానికి పనికొచ్చేలాగానే ‘ఫ్లూవోసాల్’, ‘హెమ్ప్యూర్–201’ వంటి వాటిని, కృత్రిమ ఎర్ర రక్తకణాలను రూపొందించారు. వీటిలో రక్తంలో ఉండే పదార్థాలన్నీ పూర్తిగా ఉండవు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా ఉంటాయి. ఇప్పటి వరకు రక్తానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన వాటిలో హెమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు మినహా ఇతర కీలక పదార్థాలు లేకపోవడమే వీటి పరిమితి. ఇవి రక్తంలోని హెమోగ్లోబిన్ను, ఎర్ర రక్తకణాలను భర్తీ చేయగలవు. రక్తం మాదిరిగానే శరీరంలోని జీవకణాలకు ఆక్సిజన్ సరఫరా చేయగలవు.అయితే, ప్లేట్లెట్ల మాదిరిగా రక్తం గడ్డకట్టేందుకు దోహదపడలేవు. ప్లాస్మా మాదిరిగా రక్త పరిమాణాన్ని పెంచలేవు. డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడినవారికి ప్లేట్లెట్లు అత్యవసరం అవుతుంటాయి. కాలిన గాయాలకు లోనైన వారికి, విపరీతంగా రక్తస్రావం అయిన వారికి ప్లాస్మా అవసరం అవుతుంది. వీటి కోసం బ్లడ్‌బ్యాంకులపై ఆధారపడాల్సిందే! రక్తదాతల నుంచి సేకరించిన రక్తం ద్వారా ప్లేట్లెట్లు, ప్లాస్మా వేరు చేసి రోగులకు ఎక్కిస్తారు.రక్తం నుంచి అవసరమైన పదార్థాలను వేరు చేసి, నిల్వచేసే పని బ్లడ్‌బ్యాంకులు చేస్తుంటాయి. రక్తం అవసరాలకు ఇప్పటి వరకు కృత్రిమంగా తయారైనవన్నీ పాక్షిక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటున్నాయి. రక్తానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రూపొందించిన ఉత్పత్తులతో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రక్తం బదులుగా వీటిని ఎక్కించిన రోగులు కొందరిలో అధిక రక్తపోటు, రక్తనాళాల సంకోచం, అరుదుగా గుండెపోటు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరించే రక్తంతో పోల్చుకుంటే, ఈ కృత్రిమ ఉత్పత్తుల ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది.కృత్రిమ రక్తం భవితవ్యంప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సాంకేతికత సహజ రక్తానికి పరిమిత స్థాయిలో మాత్రమే కృత్రిమ ప్రత్యామ్నాయాలను అందించగలుగుతోంది. వీటిలో ప్లేట్లెట్లు, తెల్ల రక్తకణాలు, ప్లాస్మా ఉండనందున ఇవి సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయాలు కాలేకపోతున్నాయి. అయితే, రానున్న ఇరవై ఏళ్లలో ఆక్సిజన్ క్యారియర్లుగా ఉపయోగపడే కృత్రిమ రక్త ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల కోసం రక్తదాతలపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వారి అంచనా ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆస్పత్రులు ఎర్ర రక్తకణాల అవసరాల కోసం కృత్రిమ రక్త ఉత్పత్తులను విరివిగా వాడటం ప్రారంభిస్తాయి. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్లేట్లెట్లు, ప్లాస్మా తదితర అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఈలోగా మరిన్ని పరిశోధనలు జరిగి, పూర్తిస్థాయిలో సహజ రక్తానికి దీటైన సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని (యూనివర్సల్ ఆర్టిఫిషియల్ బ్లడ్) రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికే లాబొరేటరీల్లో కృత్రిమంగా గుండె వాల్వులు, తాత్కాలికంగా పనిచేయగలిగే కృత్రిమ గుండెలు సహా పలు కృత్రిమ అవయవాలను తయారు చేయడం సాధ్యమైందని, అదే రీతిలో సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాగల కృత్రిమ రక్తాన్ని తయారు చేయడం కూడా సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్‌కు కర్మ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఏంటి ?
-
ప్రేతాత్మ చెప్పిన కథ..!
ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్ స్పీక్స్’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్ రాబర్ట్స్– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్ బట్స్ 1963 డిసెంబర్ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్‌కు ఒక అశరీరవాణి వినిపించిందట! ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్ రాబర్ట్స్ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్ తనకు చెప్పిన కథలను జేన్ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్ మెటీరియల్’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.బంగారు మ్యూజియంప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. -
సముద్రమంత ప్రేమ : ఎవరీ సతీష్ భాస్కర్
World Turtle Day ‘సతీష్ భాస్కర్’ అనే పేరు వినబడగానే చాలామందికి తాబేళ్లు గుర్తుకు వస్తాయి.ఆయనకు ‘తాబేళ్ల సంరక్షకుడు’ అని పేరు. చిన్నప్పటి నుంచి సతీష్ భాస్కర్‌కు సముద్రపు తాబేళ్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను తాబేళ్ల ప్రపంచంలోకి తీసుకు వెళ్లింది. ఆ ప్రపంచంలో ఆయన వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు.అయితే ఆయన ఉక్కు సంకల్పం ముందు ఆ ఆటంకాలు నిలవలేకపోయాయి... తాబేళ్ల పరిరక్షణ కోసం ఎవరి తోడూ లేకున్నా వేల కిలోమీటర్ల దూరం ఒంటరి ప్రయాణం చేశారు సతీష్ భాస్కర్. తీర్ర΄ాంత మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో, అలుపెరుగని స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉండేవి. అండమాన్ దీవుల తీరాలలో సముద్ర తాబేళ్ల పరిరక్షణకు భాస్కర్ చేపట్టిన కార్యక్రమాలు విస్తృతమైన ఆయన పరిశోధనకు గీటురాయిగా మారాయి.ఆకలితో కొన్ని రోజులు...లక్షద్వీప్‌లోని జనావాసాలు లేని సుహేలి ద్వీ΄ానికి వెళ్లారు భాస్కర్. అక్కడ అయిదు నెలల పాటు తాబేళ్లపై సర్వేలు నిర్వహించారు. ఆ ద్వీపానికి వెళ్లడం చాలా కష్టం. అయినా అష్టకష్టాలు పడి అక్కడికి చేరుకున్నారు. అండమాన్ ద్వీపంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తినడానికి అతడి దగర్గ ఏమీ లేదు. ఆకలిని తట్టుకోలేని పరిస్థితులలో అక్కడి ఆదిమ గిరిజన తెగ వారి దగ్గర కాల్చిన మాంసం తెచ్చుకొని కడుపు నింపుకున్నారు.టర్టిల్ వాకర్సుహేలి ద్వీపంలో ఉన్నప్పుడు కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, ఇండోనేషియాలోని వెస్ట్ పపువా వంటి తీర్ర ప్రాంతాల వెంబడి అలుపెరుగకుండా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతిచోట తన ప్రయాణానికి పరమార్థాన్ని వెదుక్కున్నారు భాస్కర్. తాబేళ్ల ప్రపంచం గురించి సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడానికి తాను చేసిన ప్రయాణాలు ఉపకరించాయి. ‘టర్టిల్ వాకర్’ పేరుతో భాస్కర్‌పై 75 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు తైరా మాలనీ. ఈ డాక్యుమెంటరీ జాక్సన్ వైల్డ్ మీడియా అవార్డ్స్‌లో కన్జర్వేషన్, గ్రాండ్ టెటాన్ అవార్డులను అందుకుంది. సతీష్ భాస్కర్ ప్రయాణం గురించి ఈ డాక్యుమెంటరీ చెప్పే మాట...‘అతడిది...మృత్యువును ధిక్కరించే అన్వేషణ’సముద్ర తాబేళ్ల ఆవాసాలను గుర్తించే ప్రయత్నంలో మన దేశంలో తీర్ర΄ాంతంలో నాలుగువేల కిలోమీటర్లు ప్రయాణించారు భాస్కర్. గూళ్లు కట్టే విధానం నుంచి గుడ్ల స్వభావం వరకు తాబేళ్లకు సంబంధించి అనేక కోణాలలో అధ్యయనం చేశారు. ఆయన సాహసాలు, ప్రయత్నాలు రాబోయే తరాలు తాబేళ్లను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలిచాయి.తాబేళ్ల సంరక్షణ కోసం...గుడ్లు, మాంసం, పెంకులు, చర్మం కోసం తాబేళ్లను వధిస్తున్నారు వేటగాళ్లు. మరోవైపు... చేపల వలలతో ప్రమాదవశాత్తు తాబేళ్ల ఆవాసాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయాలు సతీష్ భాస్కర్‌ను తీవ్రంగా కలచివేశాయి. బాధపడడానికి మాత్రమే పరిమితం కాకుండా తన జీవితాన్ని తాబేళ్ల సంరక్షణకు అంకితం చేశారు. తాబేళ్ల స్థితి గతులు, పరిరక్షణపై యాభైకి పైగా రిపోర్ట్లు వెలువరించారు. -
నేటి అమ్మ మేటి యోధ
వయసు ముప్పై వచ్చేసరికి ఆమె భార్య, తల్లి, కోడలు, ఉద్యోగి. యువతిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! కుటుంబం.. సమాజం... విసిరే సవాళ్లు ఎన్ని! కాని గెలవడం ఆమెకు తెలుసు. ఆమె నేటి అమ్మ. ఈ అమ్మకు పద్మవ్యూహాలు ఛేదించడం తెలుసు.నాకు నేను మిగలాలిపెళ్లి అయ్యింది. పిల్లాడు పుట్టాడు. ఉద్యోగం ఉంది. సంతోషమే. కానీ ‘నేను’ ఏమయ్యాను అనే ప్రశ్న ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అద్దంలో చూసుకుంటే కనిపించేది ఒకరి భార్య, ఒకరి తల్లి, ఒక కంపెనీ ఉద్యోగి. కానీ వీళ్ల వెనుక ఉత్సాహం ఉరకలెత్తే ‘అమ్మాయి’ కూడా ఉండాలే. నాటి అమ్మాయిని కాపాడుకోవడం నేటి అమ్మకు తెలుసు. అందుకు తను ఏం చేస్తోంది? తనకంటూ కొంత సమయాన్ని మిగుల్చుకుంటోంది. తనకు ఆసక్తి ఉన్న రాజకీయ, సామాజిక అంశాలు తెలుసుకుంటోంది. వాలెంటరీ గ్రూప్‌తో పని చేస్తోంది. నెలకి ఒక్కసారైనా ఫ్రెండ్స్‌ను కలుస్తుంది. పూర్వపు బృందానికి లంకెలా పని చేస్తోంది. నేటి అమ్మ ఏకకాలంలో అమ్మ, వ్యక్తి కూడా.80శాతం తృప్తి చాలుఆఫీసులో ప్రమోషన్ కోసం మీటింగ్ నడుస్తోంది. ఇంట్లో పిల్లాడికి జ్వరం వచ్చింది. అటు వైపు చూడాలా.. ఇటు వైపు చూడాలా? 30 ఏళ్ల అమ్మ రెండుగా చీలిపోతుంది. ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక స్వాతంత్య్రం పోతుంది. పిల్లాడిని వదిలేస్తే మనసు ముల్లు గుచ్చుకుంటుంది. అందుకే రెండూ బేలెన్స్ చేసుకుంటోంది. ‘గిల్ట్’ని పక్కన పెట్టడం నేర్చుకుంటోంది. ఆఫీసులో 100 శాతం, ఇంట్లో 100 శాతం ఇవ్వలేనని ఒప్పుకుని, రెండు చోట్లా 80 శాతం నిజాయితీగా ఇస్తోంది. ‘సూపర్ ఉమన్’ కాకపోయినా ‘తృప్తి ఉన్న అమ్మ’ అవుతోంది.నా శరీరం నా కవచండెలివరీ తర్వాత పొట్ట మీద గీతలు, జుట్టు రాలడం, నడుం నొప్పి, నిద్రలేమి. 20 ఏళ్ల వయసులోని చురుకుదనం 30కి వచ్చేసరికి మాయం. సోషల్ మీడియాలో ‘ఫిట్ మామ్’లను చూసి తనను తాను తిట్టుకోవాలా? నో. నేటి అమ్మ అలా చేయదు. అద్దంలో కనిపించే గీతల్ని ‘యుద్ధ గాయాలు’గా చూస్తోంది. వాటిని అలా ఉండనిచ్చి పిల్లాడిని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు 30 నిమిషాలు నడుస్తోంది. యూట్యూబ్ చూసి 10 నిమిషాల యోగా చేస్తోంది. ‘సైజ్ జీరో’ కాదు, ‘జీరో టెన్షన్ హెల్త్’ తన టార్గెట్ చేసుకుంది. శరీరాన్ని ద్వేషించడం మానేసి, అక్కున చేర్చుకోవడం మొదలుపెట్టింది. నేటి అమ్మ... జీవన ప్రయాణాన్ని గౌరవిస్తోంది.నేను ముద్దాయిని కానుపిల్లాడు మార్కులు తక్కువ తెచ్చుకున్నాడా... ‘అమ్మ సరిగా చూడట్లేదు’. పిల్లాడు అల్లరి చేశాడా... ‘తల్లి ఉద్యోగం చేస్తే పిల్లలు ఇలాగే ఉంటారు’. బయటి వాళ్ల మాటలు సరే... సొంత వాళ్లే ‘మా అమ్మలా నువ్వు లేవు’ అని పోలుస్తారు. 30 ఏళ్ల అమ్మ ప్రతి రోజూ బోనులో నిలబడుతుంది. అయితే ముద్దాయిలా కాదు. నిర్దోషిగా. పరాయి మాటలకు చెవులు మూసుకోవడం నేర్చుకుంటోంది. ‘నా పిల్లాడికి ఏం కావాలో నాకు తెలుసు’ అనే నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటోంది. ఫోన్ పక్కన పెట్టి పిల్లాడితో రోజూ 30 నిమిషాలు మాట్లాడుతోంది. మార్కులతో పాటు వాడితో అనుబంధం ముఖ్యమని చెబుతోంది. జడ్జిమెంట్ ఇచ్చేవాళ్లకు తన పిల్లాడి నవ్వే సమాధానం అని ప్రూవ్ చేస్తోంది.నా రేపటి చూపుపిల్లాడి స్కూల్ ఫీజు, ఇంటి ఇ.ఎం.ఐ, అత్తమామల మందులు... సంపాదనలో సగం కళ్ల ముందే కరిగిపోతుంది. ఫ్రెండ్ మంచి చీర కొనుక్కుంటే ‘నేను ఎప్పుడు కొనుక్కోవాలి’ అని 30 ఏళ్ల అమ్మ మనసు చిన్నబోతుంది. తన కలల్ని ‘తర్వాత’ అనే అరలో దాచేస్తుంది. అయితే ఎన్నాళ్లు? అందుకే అమ్మ మారింది. ‘తర్వాత’ని ‘ఇప్పుడే’గా మార్చుకుంటోంది. నెలకి కొన్ని డబ్బులైనా తన పేరు మీద సేవ్ చేస్తోంది. ఫ్రీలాన్స్ పని చేస్తోంది. ఆన్లైన్లో చీరలు అమ్ముతోంది. భర్తతో బడ్జెట్ డిస్కస్ చేస్తోంది. ‘కుటుంబం కోసం’ అనే మాటతో పాటు ‘నా కోసం’ అనే ‘అర’ను జత చేసుకుంటోంది.నా టాలెంట్ నా కల పెళ్లికి ముందు ఆమెకు ఒక కల ఉండేది. డ్యాన్సర్ అవ్వాలి, లేదా బిజినెస్ పెట్టాలి, లేదా ఒక్కతే లడాఖ్ వెళ్లాలి. పిల్లాడు పుట్టాక ఆ కలల ఫైల్ మూసేసింది. ‘ఇప్పుడు కుదరదులే’ అని తనకు తానే సర్ది చెప్పుకుంది. మరి ఇప్పుడు? తన కలలను తవ్వి బయటకు తీస్తోంది. ఉద్యోగం, పిల్లాడితో సమయం... పోగా మిగిలిన కాసేపు తన కల కోసం కేటాయిస్తోంది. ఆన్ లైన్ క్లాస్‌లో డ్యాన్స్ నేర్చుకుంటోంది. కథలు రాస్తోంది. ఇంటి నుంచే చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తోంది. భర్తతో ‘నాకూ ఒక లడాఖ్ కావాలి’ అని ధైర్యంగా అడుగగలుగుతోంది. ‘అమ్మ’ అయిన తర్వాత కలలు చావవు, విరామంతో మేల్కొంటాయి అంతే అని ప్రపంచానికి చెబుతోంది. మరి నేటి అమ్మ కదా. అమ్మా... మము కన్నందుకు పాదాభివందనందేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. తప్పు. అమ్మతో సాటి రాగల దేవుడు ఉన్నాడంటే ఆ దేవుడు కూడా అంగీకరించడు. అందుకే కవి అంటాడు... ‘అమ్మ లేకుంటే జననం లేదు, అమ్మ లేకుండా గమనం లేదు’. అవును. అమ్మ లేకుండా చేసేది ఏమి గమనం’ అమ్మ లేకుండా సాగేది ఏమి గమ్యం? అమ్మా... ఎలా సాకావు మమ్మల్ని. ‘అకలి’ అని నువ్వు ఏనాడూ అనలేదు. మా కడుపు నిండితే నీ కడుపు నిండిందనుకున్నావు. ‘స్వార్థం’ అనే భావన ఏనాడూ చూపలేదు. నీకున్నదంతా మాకే పంచి పెట్టావు. అలసిన సంగతి తెలియనిచ్చావా? తెచ్చిపెట్టుకున్న హుషారుతో మమ్మల్ని విజయాల వైపు పరుగులెత్తించావు.మేము పాసైతే నువ్వు పాసయ్యావనుకుని, మేము ఇంటర్వ్యూకెళితే నువ్వు ఉపవాసం ఉండి, మేము గెలిస్తే నీకు ప్రైజ్ వచ్చిందనుకుని మురిసిపోయే అమాయకురాలివి. ఎంత క్షమ నీకు. ఎంత ఆర్తి. ఎంత ఆర్ద్రత నీ పిల్లల కోసం. నీ ప్రతి ప్రార్థన మా కోసమే కదా. ‘మదర్స్ డే’ అని చెప్పి స్టేటస్ పెట్టి, నీతో సెల్ఫీ దిగి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తే బాధ్యత తీరిపోతుందనుకుంటున్నాం. నువ్వనే ఒక మహాకావ్యంలో మేమొక అధ్యాయమని తెలుసుకోవాలి. తెలుసుకుంటాం. కృతజ్ఞతాశ్రువులతో నీ చేతులను ముద్దాడతాం. ‘అమ్మా.. మము కన్నందుకు పాదాభివందనం’ అని నీ పాదాలు అంటి ఆశీర్వాదం తీసుకుంటాం.అమ్మా.. నీకు శతకోటి ప్రణామాలు. -
సిద్ధార్థుడి నుంచి బుద్ధుడి దాకా
మనిషిలోని క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, భయం వంటి దుర్గుణాలను ప్రోత్సహిస్తున్న కొద్దీ అవి పేట్రేగి పోతుంటాయి. వాటిని అదుపు చేయడానికి ధ్యానం ఒక మార్గం. ధ్యానమంటే మనలోకి మనం ప్రయాణించడం.మన గురించి మనం అలోచించుకోవడం. మంచి మనిషిగా బతుకుతూ మనుషులందరినీ సమానత్వ భావనతో ప్రేమించడం. పాప ప్రక్షాళన ఎలా సాధ్యం? ఒక పండితుడు తెల్లవారు జామున చలికాలంలో నదిలో మళ్ళీ మళ్ళీ మునుగుతున్నాడు. వణికిపోతూ కూడా మునిగి లేస్తున్నాడు.బుద్ధుడు:: అంతగా వణికి పోతున్నారు. అలా నీళ్ళలో మునుగుతూ ఉంటే జబ్బు పడతారుకదా?పండితుడు: నేను తెలియక చాలా పాపాలు చేశాను. ఈ పవిత్ర గంగలో 108 సార్లు మునిగితే, పాపాలు ప్రక్షాళనమవుతాయి. చేసిన పాపాలకు పరిహారం చేసుకుంటున్నాను. బుద్ధుడు: పాప ప్రక్షాళన తర్వాత, ముందు జబ్బు పడిమంచాన పడతారు. అయినా, మీ కాలి కింద కప్ప ఉంది. చూసుకున్నారా? దాన్ని చంపుతూ పాపాలు ఎలా కడుక్కుంటారూ?పండితుడు: అయ్యో చూసుకోలేదు మహాత్మా! – అంటూ, కాలు తీసి పక్కకు జరిగాడు.బుద్ధుడు: పాప ప్రక్షాళన మీరు చెప్పినట్టే జరిగితే, గంగలో ఉండే చేపలు, తాబేళ్ళూ వంటి నీటి జంతువులకు ఎప్పుడో మోక్షం దొరికేది కదా? మీ వివేకాన్ని తట్టి లేపండి! మీరు ఏమి తప్పులు చేశారో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోండి! అంతే!! సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడే వెతకాలి! నీటిలో మీరు ఎన్నిసార్లు మునిగి లేచినా, మీరు చేసిన తప్పులు ఒప్పులు కావు. తప్పు జరిగిన చోటే సరి చేసుకునే మార్గముంటుంది. దాన్ని అన్వేషించండి.పండితుడు: మహాత్మా! నిజమే మీరు చెప్పిన విధంగా చేస్తాను. నా కళ్ళు తెరిపించారు. మీకు నమస్సులు.బుద్ధుడు: అన్ని అనర్థాలకు అజ్ఞానమే కారణం. పూజల వల్ల, వ్రతాల వల్ల, ఉపవాసాల వల్ల, బలుల వల్ల అజ్ఞానం దూరం కాదు. మనిషి, తనలోని వివేచనను తట్టి లేపాలి. అప్పా దీపోభావ! మనిషి తనకుతాను దీపంగా వెలిగితే, అజ్ఞానాంధకారం దరిదాపుల్లోకి రాదు.దైవ ప్రార్థన దేనికీ? వేద వేదాంగాలు మధించిన ఒక రుషి పుంగవుడు బుద్ధుణ్ణి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ‘పూజలు, నోములు, ప్రార్థనలకు ఫలితం ఏమీ ఉండదని చెపుతున్నారట. ఇది అన్యాయం కదా బుద్దా!’బుద్ధుడు పక్కన ఉన్న నది వైపు తిరిగి ఇలా అన్నాడు– ‘మనం నదికి ఇటువైపు ఒడ్డున ఉన్నాం. అటువైపు ఒడ్డుకు చేరాలంటే ఏం చేయాలో చెప్పండి’ అన్నాడు.రుషి: నదిలో నీళ్ళు తక్కవగా ఉంటే, నడిచిపోవచ్చు. లోతుగా ఉంటే ఈదుతూ వెళ్ళొచ్చు. లేదా పడవతో నది దాటొచ్చు.బుద్ధుడు: సరే మీరు అన్నట్టు ఒకతను ఉన్నాడనుకోండి. అతను అంత దూరం నడవలేడు. ఈత రాదు. సమయానికి పడవ కూడా లేదు. అప్పుడు, దైవ ప్రార్థన మొదలు పెట్టి, ఆ అవతల ఒడ్డే తన దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాడనుకోండి. ఫలితం ఉంటుందా చెప్పండి?రుషి: ఫలితం ఎలా ఉంటుంది? వాడంతటి మూర్ఖుడు మరొకడు ఉండడని అర్థం! ఎలాగో ప్రయత్నించి నది దాటడానికి ఉపాయం ఆలోచించాలి తప్ప, అలాంటి సమయంలో దైవప్రార్థన ఎందుకు పనికొస్తుంది?బుద్ధుడు:: అయితే, ఇందాక మీరు అడిగిన ప్రశ్నను మరొకసారి గుర్తు చేసుకోండి.రుషి: అవును బుద్దా! నిజమే – మీరు చెప్పిన విషయం ఆలోచిస్తే నాకు సమాధానం దొరుకుతూ ఉంది. ప్రార్థనలతో, విశ్వాసాలతో పని జరగదు. పని జరగడానికి ఏది చేయాలో అది చేయకుండా ఊరికే చేసే దైవ ప్రార్థనలతో ఏ పనీ జరగదు. నన్ను వాస్తవంలోకి తీసుకొచ్చినందుకు ఇవే నా నమస్సులు!-ప్రొ.దేవరాజు మహారాజు , వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త -
ఊహించని వివాదాల్లో చిక్కుకుంటున్న ముద్దుగుమ్మలు
-
కత్తిదూస్తే రాణిరుద్రమలే!
వరంగల్ స్పోర్ట్స్: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. వారి తెగువ, ఆయుధ విద్యను ఇప్పటికీ ఓరుగల్లు ఆడబిడ్డలు వారసత్వంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కత్తిసాము(ఫెన్సింగ్) క్రీడ ఉనికి పదిలంగానే ఉంది. ప్రపంచ ప్రఖ్యాత క్రీడల్లో ఫెన్సింగ్ మూడో స్థానంలో నిలుస్తోంది. అభివృద్ది చెందిన నగరాలు, దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ గేమ్‌లో రాణిస్తున్నారు ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఆడబిడ్డలు. రాణి రుద్రమదేవీలా కత్తి దూస్తున్న ఆ ఇద్దరి నేపథ్యమే ఈ వారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ.అంతర్జాతీయ వేదికపై ప్రదర్శనవరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటకు చెందిన గొర్రె శ్రీజ డిగ్రీ చదువుతూ మహారాష్ట్ర సాయ్ అకాడమీలో ఫెన్సింగ్‌లో శిక్షణ పొందుతోంది. 4వ తరగతిలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో చేరిన శ్రీజ 9వ తరగతి వరకు అక్కడే చదువుతూ ఫెన్సింగ్‌లో శిక్షణ పొందింది. అనంతరం ఎన్ఐఎస్ పంజాబ్‌లో సీటు సాధించి కత్తి యుద్ధంలో ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటి వరకు 20కిపైగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో బల్గేరియా, ఇటలీలో జరిగిన చాంపియన్‌షిప్‌లో తనదైన ప్రతిభ చాటింది. ఎప్పటికై నా భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని శ్రీజ చెబుతోంది.పది పోటీల్లో ప్రతిభహనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రానికి చెందిన కడార్ల స్కావెస్లా స్పోర్ట్స్ కోటాలో ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. పదో తరగతిలో ఫెన్సింగ్‌లో శిక్షణ ప్రారంభించిన స్కావెస్లా కేవలం ఐదేళ్లలో పదికి పైగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. మరింత మెరుగైన శిక్షణ అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి వరంగల్ జిల్లాకు పేరు తీసుకొస్తానని స్కావెస్లా చెబుతోంది. -
ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
-
ఈ వీడియో చూస్తే బయట ఫుడ్ మీ జన్మలో ముట్టరు
-
అద్దె ఇల్లు కష్టాలు @హైదరాబాద్
-
ఆన్లైన్లో ట్రెండింగ్ గిఫ్ట్‌లు : ప్యార్ కా తోఫా
Ramadan 2026 విభిన్న ఆచారాలు, సంస్కృతుల నిలయం మన నగరం.. ఏ మంచి సంప్రదాయమైనా మతాలకు అతీతంగా అందరినీ ఆకట్టుకుంటుంది.. అది హలీమ్, ధమ్కా రోట్ వంటి వంటకాలు కావొచ్చు.. రంజాన్ తోఫా వంటి బహుమతులు ఇచ్చి పుచ్చుకునే పద్ధతులు కావొచ్చు.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వారిని ఒక చోట చేరుస్తున్న కార్పొరేట్ కల్చర్.. భౌగోళిక సరిహద్దులను మాత్రమే కాదు మతాల సరిహద్దులనూ తిరగరాస్తోంది. -సాక్షి, సిటీ బ్యూరో రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించి ఈద్–ఉల్–ఫిత్ర్ పండుగ సందర్భంగా పెద్దలు, పిల్లలకు తోచిన బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవ డాన్ని ‘రంజాన్ తోఫా’ లేదా ‘ఈది’ గా పిలుస్తారు. ప్రేమ, కృతజ్ఞత, స్నేహ బంధాలను బలపరిచే ఒక చక్కని సంప్రదాయంగా స్థిరపడింది. నగదు రూపంలోనో దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆట వస్తువులు, గాడ్జెట్లు వంటి బహుమతులు ఇవ్వడం ఒకరిని ఒకరు కలుసుకొని ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ బహుమతులు పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇటీవల ఈ రంజాన్ తోఫా సందడిలో భాగంగా కొత్త గిఫ్ట్ ఐడియాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా ఈ–కామర్స్ వృద్ధితో ఈద్ సమయంలో గిఫ్ట్‌ల ఎంపికలో విపరీతమైన మార్పులు చేర్పులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ ఆఫీసులు తమ ఉద్యోగుల కోసం కూడా తోఫాలను అందిస్తుండటంతో మరిన్ని కొత్త సొబగులు సంతరించుకుంటున్నాయి. ట్రెండింగ్ రంజాన్ గిఫ్ట్‌లు.. చాక్లెట్లు, అత్తర్, ప్రార్థనా మాలలతో తయారు చేసిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లు ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే ప్రత్యేక ఖర్జూరాలను అందంగా ప్యాక్ చేసి బహుమతిగా ఇవ్వడం ట్రెండ్‌గా మారింది. పేరు లేదా ఈద్ ముబారక్ మెసేజ్‌తో ఉన్న కప్పులు, ఫొటోఫ్రేమ్స్, కస్టమ్ గిఫ్ట్ బాక్స్‌లకు నగరంలో బాగా డిమాండ్ ఉంది. కుర్తాలు, హిజాబ్‌లు, అబాయాలు, షాల్స్ వంటి ఫ్యాషన్ వస్తువులు కూడా బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు.ఇస్లామిక్ సంప్రదాయంలో సువాసనలు ముఖ్యమైనవి కావడంతో అత్తర్ లేదా అరబిక్ పరిమళాలు కూడా ప్రముఖ గిఫ్ట్ ఎంపికలుగా మారాయి. (Ugadi 2026 ‘పరాభవ’అంటే అవమానం కాదు, ఇదీ అర్థం!)చంద్రతార డిజైన్లతో ఉన్న లాంతర్లు, వాల్ హ్యాంగింగ్స్, ఖురాన్ ఆయతుల్లా కాలిగ్రఫీ ఫ్రేమ్స్ వంటి డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. రంజాన్ తోఫా కేవలం బంధువుల మధ్య బహుమతులు పంచుకోవడం మాత్రమే కాదు. కొన్ని ప్రాంతాల్లో పేద ముస్లిం కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో ఆర్థిక చేయూత అందిస్తుంటారు. ఈ పండుగ సీజన్లో ఆలోచనాత్మకంగా రూపొందించిన గిఫ్ట్ బాక్సులు సిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికలో ఒకటిగా మారుతున్నాయి. నగరవ్యాప్తంగా ఇప్పుడు విభిన్న అభిరుచులు ప్రాధాన్యతకు అనుగుణంగా ఈద్–థీమ్ హ్యాంపర్లను వ్యాపార సంస్థలు ఆన్లైన్ వేదికలు రూపొందిస్తున్నాయి. కొన్ని డెజర్ట్‌లు పండుగ ప్రత్యేక వంటకాలతో నిండిన ఆహార–ఆధారిత బహుమతులపై దృష్టి సారిస్తుండగా, మరికొన్ని యాక్సెసరీలు వ్యక్తిగతీకరించిన వస్తువులతో కూడిన ఆహారేతర హ్యాంపర్లను అందిస్తున్నాయి. అందంగా ప్యాక్ చేసిన స్వీట్ల నుంచి సొగసైన మెమెంటో బాక్సుల వరకు, హ్యాంపర్లు ఈ సందర్భాన్ని జరుపు కోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రేమ, సహానుభూతి, పంచుకునే భావనను ప్రతిబింబించే చిన్న బహుమతి అయినా పెద్ద ఆనందాన్ని పంచుతుంది. రంజాన్ పండుగను మరింత అర్థవంతంగా మారుస్తుంది. ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి -
ఇజ్జత్ కా సవాల్... ట్రంప్ కు షాక్ ఇచ్చిన మిత్రదేశాలు
-
IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు
ఇంట్లో ఆడ, మగ తేడా చూపని తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీరుతున్న మహిళలు.. మహిళా దినోత్సవం రోజున మహోన్నత సత్కారాలు.. ఇది నాణేనికి ఓ వైపు కాగా.. నాణేనికి ఇంకో వైపు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిక్షణం.. అడుగడుగునా ఆకతాయిల ఆగడాలు.. కామాంధుల కర్కశత్వం.. మోసం చేయాలనే కేటుగాళ్లు.. రోజుకో లైంగికదాడి.. సమాజంలో తప్పని లైంగిక వేధింపులు.. ఎన్ని కఠిన చట్టాలున్నా.. మహిళ నేటికీ సభ్యసమాజంలో వివక్షకు గురవుతూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత క్షేమంగా ఇల్లు చేరతామన్న ధీమా లేకపోయింది.తిరుపతి సిటీ: ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. తెల్లవారకముందే దినచర్య మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అటు ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరణంలోనూ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సమాజం అనుమానపు చూపులతో చంపుతోంది. కొందరి మానవమృగాల నుంచి మహిళాలోకానికి నేటికీ ముప్పుతప్పడం లేదు. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష ప్రస్తుతం చాలా వరకు తగ్గినా, బయట సమాజంలో ఎటువంటి మార్పు కనబడలేదు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నేటి సమాజంలో మహిళల రక్షణ, వివక్ష అనే అంశంపై సాక్షి మహిళా సంఘాల నేతలతో, విద్యార్థినులతో మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి. – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్పరిస్థితుల్లో మార్పు రాలేదు మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి. – డాక్టర్ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతిఒంటరిగా వెళ్లాలంటే భయం పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించు కున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్ ఆషా, పీడీఎస్ఓ,జిల్లా కార్యదర్శి, తిరుపతి (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్)ఆ రోజు ఆర్భాటాలు.. తర్వాత షరా మామూలే.. ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని…కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్‌ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి.– పవిత్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి వివక్షకు గురవుతున్నారు ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కారి్మకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – లక్ష్మమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి -
Video: బంగారం కంటే ఖరీదైన చెట్టు.. కిలో.. రూ. కోటి
-
క్యాన్సర్‌కు ఆన్సర్!
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. డయాబెటిస్, బీపీ మాదిరిగానే క్యాన్సర్‌తో కూడా దీర్ఘకాలిక మనుగడ సాగించవచ్చు.ఏఐ, రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పని పడుతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసిన్, ప్రోటాన్ బీమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురి తప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి . వీటి ఫలితంగా క్యాన్సర్‌కు ఆన్సర్ దగ్గరలోనే ఉంది.ఇమ్యూనో థెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే ‘హైపర్ పర్సనల్’ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్‌ను మరింత సమర్థంగా ియంత్రించగలుగుతాయి.క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తుంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతోంది. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతోంది. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాల రూపకల్పన కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.చాలా రకాల క్యాన్సర్లలో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్, సర్వినిన్, పీ53 ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని, వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్లను అరికట్టే వ్యాక్సిన్లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్‌కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే!‘క్యాన్సర్‌కు ఆన్సర్ ఉండదు’ అనేది ఇదివరకటి మాట. ఇప్పుడది దాదాపు అపోహ. వైద్యశాస్త్రం శరవేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కళ్లేలు వేయగలుగుతోంది. పలు రకాల క్యాన్సర్లను సమూలంగా నయం చేయగలుగుతోంది. కొన్ని రకాల క్యాన్సర్లు సోకకుండా వ్యాక్సిన్లను తయారు చేయగలుగుతోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను, చికిత్స విధానాల్లోను వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్‌కు ఆన్సర్‌గా ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్లను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్‌ను జయించడం ఏమంత కష్టం కాదనేంత వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, అరికట్టడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోతపెట్టి, బయాప్సీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు కోతతో పనిలేకుండా, రక్తపరీక్ష ద్వారా జరిపే ‘లిక్విడ్ బయాప్సీ’, శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగల ‘బ్రీతలైజర్లు’ వాడుకలోకి వచ్చాయి.క్యాన్సర్ రోగులను యమయాతనకు గురిచేసే కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఇమ్యూనో థెరపీ’తో చాలామంది క్యాన్సర్ నుంచి విజయవంతంగా కోలుకోవడం సాధ్యం అవుతోంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్తులోనే కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించడం; ఇంకొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం; మరికొన్ని రకాల క్యాన్సర్లను ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకుందాం...లిక్విడ్ బయాప్సీ‘కోవిడ్–19’ తర్వాతి కాంలలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ‘లిక్విడ్ బయాప్సీ’ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్‌ను ముందుగా నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్తనమూనాలోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లను విశ్లేషించి, రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు ‘లిక్విడ్ బయాప్సీ’ దోహదపడుతుంది. దీని వల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి, ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోతపెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకునే చేసే బయాప్సీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా, రోగనిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది.ఏఐ ఆధారిత పాథాలజీక్యాన్సర్ నిర్ధారణకు సీటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, మామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తుంటారు. వీటిని విశ్లేషించి, చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్స్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ చాలా సులభతరంగా మారింది. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా క్యాన్సర్లను త్వరితగతిన గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతోంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వైద్యులు మరిన్ని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) పరీక్షలుఇవి కూడా ‘లిక్విడ్ బయాప్సీ’ మాదిరి పరీక్షలే! ఒకే రక్తనమూనాను పరీక్షించడం ద్వారా యాభైకి పైగా క్యాన్సర్లను ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవలి కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటివల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి, ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధిని నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్తనమూనాల ద్వారా డీఎన్ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు యాభైకి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక విప్లవాత్మకమైన పరిణామం.జీనోమిక్ ప్రొఫైలింగ్– ప్రెసిషన్ ఆంకాలజీక్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవలి కాలంలో అధునాతనమైన మాలిక్యులర్, జీనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవకణాల్లోని జన్యువుల్లో క్యాన్సర్‌కు దారితీసే ఉత్పరివర్తనలను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో రోగికి వారి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ చికిత్సను అందించగలుగుతున్నారు. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వల్ల క్యాన్సర్ రోగులను మృత్యువాత పడకుండా కాపాడగలుగుతున్నారు.డిజిటల్ బయో మార్కర్స్ఇటీవలి ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, బయాప్సీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటి ‘బయో మార్కర్స్’ను హైరిజల్యూషన్ డిజిటల్ ఇమేజెస్‌గా మార్చడం వీలవుతోంది. డిజిటల్ బయో మార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడానికి, వారి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయో మార్కర్స్ ఇమేజెస్‌ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి, వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతోంది. దీని వల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలపై చికిత్స పొందడం సాధ్యమవుతోంది.క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు ఆశాజనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి, రోగుల జీవితకాలాన్ని పొడిగించడానికి దోహదపడుతున్నాయి. ఇదివరకు క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో మరిన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...సీఏఆర్–టీ సెల్ థెరపీలుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లను అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ‘కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ–సెల్ థెరపీ’ (సీఏఆర్–టీ సెల్ థెరపీ). ఇది కూడా ఇమ్యూనో థెరపీలో ఒక విధానం. అయితే, ఇది వ్యక్తిగత చికిత్స విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధకతకు దోహదపడే ‘టీ–సెల్స్’కు జన్యుమార్పులు చేసి, రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.టార్గెటెడ్ థెరపీకీమో థెరపీ, రేడియో థెరపీలలో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ‘టార్గెటెడ్ థెరపీ’ని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఇవి హాని చేయవు. టార్గెటెడ్ థెరపీతో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతోంది.ప్రెసిషన్ రేడియేషన్ థెరపీరేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్‌కు గురిచేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ కిరణాలను కచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో కచ్చితత్వం గణనీయంగా పెరిగి, రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గి, రోగి కోలుకునే అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి.నానో మెడిసిన్క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్స్‌లో 1–100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగం మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బేస్డ్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీలో నానో సాంకేతికత వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.రోబోటిక్ క్యాన్సర్ సర్జరీక్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత కచ్చితత్వం సాధిస్తోంది. హైడెఫినిషన్ త్రీడీ కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితులను గుర్తించి, తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో పని చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితులను తొలగించగలుగుతున్నాయి. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతోంది. ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, అండాశయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ సత్ఫలితాలను సాధిస్తోంది. ప్రోటాన్ బీమ్ థెరపీరేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్–రే రేడియషన్ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యకరమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో ప్రోటాన్ కిరణాలు అత్యంత కచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకు ప్రసరించి, అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హానీ జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి అవకాశం ఉండటం మరో సానుకూలత. దీని వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం లేకుండా, విడతలు విడతలుగా క్యాన్సర్ కణితిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నెముక, కన్ను, ప్రొస్టేట్, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.మరిన్ని చికిత్స పద్ధతులుక్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్స పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’, ‘ఎపిజెనెటిక్ థెరపీ’ వంటి పద్ధతులపై ప్రయోగాలు జరుపుతున్నారు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’లో జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిని మెలనోమా వంటి చర్య క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ‘ఎపిజెనెటిక్ థెరపీ’లో క్యాన్సర్‌కు కారణమయ్యే ఉత్పరివర్తలను లోనైన జన్యువులను గుర్తించి, వాటి డీఎన్ఏను మార్చకుండానే, ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పరివర్తనలను వెనక్కు మళ్లిస్తారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్ససమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతులను కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా ‘హైపర్ పర్సనలైజ్డ్’ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి, ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో పలు అధునాతనమైన ఔషధాలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా, పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదు. అందువల్ల క్యాన్సర్‌ను దీర్ఘకాలం నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధాలను, చికిత్స విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించ లేకపోయినా; డయాబెటిస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా చేయవచ్చని చెబుతున్నారు.క్యాన్సర్ వ్యాక్సిన్లుపలు రకాల క్యాన్సర్లను నిరోధించడానికి వీలుగా ఇటీవలి కాలంలో ‘ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రొటీన్లకు అనుగుణంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. -పన్యాల జగన్నాథదాసు -
ఈ-పాస్‌పోర్టు ఉంటే..క్యూలేకుండానే సెక్యూరిటీ చెక్
విదేశీ ప్రయాణాలు చేసేవారికి గమ్యస్థానానికి చేరుకున్నాక ఇమిగ్రేషన్ చెక్, ఇతరత్రా తనిఖీలు తెలియనిది కాదు..! కొన్ని సందర్భాల్లో ఈ తనిఖీల కోసమే చాంతాడంత క్యూలైన్లో గంటల తరబడి నిలబడాల్సి ఉంటుంది..! కానీ, ఇటీవల భారత్ అమల్లోకి తెచ్చిన ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు మాత్రం ఇలాంటి క్యూలైన్లలో నిలబడకుండానే.. చాలా సులభంగా విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈ-పాస్‌పోర్టు విదేశీ ప్రయాణికుల ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. కొత్త పాస్‌పోర్టు దరఖాస్తుదారులతోపాటు.. రెన్యూవల్ చేయించుకునేవారు కూడా ఇప్పుడు ఈ-పాస్‌పోర్టుకు జైకొడుతున్నారు. సాధారణ పాస్పోర్టుతో పోలిస్తే.. ఈ-పాస్‌పోర్టులో ఓ మైక్రోచిప్ ఉంటుంది. అందులో పాస్‌పోర్టుదారుడి వేలిముద్రలు, ఫొటోలు, ప్రయాణ వివరాలు.. ఇలా అన్నీ డిజిటల్‌గా రికార్డ్ అయ్యి ఉంటాయి. అలాగని ఈ చిప్‌కు హ్యాకింగ్ బెడద ఉండదు. ఎందకంటే.. ఇది పూర్తిస్థాయిలో ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. చూడ్డానికి సాధారణ పాస్‌పోర్టు మాదిరిగానే ఉన్నా.. పాస్‌పోర్టు కవర్‌పై చిన్న బంగారు చిహ్నంతో మైక్రోచిప్ ఉండడం ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకం. మన దేశంలో 2024 ఏప్రిల్ నుంచి ఈ-పాస్‌పోర్టు జారీ ప్రారంభమైంది. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతోపాటు.. 120 దేశాల్లో ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉంది.అసలు ఈ-పాస్‌పోర్టు ప్రత్యేకత ఏంటంటే.. పాస్పోర్టుదారుడు బయోమెట్రిక్ అందజేస్తే తప్ప.. ఇందులోని వివరాలు ఇమిగ్రేషన్ అధికారులు యాక్సెస్ చేయలేరు. ఇందులో బీఏసీ.. అంటే బేసిక్ యాక్సెస్ కంట్రోల్, పాసివ్ అథెంటికేషన్, ఎక్స్టెండెడ్ యాక్సెస్ కంట్రోల్ వంటి అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఫలితంగా.. విమానాశ్రయాల్లో తనిఖీ సులభతరమవుతుంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఇతర తనిఖీ అధికారులు ఈ-పాస్‌పోర్టులోని సమాచారాన్ని అనుమానించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. వ్యతిగత సమాచార తస్కరణ, వివరాల ట్యాంపరింగ్ ఇందులో అసాధ్యం కాబట్టి..! ఈ-పాస్‌పోర్టును ట్యాంపర్ చేయడం.. వివరాలను మార్చడం వంటి మోసాలు అంత సులభం కాదు. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఆమోదించిన ప్రమాణాల ప్రకారం ఈ-పాస్‌పోర్ట్‌లను భారత్ జారీ చేస్తోంది. అందుకే.. 120 దేశాలకు ఈ-పాస్‌పోర్టులను యాక్సెస్ చేసే వ్యవస్థ ఉంది. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఉన్నవారు 120 దేశాల్లో ఎక్కడా కూడా తనిఖీల కోసం క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు.విదేశీ ప్రయాణాల్లో ఇమిగ్రేషన్ ప్రక్రియ చాలా మందికి శిరోభారాన్ని తెచ్చిపెడుతుంది. భారత్‌నుంచి బయలుదేరేప్పుడే ఐఎంఆర్సీ అవసరమా? కాదా? వెళ్లబోతున్న దేశంలో మాట్లాడే భాషపై అవగాహన ఉందా? ఇంగ్లిష్ ఎలా ఉంది? అనే వివరాలను తనిఖీ చేయడం తెలిసిందే..! ఈ-పాస్‌పోర్టు విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ-పాస్‌పోర్టు విధానం అమల్లో ఉండే గమ్యస్థాన దేశాన్ని చేరాక కూడా.. సాధారణ పాస్‌పోర్టుదారులకు భిన్నంగా సపరేట్ క్యూలైన్ ఉంటుంది. ఈ క్యూలో తనిఖీలు వేగంగా జరుగుతాయి. సాధారణ పాస్పోర్టుదారుల క్యూలో మాత్రం ఒకరి తనిఖీ పూర్తయ్యాకే.. మరొకరిని తనిఖీ చేస్తారు. అంటే.. ఈ-పాస్‌పోర్టు ఇప్పడు ఇమిగ్రేషన్ విధానాన్ని చాలా సులభతరం చేసిందన్నమాట..! -
అమెజాన్ అడవుల్లో కొత్త తెగ గుర్తింపు.. వీళ్లు ఏం చేస్తారంటే..?
ప్రకృతి సౌందర్యానికి అమెజాన్ అడవులు పెట్టింది పేరు..! అనకొండ వంటి ఎన్నెన్నో హాలీవుడ్ చిత్రాలకు ఈ అడవులు ఫేమస్..! చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదువుకునే చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి అమెజాన్‌కు సొంతం. అలాంటి అడవిలో ఎన్నెన్నో తెగలుంటాయి. ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని ఓ కొత్త తెగ వివరాలు తాజాగా వెలుగు చూశాయి. అమెజాన్ అడవులపై పరిశోధనలు జరుపుతున్న పర్యావరణవేత్త పాల్ రోసాలీ డ్రోన్ కెమెరాలతో దట్టమైన అటవీ ప్రాంతాలను.. సెలయేళ్లను.. కొండాకోనలను జల్లెడపడుతున్నారు. హెచ్డీ కెమెరాలకు ఇటీవల ఓ అరుదైన దృశ్యం చిక్కింది. దాంతో.. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఓ గిరిజన జాతి ప్రజల ఉనికి వెలుగులోకి వచ్చింది. అంతే.. పాల్ రోసాలీ తన డ్రోన్ కెమెరాలతో ఆ తెగ ప్రజల జీవన శైలిని తెలుసుకునేందుకు చాలా రోజులు శ్రమించారు. ఫలితంగా.. ఆ తెగ సామాజిక పరిస్థితులు, సామూహిక వేడుకలు, అడవుల్లో లభించే చెట్ల నారతో.. చేత్తో తయారు చేసిన దుస్తులు.. ఇలా ఎన్నో విశేషాలను మన ముందు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా బయటపడని తెగలు 200 వరకు ఉంటాయని.. అమెజాన్‌లో తాజాగా వెలుగు చూసిన తెగ అందులో ఒకటని పాల్ రోసాలీ చెబుతున్నారు.ఈ తెగ ఇప్పుడు అక్రమ మైనింగ్ కారణంగా అంతరించిపోయే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గరింపెరోస్ పేరుతో బ్రెజిల్లో ఇలాంటి అక్రమ మైనింగ్‌లు సాధారణమే. ఈ మైనింగ్ వెనక శక్తిమంతమైన మాఫియాలున్నాయి. లూలా డా సిల్వా అధికారంలోకి వచ్చాక.. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు హెలికాప్టర్లతో పెట్రోలింగ్ జరుగుతున్నా.. గిరిజన జాతులకు ప్రమాదం ఏమాత్రం తగ్గలేదని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. వ్యవసాయం పేరుతో అడవులను నాశనం చేస్తున్నారని, సొయాబీన్, ఆయిల్‌పామ్ సాగు, పశువుల పెంపకం అమెజాన్‌లో విస్తృతమవుతోందని చెబుతున్నారు. ఇలాంటి పంటల కోసం అమెరికా, ఐరోపాలోని బడా బ్యాంకులు సైతం బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. ఈ సహజ సంపద దోపిడీ కారణంగా 2050 నాటికి అమెజాన్ అడవులు చాలా వరకు కుంచించుకుపోతాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి.తాజాగా కనుగొన్న తెగకు అక్రమ మైనింగ్‌తోపాటు.. మరో ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాహ్య ప్రపంచ వ్యక్తులు వీరిని కలిస్తే.. ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారంలో పురుగుమందు అవశేషాలుండడం తెలిసిందే..! ప్రకృతి ఒడిలో ఆర్గానిక్ ఫుడ్ తింటున్న ఈ తెగకు.. మన ఆహారాన్ని గనక ఇస్తే.. అది వారిపాలిట విషంలాంటిదే అంటున్నారు. ఇక బయటి వ్యక్తులు ఈ తెగను సంప్రదిస్తే.. ఇన్‌ఫ్లూయెంజా, మీజిల్స్ వంటి వ్యాధులు ప్రబలి, తెగ ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో దూరంగా ఉండే తెగలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, సాధారణ జలుబు, వైరస్లు కూడా ఈ తెగ అంతానికి కారణమవ్వొచ్చని హెచ్చరిస్తున్నారు. -
గతానికి, భవిష్యత్‌కి వెళ్లగలమా?
ప్రపంచంలో ఎలాంటి మీడియా లేదు.... ఎలాంటి రికార్డింగ్ లేదు....కానీ ఒక మాట అందరి నోటా ఉంది. మనం space-time(కాల కొలమానం) ను adjust చేసి... టైం ట్రావెల్ చేయొచ్చా? అంటే.... మనం కాలాన్ని సెట్ చేసి... గతంలోకి లేదా భవిష్యత్తులోకి వెళ్లగలమా? , గణాంకాల ప్రకారం... సిద్ధాంతపరంగా ఒక వస్తువును లేదా వస్తువులను 99.9999% కాంతివేగం వరకు తీసుకెళితే time dilation(కాల వ్యత్యాసం) జరుగుతుంది....కాలం నెమ్మదిస్తుంది.... ఆ స్పీడ్‌లో టైం ట్రావెల్ సాధ్యమే కానీ.. అక్కడి వరకు వెళ్లడం ప్రస్తుతానికి అసాధ్యమే అని చెప్పవచ్చు. భవిష్యత్తులో సాధ్యం కావచ్చు కూడా... 19వ శతాబ్ధం వరకు మన పూర్వీకుల గురించి మనం విన్నామే తప్ప వారి దినచర్యలు... కార్యకలాపాలు... వారి అసలు రూపాలు మనం చూడలేదు. ఆ తర్వాత క్రమేణా విగ్రహాలు... రాతి బొమ్మలు... ఆ తర్వాత కెమెరా... ఫోటోలు.. వీడియోలు వచ్చేశాయి. అంతకు ముందు వారికి దీని గురించి తెలియదు. ఇక 21వ శతాబ్ధంలో అధునాతన టెక్నాలజీ రావడంతో ప్రతి విషయం రికార్డెడ్‌గా మారింది. అంటే భవిష్యత్ తరాల వారికి మనం ఇప్పడు జీవిస్తున్న తీరు... మన చర్యలు.. మనకు సంబంధించి ప్రతి విషయం తెలిసే అవకాశం ఉందనడంలో సందేహం లేదు. అంటే ఇప్పటి తరం గతంలోకి వెళ్లలేకపోయినా... రాబోయే తరాలు సోషల్ మీడియా ద్వారా భూతకాలంలోకి వెళ్లి చూసే అవకాశముంది. ఇది వినడానికి అంత వింతగా కనిపించకున్నా... భవిష్యత్తులో మాత్రం ఎన్నో ప్రయోగాలకు మూలం కానుంది. అయితే టైమ్ ట్రావెల్ కూడా ఇలాంటిదే అని చెప్పవచ్చు... Time travel ఒక science fiction మాత్రమే అయితే.... CERNలో శాస్త్రవేత్తలు వెదుకుతున్నదేంటీ? , Time travel అసాధ్యం అయితే.... 13 బిలియన్ డాలర్లు వెచ్చించి Large Hadron Collider ఎందుకు నిర్మించారు? , వాస్తవంగా కాలం కన్నా ముందు... కాలానికి వెనక్కి మనం ప్రయాణించడానికి ఆస్కారం లేకుంటే 150 ఏళ్ల నుంచి సాగుతున్న పరిశోధనల సారం ఏంటీ?, పరిశోధనలకు అనుగుణంగా కాంతి వేగానికి సమాన వేగంతో ప్రయాణించే సాధనాల సంసిద్ధత అవసరముందని శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పారు.Laser ring తో time machine ఎందుకు తయారు చేసి ప్రయోగించారు. ఇప్పటికీ అలాంటి కొన్ని వేల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దీంతో మనకు అర్థం అయ్యేదేమిటంటే.... Time travel వెంటనే కాకున్నా.... మరి కొన్ని పరిశోధనల తర్వాత... రాబోయే తరాల సాంకేతికతతో సాధ్యమయ్యే అవకాశముంది. టైమ్ ట్రావెల్ సాధ్యమే అని 2017లో Stephen Hawking అన్నాడు. సాంకేతికత కాకుండా... వాస్తవికతతో పరిశీలిస్తే... ప్రతి రాత్రి మనం నిద్రపోతే.... నిద్రలో కలల్లో భవిష్యత్తును కూడా చూస్తుంటాం... ఊహకందని విషయాలు... వింతలు చూసి తిరిగి వర్తమానంలో మేల్కొంటాం. ఇది ఓ రకమైన టైం ట్రావెల్ అని చెప్పవచ్చు. కలలో పెద్ద పెద్ద పనులు కొన్ని సెకన్లలో జరుగుతున్నట్లు అనిపిస్తుంది... కానీ మేల్కొన్న తర్వాత అసాధ్యమనిపిస్తుంది. అంటే మనం నిద్ర పోయి time travel చేస్తున్నట్టే కదా? ప్రతి రాత్రి మన ఆత్మ వేరే dimension లోకి వెళ్తుంది, అక్కడి కాలం వేరేలా ఉంటుంది. తిరిగి మన ప్రపంచంలో మేల్కొంటాం.ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1905లో రిలేటివిటీ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. రిలేటివిటి సిద్దాంతం కూడా కాలానికి సంబంధించి కచ్చితత్వం లేదని చెప్పారు. ఇంటర్ స్టెల్లార్ సినిమాలో మాథ్యూ మెక్ కానవే పాత్ర black hole దగ్గర ఒక గ్రహంపై ఒక గంట గడుపుతుంది.... కానీ భూమిపై 23 సంవత్సరాలు గడుస్తాయి. ఇది కాల వ్యత్యాస ఉదాహరణగా చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ కోసం speed of light(కాంతి వేగం) కంటే ఎక్కువ వేగం కావాలి. కానీ mass(ద్రవ్య పరిమాణం) ఉన్న ఏ వస్తువూ శక్తి లేకుండానే speed of light చేరలేదు... అది చేరాలంటే infinite energy అవసరం అని... శాస్త్రవేత్తలు చెప్పారు. Einstein తో పాటు Nathan Rosen కూడా worm holes(సిద్ధాంతాత్మక మార్గం) గురించి చెప్పారు. Worm holes... space-timeలో shortcuts కావచ్చు. అంటే రెండు దూర ప్రాంతాలను కలిపే ఓ పైపు లేదా సొరంగం లాంటి చర్య అని చెప్పవచ్చు. ఒక stable wormhole కోసం Milky Way galaxy మొత్తం mass కంటే ఎక్కువ energy కావాలి. ఆ ఎనర్జీ ఉంటే టైం ట్రావెల్ సాధ్యమే అని చెప్పవచ్చు. కానీ ఎనర్జీ ఏకీకృతం చేయడానికి ఇంకా సమయం పట్టవచ్చు. 1974లో Frank Tipler అనే శాస్త్రవేత్త.... rotating cylinder concept(భ్రమించే సిలిండర్ సూత్రం) ఇచ్చాడు. Infinite density.... length తో cylinder space-time ను curve చేస్తుంది. అంటే కాలం భవిష్యత్తు... భూతకాలం... వర్తమానానికి తిరుగుతుందని ఓ సూత్రం చెప్పారు. అయితే దానిపై అంతగా ఫోకస్ జరగలేదు. 2001లో Ronald Mallett అనే ఆయన laser beams తో space-time twist చేయడం ప్రతిపాదించాడు. Research ఇంకా కొనసాగుతోంది... ఫలితం ఇంకా రాలేదు. CERN లో particles ను 99.99% speed of light వద్ద collide చేస్తారు. Time dilation( కాల వ్యత్యాసం) జరుగుతుంది, particleకి సంబంధించిన lifetime పెరుగుతుంది. మనుషుల కోసం ఇది practical కాదు.... కేవలం spiritual మాత్రమే. ఎందుకంటే టైమ్ ట్రావెల్ శక్తి ప్రస్తుతం మనుషులకు అసాధ్యమే అని చెప్పవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం సాధ్యమని భావిద్దాం. -
Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే
-
జెన్ జడ్ గురించి మీకు తెలుసా?
జెన్ జడ్ గురించి మీకు తెలుసా? ఇదేదో పదం కాదు.. ఓ తరం. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో పుట్టిన... ఈ సాంకేతికను అలవర్చుకున్న... చిన్న నాటి నుంచే టెక్నాలజీని వాడుతున్న జనరేషన్‌నే జెన్‌జడ్ అని... అంటే జనరేషన్ జడ్ అని పిలుస్తారు. ముందటి తరాలకు భిన్నంగా... కొత్త ఆలోచనలు... దానికి మించి... ఆన్లైన్ సాంకేతికత... అధిక టెక్నాలజీ వినియోగంతో దూసుకెళ్తున్న తరమే జెన్ జడ్. ఆ తరం ఆలోచనా విధానం... సవాళ్లను ఎదుర్కొనే మనస్తత్వం... పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి వారు అనుసరించే విధి విధానాలు....సున్నితత్వం.. ఆత్మాభిమానం... ఆవేశం లాంటి అంశాలపై గత తరాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న జెన్ జడ్ తీరు గురించి మనో వైజ్ఞానిక వేత్తలు జరిపిన పరిశోధనల ఆధారంగా వారి తీరు తెన్నులపై ఓ సారి ఫోకస్ చేద్దాం.జన్ జడ్ తరాన్ని ఓ రకంగా గమనిస్తే 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారిగా గుర్తించవచ్చు. ఆ తరాన్ని సాధారణంగా "జూమర్స్..., "ఐ జనరేషన్"...., "డిజిటల్ స్థానికులు".... అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వారు చాలా చిన్న వయస్సు నుండే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహనతో పెరిగిన మొదటి సామాజిక తరంగా చెప్పవచ్చు. జన్‌జడ్‌లో దాదాపు 12 నుంచి 30 ఏళ్ల వరకు వయస్సున్న వారే ఉన్నారు. అంటే ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు చిన్నప్పుడే మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు చేతబట్టుకున్నారు. ఇప్పటి వరకు వారి జీవితమంతా అంటే చిన్ననాటి నుంచి చివరివరకు టెక్నాలజీ, ఆన్ లైన్ వీడియోలు, సోషల్ మీడియాకు అలవాటు పడిపోయారు. దాంతో వారి ప్రపంచ దృక్పథం.. వారు చూసే కోణాలు.. వారి కమ్యూనికేషన్ విధి విధానాలు సాధారణ పౌరులకు భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. అంటే అంతకు ముందు తరం గురించి మాట్లాడితే.... పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, విద్య, సామాజిక దృక్పథం వంటి విషయాలను వంట బట్టించుకున్నారు. జన్ జడ్ లో ఉన్న వారిని ప్రశ్నించగానే గూగుల్ వెదకటం, చాట్ జీపీటీని అడగం.... లేదా ఏఐతో ఏదైనా సాధ్యం అని భావించడంతో పాటు కొత్తగా సృష్టించడం... కొత్త ఆలోచనలను బహిరంగ పరచడం లాంటివి అలవర్చుకున్నారు. తరంలో వచ్చిన మార్పు సాంకేతిక పరంగా ఆహ్వనించదగ్గ పరిణామమే... దీంతో వారి మనస్సులు... వారి సామాజిక స్పృహ... ఆరోగ్య అంశాలపై వారికున్న అవగాహన... వారిని మరింత తీర్చి దిద్దుతోంది. ఈ మార్పు సత్ఫలితాలనిస్తాయనడంలో సందేహం లేదు. జన్జడ్ తరానికి సంబంధించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ముఖ్యంగా... కొత్త తరం... కథలకు కాకుండా వాస్తవాలకు విలువనిస్తారు. ఆరోగ్య విషయాల్లో పాత తరాలకన్నా... ఎక్కువగా ఆలోచిస్తారు... చర్చిస్తారు. చెడు అలవాట్ల విషయంలో జాగ్రత్త పడటం... దూమపానం, మద్యపానంపై ఆసక్తి చూపకపోవచ్చు. తరచుగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు, విద్య.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అంతే కాకుండా Gen Z లో చాలా వరకు వ్యక్తులు సొంతంగా అవకాశాలు అంది పుచ్చుకోవడం... సొంతంగా ఏదో చేయాలన్న తపన, కొత్త వాటిని ఆవిష్కరించడం, సృష్టించడం... ఇ-కామర్స్ బ్రాండ్స్, డిజిటల్ కంటెంట్లు, స్టార్టప్‌లు సష్టించడం, వంటి సొంతంగా గుర్తింపు పొందే ఆసక్తి కలిగి ఉంటారు. జెన్ జెడ్ తరం వారిలో బహిరంగంగా మాట్లాడటం.... భయం లేకుండా ప్రవర్తించడం... కొందరు అంతర్గతంగా చాలా సున్నిత మనస్కులైనప్పటికీ... మానసికంగా బలంగా ఉంటారు. దాన్ని వారు బలహీనత అని చెప్పకుండా అవగాహన అని చెప్పుకుంటారు. వారిలో చాలామంది సామాజిక సమస్యలను చర్చించడానికి, ఆర్థిక అస్థిరత, ప్రపంచ సంక్షోభాలు, మునుపటి తరాలు పట్టించుకోని... లేదా సాధ్యం కానివని వదిలేసిన కార్యకలాపాలు.. పాత తరం వారి ఆలోచనలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తారు. జెన్ జడ్ తరం మానసికంగా బలంగా ఉంటారు... భావోద్వేగాలకు తావు లేకుండా... బాధను వ్యక్తీకరించడం... ఆ బాధను తగ్గించే దారులు వెదుక్కుంటారు.... సమస్యలు, బాధలతో సతమతమయ్యే పాత తరపు ఆలోచనలు పట్టించుకోకుండా... వాటిని అడ్డంకులుగా భావించి కొట్టిపారేస్తూ పాత తరం ఆలోచనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు.ఆన్ లైన్లో చర్చల ద్వరా సమాజం అవగాహన, రాజకీయాలపై మక్కువ... ఆర్థిక అసమానతలపై చర్చలు... ప్రపంచ సమస్యలు, సామాజిక అన్యాయాలు, అవాస్తవిక అంశాలు, జీవన ప్రమాణాలపై నిరంతర అవగాహన... చర్చలు సాగుతుంటాయి. అంతే కాకుండా సొంతంగా ఆలోచనలు... వాటిని అమలు పర్చడానికి దారులు వెదుక్కుంటారు. శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.వాతావరణంలో మార్పుల ప్రభావం... ఆర్థిక అస్థిరత, విద్యా ఒత్తిడి కారణంగా అధిక ఒత్తిడి స్థాయిలను జయిస్తారు. ఉద్యోగాలు, భవిష్యత్తు అవకాశాలపై అనిశ్చితి వారిని మరింత జాగ్రత్త పడేలా చేస్తుంది. పోటీ పెరిగినందువల్ల వారు తమ భావాలను నిర్భయంగా బయటపెట్టడం... తద్వారా తమ గురించి బయట ప్రపంచానికి చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాగే డిజిటల్ ఎక్స్పోజర్... అంటే సోషల్ మీడియా ద్వారా తమను తాము పోల్చుకోవడం... ఇతరుల కంటే భిన్నంగా ఏం చేయగలమనే ఆలోచనలు... కలిగి ఉంటారు. కొత్త తరం ఆలోచనా విధానాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆహ్వనిస్తోంది. భావాల వ్యక్తీకరణ... బలహీనత కాదు... అది అవగాహన అని చెబుతున్నారు. భావాలను దాచడం కంటే వ్యక్తపరచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని.... గత తరాలు మౌనంగా ఉండటం నేర్చుకున్నాయి... కానీ జెన్‌జడ్ తరం మాత్రం స్వీయ సంరక్షణ.... తమ ఆలోచనలు, విధివిధానాలు బహిరంగ పరుస్తున్నాయి. జెన్‌జడ్ సున్నితత్వం కాదు... ధైర్యం అని... వారు వాస్తవ పరిస్థితులను జీర్ణించుకుని సమాజానికి కొత్త భావాన్ని నేర్పుతున్నారని మనో వైజ్ఞానిక నిపుణులు చెబుతున్నారు. -
కోడిని చంపినట్లు భర్తలను చంపుతున్న భార్యలు
-
నువ్వే కావాలి.. మళ్లీ రావాలి
సాక్షి, రాజమహేంద్రవరం: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్‌ల కటింగ్‌తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు.ఇదీ సంక్షేమం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘నవరత్నాలు’ పేరిట తొలుత అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, చేయూత, రుణమాఫీ, పింఛను కానుక తదితర 9 రకాల పథకాలను జగన్ తీసుకొచ్చారు. వాగ్దానం చేసినవే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేశారు. తన పాలనా కాలంలో మొత్తం 33 పథకాల ద్వారా జిల్లా ప్రజలకు రూ.25,436 కోట్ల మేర సంక్షేమాన్ని అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కడా పైసా లంచం ఇవ్వనవసరం లేకుండానే.. పార్టీ, వర్గం, కులం అనే భేదం చూడకుండా.. కేవలం అర్హతే ప్రామాణికంగా.. వలంటీర్ల ద్వారా గడప వద్దనే సంక్షేమాన్ని అందించారు. వివిధ ధ్రువీకరణ పత్రాల జారీని సైతం సచివాలయాల ద్వారా సులభతరం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు అందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్బాంధవిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో సైతం చికిత్స పొందే వెసులుబాటు కల్పించారు. ప్రగతి గురుతులు పల్లెల ప్రగతికి ఎనలేని తోడ్పాటునందించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, జగనన్న కాలనీలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు రూపుదిద్దుకున్నాయి. మన బడి నాడు – నేడు పథకం ద్వారా 1,069 పాఠశాలల్లో భవనాల నిర్మాణానికి, ఇతర వసతుల కల్పనకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, జగనన్న విద్యా కానుక కింద నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, షూస్, సాక్స్, బెల్టులు, మంచి బ్యాగ్‌ల వంటి వస్తువులు అందజేశారు.68,518 మంది పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.1,233.34 కోట్లు ఖర్చు చేశారు. 3,079 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు, 279 రైతు భరోసా కేంద్రాలకు రూ.52.31 కోట్లు, 208 హెల్త్ క్లినిక్‌లకు రూ.38.17 కోట్లు వెచ్చించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన 1,443 పనులకు రూ.52.89 కోట్లు ఖర్చు చేశారు. 15,369 చిన్న పరిశ్రమలకు రూ.670.85 కోట్ల మేర రాయితీలు అందజేశారు.గత టీడీపీ ప్రభుత్వంలో అధ్వానం 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కావాలంటే వారు టీడీపీ వారో లేక ఆ పార్టీ సానుభూతిపరులో అయి ఉండాలి. టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసు తప్పనిసరి. ఆపై పథకానికి ఇంత అని రేటు నిర్ణయించి మరీ వసూలు చేసేవారు. ఆ తరువాత కూడా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి. వారు చెప్పిన మొత్తం ముట్టజెప్పకపోతే పథకం అందేది కాదు. రూపురేఖలు మారబడిదేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్‌తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కలి్పంచారు. అప్పటి వరకూ యూపీ స్కూల్‌గా ఉండగా.. దీనిని జెడ్పీ హైసూ్కల్‌గా అప్‌గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి. పాఠశాల బాగుంది నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది. – మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి, జెడ్పీ హైసూ్కల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం -
అమ్మకు ‘కట్టుబాటు’
ఆమె తానొక స్త్రీ అనే మర్చిపోయింది. పల్లెటూళ్లో ఒక గొడ్డులా కష్టపడి ఇద్దరు కొడుకులను సాకింది. పల్లెటూరి పలుకుబడి... పల్లెటూరి కట్టుబడి... ఇవి మాత్రమే ఆమెకు తెలుసు. కొడుకు ప్రయోజకుడై నగరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ తల్లికి ఒక కండిషన్ పెట్టాడు. ఆమె సంస్కృతిని తక్కువ చేస్తూ బట్టలు కట్టుకునే పద్ధతి మార్చుకోవాలన్నాడు. తమిళంలో తాజాగా విడుదలైన ‘అంగమ్మాల్’ ఆలోచనలు రేకెత్తిస్తోంది.జీవితాంతం పంచె కట్టులో, భుజం మీద తుండుతో వ్యవసాయం చేస్తూ వచ్చిన తండ్రిని తన పెళ్లి కోసం ‘నువ్వు సూట్ వేసుకోవాల్సిందే నాన్నా’ అని కొడుకు పట్టుబడితే ఆ తండ్రికి ఊపిరి ఆడుతుందా? అసలు సూట్ వేసుకుని తిరగ్గలడా? బట్టలతోనా తండ్రికి గౌరవం? అయితే తండ్రి తొడుక్కునే బట్టలు ‘తక్కువ రకానివి’ అని నిర్ణయించేదెవరు?అలాగే జీవితాంతం రవికంటే ఏమిటో ఎరగక బండ చాకిరీ చేస్తూ వచ్చిన తల్లిని మాత్రం ‘నువ్వు నా పెళ్లి సందర్భంగా రవిక తొడగాల్సిందే’ అని కొడుకు పట్టుబడితే?ఆ తల్లి ఏం చేస్తుంది? ఏం చేయాలి? అటు కొడుకు మథనం... ఇటు తల్లి అంతర్మథనం. వెరసి ‘అంగమ్మాల్’ చిత్ర కథనం. తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ రాసిన ‘కొడు తుని’ అనే కథ ఆధారంగా దర్శకుడు విపిన్ రాధాకృష్ణన్ తెరకెక్కించిన చిత్రం ఇది. దిగ్దర్శకుడు కె.బాలచందర్ కోడలైన గీతా కైలాసం ఈ చిత్రంలో ప్రధాన పాత్ర ‘అంగమ్మాల్’గా నటించారు. ఆమె పెద్దకొడుకుగా భరణి, చిన్నకొడుకుగా శరన్ శక్తి నటించారు. భర్త పోయిన తర్వాత ఇద్దరు కొడుకుల్ని కడుపులో దాచుకుని సాక్కున్న తల్లి అంగమ్మాల్ జీవిత పద్ధతి వేరే, ఆమె తీరు వేరే. భర్త లేని స్త్రీ ఊళ్లో బతకడం కష్టం కనుక ఆమె బండగా మారిపోయింది. మగరాయుడిలా తనను తాను మలుచుకుంది. జాకెట్ వేసుకోవడం ఆమె ఎరుగదు. బీడీ తాగుతూ, అందర్నీ అదిలిస్తూ, కుటుంబాన్ని అధీనంలో ఉంచుకొని బతకడం అలవాటైన మనిషి. కోపధారి, రోషనారి. ఇటువంటి మనిషికి ఇప్పుడు చిన్నకొడుకు వల్ల కలిగిన సంకటమే ఈ కథలోని మూలాంశం. కొడుకు పట్నానికి వెళ్లి చదువుకుంటూ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. సంబంధం మాట్లాడటానికి అతని ఊరొస్తామంటున్నారు. వాళ్లు పట్నవాసపు మనుషులు. హైక్లాసులో పెరిగినవారు. వారు వచ్చి, తన అమ్మ పద్ధతి, ప్రవర్తన చూస్తే ఏమనుకుంటారు? పెళ్లి విషయంలో పేచీ పెట్టరా? రవిక లేకుండా ఆమెను చూసి హవ్వా అనుకోరా? ఇదంతా ఆలోచించిన చిన్నకొడుకు రవిక వేసుకోమని పట్టుబట్టాడు. ఆమెతో పంతానికి పోయాడు. తల్లికి కొడుకు మీద ప్రేమ, అతని బతుకు మీద ఆరాటం. కానీ తన అస్థిత్వాన్ని తానెలా వదులుకోగలదు? ఆమె భుజం మీద ఒక అడవి పువ్వు పచ్చబొట్టు ఉంటుంది. అది ఆ ప్రాంతంలో కొండల్లో పాతికేళ్లకు ఒకసారి పూస్తుంది. భలే సువాసన. ఆ పువ్వు ఆమె భుజం మీదఆమెకో అస్తిత్వంలా ఉంటుంది. ఆ అడవి పువ్వు పాతికేళ్లకు ఒకసారే ఎందుకు పూస్తుంది అనంటే ఏం చెప్పగలం? అది దాని స్వభావం. దానిని ప్రతి సంవత్సరం పూయమంటే పూస్తుందా? అంగమ్మాల్ రవిక వేసుకోకుండా ఎందుకుంది అనంటే ఆమెకు అలా అలవాటైంది. చీరను ఒంటికి కప్పుకుని ఇన్నాళ్లు బతికింది. ఊరికి కూడా అదే అలవాటైంది. వారికి లేని ఇబ్బంది. అంగమ్మాల్కు లేని చింత ఇప్పుడు కొడుక్కు వచ్చింది– అదీ పట్నం నుంచి వచ్చే ఎవరి కోసమో. ఆమె బాగా ఆలోచించింది.చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం ఆమెకూ, ఆమె కుటుంబంలోని వారికీ ఎలాంటి పరిస్థితులను కల్పించిందనేది చిత్రకథ. తమిళనాడులోని ఓ పల్లెలో కెమెరాను పాతి, చుట్టూ జరుగుతున్న అంశాలను చూపించిన సినిమా ఇది. అంత సహజమైన లొకేషన్లు, అక్కడి మనుషులు, వారి మనస్తత్వాలను ఈ చిత్రంలో చూపించారు. వారికి తగ్గ భాషనే డైలాగుల్లో వాడారు. గతంలో నిర్మాతగా వ్యవహరించిన గీతాౖ కెలాసం అనంతరం నటిగా మారారు. ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోదగ్గ సినిమా ఇది. ఈ సినిమా మొత్తానికి ఆమె నటన అద్భుతం అనిపిస్తుంది. కుటుంబం కోసం రాయిలా మారిన మనిషి పద్ధతి చివరకు ఆ కుటుంబానికే ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఆ అమ్మ ఏం చేయాలో ఈ చిత్రం చూసి ఆలోచనలో పడాలి.పైకి ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల సంస్కృతిని వెనుకబాటుగా చూడటం, వారిని నలుగురి ఎదుటకూ తేకపోవడం, వారిని ‘సంస్కరించాల’ని చూడటం మన సమాజంలో వినబడుతూనే ఉంది. మనల్ని కన్నవాళ్లను మనం ‘కరెక్ట్’ చేయాలనుకోవడం వారు ‘గాయపడే’ స్థాయిలో జరగాలా? వారిని వారిలా ఉండనివ్వండి అని చెప్పే సినిమా ‘అంగమ్మాల్’. త్వరలో ఓటీటీలో రావచ్చు. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్‌ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్‌లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్‌ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్‌కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
డీజిల్ కార్లు కనుమరుగవుతాయా?: ఎందుకు..
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే క్రమంగా దేశంలో డీజిల్ కార్ల ఉత్పత్తి, అమ్మకాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు అందుబాటులో ఉన్నన్ని డీజిల్ కార్లు ప్రస్తుతం అందుబాటులో లేదు. దీనికి గల కారణం ఏమిటి?, భవిష్యత్తులో డీజిల్ కార్లు కనుమరుగవుతాయా? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ఒకప్పుడు మార్కెట్లో ఆధిపత్యం చెలాయించిన డీజిల్ కార్లు.. నేడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీలు సైతం ఈ కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అధిక కాలుష్యం కారణంగా.. కూడా ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ కార్లను నిషేధిస్తున్నాయి.డీజిల్ కార్లు తగ్గడానికి ప్రధాన కారణాలుబీఎస్6 నిబంధనలు: 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్6 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కంపెనీలు తయారు చేసే కార్లను తప్పకుండా ఈ నిబంధనలను అనుగుణంగా ఉండాలని, ఇంజిన్లను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత శాఖలు వెల్లడించాయి. పెట్రోల్ వాహనాలలో ఇంజిన్లను బీఎస్6 నిబంధనలను అనుగుణంగా అప్డేట్ చేయడం కొంత సులభమే. కానీ డీజిల్ ఇంజిన్లను కొత్త నిబంధనలకు తగ్గట్లుగా అప్డేట్ చేయడం కష్టం. దీనివల్ల ధరలు భారీగా పెరుగుతాయి. ధరలు పెరిగితే అమ్మకాలు క్రమంగా తగ్గుతాయి.కాలుష్యం: డీజిల్ కార్ల వినియోగం వల్ల.. వాతావరణంలోకి వెలువడే కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట పరిమితి దాటిన తరువాత డీజిల్ కార్ల నుంచి వెలువడే పొగ అధికంగా ఉంటుంది. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొంతవరకు నిషేధించాయి.ధరల మధ్య తేడా: చాన్నాళ్లకు ముందు.. డీజిల్, పెట్రోల్ ధరలలో తేడా ఉండేది. లీటరు పెట్రోల్ రేటు 100 రూపాయలు ఉంటే, డీజిల్ ధర 80 రూపాయలు వరకు ఉండేది. కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా.. పెట్రోల్ కార్ల ధరల కంటే.. డీజిల్ కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాల్సి ఉంటుంది.తగ్గిన అమ్మకాలు: కార్లను కొనుగోలు చేసేవారిలో కూడా చాలామంది.. పెట్రోల్, ఈవీలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అమ్మకాలు తగ్గుతున్న కారణంగా.. కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయి.ప్రస్తుతం మారుతి సుజుకి కంపెనీ.. డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. ప్రస్తుతం భారతదేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా మోటార్స్, టయోటా వంటి కంపెనీలతో పాటు లెక్సస్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఒకవేళా కంపెనీలు కూడా డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తే.. కొత్త డీజిల్ కార్లు అందుబాటులో ఉండవు. బహుశా ఈ స్థితి రాదనే కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ.. ''సంఖ్య మాత్రం తగ్గుతుందనేది నిజం. పూర్తిగా డీజిల్ కార్లను కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమే''.డీజిల్ కార్లను తగ్గడానికి మరోకారణం.. కొనుగోలుదారుల ఆలోచన కూడా. ఎందుకంటే.. మారుతున్న కాలంతో పాటు వారు వినియోగించే కార్లలో కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది యువత ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ రాష్ట్రాల్లో డీజిల్ కార్లు నిషేధం!వాయుకాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ ప్రభుత్వం పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ కార్లను నిషేధించారు. ఈ జాబితాలో కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఇంజిన్ అప్డేట్ పొందిన డీజిల్ కార్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు.ఇదీ చదవండి: వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా? -
వాహనాల్లో ఇథనాల్ వినియోగం: లాభమా.. నష్టమా?
ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్, సీఎన్జీల విషయాన్ని పక్కన పెడితే.. డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి మనదేశంలో చాలా తక్కువ. దేశంలోని కార్లకు సరిపడా ఫ్యూయెల్ కావాలంటే.. ఇతర దేశాల నుంచి తప్పకుండా దిగుమతి చేసుకోవాల్సిందే. దీనికోసం లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఈ ఆలోచనల్లో పుట్టుకొచ్చించిందే బ్లెండెడ్ ఇథనాల్.భారతదేశంలో బ్లెండెడ్ ఇథనాల్ ప్రయోగం ఇప్పుడు వచ్చింది కాదు. 2001లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్రం 5 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి మహారాష్ట్ర & ఉత్తరప్రదేశ్‌లో వినియోగించడం ప్రారంభించారు. ఆ తరువాత 2002లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించడం ప్రారంభించారు. 2019లో E10, 2022 డిసెంబర్ 15న E20 (20 శాతం ఇథనాల్ - 80 శాతం పెట్రోల్)ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రవేశపెట్టారు.పెట్రోల్ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ఈ ప్రయోగం సరైనదే అయినప్పటికీ, కొంతమంది వినియోగదారుల్లో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. కానీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం.. ఇథనాల్ వినియోగం వల్ల సమస్యలు లేవని, దీనివల్ల పెట్రోల్ దిగుమతి తగ్గిందని.. తద్వారా రూ. 1.40 లక్షల కోట్లు అదా అయిందని లోక్‌సభలో వెల్లడించారు. నిపుణులు కూడా ఇథనాల్ వినియోగం వల్ల లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.ఇథనాల్ వినియోగం వల్ల నిజంగా లాభాలు ఉన్నాయా?, వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలు ఉన్నాయా?.. అనేది ఇక్కడ వివరంగా పరిశీలిస్తే..నిపుణులు చెబుతున్న ఉపయోగాలుకాలుష్యం తక్కువ: పెట్రోల్ వినియోగించినప్పుడు వెలువడే.. కాలుష్య కారకాల కంటే ఇథనాల్ ఉపయోగించడం వల్ల వెలువడే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు వంటి ఇతర హానికర కారకాల విడుదల కొంత తక్కువగా ఉంటుంది. గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలు కూడా కొంత తగ్గుతాయిఖర్చు తక్కువ: పెట్రోల్ ధరతో పోలిస్తే.. ఇథనాల్ ధర కొంత తక్కువే. దీనివల్ల డబ్బు కొంత ఆదా చేసుకోవచ్చు.ఇంజిన్ పనితీరు: కొంతమంది E10/E20 వంటి ఇథనాల్ మిశ్రమాలు ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.చమురు దిగుమతులను తగ్గిస్తుంది: భారతదేశం సుమారు 85 శాతం డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ స్థానికంగా తయారవుతుంది, కాబట్టి ఫ్యూయెల్ దిగుమతి కొంతవరకు తగ్గించుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇది పునరుత్పత్తి అయ్యే ఇంధనం కాబట్టి.. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం వచ్చే అవకాశం లేదు.వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలుమైలేజ్: ఇథనాల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనేది వాహనదారులు చెబుతున్న ప్రధాన అంశం. ఇది పెట్రోల్ కంటే కూడా 30 శాతం తక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కాకుండా.. మైలేజ్ 4 శాతం నుంచి 5 శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. రోజువారీ వినియోగదారుడికి ఇది ప్రధానమైన నష్టం.వాహనాల్లో సమస్యలు: 2005 కన్నా పాత కార్లు, బైకులకు ఇథనాల్ సరిపడకపోవచ్చు. దీనివల్ల రబ్బరు హోస్‌లు, ఫ్యూయల్ పంపులు, ఇతర వాహన భాగాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఫ్యూయెల్ లీక్స్, ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. ఇథనాల్ వల్ల ఇంధన ట్యాంక్‌లో తేమ పెరగడం, ఫ్యూయల్ సిస్టమ్‌లో తుప్పు పెరగడం వంటివి జరుగుతాయి.చివరగా..ఇథనాల్ వినియోగం వల్ల.. వచ్చే నష్టాల కంటే, లాభాలే ఎక్కువ. అయితే వాహనదారులు చెప్పిన సమస్యలు కూడా వచ్చే అవకాశం లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఒకవేళా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఇథనాల్ ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా.. బ్రెజిల్, అమెరికా, చైనా, పోలాండ్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దాదాపు 70 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. -
రూ.3200 నుంచి.. రూ.లక్ష దాటిన గోల్డ్
బంగారం.. ఇది ఒక విలువైన లోహం. ప్రపంచంలోని చాలా దేశాలు దీనిని అలాగే చూస్తాయి. కానీ భారత్ దీనికి భిన్నం. ఎలా అంటే.. బంగారం అంటే విలువైన లోగా మాత్రమే కాకుండా.. పవిత్రం, ఒక ఆభరణం, లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ కారణంగా ఎప్పటికప్పుడు గోల్డ్ కొనేస్తుంటారు. దీంతో ధరలు కూడా అమాంతం పెరుగుతూ వచ్చేసాయి.ఉదాహరణకు 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,200. అంటే గ్రామ్ గోల్డ్ కొనాలంటే.. కేవలం రూ. 320 వెచ్చించాలన్నమాట. అయితే ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,30,750 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక గ్రామ్ గోల్డ్ కొనాలంటే రూ. 13075 ఖర్చు చేయాలి. దీన్నిబట్టి చూస్తే.. 35 సంవత్సరాల్లో గోల్డ్ రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.35 సంవత్సరాల్లో బంగారం ధరలు ఎందుకింతలా పెరిగాయి?, భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో చూసేద్దాం.బంగారం ధరలు ఎందుకిలా..ద్రవ్యోల్బణం: గోల్డ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణమే. దేశంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల.. ఈ ప్రభావం బంగారంపై కూడా చూపించింది. రూపాయి బలహీనపడటం కూడా పసిడి ధరలు అమాంతం పెరగడానికి కారణమైంది.భద్రమైన ఆస్తి: ప్రపంచంలోనే సంక్షోభం వచ్చినప్పుడల్లా.. ప్రజలు బంగారం వైపు పరుగెడతారు. 2001లో ఏర్పడిన ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, 2008 నాటి ఆర్ధిక సంక్షోభం, 2020లో వచ్చిన కోవిడ్ 19, 2022-25 వరకు రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటివి బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కారణమయ్యాయి. దీంతో రేట్లు రాకెట్లా దూసుకెళ్లాయి.కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: చైనా, రష్యా, టర్కీ, ఇండియా వంటి దేశాలు.. గత దశాబ్దంలో టన్నుల కొద్దీ బంగారం కొనుగోలు చేశాయి. ఇది గ్లోబల్ మార్కెట్లో డిమాండ్‌ను పెంచేసింది.డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి: ఎక్కడైనా డిమాండ్‌కు సరిపడా.. ఉత్పత్తి ఉన్నప్పడే ధరలు స్థిరంగా లేదా కొంత తక్కువగా ఉంటాయి. కానీ మార్కెట్లో బంగారం కొనేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరికి సరఫరా చేయడానికి కావలసినంత బంగారం ఉత్పత్తి జరగలేదు. దీంతో ఆటోమేటిక్‌గా ధర పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది.డాలర్ విలువ & యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు: సాధారణంగా.. డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఇదే వ్యతిరేఖ దిశలో జరిగితే.. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. గోల్డ్ రేట్ల పెరుగుదలపై.. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా ప్రభావం చూపుతుంది.ఇతర కారణాలు: పండుగలు, పెళ్లిళ్లు మొదలైన శుభకార్యాలు వచ్చినప్పుడు కూడా బంగారం కొనేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిదారులు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా పసిడి రేటు భారీగా పెరుగుతుంది.భవిష్యత్తులో తగ్గే సూచనలు ఉన్నాయా?2025 డిసెంబర్ 9, 10 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీక్ష జరగనుంది. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేటు తగ్గితే.. బంగారం ధర పెరుగుతుంది. ఈ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోతే.. గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉంది. -
కార్తికేయుని అనుగ్రహంతోనే యోగప్రాప్తి
సాధారణంగా కొన్ని దేవాలయాలలో రెండు సర్పాలు ఒక దానితో మరొకటి మెలికలు తిరుగుతూ ఉన్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ శిల్పంలో ఉండే రెండు సర్పాలు మన సూక్ష్మ శరీరంలో ఏ విధంగా ఇడా, పింగళా నాడులు ఒక దానితో ఒకటి మెలికలు తిరిగి ఆరు శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను ఏర్పరుస్తాయో సూచిస్తాయి. వీటినే చంద్ర నాడి, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. మన వెన్నెముక అడుగు భాగాన త్రికోణాకార ఎముకలో ఉండే కుండలినీ శక్తి ఈ రెండు నాడుల మధ్య ఉండే సుషుమ్నానాడి ద్వారా పైకి వచ్చి మన మాడు పై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించి, మన చుట్టూ ఉండే సర్వ వ్యాపితమైన భగవంతుని పరమ చైతన్య శక్తితో ఐక్యం చెందుతుంది. అప్పుడే ఒక సాధకునికి యోగ్ర ప్రాప్తి జరుగుతుంది. ధ్యానంలో కుండలినీ శక్తి జాగృతిని, దాని ఊర్థ్వ గమనాన్ని అనుభూతి చెందితే, సాధకుడు నిరానంద అనుభూతిని పొంద గలుగుతాడు.మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమయ్యే కొద్దీ మన లోపల అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయి అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ విధంగా కుడి వైపు మూలాధార చక్రం మన లోపల సమతుల్యత ఏర్పడడానికి, నిర్విచార స్థితి నెలకొనడానికి సహాయ పడుతుంది.మితిమీరిన క్రియాశీలత, ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అవసరానికి మించి పని చేయడం, అతిగా ప్రణాళికలు వేయడం, నిద్ర లేమి, మొండితనం, మూర్ఖత్వం, చిరాకు, కోపం, అతిగా మాట్లాడడం, అతిగా ఆటలు ఆడటం, క్రూరత్వం, కాఠిన్యం ఇటువంటివన్నీ మన కుడివైపు పింగళానాడిని బలహీన పరుస్తాయి. ఆ సమయంలో శ్రీ కార్తికేయుని ధ్యానం ద్వారా మనం మన లోపల గల అసమతుల్యత లను తొలగించు కోవచ్చును. శ్రీ కార్తికేయుని ధ్యానం వలన మన చిత్తం నిర్మలంగా మారి మనకు నిర్విచార స్థితి లభిస్తుంది.ఒక గురువుకు తన మీద తనకు ఆత్మనిగ్రహం ఉంటుంది. అంటే తనను తాను నియంత్రించుకో గలుగుతాడు. కానీ శ్రీ కార్తికేయుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇతరులను శాసించ గలుగుతాడు. ఆ విధంగా శాసించగల శక్తి పురుషులకు వారి మాటల ద్వారా, చురుకుదనం ద్వారా, వ్యక్తిగత విజయాల ద్వారా లభిస్తే, స్త్రీలకు వారి ప్రేమించే గుణం, సహనం, హుందాతనం, క్షమా గుణం, కరుణల ద్వారా లభిస్తుంది.శ్రీ కార్తికేయుని శక్తి మన లోపల పసితనం లాంటి అమాయకత్వాన్ని పరిరక్షిస్తుంది. ఈ అమాయకత్వం వలనే మానవులు ఆనందంగా ఉండగలుగుతారు. మనలో కుండలినీ శక్తి వెన్నెముక అడుగున ఉన్న త్రికోణాకార ఎముక నుండి బయలు దేరి, షట్చక్రాలనూ దాటుకుంటూ వెళ్ళి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించడానికి మార్గ మధ్యంలో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగించడానికి కుడి మూలాధార చక్రం సహకరిస్తుంది. శ్రీ కార్తికేయుని శక్తి పరిపూర్ణంగా స్వచ్ఛమైన క్రియాశీలక శక్తి. అందులో ఎటువంటి అనవసరమైన, పనికిమాలిన ఆలోచనలకు తావు లేదు. అది చక్కటి ఫలితాలను ఇస్తుంది.– డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాలు, ప్రసంగాల ఆధారంగా) -
పరువు పేరుతో ప్రేమకు సమాధి; తప్పెవరిది?
నాగరిక ప్రపంచంలో ప్రేమకు చోటు లేకుండా పోతోంది. కుల దురహంకారం మట్టికాళ్ల మహారాక్షసిలావిజృంభిస్తోంది. మనసుకు నచ్చినవాడిని ప్రేమించడమే తరతరాలుగా ‘ఆమె’ పాలిట శాపమైపోతోంది.మనసిచ్చినవాడిని మను వాడాలనుకున్న అమ్మాయి కలల్ని సొంత కుటుంబ సభ్యులే కాల రాస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన పలువురి కంట తడి పెట్టిస్తోంది. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చినపుడు, అబ్బాయి తల్లిదండ్రులు స్వీకరించిన సులువుగా అమ్మాయి తల్లిదండ్రులు ఒక జంట ప్రేమను ఎందుకు అంగీకరించకలేక పోతున్నారు. అమ్మాయి ప్రేమిస్తే.. అది ధిక్కారమే అన్నట్టు ఆగ్రహావేశాలతో ఎందుకు రగిలిపోతున్నారు.. ఎందుకంటే అనాదికాలంగా పాతుకుపోయిన ఆమె మన సొత్తు..మనం చెప్పినట్టే వినాలి అనే భావన. అమ్మాయి మన స్వాధీనంలోనే ఉండాలనే ఆధిపత్య ధోరణి. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకొని, వాడితో పిల్లల్ని కంటుందా? అనే అత్యంత అమానవీయమైన భావజాలం వారిలో తీరని అసంతృప్తిని రగిలిస్తోంది.అమ్మాయి ప్రేమే సమస్యతమ కుటుంబంలోని అమ్మాయి ప్రేమిస్తే ఎందుకంత అగ్గిమీద గుగ్గిలం అవుతారు. కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకోవాల్సిన సమస్యని హత్యల దాకా ఎందుకు తీసుకెళతారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆధిపత్య, అహంకార పూరిత ధోరణి. ఆడవారి స్వేచ్ఛను, ప్రేమను అంగీకరించలేని అసహనం. వివక్ష. బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలి తనంలో కొడుకు ఇంట ఆడది బతకాలి. మారు మాట్లాడినా, ఎదురు తిరిగినా అంతే సంగతులు, పరువు ప్రతిష్ట పేరుతో ఇంట్లోని మగవాళ్ల ఆగ్రహానికి బలికావాల్సిందే. ఇదే తరతరాలుగా సాగుతున్న తంతు. మహిళల్ని, లేదా యువతులను పితృస్వామ్య అణచివేత, లైంగిక,శారీరక, మానసిక వేధింపులతోనే కాదు వారికి నచ్చినవారిని హతమార్చి, ఇలా కూడా అతి దారుణంగా చంపేయొచ్చు. వారిని మానసికంగా దెబ్బతీయచ్చు. తండ్రి , సోదరులు ఇలా ఎవరైనా సరే పరువు హత్యల ద్వారా పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ‘ఆమెను’ హత్య చేయవచ్చు. అపుడే వారి అహం చల్లారుతుంది. ఈ అహంభావమే, దౌర్జన్యమే ఇప్పటికీ రాజ్య మేలుతోంది. ఆయా కుంటుంబాలలోని మహిళలు ఇలాంటి హత్యలను సమర్థించడం సాయపడుతూ ఉండటం దురదృష్టకరంఇటీవల జరిగిన సంచలన హత్యలు2016 మార్చి 13న లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగిన శంకర్ పరువు హత్య సంచలనం రేపింది. తమ కుమార్తె కౌసల్యం శంకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుందన అక్కసుతో, కౌసల్య తండ్రి చిన్నస్వామితన బంధువులతో కలిసి పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు.ఈ కేసులో ఏమైంది... నేరస్తులకు దక్కిన పరువు ఉంటి? నలుగురిలోనూ హంతకులనే పేర్లు, జైలు జీవితం అంతేగా. ప్రణయ్ హత్యతో పరువు నిలబడిందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018, సెప్టెంబర్ 14న పెరుమాళ్ల ప్రణయ్‌ది మరో దారుణ హత్య. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా, పగపెంచుకుని, కిరాయిహంతకుల సాయంతో స్వయంగా అమృత తండ్రి మారుతీ రావు చంపించాడు.ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు దూరం, మరోవైపు అల్లుడి హత్యతో ఆమె జీవితంలో నిప్పులు పోసానన్న పశ్చాత్తాపం ఊపిరి సలప నీయలేదు. దీనికి తోడు పోలీసు కేసులు విచారణ, చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు మారుతీరావు. నానమ్మ కోసం హత్య 2025 జనవరిలో సూర్యాపేటలో భార్గవి, కృష్ణల ప్రేమను పరువు హత్య చేశారు. తమ కుమార్తెను భార్గవిని తన స్నేహితుడు కృష్ణ కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు దీంతో స్నేహితుడు అన్న కనికరం కూడా లేకుండా మరి కొంత మందితో కలిసి కృష్ణను నమ్మించి హత్య చేశారు. ఈ కేసులో నానమ్మ పాత్ర పెద్ద చర్చు దారితీసింది. మొదటినుంచి భార్గవి ప్రేమను వ్యతిరేకించి నాన్నమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొట్టి మరీ ఈ హత్యకు వుసి గొల్పిందని పోలీసులు నిర్ధారించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో 2000లో కు లాంతర వివాహం చేసుకుందని ఓ వ్యాపారి యువకుడిని హత్య చేయించాడు. 2012లో తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని భావించి ప్రేమికుడిని హత్య చేశారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, నరేష్ ప్రేమించు కున్నారు. కేవలం కుల అహంకారంతోనే స్వాతి తల్లిదండ్రులు నరేష్‌ను హత్య చేశారు. అది తట్టుకోలేక స్వాతి కూడా మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన యువకుడి హత్య. ఆంచల్ మామిద్వార్‌కు స్వయంగా తల్లిదండ్రులే పుట్టెడుదుఃఖాన్ని మిగిల్చారు. అంచల్ ప్రేమికుడు సాక్షమ్ టేట్ (25)ని దారుణంగా కాల్చి చంపారు. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే. వెలుగులోకి రాని కౄరహత్యలు ఎన్నో...మరెన్నో..! పగ కాదు, ప్రేమను పంచుదాంకన్నబిడ్డల కంటే వారి సంక్షేమం కంటే తల్లిదండ్రులకు ఏముంటుంది. జీవితాంతా కష్టపడి ప్రాణానికి ప్రాణంగా పెంచుతారు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మూర్ఖంగా మారిపోతున్నారు. అమ్మాయి ప్రేమను అస్సలు ప్రేమను జీర్ణించుకోలేక పగతో రగిలి పోతున్నారు. కుటుంబ పరువు గంగలో కలిసిపోయిందంటూ గగ్గోలు పెడతారు. ఫలితంగా దారుణ హత్యలకు తెగబడుతున్నారు. చివరికి కన్నబిడ్డ గొంతుకు ఉరి బిగించేందుకు కూడా వెనుకాడటం లేదు.ఏమిటీ పరిష్కారంఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ఉండాల్సింది ప్రేమ, అభిమానం, పరస్పరం నమ్మకం. ప్రేమకు, ప్రేమ వివాహాలకు కులాలు, మతాలు అడ్డుగోడలు కాకూడదు. ఆర్థిక స్థోమత అస్సలు సమస్యే కాదు. కానీ తక్కువ, ఎక్కువ అనే లేని పోని విద్వేషాలతో ప్రేమ వివాహాలను పెద్దలు అడ్డుకుంటున్నారు. కుటుంబ పరువు, సమాజంలో నలుగురూ ఏమనుకుంటారో అనే లేని పోని ఆందోళన వారిని భయపెడుతోంది. ఇదే ప్రేమికులనూ భయపెడుతోంది. అందుకే తమ ప్రేమ బతకని చోట తామూ బతకలేమని ప్రేమికులు ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతోంటూ, మరోవైపు ప్రేమకోసం ప్రేమగా, ధైర్యంగా కలిసి బతుకుదామను కున్న వారిని స్వయంగా కుటుంబ సభ్యులే హత్య చేస్తుండటం బాధాకరం.రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన ప్రతీ యువతీ యవకుడికీ తమకు నచ్చిన వారిని భాగస్వాములుగా ఎంచుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడిని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం, చట్టాన్ని రక్షించే అధికారులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. చట్టాలు, ప్రేమ వివాహాలు, పరువుహత్యలు, పర్యవసానాలపై పౌరుల్లో అవగాహన కల్పించాలి. "మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును." అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు కుల, మత బేధం లేని సమాజం ఇపుడు మనకు కావాలి. ఇకనైనా పరువు పేరుతో జరుగుతున్న మారణకాండ ఆగాలని కోరుకుందాం. పరువు, ప్రతీకారంకోసం నిండు నూరేళ్ల ప్రేమను కోల్పోయిన బాధితురాళ్ల వేదన సాక్షిగా నిజమైన ప్రేమలను గెలిపించుకుందాం. -
Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన
-
కార్తీక దీపానికి భక్తకోటి కాంతులు
అవి ప్రతి యేటా జరిగే బ్రహ్మోత్సవాలు కాదు... సనాతనంగా నిర్వహించుకునే నవరాత్రులూ కాదు తరతరాలుగా చేసుకునే పండుగలో పర్వదినాలో కాదు అలాగని అది మునుపెన్నడూ చేయని క్రతువు కాదు. వేదాలు.. పురాణేతిహాసాలు అందించిన ఒక చిన్న వెలుగుకు కోటికాంతులు అద్దిన ఉత్సవం. కార్తికమాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన అద్భుతం. సుమారు పుష్కరకాలం క్రితం కార్తికమాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే భక్తిటీవీ కోటి దీపోత్సవం. కార్తికమాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం. భక్తిటీవీ కోటిదీపోత్సవం. చరిత్రలో మునుపెవ్వరూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్షదీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై... పుష్కరకాలానికి పైగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. ఎప్పటిలాగే భక్తుల నుంచి ఎలాంటి రుసుములు, కానుకలు తీసుకోకుండా.. ప్రాంగణంలో ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, దేవతాప్రతిమలు, పూలు, పూజాసామాగ్రి ఇలా ప్రతీది ఉచితంగా సిద్ధం చేస్తారు.సుమారు పుష్కరకాలం క్రితం... పదమూడేళ్లక్రితం శృంగేరీ దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామివారు విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. ఈ సందర్భాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులకు ఓ సంకల్పం కలిగింది. భక్తులందరి సమక్షంలో వారికి గురువందనం చేయాలని భావించారు. దానితోపాటు కార్తికమాసంలో శివస్వరూపమైన జగద్గురువులు స్వయంగా విచ్చేశారు గనుక.. వారి సమక్షంలో కార్తికదీపోత్సవం నిర్వహించాలని సంకల్పించారు. ఆ చిన్న సంకల్పానికి ప్రతిరూపమే 2012లో జరిగిన లక్షదీపోత్సవం. భక్తిటీవీ చేపట్టిన దీపయజ్ఞానికి నాంది అది. ఎన్టీఆర్‌స్టేడియం వేదికగా కైలాసాన్ని తలపించే సభావేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై శృంగేరి జగద్గురువులు దీపారాధన చేసి భక్తులను ఆశీర్వదించారు.ముక్కోటి దేవతలు ఒక్కటైనారు...కార్తికమాసంలో శంకరనారాయణులనే కాదు.. సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేష పూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్టధామాల నుంచి కోటిదీ΄ోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించడం సాక్షాత్తూ ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. ఉజ్జయిని, అరుణాచలం, వేములవాడ, కాళేశ్వరం వంటి శైవ క్షేత్రాలు.. యాదాద్రి, శ్రీరంగం, కొండగట్టు తదితర వైష్ణవ క్షేత్రాలు... అలంపురం, కంచి, వారణాసి వంటి శక్తిపీఠాలు. ఇలా ఒకటేమిటి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ దేవతామూర్తులు కోటిదీ΄ోత్సవ వేదికపై కొలువుదీరతారు. కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. ఎన్నో పూజలు – పరిణయోత్సవ వైభవ సమాహారం.గురుర్దేవో మహేశ్వరఃప్రతి ఏటా దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలి వస్తుంటారు. శివైక్యం చెందిన కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీవిద్యానృసింహ భారతిస్వామి, ఉడిపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామి, ఆర్షవిద్యాగురుకులం శ్రీదయానందసరస్వతి వంటి మహామహులు కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించడం వీక్షకుల అదృష్టం. శృంగేరి శంకరాచార్య భారతీ తీర్థమహాస్వామి, పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి, జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి, ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గివాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ, సమతామూర్తి స్థాపకులు త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైసూరు దత్తపీఠం పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానందస్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీవిద్యాశంకరభారతిస్వామి, ధర్మస్థల క్షేత్రాధికారి వీరేంద్రహెగ్డే, అక్షయ΄ాత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీమధుపండితదాస, ఇస్కాన్ అంతర్జాతీయ అధ్యక్షులు జయపతాకస్వామి, పతంజలి యోగ బాబారామ్ దేవ్, కుర్తాళం పీఠాధిపతి శ్రీసిద్ధేశ్వరానంద భారతిస్వామి, రుషికేశ్ పరమార్థ్నకేతన్ చిదానంద సరస్వతి, కాశీ – శ్రీశైల జగద్గురువులతో పాటు ఎందరెందరో యోగీశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మాతాజీలు భక్తిటీవీ కోటిదీపోత్సవానికి విచ్చేసి భక్తులను అనుగ్రహించారు. గురుదేవులే మహేశ్వరులై భక్తకోటిని అనుగ్రహించారు. ఈ ఏడాది సైతం శృంగేరి జగద్గురు విధుశేఖరభారతిస్వామివారు.. కంచి జగద్గురు విజయేంద్రసరస్వతి స్వామివారు విచ్చేయడం కోటిదీపోత్సవానికి సూర్యచంద్రుల ఆగమనం లాంటి శుభతరుణం. సువర్ణాక్షరాల ఘట్టాలు కోటిదీపోత్సవ చరిత్రలోనే కాదు... భక్తిటీవీ ప్రస్థానంలో సైతం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టాలు. కోటిదీపోత్సవం – 2023. కోటిదీపోత్సవం – 2024. రెండేళ్ల క్రితం మహాదేవునికి కోటిదీపాల నీరాజనం అర్పించేందుకు తుమ్మల నరేంద్రచౌదరి – రమాదేవి దంపతుల ఆహ్వానం మేరకు.. సాక్షాత్తూ దేశప్రధానమంత్రి నరేంద్రమోది విచ్చేయడం... దీపారాధన కార్యక్రమాన్ని ఆద్యంతం గమనించి.. తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న భావన కలుగుతోందని ప్రశంసించడం ఓ అపూర్వ జ్ఞాపకం. గతేడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేయడం మరో మరపురాని ఘట్టం. దేశ ప్రథమ ΄ పౌరురాలి చేతులమీదుగా కార్తికదీపం వెలిగింది. భక్తుల ఆనందం కోటిదీపాల కాంతులై మెరిసింది. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టమని ద్రౌపది ముర్ము పేర్కొనడం అద్వితీయం. సప్తహారతులు... మహానీరాజనాలు ఈ అపూర్వ వేడుకలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథ మహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు.లక్ష కాదు.. కోటి 2013లో... మళ్లీ కార్తికమాసం రానే వస్తోంది. 2012లో జరిగిన వైభవం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. లక్షదీపోత్సవం కంటే మించినది ఏదైనా చేయాలని తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి – వారి కుమార్తె రచనా చౌదరిల సంకల్పం. ఆ సంకల్పానికి ప్రతిరూపమే అంతవరకూ ఎవరూ చేయని మహోత్సవం. నూతన ఆధ్యాత్మిక యుగానికి పునాదులు వేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం. ఆనాడు వెలిగిన దీపజ్యోతి ఇంతింతై అన్నట్లుగా... పుష్కరకాలంగా కొనసాగుతోంది. అఖండదీపమై ప్రకాశిస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త హంగులతో వెలుగొందుతోంది. కోటిదీ΄ోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్లే అనే భావన ప్రతీ భక్తుడికీ కలిగేలా కార్యక్రమ రూపకల్పన జరిగింది. నటరాజుకు కళాంజలి: జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, కైకుట్టి, మోహినిఆట్టం, ఒడిస్సీ, మణిపురి, లావణి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీ΄ోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. ఇందుకోసం ప్రసిద్ధ కళాకారులు సైతం తరలివస్తారు. సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈశా ఫౌండేషన్ తరఫున బ్రహ్మచారులు చేసే అగ్నినృత్యం భక్తులను ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలు ప్రతిఏటా చోటుచేసుకుంటాయి.ఆ అపూర్వ యజ్ఞంమరోమారు...కార్తికమాసాన్ని పురస్కరించుకునినవంబరు1 నుంచి 13 వరకుహైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో... -
అమెరికా కాదన్నా.. ఆప్షన్స్ అన్‌లిమిటెట్
‘టాలెంట్ ఉన్న ప్రతిచూపు అమెరికా వైపే’ అన్నట్లుగా సాగింది ఇంతకాలం. అమెరికాలో సెటిల్ అయినవారి పేరెంట్స్ దగ్గర నుంచి అమెరికన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరూ అమెరికా కాలమానానికి అనుగుణంగా నడుచుకోవడం పరిపాటి అయిపోయింది! కాని, అమెరికా తీరు మార్చింది. పొమ్మనకుండానే ఇండియన్స్‌కు పొగబెడుతోంది.చదువు, ఉద్యోగం, స్థిరనివాసం కోసం అమెరికా చేరుకోవడమనేది చాలామంది భారతీయుల కల! అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. కాని, అపారమైన ఆశలతో అమెరికా వైపు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల కలలు ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీనికి, అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం! ఎన్నో ఏళ్లుగా ఇండియా–అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన అనుబంధం ఇప్పుడు మెల్లమెల్లగా బీటలువారుతోంది. ఈ బంధానికి ప్రధాన వారధి అయిన విద్యారంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థితుల్లో, విదేశీ విద్య కోసం అమెరికా తప్పితే మరో మార్గమే లేదా? మరో దేశమే లేదా?! అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాదర ఆహ్వానాలు అందుతున్నాయి.క్రమంగా అమెరికాకే కాదు జర్మనీ, కెనడా యూకే వంటి దేశాలకు ఇండియా నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికాకు బ్రేక్స్ పడుతున్న తరుణంలో భారత యువత తమ విదేశీ ప్రయాణాల గమ్యాలను మార్చుకుంటూదూసుకుని పోతున్నారు. ఏటా విదేశాలకు వెళ్లే మన విద్యార్థులు హెచ్–1బీ వీసా అనేది అమెరికా– తమ దేశంలో ప్రత్యేక నైపుణ్యంతో నిర్వహించే ఉద్యోగాల కోసం– విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక వలస వీసా! ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ (స్టెమ్) రంగాల్లో అమెరికాకు చెందిన నిపుణుల కొరతను తీర్చుకోవడానికి ఈ వీసాను 1990లో నాటి అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోగలిగాయి. ఇది అమెరికా ఆర్థిక వృద్ధికి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో తోడ్పడింది! ఇప్పటి వరకూ హెచ్–1బీ వీసాలు పొందినవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఎందరో భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఈ క్రమంలోనే ‘అమెరికా వద్దంటే ఆగిపోనక్కర్లేదు మా దేశం రండి’ అంటున్నాయి ఎన్నో దేశాలు. ఆ లిస్ట్‌లో జర్మనీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, ఫ్రాన్స్, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), పోలండ్ ఇలా చాలా దేశాలు చక్కటి భవిష్యత్ కోసం ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూద్దాం విదేశీయులకు సైతం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను, అది కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు ఉచితంగా అందించే అరుదైన దేశం జర్మనీ. ఇది కేవలం ఉన్నత ప్రమాణాలకు, ఆధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందడమే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక, ఇంజనీరింగ్ కోర్సులకు కేంద్రంగా ఉంది. జర్మనీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్ ఫీజులుండవు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడాదికి గరిష్ఠంగా 140 పూర్తి రోజులు లేదా 280 సగం రోజులు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సెమిస్టర్ కాలంలో వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు తమ అర్హతకు సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల వరకు జర్మనీలో ఉండొచ్చు. అందుకు జాబ్–సీకింగ్ రెసిడె¯ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో వారు పూర్తి సమయం ఉద్యోగం వెతుక్కుంటూనే తమ ఖర్చుల కోసం తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. గడువులోపు ఉద్యోగం సంపాదించి, దానిని వర్క్ పర్మిట్‌గా మార్చుకున్నట్లయితే, జర్మనీలో స్థిరపడటానికి మార్గం సులభమవుతుంది.కెనడానిజానికి కెనడియన్ విద్యార్హతలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే కెనడాలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి, ఇవి విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలనందిస్తాయి. కెనడాలో ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలలో కూడా విదేశీ విద్యార్థులకు ఫీజులుంటాయి. అయితే కోర్సులను బట్టి, యూనివర్సిటీ స్థాయిని బట్టి ఫీజులు మారుతుంటాయి. స్టడీ పర్మిట్ ఉన్న విద్యార్థులు తమ చదువుల సమయంలో వారానికి గరిష్ఠంగా 20 గంటలు క్యాంపస్‌లో లేదా క్యాంపస్ వెలుపల పనిచేయడానికి అనుమతి ఉంటుంది. సెమిస్టర్ బ్రేక్స్ సమయంలో పూర్తి సమయం పనిచేయవచ్చు. కెనడియన్ డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అర్హత కలిగిన ప్రోగ్రామ్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని బట్టి గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కెనడాలో ఉండొచ్చు. ఉద్యోగం వెతుక్కోవడానికి పనిచేయడానికి అనుమతించే పోస్ట్–గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ పొందవచ్చు. ఈ పర్మిట్ పొందిన తరువాత, ఒక సంవత్సరం కెనడియన్ గ్రాడ్యుయేట్స్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ వంటి ఇమ్మిగ్రేషన్ మార్గాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కెనడా ప్రభుత్వం వలసదారులను స్వాగతిస్తుంది కాబట్టి, విద్యార్థులకు ఇది ఒక చక్కటి మార్గమవుతుంది.యూకే విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గమ్యస్థానం యునైటెడ్ కింగ్డమ్ (యూకే). బెస్ట్ కోర్సులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు, గ్రాడ్యుయేషన్ తర్వాత సులభంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే విధానాలతో యూకే అంతర్జాతీయ విద్యార్థులకు స్వర్గధామం. అక్కడి విశ్వవిద్యాలయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు ప్రసిద్ధి. ఇక్కడి బ్యాచిలర్ కోర్సులు సాధారణంగా 3 సంవత్సరాలు, మాస్టర్స్ కోర్సులు ఒక సంవత్సరంలోనే పూర్తి అవుతాయి. యూకేలో విదేశీ విద్యార్థులకు ఫీజులు సాధారణంగా దేశీయ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్, నగరంతో పాటు కోర్సును బట్టి ఫీజు మారుతుంది. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, విద్యార్థి తమ ట్యూషన్ ఫీజుతో పాటు తమ జీవనానికి సరిపడా కనీస రాబడిని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన యూనివర్సిటీ/కాలేజ్ (లైసె¯Œ ్స పొందిన స్పాన్సర్) నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ వంటి అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ లేదా పూర్తి స్థాయి స్కాలర్షిప్లను అందిస్తాయి. కామ¯Œ వెల్త్ దేశాలకు చెందిన ప్రతిభావంతులకు కామ¯Œ వెల్త్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. విద్యార్థులు ఎటువంటి తక్కువ జీతం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నా స్కిల్డ్ వర్కర్ వీసాకు మారే అవకాశం కూడా ఉంటుంది.ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు చక్కటి విద్యను, అధిక జీవన ప్రమాణాలను, పట్టభద్రులైన తర్వాత గొప్ప ఉద్యోగ అవకాశాలను పుష్కలంగా అందించే దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంతర్జాతీయ విద్యార్థి వీసా (సబ్‌క్లాస్ 500) ఉన్నవారు చదువుకునేటప్పుడు ప్రతి రెండు వారాలకు 48 గంటల వరకు పని చేసుకోవచ్చు, ఇంకా చదువు విరామ సమయాల్లో అపరిమిత గంటలు పనిచేసే వెసులుబాటు కూడా ఉంది. ఇది విద్యార్థులకు తమ ఖర్చులను తాము భరించడానికి, నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, చక్కటి అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత, విద్యార్థులు తమ అర్హతలను బట్టి, 18 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు (కోర్సుతో పాటు ప్రాంతాన్ని బట్టి) ఆ దేశంలోనే ఉండి, తగిన ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.న్యూజీలండ్అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో న్యూజీలండ్ కూడా ప్రత్యేకమే! ఇక్కడ పర్యావరణం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. న్యూజిలాండ్‌లో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వరల్డ్ క్యూఎస్ (కోక్వారెల్లి సైమండ్స్) ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని పొందాయి. కాబట్టి అక్కడ విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు. అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్డీ (డాక్టోరల్) కోర్సులు చదివితే, వారికి దేశీయ విద్యార్థులతో సమానమైన, చాలా తక్కువ ఫీజు వర్తిస్తుంది. ఇక విదేశీ విద్యార్థి వీసా కోసం జీవన వ్యయాలు, తిరుగు ప్రయాణ ఖర్చులు చూపించాల్సి ఉంటుంది. విరామ సమయాల్లో పూర్తి సమయం పనిచేయడానికి అనుమతి ఉంది. న్యూజీలండ్‌లో చదువుకున్న తర్వాత అక్కడ స్థిరపడటం కూడా సులభమే.మొత్తానికీ అమెరికా చాన్స్ పోయిందని నిరాశపడే భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా దేశాలు వెల్కమ్ బోర్డ్‌తో ఎదురుచూస్తున్నాయి. ఆ నిరాశను వదిలేసి చుట్టూ ప్రపంచం వైపు చూస్తే మారేదేం లేదు.. విమానాశ్రయంలో ఫ్లైట్ పేరు తప్ప అంటున్నారు అనుభవజ్ఞులు.ఉత్తమమైన దేశాన్ని ఎలా ఎంచుకోవాలి?విదేశాల్లో కెరీర్‌ని ప్లాన్ చేసుకునే యువతకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి, ఆపై అక్కడే పని చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేది ప్రధాన సమస్య. కొన్ని దేశాలు సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ (స్థిరనివాసం) పొందే మార్గాలను అందిస్తాయి. అయితే ఏ దేశాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది?సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, స్థిరనివాస మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన వీసా విధానాలను పాటిస్తున్నాయి. దాంతో ఈ దేశాలలో పర్మనెంట్ రెసిడెన్సీ (స్థిరనివాసం)పొందే మార్గాలు కూడా సులభంగా ఉంటాయి.కెరీర్ వృద్ధి కోసం ఇంగ్లీష్ మాట్లాడే లేదా ఇంగ్లీష్ బోధించే దేశాలను ఎంచుకోవాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, యూకే వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాలు మన భారతీయులకు భాషాపరంగా సౌకర్యంగా ఉంటాయి. అయితే జర్మనీ, నెదర్లండ్స్ వంటి కొన్ని నాన్–ఇంగ్లిష్ దేశాలు ఇంగ్లిష్ భాషలో కోర్సులను అందిస్తాయి. కాని, ఉద్యోగం పొందాలంటే మాత్రం స్థానిక భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునేవారు ఎడ్యుకేష సమయంలో స్థానిక భాష నేర్చుకోవడంపై కాస్త దృష్టిపెట్టాలి.ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో దాని ఆధారంగా మనం ఎన్నుకునే యూనివర్సిటీల విషయంలో కోక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్), టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) వంటి సంస్థల ప్రపంచ ర్యాంకింగ్‌లను పరిశోధించుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఎంత సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో, వారి సగటు జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లు లేదా లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వివరాలు లభిస్తాయి.ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉందో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎలాంటి సహాయక సేవలు (అకాడెమిక్ సపోర్ట్, కౌన్సెలింగ్, కెరీర్ గైడె¯Œ ్స) అందిస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఆ దేశంలో జీవన వ్యయం (అద్దె, ఆహారం, రవాణా) సహా విద్యార్థి సంఘాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.చదువుకునే సమయంలో ఆయా దేశాల్లో తమ వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవడానికి స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. చదువుతున్నప్పుడే ఇంటర్న్‌షిప్‌లు లేదా పార్ట్–టైమ్ ఉద్యోగాలు లభించే అవకాశాలున్న దేశాలను ఎంచుకోవడంతో వృత్తి అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, స్థానిక భాష కూడా నేర్చుకోవచ్చు. -
షహీద్ భగత్ సింగ్ : స్వాతంత్య్ర విప్లవ జ్వాల
మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు సర్దార్ భగత్‌సింగ్ (Bhagat Singh). ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి, స్వరాజ్య సాధన పోరాటంలో చిరు ప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధుడు. ఆయన పేరు వింటే చాలు యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. 1907 సెప్టెంబర్ 28న నేడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ సమీపంలోని ఒక గ్రామంలో భగత్ సింగ్ జన్మించారు. రష్యాలో మాదిరిగా భారతదేశంలో కూడా సోష లిస్టు రాజ్యం, సమసమాజం ఏర్పడాలని భావించారు. జైలుకు వెళ్లడానికి ముందూ, జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆయన విస్తృతంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి... మారు పేర్లతో పత్రికలకు రహస్యంగా వ్యాసాలు రాశారు. తన వ్యాసాల్లో ఆయన మతతత్వ ప్రమాదం గురించి దూరదష్టితో కచ్చితమైన హెచ్చరిక చేశారు. మతవాదుల పట్ల ఉదాసీనత ప్రమాదకరం అని బోధించారు. తనకు గురు తుల్యుడు, తండ్రి సమానులైన లాలా లజపత్ రాయ్ ‘హిందూ మహాసభ’కు అనుకూలంగా మారినప్పుడు ఆయన ఘాటుగా విమర్శించారు. భగత్‌సింగ్ కార్య కలాపాలపై లాలా కూడా విరుచుకు పడ్డారు. నన్ను లెనిన్ లా మార్చడానికి భగత్‌సింగ్ ప్రయత్నిస్తున్నాడనీ, అతను రష్యన్ ఏజెంట్ అనీ నిందించారు. అయినప్పటికీ లాలాను బ్రిటీష్ పోలీసులు కొట్టి చంపడాన్ని భగత్‌సింగ్ సహించలేదు. ప్రతిగా బ్రిటిష్ పోలీస్ అధికారిని తుపాకీతో కాల్చి చంపారు. ‘విప్లవం అంటే బాంబులు, తుపాకుల సంస్కృతి కాదు. పరిస్థితుల్లో మార్పు తేవడమనే ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి జరగాలి’ అంటూ వివరించారు. మతతత్వం పట్ల ఆనాడు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల పట్ల భగత్ సింగ్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన ప్రజలు పరస్పరం ఇతర మతస్థు లను శత్రువులుగా భావిస్తున్నారనీ, రాజకీయాల నుంచి మతాన్ని వేరుచేయడమే దీనికి పరిష్కారం అనీ, మతం వ్యక్తిగతమైన విషయం కాబట్టి దానిలో ఎవరూ జోక్యం చేసుకోకూడదనీ భగత్‌సింగ్ అన్నారు. మతతత్వాన్ని నిర్మూ లించడానికి ఏకైక మార్గం వర్గచైతన్యమే అని అన్నారు. ‘పెంపుడు కుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుంటాం. కానీ, సాటిమనిషిని ముట్టుకుంటే మైలపడిపోతాం. ఎంత సిగ్గుచేటు?’ అని ‘అఛూత్ కా సవాల్’ (అంటరానితనం సమస్య) అనే వ్యాసంలో భగత్ సింగ్ ప్రస్తావించారు. సంకుచిత స్వపక్ష దురభిమానులను భగత్‌సింగ్ ప్రజల శత్రువుగా చూశారు. నేడు దేశంలో వేళ్లూనుకుపోయిన కుల, మత మౌఢ్యాలు పోవాలంటే లౌకిక, ప్రజాస్వామిక శక్తులు భగత్‌సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలను చైతన్య పరచాలి.– నాదెండ్ల శ్రీనివాస్ మధిర -
ఊహకందని చరిత్ర: గూగుల్‌కు ఆ పేరు వచ్చిందిలా..
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్‌స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.●1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్●1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది●1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్●2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).●2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.●2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.●2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.●2004 - జీమెయిల్ ప్రారంభం●2005 - గూగుల్ మ్యాప్స్●2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది●2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్‌ను గూగుల్ కొనుగోలు చేసింది●2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది●2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది●2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.●2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. ●2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది●2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం●2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం●2015 - సీఈఓగా సుందర్ పిచాయ్●2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్●2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది●2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది●2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్●2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)●2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్‌ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.●2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ●2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ●2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్‌లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.●2025: 2025లో గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ & ప్రో లాంచ్ చేసింది. బననా ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.గూగుల్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.80 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలుగా చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుంటే.. స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా ఇంతలా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా.. అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి కనీసం రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
దేశానికి రక్తతర్పణం చేసిన అహింసా మూర్తి!
ఆమె 73 ఏళ్ల ముదుసలి. జాతీయ పతాకాన్ని ఎత్తిపట్టి ‘వందేమాతరం’, ‘ఆంగ్లేయులారా! ఇండియాను వదిలి వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ ఆరువేల మందితో ఒక పోలీస్ స్టేషన్‌ను ఆక్రమించేందుకు శాంతియుతంగా దండయాత్ర చేస్తోంది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరి పారు. అయినా ఆమె ముందుకే కదిలింది. ఈసారి జెండా పట్టుకున్న చేతిని గురిచూసి కాల్చారు. వెంటనే రెండో చేతిలోకి జెండాను మార్చుకుని మునుముందుకు దూకింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆమె రెండో చేతి పైనా, నుదుటి పైనా కాల్పులు జరిపారు. తెల్లని ఖద్దరు చీర రక్తసిక్తమయ్యింది. ఆ బక్కచిక్కిన వృద్ధ యోధ కుప్పకూలింది – కానీ జెండాను మాత్రం కిందపడకుండా గుండెలకు హత్తుకునే!1942 సెప్టెంబర్ నాలుగవ వారంలో చోటు చేసుకున్న ఈ బలిదానం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ‘వృద్ధ మహిళా గాంధీ’ (గాంధీ బురి)గా పేరుగాంచిన ఆమె పేరు మాతంగినీ హజ్రా (Matangini Hazra). 1869లో బెంగాల్‌లోని హొగ్లా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు పన్నెండేండ్లకే వివాహం చేశారు. కానీ 18 ఏండ్లకే వితంతువయ్యింది. పిల్లలు లేని ఆమె సమాజ సేవ, దేశ సేవకే తన జీవితాన్ని అంకితమిచ్చింది. ఆమెకు చదువు లేదు. అయినా గాంధీజీ బోధనలకు ఆకర్షితురాలయ్యింది. ఆయన చెప్పినట్లే జీవించింది. 1930లలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు మిగతా ఉద్యమాల్లోనూ పాల్గొని జైలుకెళ్లింది. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని 1942 ఆగస్ట్ 8న ‘క్విట్ ఇండియా’ (ఇండియా వదిలి వెళ్లండి) ఉద్య మాన్ని ప్రారంభించింది. గాంధీజీ ‘డూ ఆర్ డై’ (విజయమో, వీరస్వర్గమో) అంటూ ఉద్య మాన్ని ఉరకలెత్తించారు. ఈ ఉద్యమ సమయా నికి మాతంగినికి 73 ఏండ్లు. బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో ఉద్యమానికి సరైన నాయకత్వం అందించే గాంధీవాదులు లేకపోవడంతో ఈ ఉద్యమం ప్రజల తిరుగుబాటుగా మారింది. బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాలు చేసే సమాంతర ప్రభుత్వాన్ని లేదా ‘జాతీయ సర్కా ర్’ను తామ్లుక్‌లో ‘సమర్ పరిషద్’ ఏర్పాటు చేసింది. మాతంగినీ పక్కా గాంధేయవాదే కానీ ఈ తిరుగుబాటుదారుల్లో ఒకరుగా మారారు. పోలీస్‌స్టేషన్‌పైకి దండయాత్ర1942 సెప్టెంబర్ 29న తామ్లుక్ పోలీస్ స్టేషన్ (అప్పట్లో సెయ్లన్ స్క్వేర్)పై నియంత్రణ సాధించడానికి తామ్లుక్ జాతీయ సర్కార్ ఒక నిరసన మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇది బ్రిటిష్ అధికారంపై ప్రత్యక్ష తిరుగుబాటే! పోలీస్ స్టేషన్‌పై భారత జాతీయజెండాను ఎగురవేయడానికి వేలాదిమందితో (వీరిలో ఎక్కువమంది స్త్రీలు) మాతంగినీ బయలుదేరింది. పోలీస్ స్టేషన్ ఉన్న ఊరు సమీపానికి ఆమె తన అనుయాయులతో చేరుకున్నప్పుడు, యూరోపియన్ అధికారుల ఆధ్వర్యంలోని బ్రిటిష్ ఇండియన్ పోలీసు దళాలు అడ్డంగించాయి. అయినా ముందుకే కదలడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆమె ‘వందేమాతరం’ నినాదం చేస్తూనే కుప్పకూలిపోయింది. ఆమె పక్కనే మార్చ్ చేస్తున్న ఇద్దరు యువకులు సఖావత్ అలీ, సతీష్ చంద్ర సామంతా పైనా పోలీసులు కాల్పులు జరపడంతో వారూ వీర మరణం పొందారు. మాతంగినీ హజ్రా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత ధైర్యవంతురాలిగా చరిత్ర లిఖించారు. తామ్లుక్‌లో ఆమె బలిదానం జరిగిన చోట ఆమె విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. ప్రస్తుతం ఉన్న తామ్లుక్ పోలీస్ స్టేషన్ పేరు ‘మాతంగినీ హజ్రా పోలీస్ స్టేషన్‘గా మార్చారు. భారత ప్రభుత్వం 2002లో ఆమె గౌరవార్థం ఒక తపాలా బిళ్లను జారీ చేసి తనను తాను గౌరవించుకుంది. -
నన్నుఇంటికి తీసుకువెళ్ళు
ఒక ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని కనుగొనడానికి మనకు రెండు విషయాలు అవసరం. అవి ఒకటి మ్యాప్ రెండు దిక్సూచి. లేదా రెండింటిని కలిపే గూగుల్/ఆపిల్ మ్యాప్స్. మ్యాప్ మన గమ్యస్థానానికి సంబంధించి ..ప్రస్తుత స్థానం తోపాటు వెళ్లాల్సిన ప్రదేశం దిశను తెలియజేస్తుంది. అయితే దీన్ని సులభంగా జంతువులు పసిగట్టేయగలవట. అందుకుతగ్గట్టుగా మెదడు, అవయవాల ప్రత్యేక అమరిక ఉందని జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేగాదు హోమింగ్ పావురాలలో ఈ నావిగేషన్ సామర్థ్యం ఉందని అర్ధ శతాబ్దానికి పైగా చేసిన అధ్యయనం వెల్లడైందట అందుకోసం ఇవి సూర్యుడిని ఆధారంగా చేసుకుంటాయని గుర్తించి విస్తుపోయారు శాస్త్రవేత్తలు. అందుకోసం రాత్రిపూట కృత్రిమంగా వెలుగుని ప్రసరించేలా చేసి, పగటిపూట చీకటి ఉంటేలా చేశారట పరిశోధకులు. దాంతో అవి శరీర గడియారాన్ని మార్చుకునే వ్యస్థను తటస్థీకరించిందని గుర్తించాయట. ఎందుకంటే దాని వల్లే కొన్ని పక్షులు ఎండగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉండగా, మరికొన్ని ఇంటికి వెళ్లే మార్గాన్నే గుర్తించడంలో విఫలమయ్యాయట. కానీ మేఘావృతమైన రోజుల్లో ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయట. అదెలా అని పరిశోధించగా..అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అంచనా వేశారు. అనేక జంతువులు, పక్షులు మాదిరిగా ఈ పావురాల ముక్కుల పై భాగంలో మాగ్నెటైట్ (లేదా ఐరన్ ఆక్సైడ్) కణాలు ఉంటాయట, అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని దిక్సూచిలాగా గ్రహించడానికి సహాయపడతాయట. ఈ ఇంద్రియాన్ని నిష్క్రియం చేసేలా పరిశోధకులు పక్షుల తలలకు అయస్కాంతాలను అనుసంధానించారు. అలాగే వాటి ముక్కులకు అనస్థీషియా ఇచ్చారు. దాంతో అవి సూర్యుడిని ఉపయోగించి నావిగేట్ చేయలేకపోయాయి. అలాగే మబ్బుగా ఉన్న రోజుల్లో దారితప్పాయట. అయితే ఎండగా ఉన్న రోజుల్లో అవి తమ మార్గాన్ని సులభంగా గుర్తించాయట. ఇక్కడ ఆ పావురాలు ఒక ఇంద్రియాన్ని కోల్పోతే మరొక ఇంద్రియాన్ని భర్తీ చేస్తున్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇది నిజం అనేలా ఒక అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జాన్ హాగ్ర్స్టమ్ పక్షులు తాము ఎక్కడ ఉన్నాయో ఎలా చెప్పగలవో వివరించేలా ఒక సిద్ధాంతాన్ని వివరించారట. ఆ సిద్ధాంతం ప్రకారం..భూమి అయస్కాంత క్షేత్రంలో స్థిరమైన పౌనపున్యం ఇన్ఫ్రాసౌండ్ విడుదల చేస్తుందని, అయస్కాంత క్షేత్రం వలే గ్రహం ప్రతి భాగానికి దాని స్వంత సోనిక్ సౌండ్ ఉంటుంది. కొన్ని పక్షులు ఈ ఇన్ఫ్రాసౌండ్లను వినగలగడమే కాదు, అవి ఎటు నుంచి వస్తుందో గుర్తించగలదని అంటున్నారు జాన్. అయితే మరికొందరు ఆ శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతంతో విభేదిస్తున్నారు. కచ్చితంగా ఇది ఎలా సాధ్యం అనేది నిర్థారించాల్సి ఉంది. చెప్పాలంటే జంతువులు తమ గమ్యస్థానానికి తిరిగి వెళ్లడానికి దృష్టి, వాసన, సూర్యుడు, నక్షత్రాలు, భూమి అయస్కాంత క్షేత్రం, ఇన్ఫ్రాసౌండ్ లేదా వీటన్నింటి కలయికను వినియోగిస్తాయా? లేదా అనేది ఒక మిస్టరీగా ఉంది. అయితే ఈ సామర్థ్యం వాటికి ఎలా వచ్చిందనేది తెలుసుకునేందుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి గూళ్లకు సులభంగా చేరుకునే హోమింగ్ పావురాల ఎంపిక చేసి మరి పెంచుతారట. సింపుల్‌గా చెప్పాలంటే ఇది జన్యు లక్షణం. అయితే ఇది కొన్నింటి ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. కొన్ని జంతువులు దారితప్పితే తమ గమ్యస్థానానికి చేరుకోవాలో తెలియగా గందరగోళానికి గురవ్వుతాయట. దీనిపై సంవత్సరాలుగా రోమ్, నేను జంతువుల మాదిరిగానే తమలో ఎవరికి దిశానిర్దేశం ఉందో వాదించుకున్నాం. కానీ ఒక అసాధారణ క్షేత్ర పరిశోధకురాలు, జె. విజయకు అద్భుతమైన దిశానిర్దేశం ఉంది. ఆమె తెలియని అడవిలో తిరుగుతుంది. చెట్టును కోయకుండా లేదా కొమ్మను కొట్టకుండా, ఖచ్చితంగా తన మార్గాన్ని కనుగొంటుంది. ఆమెకు ఎలా సామర్థ్యం ఎలా వచ్చిందో తెలియదు, అందుకోసం ఏం చేస్తుందో కూడా తెలియదు. రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తిరిగి వచ్చాక, చీమల దాడితో పోరాడినప్పుడు ఈ హోమింగ్ స్వభావం నాపై తిరిగి వచ్చింది. అత్తగారి మాట గుర్తుకు వచ్చి, నేను తృణప్రాయంగా తోట నుంచి రెండు కప్పలను పట్టుకుని సింక్ కింద వదిలేశాను. అవి నేరుగా తమ అడవి తోటలోకి వెళ్లిపోయాయి. ఈసారి అలా కాదని ఒక కార్డ్ బోర్డు పెట్టేలో పెట్టాను..అవి మల విసర్జనలతో దుర్వాసన కలిగించినా.. చీమల బెడదను నివారించాయి. ఈసారి ఈ కప్పలను ఇలా కార్డ్బోర్డ్లో బంధించకుండా రెడ్ కార్పెట్ట్రీట్మెంట్ సౌకర్యం అందిస్తా..ఎందుకంటే చీమల బెడద లేకుండా చేస్తే కచ్చితం వాటిని ముద్దుపెట్టుకుంటా.Author : Janaki Lenin -- జానకి లెనిన్Photo credit - జానకి లెనిన్(చదవండి: Frogs నన్ను ఇంటికి తీసుకు వెళ్ళు) -
బాల వినాయకులకు గిరాకీ..!
మనం చేసుకునే పండగలు వెనుక ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అవ్వడం. కానీ ఆధునిక పోకడలు పర్యావరణ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఉపయోగిస్తున్న ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో తయారు చేస్తున్న విగ్రహాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాయి. దీనివలన జీవకోటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వినియోగించాలనే సంకల్పంతో అమలాభట్ట గ్రామస్తులు మట్టితో విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. వీటిని ఉపయోగించడం వలన పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇలా మట్టి మేలు తలపెడుతున్న వారిని ఒకసారి పలకరిస్తే... – రాయగడ ఒడిశా రాయగడ జిల్లా కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో అమలాభట్ట గ్రామం ఉంది. ఈ గ్రామంలోని సుమారు 100 కుటుంబాలు మట్టినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయి. వీరు ప్రకృతిహితంగా విగ్రహాలను తయారు చేస్తుంటారు. కేవలం మట్టినే ఉపయోగించి అందమైన విగ్రహాలను తయారు చేయడంలో అమలాభట్ట గ్రామానికి ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు వంటి ప్రత్యేక దినాల్లో విగ్రహాల తయారీలో ఇంటిళ్లపాది నిమగ్నమవుతుంటారు. ఈ ఏడాది కూడా వినాయక ఉత్సవాలకు సంబంధించి విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. మూడు నెలల ముందుగానే విగ్రహాలను రూపొందించడంలో నిమగ్నమైన యువతీ, యువకులు రేయింబవళ్లు కష్టించి విగ్రహాలను తయారీ చేస్తున్నారు. మూడు నెలల పాటు కష్టపడి పనిచేస్తే సుమారు రూ.50 వేల వరకు ఆదాయం ఒకొక్కరికీ లభిస్తుందని చెబుతున్నారు. అయితే గత మూడేళ్లుగా తమ వ్యాపారాలు చాలా మందకొడిగా కొనసాగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వినాయక విగ్రహాలకు సంబంధించి సహజ రంగులు ధరలు ఆకాశానంటుతుండడంతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్‌తో రూపొందించిన విగ్రహాల విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలకు గిరాకీ తగ్గుతోందని చెబుతున్నారు. బాల వినాయకులకు గిరాకీ ఈ ఏడాది ఆర్డర్లు ఇచ్చేవారు బాల వినాయకుల ప్రతిమలకు అత్యంత ప్రాధాన్యమివ్వడంతో పాటు ఆర్డర్లకు అనుకూలంగా విగ్రహాలను తయారు చేస్తుండడం విశేషం. మువ్వగోపాలుడు, బాల వినాయకుడు వంటి వేషధారణల్లో ఈ ఏడాది వినాయకుల విగ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. రాయగడ జిల్లాలోని గుణుపూర్, గుడారి, మునిగుడ, పద్మపూర్ వంటి ప్రాంతాలతో పాటు గజపతి జిల్లా నుంచి అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన మన్యం జిల్లా పార్వతీపురానికి చెందినవారు కూడా ఈసారి వినాయక విగ్రహాలకు ఆర్డర్లు ఇచ్చారు. డైలీ మార్కెట్లో విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలను ఈ గ్రామానికి చెందిన యువతులు రూపొందిస్తున్నారు. వాటిని స్వయంగా తయారు చేసి రంగులు అద్ది, పూర్తయిన తర్వాత చవితికి మూడు రోజుల ముందుగానే రాయగడ పట్టణంలోని మార్కెట్లో విక్రయిస్తుంటారు. ప్రతీ ఏడాది మహిళలు వినాయక చవితి సందర్భంగా కష్టపడి విగ్రహాల తయారీతో పాటు వాటిని విక్రయించి కొంతమొత్తం ఆదాయం సంపాదించుకుని కుటుంబ పోషణకు అండగా నిలుస్తుంటారు. వినాయక చవితిని పురస్కరించుకుని ప్రతీ ఏడాది చిన్న చిన్న విగ్రహాలను మహిళలమే రూపొందిస్తుంటాం. తయారీ పూర్తయితే రంగులు అద్ది వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం. రూ.10ల నుంచి రూ.100ల వరకు విగ్రహాలను రూపొందిస్తుంటాం. అయితే కొనుగోలుదారులు మా కష్టానికి తగ్గ ఆలోచించకుండా బేరసారాలు అడుతుంటారు. విక్రయాలు మందకొడిగా ఉంటే ఒకొక్కసారి గిట్టుబాటు ధర లేకపోయినప్పటికీ విక్రయించాల్సి వస్తుంది. ఒకవేళ అలా విక్రయించకపోతే పెట్టుబడి కూడా నష్టపోతాం. – పొందూరు లక్ష్మి, అమలాభట్ట షెడ్డు నిర్మిస్తే ప్రయోజనం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు మట్టినే నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నాయి. వర్షం వస్తే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. చేసిన విగ్రహాలు వర్షాలకు తడిచి పాడవుతున్నాయి. పాలిథిన్ ఖరీదు చేసి వర్షం కురిసే సమయంలో విగ్రహాలను కప్పుకోవాల్సి వస్తోంది. అదే గ్రామంలో అందరి కోసం షెడ్డు ఉంటే అంతా అక్కడే విగ్రహాలు తయారీ చేసుకునే అవకాశం ఉండేది. షెడ్డు లేకపోవడంతో ఎవరి ఇంట్లో వారే విగ్రహాలను తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. భారీ వినాయకుల తయారీ కోసం బయట వేరొకరిపై ఆధారపడాల్సి వస్తోంది. – వంజరాపు రాజేష్, అమలాభట్ట ఇదీ చదవండి: జోరు జోరుగా జోగ్.. క్యూ కడుతున్న టూరిస్టులుఅధికారులు దృష్టి సారించాలి గత రెండేళ్లుగా వచ్చిన ఆర్డర్ల ప్రకారమే విగ్రహాలను రూపొందిస్తున్నాం. ఆర్డర్లు లేకుండా తయారు చేస్తే అవి విక్రయాలు జరగక నష్టపోవాల్సి వస్తోంది. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నా, వాటి ఆదరణే అధికమవ్వడంతో మా వ్యాపారాలు §ð దెబ్బతింటున్నాయి. మట్టినే నమ్ముకున్న మా కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. జిల్లా యంత్రాంగం వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.- పి.వెంకటరావు, అమలాభట్ట చదవండి: క్షణం ఆలస్యమైతే అంతే సంగతులు : వైరల్ వీడియో -
బంధం..బంధనం ఏదైనా..ఒకరికొకరం.. అంతేగా!
బంధం ఏదైనా... బంధనం ఏదైనా..ఒకరికొకరం నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు, నేను.. మాకు, మీరు, మీకు మేము, ఒకరికొకరం మనమే మనము!చదవడానికే ఇంత బావుంటే, క్రియారూపంలో ఇంకెంత బావుంటుంది?ఈ రోజు రాఖీ పండుగ కాబట్టే కాదు, మొన్న అంతర్జాతీయ స్నేహ దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, మదర్స్ డే, ఫాదర్స్ డే, దంపతుల దినోత్సవం, బ్రదర్స్ డే, సిస్టర్స్ డే.. వగైరా వగైరాలు జరుపుకుంటూనే ఉంటాం కదా!ఇవన్నీ ఎందుకు? ఒక రోజుకే సంబంధించిన అంశాలు కావు ఇవి. ఒక రోజంటూ నిర్ధారించుకుని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆత్మీయతలను కలబోసుకోవడానికి, రాబోయే రోజులను ఆ అనుబంధాలను భద్రపరచుకోవడానికి, వాటి గాఢతను ప్రోది చేసుకోవడానికి వాడుకుంటాము. రాఖీ పండుగ గురించి మైథాలజీ చెప్పే కథ ఏదైనా కావచ్చు, ఈ కాలంలో ప్రతి మనిషి ఒకరికి ఒకరు అనుకోవాలి. అనుబంధాలు పలుచన అయిపోతున్నాయి అని అనుకోవడం కాదు, మనం ఆ అనుబంధాలను కొనసాగించడం, నిలుపుకోవడం తెలుసుకోవాలి. ఒకప్పుడు అక్కాచెల్లెళ్ల బాధ్యత అన్నదమ్ములది అనే వారు. ఆడపిల్లను రక్షించడం, బాధ్యతగా చూసుకోవడం, కష్ట సమయాల్లో ఆదుకోవడం అన్నీ అన్నదమ్ముల బాధ్యత. ఈ పరిస్థితి అప్పటి కాలానిది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో పరిస్థితులు వేరు. నిజానికి మైథాలజీలోని కథను చూసినా, ద్రౌపది ముందు కృష్ణుడి చేతి వెలి గాయానికి తన చీర చించి కట్టు కట్టింది. ఆ ప్రేమ, ఆ అక్కరకు బద్ధుడైన కృష్ణుడు ఆమెకు రక్షగా ఉంటాను అంటాడు. ఇదీ చదవండి: పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?అసలు ఈ కాలంలో ఒకరికి ఒకరు కట్టుకోవాలి రాఖీ. కష్టంలో, సుఖంలో తోబుట్టువులు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అక్కలు, చెల్లెళ్లు అన్నదమ్ముల బాధ్యత మాత్రమే కాదు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ బాధ్యత కూడా. అందుకే ఒకరికి ఒకరు. భారతదేశంలో ముడి అనేది ఒక కనెక్షన్ కి చిహ్నం. ఆ ముడిలో ఒక అనుబంధానికి ఇష్టబంధనం కాబడతామేమో. మా పెళ్లి సమయంలో మా ఆయన మాత్రమే తాళి ఎందుకు కట్టాలి? నేను కూడా ఆయనకు ఒక తాళి కడతాను అని పేచీ పెట్టాను నేను. నా నేస్తాలు నన్ను బ్రతిమాలి ఆపారు. అప్పుడేమిటి? ఇప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడతానని నన్ను రెబెల్ అంటారు. కానీ నేను అనే దాంట్లో తప్పేముంది?రాఖీ కావచ్చు, ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కావచ్చు, పెళ్లిలో వేసే తాళి కావచ్చు, అన్నీ అనుబంధానికి చిహ్నాలు, ప్రతీకలుగా భావిస్తాము కాబట్టే కదా! ఈ ముడులు లేకపోయినా మానసిక బంధాల విలువ గొప్పది. ఒకరికి ఒకరం చేసుకునే చిన్న చిన్న పనులు గొప్పవి. ఒకరికే బాధ్యత ఆపాదించడం ఈ కాలానికి, భవిష్యత్ కాలానికి కూడా సరికాదు. నాకు ఇష్టమయినవి, నా అవసరాలు నా చెల్లికి, తమ్ముడికి తెలియాలి. వాళ్ళకు ఇష్టమయినవి, వాళ్ళ అవసరాలు నాకు తెలియాలి. అలాగే భార్యాభర్తలు, స్నేహితులు, బంధువులూ.. అందరం.. ఒకరికి ఒకరం అన్నట్టే ఉండాలి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పనిప్రపంచంతో పరుగుపందెం వేసే ఈ కాలంలో మనతో పాటు మనవాళ్ళూ ఉండాలి. మనం వాళ్ళతో ఉండాలి. చిన్న చిన్న సంతోషాలను, సందర్భాలను పంచుకోవాలి. ఎవరినీ ఎవరూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా సహాయం, సౌభ్రాతృత్వం చేతులు మారి, జీవితాలను చేరాలి. అన్నీ కథలే...ఏ హృదయాన్ని కదిలించినా వ్యధలే...అన్ని సమపాళ్ళలో జీవన రసాలు ఇపుడసలు లేవుఉగాది పచ్చడి రుచులు నిజజీవితాల్లో లేవుఅడగకూడదిక ఎవర్నీ....నువ్వెలా ఉన్నావని!కదిలించకూడదిక ఎవర్నీ....ఏమిటి విశేషాలని!దీన గాథలను చేతుల్లో మొయ్యని ఆత్మలు లేవురెప్పల లోపల ఇసుకను భరించని కళ్ళు లేవు అన్నీ చప్పటి వెలితికి చిహ్నాలే...అన్నీ ఉప్పటి నీటికి బానిసలే...స్పర్శించాలిక అందర్నీ...కాస్త ధైర్యాన్నివ్వడానికి!హత్తుకోవాలిక ఆ చూపుల్ని...వెలుగు ఎంతో దూరం లేదని చెప్పడానికి!మనం ఒకరికి ఒకరం అని నిబద్ధతగా నిలబడడానికి!! - విజయభాను కోటే, ప్రభుత్వ ఉపాధ్యాయిని వైజాగ్ -
కరువు సీమగా ఉండే పులివెందులను ఆకుపచ్చ బంగారం చేసిన YSR
-
అంతర్గత సంపదే నిజమైనది
ఇంటా బయట ఆందోళనకరమైన జీవన విధానం. నిత్యం ఒత్తిడి, భావోద్వేగ సంఘర్షణలు. అయితే... ధ్యానం ద్వారా వాటిని సమతుల్యం చేసుకునే శక్తి మనకు ఉంది. ధ్యానం ఆత్మ సముద్ధరణకు ఉపయోగపడే అత్యున్నతమైన సాధనం. ఇంటిలో, సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాలంటే ముందు మనలో ప్రశాంతత కలగాలి అని వివరించారు బ్రహ్మకుమారీస్ రాజయోగిని కులదీప్ దీది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘సంత్ సమాగమమ్’ కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.‘నేటి వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి పోటీ, మితిమీరిన సాంకేతికత, భావోద్వేగ సంఘర్షణల కారణంగా మనశ్శాంతిని కోల్పోతున్నాం. ధ్యానం శక్తిమంతమైన, సమగ్రమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సహనాన్నిప్రోత్సహించి సామరస్యాన్ని పెంపొదిస్తుంది. మానసికంగా ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. మానసిక శ్రేయస్సును పెంచుతుంది. ఈ విషయాలు అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. యువతలో వేగవంతమైన భావోద్వేగాలు..నేటి యువత భావోద్వేగాలకు చాలా ఎక్కువగా గురవుతోంది. వేగవంతమైన భావోద్వేగాలు, విచ్ఛిన్నమైన సంబంధాలు, ప్రేమ గురించి విరుద్ధమైన ఆలోచనలతో వారి జీవితమే కాకుండా వారి ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలుగుతోంది. మనం వారికి ఏం చెప్పగలం అంటే.. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణ లేదా భావోద్వేగం కాదు. అది అర్థం చేసుకోవడం, గౌరవించడం, అవసరమైనప్పుడు కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. లోలోపల ఖాళీగా అనిపిస్తే బయట ప్రేమ కోసం వెతకద్దు. ప్రేమ స్వీయ అవగాహనతో ్ర΄ారంభమవుతుంది. జీవితం కేవలం ఆనందం కోసం కాదు ప్రయోజనం కోసం అని గ్రహించాలి.గృహిణులు ఇంట్లో శాంతిని నిలబెట్టాలంటే... ‘నేను ప్రశాంతమైన ఆత్మను’ అనేది ముందుగా గుర్తుంచుకోవాలి. కొన్ని నిమిషాల నిశ్శబ్దం లేదా ధ్యానంతో రోజును ప్రారంభించాలి. కుటుంబ సభ్యులను కేవలం పాత్రలుగా కాకుండా ఆత్మలుగా చూడండి. ఇది సహనాన్ని, మంచి అవగాహనను తెస్తుంది. వంట చేసేటప్పుడు మీ ఆలోచనలను స్వచ్ఛంగా, ఉన్నతంగా ఉంచుకోండి. ఎటువంటి లక్షణాలు ఉన్న భోజనం తింటారో అటువంటి ఆలోచనలే వస్తాయి. జీవితం అలాగే తయారవుతుంది. గృహిణి ప్రశాంతంగా ఉన్నప్పుడు, మొత్తం కుటుంబం సురక్షితంగా, ప్రేమగా, సంతోషంగా ఉంటుంది. మనిషి జీవితం ధ్యేయం...‘నేను ఎవరు?’ నాది ఏది, సత్యత ఏంటీ.. అనేది గ్రహించాలి. రోజువారీ జీవితంలో శాంతి, ప్రేమ, స్వచ్ఛత వంటి అసలు లక్షణాలను వ్యక్తపరచాలి. మనం కేవలం శరీరాలు కాదు. మనం ఆత్మలం. ప్రతి ఆత్మ తన ప్రత్యేక΄ాత్రను ΄ోషించడానికి, ప్రపంచానికి ఏదైనా మంచిని అందించడానికి ఇక్కడ ఉంది. మనం విలువలు, ఆధ్యాత్మిక అవగాహనతో జీవించినప్పుడు మనం లోపల నండి సంతృప్తి చెందుతాం. ధ్యానం మనకు పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, మన ఉన్నత ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ‘నేను ప్రతిరోజూ మెరుగవుతున్నానా?’ అని తమని తాము ప్రశ్నించుకోగలిగితే, మీరు సరైన మార్గంలో ఉన్నారనేదానికి అదే సంకేతం. వెలితిగా ఉండటానికి పరిష్కారం..బాహ్య, భౌతిక విజయం వాస్తవానికి అంతర్గత శూన్యతను పూరించదు. నిజమైన సంతృప్తి అంతర్గత శాంతి, ప్రేమ నుండి వస్తుంది. మన ఆత్మ పరమ సంబంధం కోరుకుంటుంది. మనం స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ఇతరులకు సేవ చేసినప్పుడు మనం అర్థవంతంగా, సంతృప్తిగా భావించడం ప్రారంభిస్తాం. నిశ్శబ్దం, సరళత, ఆధ్యాత్మికత మన హృదయాన్ని నింపుతాయి. ఇవేవీ బాహ్య విజయాల ద్వారా అందవు. ఆధ్యాత్మికత తోడవ్వాలి. అంతర్గత సంపద ఉంటే వెలితి అనేదే ఉండదు’’ అని తెలిపారు ఈ రాజయోగిని.నేను ఆత్మను అనే భావనతో అవగాహన... ‘నేను ఒక ఆత్మను’ అనే అవగాహన మనకు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. భావోద్వేగపరంగా తక్షణమే స్పందించే బదులు, అవగాహనతో ప్రతిస్పందిస్తాం. ఇతరులను వారి రూ΄ాలతో, పనులతో కాకుండా ఆత్మలుగా చూడటం ప్రారంభించినప్పుడు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ అవగాహన సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. పిల్లలపై తల్లిదండ్రుల దృష్టికోణం... తల్లిదండ్రులు పిల్లలను ఆస్తిగా కాకుండా వారి స్వంత ప్రయాణంతో కూడిన వ్యక్తిగత ఆత్మలుగా చూడాలి. ప్రతి బిడ్డ ప్రత్యేకమైనవాడే. ఇతరులనుండి ప్రేరణ కలిగించవచ్చు. కాని ఇతరులతో ΄ోల్చకూడదు. ప్రేమ అంటే ప్రతి కోరికనూ నెరవేర్చడం కాదు. అలా చేస్తే వారి కోరిక తీరక΄ోతే మారాం చేయడమో, మొండిగా అవ్వటమో చేస్తారు. సమయం చూసి వారితో ప్రేమతో మాట్లాడాలి. కఠినంగా కాకుండా ప్రశాంతంగా, స్పష్టతతో మాట్లాడండి. పిల్లలు సురక్షితంగా, ప్రేమతో ఉన్నప్పుడు బాగా వింటారు. అంతర్గత బలం వారికి ప్రేమ, సరైన మార్గదర్శకత్వం రెండింటినీ ఇవ్వడానికి సహాయ పడుతుంది– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చరిత్ర సృష్టించిన కుట్ర కేసు!
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్‌లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవ కారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి కొందరు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), తరిమెల నాగిరెడ్డి (టీఎన్) తదితరులు ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని కారణంగా అరెస్టు కాలేదు. సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్ర కేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్ర కేసు’. అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్ర కేసు’గా బహుళ ప్రచారం పొందింది. దీనికి ముఖ్య కారణం వీరిపై పెట్టిన కేసును డీవీ, టీఎన్లు స్వయంగా వాదించి సంచలనం సృష్టించడం. 1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనంలో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవ కారుల వ్యూహం – ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ‘తక్షణ కార్యక్రమం’ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి వీరు కుట్ర పన్నినట్లు పేర్కొంది. 1970 జూన్‌లో ఈ కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో– డీవీ, టీఎన్లు ఈ ‘తక్షణ కార్యక్రమా’న్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసి కూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవసంప్రదాయాలకు పట్టం కట్టారు. కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు కూడా ఈ శిక్షలను నిర్ధారించింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిష¯Œ ్సపై జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో డీవీ, టీఎన్లతో సహా కుట్రకేసులో ఉన్న ముఖ్య నాయకులంతా రహస్య జీవితానికి వెళ్లిపోయారు.డీవీ, టీఎన్ ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్మెంట్ను కేసులో ఉన్న అందరి తరఫున తయారుచేసి, విచారణ సందర్భంగా డీవీ వివరించారు. ఈ ప్రకటన ‘డీవీ స్టేట్మెంట్’గా ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టీఎన్ ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమా’నికి అన్వయించి రాసి... స్టేట్మెంట్ రూపంలో కోర్టులో రెండు గంట లపాటు ఎంతో శక్తిమంతంగా వివరించారు.డీవీ, టీఎన్ కోర్టును తమ రాజకీయాల ప్రచార వేదికగా చేసుకున్న ఫలితంగా ఈ స్టేట్మెంట్లు కొత్త ఒరవడిని సృష్టించాయి. వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో ముఖ్యమైనవి: ‘సాయుధ పోరాటాలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో భూసంస్కరణలు అమలు జరగటం అసంభవం’, ‘వర్గపోరాటం, ప్రజల సాయుధ విప్లవం ద్వారా పాలకవర్గాన్ని కూలదోయటం తప్పనిసరిగా జరుగుతాయి’, ‘కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం’, ‘మా విప్లవ పంథా రివిజనిస్టుల పార్లమెంటరీ పంథాకు పూర్తిగా భిన్నమైనది, మా పం«థాను గురించి మా తక్షణ కార్యక్రమంలో ప్రకటించాం.’ ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో... వాటిని అంగీకరిస్తూ కోర్టులో స్టేట్మెంట్లు ఇచ్చి విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచారు వీరు. డీవీ 1984 జూలై 12న చనిపోగా, టీఎన్ ఎమర్జెన్సీకాలంలో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో 1976 జూలై 28న చనిపోయారు. అలా వీరు జూలై మాసంలోనే అమరులవ్వడం యాదృచ్ఛికమే అయినా ఆసక్తిదాయకం. వారికి విప్లవాభివందనాలు.– ముప్పాళ్ళ భార్గవ శ్రీ సీపీఐ ఎంఎల్ నాయకులు(రేపు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వర్ధంతి) -
చినుకు చినుకుల జీవధార
ప్రకృతి సహజ పరిణామమైన రుతుచక్ర భ్రమణంలో ఏటా వర్షర్తువు వస్తుంది. వర్షాకాలం ఏటా రావడం తథ్యమే అయినా, వాన రాకడలో తరచుగా ముందు వెనుకలు జరుగుతుంటాయి. ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు’ అని మనకో సామెత ఉంది. ఎప్పుడు కురుస్తాయో తెలియని వాన రాక కోసం ఒక్కో ఏడాది రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కో ఏడాది వానలు పుష్కలంగా కురుస్తుంటాయి. ఒక్కో చోట అనావృష్టి కరవు కాటకాలను సృష్టిస్తుంది. ఒక్కో చోట అతివృష్టి వరదలతో ముంచెత్తి పెనునష్టాన్ని కలిగిస్తుంది. వానలు తెచ్చిపెట్టే కష్టనష్టాలు ఎలా ఉన్నా, వానలు లేనిదే మనుగడ సాగించడం అసాధ్యం. ఈ భూమ్మీద మనుషులతో పాటు పశుపక్ష్యాదులు, చెట్లు చేమలు వంటి సమస్త జీవులు బతకాలంటే, వానలు కురవాల్సిందే!వానలే లేకుంటే మనం నివసించే ఈ భూమి కూడా మిగిలిన గ్రహాల మాదిరిగా జీవరహిత గోళంగానే మిగిలి ఉండేది. వానల వల్లనే భూమి మీద జీవజాలం ఏర్పడింది. వానల వల్లనే భూమి మీద నాగరికతలు ఏర్పడ్డాయి. తొలినాటి మానవులకు వాన ఒక ప్రకృతి అద్భుతం. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, చిటపట చినుకులతో మొదలై, క్రమంగా పుంజుకుని జడివానగా మారే దృశ్యం ఇప్పటికీ ఒక అద్భుతమే! నాగరికతలు ఏర్పడిన కాలం నుంచి వివిధ సంస్కృతులలో వర్షారాధన ఉండేది. వానాకాలంలో ప్రత్యేకంగా జరుపుకొనే పండుగలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు వర్షవర్ణన కనిపిస్తుంది. వైదిక సాహిత్యంలోని ‘పర్జన్యసూక్తం’, ‘వరుణస్తుతి’ వంటివే కాకుండా, లౌకిక సాహిత్యంలోనూ కవులు మేఘవర్ణన, వర్షవర్ణన చేశారు.‘ఆనందదో వర్షతు మేఘ వృందఃఆనందదా జలధరా స్సంతతం భవంతుఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యంఆనందినీ రోషధయో భవంతు’అని ‘వరుణస్తుతి’ వర్షానందాన్ని స్తుతించింది.‘విరిసెను మేఘ పరంపరమెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్పరచెను ఝంఝానిలములుకురిసెను వర్షము కుంభగుంభితరీతిన్’అంటూ మబ్బులతో మొదలై కుంభవృష్టిగా మారే వర్షదృశ్యాన్ని ఆవిష్కరించారు గుంటూరు శేషేంద్రశర్మ.నాగరికతలతో పాటు సంగీత సాహిత్యాది కళలను కూడా ప్రభావితం చేసిన ప్రకృతి పరిణామం వాన. వానలు లేనిచోట జీవం ఉండదు. జీవానికి తావులేని చోట మనుగడ ఉండదు. మనుగడ లేని చోట ఇక నాగరికతలెక్కడ? సంగీత సాహిత్యాది కళావైభవాలెక్కడ? భూమ్మీద వానలు కురిసే తావులతో పాటు అక్కడక్కడా చినుకు కురవని ఎడారులు కూడా ఉన్నాయి.ఇప్పటి ఎడారులు ఒకనాడు పచ్చని నేలలేనని, ప్రకృతి మార్పుల ఫలితంగానే అవి ఎడారులుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేదని; ఒకప్పుడు అక్కడ జలకళతో అలరారే సరోవరాలు, నదులు ఉండేవని; వాటి ఒడ్డున పచ్చని సవన్నా గడ్డిభూములు ఉండేవని; ఆ గడ్డిభూముల్లో అనేక జంతువులు జీవించేవని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. వేలాది సంవత్సరాల పరిణామంలో భూకక్ష్యలో వచ్చిన మార్పుల వల్ల సహారా ప్రాంతంలో వానలు కురవడం ఆగిపోయి, పూర్తిగా ఎడారిగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో సహారా ఎడారిలో అక్కడక్కడా తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తోంది. ‘ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్’ ఉత్తర దిశవైపు కదిలినప్పుడు సహారా ఎడారిలో అక్కడక్కడా నాలుగు చినుకులు కురుస్తున్నాయి. ఆ చినుకుల వల్లనే ఈ ఎడారిలో తాత్కాలికంగా పచ్చదనం కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వర్షారాధన సంస్కృతిప్రాచీన నాగరికతలు విలసిల్లిన ప్రతిచోట వర్షారాధన సంస్కృతి ఉంది. అన్ని నాగరికతలలోనూ వర్షాలకు అధిదేవతలు ఉన్నారు. భారత ఉపఖండంలో వైదికార్యులు ఇంద్రుడిని, వరుణుడిని వర్షాధిదేవతలుగా కొలిచేవారు. మన పురాణాల్లో ఇంద్ర వరుణుల ప్రస్తావన కనిపిస్తుంది. ప్రాచీన గ్రీకు ప్రజలు వర్షాల కోసం జూస్ అనే వర్షాధిదేవుడిని, హైయడీస్ అనే అప్సరసలను ఆరాధించేవారు. వర్షాల కోసం ప్రాచీన రోమన్లు దేవతలకు రాజైన జూపిటర్ను, సముద్రాధిదేవత అయిన నెప్ట్యూన్‌ను పూజించేవారు. ప్రాచీన ఈజిప్షియన్ ప్రజలు టెఫ్నట్ అనే వర్షదేవతను ఆరాధించేవారు. సుమేరియన్ నాగరికతలోని ప్రజలు ఇష్కుర్ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు.ఇష్కుర్కు ‘అదాద్’ అనే మరోపేరు కూడా ఉన్నట్లు అకాడియన్ పురాణాల కథనం. మధ్య అమెరికాలోని మాయన్ నాగరికత ప్రజలు చాక్ అనే వర్షాధిదేవుడిని పూజించేవారు. ఉత్తర అమెరికాలో మూలవాసులైన నవాజో ప్రజలు టొనీనిలీ అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. దక్షిణ అమెరికాలో పురాతన మూయిస్కా మతస్థులు వర్షాల కోసం చిబ్చాకూమ్ అనే దేవుడిని పూజించేవారు. ప్రాచీన చైనీస్ ప్రజలు యుషి అనే వానదేవుడిని పూజించేవారు. జపాన్‌లోని షింటో మతస్థులు కురాఒకామి అనే వర్షాధిదేవుడిని ఆరాధించేవారు. ఆస్ట్రేలియాలోని మూలవాసులు వాంజినా అనే వర్షాధిదేవతను పూజించేవారు. వానల కోసం దేవుళ్లను, దేవతలను పూజించడం, వారి ప్రీతి కోసం రకరకాల నైవేద్యాలు సమర్పించడం, పండుగలు జరుపుకోవడం పురాతన కాలం నుంచే ఉంది. చాలాచోట్ల ఇప్పటికీ వానల కోసం ప్రత్యేకంగా పూజలు జరపడం, వేడుకలు జరపడం వంటి ఆచారాలు కొనసాగుతున్నాయి.మన వానాకాలం పండుగలుమన దేశంలో వానాకాలంలో వచ్చే పండుగలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పండుగలను దేశవ్యాప్తంగా జరుపుకొంటే, మరికొన్నింటిని వేర్వేరు ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజలు జరుపుకొంటారు. వానాకాలంలో వచ్చే జగన్నాథ రథయాత్ర, కృష్ణాష్టమి, వినాయకచవితి పండుగలను దాదాపు దేశవ్యాప్తంగా జరుపుకొంటారు. అలాగే, తెలంగాణలో బోనాల పండుగ, కేరళలో ఓనం పండుగ, తమిళనాడులో ఆదిపెరుక్కు తదితర పండుగలు జరుపుకొంటారు. ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీజ్, లద్దాఖ్‌లో హెమిస్ సెచు, మేఘాలయలో భేడియేంఖ్లామ్, గోవాలో సావో జొవావో వంటి పండుగలను జరుపుకొంటారు. ఇవేకాకుండా, దేశవ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో శాకాంబరి పూజలు జరుపుతారు.అత్యధిక వర్షపాతంప్రపంచంలో కొన్నిచోట్ల దాదాపు ప్రతి ఏడాది అధిక వర్షాలు కురుస్తుంటాయి. ఇంకొన్ని చోట్ల అరుదుగా అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. మేఘాలయలోని మౌసిన్రామ్ గ్రామంలో 11,872 మిల్లీ మీటర్ల వార్షిక వర్షపాతం నమోదవడంతో ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఒకే సంవత్సరంలో అత్యధిక వర్షపాతం రికార్డు కూడా మౌసిన్రామ్ గ్రామానికే దక్కడం విశేషం. ఈ గ్రామంలో 1985 సంవత్సరంలో ఏకంగా 26,471 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ఫ్రెంచ్ ప్రభుత్వం అధీనంలోని రీయూనియన్ దీవిలోని ఫోక్ ఫోక్ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో అత్య«ధిక వర్షపాతం నమోదైంది. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్కు తూర్పున ఉన్న రీయూనియన్ దీవిలో సముద్రమట్టానికి 2,990 మీటర్ల ఎత్తులో ఉండే ఫోక్ ఫోక్ ప్రాంతంలో 1966 జనవరి 7–8 తేదీల నడుమ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా 1870 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.వానాకాలం వెతలుసెగలు రేపే వేసవి తర్వాత వచ్చే వర్షాలు కొంత హర్షాన్ని తెచ్చినా, తెరిపిలేని వానలు వరుసగా వెతలను కూడా మోసుకొస్తాయి. మన దేశంలోని పరిస్థితులనే చూసుకుంటే, వానలు కురిస్తే చాలు నగరాలు, పట్టణాల్లోని రహదారులన్నీ జలమయంగా మారుతాయి. మురుగునీటి ప్రవాహంతో నిండిన రోడ్లపై వాహనాల రాకపోకలకు అడుగడుగునా అవరోధాలు ఏర్పడతాయి. ఒక్కోసారి రోజుల తరబడి ముసురు విడిచిపెట్టని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు రోజువారీ కూలీలు ఉపాధి దొరకక ఇబ్బంది పడతారు. జలమయమైన రోడ్ల మీదుగా రాకపోకలు సాగించడానికి ఉద్యోగులు, విద్యార్థులు నానా ఇక్కట్లు పడతారు. అధిక వర్షాలు కురిసినప్పుడు నదుల్లో వరద పోటెత్తి, నదీ తీరాలలో ఉండేవారికి ప్రాణనష్టం, ఆస్తినష్టం వంటి తీవ్రనష్టాలు వాటిల్లుతాయి.వానాకాలంలో వీథులు, ఇళ్ల పరిసరాలన్నీ బురదమయంగా మారడంతో రకరకాల వ్యాధులు విజృంభిస్తాయి. పలుచోట్ల చిట్లిన మంచినీటి పైపులైన్లలోకి మురుగునీరు ప్రవేశించడంతో నీరు కలుషితమై, కలరా, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు పెరుగుతాయి. మురుగునీరు నిలిచిపోవడంతో ఈ కాలంలో దోమల బెడద పెరిగి, వాటి వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు సోకుతాయి. వాతావరణంలో తేమకు తోడు కాలుష్యం పెరగడం వల్ల జలుబు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు ఎక్కువవుతాయి. వానాకాలంలో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతుంటాయి.చాలా చోట్ల వీ«థుల్లోనే తినుబండారాలు అమ్మే దుకాణాలు, టీ షాపులు ఉంటాయి. వానాకాలంలో వీటి చుట్టూ మురుగునీరు, బురద చేరి ఉంటుంది. ఈగలు, దోమలు ముసురుతూ ఉంటాయి. పరిసరాలు అంత దారుణంగా ఉన్నా, ఉపాధి కోసం ఆ చిరువ్యాపారులు వ్యాపారాలు సాగిస్తుంటారు. అలాంటి చోట్ల తినుబండారాలు తినేవారికి వానాకాలంలో జీర్ణకోశ సమస్యలు, పరిసరాల శుభ్రత లోపించడం వల్ల రకరకాల అంటువ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువవుతాయి.వర్షాలు అతిగా కురిస్తే రైతులకు పంటనష్టం తప్పదు. పొలాల్లో నీరు నిలిచిపోయి, నాట్లు వేసే సమయంలో అతిగా వర్షాలు కురిస్తే, సజావుగా పెరగాల్సిన మొక్కలు కుళ్లిపోతాయి. పంట చేతికి వచ్చే సమయంలో అతిగా వర్షాలు వస్తే, రైతులకు శ్రమ దండగై, పంటనష్టం జరుగుతుంది.వానాకాలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంటుంది. దీనివల్ల జనాల రోజువారీ పనులు దెబ్బతింటాయి. వ్యాపార లావాదేవీలకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. గాలి వానల ధాటికి ఒక్కోసారి స్తంభాల నుంచి విద్యుత్ తీగలు నేల మీదకు పడి ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి.చినుకు కురవని నేలప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఆఫ్రికాలో ఉంది. మన దేశంలో థార్ ఎడారి ఉంది. ఈ ఎడారులు ఇసుక మేటలతో పొడి పొడిగా ఉంటాయి. వీటిలో అరుదుగా కనిపించే ఒయాసిస్సుల్లో మాత్రమే కాస్త నీటిజాడ కనిపిస్తుంది. ఇలాంటి ఎడారుల్లో కూడా అతి అరుదుగా కొద్దిపాటి చినుకులు కురుస్తుంటాయి. అయితే, ఈ భూమ్మీద చినుకు కురవని నేల ఏదైనా ఉందా అంటే, అది చిలీలోని అటకామా ఎడారి మాత్రమే! అటకామా ఎడారిలోని పలు ప్రదేశాల్లో చరిత్రలో ఏనాడూ చినుకు కురిసిన దాఖలాల్లేవు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రదేశంగా రికార్డులకెక్కింది.వర్షాధార దేశాలుభూమధ్య రేఖకు ఉత్తర, దక్షిణ దిశలలోని కర్కాటక, మకర రేఖల నడుమనున్న చాలా దేశాలకు, వాటికి కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు వర్షాలే ఆధారం. భారత్, చైనా సహా అత్యధిక జనాభా కలిగిన పలు దేశాలు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏటా వర్షాకాలం వస్తుంది. అలాగని, ప్రతి ఏడాది ఒకేలా వర్షాలు కురుస్తాయనే భరోసా ఉండదు. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు ఈ దేశాలు చక్కని పంట దిగుబడులతో కళకళలాడతాయి. తగినంత వానలు కురవనప్పుడు కరవు కాటకాలతో అల్లాడిపోతాయి. వానలు మితిమీరి కురిసినప్పుడు వరదలు ముంచెత్తి, పంటనష్టమే కాకుండా, ఆస్తినష్టం, ప్రాణనష్టాన్ని కూడా చవిచూస్తాయి. వరదలు ముంచెత్తకుండా పలుచోట్ల ఆనకట్టలు కడుతున్నా, అనావృష్టిని ఎదుర్కోవడానికి వీలుగా నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు కడుతున్నా ఈ ప్రాంతాలకు తరచుగా అతివృష్టి, అనావృష్టి బాధలు తప్పడం లేదు.భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాలలో ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఏటా రుతుపవనాలు వస్తాయి. రుతుపవనాల రాకతో ఈ ప్రాంతాల్లో వానాకాలం మొదలవుతుంది. పశ్చిమ, దక్షిణ ఆఫ్రికా దేశాల్లోను; ఉత్తర అమెరికా, ఆసియా దేశాలతో పాటు యూరోప్ దేశాలలో ఏటా జూన్ నెలాఖరులోగా వానాకాలం మొదలవుతుంది. దక్షిణార్ధగోళంలోని ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలలో సెప్టెంబర్ నుంచి వానాకాలం మొదలవుతుంది. వానాకాలంలోనే సముద్రంలో అల్పపీడనాలు, తుఫానులు వంటివి ఏర్పడుతుంటాయి. తుఫానుల వంటి ప్రకృతి విపత్తుల వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కోసారి అపారనష్టం వాటిల్లుతూ ఉంటుంది. వర్షాధార దేశాలకు తఫాను ముప్పు వెన్నంటే ఉన్నా, వర్షాలు లేకుండా ఈ దేశాలు మనుగడ సాగించలేవు. ఇటీవలి కాలంలో పెరిగిన వాతావరణ కాలుష్యం, అడవుల నరికివేత వంటి చర్యల వల్ల అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తరచుగా తలెత్తుతున్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడుకుంటేనే సకాల వర్షాలు సజావుగా కురుస్తాయి. మానవాళికి హర్షాతిరేకాన్ని తీసుకొస్తాయి.వానాకాలం జాగ్రత్తలువానాకాలంలో పుష్కలంగా వానలు కురవడం వల్ల నదులు, జలాశయాలు నీటితో నిండుతాయి. అయితే, వానాకాలంలో నీటితోనే జాగ్రత్తగా ఉండాలి. వానల ఉద్ధృతి వల్ల చెరువులు, బావుల్లో మురికి నీరు పైకి తేలుతుంది. చిట్లిన మంచినీటి పైపులైన్ల ద్వారా మురుగునీరు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వానాకాలంలో నీటిని బాగా వడగట్టి, కాచి, చల్లార్చి తాగడం మంచిది. వానాకాలంలో నీటి పట్ల జాగ్రత్తలు తీసుకునేటట్లయితే చాలా వ్యాధుల నుంచి ముప్పు తప్పించుకోవచ్చు.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వానాకాలంలో వాతావరణ కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు వంటి ఇబ్బందులను తప్పించుకోవడం కష్టం. కాలంలో మార్పుల వల్ల వచ్చే ఇలాంటి సామాన్యమైన ఇబ్బందులకు దూరంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్–సి వంటి పోషకాలు ఉండే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి.వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కాలంలో వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడమే మంచిది. పరిశుభ్రమైన ఆహారం, ఇంట్లో వండుకున్న పదార్థాలు మాత్రమే తినడం అలవాటు చేసుకుంటే, వానాకాలంలో వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ కాలంలో ఆరుబయట విక్రయించే తినుబండారాలను తినడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.వాన కురిసే సూచన ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా గొడుగు లేదా రెయిన్‌కోటు వెంట తీసుకువెళ్లడం క్షేమం. నీరు నిండిన రోడ్లపై నడవడానికి అనువైన వాటర్‌ప్రూఫ్ చెప్పులు ధరించడం మంచిది. అనుకోకుండా తోవలో ఎక్కడైనా వానలో తడిస్తే, ఇంటికి రాగానే తడిబట్టలను విడిచి పొడి దుస్తులను ధరించడం మంచిది. తడిసిన దుస్తులతో ఎక్కువసేపు ఉన్నట్లయితే, చర్మంపై ఫంగస్ పెరిగి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.తోవలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాన మొదలైతే, విద్యుత్ స్తంభాలు, వేలాడుతూ కనిపించే విద్యుత్ తీగలు లేని సురక్షితమైన ప్రదేశంలో తలదాచుకోవడం మంచిది. వాన కురిసేటప్పుడు విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదాలను నివారించుకోవచ్చు. వానలో చెట్ల కింద తలదాచుకోవడం కూడా మంచిది కాదు. గాలి తీవ్రత ఎక్కువైతే భారీ కొమ్మలు విరిగి మీదపడే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. -
5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడు
దుబ్బాక/దుబ్బాకటౌన్: రెక్కాడితే గాని డొక్కాడని పేద, వ్యవసాయ ,కూలీ కుటుంబాల పిల్లలు వీరూ..అయితేనేం చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. ఓ వైపు తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం, కూలి పనులు చేస్తూనే కష్టపడి చదువుకొని ఎస్ఐలుగా జాబ్‌లు సాధించారు. 21 నెలలు వివిధ అంశాలపై శిక్షణ తీసుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ స్టేషన్లలో బాధ్యతలు తీసుకున్న యువ ఎస్ఐలు, వారి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రుల కష్టం, తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం. తండ్రి టైలరింగ్.. కొడుకు ఎస్ఐదుబ్బాక పట్టణానికి చెందిన ఐరేని శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మీ దంపతుల కుమారుడు భార్గవ్ గౌడ్. నా తండ్రి టైలరింగ్ చేస్తూ కుటంబాన్ని పోషించాడు. గతంలో అస్సాం రైఫిల్‌మెన్‌గా, సీఆర్పీఎఫ్ ఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. ఆర్మీ అధికారి కావాలని కష్టపడి చదివాను. పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎస్ఐ పరీక్షకు సిద్ధమై జాబ్ సాధించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎస్ఐగా సేవలందిస్తున్నా. ఇటు ఎస్ఐగా పనిచేస్తూనే నాకు సమయం దొరికినప్పుడు అసిస్టెంట్ కమాండెంట్ ఆర్మీ పరీక్షకు సన్నద్ధమవుతున్నా. – భార్గవ్, నాగిరెడ్డి పేట ఎస్ఐఅమ్మ కూరగాయలు విక్రయించి..మాది కరీంనగర్ జిల్లా సైదాపూర్. నాన్న గతంలో మృతి చెందాడు. అమ్మ కూరగాయలు విక్రయిస్తూ ముగ్గురు ఆడపిల్లలను చదివించింది. ఇద్దరు అక్కలు ఉద్యోగాలు సాధించారు. నా విద్యాభ్యాసం కరీంనగర్‌లోనే పూర్తి చేశా. నేను కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి ఎస్ఐ జాబ్ కోసం కష్టపడ్డా. మా అమ్మ కష్టానికి ఈ ఎస్ఐ ఉద్యోగంతో ప్రతిఫలం దక్కింది.– బోయిని సౌజన్య, బెజ్జంకి ఎస్ఐఅమ్మ కష్టానికి ప్రతిఫలం మాది కరీంనగర్ టౌన్. నాన్న మల్లేశం, అమ్మ లీలా. నాన్న ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం అమ్మపై పడింది. నాకు ఒక తమ్ముడు, అక్క ఉన్నారు. మా ముగ్గురిని అమ్మ చిన్న ఉద్యోగం చేస్తూ చదివించింది. నేను బీటెక్ చదువుతూనే పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవాన్ని. బీటెక్ పూర్తి కాగానే పోలీస్ శాఖ నోటిఫికేషిన్ రాగానే కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. – ప్రశాంత్, అక్కన్నపేట, ఎస్ఐ4 ఏళ్ల పాప ఉన్నా.. గురి తప్పలేదు పెళ్లయితే అమ్మాయిలు ఏం సాధించలేరు, ఇంటికే పరిమితం అంటుంటారు. కానీ భర్త, కుటుంబం ప్రోత్సహిస్తే ఏదైనా సాధించవచ్చు. నాకు 6 సంతవ్సరాల పాప ఉంది. మాది కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామం. నాన్న వివేకానందరెడ్డి హోంగార్డ్, అమ్మ శారద టైలరింగ్ చేసేది. భర్త సుమంత్, తమ్ముడు సంతోష్ ప్రోత్సహించారు. నా ట్రైనింగ్ సమయంలో పాపకు నాలుగేళ్లు. నా భర్త పాపను చూసుకునేవాడు. – సుచిత, ఎస్ఐతండాలో తళుక్కుమన్న నరేశ్..తండా ప్రజలు వ్యవసాయానికే పరిమితం ఏం సాధించలేరనేది ఒక్కప్పటి మాట. ఆ మాట మూగపోయేలా అనుకున్న లక్ష్యం కోసం ఎంతో కష్టపడ్డాను. మాది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామం. నాన్న లాల్‌బహదూర్, అమ్మ హంసీ. వ్యవసాయం చేసేవారు. నేను ఉన్నత స్థానంలో ఉండాలనేది నా తల్లిదండ్రుల కోరిక. 22ఏళ్లకే ఉద్యోగం సాధించా. ఎస్ఐ జాబ్ వచ్చినప్పుడు వాళ్ల కళ్లలో ఆనందం, మాటల్లో చెప్పలేనిది. – మాలోత్ నరేష్ ఎస్ఐతల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు.. కూతురు ఎస్ఐ దుబ్బాక మండలం చీకోడ్ గ్రామానికి చెందిన నందిరి రాజయ్య, సత్తవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె జ్యోతి. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ జ్యోతిని చదివించారు. తల్లిదండ్రులకు గౌరవం దక్కేలా..జ్యోతి ఎస్ఐ జాబ్ సాధించి ఔరా అనిపించింది. కాగా దుబ్బాక మండలంలో 2వ మహిళా ఎస్ఐగా జాబ్ సాధించిన ఘనత జ్యోతికే దక్కింది. – జ్యోతి, ఎస్ఐ5 ప్రభుత్వ ఉద్యోగాల అరవిందుడుమాది కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పోతారెడ్డి పల్లి స్కూల్ తండా. నాన్న లక్ష్మణ్, అమ్మ, జమునా వ్యవసాయం చేసేవారు. తండాలో పుట్టి పెరిగిన నేను చిన్నప్పటి నుంచి ఎస్ఐ అవ్వాలన్న లక్ష్యంతో చదివాను. నాకు 5 గురు అక్కాచెల్లెల్లు. ఎస్ఐ పరీక్షకు సన్నద్ధమవుతూనే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినా పోస్టింగ్ తీసుకోలేదు. కష్టపడితే సాధించలేనిదంటూ.. ఏమి లేదు. ఇదే యువతకు ఇచ్చే సందేశం. – హలావత్ అరవింద్ కుమార్, ఎస్ఐ కీర్తిని గడించేలా.. కామారెడ్డి జిల్లా బిర్కూర్ గ్రామం మాది. అమ్మ భారతి, నాన్న నాగరాజు వ్యవసాయం చేçస్తూ నన్ను చదివించారు. నేను వరంగల్‌లో బీటెక్ పూర్తి చేశా. పోలీస్ అవ్వాలన్నది నా కోరిక. దాని కోసం పడిన కష్టం వర్ణణాతీతం. తల్లిదండ్రుల కీర్తిని పెంచేలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తా. – కరీన కీర్తిరాజ్, దుబ్బాక, ఎస్ఐకానిస్టేబుల్ టూ..ఎస్ఐ మాది కరీంనగర్ జిల్లా గుంటూర్పల్లి. అమ్మ తాహేర బేగం, నాన్న షేక్ అహ్మద్. నాన్న వ్యాపారం చేస్తూ చదివించాడు. నేను 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికై విధులు నిర్వహించా. 2023 ఎస్ఐ నోటిఫికేషన్లో కష్టపడి చదివి ఎస్ఐగా ఎంపికయ్యాను. చిన్నకోడూర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించా. – సైఫ్ అలీ, చిన్నకోడూర్ ఎస్ఐతండ్రి కష్టమే నన్ను ఎస్ఐని చేసింది మాది కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్. అమ్మానాన్నలు కుంచెం రాజేశ్వరి, కనకయ్య. సోదరి, సోదరుడు ఉన్నారు. తన కష్టం పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులు కష్టానికి వెనుకాడకుండా చదివించారు. ఎస్ఐగా ఎంపికయ్యాను అని తెలియగానే నా తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. – మానస, రాయపోల్ ఎస్ఐ ఎస్ఐ ఉద్యోగంపై ఇష్టంతో.. 2018లో కానిస్టేబుల్‌కి ఎంపికైనా ఎస్ఐ పోస్టుపై ఇష్టంతో వెళ్లలేదు. తల్లిదండ్రుల కలను సాకారం చేయడానికి ఎస్ఐగా ఎంపికై దౌల్తాబాద్‌లో సేవలు అందిస్తున్నాను. కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామానికి చెందిన అరుణ్ కుమార్‌కి నలుగురు అన్నదమ్ములు. నాన్న చంద్రయ్య, అమ్మ కాంతమ్మ వ్యవసాయం చేసేవారు. ఎస్ఐ ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడంతో సంతోషంగా ఉంది. – గంగాధర అరుణ్‌కుమార్, దౌల్తాబాద్, ఎస్ఐమొదటి ప్రయత్నంలోనే.. మాది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం సిరి బీబీపేట గ్రామం. నాన్న భీమరి పోచయ్య 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అమ్మ మంజుల వ్యవసాయం చేస్తూ తమ్ముడిని, మా ముగ్గురు అక్క చెల్లెళ్లను పోషించింది. నేను ఇప్పటి వరకు ఎలాంటి పోటీ పరీక్షలు రాయలేదు. మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ ఉద్యోగం సాధించాను. నా ఉద్యోగ ప్రయత్నానికి మేనమామ దేషెట్టి లింగం సపోర్టు చేశాడు. – సృజన, ఎస్ఐ తండ్రి కూలీ..మాది కరీంనగర్. నాన్న వెంకన్న, అమ్మ కనకమ్మ ఇద్దరు కూలీపని చేసేవారు. నేను బీటెక్ పూర్తి చేశాను. నన్ను చదివించేందుకు అమ్మానాన్న రెక్కలు ముక్కలు చేసుకోవడం స్వయంగా చూసిన. నా కుటుంబ నేపథ్యాన్ని సవాల్‌గా తీసుకొని పట్టుబట్టి ఎస్ఐ ఉద్యోగం సాధించాను. – నవీన్,ఎస్ఐ చేర్యాల -
చల్లని థ్రిల్లింత.. తియ్యని తుళ్లింత
నోట్లో వేసుకోగానే జివ్వుమనిపించే ఐస్‌క్రీమ్ జిహ్వకు ఒక చల్లని చలువ వేడుక ఆబాల గోపాలానికీ నోరూరించే ఐస్‌క్రీమ్ తరతరాలకు తియ్యని రుచుల కానుక ప్రపంచవ్యాప్తంగా ఐస్‌క్రీమ్ ఒక భావోద్వేగం తియ్యని చల్లని ఐస్‌క్రీమ్ ఒక మధురోత్సాహం! స్కూల్ విడిచిపెట్టగానే ముందు సందులోనూ..సెలవలొచ్చి ఇంట్లో ఉంటే, వీధి చివరి సందులోనూ..ప్రత్యేకమైన ఒక బెల్ మోగుతుంటుంది. అది వినగానే పిల్లలకు ఆకలి మొదలైపోతుంది! అది అట్టాంటి ఇట్టాంటి ఆకలి కాదు,కేవలం ఐస్‌క్రీమ్ ఆకలి! ఆరు నూరైనా ఐస్‌క్రీమ్ తింటేనే తీరుతుంది! ఇక ఆ బెల్ ఏ బండిదో చెప్పుకోనక్కర్లేదు కదూ! నిజానికి ఆ శబ్దం– పెద్దలను కూడా బాల్యానికి నెడుతుంది! సందర్భమేమీ లేకపోయినా, ఉన్నపళంగా కుటుంబంలో తియ్యని వేడుకను సృష్టించగలుగుతుంది! అదే ఐస్‌క్రీమ్‌కి ఉన్న క్రేజ్!‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి’ అంటారు పెద్దలు. అయితే నోరూరించే తియ్యదనం, నాలుకపై చిందులేసే చల్లదనం ఊహల్లో మెదలగానే, అన్ని జిహ్వలు కోరేది ఒక్కటే– ఐస్‌క్రీమ్! అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక మధురానుభూతి!శీతల పానీయాల నుంచి హిమక్రీములకు సాగిన ఐస్‌క్రీమ్ చరిత్ర– ఐస్‌క్రీమ్ తిన్నంత తియ్యగా ఉంటుంది. నిజానికి ఐస్‌క్రీమ్, సరిగ్గా ఎప్పుడు మొదలైంది? ఎవరు కనిపెట్టారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోయినా, క్రీ.పూ. 4 వేల సంవత్సరాల కాలంలోనే మనిషి చల్లని రుచులను ఆస్వాదించడం మొదలుపెట్టాడట! ‘టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల గుండా ప్రవహించే టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల పరివాహక ప్రాంతమైన మెసపొటేమియాను ‘ప్రపంచ నాగరికతకు పుట్టినిల్లు’గా గుర్తిస్తారు! అందులో భాగమైన దక్షిణ ఇరాక్‌లోని యూఫ్రటిస్ నది సమీపంలో ఎల్లవేళలా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ జీవనం సాగించిన, క్రీ.పూ. ఐదో శతాబ్దం నాటికి పర్షియన్లు తమ నివాసాలను చల్లబరచుకోవడానికి, రాత్రి వేళల్లో సహజంగా ఏర్పడిన మంచును భూగర్భంలో నిల్వ చేసుకుని, వాడుకునేవారు. కాలక్రమేణా ‘యఖ్చాల్’ అనే హిమగృహాలను ఏర్పాటు చేసుకునేవారు. సాంకేతికాభివృద్ధి పెరిగి, రిఫ్రిజిరేటర్స్ వాడుకలోకి వచ్చాక ఐస్‌క్రీమ్ చరిత్ర చల్లని మలుపు తిరిగింది.క్రీ.పూ. ఐదో శతాబ్దంలో గ్రీకు రాజధాని ఏథెన్స్ ్సలో వైన్స్ ను చల్లబరచడానికి మంచును విక్రయించేవారట! మరోవైపు ఒకటో శతాబ్దానికి చెందిన రోమన్స్ చక్రవర్తి నీరో– తేనెతో కూడిన చల్లని పానీయాలను ఆస్వాదించేవాడు. చైనాలో టాంగ్ రాజవంశీకుల కాలంలో కర్పూరం కలిపిన గేదె పాలతో తియ్యటి పానీయాలు చేసుకుని, చల్లగా తాగేవారట! అలాగే పర్షియన్స్ వంటకమైన ‘ఫాలూదా’ శతాబ్దాల నాటిదని చరిత్ర చెబుతుంది. ఎందరో ఇష్టపడి ఆస్వాదించే చల్లచల్లని ‘షర్బత్’కి ఏళ్లనాటి అరబిక్ మూలాలున్నాయి. తర్వాత తర్వాత చల్లగా తాగే తీపి పదార్థాలను గడ్డ కట్టించి ఐస్‌క్రీమ్‌లా ఆస్వాదించడం మొదలైంది. ఈ క్రమంలోనే భారత్‌లో మొఘల్ చక్రవర్తులు ‘కుల్ఫీ’ని ఇష్టంగా తినేవారట. ఇది పాల మీగడను గడ్డకట్టించి, తయారు చేసే ఒక రకమైన ఐస్‌క్రీమ్!పాప్సికిల్ – ఓ అనుకోని రుచిపాప్సికిల్ (పుల్ల ఐస్) చరిత్ర చాలా ఆసక్తికరంగా, అనుకోని రీతిలో మొదలైంది. ఫ్రాంక్ ఎపర్సన్స్ అనే పదకొండేళ్ల కుర్రాడు, దీనిని 1905లో తొలిసారి కనుగొన్నాడు. శీతకాలంలో ఒక రాత్రి– ఫ్రాంక్ తన పెరట్లో సోడా పౌడర్, నీళ్లు కలిపిన గ్లాసును, ఆ నీళ్లను కలపడానికి వాడే ఒక పుల్లతో సహా ఆరుబయట అలాగే వదిలేశాడు. తెల్లవారేసరికి, గ్లాసులోని మిశ్రమం రంగులో గడ్డకట్టి, పుల్లతో సహా చేతిలోకొచ్చిందట. దానిని కాస్త రుచి చూస్తే అదిరిపోయిందట! దానికి ‘ఎప్సికిల్’ అని పేరుపెట్టాడు ఫ్రాంక్. ఆ రుచిని వెంటనే తన స్నేహితులకు, పక్కింటి పిల్లలకు పరిచయం చేశాడు. వాళ్లు కూడా ఇష్టంగా తిన్నారు.1922లో కాలిఫోర్నియా, ఆక్లండ్‌లో జరిగిన ఒక డ్యాన్స్ ్స పార్టీలో పాల్గొన్నవారందరికీ ‘ఫ్రాంక్ ఎపర్సన్స్ ’ తాను తయారు చేసిన పాప్సికిల్ రుచిని తొలిసారి పరిచయం చేశాడు. వారంతా ఆ రుచిని ఎంతో ఇష్టపడ్డారు. ఆ క్రేజ్‌తోనే ఆ మరుసటి ఏడాది దానిపై పేటెంట్ పొందాడు ఫ్రాంక్. ఆ రోజుల్లో, పాప్సికిల్ను ఎక్కువగా స్ట్రాబెర్రీ, నారింజ, చెర్రీ వంటి పండ్ల రుచులలో తయారు చేసుకునేవారు. కాలక్రమేణా ఈ పుల్ల ఐస్ చిన్ననాటి జ్ఞాపకాలకు, వేసవి వినోదానికి గుర్తుగా మారింది.హిమక్రీములు విశేషాలువాతావరణం వేడెక్కుతున్నప్పుడు, ఎక్కువగా ఐస్‌క్రీమ్ తినడం సహజమే! శతాబ్దాలుగా అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని పంచుతున్న ఈ తియ్యని, చల్లని పదార్థం కేవలం రుచికే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలకూ బెస్టేనట. ఒకటి లేదా రెండు హెల్దీ ఐస్‌క్రీమ్ స్కూప్‌లను తింటే తప్పేమీ లేదట. ప్రమాదమేమీ కాదట!ఇంటర్నేషనల్ డైరీ ఫుడ్స్ అసోసియేషన్స్ ప్రకారం, సగటు అమెరికన్స్ సంవత్సరానికి 20 పౌండ్ల ఐస్ క్రీమ్‌ను తింటాడట. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందట!పాల పదార్థాలతో చేసిన ఐస్‌క్రీమ్‌లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసేటప్పుడు ‘ప్రోబయోటిక్ ఐస్‌క్రీమ్’ లేదా ‘లైవ్ అండ్ యాక్టివ్ కల్చర్స్’ వంటి లేబుల్ ఉందో లేదో చూసి కొనుగోలు చేయడం మంచిది.ఐస్‌క్రీమ్‌తో రికార్డ్స్!ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. అయితే, కొందరు ఐస్‌క్రీమ్‌ను కేవలం తినడమే కాకుండా, దానితో ప్రపంచ రికార్డులను సైతం సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ఐస్‌క్రీమ్ అద్భుతాలను చూద్దాం!నిమిషంలో చప్పరించేవాడుఐస్ ఎక్కువగా తిన్నా, వేగంగా తిన్నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. తలలోంచి తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాంటిది ఐజాక్ హార్డింగ్ డేవిస్ అనే వ్యక్తి 2017 జూలై 16న కేవలం ఒక నిమిషంలో 806 గ్రాముల ఐస్‌క్రీమ్‌ను లాగించేసి, వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.నోరూరించే అతిపెద్ద స్కూప్సాధారణంగా ఐస్‌క్రీమ్ లవర్స్‌కి పెద్ద స్కూప్ చూస్తే భలే సంబరంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ‘కెంప్స్’ అనే సంస్థ, 2014 జూన్ 28న తన శత వార్షికోత్సవ వేడుకల్లో అతిపెద్ద స్కూప్ని ప్రదర్శించింది. ‘విస్కాన్సిన్స్ లోని సెడార్బర్గ్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్’లో 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 6 అడుగుల 2 అంగుళాల వెడల్పుతో భారీ స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్ స్కూప్ను తయారుచేసి, రికార్డు సృష్టించింది.ఎత్తైన కోన్ ఐస్క్రీమ్ఎంతపెద్ద కోన్ ఐస్‌క్రీమ్ అయినా అరచేతి సైజుకి మించదు. అలాంటిది 10 అడుగుల 1.26 అంగుళాల ఎత్తైన కోన్ ఐస్‌క్రీమ్‌ని సృష్టించారు నార్వేకు చెందిన హెనిగ్ ఓల్సెన్, ట్రోండ్ ఎల్. వాయిన్ అనే ఇద్దరు స్నేహితులు 2015 జూలై 26న ఈ భారీ కోన్ ఐస్‌క్రీమ్‌ను సృష్టించి రికార్డ్ సాధించారు.ఒక కోన్స్ పై అత్యధిక స్కూప్లుఒక ఐస్‌క్రీమ్ కోన్స్ పై సాధ్యమైనన్ని ఎక్కువ స్కూప్‌లను పేర్చడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటలీకి చెందిన దిమిత్రి పాన్చెరా సాధించిన రికార్డ్‌ను మాత్రం ఎవ్వరూ కొట్టలేరనిపిస్తుంది. ఎందుకంటే, గతంలో తాను సృష్టించిన రికార్డ్‌ని తానే బద్దలుకొట్టాడు. అతడు 2018, నవంబర్ 17న ఒకే కోనుపై 125 స్కూపులను నిలిపి రికార్డ్ సృష్టించాడు. అయితే గతంలో 121 స్కూపులను నిలిపి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు.పొడవాటి తియ్యని వేడుక2011 జూలై 23న యూకేలోని పోర్ట్ స్టీవర్ట్లో ‘మోరెల్లి ఐస్‌క్రీమ్ షాప్’ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించింది. ఆ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా 2,728 మందిని ఒక చోటికి చేర్చి; ప్రతి ఒక్కరికీ ఐస్‌క్రీమ్ కప్స్ ఇచ్చి, ఒకరికి ఒకరు తినిపించుకోమని చెప్పింది. అలా 2,728 మందీ పొడవాటి మానవహారంలా నిలబడి, ఒకరికొకరు ఐస్‌క్రీమ్ తినిపించుకోవడంతో అది ప్రపంచ రికార్డ్‌గా నిలిచింది.ఐస్‌క్రీమ్ కోన్‌లా మారిన మనుషులుచైనాలో నెస్లే లిమిటెడ్ ఐస్‌క్రీమ్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వినూత్న రికార్డ్ సృష్టించింది. 2019, డిసెంబర్ 18న రెండు వేరువేరు రంగుల దుస్తులు ధరించిన 478 మందికి జనం ఒక భారీ ఐస్‌క్రీమ్ కోన్స్ ను రూపొందించారు. ఇది గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.ఐస్‌క్రీమ్ కాన్వాయ్ సాధారణంగా ఐస్‌క్రీమ్ బండి వేసే హారన్ కూడా మనసులో ప్రత్యేకమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. బాల్యంలోని రుచులన్నింటినీ గుర్తు చేస్తుంది. అందుకే యూకేలో 2018 అక్టోబర్ 16న ‘ది ఐస్‌క్రీమ్ వ్యాన్ డ్రీమ్ టీమ్’ అనే బృందం 84 ఐస్‌క్రీమ్ ట్రక్కులు, వ్యాన్లతో ఒకేసారి భారీ ఊరేగింపు చేసి, అద్భుతమైన ప్రపంచ రికార్డును సృష్టించింది.ఐస్‌క్రీమ్ శతాబ్దాల పాటు ఒక ప్రత్యేకమైన, ఖరీదైన విలాసవంతమైన ఆహారంగా ఉండేది. చౌకైన రిఫ్రిజిరేటర్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేంత వరకు ఐస్‌క్రీమ్ లగ్జరీ రుచే! సాంకేతికత అందుబాటులోకి వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఐస్‌క్రీమ్‌ను రుచి చూడగలుగుతున్నారు.మరో అమెరికన్ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఐస్‌క్రీమ్ మీద ప్రేమతో జూలై నెలను ఐస్‌క్రీమ్ నెలగా ప్రకటించాడు. జూలై మూడో ఆదివారాన్ని ‘ఐస్‌క్రీమ్ డే’గా ప్రకటించాడు.ఐస్‌క్రీమ్‌ను అత్యధికంగా తినే దేశాలలో యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానంలో ఉంది. తొలిస్థానం న్యూజీలండ్దట. అక్కడ సంవత్సరానికి సగటున ప్రతి వ్యక్తి సుమారు 20 నుంచి 22 కేజీల ఐస్‌క్రీమ్‌ను తింటున్నారట.ఐస్‌క్రీమ్‌లో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్లతో పాటు విటమిన్స్ ఎ, డి, బి12 వంటివి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఒత్తిడి, ఆందోళన, విచారం ఉన్నప్పుడు చాలామంది ఐస్‌క్రీమ్ వైపు మొగ్గు చూపుతారట. ఐస్‌క్రీమ్ డోపమైన్, సెరోటోనిన్స్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. వీటిని ‘ఫీల్–గుడ్’ హార్మోన్లు అంటారు. అందుకే అప్పుడప్పుడు ఈ తియ్యని, చల్లని ట్రీట్‌ను ఆస్వాదించి, మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు.మూడు నుంచి నాలుగు కేజీల ఐస్‌క్రీమ్ ఉత్పత్తికి, సుమారు 10 నుంచి 12 లీటర్ల పాలు అవసరమవుతాయి.థామస్ జెఫర్సన్స్ – అమెరికా అధ్యక్షుడు కావడానికి కొన్నేళ్ల ముందు ఫ్రాన్స్్సలో అమెరికా రాయబారిగా పనిచేసేవాడు. అక్కడ ఆయన వెనీలా ఐస్‌క్రీమ్ తొలిసారి రుచి చూసి మైమరచిపోయాడు. ఆ వెంటనే ఆ రెసిపీ తయారీ విధానాన్ని నోట్ చేసుకుని మరీ, అమెరికా వంటకాల్లో భాగం చేసేశాడు. ఇక ఆ తర్వాత తన విందు భోజనాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక కప్పు ఐస్‌క్రీమ్ ఉండేలా చూసుకునేవాడు.థామస్ జెఫర్సన్స్ అప్పటికే పరిచయం చేసిన ఆ ఐస్‌క్రీమ్ రుచి కోసం అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్స్ తపించిపోయేవాడట! ఆయన అధికారంలోకి రాగానే, వైట్‌హౌస్‌లో ఐస్‌క్రీమ్ తయారీ పరికరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నాడు.ఐస్‌క్రీమ్‌పైన చాక్లెట్ సిరప్ వేస్తే చాలామందికి నచ్చుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ సిరప్.. ఐస్‌క్రీమ్ రుచిని మరింత పెంచుతుంది.ఐస్‌క్రీమ్ రుచిని పరీక్షించే నిపుణులు బంగారు చెంచాలను ఉపయోగిస్తారు. దీనికి కారణం, ఇతర లోహాలతో తయారు చేసిన చెంచాలు ఐస్‌క్రీమ్ రుచిని సూక్ష్మంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఐస్‌క్రీమ్ అసలు రుచిని ఏమాత్రం మిస్ కాకుండా ఉండటానికే బంగారు చెంచాలను ఉపయోగిస్తారు.బరాక్ ఒబామాఅమెరికా అధ్యక్షుడిగా మారడానికి ముందు, బరాక్ ఒబామా హవాయిలోని హోనోలులులో ఉన్న ఒక బాస్కిన్–రాబిన్స్ ్స ఐస్‌క్రీమ్ పార్లర్లో పనిచేశారు. ఈ ఉద్యోగం తనకు బాధ్యతలను నేర్పిందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.జూలియా రాబర్ట్స్ప్రముఖ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా ఒకప్పుడు ఐస్‌క్రీమ్ స్కూప్ చేస్తూ పనిచేశారట. ‘మిస్టిక్ పిజ్జా’ చిత్రంలో ఆమె పాత్ర ప్రస్తావనతో పాటు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా!జూలియా లూయీ–డ్రైఫన్‘కమేడియన్స్ ్స ఇన్ కార్స్ గెట్టింగ్ కాఫీ’ అనే కార్యక్రమంలో ప్రముఖ నటి జూలియా లూయీ–డ్రైఫస్ తన ఐస్‌క్రీమ్ పార్లర్ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె స్వెన్స్ సెన్స్ ్స అనే ఐస్‌క్రీమ్ పార్లర్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఆమె ఎమ్మీ అవార్డు గ్రహీతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.బాబీ ఫ్లే – ప్రసిద్ధ అమెరికన్ షెఫ్, టీవీ పర్సనాలిటీ అయిన బాబీ ఫ్లే కూడా యువకుడిగా ఉన్నప్పుడు ఐస్‌క్రీమ్ స్కూపర్‌గా పనిచేశారు. హిమక్రీముల క్రేజు‘ఐస్‌క్రీమ్ రుచుల కోసం మనుషులే కాదు, యమలోకం నుంచి యముడైనా కదిలి రావాల్సిందే’ అన్నట్లు నటించారు ‘యమలీల’ చిత్రంలోని కైకాల సత్యనారాయణ. ఆ సినిమాలో ఆయన ‘హిమక్రీములున్నాయా నాయనా?’ అంటూ ఐస్‌క్రీముల కోసం తపించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం 1994లో విడుదలైంది. ఈ ఒక్క సన్నివేశంతో ఆనాడు ఐస్‌క్రీమ్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది. నిజానికి, హిమక్రీములంటే జనాల్లో నేటికీ అదే మోజుంది, అదే క్రేజుంది!ఐస్‌క్రీమ్ గురించి విన్నా, చూసినా, చదివినా వెంటనే తినాలనిపించే అనుభూతి కలగడం సహజం! చల్లని తియ్యని రుచులను కోరుకునే వారు ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లోనే సులభంగా ఐస్‌క్రీమ్స్ చేసుకునే మేకర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి! మరోవైపు బయట అమ్ముడయ్యే కొన్నిరకాల ఐస్‌క్రీములు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు! ఇక ఇంట్లో ఐస్‌క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు పంచదార, ఐస్‌క్రీమ్ ఎసెన్స్ వంటివి ఆరోగ్యానికి అనర్థం అనుకుంటే, వాటిని కలపకుండా కూడా ఐస్‌క్రీమ్ చేసుకోవచ్చు. తియ్యటి పండ్లతోనో, కమ్మటి కూరగాయలతోనో మెత్తటి గుజ్జు చేసుకుని, దానిలో తేనెనో, ఖర్జూరాలో, బెల్లం తురుమో జోడించి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఇంటిల్లిపాది చల్లని వేడుక చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు ఇష్టంగా తినని పిల్లలతో ఇలా కూడా తినిపించొచ్చు. అయినా తియ్యని, చల్లని ఐస్‌క్రీమ్ రుచిని కాదనేవారు ఎవరుంటారు?ఐస్‌క్రీమ్ పార్లర్లలో పనిచేసిన ప్రముఖులుఉన్నతమైన స్థానాలకు వెళ్లిన చాలామంది జీవితాల్లో ఆర్థిక కష్టాలు చాలానే ఉంటాయి. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి చిన్నా చితకా పనులతో కాలం వెళ్లదీసిన ప్రముఖులు ఎందరో ఉంటారు. కొందరు ప్రముఖులు తమ కెరీర్ ప్రారంభంలో ఐస్‌క్రీమ్ పార్లర్లలో పనిచేశారు. వారిలో కొందరి ప్రముఖుల వివరాలు చూద్దాం. -
సెలబ్రిటీ జంటలు అందుకే విడిపోతున్నారా?
-
పేపర్ బాయ్ నుంచి కుబేర సినిమా సక్సెస్ దాకా.. మన కుర్రాడే!
పెద్ద అడిశర్లపల్లి(నల్గొండ): ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ట్రావెలింగ్, ఫొటోగ్రఫీపై తనకున్న ఆసక్తితో అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నాడు నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని మేడారం గ్రామానికి చెందిన మేడారం వెంకటయ్య, అంజమ్మ దంపతుల కుమారుడు మేడారం అరవింద్. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాకు అరవింద్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.అరవింద్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలో బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లగా.. వారితో పాటు అతడు కూడా వెళ్తూ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు పేపర్‌బాయ్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా, రైస్‌మిల్లు నైట్ షిఫ్ట్ చేస్తూ సొంత ఖర్చులు సమకూర్చుకున్నారు. అంతేకాకుండా తనకు సాహిత్యంపై ఉన్న మక్కువతో కవితలు, వ్యాసాలు రాస్తుండేవాడు. ట్రావెలింగ్, ఫొటోగ్రఫీ అభిరుచి ఏర్పర్చుకొని సినిమాల్లో ప్రవేశం దొరకబుచ్చుకున్నారు.చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై ఆసక్తి..తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో అరవింద్ చదువు కొనసాగింది. తమ గ్రామం నుంచి యూనివర్సిటీకి వచ్చిన మొదటితరం విద్యార్థి అరవిందే కావడం విశేషం. మాస్ కమ్యూనికేషన్ చదువుతూనే వార, మాస పత్రికలు నడిపారు. చిన్నతనంలో పేపర్‌బాయ్‌గా పనిచేయడం వల్ల సాహిత్య పఠనం అలవడింది. అనేక సామాజిక, సాహిత్య అంశాలను స్పృశిస్తూ కవితలు, వ్యాసాలు రాశారు.సాహిత్య ప్రచారం..కథ, కవిత్వం, నవలలు విరివిగా చదవటం.. చదివిన పుస్తకాలను నలుగురికీ పంచడం అవసరమని భావించిన అరవింద్ ‘ఆలోచనా’ అనే సంస్థ ద్వారా గ్రామీణ, పట్టణ విద్యార్థులకు చిట్టిపొట్టి జానపద కథల నుంచి దేశభక్తుల జీవితచరిత్ర వరకు పరిచయం చేయడం, చదివించడం చేశారు. హైదరాబాద్ నగరంలోని యూనివర్సిటీల్లో స్టడీ సర్కిల్స్ నిర్వహణ, పుస్తకాలు, సినిమాలు, ఆర్ట్స్ పై సదస్సులు, సభలు నిర్వహించేవారు. దక్షిణ భారతదేశం మొత్తం యాత్రలు చేయడంతో ఫొటోగ్రఫీపై అభిరుచి ఏర్పడింది. ఆయా ప్రాంతాల సంస్కృతి, వైవిధ్యం, ఆర్కిటెక్చర్‌ను కెమెరాల్లో బంధించి వాటిని యూనివర్సిటీల్లో, పట్టణాల్లో ప్రదర్శించారు.జాతిరత్నాలు డైరెక్టర్‌తో సినిమా రంగంలోకి...జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవీతో అరవింద్‌కు ఏర్పడిన పరిచయం స్నేహం మారడంతో ఆయనకు సినిమాల్లోకి ప్రవేశం దొరికింది. ఆయన కథలను చర్చిస్తుండటం.. రాస్తుండటంతో అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ప్రిన్స్ సినిమాకు రచన విభాగంలో పనిచేయడం వలన రచన నైపుణ్యాన్ని అరవింద్ నేర్చుకున్నారు.కుబేర విజయాన్ని ఆస్వాదిస్తున్నాకుబేర సినిమా మొదలవుతుంది అనుకున్న రెండు నెలల ముందు శేఖర్ కమ్ముల గారు నన్ను పిలిచారు. మొదట ఇంటర్న్షిప్గా జాయిన్ అయ్యాను. నాకు ట్రావెలింగ్ చేసిన అనుభవం ఉండడంతో ఈ సినిమా కథకు ముంబై దగ్గర్లలో లొకేషన్స్ వెతికి పెట్టే పని అప్పగించారు. ఈ క్రమంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఇన్చార్జిగా నియమించారు. తోట తరణి వంటి ఆర్ట్ డైరెక్టర్‌తో శేఖర్ కమ్ముల నేతృత్వంలో పనిచేయడం జీవితంలో మరిచిపోలేని మైలురాయి. డైరెక్టర్ విజన్, ప్రొడక్షన్ డిజైనర్ విజువల్ సెట్లో ప్రతిబింబించడానికి నిద్రాహారాలు పక్కనపెట్టి పనిచేశా. అయినా కష్టం అనిపించలేదు. ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రాణితో సమన్వయంలో ఉండటం వలన టీంతో రాత్రి, పగలు ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేశాం. కుబేర సినిమా విజయాన్ని నేను, మా టీం సభ్యులు ఆస్వాదిస్తున్నాం.– మేడారం అరవింద్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ -
RAS : ఆధునిక చేపల సాగు
ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు ఇతర జలజీవులను పెంచటమే. ఇది ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ఆహార ఉత్పత్తి విధానం. సముద్రాలలో సహజంగా దొరికే చేపలు తగ్గిపోవటంతో ఆక్వాకల్చర్ ద్వారా మనకు అవసరమైన చేపల్ని అందిస్తున్నారు. ప్రస్తుతం మనం తినే చేపల్లో సగం కంటే ఎక్కువ ఆక్వాకల్చర్ నుంచే వస్తున్నాయి. చెరువుల నుంచి పటిష్టమైన రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్(ఆర్ఎఎస్)ల వరకు ఆక్వాకల్చర్ మనకు ఆహార భద్రతను కల్పిస్తూ ప్రకృతిని కూడా కాపాడుతుంది.ఆర్ఎఎస్ సాధారణ చెరువుల కన్నా ఎంతో అధునాతనంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే నీటిలో 90 శాతం వరకు నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడతారు. దీంతో తక్కువ నీటితో ఎక్కువ చేపలను ఉత్పత్తి చేయటం సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా నీటి వృథా చాలా తక్కువగా ఉండి, పర్యావరణానికి తోడ్పడుతుంది. ఇది భవిష్యత్తు చేపల సాగుకు ఉత్తమ మార్గం. నార్త్ యూరప్ దేశాల్లో పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా సాగు చేయించే క్రమంలో ఆర్ఎఎస్ తొలుత ప్రారంభమైనప్పటికీ తదనంతర కాలంలో అన్ని ఖండాలకూ ఈ మెరుగైన ఆక్వాసాగు పద్ధతి విస్తరిస్తోంది. అదేవిధంగా మన దేశంలోనూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ఎఎస్ పద్ధతిలో చేపల సాగుకు ప్రోత్సాహం ఇస్తుండటం విశేషం. ∙చేపల సాగులో ఆధునిక పోకడ.. రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ (ఆర్ఎఎస్-Recirculating aquaculture system)చేపల సాగుకు చక్కని భవిష్యత్తుకు పర్యావరణహితమైన మార్గం ఇదిఅతి తక్కువ నీటి వనరులతో ఆక్వా సాగుతో పాటు అధిక దిగుబడికి దోహదం5 టన్నుల చేపల ఉత్పత్తి యూనిట్‌కు కనీస పెట్టుబడి రూ. 15–25 లక్షలుసరైన నిర్వహణ ఉంటే సంవత్సరానికి రూ. 6–8 లక్షల ఆదాయం మహిళలు, యువతకు 40%–60% వరకు ప్రధాన మంత్రి స్కీమ్ కింద సబ్సిడీలకు అవకాశం రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్(ఆర్ఎఎస్) వ్యవస్థలో అనేక భాగాలున్నాయి. ఇందులో ప్రతి భాగమూ కీలకపాత్ర పోషిస్తాయి. మొదటిది : కల్చర్ ట్యాంక్. ఇది చేపల పెంచే ప్రధాన నీటి ట్యాంకు. ఇక్కడే పెంపకం జరుగుతుంది. రెండోది : మెకానికల్ ఫిల్టర్. నీటి నుంచి తుప్పు, చెత్త వంటి ఘనపదార్థాలను తొలగిస్తుంది. మూడోది : బయో ఫిల్టర్. మంచినీటి జీవక్రియ ద్వారా విషకర నైట్రోజన్ పదార్థాలను తొలగిస్తుంది. నాలుగోది : యువి లేదా ఓజోన్ యూనిట్. నీటిలో క్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లను నశింప జేస్తుంది. ఐదోది : సంప్ ట్యాంక్. నీటి ఫిల్టర్ అయిన తర్వాత తాత్కాలికంగా నీటిని నిల్వచేసే ట్యాంక్. ఆరోది : పంప్. పంపు నీటిని తిరిగి ట్యాంకుకు పంపిస్తుంది. ఏడోది : ఎయిరేషన్ వ్యవస్థ. ఆక్సిజన్‌ను నీటిలో కలిపి చేపలకు జీవనాయువును అందించేదే ఎయిరేషన్ వ్యవస్థ.ఈ విధంగా ఆర్ఎఎస్లో ప్రతి భాగమూ కలిసి పనిచేస్తూ, ఒక సురక్షితమైన పర్యావరణ మిత్రమైన చేపల పెంపక పద్ధతిని అందిస్తాయి. చేపలు.. కల్చర్ ట్యాంకులో పెరుగుతాయి. వాటి ద్వారా నీటిలో మలినాలు ఏర్పడతాయి. ఈ నీరు ముందుగా మెకానికల్ ఫిల్టర్ ద్వారా వెళ్తుంది. చెత్తను తొలగిస్తుంది. ఆ తర్వాత ఈ నీరు బయో ఫిల్టర్‌లోకి ప్రవహిస్తుంది. ఈ నీటిలో ఉన్న అమ్మోనియా, నైట్రేట్ వంటి విషతుల్యమైన నైట్రోజన్‌ను ఖచ్చితంగా తొలగిస్తుంది. తర్వాత యువి లేదా ఓజోన్ యూనిట్‌కు నీరు వెళ్తుంది. ఇక్కడ నీటిలో ఉన్న సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి. ఇలా శుద్ధి అయిన నీరు సంప్ ట్యాంక్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పంప్ సాయంతో మళ్లీ కల్చర్ ట్యాంకుకు నీరు వెళ్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఎయిరేటర్ ద్వారా నీటిలోకి ఆక్సిజన్ కూడా అందజేయబడుతుంది. ఇది చేపల ఆరోగ్యానికి కీలకం.ఇదీ చదవండి: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్ఆర్ఎఎస్లో పెంచతగిన చేపల జాతులు:తిలాపియా, ఫంగాషియాస్ సీబాస్ (పండుగప్ప) , మారెల్ ట్రౌట్.ఆర్ఎస్ చేపల సాగులో ప్రధాన నీటి ప్రమాణాలు:1. నీట కరిగిన ఆక్సిజన్ (డిజాల్వ్డ్ ఆక్సిజన్). చేపలు పెరిగే ట్యాంకులో లీటరు నీటికి 5 మిల్లీ గ్రాముల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇది చేపల శ్వాసకు అవసరం. 2. ఉష్ణోగ్రత: 25 నుంచి 30 డిగ్రీల సెల్షియస్ వరకు మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. 3. ఉదజని సూచిక (పిహెచ్): 6.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. 4. అమ్మోనియా: ఇది లీటరు నీటికి 0.02 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. 5. నైట్రైట్: ఇది బాగా తక్కువగా ఉండాలి. అంటే, లీటరు నీటికి 0.1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉండాలి. 6. టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ (టిఎస్ఎస్): ఇది 50 మిల్లీ గ్రాముల కంటే చాలా తక్కువగా ఉండాలి. 7. కార్బన్ డయాక్సయిడ్: ఇది 10 నుంచి 15 మిల్లీగ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఇవన్నీ సమానంగా మెయింటెయిన్ చేసుకుంటూ ఉంటే ఆర్ఎఎస్ సిస్టం సక్రమంగా నడుస్తుంది.ఆర్‌ఎఎస్‌కు ఎదురవుతున్న సవాళ్లు:1. ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. చిన్న రైతులకు ఇది చాలా పెద్ద పెట్టుబడి అవుతుంది. 2. ఈ వ్యవస్థ నడిపించడానికి నిపుణుల అవసరం ఉంది. అంటే, శిక్షణ ΄÷ందిన వ్యక్తుల అవసరం చాలా ఎక్కువగానే ఉంది. 3. ఈ వ్యవస్థ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ముఖ్యంగా నీటి శుద్ధి, ఆక్సిజన్ సరఫరా కోసం విద్యుత్తు కావాలి. 4. సిస్టమ్ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ. పంపులు, ఫిల్టర్లు పనిచేయక΄ోతే సిస్టమ్‌లు ఫెయిల్యూర్ అవ్వటం వల్ల రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, చిన్న పొరపాటుకు పెద్ద నష్టం జరుగుతుందన్నమాట. కాబట్టి, ఆర్ఎఎస్ చేపల సాగు ప్రారంభించే ముందు అన్ని అంశాలనూ పరిశీలించాలి.చేపలతో పాటు కూరగాయలుఇంకా ఆక్వాపోనిక్స్ ద్వారా చేపల ఉత్పత్తితో పాటు కూరగాయల సాగు కూడా ఈ వ్యవస్థలో జరుగుతోంది. ఇదొక స్మార్ట్ వ్యవస్థ. దీంట్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది. ఇది ఎగుమతులకు మార్గం వేస్తుంది. మహిళలు, యువత ఆర్ఎఎస్ సాగును సులభంగానే చేపట్టి మంచి ఉపాధి పొందగలుగు తున్నారు. ఆర్ఎఎస్ కేవలం ఆధునిక చేపల చెరువు మాత్రమే కాదు. శుభ్రమైన, స్థిరమైన చేపల పెంపకానికి సంబంధించిన భవిష్యత్తు గల రంగం ఇది. నీటి పొదుపుగా వాడటం, ఆరోగ్యకరమైన చేపలను పెంచటం, ఎక్కువ దిగుబడి పొందటం.. వంటి ప్రయోజనాల రీత్యా పూర్తిగా పర్యావరణ అనుకూలమైన ఆక్వా సాగుగా ఆర్ఎఎస్ చేపల సాగును అభివర్ణించవచ్చు. ఆధునిక టెక్నాలజీ ఇప్పటి వరకు చేపల సాగు మాదిరిగా ఇది సాంప్రదాయ పద్ధతిలో చేపల పెంపకం కాదు. ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ వ్యవస్థను వాడుకునే పద్ధతి ఇది. రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్‌లో ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇఓటీ) సెన్సార్లు ఉపయోగించి, నీటి గుణ, నిల్వలపై కంట్రోల్ పెరుగుతుంది. అంటే, మొబైల్ ఫోన్ ద్వారా పిహెచ్, ఆక్సిజన్, టెంపరేచర్ వంటివి మనం చెరువులకు దూరంగా ఉండి కూడా సులువుగా తెలుసుకోవచ్చు.కనీస పెట్టబడి రూ. 15 లక్షలుఒక చిన్న స్థాయి ఆర్ఎఎస్ చేపల సాగు యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలంటే ముఖ్యంగా గమనించాల్సిన అంశాలు ఇవి.. : టన్నుల సామర్థ్యంతో ఆర్ఎఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ. 15 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ∙నిత్యం అయ్యే నిర్వహణ ఖర్చులు, చేపల ఆహారం, విద్యుత్తు, కూలి ఖర్చులు.. ఇలాంటివి ఉంటాయి ∙సరైన నిర్వహణ ఉంటే ఈ వ్యవస్థ ద్వారా సంవత్సరానికి రూ. 6 నుంచి 8 లక్షల ఆదాయం పొందవచ్చు. అంతేకాకుండా ఈ పెట్టుబడిని మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపే తిరిగి పొందగలుగుతారు ∙తిలాయిపియా, ఫంగాసియస్, ముర్రెల్, సీబాస్ వంటి చేపలను ఇందులో పెంచుకోవచ్చు. వీటికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రభుత్వ మద్దతుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త వెలుగుగా మారింది.ఆర్ఎఎస్ ఉపయోగాలు:ఆర్ఎఎస్ చేపల సాగు అంటే సాంకేతికతతో కూడిన భద్రతా వ్యవస్థ. ఇందులో నీటి వాడకం తక్కువగా ఉండటం వలన, అదే నీటిని మళ్లీ మళ్లీ వాడటం వల్ల నీరు పొదుపు అవుతుంది. తక్కువ వనరులతో అధిక ఉత్పాదకత సాధించవచ్చు. అంటే, తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి. వాతావరణంపై అంతగా ఆధారపడదు. కాబట్టి, ఏ కాలంలో అయినా మనం ఆర్ఎఎస్ సాగు చేసుకోవచ్చు. వ్యాధుల నియంత్రణ చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే, నీటి నాణ్యతా యాజమాన్యం అంతా మన చేతిలోనే ఉంటుంది. మురుగు నీరు బయటకు పోదు. ఆ విధంగా ఆర్ఎఎస్ అనేది పర్యావరణాన్ని కాపాడుతుంది. ఇది భవిష్యత్తులో మరింత విస్తరించే చేపల సాగు వ్యవస్థ. 40%–60% వరకు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీఆర్ఎఎస్ చేపల సాగు తీర్ర ప్రాంతాల రైతులకు ఇప్పుడు ఉత్తమ అవకాశంగా మారింది. ఎందుకంటే, తీర్ర ప్రాంతపు మట్టి (అంటే లావా మట్టి) ఆర్ఎఎస్ స్థాపించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఫిష్ ఫీడ్ అందుబాటులో ఉండటం, నిపుణుల సహాయం అందుబాటులో ఉండటం వల్ల ఈ సాగు మరింత లాభదాయకంగా మారుతుంది. పిఎంఎంఎస్వై అనే కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా రైతులకు ప్రోత్సాహకాలు, శిక్షణ, మార్గదర్శకత అందుతున్నాయి. పెట్టుబడులపై సబ్సిడీలు 40 శాతం నుంచి 60% వరకు లభిస్తున్నాయి. ఇది యువతకు, మహిళలకు, కొత్త రైతులకు గొప్ప అవకాశం. ఈ విధంగా ఆర్ఎఎస్ సాగు తీర్ర ప్రాంతాల్లో పరిశ్రమలతో సమానంగా అభివృద్ధి చెందుతోంది. ఇది జీవనోపాధికి, ఆర్థిక అభివృద్ధికి నూతన మార్గాలు చూపుతోంది. -
ఐఏఎస్ కల : మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!
ఎలాగైనా యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించాలనే తపనతో చదువుతున్నాడు మిస్టర్ రంజిత్ (పేరు మార్చాం). అతడు నరాలు తెగే ఏకాగ్రతతో చదువుతుంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) అనే సమస్య అతడి నరాలను దెబ్బతీసింది. జీబీఎస్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత వస్తుందిది. ఇందులో నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపైన ఉండే ‘మైలీన్’ అనే పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ వెలువడి... అవి తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక సొంత అవయవాలు అచేతనమవుతాయి. అందునా ఈసారి రంజిత్‌కు వచ్చిన వ్యాధి మామూలు జీబీఎస్ కాదు. జీబీఎస్ వచ్చేవాళ్లలోనూ ప్రతి 1000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన, అత్యంత తీవ్రమైన గులియన్ బ్యారీ సిండ్రోమ్ (Guillain-Barré syndrome (GBS) రకమిది. నరాల కూడలి (నోడల్) ప్రదేశాల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘నోడోపతి’ అంటారు. అది ఎంతటి తీవ్రమైనదంటే... సాధారణంగా కాళ్ల నుంచి పైకి చచ్చుబడిపోయేలా చేసే ఆ వ్యాధి... ఇతడిలో మాత్రం దేహమంతా అచేతనమయ్యేలా చేసింది. ఊపిరి తీసుకునేందుకు సహాయపడే కండరాలు అచేతనమైపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణం పోతుంది కదా. అలాంటిది అతడి కంటికి సంబంధించిన కండరాల్లో కొంత మినహాయించి మిగతా దేహమంతా కదలిక లేకుండా పోయింది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ అతడిని దెబ్బతీసిందేమో కానీ పరిస్థితులు అతడి సంకల్ప బలాన్ని ఏమాత్రమూ దెబ్బతీయలేకపోయాయి. సొంత కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డ తీరు అసామాన్యం, అనితరసాధ్యం, నిరుపమానం, నిరంతర స్ఫూర్తి. సొంత సోదరి కూడా ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతుండటంతో ఆమె అతడిలో మోటివేషన్ నింపుతూ ఉంది. అతడి పరిస్థితికి అతడిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐవీఐజీ అనే తరహా ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సి ఉంది. ఇది బాగా ఖరీదైన చికిత్స. అతడిది కేవలం ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. దాంతో అతడి మనోబలాన్ని పెంచేందుకూ, అతడిలో స్ఫూర్తి రగిలించేందుకూ మేం డాక్టర్లం కూడా అతడికి ఆర్థికంగా కొంత సహాయం (క్రౌడ్ ఫండింగ్) చేశాం. ఆసుపత్రి కూడా తనవంతు అండదండలందించింది. అన్నివైపుల నుంచి అందుతున్న సహకారాలతో అతడు రెండునెలల పాటు ఐసీయూలో వ్యాధితో పోరాడాడు. ఈలోపు మరో రెండుసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి అతడిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్లింది. దాంతో అతడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉండేలా చేశాం. అతడికి అందే ఆహారాలు బలవర్థకంగా ఉండేలా చూశాం. రిటుక్సిమాబ్ అనే ఇమ్యూన్ సపోర్ట్ మందులిచ్చాం. ఇలా అనేక ప్రయత్నాలు చేసి అతడిని కాపాడాం. రెండు నెలల పాటు అతడి నరాలకు ఏ ఆహారమూ అందకపోవడంతో, అవి రెండునెలల పాటూ ఏ పనీ చేయకపోవడంతో... ఆ తర్వాత ఎంతో బలహీనపడి శక్తిపుంజుకునేందుకు ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో అతడెంతో కష్టపడి బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు. చదవండి: బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్స్పైర్ చేసిన ఇంట్రస్టింగ్ కథనంఈ ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది పరీక్ష రాద్దువుగానీ అంటే... ‘‘లేదు సర్... మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా పరీక్ష రాయాల్సిందే. అది కుదరకపోతే నేను చెబుతుంటే ఎవరైనా స్క్రైబ్‌ను పెట్టుకునైనా సరే’’ అన్నాడా అబ్బాయి. మేం ఒక టీమ్‌గా పనిచేసే డాక్టర్లమంతా కలిసి, మా శక్తియుక్తులన్నీ వెచ్చించి, సంయుక్తంగా అతడిని మృత్యుదేవత ఒడిలోంచి బలవంతంగా వెనక్కుతీసుకొచ్చామంటే అది అతిశయోక్తి కాదు. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోక్రిటికల్ కేర్‌లో పనిచేసే మేము రోజులోని 24 గంటలూ క్రిటికల్ కేసుల్నే చూస్తాం. ఇటీవలే మేం ఒక డబుల్ ట్విన్స్ కడుపులో ఉన్న మహిళను రక్షించాం. అత్యంత సంక్లిష్టమైన టీబీ ఇన్ఫెక్షన్లూ, చాలా అరుదుగా కనిపించే మెనింజైటిస్ విత్ టీటీపీ అనే కేసులూ చూశాం. కానీ ఇలా చదువుకోసం తాపత్రయపడే ఓ చురుకైన కుర్రాణ్ణి మేమంతా ఓ టీమ్‌గా రక్షించిన ఉదంతం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది.డాక్టర్ హర్ష్ ఖండేలియా సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్-యాసీన్ -
Special Story: పాశమైలారంలో సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన
-
అప్పుడు సెల్ ఫోన్, ఇప్పుడు రాపిడో.. జనం నవ్వుకుంటున్నారు.. ఇక మారవా చంద్రబాబు
-
ఎయిరిండియా ప్రమాదంపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
-
Basaveshwarudu: బసవ బోధ
సమాజంలో నెలకొన్న దురాచారాలను, మూఢ విశ్వాసాలను సమూలంగా నిర్మూలించి జనులను సన్మార్గంలో నడి పించి ఉద్ధరించాలని తపించి ఆ ప్రయత్నంలోనే తనువులను బాసిన మహనీయులెందరో! వారిలో బసవేశ్వరుడు ఒకరు. బసవేశ్వరుడు క్రీ.శ. 1131లో కర్ణాటకలో జన్మించాడు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో ఉపనయనం చేయదలచిన తల్లితండ్రులతో, ‘అక్కకు లేని ఉపనయనం నాకెందుకు?’ అని ప్రశ్నించాడు. సదాచారం, సత్ప్రవర్తన లేని జీవితం వ్యర్థమనీ, చిత్త శుద్ధి దైవ సాక్షాత్కారాన్ని కల్గి స్తుందనీ చాటి చెప్పాడు. బస వేశ్వరుని అపారమైన మేధను గమనించి కల్యాణ కటకాన్ని పాలించే ఆనాటి రాజు బిజ్జ లుడు ఆయనను తన రాజ్యంలో మహామంత్రిగా నియ మించాడు. కేవలం శాసించటానికే పరిమితమైన రాజ సభను ప్రజాసమస్యలను పరిష్కరించే వేదికగా ‘అనుభవ మంటపం’గా ఆయన తీర్చిదిద్దాడు. ‘కాయకమే కైలాసం’ అనే సిద్ధాంతాన్ని బోధించి ప్రజలను కార్యకర్తలుగా, కార్య దక్షులుగా మలిచాడు. తాము చేసే పనిని శ్రద్ధతో చేయ టమే అసలైన పూజ అని తెలియజెప్పాడు.మానవులంతా సమానమే, శివుడే సత్యం, ఆయన నిరాకారుడు, ఖరీదైన ఆలయాలు, అలంకారాలు వద్దు, వాస్తు – జ్యోతిషాలు అసత్యాలు, భక్తి కన్నా సత్ప్రవర్తన మిన్న అని పదేపదే గొంతెత్తి చెప్పాడు. వేటగాడైన కన్నప్ప, పారిశుద్ధ్యపు పని చేసిన మేదర చెన్నయ్య, అంటరాని వాడైన సిరియాళుడు ఎలా ముక్తి పొందగలిగారో వివరించాడు. కులాంతర వివాహాలను, సహపంక్తి భోజనాలను బసవేశ్వరుడు ఆనాడే ప్రోత్సహించి సంఘ సంస్కరణకు పూనుకొన్నాడు. ఇలాంటివి నచ్చని సంప్రదాయవాదులు కుట్ర పన్నారు. అయినా వాటిని ఎదుర్కొంటూ ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తూనే శివైక్యం చెందాడు.– రాచమడుగు శ్రీనివాసులు -
అంతరించిపోతున్నఅరుదైన జంతువు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అరుదైన జంతువు అలుగు (పంగోలిన్) ప్రమాదంలో పడింది. సంప్రదాయ వైద్యం, పలు ఉత్పత్తుల్లో వాడకం పేరుతో ఈ వన్యప్రాణిని వేటగాళ్లు హత మార్చుతుండడంతో అంతరించపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ములుగు, ఏటూరు నాగారం, అమ్రాబాద్ టైగర్ రిజర్వుతో సహా పలు అటవీ ప్రాంతాల్లో గుట్టుగా వేటాడుతూ.. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ట్రస్టు ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) సంస్థ, అటవీ అధికారులు తెలంగాణలో పలుచోట్ల రహస్యంగా మాటు వేసి నిందితులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అలుగులనే అత్యధికంగా వేటాడి అక్రమరవాణా చేస్తుండగా.. వీటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ చర్యల్లో భాగంగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) ఈ వన్యప్రాణిని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది.వైవిధ్యం గల జీవిశరీరంపై గట్టి పొలుసులు ఉండే అలుగు.. క్షీరదాల్లో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆకారంలో ముంగిస తరహాలో ఉంటుంది. ఎదురుగా ఏదైనా కనిపిస్తే వెంటనే బంతి ఆకారంలో ముడుచుకు పోతుంది. సిగ్గరిగా, మనుషులకు దూరంగా ఉంటుంది. ఎవరిపైనా ఎటువంటి దాడి చేయదు. కేవలం రాత్రి వేళ సంచరిస్తూ చెదలు, చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. వాసన, వినికిడి శక్తి అధికంగా ఉంటుంది.శాస్త్రీయంగా నిరూపణ లేకున్నాచైనాతో సహా పలు దేశాల్లో ఈ జీవి శరీర భాగాలను సంప్రదాయ వైద్యంలో అనేక చికిత్సలకు వాడుతున్నారు. దీంతో అక్రమంగా అడవుల నుంచి రవాణా చేస్తూ పొలుసులు, మాంసాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలామంది నాటు వైద్యులు.. ఈ జీవి శరీర భాగాలను మందులు, చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అటవీ సమీప ప్రాంతాల వారికి డబ్బు ఆశ చూపిస్తూ.. అలుగును అక్రమ రవాణా చేస్తున్నారు. కొన్నిసార్లు మధ్యవర్తులతో ఇతర దేశాలకు రవాణా జరుగుతోంది. పలు చికిత్సల్లో వాడుతున్నప్పటికీ రోగ నివారణపై శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాల్లేవని అటవీ, వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానవ స్వార్థం కోసం అరుదైన అడవి జంతువులను వేటాడొద్దని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గి పోయిందని.. భవిష్యత్‌లో మరింత ముప్పును ఎదుర్కోబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.ఆగని అక్రమ రవాణాగత మార్చిలో అలుగును వేటాడుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజీలో ముగ్గురు పట్టుబడ్డారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో పలు చోట్ల అలుగు అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో అలుగును అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అటవీ అధికారులకు చిక్కాయి. -
వైఫ్ లు కాదు.. వైల్డ్ నైఫ్ లు
-
Special Story: జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు
-
మళ్ళీ కనబడ్డ ఓర్ ఫిష్.. ఇక ప్రళయమేనా!!?
-
ఆకాశమంత విషాదానికి అసలు కారణం అదేనా?
-
సెవెన్ స్టార్’ బిచ్చన్న.. ఈయన కథ వేరే లెవెల్..
ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం నాన్న.. తాను కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహరి్నషలు కష్టపడే శ్రామికుడు నాన్న.. జీవన ప్రయాణంలో తన స్వార్థం కోసం చూసుకోకుండా.. బిడ్డలను ఒడ్డున చేర్చేందుకు పరితపించే నావికుడు నాన్న.. పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే తపనతో.. చివరి శ్వాస వరకూ రక్తమాంసాలను కరిగించే యోధుడు నాన్న.. ఎన్ని జన్మలైనా.. ఎంత సేవ చేసినా తీర్చుకోలేని రుణం నాన్న.. అందుకే నాన్నా.. మీరే మా హీరో. ఆదివారం జాతీయ పితృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..‘సెవెన్ స్టార్’ బిచ్చన్న కొడంగల్ రూరల్: పట్టణానికి చెందిన బిచ్చన్న – విజయలక్ష్మి దంపతులకు ఏడుగురు సంతానం. దర్జీ వృత్తి చేస్తూ పిల్లలను చదివించారు. ఆ కాలంలో ఏడుగురిని చదివించడమంటే ఆషామాషీ కాదు.. కానీ బిచ్చన్న బెదరలేదు.. పేదరికాన్ని జయించి కొడుకులను ఉన్నత స్థానంలో నిలిపారు. మొదటి కుమారుడు సత్యకుమార్ హైదరాబాద్‌లో పీహెచ్డీ, ఐఐసీటీ.., సౌత్ఆఫ్రికాలో పోస్టు డాక్ చేశారు.ప్రస్తుతం మస్కట్ దేశంలో యూనివర్సిటీ ఆఫ్ నిజ్వాలో అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ రీసర్చ్గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఐఐటీ బాంబే, ఎంఎస్సీ గణితం పూర్తి చేసి ప్రస్తుతం మస్కట్ దేశంలో హలీ బ్యాంకులో పని చేస్తున్నారు. మూడో కుమారుడు రవికుమార్ దౌల్తాబాద్ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నాల్గో కుమారుడు అనిల్‌కుమార్ మద్రాస్ ఐఐటీలో పీహెచ్డీ పూర్తి చేసి ప్రస్తుతం కెనడియన్ కంపెనీలో రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటర్ టెక్నాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఐదో కుమారుడు శివకుమార్ ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రముఖ నగల దుకాణంలో సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆరో కుమారుడు మనోజ్‌కుమార్ ఐఐఐటీ పూర్తి చేసి ఫీడెక్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా రాణిస్తున్నారు. ఏడో కుమారుడు నవీన్‌కుమార్ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసి అపెక్స్ కోవంటెజ్ ఎల్ఎల్సా, యూఎస్ కంపెనీలో డాటా ప్రోగ్రామర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో బిచ్చన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
భారత్ లో అత్యంత ఘోర విమాన ప్రమాదాలు ఇవే
-
1, 2, 3 కేన్సర్ దాకా అవసరమా మిత్రమా!
దేహం ఎంత ధృఢంగా ఉన్నా.. సిగరెట్, బీడీ అలవాటు ఉంటే చాలు పొగాకు దండయాత్రకు గేట్ తీసినట్టే. పొగాకుతో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. అలాగే తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ"కూర్చిన" రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.ఒక్కటి చాలు అంటూ మెల్లిగా మొదలెట్టి 2, 3, 4 అలా రోజూ డబ్బా, ఇలా పర్సు ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు. సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.. దమ్ము కొట్టినపుడు సిగరెట్లో పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డీఎన్ఏను నాశనం చేసే పనిలో పడతాయి. సరళంగా చెప్పాలంటే ఓ వ్యక్తి జాతకాన్ని.. ధూమపానికి ముందు, తర్వాత అని చెప్పొచ్చు.అమ్మా, నాన్నలు ఇచ్చే పాకెట్ మనీతో గుట్టుగా సిగరెట్‌కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండిగా పైసలున్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటుకు "దగ్గర" అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతేగాక కొన్ని సినిమాల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్లు సైతం యువతను అటువైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు. "బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్" అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఉక్కు లాంటి కండరాల్ని తుప్పు పట్టించే పనిలో ఉంటాయి. పటిష్టమైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్) అడ్డగోలుగా పెరగడానికి కారకం అవుతాయి. తద్వారా కేన్సర్‌కు దారి తీస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాల డిఎన్ఏను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో, మనిషి ఆరోగ్యానికి కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.చదవండి: NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లుసిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డీఎన్ఏను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు.. రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి. దేహ పోరాట పటిమను సమాధి చేస్తాయి. వెరసి కణాలపై రాక్షసంగా దండయాత్ర చేసి.. దేహాన్ని జబ్బులతో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపిలో దిగబడ్డ ప్రాణిలా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకుతో దోస్తీ దేనికి?ధూమపానానికి దూరంగా ఉంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మన దగ్గరే ఉంటుంది.- మాచన రఘునందన్పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీతతెలంగాణ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్దార్ -
సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..
చిన్నప్పుడే విద్యుత్ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్ జీవితంపై స్పెషల్ స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ ‘సాక్షి’తో చెప్పాడు. స్ఫూర్తిగా నిలిచి.. విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్ మధు అనిపించుకున్నాడు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్ టాప్‌ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. చిరునవ్వుతో ముందడుగుమునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్ వచ్చి షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.నోటితో పెయింటింగ్..నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్ జామ్ షోకు హాజరై అక్కడ మెగాస్టార్ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్లు ప్రభాస్, వెంకటేష్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.ఐఏఎస్ అవ్వడమే లక్ష్యం..కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్ గ్రామం, మునిపల్లి మండలం -
ఈ వారం కథ: రీట్వీట్
నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు. డెడ్ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్ లాంప్ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్ కంటైనర్‌లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు. రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు. ఒక్క క్లిక్. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్ అని కొందరంటే, ట్రైటర్ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి.∙∙ మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్ నేమ్ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి. తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!∙∙ నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని. నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్వి. నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్‌కి బయలుదేరావు. టైమ్ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.∙∙∙INTERNAL DHS MEMO & CLASSIFIEDసబ్జెక్ట్: భారతి రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్: 04/14/1997సిటిజన్‌షిప్: ఇండియా స్టేటస్: ఎఫ్–1 యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్: యు.ఎస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. సాక్ష్యం: సోషల్ మీడియా యాక్టివిటీ. రికమెండేషన్: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దుకేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్: జాతీయ భద్రతా ముప్పు యాక్షన్: సాఫ్ట్ డెటెన్షన్ ప్రోటోకాల్. ∙∙ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్లిపోయావు. అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్‌పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.‘‘మేమ్, ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్‌గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్ రొటీన్’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. ∙∙ ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్: సబ్జెక్ట్ కామ్‌గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్ రీట్వీట్ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. ∙∙ నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. ‘‘నా మీద పెట్టిన చార్జ్ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్‌లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్ కాల్ ట్రాన్ స్క్రిప్ట్: ICE మానిటర్డ్ లైన్ ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. ‘‘మొన్న ఫ్లయిట్ ఎందుకు కాన్సిల్ చేశావ్? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’‘‘నీ వీసా Extensionకి ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్‌గా వున్నాయి. నేను ఫోన్ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి. ఫోన్ కాల్ టైమ్ అయిపోయింది. ∙∙ Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!∙∙ ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా. Like Bharati.. స్పీడ్‌గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. కల్పనా రెంటాల(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
కుళ్లుబోతు రాజకీయాలు
-
జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది అంటున్న బ్యూటీ!
ఇదివరకైతే ఇలాంటి పోటీల్లో నిర్ణీత కొలతల్లో శరీరాకృతి ఉండాలనే నియమం ఉండేది. కానీ ఇప్పుడు వీరందరినీ చూస్తుంటే అలా అనిపించట్లేదు. అయిదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వాళ్లున్నారు.. ఆరడుగులు ఎత్తు దాటిన వారూ ఉన్నారు. సన్నజాజి తీగను మరిపించే వారున్నారు, బలిష్టమైన శరీరాకృతితో మెరిసి΄ోతున్న వాళ్లూ ఉన్నారు. ఇంచుమించు అందరివీ వైవిధ్యభరితమైన నేపథ్యాలు, ఎన్నో పోరాటాలు, ఎదురీతలు... దాదాపు 120 దేశాల సుందరీమణులు. రకరకాల దేశాల శీతోష్ణస్థితులు... రకరకాల స్కిన్టోన్లు. వివిధ రకాల ఆకృతులు. వారందరికీ ఒక్కొక్కరిది ఒక్కో కథ! ఆత్మవిశ్వాసమే ఆభరణంగా.. ప్రతిభ, బ్యూటీ విత్ పర్సస్ ప్రధాన అర్హతలుగా తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆ సుందరీమణుల్లో రొజుకొకరి పరిచయం ఇక్కడ. ఈరోజు మిస్ జపాన్ కియానా తుమీత గురించి ఆమె మాటల్లోనే..నేను ప్రకృతి వైపరీత్యాల మీద పీహెచ్డీ చేస్తున్నాను. అంతకుముందు కేంబ్రిడ్జ్, ఎడింబరో యూనివర్సిటీల్లో విమెన్ లీడర్ షిప్ మాస్టర్ డిగ్రీ చేశాను. ఒక బిజినెస్ చానల్లోఎకనమిక్ న్యూస్ యాంకర్‌గా పనిచేస్తున్నాను. నా టాలెంట్ విషయాలకు వస్తే నేను జపనీస్ కాలిగ్రాఫర్ని. అందులో నాకు మంచి పేరుంది. ఎలక్ట్రిక్ ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఈ పోటీల్లో టాలెంట్ రౌండ్లో ఎలక్ట్రిక్ ఫ్లూట్నే పెర్ఫార్మ్ చేయబోతున్నాను. ప్రకృతి గౌరవిస్తూ వైపరీత్యాలు రాకుండా జాగ్రత్తపడటం, ఒకవేళ ప్రకృతివైపరీత్యాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను. నా అందంతో ఈ ప్రయోజనాన్ని సాధించాలనుకుంటున్నా! ప్రకృతి వైపరీత్యాల పట్ల పిల్లలకు అవేర్నెస్ కల్పించడం! స్త్రీ, పురుష వివక్ష విషయానికి వస్తే.. దానికి జపాన్ కూడా అతీతమేమీ కాదు. చదువుకు సంబంధించి అమ్మాయి, అబ్బాయిలకు సమాన అవకాశాలున్నప్పటికీ.. లీడర్షిప్ విషయంలో మాత్రం పురుషులదే ఆధిపత్యం. ఆ అంతరం చాలా ఎక్కువ. వేతనాల్లో కూడా ఆ గ్యాప్ కనపడుతుంది. సమానమైన పనికి మహిళలకన్నా పురుషులకే వేతనాలు ఎక్కువ. డిసిప్లిన్, పని విషయాల్లో ప్రపంచంలోని ప్రతిదేశం జపాన్ వైపు చూస్తుందేమో కానీ.. టెక్నికల్ జాబ్స్ విషయంలో మాత్రం మేము ఇండియాను అప్రిషియేట్ చేస్తాం. కొత్తగా వచ్చిన ఏ టెక్నికల్ చేంజ్‌ను అయినా ఇట్టే గ్రహించి, అడాప్ట్ చేసుకుని రాణిస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న క్రైమ్ గురించి వార్తల్లో విన్నప్పుడు కొంచెం నెర్వస్ ఫీలయ్యాను. కానీ ఈ పోటీల కోసం ఇక్కడ ల్యాండ్ అయ్యి, ఇక్కడి మనుషులు, వాళ్లిచ్చే మర్యాద అవన్నీ చూశాక ఆ నెర్వస్నెస్, భయాలు అన్నీ పటాపంచలయ్యాయి. ఇక్కడికి రావడానికి నాకు దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లయిట్ ఉండింది. అక్కడ బోర్డింగ్‌లో నా లగేజ్‌తో అవస్థపడుతుంటే ఒక ఇండియన్ జెంటిల్మన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడే నాకు ఇండియా మీద గౌరవం రెట్టింపయింది. ఈ దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన మరోవిషయం.. ఎర్రటి బొట్టు. ఈ పోటీలో ఒకరోజు నేను చీర కట్టుకుని, ఎర్రటి బిందీ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇండియాకు, జ΄ాన్కున్న మరో సామ్యం.. బౌద్ధం. మేము ఫాలో అవుతున్న బౌద్ధానికి, ఇక్కడికి వ్యత్యాసమున్నప్పటికీ బౌద్ధం ఈ దేశంతో మాకో కనెక్టివిటీని పెంచింది. ఇక్కడి ఆధ్యాత్మికతకు నేను ఫిదా అయ్యాను. బ్యూటీ పాజెంట్ విషయానికి వస్తే చాలా దేశాల్లో ఉన్నట్టే జపాన్‌లోనూ.. అందాల పోటీలు అంటే స్కిన్ షో తప్ప మరోటి కాదనే అభిప్రాయం, అపోహా ఉన్నాయి. కానీ బ్యూటీ విత్ పర్పస్ అనే ఐడియా నాకు నచ్చి.. పోటీల్లోపాల్గొంటున్నాను. సిస్టర్హుడ్ క్రియేట్ చేయడానికి ఇదొక వేదిక. సన్నగా ఉన్నామా.. లావుగా ఉన్నామా.. తెల్లగా ఉన్నామా.. నల్లగా ఉన్నామా అని కాదు.. అదసలు విషయమే కాదు. డజంట్ మ్యాటర్. ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నదే మ్యాటర్. అందుకే నా దృష్టిలో ఆత్మవిశ్వాసమే అసలైన అందం!ఇదీ చదవండి: Operation Sindoor: 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం! జూనియర్ ఎన్టీఆర్‌తో నటించాలనుంది..నాటు నాటు పాట జపాన్‌లో చాలా ఫేమస్. ఆ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పక్కన నటించడానికి నేను సిద్ధం. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా షారూఖ్ ఖాన్‌కి వీర ఫ్యాన్‌ని. ఇండియాది రిచ్ కల్చర్. ఇక్కడి రైతా చాలా డెలీషియస్‌గా ఉంటుంది. – కియానా తుమీతచదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర– సరస్వతి రమ -
పానీ పూరీ తినడం నేర్చుకున్న అందాల సుందరి ఎవరంటే..!
అందం అంటే స్వతహాగా మనం ఉండే విధానమే. అందానికి సూత్రాలేం లేవు. దేనినైనా స్వతహాగా ఆస్వాదించడమే అందం. ఇదే ప్రపంచంలోని అందమైన వైవిధ్యం అన్నారు హూన్ త్రాన్ నీ. తెలంగాణ (హైదరాబాద్) వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025పోటీల నేపథ్యంలో మిస్ వరల్డ్ వియత్నామ్ హూన్ త్రా నీ ‘సాక్షి’ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. భారతీయతను, మానవత్వాన్ని, భిన్న సంస్కృతుల అద్భుత సమ్మేళనాన్ని గొప్పగా వర్ణించిన హూన్ త్రాన్ సాక్షి’తో పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..!!ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి నన్ను ఆహ్వానించిన విధానం, ఇక్కడి సంస్కృతిలోని ఆప్యాయత నాకెంతో నచ్చింది. తెలంగాణ స్థానిక సంస్కృతిలో ప్రదర్శించిన నృత్యాలు నన్ను అబ్బుర పరిచాయి. ఇక్కడి కళాకారుల్లో ఒక వైవిధ్యముంది. ఇక్కడి ఆతిథ్యం నాకు మరో ఇంటిని తలపిస్తోంది. నేను బస చేస్తున్న హోటల్ సిబ్బంది నా కోసం పర్యావరణహితమైన పదార్థాలతో తయారు చేసిన అందమైన బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు. మరో సిబ్బంది నా కోసం వియత్నామీస్ భాషలో రాసిచ్చిన లేఖ నన్ను హత్తుకుంది. ఇంటికి దూరంగా ఉన్న నాకు ఈ లేఖ ఎంతో సాంత్వనను అందించింది. ఇవన్నీ ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమానురాగాలకు ప్రతీకలు. హైదరాబాద్‌లో నాకు బాగా నచ్చిన అంశం పానీ పూరీ. వియత్నాం, నేను చదువుకునే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎప్పుడూ ఇంత రుచికరమైనది తినలేదు. మిస్ ఇండియా నందినీ గుప్తా పానీ పూరీ ఎలా తినాలో నేర్చించింది. నా దేశం అందమైన, సాంస్కృతికమైన దేశం. మిస్ వరల్డ్ అంటే.. తమ దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. వ్యక్తిగత విశిష్టత గురించి గొప్పగా ప్రదర్శించే ప్రపంచ వేదిక. ఈ స్ఫూర్తితోనే నేను వియత్నామీస్ ఆత్మస్థైర్యం, సామాజిక బాధ్యత గల అమ్మాయిగా మిస్ వరల్డ్ వేదిక పైన సగర్వంగా నిలుచున్నాను. మిస్ థాయ్‌లాండ్ ఓపాల్, మరో దేశ వనిత సోమ నాకు స్ఫూర్తినిచ్చారు. సామాజికంగా ఎదురయ్యే కొన్ని అడ్డంకులు, అవరోధాలను ఎలా ఎదుర్కోవాలో వారి కథలు విని నేర్చుకున్నాను.ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించానువిద్య–విఙ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడి జీవితాలు బాగుంటాయని నమ్ముతాను. అందుకే మా దేశంలో ‘హర్టీ హెల్ప్’ అనే ప్రాజెక్ట్ చేపట్టాను. ఇదే నా బ్యూటీ విత్ పర్పస్ థీమ్. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్నో స్కూల్స్‌ను పునరుద్ధరించాను, అక్కడి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను అందించడానికి బుక్ రూంలను ఏర్పాటు చేశాను. నేను మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే ఈ ప్రాజెక్ట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తున్నాను.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీరపుస్తకాలే నాకు సాంత్వన నా ఫ్యాషన్ మోడలింగ్‌లో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. దానిని అధిగమించడానికి నాకు తోడుగా నిలిచింది పుస్తకాలు మాత్రమే. పుస్తకాలే నాకు గురువులు, స్నేహితులు, సాంత్వన. వ్యక్తులు, వ్యక్తిత్వాలు, సామాజిక అంశాలను రచయితలు ఎంతో హృద్యంగా మనకు చేరవేస్తారు. ‘ఎలయర్’ అనే పుస్తకం నాకెంతో నేర్పించింది. ఎప్పుడైనా సరే ఇతరుల విజయాన్ని చూసి మనల్ని పోల్చుకోవద్దు. వారి విజయాలకు కారణాలు వేరు. మన వాస్తవ పరిస్థితులు వేరు. ప్రతీ ఒక్కరికి ఒక వినూత్నమైన దారి ఉంటుంది, ఒక అందమైన ప్రయాణముంటుంది. అందరినీ గౌరవించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి. నేనూ వాటిని దాటుకునే వచ్చిన దానినే. ఈ సందర్భంగా నేనొక విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో దయతో ఉండండి. ఎవరినీ తక్కువ చేసి చూడొద్దు, సామాజిక అసమానతలు, అస్పశ్యతలు నాలాంటి అమ్మాయిలను వేదనకు గురి చేస్తాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ వేదికపైన చెప్పాలనుకున్నాను.. కానీ ‘సాక్షి’ దీనిపై నన్ను స్పందన కోరడంతో ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరిని గౌరవించండి, వారి ఆలోచనలకు విలువ ఇవ్వండి. – హూన్ త్రాన్ – హనుమాద్రి శ్రీకాంత్ ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
నోరూరగాయ.. ఆవకాయ..! ఇప్పుడు చాలా కాస్టలీ గురూ..
‘ముద్దపప్పు మిత్రమై వర్థిల్లే ఆవకాయ వేసవిలో పుట్టి చవులూరించే ఆవకాయ‘ వేసవి వచ్చిందంటే చాలు వంటగదిలో హడావుడి మొదలయ్యేది.. ఆ ఏడాది ఆవకాయ పెట్టే కార్యక్రమం గురించి చర్చోపచర్చలు జరిగేవి.. మంచి మామిడి కాయలు తెచ్చుకోవాలి.. కరెక్ట్ సైజులో ముక్కలు కొట్టించాలి.. సరైన మోతాదులో సంబారాలన్నీ కలుపుకోవాలి.. శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే ఏడాదంతా నిల్వ ఉండాలి కదా.. ఆవకాయ పెట్టే విధానం గురించి కొత్త కోడలికి పాఠాలు.. సరిగ్గా నేర్చుకోవడం లేదని కూతురికి అక్షింతలు.. ఇంటి పెద్ద హడావుడే హడావుడి.. ఇదంతా గతం. ఇప్పుడు ఆవకాయ పెట్టే ఓపిక, తీరిక ఎవరికుంది? ఆవకాయ పెట్టడం ఎందరికి వచ్చు? పెరిగిన ధరలతో అది భారంగా మారిన వేళ అంత శ్రమ ఎవరు తీసుకుంటారు?ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి. ధరల దరువు కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాణ్యమైన మామిడి కాయలేవీ? వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్ వ్యాపారుల వద్ద సూపర్మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు. ఆవకాయ చాలా కాస్ట్లీ గురూ.. 40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది. మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది.జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్ వన్ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదు. – విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురం(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..) -
Bhimireddy Narasimha reddy రైతాంగ విప్లవ వీరుడు
ఆయన పేరు వినగానే వీర తెలంగాణ(Telangana) రైతాంగ సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసి పడతాయి. ఆయనే కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహా రెడ్డి (బీఎన్) (bhimireddy narasimha reddy ) భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధం చేబూని ఉద్యమాన్ని నడిపిన నాయకులలో కామ్రేడ్ బీఎన్ ఒకరు. ఆయన 1922లో నేటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్త గూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. అయినా రైతాంగ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. హైదరాబాద్ సంస్థానానికి తెలంగాణలో 2,600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు ఉండేవారు. వీరి అధీనంలో 10 వేల గ్రామాలు, కోట్లాది ఎకరాల సాగుభూమి ఉండేది. ప్రజల్లో అత్యధికులు పెత్తందారీ భూస్వాముల కింద వెట్టిచాకిరీ చేసి బతకవలసి ఉండేది. ఈ వాతావరణం రైతు కూలీలలో అసంతృప్తిని రగుల్కొల్పి ఉద్యమానికి దారి తీసింది.చదవండి : వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీకమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. శత్రువు మూకలను ఎదిరించడానికి ‘గుత్పలసంఘాలు’ ఏర్పడ్డాయి. పాత సూర్యాపేట, దేవరుప్పల, ఆలేరు; అలాగే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అనేక ప్రాంతాలలో బీఎన్ నిజాం రైఫిల్‌లను ఎదిరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయన ఆధ్వర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడుల ద్వారా సేకరించిన ఆయు ధాలతో పోరాటం ముందుకు సాగింది. 1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరివాహక ప్రాంతంలో నదికి రెండు వైపుల సుమారు 200 గ్రామా లలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు బీఎన్. చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!1946 నుండి 1951 అక్టోబర్ వరకు విరామం ఎరుగక జరిగిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చివరగా ఆయుధం కిందకు దించింది ఆయనే. రెండుసార్లు సూర్యాపేట నుండి రాష్ట్ర శాసనసభకు, మూడు సార్లు మిర్యాలగూడ నుండి భారత పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రజల హక్కులపై, సమస్యలపై చట్టసభలలో తన గళాన్ని వినిపించారు. ఒకానొక దశలో స్వయంగా సీపీఎం (బీఎన్) పార్టీని స్థాపించి దానిని తరువాత ఎమ్సీపీఐలో కలిపారు.– వనం సుధాకర్ ఎమ్సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బీఎన్ రెడ్డి వర్ధంతి -
Frogs నన్ను ఇంటికి తీసుకు వెళ్ళు
ఒకటి రెండు కప్పలు సింక్ కింద ఉంటే చాలు, ఇంట్లో బొద్దింకల బెడద తీరిపోతుందని రోమ్ వాళ్ల అమ్మ ఎప్పుడూ అంటుండే వారు. ఆలోచించి చూస్తే, మా అస్తవ్యస్థమైన తోటలాగే, కప్పలు మా ఇంటిలో గుమిగూడి, గంపలు తెంపలుగా చేరాయి, అచ్చం ఆ చెట్టుకప్పల దాడి లాగ. అడవి దారిలో నడిచినట్టు, ప్రతి రాత్రి నేను నా చెప్పులు తొడగని కాలిని ఎక్కడ పెడుతున్నానో చూసుకోవలసి వచ్చేది. నేను ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఆ అద్భుత-పరిమాణం గల జిగురోడే కప్ప మలం ఎగిరోచ్చి నా పాదాలకు అంటుకునేది. నేను ఏమి చేస్తున్నా మరచిపోయి, ఆ నల్ల ‘కప్ప జిగురుని’ కడుక్కోవడానికి వెంటనే కుంటూ కుంటూ వెళ్ళాల్సొచ్చేది. అలా కొన్ని రాత్రి సంఘటనల తరువాత నేను ఆ కప్పల్ని ఇంటి నుంచి అవతల విసిరేశాను కానీ అవి నా కోపాగ్నిని ఎదురుకోవడానికి భయం లేకుండా తిరిగి వచ్చాయి.వాటిని నేనొక ప్లాస్టిక్ డబ్బాలోకి పోగు చేసి, ఒక 250 మీటర్లు అవతల, ఇంటి ముందుపెరటి చివర్న వదిలాను. అవి ఒక మొండి ధైర్యంతో తిరిగి వచ్చాయి. నేను 500 మీటర్ల దూరంలో వాటిని వదిలేముందు వాటికి ముద్ర వేసి (గుర్తించడం కోసం), డబ్బాని గిరగిరా గుండ్రంగా తిప్పి తోటలో వాటిని చాలా గజిబిజిగా త్రోవ మార్చి తిప్పాను (అయోమయం సృష్టింద్దామని అనుకున్నా). కానీ అవి 25 గంటల్లో తిరిగి వచ్చాయి.ఆడ-రాక్షసి వాటికోసం వస్తే వాటి భాగ్యంలో ఏముందో ఈ పాటికి ఆ వేధించే జీవులకి అర్ధమయ్యింది. అవి బాధలో కీచుమన్నాయి, వణుకుతూ ఎక్కడ పడితే మూత్రం చేసాయి, ఇంకా పట్టుబడకుండా వుండే ప్రయత్నం చేసాయి. నేను ఇంచుమించు క్షమించేశా, కానీ నా కుతూహలం నన్ను ఎగదోసింది. 750 మీటర్లు. 30 గంటల్లో తిరిగి వచ్చాయి. ఆ చిన్న ప్రాణులకి నడవటానికి అది చాలా పెద్ద దూరమే. సీసాని గిరగిరా తిప్పి, ఒక కిలోమీటర్ దూరంలో రోడ్డవతల బురదనిండిన పొడవాటి దారిలో తీసుకెళ్లి, అడవిలో నీటి మడుగు దెగ్గర వదిలేశా. వాటిని ఇంటి నుండి తరిమెయ్యడంలో నేను విజయం సాధించాను కానీ, పెరటి బయట కుండీలో ఒక కప్ప జంటని నేను కనుగొన్నాను. అవన్నీ తిరిగివచ్చాయా లేదా కొన్నే తిరిగివచ్చాయా అన్నది నేనిప్పుడు చెప్పలేను. వేరే జంతువులు వాటిని ఇంటి నుండి దూరంగా తీసుకుపోతే ఏం చేస్తాయి?నేను వెలికి తీసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో...నమీబియాలో ముద్ర వేసి 800 కిలోమీటర్ల దూరంలో వదిలివేసిన ఎనిమిది చిరుతల్లో, 5 నుండి 28 నెలల వ్యవధిలో ఆరు చిరుతలు ఇంటికి తిరిగి వచ్చాయి. ఒక ఉదాహరణ ఇస్తాను ఉండండి: ఈ చిరుతల్ని చెన్నై నుంచి తీసుకుపోయి గోవాకి కొద్దిగా ఉత్తరాన వదిలినట్టయితే, అవి తిన్నగా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాయాన్నమాట! అమెరికాలో, వాటి ఇంటికి 200 కిలోమీటర్ల అవతల వదిలేసిన 34 నల్ల ఎలుగుబంట్లలో చాలామటుకు విజయవంతంగా వాటి భూభాగానికి తిరిగి వచ్చేశాయి. భారతదేశంలో, టెరాయి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో బక్స పులుల సంరక్షణ కేంద్రంకి మార్చాబడిన ఒక ఏనుగు రెండు నెలల కంటే తక్కువ కాలంలో తిరిగి వచ్చేసింది. ఆస్ట్రేలియాలోని, ఇంటి నుండి 400 కిలోమీటర్ల అవతల వదల బడ్డ ఉప్పునీటి మొసళ్లు తిరిగి వచ్చేసాయ్..అదే నన్ను బెంగుళూరులో వదలండి, నేను మరుక్షణం తప్పిపోతాను.ఏదేమైనా, దూరాల నుండి ఇంటికి చేరుకోవడంలో ఆరితేరినవి మాత్రం ఆల్బట్రాస్, షీర్వాటర్ వంటి సముద్ర పక్షులదే. మధ్య పసిఫిక్ నుంచి 6,500 కిలోమీటర్ల దూరంలో ఫిలిప్పిన్స్ లో ఉన్న ఒక దీవిలో విడిచి పెడితే, అది ఒక ఆల్బట్రాస్ నెలలో తిరిగి వచ్చింది, మరో రెండు 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ (అమెరికా) నుంచి తిరిగి వచ్చాయి.ఈ అద్భుత నేర్పు కేవలం పెద్ద జంతువులకు మాత్రమే ఉండదు. U. K లో, వాటి తేనె తుట్ట నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ప్రణాళిక లేకుండా విడిచెయ్యబడ్డ బంబల్ బీ తేనెటీగలు వాటి ఇంటికి తిరిగి వచ్చేసాయి. కాబట్టి, కప్పకు ఒక కిలోమీటర్ ఎంత, ఊఁ?ఈ జంతువులు, పక్షులు, పురుగులు ఇంటికి తిరిగి చేరుకుంటాయన్న వాస్తవం బాగా డాక్యుమెంట్ చేయబడింది. కానీ, దూరతీరాలలోని తెలియని భూభాగం నుంచి అవి ఇంటి దారి ఎలా కనుగొంటాయి? ఈ జంతువులను వాటి ఇంటి నుంచి బయట చోటికి మార్చేప్పుడు, అన్ని వైపులా మూసి ఉన్న వాహనాలలో (లేదా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలో) తీసుకు వెళతారు కనుక, అవి దారిలో దాటి పోయే దృశ్యాలను, చెట్లను చూసి, జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం లేదు. చాలా కేసులలో, ఆ జ్వంతువులు తీసుకువెళ్లే దారిలో కాకుండా, దానికి బదులుగా, ఇంటికి రావటానికి డైరెక్ట్ తోవ ఎంచుకున్నాయి. అయితే, అవి అది ఎలా చేస్తాయి?-ఇంకా ఉందిAuthor : Janaki Lenin -- జానకి లెనిన్Photo credit - జానకి లెనిన్ -
దేశ గుండెల్లో చెరగని గాయాలు
-
Indian railways marks 172nd anniversary: భారతీయ రైల్వే @173
153లో ముంబై నుంచి తొలి రైలు పరుగులు..బుధవారంతో 172ఏళ్లు పూర్తి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఇండియన్ రైల్వే విజయ వంతంగా 172 సంవత్సరాలు (Indian railways marks 172nd anniversary) పూర్తిచేసుకుని 173వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టరి్మనస్, థానేలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రయాణికుల అసోసియేషన్స్ సభ్యులు కేకులు కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎంపీ నరేష్ మస్కే థానే స్టేషన్ మాస్టర్ కేశవ్తావడేతోపాటు రైల్వే అధికారులు, ప్రయాణికుల సంఘటన పదాధికారులను ప్రత్యేకంగా సన్మానించారు. బ్రిటిష్ ఇంజనీర్ జార్జ్ క్లార్క్ ఆలోచనతో... దేశ ఆరి్థక రాజధానిగా, మహారాష్ట్ర రాజధాని ముంబై నగర అభివృద్ధికి అనేక కారణాలున్నప్పటికీ వాటిలో రైల్వేవ్యవస్థది ప్రధానపాత్ర. 1843లో మొదలై నేటి వరకూ రైల్వే దేశవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా మోనో, మెట్రో రైళ్ల ప్రవేశం రైల్వే విస్తరణలో కీలక ముందడుగు. వీటితో పాటు ఇటీవలే ప్రారంభించిన అత్యాధునిక వందేభారత్ రైలు, త్వరలో ప్రారంభించేందుకు ప్రయతి్నస్తున్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్రైలు రైల్వే కిరీటంలో కలికితురాళ్లు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముంబై రవాణా వ్యవస్థలో కీలకమైన లోకల్ రైళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అది 1843వ సంవత్సరం. ఏదో పని నిమిత్తం సైన్–భాండూప్ రోడ్డుపై వెళ్తున్న బ్రిటీష్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్‌కు హఠాత్తుగా ముంబైలోని ద్వీపాలన్నింటిని కలుపుతూ ఒక రైల్వే లైన్‌ను వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మనసులోకి వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉన్నతాధికారులతో చర్చించి పనులు ప్రారంభించారు. కేవలం పదేళ్లలో పనులు పూర్తిచేశారు. పట్టాలెక్కిన తొలి రైలు... 1853 ఏప్రిల్ 16వ తేదీ మొట్టమొదటి రైలు ముంబై నుంచి ఠాణేకి మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవంతంగా బయలుదేరింది. అప్పటినుంచి రైల్వే ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముంబై రవాణాలో బెస్ట్ బస్సులతో పాటు సబర్బన్ లోకల్ రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందుకే ఇవి ‘ముంబై లైఫ్‌లైన్’లుగా పేరుపొందాయి. ఇక్కడ ప్రజలు నిరంతరం ఉరుకులు పరుగులతో బిజీగా ఉంటారు. వారి జీవన విధానానికి తగ్గట్లుగా లోకల్ రైళ్ల వ్యవస్థను రూపొందించారు. మూడు నుంచి అయిదు నిమిషాల తేడాతో నడిచే ఈ లోకల్ రైళ్లలో ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ప్రతి రోజు సుమారు 65 లక్షలమందికిపైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నాలుగింటికి అదనంగా మరో 2 ట్రాక్‌లు.. నగరంలో సెంట్రల్ రైల్వే, వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్లున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో మెయిన్ (ప్రధాన), హార్బర్, ట్రాన్స్ హార్బర్, వెస్టర్న్‌రైల్వే పరిధిలో వెస్టర్న్ సబర్బన్ లోకల్‌తోపాటు మోనో, మెట్రో రైల్వే మార్గాలలో రైళ్లు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో లోకల్ రైల్వేస్టేషన్లను ఆనుకని వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఇతర నగరాలలో మామూలుగా ఒకటి వెళ్లేందుకు, మరోటి వచ్చేందుకు ఇలా అప్, డౌన్ మార్గాలు (రైల్వేట్రాకులు) ఉంటాయి. కానీ లోకల్ రైలు సేవల కోసం మాత్రం ప్రత్యేకంగా నాలుగు ట్రాక్‌లు ఉన్నాయి. దీంతో స్లో, ఫాస్ట్ ఇలా రెండు రకాల లోకల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు పెద్ద అంతరాయం లేకుండా పోయింది. అదే విధంగా లోకల్ రైళ్ల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు అయిదు, ఆరో ట్రాక్‌లు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయి. సాధారణంగా లోకల్ రైళ్లన్నీ డైరెక్ట్ కరెంట్ (డిసి)పై నడుస్తాయి. తరువాతి కాలంలోనుంచి ఆల్టర్నేట్ కరెంట్ (ఎసి)కి మార్చారు. ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్చారిత్రక ఘట్టాలు... ప్రారంభంలో ముంబై ప్రజలు రైళ్లను ‘బకరా గాడీ’లని పిలిచేవారు. 1853లో మొదటి రైలు ప్రారంభం తర్వాత 1856లో మొట్టమొదటి రైల్వే టైంటేబుల్ రూపొందించారు. 1886 నుంచి ఫ్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. 1874లో సైన్ రైల్వేస్టేషన్ నిర్మాణం, 1880లో ముంబై–కళ్యాణ్ రెండు వైపుల రైల్వే సేవలను ప్రారంభించారు. దేశంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన నాటి విక్టోరియా టరి్మనస్ ‘నేటి ఛత్రపతి శివాజీ టరి్మనస్)ను 1889లో, 1890లో డోంబివలి రైల్వేస్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. సరీ్వసులను మరింత వేగవంతం చేసేందుకు 1929లో ముంబై–కళ్యాణ్‌ల మధ్య రైల్వేలైన్లను విద్యుదీకరించారు. చదవండి: షారూక్ ఖాన్ భార్య హోటల్లో ఫేక్ పనీర్ ఆరోపణల దుమారం : టీం స్పందన -
త్వరలో సమంత రెండో పెళ్లి..?
-
Sri Rama Navami టీటీడీ నిర్లక్ష్యం : అయ్యో... ఆంధ్రావాల్మీకి!
భద్రాచలం రామయ్య కోసం గుడి నిర్మించి రామభక్తుల హృదయాల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారు రామదాసు.. అదే తరహాలో ఒంటిమిట్ట కోదండ రాముని ఆలయ జీర్ణోద్ధరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మరో రామదాసు వావికొలను సుబ్బారావు. అయితే వావికొలనును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామభక్తుడైన వావికొలను సుబ్బారావు సేవలపై కథనం. ఒంటిమిట్ట(రాజంపేట): భద్రాచలంలో రామయ్య గుడి కట్టించిన భక్తరామదాసు కీర్తి ప్రతిష్ణలు తెలంగాణా ప్రభుత్వం ఇనుమడింప చేసే విధంగా ముందుకెళుతోంది..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అధికారిక రామాలయం నిర్మాణానికి సూత్రధారి అయిన అపరరామదాసు, ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధికెక్కిన వావికొలను సుబ్బారావు గురించి పట్టించుకోవడం లేదు.టీటీడీ వావికొలను సుబ్బారావు కీర్తిప్రతిష్టలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎటు వంటి అడుగువేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సుబ్బారావు బోటు(గుట్ట)ను టీటీడీ అభివృద్ధి చేయలేదు. ఇటీవల ఒంటిమిట్టకు వచ్చిన ప్రభుత్వ బృందం దృష్టికి వావికొలను అంశం వెళ్లినట్లు తెలిసింది. వావికొలను జీవితమిలా.. ఆంధ్రావాల్మీకి వావికొలను సుబ్బారావు జనవరి 23, 1863న ప్రొద్దుటూరులో జన్మించారు. తండ్రి రామచంద్ర, తల్లి కనకమ్మ, భార్య రంగనాయకమ్మ. 1883లో ప్రొద్దుటూరు తాలుకా ఆఫీసులో గుమస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 1896 వరకు పనిచేశారు. ఆగస్టు1, 1936లో మద్రాసులో పరమపదించారు. టెంకాయచిప్పను చేతిలో ధరించి.. రాజులు ఆలయానికి ఇచ్చిన వందలాది ఎకరాల మాన్యాలు ఎవరికివారు భోంచేశారు. దీంతో ఒంటిమిట్ట రామయ్యకు నైవేద్యం కూడా పెట్టలేని స్థితికి ఆలయం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని ఉద్ధరించడానికి వావికొలను కంకణం కట్టుకున్నారు. టెంకాయచిప్పను చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఊరురా తిరిగి బిచ్చమెత్తారు. వచ్చిన ధనంతో రామాలయాన్ని పునరుద్ధరించారు. టెంకాయ చిప్పలో ఎంత డబ్బు పడినా.. ఏదీ ఉంచుకోలేదు. అంతా ఆలయ అభివృద్ధికే ఇచ్చారు. అలాగే రామాయణంతోపాటు శ్రీకృష్ణలీలామృతం, ద్విపద భగవద్గీత, ఆంధ్రవిజయం, దండకత్రయం, టెంకాయ చిప్పశతకం లాంటి ఎన్నో రచనలు కూడా వావికొలను చేశారు. వానప్రస్ధం 1920లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగుపండితునిగా పనిచేశారు. వైరాగ్యపూరితుడై భోగమయ జీవితాన్ని త్యజించి గోచి ధరించి రాముని కోసం ఒంటిమిట్టలో ఏళ్ల తరబడి తపస్సు చేశారు. కాని ఊరిలో కొందరు స్వార్ధపరులు కుళ్లు రాజకీయాలతో ఆయన్ను అవమానించారు. ఆలయంలోకి రానివ్వకుండా చేశారు.ఊరిలో నిలువలేని పరిస్ధితులును కల్పించారు. వావికొలను దుఖించి, ఆ ఊరిని వీడి. మొదట గుంటూరు జిల్లా నడిగడ్డపాలెంలోనూ, అంగలకుదురులో తన ఆశ్రమాన్ని స్థాపించుకుని అక్కడే ఉన్నారు. ఈయన మొదలుపెట్టిన గురు పరంపర నేటికి కొనసాగుతోంది. ఆంధ్రావాల్మీకిగా.. సుబ్బారావు వాల్మీకి సంస్కృత రామాయణాన్ని 24వేల చందోభరిత పద్యాలుగా తెలుగులో రాశారు. వాల్మీకి రామాయణాన్ని (24000 శ్లోకాలను)108సార్లు పారాయణం చేయటం వల్ల ఆయనకు అందులోని నిగూఢ అర్థాలు స్ఫురించాయి. ఆయన రాసిన రామాయణాన్ని మహాసభమద్యలో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. అప్పుడు బళ్లారి రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో మహాపండితులు ఆయనకు ఆంధ్రవాల్మీకి అని బిరుదు ప్రదానం చేశారు.శృంగిశైలాన్ని అభివృద్ధి చేయాలి రామాలయం నిర్మాణంæ కోసం తన సర్వస్వాన్ని కోల్పోయిన వావి కొలను సుబ్బారావుకు స్మారకమందిరం నిర్మించాలి. ఆయన నివసించిన శృంగిశైలం (సుబ్బారావుబోటు)ను అభివృద్ధి చేయాలి. – గానుగపెంట హనుమంతరావు, సాహితివేత్త, కడపవావికొలను సుబ్బారావును టీటీడీ మరవరాదు ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గురించి టీటీడీ మరవ రాదు. ఆయన నివాసం ఉన్న గుట్ట అభివృద్ధికి నోచుకోలేదు. ఆయన పేరుతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించాలి –ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, మాజీ డైరెక్టర్, గిడ్డంగులశాఖ కార్పోరేషన్, ఒంటిమిట్ట -
సీతారాముల కల్యాణం.. చూతము రారండీ..
శ్రీ సీతారాముల కల్యాణానికి నగరం నలుమూలలా ఉన్న రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ‘అమ్మపల్లి’ దేవస్థానం. ఏకశిలా రాతి విగ్రహంతో.. దశావతారంలో మకర తోరణం కలిగి శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ కొలువయ్యారు. యేటా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ శివారులోని అమ్మపల్లిలోని ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రశస్థి. ఇక్కడి ఆలయ, ప్రాకారాల నిర్మాణాల గురించి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలూ లేకపోయినా.. అప్పటి నిర్మాణ శైలి, విగ్రహ రూపాలను బట్టి 18వ శతాబ్దం నాటివిగా పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. నర్కూడలోని అమ్మపల్లి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో రెండు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. ఆదివారం ఉదయం 11.49 గంటలకు స్వామి కల్యాణం జరుగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం చుట్టూ క్యూలైన్లు, ఇతర ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.ఎత్తయిన ఆలయ గోపురం.. అమ్మపల్లి ఆలయానికి ఎత్తయిన గోపురం ప్రత్యేక ఆకర్షణ. సుమారు 80 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో ఈ గోపురం నిర్మితమైంది. ఆలయ గోపురం, ప్రాకారాలు చారిత్రక కళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, వెనకాల మరో కోనేరు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఎదురుగా ఉన్న మంటపంలో యేటా శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. మంటప సమీపంలో నగారా, రథశాల ఉన్నాయి. శ్రీరామ లింగేశ్వర, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి.గద్వాల్ సంస్థానం నుంచి విగ్రహాలు.. నిజాం దర్బార్‌లో వివిధ హోదాల్లో పని చేసిన రాజా భవానీ ప్రసాద్ భటా్నగర్ 1790లో దేవాలయం పనులను ప్రారంభించగా.. 1802లో విగ్రహ ఆవిష్కరణను కేరళకు చెందిన పూజారి వెంకటరమణాచారి, రాజా భవానీ ప్రసాద్‌ల నేతృత్వంలో గద్వాల్ సంస్థానం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను తీసుకొచ్చి అత్తాపూర్ రాంబాగ్‌లో విగ్రహా ప్రతిష్టాపన చేశారు. దీనికి మూడో నిజాం సికిందర్ జా ముఖ్య అతిథిగా హజరయ్యారు. నాటి నుంచి నేటి వరకూ వారి వారసులు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. 300 సంవత్సరాలు గల ఈ దేవాలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు. భద్రాది రాములోరి కల్యాణం జరిగే సమయంలోనే అత్తాపూర్ రాంబాగ్ దేవాలయంలో అత్యంత వైభవంగా కల్యాణ ఉత్సవం ఆనవాయితీగా వస్తుంది.అత్తాపూర్ రాంబాగ్‌లో.. అత్తాపూర్ : అత్తాపూర్ రాంబాగ్‌లోని చారిత్రాత్మక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే దేవాలయాన్ని రంగులు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ మహోత్సవం, 7న దశమి రోజున రథోత్సవంతో పాటు లంకా దహనం, 8న సీతారామలక్ష్మణులకు దోపుసేవ, 9న వీధి సేవతో పాటు చక్రతీర్థం వంటి కార్యక్రమాలతో ముగుస్తాయని పూజారి తిరుమల దేశభక్త ప్రభాకర్, శ్రీనివాస్‌లు వెల్లడించారు. -
రాముని గుణగణాలను అలవరచుకుందాం!
మానవాళి సంక్షేమం కోసం సహజయోగాన్ని ఆవిష్కరించిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దేశ విదేశాలలో ఇచ్చిన అనేక ప్రవచనాలలో శ్రీ రాముని గుణ గణాలను, లక్షణాలను, ఆయన వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుని, వాటిని మనలో అంతర్గతంగా స్థిరపరచుకొని వ్యక్తీకరించుకోవలసిన అవశ్యకతను గురించి విశదీకరించారు.శ్రీరాముడు పుడమిపై అవతరించినప్పుడు విశ్వ విరాట్‌లో కుడిపార్శ్వం అభివృద్ధి చెందడానికి దోహద పడింది. తేత్రాయుగంలో రాక్షసుల నుండి, దుష్ట శక్తుల బారి నుండి తన భక్తులను, ప్రజలను సంరక్షించడానికి శ్రీ విష్ణువు తీసుకున్న అవతారమే శ్రీ రాముడు. ఆ కాలంలోనే రాజుల రాజ్యాధిపత్యం మొదలయ్యి అన్నిటికన్నా మిన్నగా ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం ్ర΄ారంభమయ్యింది. ప్రజల కొరకు, మానవాళి యొక్క అభివృద్ధి కొరకు రాజు మంచితనాన్ని, ప్రేమ తత్వాన్ని కలిగి వుండాలని నిర్ణయించబడింది. నాయకుడైన రాజు ఎంత త్యాగం చేయడానికైనా సిద్దపడాలి. అది శ్రీరామునితోనే మొదలయ్యింది. నేటి సమస్త ప్రజానీకం కోరుకున్న ఋజు ప్రవర్తన, మంచితనం శ్రీ రామునిగా అవతరించాయి. ప్రభువు అనే వాడు శ్రీ రామునిగా వుండాలని కోరుకున్నారు. మంచితనం గురించి, రాజ ధర్మం గురించి కేవలం చెప్పడమే కాదు, దానిని ఆచరించి చూపించిన ఆదర్శవంతమైన రాజు. శ్రీ రాముడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఆదర్శవంతమైన భర్తగా, ఆదర్శవంతమైన కొడుకుగా, ఆదర్శవంతమైన రాజుగా, మర్యాద పురుషోత్తముడుగా ఇతిహాసంలో చెప్పుకోబడుతున్నాడు.అగస్త్య మహాముని రచించిన శ్రీ రామ రక్షా కవచంలో శ్రీ రాముని గుణగణాల గురించి ఇలా వర్ణించడం జరిగింది.ఆయన ఆజానుబాహుడు. చేతులలో ధనుర్బాణాలు ధరించి, పీతాంబరధారుడై సింహాసనంపై ఆసీనుడై వుంటాడు. ఆయన పద్మదళాయతాక్షుడు. తన ఎడమ పార్శ్వమున కూర్చున్నసీతాదేవిని చూస్తూమందస్మిత వదనార విందుడై మనకు కనిపిస్తాడు. అతని యొక్క మేని రంగు లేత నీలిరంగు ఛాయతోనూ, నేత్రములు తామర పుష్ప రేకులవలే పెద్దవిగా వుండి, ఇతరులకు ఆనందమును చేకూరుస్తుంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో విల్లు, వీపున అంబుల పొదితో దుష్ట సంహారం కొరకు సదా సన్నద్ధుడై ఉంటాడు.ఆయన జనన మరణాలకు అతీతుడు. అపార శక్తిమంతుడు. దుష్ట శక్తులన్నిటిని నాశనపరచి, మన కోరికలన్నిటినీ నెరవేర్చే సామర్ధ్యం కలవాడు శ్రీ రాముడు. తానొక అవతార పురుషుడునని గానీ, అవతార మూర్తినని గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. శ్రీ రాముని సుగుణాలలో మరొకటి ఏమిటంటే తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. ఆ లక్షణాన్ని మనలో కూడా స్థిరపరచు కోవాలి. ఇచ్చిన మాట తప్పించుకోవడానికి ఏవేవో కుంటిసాకులు వెతికి తప్పించుకోకూడదు. ఆయనకున్న మరో సుగుణం – అవతలివారి హృదయాన్ని నొప్పించే విధంగా మాట్లాడక ΄ోవడం. దీనినే సంకోచమని అంటారు. మానవ అంతర్గత సూక్ష్మ శరీరంలో అంగాంగమునందు, చక్రాలలోనూ, నాడులలోనూ దేవీదేవతలు కొలువై వున్నారు. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వారిని, వారి లక్షణాలను మనలో జాగృతి పరచుకోవచ్చును. అలా సీతా సమేతుడైన శ్రీరాముడు మన హృదయంలోని కుడి పార్శ్వం వైపు ఆసీనులై వుంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారిలో మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శవంతమైన తండ్రిగా, శ్రీరాముని లక్షణాలు జాగృతి చెంది ప్రతిబింబిస్తూ వుంటాయి. ఆయన మనలోని ఊపిరి తిత్తులను పరిరక్షిస్తూ వుంటాడు. ఎవరితో ఎప్పుడు, ఎలా సంభాషించాలో మనం ఆయన దగ్గరనుండి నేర్చుకోవాలి. తన పరిమితులు, హద్దులు, శ్రీ రామునికి బాగా తెలుసు. వాటిని ఆయన ఎప్పుడూ అతిక్రమించలేదు. దేశాన్ని పరిపాలించే పరిపాలకుడు ఎలా వుండాలనేది రామరాజ్యం నుండే నేర్చుకుంటారు.మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని శ్రీ రామ నవమి పర్వదినాన బాహ్య పరంగా పూజించుకోవడమే కాకుండా అతని గుణగణాలను, వ్యక్తిత్వాన్ని సహజ యోగ సాధన ద్వారా మనలో పొందు పరచుకుని అభివ్యక్తీరించుకోవటం అవసరం. – డా. పి. రాకేష్(పరమపూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
మానవ పుట్టుక వెనుక దాగిన రహస్యం.. గుట్టు విప్పిన సైంటిస్టులు
-
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. -
మానవ సేవతో...
మూడు శతాబ్దాలు చూసిన మునిగా పేరు గాంచిన కల్యాణ్ దేవ్... వివేకానుందుని బోధనలతో ఉత్తేజితుడై మానవ సేవ ద్వారా మాధవునికి సేవ చేసి తరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పట్ జిల్లాలోని కోటనా గ్రామంలో 1876లో జన్మించిన ఆయన అసలు పేరు కాలూరామ్. రిషీకేశ్‌లో స్వామి పూర్ణానంద శిష్యులై స్వామి కల్యాణ్ దేవ్ అయ్యారు. కొన్నేళ్ళు హిమాలయాలలో తపస్సు చేశారు. అనంతరం ఆయన తన ప్రాంతంలోని పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల ప్రజల కోసం దాదాపు మూడు వందల పాఠ శాలలు, వైద్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటరాని తనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన తన వాణిని వినిపించారు. నిర్లక్ష్యానికి గురైన మతపరమైన, చారిత్రక ప్రదే శాల పునర్నిర్మాణానికి కల్యాణ్‌దేవ్ మద్దతు ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లోని శుక్తల్‌లో ఆయన ‘శుకదేవఆశ్రమం’, ‘సేవా సమితి’ని కూడా స్థాపించారు. హస్తినా పూర్లోని కొన్ని ప్రాంతాలను, హరియాణాలోని అనేక తీర్థయాత్రా స్థలాలను పునరుద్ధరించారు.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కల్యాణ్‌దేవ్ మాట్లా డుతూ... 1893లో ఖేత్రిలో వివేకానందుడిని కలిసి నప్పుడు తనకు ప్రేరణ కలిగిందని, ఆయన తనతో... ‘నువ్వు దేవుడిని చూడాలనుకుంటే, పేదల గుడిసెలకు వెళ్ళు... నువ్వు దేవుడిని పొందాలనుకుంటే, పేదలకు, నిస్సహాయులకు, అణగారినవారికి, దుఃఖితులకు సేవ చేయి’ అని అన్నారని చెప్పారు. పేదల సేవ ద్వారా దేవుడిని పొందడమే తనకు స్వామీజీ నుండి లభించిన మంత్రమని కల్యాణ్‌దేవ్ పేర్కొన్నారు.భారత ప్రభుత్వం 1982లో ఆయనను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది మీరట్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డి.లిట్. ప్రదానం చేసింది. తుదకు ఆయన 2004లో పరమపదించారు. – యామిజాల జగదీశ్ -
యుగాంతం రాబోతుందా?
-
సునీతను నడిపించిన హీరో.. ఎవరీ బ్యారీ విల్ మోర్ ?
-
ఇక వినాశనమే.. కార్టూన్ చెప్పిన భవిష్యత్తు
-
Avocado డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. సాగు ఎలా చెయ్యాలి?
మన దేశంలో పట్టణ ప్రాంత ప్రజల్లో ఆహార – ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. అందులో ఒకటి అవొకాడో. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. కరుణాకరన్ మాటల్లో చెప్పాలంటే.. అవొకాడో, డ్రాగన్ సహా పన్నెండు రకాల దేశ, విదేశీ ఖరీదైన పండ్ల జాతుల సాగు విస్తీర్ణం మన దేశంలో గత మూడేళ్లుగా పెరుగుతోంది. ఈమొక్కలకు గిరాకీ 30% పెరిగింది. పరిమిత నీరు, పోషకాలు, శ్రమతో సాగు చేయడానికి అవకాశం ఉండటం.. ధాన్యపు పంటలతో పోల్చితే అధికాదాయం రావటం.. యాంత్రీకరణకు అనుకూలం కావటం.. పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.. మార్కెట్లో డిమాండ్ ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే, అవొకాడో పండ్ల తోటలు ఏయే భూముల్లో సాగు చెయ్యాలి? ఏయే రకాలు అనువైనవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు డా. కరుణాకర్ మాటల్లోనే చదవండి.అవొకాడో సాగు మనకు కొత్తది కాదు. 70 ఏళ్లుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, సిక్కిం, మహారాష్ట్రల్లో సాగవుతోంది. అయితే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అవొకాడో తోటలను తామర తంపరగా నాటుతున్నారు. గత మూడేళ్లలోనే 8–10 లక్షల అవొకాడో మొక్కలు నాటారు. ఉష్ణమండలం, తేమ ఎక్కువగా ఉండే ఉప–ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పెరిగే లక్షణం దీనికి ఉన్నప్పటికీ, తగిన వాతవరణం, నేలల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాను. 18–33 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు, 700–1500 ఎం.ఎం. వర్ష; ఉన్న ప్రాంతాలు.. 5.5 - 8 వరకు ఉదజని సూచిక (పిహెచ్) ఉన్న భూములు అనుకూలం. మొక్కలు నాటిన 5 ఏళ్లకు పూర్తిస్థాయి దిగుబడినిచ్చే స్థితికి పెరుగుతుంది. ప్రస్తుతం మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందుకే రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అవొకాడో ఖరీదైన పండు కాబట్టి మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లు, డిసర్ట్ స్వీట్ల తయారీలో మాత్రమే వాడుతున్నారు. మున్ముందు దిగుబడి పెరిగే నాటికి ప్రాసెసింగ్ సదుపాయాలు పెరిగి వేర్వేరు రూపాల్లో వాడకం పెరగాలి. లేదంటే మార్కెట్ పడిపోయే ముప్పు ఉంటుంది. ఇక రైతుల విషయానికొస్తే.. తోటలు నాటేటప్పుడు అది ఏ రకమో తెలియకుండానే, ఏయే నేలలకు సరి;yతుందో తెలుసుకోకుండానే స్థానిక నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు నాటుతున్నారు. దీంతో సాగులో చాలా సమస్యలు వస్తున్నాయి.‘హాస్’ రకం మొక్కలు వద్దుబెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో 16 రకాల అవొకాడో మొక్కలున్నాయి. మీ భూమి, నీరు, వాతావరణానికి అనువైన రకాన్ని ఎంచుకోవటంపై శ్రద్ధ పెడితే విజయం సాధించవచ్చు. అర్క సుప్రీం, అర్క రవి, లాంబ్ హాస్, పింకర్టన్ రకాలు మేలైనవి. చాలా మంది హాస్ రకం సాగు చేస్తున్నారు. ఇది మనకు సూట్ కాదు. నెర్రెలిచ్చే భూముల్లో వద్దుఅవొకాడో చాలా సున్నితమైన పంట. నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. అవొకాడోకే కాదు ఏ పండ్ల తోటలకైనా ఎండా కాలం నెర్రెలిచ్చే నల్లరేగడి నేలలు పనికిరావు. వేర్లు తెగి΄ోతాయి. నీరు నిలవని, బాగా గాలి సోకే ఎర్ర గరప నేలలు (రెడ్ శాండీ సాయిల్) మేలు. 40% ఇసుక కలిసిన చెరువు మట్టిలో కూడా బాగా పెరుగుతుంది. బంక మట్టి నేల (క్లే సాయిల్) అసలు పనికిరాదు. ఈ నేలలో సాగు చేయాలంటే... 4x3 అడుగుల గుంతల్లో ఎర్ర మట్టిపోసి, మొక్కలు నాటుకోవాలి. పిహెచ్ సమతుల్యంగా ఉండాలి. నీటిలో ఈసీ 1 కన్నా ఎక్కువ ఉంటే సరిగ్గా పెరగదు. అందుకని, అవొకాడో మొక్కలు నాటే ముందు మట్టి, నీటి పరీక్షలు చేయించి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలి.పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉంటే, కాల్షియం కార్బొనేట్ 20% కన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కాదు. నీరు తగుమాత్రంగా ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఐరన్ లభ్యత సమస్య వస్తుంది. నీటి ఉప్పదనం 2% కన్నా ఎక్కువ ఉంటే పనికిరాదు. క్లోరైడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలకు తగిన రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఏటా రెండు సీజన్లుఅవొకాడో పూత వచ్చిన తర్వాత 120–150 రోజుల్లో పండ్లు కోతకు వస్తాయి. ఏప్రిల్–జూలై, అక్టోబర్– ఫిబ్రవరి సీజన్లలో రెండు దఫాలుగా పండ్ల దిగుబడి వస్తుంది. విత్తనం నాటితే 5–6 ఏళ్లలో, అంటు మొక్కలు నాటితే 3–4 ఏళ్లలో కాపుకొస్తాయి. చెట్టుకు 100 నుంచి 500 కాయలు కాస్తాయి. కాయలు పక్వానికి వచ్చినా చెట్టు మీద గట్టిగానే ఉంటాయి. కోసిన తర్వాత మెత్తబడతాయి. ముదురు రంగులోకి మారితే పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి. పక్వ దశను గుర్తించడానికి ఇతర దేశాల్లో చిన్న΄ాటి యంత్రాలను వాడుతున్నారు. మన శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించే పరికరంతోనే అవొకాడో పక్వ దశను తెలుసుకోవచ్చు. 24% ఆర్గానిక్ కంటెంట్ ఉన్న దశలో పండును కోయాలి. కాయ కోసిన తర్వాత రంగు మారుతుంది. అవొకాడోతో ఒక ఉపయోగం ఏమిటంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ధర లేకపోతే చెట్టు మీదే 1–2 నెలల వరకు కాయ కోతను వాయిదా వేసుకోవచ్చు! ముందుగా/ఆలస్యంగా కోతకు రావటం.. మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండటం.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. మార్కెట్లో గిరాకీ ఉండటం.. కోసుకు తినటానికి లేదా ప్రాసెసింగ్‌కు అనువుగా ఉండటం.. వంటి అనేక అంశాలను పరిశీలించి అవొకాడో సాగుచేసే రకాలను ఎంపిక చేసుకోవటం కీలకం. మరికొన్ని మెళకువలుసముద్రతలం నుంచి 1,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాల్లో వెస్ట్ ఇండియన్ అవొకాడో వెరైటీలను నాటుకోవాలి. వీటి కొమ్మలు, విత్తనాల ద్వారా మొక్కలు తయారు చేసుకోవచ్చు. మొదటి 5 ఏళ్లూ మధ్యాహ్నపు ఎండ నుంచి మొక్కల్ని కాపాడాలి. 5 ఏళ్ల వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూత, కాతను ఉంచకూడదు. తీసెయ్యాలి. 5 మీ.“ 5 మీ. సైజులోగొయ్యి తవ్వి, అది 3 నెలలు ఎండిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. అవొకాడో పండ్లను ప్రాసెస్ చేసి అనేక ఉత్పత్తుల తయారు చేయటం, స్ప్రే డ్రయ్యింగ్ ద్వారా పొడిని తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. విలువ జోడించి ఉత్పత్తులు అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి అవొకాడో 2 – నీరు నిలవని ఎర్ర గరప నేల (రెడ్ శాండీ సాయిల్)లో అవొకాడో చెట్టు చక్కగా పెరుగుతుంది. బంక మన్ను (క్లే సాయిల్) దీనికి సరిపడదు. ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. కరుణాకరన్ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చె΄్పారు. బంక మన్ను నేలలో అవొకాడో సాగు చేయదలిస్తే 4 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పున గొయ్యి తీసి, ఆ గోతిలో 90% వరకు ఎర్ర గరప మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపి సాగు చేయవచ్చని ఆయన తెలిపారు. గుంతలో సగం వరకే ఎర్ర గరప మట్టిని నింపితే.. చెట్టు కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత వేర్లు బంకమన్నులోకి విస్తరించినప్పుడు పోషకాలు, నీరు అందక (చిత్రంలోచూపిన విధంగా) నిలువునా ఎండిపోతుందని వివరించారు. అవొకాడో చాలా సున్నితమైన పంట. వేరుకుళ్లు బెడద ఉంటుంది. అవొకాడో మొక్కల్ని (ఆ మాటకొస్తే ఏ పండ్ల తోటైనా) 5 అడుగుల ఎత్తుమడి (రెయిజ్డ్ బెడ్) పైనే నాటుకోవాలి. ట్రాక్టర్‌తో అంతర సేద్యం చేసినా బెడ్ దెబ్బతినదు. సాళ్ల మధ్య వర్షపు నీరు బయటకు త్వరగా వెళ్లిపోవటానికి కందకం తియ్యాలి. ఇజ్రాయెల్, సౌతాఫ్రికాలో కూడా ఎత్తుమడులపైనే నాటుతారు.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి.థాంక్స్ టు ‘టొక్సోడాన్’!అవొకాడో.. అమెజాన్, మెక్సికన్ అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ శాకాహార జంతువు ‘టొక్సోడాన్’కు పండ్లు తినే అలవాటుంది. అయితే, దానికి ఏ పండూ సరిగ్గా నచ్చేది కాదు. అవొకాడో పండు టొక్సోడాన్కు తెగ నచ్చేసిందట. అందులో పుష్కలంగా ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్సే అందుకు కారణమట. ఇందులో 20% కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా ‘సంతృప్తినిచ్చేది’ కూడానట! అందుకే దీనికి ‘వెన్న పండు’ అని పేరు. ఆ విధంగా దీని గొప్పతనాన్ని జనానికి తెలిసేలా చేసినందుకు టొక్సోడాన్కి థాంక్స్ చెప్పాలి అన్నారు ఐఐహెచ్ఆర్ (బెంగళూరు)లో పండ్ల పరిశోధనా విభాగాధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. జి. కరుణాకరన్! అదేవిధంగా, 1950లలో కూర్గ్, వయనాడ్ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ల యజమానులు వ్యాహ్యాళికి వెళ్తూ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. దారి పక్కన చెట్ల కింద రాలినపడి ఉన్న అవొకాడో పండ్లను కుక్కలు ఇష్టంగా తినటం గమనించారు. అప్పటి వరకు ఇవి తినదగిన పండ్లని చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ‘డాన్ ఆఫ్ ఫ్రూట్స్’ అయ్యింది! -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పాక్ లో ట్రైన్ ను హైజాక్ చేసిన బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు
-
రీల్స్, యూట్యూబ్ మోజులో పిల్లలు, తలలు పట్టుకుంటున్న పేరెంట్స్
నా కూతురు 8వ తరగతితో చదువు మానేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటోంది. భారీ పెట్టుబడి లేకుండానే త్వరగా డబ్బు సంపాదించవచ్చని అంటోంది. కౌన్సెలింగ్ కూడా ఇప్పించా. అయినా ఫలితం లేదు. ఆమె మనసును ఎలా మార్చాలో తెలియడం లేదు..- హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి బాధ మా అమ్మాయిలు ఒకరు 9, మరొకరు8 చదువుతున్నారు. ఇటీవలే రీల్స్ చేయడంఅలవాటు చేసుకున్నారు. మొదట్లో మేం కూడా సరదాగా ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు అదే పనిలో పడిపోయి చదువును పూర్తిగా అటకెక్కించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. - వరంగల్ జిల్లాకు చెందిన ఓ తల్లి ఆవేదనపిల్లల మనసు మార్చాలని మా వద్దకు తీసుకొస్తే.. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరు అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు.. - మానసిక వైద్యులు చెబుతున్నది ఇది బాల్యం సోషల్ మీడియా వలలో చిక్కి విలవిల లాడుతోంది. రీల్స్, యూట్యూబ్ చానల్స్‌తో లక్షలు సంపాదించొచ్చన్న ఇన్ఫ్లుయెన్సర్ల మాటలగారడీలో పడి స్కూలు పిల్లలు కూడా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అంతటా ఈ జాడ్యం పెరుగుతోంది. దీంతో స్కూల్ పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -సాక్షి, హైదరాబాద్చదువు కోసం మొదలై.. కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల చదువు పాడవకూడదని అందరూ ఆన్లైన్ చదువుల వైపు మొగ్గారు. అందుకోసం పిల్లలకు పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబులు కొనిచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారింది. ఆన్లైన్లో అధిక సమయం గడపడంతో పిల్లలకు క్విక్ మనీకి బోలెడు మార్గాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సహా అనేక అంశాలపై అర్థసత్యాలు, అసత్యాలతో కూడిన అనవసర పరిజ్ఞానాన్ని అందించాయి. ‘హౌ టు మేక్ 30 లాక్స్ ఇన్ 2 ఇయర్స్’వంటి ఊరింపులు టీనేజ్ ఆలోచనలను కలుషితం చేశాయి.సంపాదనకు వెల్కమ్.. స్కూల్‌కు బైబై...సోషల్ మీడియాకు బానిసైన 8 లేదా 9వ తరగతి విద్యార్థుల్లో చాలామంది పాఠశాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. తాము సుఖంగా బతకడానికి సంప్రదాయ విద్య సరిపోదని వీరు బలంగా నమ్ముతున్నారు. ‘సోషల్ మీడియా ద్వారా కొందరు సులభంగా డబ్బు, పాపులారిటీ సంపాదించడాన్ని చూసి తామూ అలాగే చేయగలమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలలో గడిపే కాలం వృథా అనే ప్రమాదకర అభిప్రాయం పెంచుకుంటున్నారు’ అని సైకాలజిస్ట్ అరుణ్ చెప్పారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని కొందరు, తమ వ్యాపార ఆలోచనలకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చాలని ఇంకొందరు, సేవా సంస్థను ప్రారంభించాలని/ ఇన్ఫ్లుయెన్సర్ / సింగర్‌గా మారాలని.. ఇలా ఏవేవో కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చాలా మొండిగా తయారవుతుండడంతో వారికి కౌన్సెలింగ్ కూడా పనిచేయడం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు. బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువఇటీవల ఈజీ మనీ మీద టీనేజర్లలో బాగా ఆసక్తి పెరిగింది. అది వారి చదువు మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఇది బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ కనిపిస్తోంది. గేమింగ్‌తో సహా రకరకాల యాప్స్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని వాటికి దూరం చేసి ఎలాగోలా చదువు మీద దృష్టిపెట్టేలా చేయమని మమ్మల్ని సంప్రదించే తల్లిదండ్రులు పెరిగారు. అయితే ఈ వ్యసనాన్ని ముదరనీయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి తుంచాల్సిన అవసరం ఉంది. దీనిపై స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ల ద్వారా కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. - డా. పృథ్వీ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్ జాగ్రత్తగా డీల్ చేయాలిస్కూల్ విద్యతో ఉపయోగం లేదని 13–15 ఏళ్ల మధ్య వయస్కులు కొందరు పాఠశాల నుంచి నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లలు కనీసం ఇంటర్ పూర్తి చేసినా చాలని, మందులతోనైనా బాగు చేయాలని వారి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నా దగ్గరకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చిన ఓ టీనేజ్ అమ్మాయి ఆన్లైన్లో ఓ రీల్ చూపించి తన వయసే ఉన్న ఓ టీనేజర్ రూ.30 లక్షలు సంపాదించిందని.. మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరని చెప్పింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకుని మరీ డ్రాప్ అవుట్స్‌గా మారుతున్నారు. వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గైడెన్స్, అవేర్నెస్ అందించాలి. మన విద్యా విధానం కూడా మారాలి. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.- డా.చరణ్ తేజ, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం. ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్‌గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్‌గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్‌మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్‌కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్‌వర్క్‌తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు. అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద. పాపులేషన్ ఫస్ట్పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్‌ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్‌లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -
తండ్రి బాటలో జగన్.. మహిళలే మహారాణులు
-
SLBC Tragedy : ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎస్ఎల్బీసీ కథ ఇదీ!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు – సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదం అందరికీ బాధ కలిగిస్తోంది. చివరికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. భద్రతా చర్యల్లో డొల్లతనానికి అద్దం పట్టింది.నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలో మీటర్ల సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా అందించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసే లోపు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి పుట్టంగండి, అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో నీళ్లు అందించేందుకు ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్’ ప్రారంభించారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోయడం వల్ల ఇది జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేదు. విద్యుత్ వినియోగం వల్ల అధిక వ్యయం అవుతుంది.అందువల్ల జిల్లా ప్రజల తాగు–సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టును శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అర కిలోమీటర్ లోతున సొరంగ తవ్వకం జరుగుతోంది. ఇది పూర్తి అయితేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావితప్రాంతాల్లో తాగునీరు; సూర్యాపేట భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. వామపక్ష పార్టీలు శాసనసభ లోపల, వెలుపల ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు పొంది, అదే నెల 28న ‘జేపీ అసోసియేట్స్’ సంస్థతో ఎస్ఎల్బీసీ ఒప్పందం చేసుకుంది. మొదటి అంచనా మేరకు రూ. 2,813 కోట్ల ఖర్చు. అయితే 2017 నాటికి 3,152 కోట్ల రూపా యలకు పెంచారు. ఇప్పుడు అది 4,636.75 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజ ర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి ‘దోమల పెంట’ వద్ద ఇన్లెట్తో మొదలై... నాగర్ కర్నూలు జిల్లా ‘మన్నె వారి పల్లె’ వద్ద అవుట్లెట్తో... మొత్తం 49.93 కిలో మీటర్ల ప్రధాన సొరంగం ముగుస్తుంది. ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్త యింది. 7.13 కిలోమీటర్ల పొడవైన రెండవసొరంగం తవ్వకం బ్లాస్టింగ్ పద్ధతిలో మొత్తం పూర్తి చేశారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ గత పాలకులు ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరి గిన పనుల విలువ రూ. 2,689.47 కోట్లు. రెండు దశాబ్దాల్లో 34.37 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. 9.56 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు ఆగి పోయాయి. నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 20 ఏళ్లుగా కొనసాగడం వల్ల వ్యయ భారా నికీ, తాజా పరిణామాలకూ పాలకుల అలసత్వమే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం లోపల పైకప్పు నుంచి నీరు, మట్టి పడుతున్నదనీ, పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతున్నదనీ కార్మికులు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి చెప్పినా, ఏమీ కాదని పని చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. భద్రతా ప్రమా ణాలు, ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేక సాగునీటి ప్రాజె క్టుల్లో, పరిశ్రమల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలతో నష్టం జరుగుతోంది. ఆయా సంఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి, టన్నెల్లో బురద నీరు, వ్యర్ధాలను తొలగించడానికి వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఈ ప్రమాదంపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథార్టీ (ఎన్డీఎస్ఏ) వారి నుంచి స్పందన రాలేదు. ఈ ప్రమాదం జరిగిన దోమల పెంట ప్రాంతాన్ని సీపీఎం బృందం ఫిబ్రవరి 23న సందర్శించింది. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహాయక చర్యల విషయం చర్చించింది. చివరికి ఆశలన్నీ గల్లంతై కార్మికుల ప్రాణలు గాల్లో కలిసిపోయాయి. భద్రతాపరంగా తగిన సాంకేతిక చర్యలు తీసుకొని ఇప్పటిౖకైనా పనుల్లో అలసత్వం లేకుండా త్వరిత గతిని పూర్తి చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి.-జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
కొండరాళ్లలో దొరికిన అమ్మ...కొండంత అమ్మ!
కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా శ్రీ కొండలమ్మ తల్లి భక్తుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. తల్లి చెంతకు వచ్చి తమ కోర్కెలు కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు.వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, రాజకీయ పదవులు, పారిశ్రామికం, సినిమా అవకాశాలు ఒకటేమిటి? ఏ రంగానికి చెందిన వారైనా భక్తితో నమ్మి అమ్మ వద్ద తలచుకుంటే చాలు వారికి వరాల జల్లు కురిపిస్తుంది కొండలమ్మ తల్లి. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక తల్లి సన్నిధిలోనే తమతమ మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా వస్తోంది. భక్తితో కొలవటంతో తృప్తి చెందక తమ ఇంటిలో ఆ తల్లి పేరును అనుకున్నదే తడవుగా స్తుతించాలనే దృక్పథంతో కొండలమ్మను ఆ భక్తులు తలచుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లతో ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఆ తల్లి చల్లని సన్నిధిలో వివాహాలు, అన్నప్రాశన, ఊయలలో వేయటం వంటి శుభ కార్యక్రమాలను భక్తులు జరుపుకుని దీవెనలను ΄పొందుతున్నారు మహిమలతో తల్లి కీర్తి చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం కృష్ణాజిల్లా నుంచే గాక ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఆది, గురువారాల్లో 25వేల మంది భక్తులు తల్లిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. కొండరాళ్లలో దొరికిన అమ్మఈ దేవాలయానికి దాదాపు దశాబ్దాల చరిత్ర ఉంది. వేమవరంలో రహదారి పక్కనే దివాన్ సాహెబ్ కోడ్డు మురుగు కాలువకు రివిట్మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా పనివారికి కనబడింది. ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి... పసుపు, కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. అక్కడికి బాతులు పెంచుకునేవారు వచ్చారు. ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి విపరీతమైన లాభాలు వచ్చాయి. సీజన్ పూర్తి కావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని దించగా వెంటనే బాతులు మొత్తం హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. వెంటనే అతను మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశాడు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న స్థానంలోనే నిలి΄పాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనతికాలంలో మౌఖికంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విరివిగా వచ్చి పాల పొగగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.శోభాయమానంగా నవరాత్రులు...తల్లి సన్నిధిలో ఏటా దసరా నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా జరుçగుతాయి. దుర్గాష్టమి రోజున కనకడప్పుల వాద్యాలు, బాణాసంచా, చిత్ర విచిత్ర వేషధారణలతో చుట్టుపక్కలున్న గ్రామాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు సాగుతుంది. ఆ రోజు 20 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఉంటుంది. నవరాత్రుల్లో భక్తుల ఉల్లాసం కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత కొండలమ్మ మూలవిరాట్‌ను దర్శించుకునే ఆలయం చిన్నదిగా ఉండేది. ఆ తర్వాత భారీ ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్మించి అభివృద్ధి చేయటం జరిగింది. అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికే దసరా ఉత్సవాలకు దేవతా స్వరూపాలను అలంకరిస్తున్నాం. ఈ తల్లి మూలవిరాట్ నేల మీదనే తల వరకే దర్శనమిస్తుంది. మనసులో మాట అనుకున్నంతనే అవి తీరుస్తున్న అమ్మవారికి భక్తుల నుంచి తాకిడి నానాటికీ పెరిగి΄ోతుంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రైతులు ఒక్క రంగమే కాదు అన్ని రంగాలకు చెందిన భక్తులు ఏం కోరుకుంటే అది తీరుస్తూ వారి నుంచి పూజలందుకుంటున్నారు అమ్మవారు. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు కొండలమ్మకు పాల పొంగళ్లను సమర్పిస్తారు. – అయికా రాంబాబుసాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా -
Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం
మహాశివరాత్రి పర్వదినంకోసం ముంబైతోపాటు రాష్ట్రంలోని శివాలయాలన్నీ ముస్తాబ వుతున్నాయి. మహాశివరాత్రికి రాష్ట్రంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూలైన్లు, మండపాలను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయిదు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔండా నాగనాథ్, భీమాశంకర్, ఘృశ్నేశ్వర్, పర్లి వైద్యనాథ్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి కొన్ని విశేషాలు.... త్రయంబకేశ్వర్.. జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రం నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని నల్లరాతితో అద్భుత శిల్ప నైపుణ్యంతో నిరి్మంచారు. ఇక్కడ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర..ఇలా ముగ్గురి ముఖా లున్న స్వర్ణకవచంతో త్రిముఖ లింగంగా వెలుగొందుతోంది. పాండవుల కాలం నుంచి శివలింగాన్ని ఈ విధంగా అలంకరిస్తున్నట్లు స్థానికుల కథనం. ఈ ఆలయంలో మహా శివరాత్రితోపాటు శ్రావణ మాసంలోనూ విశేష పూజలను నిర్వహిస్తారు. పర్లీ వైద్యనాథ్..బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైధ్యనా««థ్ దేవాలయ నిర్మాణ కాలం ఇతమిద్ధంగా తెలియదు. అయితే క్రీ.శ.1706 లో రాణి అహల్యాదేవి హోల్కర్ దీన్ని పునఃనిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్రం చుట్టుపక్కలంతా కొండలు, చెట్లు, ఔషధ మొక్కలతో అలరారు తుంటుంది. ఈ కారణంగా పర్లీ జ్యోతిర్లింగ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందని భక్తుల కథనం. ఔండా నాగనాథ్ ..ఈ క్షేత్రం రాష్ట్రంలోని హింగోళి జిల్లాలో ఉంది. ఔండా నాగనాథ్ క్షేత్రాన్ని గూర్చి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంత్ జ్ఞానేశ్వర్, విసోబా కేచర, వార్కరీలు (భక్తుల సముదాయం) నాగనాథ్ ఆలయంలో భజనలు చేస్తుండగా పూజకు అంతరాయం కలుగుతోందని దూరంగా వెళ్లండని పూజారి బయటకువచ్చి చెప్పాడు. దీంతో వారు గుడి వెనకకు వెళ్లి తమ భజనలను కొనసాగించారట. వారి భజనలకు ముగ్దుడైన శివుడు వెనకవైపుకు తిరిగి వారి భక్తిగానాన్ని ఆలకించాడట. ఇందువల్లే ఈ ఆలయంలో నందీశుడు మందిరం వెనుక భాగంలో దర్శనమిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు. భీమశంకర్..పుణేకు 128 కిమీ దూరంలో భీమశంకర్ క్షేత్రం ఉంది. భీమా నదీ తీరంలో ఉన్నందువల్లే ఈ క్షేత్రానికి భీమశంకర్ అనే పేరువచ్చిందని స్థానికులు నమ్ముతారు. భీమశంకర్ దేవాలయాన్ని పదమూడో శతాబ్దంలో నిరి్మంచారని, దేవాలయానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని నానా పద్‌నివాస్ 18 శతాబ్దంలో నిర్మించారని చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. భీమశంకర్ దేవాలయాన్ని నాగరా పద్ధతిలో నిర్మించారు. ఘృష్ణేశ్వర్ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ ఘృష్ణేశ్వర్ క్షేత్రాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించినట్టు చారిత్రక ఆ«ధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్షేత్రాన్ని ఘృష్ణేశ్వర్ క్షేత్రమని కూడా పిలుస్తారు. కుసుమ అనే మహిళ తన కొడుకు ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శివలింగాన్ని చేతులో పట్టుకొని కోనేరులో మునిగి శంకరుడిని గూర్చి ఘోర తపస్సు చేసింది. దీంతో ఆది దేవుడు ప్రత్యక్షమై ఆమెకు పుత్ర భిక్ష పెట్టాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ఘృష్ణేశ్వర క్షేత్రంగా పేరు వచ్చిందదని పురాణ కథనం. మహాశివరాత్రి- ద్వాదశ జ్యోతిర్లింగాలురామనాథస్వామి లింగం, రామేశ్వరంశ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం), శ్రీశైలంభీమశంకర లింగం, భీమా శంకరంఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం, ఎల్లోరా గుహలుత్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)సోమనాథ లింగం, సోమనాథ్నాగేశ్వర లింగం, దారుకావనం (ద్వారక)ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు, ఓంకారక్షేత్రంవైద్యనాథ్ జ్యోతిర్లింగం, డియోఘర్ (జార్ఖండ్)కేదారేశ్వర లింగం, హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉందివిశ్వేశ్వర లింగం - వారణాశికేదారేశ్వర్: కేదార్నాథ్


