
ఒక ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని కనుగొనడానికి మనకు రెండు విషయాలు అవసరం. అవి ఒకటి మ్యాప్ రెండు దిక్సూచి. లేదా రెండింటిని కలిపే గూగుల్/ఆపిల్ మ్యాప్స్. మ్యాప్ మన గమ్యస్థానానికి సంబంధించి ..ప్రస్తుత స్థానం తోపాటు వెళ్లాల్సిన ప్రదేశం దిశను తెలియజేస్తుంది. అయితే దీన్ని సులభంగా జంతువులు పసిగట్టేయగలవట. అందుకుతగ్గట్టుగా మెదడు, అవయవాల ప్రత్యేక అమరిక ఉందని జీవశాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
అంతేగాదు హోమింగ్ పావురాలలో ఈ నావిగేషన్ సామర్థ్యం ఉందని అర్ధ శతాబ్దానికి పైగా చేసిన అధ్యయనం వెల్లడైందట అందుకోసం ఇవి సూర్యుడిని ఆధారంగా చేసుకుంటాయని గుర్తించి విస్తుపోయారు శాస్త్రవేత్తలు. అందుకోసం రాత్రిపూట కృత్రిమంగా వెలుగుని ప్రసరించేలా చేసి, పగటిపూట చీకటి ఉంటేలా చేశారట పరిశోధకులు.
దాంతో అవి శరీర గడియారాన్ని మార్చుకునే వ్యస్థను తటస్థీకరించిందని గుర్తించాయట. ఎందుకంటే దాని వల్లే కొన్ని పక్షులు ఎండగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో ఉండగా, మరికొన్ని ఇంటికి వెళ్లే మార్గాన్నే గుర్తించడంలో విఫలమయ్యాయట. కానీ మేఘావృతమైన రోజుల్లో ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయట. అదెలా అని పరిశోధించగా..అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు అంచనా వేశారు.
అనేక జంతువులు, పక్షులు మాదిరిగా ఈ పావురాల ముక్కుల పై భాగంలో మాగ్నెటైట్ (లేదా ఐరన్ ఆక్సైడ్) కణాలు ఉంటాయట, అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని దిక్సూచిలాగా గ్రహించడానికి సహాయపడతాయట. ఈ ఇంద్రియాన్ని నిష్క్రియం చేసేలా పరిశోధకులు పక్షుల తలలకు అయస్కాంతాలను అనుసంధానించారు. అలాగే వాటి ముక్కులకు అనస్థీషియా ఇచ్చారు. దాంతో అవి సూర్యుడిని ఉపయోగించి నావిగేట్ చేయలేకపోయాయి. అలాగే మబ్బుగా ఉన్న రోజుల్లో దారితప్పాయట. అయితే ఎండగా ఉన్న రోజుల్లో అవి తమ మార్గాన్ని సులభంగా గుర్తించాయట.
ఇక్కడ ఆ పావురాలు ఒక ఇంద్రియాన్ని కోల్పోతే మరొక ఇంద్రియాన్ని భర్తీ చేస్తున్నట్లు గుర్తించారు పరిశోధకులు. ఇది నిజం అనేలా ఒక అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త జాన్ హాగ్ర్స్టమ్ పక్షులు తాము ఎక్కడ ఉన్నాయో ఎలా చెప్పగలవో వివరించేలా ఒక సిద్ధాంతాన్ని వివరించారట. ఆ సిద్ధాంతం ప్రకారం..భూమి అయస్కాంత క్షేత్రంలో స్థిరమైన పౌనపున్యం ఇన్ఫ్రాసౌండ్ విడుదల చేస్తుందని, అయస్కాంత క్షేత్రం వలే గ్రహం ప్రతి భాగానికి దాని స్వంత సోనిక్ సౌండ్ ఉంటుంది.
కొన్ని పక్షులు ఈ ఇన్‌ఫ్రాసౌండ్‌లను వినగలగడమే కాదు, అవి ఎటు నుంచి వస్తుందో గుర్తించగలదని అంటున్నారు జాన్. అయితే మరికొందరు ఆ శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతంతో విభేదిస్తున్నారు. కచ్చితంగా ఇది ఎలా సాధ్యం అనేది నిర్థారించాల్సి ఉంది. చెప్పాలంటే జంతువులు తమ గమ్యస్థానానికి తిరిగి వెళ్లడానికి దృష్టి, వాసన, సూర్యుడు, నక్షత్రాలు, భూమి అయస్కాంత క్షేత్రం, ఇన్‌ఫ్రాసౌండ్ లేదా వీటన్నింటి కలయికను వినియోగిస్తాయా? లేదా అనేది ఒక మిస్టరీగా ఉంది.
అయితే ఈ సామర్థ్యం వాటికి ఎలా వచ్చిందనేది తెలుసుకునేందుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి గూళ్లకు సులభంగా చేరుకునే హోమింగ్ పావురాల ఎంపిక చేసి మరి పెంచుతారట. సింపుల్‌గా చెప్పాలంటే ఇది జన్యు లక్షణం. అయితే ఇది కొన్నింటి ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు. కొన్ని జంతువులు దారితప్పితే తమ గమ్యస్థానానికి చేరుకోవాలో తెలియగా గందరగోళానికి గురవ్వుతాయట.
దీనిపై సంవత్సరాలుగా రోమ్, నేను జంతువుల మాదిరిగానే తమలో ఎవరికి దిశానిర్దేశం ఉందో వాదించుకున్నాం. కానీ ఒక అసాధారణ క్షేత్ర పరిశోధకురాలు, జె. విజయకు అద్భుతమైన దిశానిర్దేశం ఉంది. ఆమె తెలియని అడవిలో తిరుగుతుంది. చెట్టును కోయకుండా లేదా కొమ్మను కొట్టకుండా, ఖచ్చితంగా తన మార్గాన్ని కనుగొంటుంది. ఆమెకు ఎలా సామర్థ్యం ఎలా వచ్చిందో తెలియదు, అందుకోసం ఏం చేస్తుందో కూడా తెలియదు.
రెండు సంవత్సరాల క్రితం ఇంటికి తిరిగి వచ్చాక, చీమల దాడితో పోరాడినప్పుడు ఈ హోమింగ్ స్వభావం నాపై తిరిగి వచ్చింది. అత్తగారి మాట గుర్తుకు వచ్చి, నేను తృణప్రాయంగా తోట నుంచి రెండు కప్పలను పట్టుకుని సింక్ కింద వదిలేశాను. అవి నేరుగా తమ అడవి తోటలోకి వెళ్లిపోయాయి. ఈసారి అలా కాదని ఒక కార్డ్ బోర్డు పెట్టేలో పెట్టాను..అవి మల విసర్జనలతో దుర్వాసన కలిగించినా.. చీమల బెడదను నివారించాయి. ఈసారి ఈ కప్పలను ఇలా కార్డ్‌బోర్డ్‌లో బంధించకుండా రెడ్ కార్పెట్‌ట్రీట్‌మెంట్ సౌకర్యం అందిస్తా..ఎందుకంటే చీమల బెడద లేకుండా చేస్తే కచ్చితం వాటిని ముద్దుపెట్టుకుంటా.
Author : Janaki Lenin -- జానకి లెనిన్
Photo credit - జానకి లెనిన్
(చదవండి: Frogs నన్ను ఇంటికి తీసుకు వెళ్ళు)