బహుశా కథల్లో కూడా ఇలాంటి రాక్షసుల గురించి విని ఉండవేమో. ముద్దులొలికే చిన్నారులను దారుణంగా హత్య చేసిందో మహిళ. ఈ హత్యలకు కారణం తెలుసుకొని పోలీసులే నిర్ఘాంత పోయారు.
హర్యానాలోని పానిపట్‌లోని ఒక గ్రామంలో బాజా భజంత్రీలు మోగుతున్న తరుణంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెళ్లివేడుకకోసం అందంగా ముస్తామైన ఆరేళ్ల బాలికను దారుణంగా హత్య చేసింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. జర్మన్ అద్భుత కథ స్నో వైట్‌లోని దుష్ట రాణిని మరపించిన పోలీసులు ఈ భయంకరమైన హత్యాకాండను ఛేదించారు.
తన కంటే అందంగా ఉందని
పానిపట్‌లో తన మేనకోడలిని హత్య చేసింది పూనమ్ అనేమహిళ. తనకంటే ఎవరూ అందంగా కనిపించ కూడదనే కారణంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. బాధితురాలు విధిని నీటితొట్టిలో ముంచి ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు పూనమ్ 2023లో తన కొడుకు దారుణంగా హతమార్చిందంటే ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చు.
హత్య ఎలా జరిగింది
సోనిపట్‌కు చెందిన విధి తన కుటుంబంతో కలిసి పానిపట్‌లోని ఇస్రానా ప్రాంతంలోని నౌల్తా గ్రామానికి బంధువుల వివాహానికి హాజరైంది. ఆమెతో పాటు ఆమె తాత పాల్ సింగ్, అమ్మమ్మ ఓంవతి, తండ్రి సందీప్, తల్లి, 10 నెలల తమ్ముడు వచ్చారు. పెళ్లిలో సీతాకోక చిలుకలా ముస్తామై, ఆనందంగా తిరుగుతున్న విధిపై పూనమ్ కన్నుపడింది. రాక్షసిలా మారిపోయింది.
అకస్మాత్తుగా విధి అదృశ్యమైంది. విధి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి, కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. దాదాపు గంట తర్వాత, విధి అమ్మమ్మ ఓంవతి వారి బంధువుల ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్‌రూమ్‌కి వెళ్లింది. బైట గడియ వేసి వున్న ఆ గదిని తెరిచినప్పుడు, విధి తల నీటి తొట్టిలో మునిగిపోయి, కాళ్ళు పైకి తేలి ఉన్నాయి. హుఠాహుఠిన చిన్నారిని NC మెడికల్ కాలేజీకి తరలించారు. కానీ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారు. దీంతో విధి తండ్రి తరువాత కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితురాలు పూనమ్ విధికి అత్త అని తేలింది. ఆమెను అరెస్ట్ చేశారు.
పిల్లలను చంపే విధానం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూనమ్ తనకంటే అందంగా ఎవరూ కనిపించకూడదని కోరుకోవడంతో అసూయ ,ఆగ్రహంతో పిల్లలను నీటిలో ముంచి చంపే అలవాటు ఉంది. ప్రత్యేకంగా చిన్న, అందమైన అమ్మాయిలే ఆమెటార్గెట్ అని పోలీసులు తెలిపారు. ఇలా మొత్తంగా పూనమ్ నలుగురు పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలతోపాటు తన కొడుకుని కూడా ఇలాగే చంపినట్లు అంగీకరించింది.
2023లో, పూనమ్ తన వదిన కుమార్తెను చంపింది. అదే సంవత్సరం, అనుమానం రాకుండా ఉండటానికి ఆమె తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపింది. ఈ సంవత్సరం ఆగస్టులో, పూనమ్ సివా గ్రామంలో మరో అమ్మాయిని హత్య చేసింది ఎందుకంటే వీరంతా తనకంటే 'అందంగా' కనిపించారట ఆమెకు. విధి హత్య కేసులో విచారణ సమయంలో పూనమ్ నిజం స్వరూపం బైటపడింది. ఆమె స్వయంగా ఈ హత్యలు చేసినట్టు ఒప్పుకుంది. అప్పటివరకు ఈ పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినట్లు భావించారు.
ఇదీ చదవండి: ఎనిమిదేళ్ల కల సాకారం : నాన్నకోసం కన్నీళ్లతో


