ధైర్యం, దృడ సంకల్పం, కృషి అన్నీ ఉన్నాయి. సాధించాలన్న పట్టుదలా మెండుగా ఉంది. కానీ ఫలితం కోసం ఎనిమిదేళ్లు నిరీక్షించింది. చివరికి ఆమె సంకల్పం, కల ఫలించింది. తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇంతకు ఏమిటా కల, ఆమె సాధించిన విజయం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే ఈ స్ఫూర్తిదాయక కథనాన్ని తప్పకుండా చదవాల్సిందే.
ప్రియాంక దల్వి పేదింటి బిడ్డ. ఆమె తండ్రి ఒక సాధారణ రైతు. ఆయన గుండె ఉప్పొంగేలా చేసిన ఆడబిడ్డ ప్రియాంక. నాన్నకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఎనిమిదేళ్లు కష్టపడింది. ఆ కల నిజమైన రోజు భావోద్వేగంతో కన్నీటి ప్రవాహమైంది. మహారాష్ట్రలో మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారిణి అయ్యింది. మారుమూల గ్రామంలో ఒక రైతుబిడ్డగా ఆమె సాధించిన ఈ విజయం నిజంగా స్ఫూర్తిదాయకం!
నవేఖేడ్ గ్రామంలో గుడ్డిదీపాల మధ్య మసక వెలుగులో చదువుకున్న ప్రియాంక మహారాష్ట్రను అగ్రస్థానంలో నిలిచింది. మహిళా & శిశు అభివృద్ధి శాఖలో అధికారి పదవిని సంపాదించింది. ఫలితాల రోజున, ప్రియాంక తల్లిదండ్రులు తమ కుమార్తె విజయానికి చూడటానికి వారి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఫలితాలు రాగానే తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది. ఇన్నేళ్ల పోరాటం నిశ్శబ్ద ప్రార్థనలు ఆమె కంట కన్నీరుగా ప్రవహించాయి.
ఇదీ చదవండి: మాస్క్‌తో పలాష్ : ప్రేమానంద్ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?


