పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకుంటూ తన అభిమానులను చైతన్యపరుస్తుంటారు. ఈసారి అలానే సరికొత్త ప్రేరణాత్మక స్టోరీతో ముందుకొచ్చారు. ఈసారి గ్రామాలకు స్ఫూర్తిని కలిగించే కథను షేర్ చేశారు. ఆ గ్రామం స్మార్ట్ డెవలప్‌మెంట్‌కి ఫిదా అవ్వతూ నెట్టింట ఎలా ఆ గ్రామం అభ్యున్నతి వైపుకి అడుగులు వేస్తూ సరికొత్త మార్పుకి బీజం వేసిందో వివరించారు. డెవలప్‌మెంట్ అనగానే డబ్బు, మౌలిక సదుపాయాలు ఉంటేనే సాధ్యం అనుకుంటే పొరపాటే అంటున్నారు మహీంద్రా. మరీ ఈ గ్రామం ఎలా ఆదర్శవంతమైన గ్రామంగా నిలిచిందో తెలుసుకుందామా..!.
మహారాష్ట్రలోని టాడోబో నేషనల్ పార్క్ సమీపంలోని సతారా నెవార్ అనే గ్రామం ఆనంద్ మహాంద్రా మనసుని దోచుకుంది. క్రమశిక్షణకు, స్థిరమైన జీవన విధానానికి ఈ గ్రామం చక్కని రోల్ మోడల్ అంటూ ఆ గ్రామం విశిష్టత గురించి పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు అర్థవంతమైన మార్పు అనేది గొప్ప నాయకత్వం, సాముహిక శక్తి నుంచి వస్తుందనేందుకు ఈ గ్రామమే ఒక ఉదాహరణ అని నొక్కి చెప్పారు.
ఒకప్పుడూ ఈ సతారా నెవార్ గ్రామం ఇతర గ్రామాల మాదిరిగానే పరిశభ్రంగా లేక, వనరుల కొరతతో అధ్వాన్నంగా ఉండేది. అయితే స్థానిక నాయకుడు గజానన్ ఐదేళ్ల పాటు ఆచరణాత్మకమైన సంస్కరణల ప్రణాళికలు అమలయ్యేలా ప్రజలందర్నీ ఒప్పించి.. ఆ మార్గంలో ముందుండి నడిపించారు. ఈ గ్రామంలో మొత్తం ప్రజలకు అవసరమయ్యే ఉచిత వేడి నీటి వ్యవస్థ ఉంది. అది కూడా సౌరశక్తితో. అంతేగాదు నీటి ఏటీఎం కార్డుతో యాక్సెస్ అయ్యే కమ్యూనిటీ ఆర్‌ఓ వ్యవస్థ ఉంది. దీని సాయంతో శుద్ధి చేసిన తాగునీరు, అలాగే ప్రతి ఇంట్లో మీటర్‌తో కనెక్ట్ అయిన నీటి కుళాయిలు ఉన్నాయి.
అలాగే ఓపెన్ డ్రెయిన్ వ్యవస్థను తొలగించారు. ప్రతి సాయంత్రం వీధులు చెత్తచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే వీధి దీపాలు సైతం సౌరశక్తితో వెలుగుతాయి. అంతేగాదు ఎవ్వరైనా అసభ్యకరమైన మాటలు మాట్లాడితే గనుక రూ. 500ల దాక జరిమాన విధించబుడుతుంది. ఇది అన్ని వయసులన వారికి వర్తిస్తుందట. ఇక్కడి పిల్లలు సైతం పరిశుభ్రత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారట. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత మాత్రమే కాదు అది మన గర్వానికి కారణమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారట.
గ్రామస్తులు ప్రతి సౌకర్యాన్ని అందరూ కలిసి నిర్వహిస్తారు, అందుకు కావాల్సిన నిధులను వారే సమకూర్చుకుంటారట. అలా సమాజ అభివృద్ధిలో పాలుపంచుకునేవారికే ఇక్కడి సౌకర్యాలను వినియోగించుకునే హక్కుని కలిగి ఉంటారట. ఇది వాళ్లంతా ఏర్పరుచుకున్న నియమం అట. ఇక్కడ పిల్లల కోసం చిన్న లైబ్రరీ కూడా ఉంది. ఈ గ్రంథాలయంలోనే పెద్దలు కూడా సమావేశమై టీవి చూస్తూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే వెసులుబాటు కూడా ఉండటం విశేషం
మార్పుకు సరైన పాఠం ఇది..
ఇంతింత బడ్జెట్ కేటాయింపులతో గొప్ప మార్పు రాదని ఈ గ్రామం ప్రూ చేసిందంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు జల్లు కురిపించారు. సరైన నాయకత్వం, ఐక్యత, క్రమశిక్షణతో అసలైన అభివృద్ధి సాధ్యమని ఈ గ్రామం చెబుతోంది పైగా మోడల్ గ్రామీణ అభివృద్ధికి కార్యచరణ ఇలా ఉండాలని తన చేతలతో చెప్పకనే చెప్పింది ఈ గ్రామం. సాముహిక బాధ్యత, క్రమశిక్షణా గొప్ప ఆవిష్కరణలకు మూలస్థంభమవ్వడమే గాక జీవితాలను సైతం మారుస్తుందని ఈ గ్రామాన్ని చూస్తే తెలుస్తుందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా
This clip has been doing the rounds.
I paused to check if it was too good to be true.
It isn’t.
What it captures is a quiet success story in our own backyard.
A village that has become a role model, not just for cleanliness or sustainability or shared amenities, but for an… pic.twitter.com/PK0HHRwBam— anand mahindra (@anandmahindra) December 1, 2025
(చదవండి: ‘జయ హో’..! ప్రతికూల పరిస్థితుల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇదే..!)


