మన సైనికులు తీవ్రమైన వాతావరణంలో సరిహద్దులలో విధులు నిర్వహిస్తుంటారు. ఎత్తైన ప్రాంతాలలో, ప్రాణాంతకమైన మంచు తుఫానులు, హింస పెట్టే గాలులను భరిస్తూ విధులు నిర్వహిస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆనందాన్ని వెదుక్కుంటారు. దీనికి తాజా ఉదాహరణ... ఆర్మీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో.
ఈ వైరల్ వీడియోలో...
మంచుతో కప్పబడిన ప్రాంతంలో సైనికులు క్రికెట్ ఆడుతుంటారు. మంచుముద్దలను క్రికెట్ బాల్స్‌గా ఉపయోగించి ఎంజాయ్ చేస్తుంటారు. ఎముకలు కొరికే చలిలో కూడా సైనికుల క్రీడానందం నెటిజనులను ఆకట్టుకుంది.
పులిలాంటి చలి కూడా వీరి సంతోషం ముందు తోక ముడవక తప్పదు కదా! ఈ వీడియో క్లిప్ నాలుగు మిలియన్‌లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘జయ హో’ అన్నారు ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్. ‘ఆ సైనికులు ఎవరూ మనకు తెలియదు. అలాంటి వారు మన కోసం ప్రాణాలను పణంగా పెట్టి దేశసరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు. వారి గురించి సర్థించడమే మనం చేయగలిగింది’ అని ఒక నెటిజనుడు స్పందించాడు.
(చదవండి: పర్ఫెక్ట్ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా..? సాక్షాత్తు ఐఐటీ ప్రొఫెసర్)


