వైరల్‌ వీడియో: ట్రంప్‌కు లేడీ యాంకర్‌ వార్నింగ్‌ | TV Anchor Breaks Down Announcing Death Of Iran Supreme Leader Khamenei, Says A Revenge Is Coming Soon, Video Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: ట్రంప్‌కు లేడీ యాంకర్‌ వార్నింగ్‌

Mar 1 2026 9:28 AM | Updated on Mar 1 2026 10:08 AM

TV Anchor Breaks Down Announcing Death Of Iran Supreme Leader

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణ వార్తను చదువుతూ... ఇరాన్ స్టేట్‌ టీవీ యాంకర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం. వారు ఏం చేశారో దానికి తగిన ఫలితం అనుభవిస్తారు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ  వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఖమేనీకి నివాళులర్పిస్తూ యాంకర్‌ అజర్‌చెహ్ర్.. ఖమేనీ నాయకత్వాన్ని, సిద్ధాంతాలను కొనియాడారు. ఆయన పాలస్తీనా పిల్లల కోసం నిలబడ్డారని.. లెబనాన్ పిల్లల కోసం పోరాడారన్నారు. ఈరోజు ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనాథలు విలపిస్తున్నారన్నారు. ఖమేనీ చరిత్రలో ఇమామ్ అలీ వలె చిరస్థాయిగా నిలిచిపోతారంటూ యాంకర్‌ తెలిపింది.

ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. 40 రోజులు సంతాప దినాలుగా ఇరాన్‌ ప్రకటించింది. ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్‌ ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ  మంత్రి అమీర్‌ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్‌ ఆర్‌జీసీ కమాండర్‌ మొహమ్మద్‌ కూడా మృతిచెందారు.

Advertisement
 
Advertisement
Advertisement