ఇరాన్‌ క్షిపణి దాడి.. ​కొద్దిలో తప్పించుకున్న బుర్జ్ ఖలీఫా | Explosion Near Dubai Burj Khalifa Amid Iran-US-Israel Tensions, Iran Drone Suspected, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ క్షిపణి దాడి.. ​కొద్దిలో తప్పించుకున్న బుర్జ్ ఖలీఫా

Mar 1 2026 8:37 AM | Updated on Mar 1 2026 12:58 PM

Dubais Burj Khalifa Hit By Iran Missile

దుబాయ్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు  కమ్ముకుంటున్న వేళ గల్ఫ్ దేశమైన దుబాయ్‌లో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం, దుబాయ్ గర్వకారణమైన బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. దీనిని సంబంధించిన దృశ్యాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. 828 మీటర్ల ఎత్తుతో ఉన్న ఈ మహా కట్టడం సమీపంలో ఇరాన్ డ్రోన్ సంచరించినట్లు సమాచారం అందిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో నల్లటి పొగలు అలుముకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఈ దాడి నేరుగా బుర్జ్ ఖలీఫాను లక్ష్యంగా చేసుకుని జరిగిందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇప్పటికే భవనాన్ని ఖాళీ చేయించారు. దుబాయ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ పేలుళ్ల ధాటికి భయానక వాతావరణం  ఏర్పడింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పామ్ జుమేరా ప్రాంతంలో సంభవించిన పేలుడు కారణంగా ఒక భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయని దుబాయ్ మీడియా కార్యాలయం ధృవీకరించింది. మరోవైపు, ఇరాన్‌కు చెందిన ‘షాహెద్’ డ్రోన్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో రెండు భవనాల మధ్యలో కూలిపోయి భారీ పేలుడుకు కారణమైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement