ఖమేనీ కథ ముగిసింది.. ఫ్యామిలీతో సహా హతం | Iran Supreme Leader Khamenei Killed In Us Israel Strikes | Sakshi
Sakshi News home page

ఖమేనీ కథ ముగిసింది.. ఫ్యామిలీతో సహా హతం

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 8:18 AM

Iran Supreme Leader Khamenei Killed In Us Israel Strikes

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఆయన మృతిచెందినట్లు  ఇరాన్‌ ప్రకటించింది. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. 40 రోజులు సంతాపదినాలుగా ఇరాన్‌ ప్రకటించింది. ఖమేనీ నివాసంపై ఆధునిక క్షిపణులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ఇజ్రాయెల్‌ ప్రయోగించారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ  మంత్రి అమీర్‌ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్‌ ఆర్‌జీసీ కమాండర్‌ మొహమ్మద్‌ కూడా మృతిచెందారు.

ఖమేనీ, అధ్యక్షుడు పెజెష్కియానే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ నిన్న(శనివారం) ఉదయాన్నే వారి నివాసాలు, కార్యాలయ సముదాయాలపై పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగింది. ఆ వెంటనే మొత్తం టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. అనంతరం అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్‌ అగ్ర నేతలతో పాటు అణు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, భారీ బాంబులతో విరుచుకుపడింది. కొద్ది గంటల అనంతరం ఇరాన్‌ తేరుకుని ప్రతి దాడికి దిగింది. తొలుత ఇజ్రాయెల్‌పై రెండు దఫాలుగా క్షిపణులతో విరుచుకుపడింది. అనంతరం పలు గల్ఫ్‌ దేశాల్లోని పలు అమెరికా స్థావరాలపైనా దాడులకు తెర తీసింది. 

నెలల పాటు ప్లాన్‌ చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌.. శాటిలైట్‌ ద్వారా ఖమేనీ లోకేషన్‌ను గుర్తించాయి. ట్రెహాన్‌లోని తన ఆఫీసులోనే ఖమేనీ ఉన్నట్లు నిర్థారణ అయిన తర్వాత  నిన్న శనివారం, ఫ్రిబవరి 28) ఉదయం 1:15 కు ఇరాన్‌పై మిస్సైల్‌ దాడులు ప్రారంభించాయి. ఖమేనీ కార్యాలయం సముదాయాలపై ప్రెసిషన్‌ గైడెడ్‌ మిస్సైళ్లను ఇజ్రాయెల్‌ ప్రయోగించగా.. తొమహాక్‌ మిస్సైళ్లతో అమెరికా ఎటాక్‌ చేసింది. లోకేషన్‌ గుర్తించిన 15 నిమిషాల్లో ఎటాక్‌ ప్రారంభించాయి. ట్రెహాన్‌లోని ఖమేనీ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు చేపట్టాయి. ఆపరేషన్‌ కిల్‌ ఖమేనీ ఆపరేషన్‌కు సౌదీ,  గల్ఫ్‌ దేశాలు మద్దతు తెలిపాయి.

ఖమేనీ మరణించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న(శనివారం) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఖమేనీను "చరిత్రలో అత్యంత దుష్టులలో ఒకరు" అంటూ పేర్కొన్న ట్రంప్‌.. ఇది ‘‘ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు అమెరికన్లకు, ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు న్యాయం" జరిగిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. తమ నిఘా, ఆధునిక ట్రాకింగ్‌ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారన్న ట్రంప్‌.. ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేది  ఏమీలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఖమేనీ నివాస సముదాయంపై 30 బాంబులు వేశారని ఇజ్రాయెల్ ఛానల్ 12 నివేదిక తెలిపింది.

శనివారం జరిగిన దాడుల తర్వాత ఇరాన్ ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపై (బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఎఇ) దాడులు జరిపింది.  ఈ పరిణామాలు ప్రాంతీయంగా పెద్ద ఎస్కలేషన్‌కు దారితీశాయి. అయతొల్లా అలీ ఖమేనీ 1989లో రుహొల్లా ఖొమేనీ తరువాత సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 36 ఏళ్లుగా ఆయన ఇరాన్‌ను పాలించారు. చివరి సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, ప్రజా నిరసనలు, హమాస్–హిజ్బుల్లా బలహీనత, అమెరికా–ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు ఆయన పాలనను కుదిపేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement