breaking news
war
-
హర్మాజ్ జలసంధి ఆక్రమణ కోసం ట్రంప్ భారీ వ్యహం
-
గల్ఫ్ లో టెన్షన్.. టెన్షన్ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
-
Special Story : తీవ్ర సంక్షోభంలో గల్ఫ్ దేశాలు
-
అమెరికాలో డ్రోన్ల కలకలం.. హై అలర్ట్‌లో వాషింగ్టన్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. అత్యంత కీలక సైనిక స్థావరం ‘ఫోర్ట్ మెక్‌నైర్’ (Fort McNair) వద్ద గుర్తు తెలియని డ్రోన్లు తిరుగుతుండటం అమెరికా యంత్రాగాన్ని హడలెత్తిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్లు నివసించే ప్రాంతంలో డ్రోన్లు కనిపించడం అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వైట్‌హౌస్ అత్యవసర చర్యల్లోకి దిగింది.యుద్ధ మేఘాల మధ్య..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఈ డ్రోన్ల సంచారం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భద్రతా పరమైన ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా తన విదేశీ రాయబార కార్యాలయాలను హై అలర్ట్‌లో ఉంచడంతో పాటు, స్వదేశంలోని పలు సైనిక స్థావరాలను లాక్డౌన్ చేసింది.ట్రంప్ మాస్ వార్నింగ్మరోవైపు, ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా ఖతార్‌లోని ఇంధన ప్లాంట్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఖతార్‌పై మళ్లీ దాడికి దిగితే, ఇరాన్ ఇంధన వనరులను పూర్తిగా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.మండిపోతున్న చమురు ధరలుఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 5 శాతం పెరిగి, మరింత భారంగా మారింది. చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ భీకర పోరులో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మంది, లెబనాన్‌లో 960 మంది, అమెరికా సైనికులు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షిపణి దాడుల కారణంగా ఖతార్‌లోని కీలక గ్యాస్ ప్లాంట్లు భారీగా దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: గల్ప్‌కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా..
ఖార్కివ్: పైన క్షిపణుల మోత.. కింద పిల్లల అక్షరాల పాట.. రష్యా సరిహద్దుకు కూతవేటు దూరంలోని ఉక్రెయిన్ నగరం ఖార్కివ్‌లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఇదే. నిత్యం బాంబు దాడులు, డ్రోన్ల ముప్పుతో వణికిపోతున్న ఈ నగరంలో చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మెట్రో రైలు స్టేషన్లనే తరగతి గదులుగా మార్చివేసింది.పాతాళంలో పాఠశాలలురష్యా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్కివ్ నగరంపై నిత్యం బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న 184 పాఠశాలల్లో 134 ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే, వారికి చదువును అందించేందుకు ఎనిమిది మెట్రో స్టేషన్లను పాఠశాలలుగా మార్చారు. ప్రస్తుతం సుమారు 20 వేల మంది విద్యార్థులు భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువుకుంటున్నారు.ట్రైన్ల పక్కనే పాఠాలుఒకప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో స్టేషన్ హాల్స్ ఇప్పుడు క్లాస్ రూమ్‌లుగా మారిపోయాయి. ఒలెక్సాండర్ మాసెల్స్కీ మెట్రో స్టేషన్లో సుమారు 2,000 మంది చిన్నారులు షిఫ్టుల వారీగా చదువుకుంటున్నారు. ‘ఇక్కడ యుద్ధం గురించి ఆలోచించాల్సిన పనిలేదు, ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. మా దృష్టి అంతా పిల్లలకు పాఠాలు చెప్పడంపైనే ఉంటుంది’ అని ఇంగ్లీష్ టీచర్ మాక్సిమ్ త్రిస్తాప్షోన్ తెలిపారు.భయం నీడలో భద్రతబయట పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. బస్టాపుల్లో నిలబడితే ఎప్పుడు డ్రోన్ దాడులు జరుగుతాయో తెలియదు. అందుకే పిల్లలను బస్సుల ద్వారా నేరుగా స్టేషన్ లోపలికే తీసుకొస్తారు. ‘నాకు ఇక్కడ చదువుకోవడం ఇష్టం, ఎందుకంటే ఇక్కడ బాంబుల భయం ఉండదు’ అని తొమ్మిదేళ్ల అలీసా అనే విద్యార్థిని చెప్పడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పోషక విలువల కోసం ‘ఉజ్వర్’ అనే పానీయాన్ని కూడా అందిస్తున్నారు.సంస్కృతిని కాపాడుకుంటూ..ఈ మెట్రో పాఠశాలలు కేవలం అక్షరాలు నేర్పడమే కాదు, ఉక్రెయిన్ సంస్కృతిని కాపాడే వేదికలుగా కూడా మారాయి. రష్యన్ భాషా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నగరంలో, పిల్లలు ఇప్పుడు పాఠశాలల ద్వారా ఉక్రేనియన్ భాషను నేర్చుకుంటున్నారు. యుద్ధం తమ గతాన్ని, చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని అధ్యక్షుడు జెలెన్ స్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా యుద్ధం మిగిల్చిన గాయాల మధ్య, క్షిపణి దాడుల భయం లేకుండా ప్రశాంతంగా చదువులు సాగించడం ఈ పిల్లలకు అతిపెద్ద ఊరటగా మారింది. ఖార్కివ్ మెట్రో స్టేషన్లు ఇప్పుడు కేవలం ప్రయాణ ప్రాంగణాలు మాత్రమే కాదు, విజ్ఞాన దేవాలయాలుగా మారాయంటున్నారు స్థానికులు.ఇది కూడా చదవండి: ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం? -
ట్రంప్ సిగ్నల్ ఇస్తే చాలు గాల్లో ఖర్గ్ ఐలాండ్..!
-
80 వేల టన్నుల చమురుతో భారత్‌కు ‘జగ్ లాడ్కీ’
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతున్న వేళ భారత్‌కు భారీ ఊరట లభించింది. యూఏఈ (యూఏఈ) నుంచి సుమారు 80,800 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో బయలుదేరిన భారతీయ నౌక ‘జగ్ లాడ్కీ’ (Jag Laadki) బుధవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు క్షేమంగా చేరుకుంది.దాడి జరిగిన చోటే లోడింగ్ఈ నౌక ప్రయాణం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మార్చి 14, 2026న యూఏఈలోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్‌పై దాడి జరిగిన సమయంలో ‘జగ్ లాడ్కీ’ సరిగ్గా అక్కడే చమురును నింపుకుంటోంది. ఆ టెర్మినల్‌పై దాడి జరిగి కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, భారత నౌక మాత్రం ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆదివారం ఉదయం సురక్షితంగా బయలుదేరింది. ‘ముర్బన్ క్రూడ్’తో నిండిన ఈ నౌక మూడు రోజుల ప్రయాణం తర్వాత భారత్ తీరానికి చేరింది.వరుస విజయాలు.. ఊపిరి పీల్చుకున్న ఇంధన రంగంపశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చేరిన మూడవ ప్రధాన నౌక ఇది. దీనికంటే ముందు 'శివాలిక్', 'నందా దేవి' అనే రెండు ఎల్పీజీ నౌకలు కూడా విజయవంతంగా భారత్ చేరుకున్నాయి. నందా దేవి.. 46,500 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో మంగళవారం వాడినార్ పోర్టుకు చేరింది. ఇక్కడి నుంచి ఈ గ్యాస్‌ను తమిళనాడులోని ఎన్నోర్, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా పోర్టులకు తరలించనున్నారు. శివాలిక్.. సోమవారమే ముంద్రా పోర్టుకు చేరుకుంది. -
Hyderabad: టిఫిన్ బిల్లులో 5 శాతం గ్యాస్ చార్జీలు
సికింద్రాబాద్‌లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా.. ‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్‌చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి. తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్‌లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్‌గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు. -
ఇరాన్ కు మరో దెబ్బ.. ఖమేనీ కుడి భుజం హతం
-
యుద్ధనౌకలను పంపబోం
వాషింగ్టన్: అగ్రరాజ్యం పిలుపిస్తే అందరూ కట్టకట్టుకుని వస్తారని కలలుగన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు భంగపాటు ఎదురైంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకలు వెళ్తే తగలబెడతామని హెచ్చరిస్తున్న ఇరాన్‌కు మనందరి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో బదులివ్వాలంటూ నాటోలోని సభ్యదేశాలు, ఇతర మిత్రదేశాలకు పిలుపునిచ్చిన ట్రంప్‌కు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. పైగా చైనా షరతులు విధించి ట్రంప్‌కు మరింత కోపం తెప్పించింది. యుద్ధంలో భాగస్వాములు కాబోమంటూ మిత్రదేశాలు ముఖంచాటేయడంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలేం జరిగింది? గట్టున కూర్చుని ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు భయపడకుండా హార్మూజ్ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నాటో దేశాలు, మిత్రదేశాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు యుద్ధనౌకలు, డ్రోన్లు పంపే ఆలోచనే లేదు. అమెరికా, యురోపియన్ యూనియన్, గల్ఫ్‌లోని మిత్రదేశాలతో చర్చించాకే బ్రిటన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది’’అని అన్నారు.‘‘అసలు పశ్చిమాసియా యుద్ధంలో నాటోకు ఎలాంటి సంబంధం లేదు. శక్తివంత అమెరికా నేవీ యుద్ధనౌకలు చేయలేని పనిని యురోపియన్ యుద్ధనౌకలు పూర్తిచేయగలవా?’’అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పోస్టోరియస్ అన్నారు. ‘‘పరిస్థితి కాస్తంత సద్దుమణిగాకే చమురునౌకలకు రక్షణగా మా యుద్ధనౌకలను పంపగలం’’అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తెగేసి చెప్పారు. జలసంధిలో జలసమాధి కావాలా? ‘‘ఇప్పటికప్పుడు యుద్ధనౌకలను పంపే ఆలోచన మాకు లేదు. పశ్చిమాసియాకు సంబంధించిన యురోపియన్ యూనియన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. హార్మూజ్ జలసంధిని తెరపించడం కోసం మేం జలసమాధి కావాలా? మా దేశాలపై బాంబుదాడులు అవసరమా?’’అని ఐరోపా సమాఖ్య విదేశాంగ విధానాల విభాగ చీఫ్ కాజా కల్లాస్ తెగేసి చెప్పారు. ‘‘ముందుగా ఇరువైపులా సైనిక చర్యలను తక్షణం ఆపేయాలి. దాడుల పర్వానికి తెరదించాలి. ఆ తర్వాతే యుద్ధనౌకలను పంపడంపై ఆలోచిస్తాం.యుద్దం ఇలాగే కొనసాగితే చమురు సంక్షోభం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తప్పవు’’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. ‘‘పార్లమెంట్ ఆమోదం లేకుండా యుద్ధనౌకలను హార్మూజ్‌కు పంపడం కుదరదు. కొరియన్ల భద్రత, ముడిచమురు రావాణామార్గాల రక్షణే మాకు ముఖ్యం’’అని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహన్గుయీ బాక్ చెప్పారు. ‘‘ఎస్కాట్‌గా యుద్ధనౌకలను పంపాలని మాకు ఎవరి నుంచీ అభ్యర్థన రాలేదు’’అని జపాన్ నూతన మహిళా ప్రధాని సనాయీ తకైచీ అన్నారు. మార్చి 19వ తేదీన ఆమె వాషింగ్టన్లో ట్రంప్‌తో భేటీకాబోతున్న వేళ అమెరికా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్ సాయుధ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగ్రహం మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంగళవారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్ ఉగ్రరాజ్యంపై దాడులకు మాతో కలిసి రాబోమని తాజాగా నాటో సభ్యదేశాలు చావుకబురు చల్లగా చెప్పాయి. నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతి ఏటా వందల బిలియన్ డాలర్లను ధారపోసింది. ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న నాటో సభ్యదేశాలు మేం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని భ్రమించా. కానీ వాళ్లు మాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేరు. వాస్తవానికి ఇప్పటికే అమెరికా ఇరాన్‌ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఇప్పుడు మాకు నాటో నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదు. గతంలోనూ వాళ్లు మాకు సాయం చేయలేదు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియాలదే అదే తీరు. మాకు ఎవరి సాయం అక్కర్లేదు’’అని అన్నారు. -
ఇజ్జత్ కా సవాల్... ట్రంప్ కు షాక్ ఇచ్చిన మిత్రదేశాలు
-
ఇరాన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా ప్రెసిడెంట్
-
హార్ముజ్‌కు మీ యుద్ధ నౌకల్ని పంపండి
-
అఫ్గానిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులు
-
అటు అమెరికా - ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ రాజధానిపై బాంబుల వర్షం..
-
ట్రంప్ ఒత్తిడిని బహిరంగంగా తిరస్కరించిన జర్మనీ
-
క్యాండిడేట్స్ టోర్నీకి హంపి దూరం!
బెంగళూరు: రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, భారత స్టార్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలనే యోచనలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం... క్యాండిడేట్స్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న సైప్రస్ దేశం ‘వార్ జోన్’కు సమీపంలోనే ఉండటం... మార్చి ఒకటో తేదీన సైప్రస్‌లోని బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేయడం... కొన్ని రోజులపాటు విమాన సర్వీసులు నిలిచిపోవడం... ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) టోర్నీ వేదిక మార్చేందుకు అనాసక్తి చూపించడం... వెరసి హంపి ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావిస్తోంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు సైప్రస్‌లోని పెయియా నగరంలో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ జరగనుంది. గత ఏడాది నవంబర్‌లో క్యాండిడేట్స్ టోర్నీ ఆతిథ్య హక్కులు సైప్రస్‌కు లభించాయి. ఏకకాలంలో పురుషుల, మహిళల విభాగంలో క్యాండిడేట్స్ టోర్నీని నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి (భారత్), జు జినెర్, టాన్ జోంగి (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్చినా, కాటరీనా లాగ్నో (రష్యా), బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్) అర్హత సాధించారు. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద (భారత్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ), హికారు నకముర, కరువానా (అమెరికా), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా), ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) బరిలో ఉన్నారు. పురుషుల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (భారత్)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ వెన్ జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడతారు.ప్రస్తుతం పశ్చిమాసియాకు సమీపంలోని ఏ దేశాలకైనా వెళ్లడం సురక్షితం కాదు. రెండు వారాల క్రితం మొదలైన యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికే ఒకసారి సైప్రస్‌లోని బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడిచేసింది. లెబనాన్ నుంచి సైప్రస్‌కు విమానాలు కూడా రద్దయ్యాయి. క్రీడాకారుల భద్రత గురించి ‘ఫిడే’ ఆలోచించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ‘ఫిడే’ చెబుతోంది. కానీ ఈ టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం చెస్ సమాఖ్యకు లేదనిపిస్తోంది. చెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడకపోతే అర్థం లేదు. మౌనంగా ఉంటే ఈ ఆట నుంచి ఏమీ నేర్చుకోలేదని భావించాలి. నాకైతే క్యాండిడేట్స్ టోర్నీ ఎంతో కీలకం. ఇప్పటికే నాకు 39 ఏళ్లు. మళ్లీ నేను ఈ టోర్నీకి అర్హత సాధిస్తానో లేదో గ్యారంటీ లేదు. రెండేళ్లుగా ఈ టోర్నీ కోసం శ్రమిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని వేరే చోట, వేరే తేదీల్లో నిర్వహించడం శ్రేయస్కరం. ఆట కంటే జీవితం గొప్పది. ఇప్పటికే నేను సైప్రస్‌కు టికెట్లు బుక్ చేసుకున్నాను. యుద్ధం ఆగిపోతే చివరి క్షణంలోనైనా ఈ టోర్నీలో ఆడతాను. దోహ మీదుగా కాకుండా ఫ్రాంక్ఫర్ట్ మీదుగా సైప్రస్ చేరుకుంటాను. అయితే ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. –కోనేరు హంపివార్ జోన్ నుంచి సైప్రస్ దూరంలో లేదని మాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం సైప్రస్‌లో ప్రమాదకర పరిస్థితులు కనిపించడం లేదు. టోర్నీ ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం లేదు. సైప్రస్ దేశాధ్యక్షుడు స్వయంగా ఈ టోర్నీని ప్రారంభిస్తారు. –‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుతోవ్‌స్కీ -
నెతన్యాహు చనిపోయాడా!? నిజమవుతున్న అనుమానాలు... కానీ..AI వీడియోతో
-
బాబు, పవన్ ఫోటోలు లేవని.. బీజేపీ ఫ్లెక్సీలు చింపేసిన టీడీపీ నేతలు
-
నమ్మండి.. సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తాం
ప్రియమైన కస్టమర్, అధిక/పదేపదే రీఫిల్ బుకింగ్ కాల్స్ కారణంగా స్పందించడంలో తాత్కాలిక ఆలస్యం జరగవచ్చు. వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. భయపడవద్దు. దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలందిస్తున్న ఆయిల్ కంపెనీని నమ్మండి. హోమ్ డెలివరీ చేస్తాం. ఏజెన్సీల వద్దకు పరుగు తీయవద్దు. ఇంధనాన్ని ఆదా చేయండి. –వినియోగదారుల ఫోన్‌కు ఐవోసీ పంపుతున్న సందేశం.సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సిలిండర్ కొరత వస్తుందనే భయం నగర వాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరఫరాపై ఆంక్షలు విధించి.. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వినియోగదారులు ఒక్కసారిగా బుకింగ్‌లకు ఎగబడడంతో ‘డొమెస్టిక్ గ్యాస్’ సంక్షోభం తారస్థాయికి చేరింది. కమర్షియల్ గ్యాస్ వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ‘ముంచుకొస్తున్న ముప్పు’నకు సంకేతంగా సామాన్యులు భావిస్తున్నారు. అందుకే సిలిండర్ అయిపోకముందే అడ్వాన్స్ బుకింగ్‌లకు పోటీ పడుతున్నారు. లక్షలాది బుకింగ్‌లతో ఆయిల్ కంపెనీల టెక్నికల్ సర్వర్లు జామ్ అవుతూ యాప్‌లు, వెబ్సైట్లు మొరాయిస్తున్నాయి.వారం దాటినా... నగరంలో హోమ్ డెలివరీ వెయిటింగ్ పిరియడ్ పెరగడం ఆందోళకు గురిచేస్తోంది. సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో వచ్చే సిలిండర్, ప్రస్తుతం వారం దాటినా చేరడం లేదు. ఫోన్లలో బుక్ కాకపోవడం, డెలివరీలో జాప్యంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ, ఆయిల్ కంపెనీల లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో బఫర్ స్టాక్ కనీసం 15 నుంచి 20 రోజులకు సరిపడా ఉంది. అయితే, కేంద్రం ఆంక్షలు విధించడంతో 30 శాతం వరకు అదనపు గ్యాస్ గృహ అవసరాలకు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర సందేశాలు, వదంతులు నమ్మొద్దని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగుతోంది. ‘‘హోం డెలివరీలో స్వల్ప జాప్యం వాస్తవమే. అది బుకింగ్‌ల రద్దీ వల్ల మాత్రమే. ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదు’’ అని చమురు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.కార్గో కంగారు సికింద్రాబాద్‌కు చెందిన వెంకటయ్య కుమారుడు దినేష్ భార్య పిల్లలతో ఖతర్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న కుమారుడి బర్త్‌డే పారీ్టకి అవసరమైన వస్తువులను నగరం నుంచి తెప్పించాలని భావించి తండ్రికి లిస్టు పంపించాడు. అయితే పశ్చిమాసియా యుద్ధంతో చాలా కార్గో కంపెనీలు పార్సిళ్లు పంపలేమన్నాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఒకటి, అరా ముందుకు వచ్చిన చార్జీలను మాత్రం 3–4 రెట్లు ఎక్కువగా పెంచడంతో పార్సిల్ పంపడం మానుకున్నారు.టౌలిచౌకీకి చెందిన ఓ కుటుంబం సౌదీ అరేబియాలో ఉంటోంది. ఏటా రంజాన్ పండుగకు నగరం నుంచే సామగ్రితోపాటు ఈద్ నమాజ్ కోసం దుస్తులను తెప్పించుకుంటుంది. యుద్ధ ప్రభావంతో కార్గో సర్వీస్ సక్రమంగా లేక ఈసారి అలా కుదరడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. పండుగలు, జన్మదినం, మ్యారేజ్ డే.. ఇలా ఏ ఫంక్షన్ ఉన్నా నగరంలోని తమ వారి ద్వారా వస్తువులు, దుస్తులు, పిండి వంటలు, పూజ సామగ్రిని కార్గో సరీ్వసుల ద్వారా తెప్పించుకునేవారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల కార్గో సరీ్వస్‌లు పూర్తి స్థాయిలో కొనసాగకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వేళ ఇక్కడి నుంచి ఎవరైనా పార్సిల్స్ పంపించాలన్నా చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇదివరకు ప్రతిరోజూ వేల సంఖ్యలో నగరం నుంచి అక్కడికి పార్సిల్స్ వెళ్లేవి. ఇతర దేశాలకు ఓకే.. అమెరికా, లండన్, యూరప్, ఆ్రస్టేలియా, ఇతర దేశాలకు నగరం నుంచి కార్గో సరీ్వసులు నిరాంటకంగా కొనసాగుతున్నా చార్జీలు మాత్రం పెరిగాయి. డెలివరీ టైమ్ కూడా ఎక్కువ పడుతోంది. గతంలో ఉన్న రేట్ల కంటే ప్రతి కేజీపై రూ 200–250 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అమెరికాకు 5 రోజుల్లో వెళ్లే పార్సిల్ ప్రస్తుతం 10–12 రోజులు పడుతోంది. యూకేకు కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా పార్సిల్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. పౌర సరఫరాల శాఖ కన్నెర్ర పౌర సరఫరాల శాఖ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి తనిఖీ బృందాలను రంగంలోకి దించింది. గ్యాస్ ఏజెన్సీలు కావాలని ‘నో స్టాక్’ బోర్డులు పెడితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. బుక్ అయిన 48 గంటల్లో డెలివరీ అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. -
మీకు తెలియని ఇరాన్ హిస్టరీ.. అమెరికాను చితక్కొడుతున్న ఎడారిదేశం
-
గణాంకాలు, ఫెడ్ సమీక్షపై దృష్టి
దేశ, విదేశీ గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష తదితరాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. అయితే ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను బలహీనపరచిన పశ్చిమాసియా యుద్ధం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. ముడిచమురు ధరల పెరుగుదల ప్రధానంగా ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తోంది. వెరసి మరోసారి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్ బ్రెంట్ చమురు బ్యారల్ లండన్ మార్కెట్లో గత వారం 102 డాలర్ల ఎగువకు చేరడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. ఇరాన్, యూఎస్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడం, హుర్ముజ్ మార్గంలో నౌకల రవాణాకు అంతరాయాలు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేయనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. ప్రధానంగా చమురు, గ్యాస్ సరఫరాల కొరత భారత్‌ను వేధిస్తోంది. నేడు(16న) చమురు ధరలు మరోసారి మండితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే వీలుంది. ఫెడ్ దారెటు? ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలను బుధవారం(18న) ప్రకటించనుంది. గత పాలసీ సమీక్షలో యథాతథ వడ్డీ రేట్ల అమలుకే కట్టుబడింది. దీంతో ఫెడ్ రేట్లు 3.5–3.75% వద్దే కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి, ప్రయివేట్ రంగ ఉపాధి, చమురు నిల్వల గణాంకాలు సైతం ఈ వారం విడుదల కానున్నాయి. వీటికితోడు పశి్చమాసియా యుద్ధం, ధరల పెరుగుదల తదితర అంశాలను ఫెడ్ పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆర్ధికవేత్తలు తెలియజేశారు. దేశీయంగా.. దేశీయంగా గత నెల రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 10 నెలల గరిష్టం 3.21 శాతాన్ని తాకింది. నేడు టోకు ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో డబ్ల్యూపీఐ 1.81 శాతం పెరిగింది. ఫిబ్రవరి నెలకు వాణిజ్య గణాంకాలు సైతం విడులకానున్నాయి. కాగా.. బ్రెంట్ చమురు 101 డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు పెరగనుంది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సైతం బలహీనపడుతోంది. యుద్ధం కొనసాగితే చమురు, గ్యాస్ కొరత పెరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.సాంకేతికంగా చూస్తే ఈ వారం .. యుద్ధ భయాలు, చమురు ఆందోళనలు ఈ వారం సైతం మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి విశ్లేషణ ప్రకారం మార్కెట్లు మరింత బలహీనపడే అవకాశముంది. ⇒ ఎన్ఎస్ఈ నిఫ్టీ 22,800–22,600 పాయింట్లవరకూ నీరసించవచ్చు. ఇక్కడి నుంచి బలపడకుంటే 22,200–22,100 పాయింట్లవరకూ పతనంకావచ్చు. ఒకవేళ బలాన్ని పుంజుకుంటే 23,700–23,900 పాయింట్ల వద్ద అవరోధాలు ఎదురయ్యే వీలుంది. 24,000 పాయింట్లు దాటితే మరింత పుంజుకోవచ్చు.గత వారం పతన బాటలోపశ్చిమాసియా యుద్ధం, చమురు ధరలు, రూపాయి క్షీణత ప్రభావంతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నికరంగా సెన్సెక్స్ 4,355 పాయింట్లు(5.5 శాతం) పతనమై 74,564 వద్ద ముగిసింది. నిఫ్టీ 1,299 పాయింట్లు(5.3 శాతం) కోల్పోయి 23,151 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 4 శాతం స్థాయిలో క్షీణించాయి. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే సెన్సెక్స్ 6,723 పాయింట్లు(8.3 శాతం) పడిపోయింది. బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 34 లక్షల కోట్లకుపైగా ఆవిరైంది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుపశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఈ నెల ప్రారంభం నుంచీ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో నికరంగా రూ. 52,704 కోట్ల(5.73 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా గత 17 నెలల్లోనే అత్యధిక పెట్టుబడులు చేపట్టారు. అయితే చమురు ధరలు, యుద్ధ భయాలతో ఈ నెల నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. -
యుద్ధమంటే...
యుద్ధమంటే... పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం; నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం; ఏళ్ల తరబడిగా సాఫీగా సాగుతున్న జనజీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం; యుద్ధ మంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకారబంధురమైపోవడం! మనిషి ఎక్కువకాలం శాంతికి దగ్గరగానూ, యుద్ధానికి దూరంగానూ ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే; కానీ ఏ దుర్ఘడియలోనో ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే; మనిషిని పట్టి పీడించే శాపమూ అదే! యుద్ధంలో విజితులూ, విజేతలూ ఉండరనీ, చివరికి అందరూ పరాజితులే అవుతా రనీ అతనికి తెలియదా, తెలుసు! రెండువైపులా చచ్చినవాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం ఒక్కలానే ఉంటుందనీ తెలుసు. కానీ ఉన్మాదం... ఉన్మాదం... తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది ఆర్థిక, వాణిజ్య సంబంధాలూ, వలసలూ, రవాణా సదుపాయాలూ, శాస్త్రసాంకేతికవృద్ధీ దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో... మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచస్థాయి నందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడీ, ఆందోళనా రేపుతున్నాయి. సహజవాయు లభ్యతకు అంత రాయం ఏర్పడి, వంటగ్యాస్ సరఫరా మందగించడంతో హాహాకారాలు చెలరేగు తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతన్న ప్రశ్న గుండెల్ని గునపంలా గుచ్చుతోంది. చిన్నా, పెద్దా హోటళ్ళు మూతపడి సిబ్బంది వీథిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుఃస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాస్ ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదమూ తలెత్తింది. అలాగని, వెనకటి కట్టెల అడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళ గలమా, కాలాన్ని వెనక్కి తిప్పగలమా, ఇన్నేళ్ళ గతినీ ప్రగతినీ కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం?! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. యుద్ధమంటే చావుబతుకులు చెట్టపట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకీ, బతుక్కీ తేడా కనిపించని నిర్లిప్తక్షణం. ప్రియకౌగిలికీ, మృత్యు ఆలింగనానికీ మధ్య నిత్యసంచారం. లియో తొలుస్తాయ్ ‘వార్ అండ్ పీస్’ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఎడతెగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్ళకు కడతాడు. ఆపైన రామాయణ, మహాభారతాల ఉదాహరణాలూ మన ముందు ఉన్నాయి. ‘తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా, సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధమెందుకు కొనితెచ్చుకున్నావు; భర్తా, కొడుకూ, బంధువులూ చచ్చిన తర్వాత జీవచ్ఛవంలా ఎలా బతక’నంటూ రావణుడి మీదపడి మండోదరి గుండెలవిసేలా రోదిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే! యుద్ధప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్యప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోకవిహ్వ లత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు ‘స్త్రీపర్వం’ పేరిట తల్లుల శోకా నికి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు; అందులో, నూరుగురు కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత పడుతున్న గాంధారిని నాయిక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖవివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడూ వణికిపోతాడు. ‘తల్లీ! నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే! నన్ను శపించు!! ’ అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతణ్ణి మన్నిస్తూనే, పాండవపక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం భోరున విలపించిన గాంధారిని యావత్ సృష్టిలోని మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అయినా యుద్ధం కలిగించే మోహ, దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు; ఆత్మవిధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు; నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోకపర్వాలకు రూపుదిద్దబోతోందో! ఈ అగ్నిగుండం ఎప్పటికి ఆరనుందో!! -
పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలతో అమెరికాలో మధ్యంతర ఎన్నిక
-
డెడ్లీ వార్.. మూడో ప్రపంచ యుద్ధం.. మొదలైనట్టేనా?
-
నెతన్యాహును వేటాడి హతమార్చుతాం: ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. -
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
-
దద్దరిల్లిన ‘ఖర్గ్’
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలనే గాక ఆ దేశంతో సంబంధమున్న చమురు వ్యవస్థలన్నింటినీ ఇకపై లక్ష్యం చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. తమపై అమెరికా దాడులకు ఉపయోగపడుతున్న గల్ఫ్ నగరాలన్నింటిపైనా ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.అమెరికా సేనలు మోహరించిన ప్రదేశాల నుంచి పౌరులంతా తక్షణం వెళ్లిపోవాలని సూచించింది! మరోవైపు ఖర్గ్పై భూతల దాడులకు కూడా అమెరికా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2,500 మందితో కూడిన నావికా దళాన్ని, మరిన్ని ఆంఫీబియస్ యుద్ధ నౌకలను హుటాహుటిన గల్ఫ్‌కు తరలిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీటికి తోడు ఇరాన్‌తో యుద్ధం నిర్ణాయక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిధి మరింతగా విస్తరించడం ఖాయమని, తద్వారా మరింత జనహననం, ఆస్తి నష్టం తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు వ్యవస్థలు బుగ్గే: ట్రంప్ఇరాన్ చమురు నెట్‌వర్క్‌కు జీవనాడి వంటి ఖర్గ్ దీవిపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు దిగింది. అక్కడ పదులకొద్దీ సంఖ్యలో భారీ పేలుళ్లు విని్పంచాయి. సముద్రంలో అమర్చే మందుపాతరల నిల్వ కేంద్రం, క్షిపణి నిల్వ కేంద్రం, బంకర్లతో పాటు మొత్తం 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. దీవిలోని కీలకమైన సైనిక స్థావరాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే కీలకమైన చమురు వ్యవస్థల జోలికి మాత్రం పోలేదని తెలిపారు.హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని ఇరాన్ నిరోధిస్తే వాటిని కూడా తుడిచి పెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టులు చేశారు. జపాన్ నుంచి తక్షణం పశ్చిమాసియాకు తరలాలంటూ 31వ మరీన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్, యాంఫిబియస్ షిప్ యూఎస్ఎస్ ట్రిపోలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. యూఎస్ఎస్ అబ్రహంలింకన్తో పాటు అమెరికా ఇప్పటికే 12 యుద్ధ నౌకలను, 8 డి్రస్టాయర్లను గల్ఫ్‌లో మోహరించింది. అమెరికా దాడిలో ఖర్గ్‌లోని తమ చమురు వ్యవస్థలకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఇరాన్ పేర్కొంది.ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, నావల్ బేస్, విమానాశ్రయ కంట్రోల్ టవర్, ఒక చమురు కంపెనీ తాలూకు హెలికాప్టర్ హ్యాంగర్‌పై దాడులు జరిగినట్టు తెలిపింది. శనివారం ఇరాన్లో 200 పై చిలుకు లక్ష్యాలను తుడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిలో క్షిపణి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలున్నట్టు తెలిపింది. అయితే ఖర్గ్ నుంచి చమురు ఎగుమతులు నిర్నిరోధంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. లెబనాన్‌లో మృతులు 826 మంది లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బీరూట్, శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 826 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వారిలో 31 మంది వైద్య సిబ్బందేనని తెలిపింది. దాడుల తీవ్రతకు ఐదు ఆస్పత్రులను మూసేయాల్సి వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. మొజ్తబాపై 92 కోట్ల రివార్డు ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ జాడ తెలిపిన వారికి కోటి డాలర్ల (రూ.92.5 కోట్ల) రివార్డును అమెరికా ప్రకటించింది. విదేశాంగ శాఖ ఎక్స్‌లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ చీఫ్ అలీ హస్గర్ హెజాజీ, భద్రతా విభాగం ఉన్నతాధికారి అల లరిజానీ తదితరుల పేర్లను కూడా పేర్కొంది. వాళ్లకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన పారితోíÙకంతో పాటు పునరావాసం కూడా కలి్పస్తామని పేర్కొంది.గల్ఫ్‌పై క్షిపణుల వర్షంఖర్గ్పై అమెరికా దాడులకు తమ ప్రతీకారం ఊహించని స్థాయిలో ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. కనీవిని ఎరుగని రీతిలో పూర్తిస్థాయి దాడులకు దిగుతామన్నారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడుల తీవ్రతను ఇరాన్ యథాతథంగా కొనసాగించింది. శనివారమంతా వాటిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌పై క్షిపణి దాడికి దిగింది. తీవ్ర నష్టానికి సంకేతంగా అక్కడినుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.ఇరాన్ డ్రోన్ దాడిలో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వెలువడే పొగలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బ్యాంకులు, ఇతర వ్యవస్థలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. దుబాయ్‌లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, పుజైరా నౌకాశ్రయాలను విడిచి వెళ్లాల్సిందిగా సిబ్బందిని, ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాటిపైనా భారీ దాడులు తప్పవని భావిస్తున్నారు. 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.నిమిషాల్లో 1,430 క్షిపణులు! ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా దాడితో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది! ఇజ్రాయెల్ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్ డేవిడ్ ఆడొమ్ దీన్ని ధ్రువీకరించారు. ఈలట్ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.హార్మూజ్‌కు యుద్ధనౌకలు పంపండి ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తిహార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని చెప్పారు. హార్మూజ్‌ను త్వరలో తెరిపించి అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.గల్ఫ్ దేశాలపై దాడులొద్దు ఇరాన్‌కు హమాస్ పిలుపు గల్ఫ్ దేశాలపై దాడులకు ఇరాన్ స్వస్తి పలకాలని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ విజ్ఞప్తి చేసింది! పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలని హితవు పలికింది. యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలని కూడా పిలుపునిచి్చంది. ఇరాన్‌కు హమాస్ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే. దానికి ఇరాన్ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది. హమాస్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.మరో ఐదు విమానాలను నష్టపోయిన అమెరికా! ఇరాన్ దాడుల్లో అమెరికా గత రెండు రోజుల్లో మరో ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలను నష్టపోయినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు కేసీ–135 స్ట్రాటో ట్యాంకర్ రీ ఫ్యూయలింగ్ విమానాలకు భారీ నష్టం వాటిల్లినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టారని ఇద్దరు అమెరికా సైనికాధికారులను ఉటంకిస్తూ కథనం వెలువరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా ఓటమిని కోరుకునే కొన్ని పనికిమాలిన మీడియా సంస్థల దిగజారుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ‘‘నాలుగు విమానాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇరాన్‌పై దాడుల్లో అవి చురుగ్గా పాల్గొంటున్నాయి. ఒక్క రీ ఫ్యూయలింగ్ విమానానికి స్వల్ప నష్టం జరిగింది. మా సైన్యం దానికి వెంటనే మరమ్మతు చేసింది కూడా’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు.. యుద్ధ ప్రభావం
-
ఇరాన్ గుండెపై అమెరికా మిస్సైల్స్
-
వామ్మో... ఏంటి ఈ రేట్లు! 1KG టమాటా రూ.250... 1KG ఉల్లిపాయ రూ.175
-
పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?
పిల్లలూ... పేపర్లలో, న్యూస్పేపర్లలో యుద్ధాలు చూస్తున్నాం. ఈ యుద్ధాలు పైకి ఏ కారణంతో జరిగినా చాలా మటుకు వీటి వెనుక ‘పెట్రోల్’ ఉంటుంది. పెట్రోల్ ప్రపంచానికి చాలా ముఖ్యమైన ఇంధనం. అది కొన్నిచోట్లే దొరుకుతుంది. అందుకని దాని కోసం చాలా పోరాటాలు సాగుతూ ఉంటాయి. మనం రోజూ బయటకు వెళ్లాలంటే ఏదో ఒక వాహనం కావాలి. అది నడవాలంటే పెట్రోల్ కావాల్సిందే! రోజూ లక్షలాది కార్లు, మోటార్ సైకిళ్ళు, యంత్రాలు పెట్రోల్ సాయంతో నడుస్తాయి. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం మహాసముద్రాలలో పెట్రోల్ నిక్షేపాలు ఏర్పడ్డాయి. ΄ప్లాంక్టన్, ఆల్కే వంటి చిన్న సముద్ర జీవులు మహాసముద్రాలలో నివసించేవి. ఈ జీవులు చనిపోయినప్పుడు, వాటి అవశేషాలు సముద్రపు అడుగుభాగంలో మునిగిపోయాయి. కాలక్రమేణా ఈ పదార్థాలు సముద్రపు అడుగుభాగంలోని బురద, ఇసుక అవక్షేపాలతో కలిసిపోయాయి. ఆ పోరలు మరింతగా పేరుకుపోవడంతో అవశేషాలు భూమి ఉపరితలం కింద మరింత లోతుగా ఏర్పడ్డాయి. అలా ఇంధన నిక్షేపాలు తయారయ్యాయి. భౌగోళిక పరిస్థితులను బట్టి, పెట్రోల్ ఏర్పడటానికి దారితీసే ముడి చమురు ఏర్పడటానికి 10 మిలియన్ల నుండి 300 మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చు. అయితే పెట్రోల్ నేరుగా తయారు కాదు. భూమి అడుగులోని ముడిసరుకును బయటకు తీసి, కర్మాగారాల్లో దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్‌గా మారుస్తారు. కొన్ని దేశాలలో పెట్రోల్‌ని ‘గ్యాసోలిన్’ అని కూడా పిలుస్తారు. కార్బన్ డై ఆక్సైడ్ నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇది సాధ్యమైతే పెట్రోల్ ఇబ్బందులు తప్పుతాయి. ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్తు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఛార్జ్ చేసి వాడటం ద్వారా పెట్రోల్ ఖర్చు తగ్గించడంతోపాటు పర్యావరణానికీ మేలు కలుగుతుంది. -
ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...
-
డోస్ పెంచిన అమెరికా.. పశ్చిమాసియాకు భారీగా బలగాలు
-
ఐదుగురు భారతీయులు మృతి: విదేశాంగ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. -
ట్రంప్ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇరాన్ ఆర్థిక రాజధానిగా భావించే ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా సైన్యం విరుచుకుపడింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు నిర్వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.సైనిక స్థావరాలు ధ్వంసం‘పశ్చిమాసియా చరిత్రలోనే అత్యంత భారీ బాంబు దాడులను మా సైన్యం చేపట్టింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశాం’ అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఒక వ్యూహాత్మక నిర్ణయంతో అక్కడి చమురు మౌలిక సదుపాయాలను ప్రస్తుతానికి ధ్వంసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం ఈ దీవి నుంచే సరఫరా అవుతుంది. రోజుకు సుమారు 70 లక్షల బారెళ్ల సామర్థ్యం కలిగిన ఈ కేంద్రంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలుతుందనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధిపై హెచ్చరికవ్యాపార నౌకల రాకపోకలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ‘ఒకవేళ హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అడ్డుతగిలితే, చమురు క్షేత్రాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు’ అని ఆయన హెచ్చరించారు. యుద్ధ ట్యాంకర్లకు రక్షణగా త్వరలోనే అమెరికా నౌకాదళం కాపలాగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.‘ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తాం’పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అమెరికా అదనంగా 2,500 మంది మెరైన్ సైనికులను, మూడు అత్యాధునిక యుద్ధ నౌకలను యుద్దప్రాంతానికి పంపింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. మరోవైపు హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇది కూడా చదవండి: సిలిండర్లు దాచారో.. జైలుకే! -
ఒక్క రోజులో 10 లక్షల కోట్లు ఆవిరి కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
ఇస్లామిక్ ప్రభుత్వ మద్దతు ర్యాలీలో టెహ్రాన్‌పై బాంబుల వర్షం..
-
అగ్నిగుండంలా పశ్చిమాసియా.. ఇరాన్ పై రెచ్చిపోయిన ఇజ్రాయెల్
-
చాకచక్యంగా హార్ముజ్ దాటి ముంబై చేరిన తొలి నౌక
-
ఇరాన్ వార్.. ఇండక్షన్ విప్లవం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అంతకంతకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయుల వంటగది ముఖచిత్రాన్ని మార్చివేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మున్ముందు ఎల్పీజీ (LPG) సరఫరాకు విఘాతం కలగవచ్చనే భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఒక సరికొత్త ‘ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికింది. గ్యాస్ సిలిండర్ల కొరత భయం సామాన్యుడిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తున్నది. ఈ నేపధ్యంలో గత రెండు రోజుల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.హాట్ కేకుల్లా ఇండక్షన్ స్టౌలుయుద్ధం పశ్చిమాసియాలో జరుగుతుంటే, ఆ సెగ భారతీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. గత 48 గంటల్లో ఇండక్షన్ స్టౌల విక్రయాలు ఏకంగా 30 రెట్లు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో కూడా ఇండక్షన్ స్టౌల ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికోసం జనం ఎంతలా ఎగబడుతున్నారంటే, ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అయిపోయి ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు, మెసేజ్‌లు కనిపిస్తున్నాయి. కేవలం ఇండక్షన్ స్టౌలే కాకుండా, రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్ల అమ్మకాలు కూడా నాలుగు రెట్లు పెరగడం విశేషం.బ్లాక్ మార్కెట్ దందాయుద్ధ భయాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అక్రమార్కులు గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, సామాన్యుడిని నిలువునా దోచేస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో గృహ అవసరాల సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో ఏకంగా ₹1,800 కి చేరగా, మధ్యప్రదేశ్‌లో కమర్షియల్ సిలిండర్ ధర ₹4,000 పలుకుతోంది. ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధరల సెగ కంటే ఎలక్ట్రిక్ వంట సురక్షితమని భావిస్తున్న గృహిణులు, స్టార్ హోటళ్ల నిర్వాహకులు కూడా ఇప్పుడు ఇండక్షన్ కుకింగ్నే ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా..భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా ఇండక్షన్ స్టౌల వినియోగం పెరుగుతోంది. ఇంధన భద్రతపై ఆందోళనలు ఉన్న అనేక దేశాల్లో ప్రజలు గ్యాస్ ఆధారిత వంట నుంచి ఎలక్ట్రిక్ వంట వైపు మళ్లుతున్నారు. ఐరోపా దేశాల్లో ఇప్పటికే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించే దిశగా ప్రజలు ఇండక్షన్ స్టౌలను ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. ఇతర ఆసియా దేశాల్లోని ప్రజల కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఎలక్ట్రిక్ వంట పరికరాలవైపు దృష్టి సారిస్తున్నారు.పొదుపుతో కూడిన భవిష్యత్తుప్రస్తుతం మార్కెట్లో బేసిక్ ఇండక్షన్ స్టౌలు ₹1,200 నుండి లభిస్తుండగా, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఎలక్ట్రిక్ కుక్కర్లు ₹14,000 వరకు అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్‌ల వినియోగాన్ని సమయం, డబ్బు ఆదా చేసేదిగా వినియోగదారులు గుర్తిస్తున్నారు. యుద్ధ భయం ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో సంప్రదాయ గ్యాస్ స్టౌల స్థానాన్ని స్మార్ట్ ఎలక్ట్రిక్ పరికరాలు పూర్తిగా ఆక్రమించే అవకాశం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ద్రవిడ కోటలో టీవీకే గర్జన.. షాకిస్తున్న సర్వే ఫలితాలు -
యుద్ధం ముగించాలి.. లేదా..! ట్రంప్ కు రాండ్ పాల్ హెచ్చరిక
-
మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన
-
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం 14వ రోజుకు చేరింది. పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర మలుపు తిరుగుతోంది. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ, రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి. -
హార్మూజ్ జలసంధిలో భీకర యుద్ధం.. మందుపాతరలు అమర్చిన ఇరాన్
-
రెండు నౌకలపై ఇరాన్ దాడి
న్యూఢిల్లీ: తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ సైతం దీటుగా స్పందిస్తూ అమెరికా తదితర ఇతర దేశాల నౌకలపై దాడులుచేస్తోంది. బుధవారం రాత్రి ఇరాక్‌లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. అతడిని భారతీయునిగా గుర్తించామని ఇరాక్‌లోని భారతీయ రాయబార కార్యాలయం గురువారం తమ సామాజికమాధ్య ఖాతాలో ఒక పోస్ట్పెట్టింది. అతని స్వరాష్ట్రం, కుటుంబం వంటి ఇతర వివరాలు ఏవీ ఇంకా తెలియరాలేదు. మంటల్లో చిక్కుకున్న ఆ నౌక నుంచి 27 మంది సిబ్బందిని ఎలాగోలా కాపాడారు.గాయపడిన వారిని సమీపంలోని బస్రా నగరంలోని ఆస్పత్రిలో చేరి్పంచి వైద్యం అందిస్తున్నారు. నౌకలోని 27 మంది సిబ్బందిలో 15 మంది భారతీయులేనని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఈ నౌకతోపాటు సమీపంలోని మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక మీదా ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. పేలుడుపదార్థాలతో దూసుకొచ్చి సూసైడ్ బోట్లు ఢీకొనడంతో పేలుళ్లు జరిగి సేఫ్సీ విష్ణు, జిఫిరోస్ నౌకలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.ఈ రెండు నౌకలు మొత్తంగా 4,00,000 బ్యారెళ్ల ముడిచమురును ఇరాక్ నుంచి తీసుకొస్తున్నట్లు షిప్‌ల ట్రాకింగ్ వెబ్సైట్ అయిన ‘ట్యాంకర్‌ట్రాకర్స్.కామ్’వెల్లడించింది. అమెరికాకు చెందిన సేఫ్సీ ట్రాన్స్పోర్ట్ ఐఎన్‌సీ సంస్థ ‘సేఫ్సీ విష్ణు’నౌకను నిర్వహిస్తోంది. 228.6 మీటర్ల పొడవు, 32.57 మీటర్ల వెడల్పయిన సేఫ్సీ విష్ణు నౌకను 2007లో తయారుచేశారు. గరిష్టంగా దాదాపు 74,000 టన్నుల బరువైన సరకులను ఇది మోసుకెళ్లగలదు. జిఫిరోస్ను గ్రీస్‌కు చెందిన సంస్థ నిర్వహిస్తోంది. -
యుద్ధ కల్లోలం
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో ఎడతెరిపిలేని యుద్ధం ధాటికి చమురు మంట మండుతోంది. విదేశీ చమురు రవాణా నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఫలితంగా బ్యారెల్ ముడి చమురు ధర గురువారం 100 డాలర్లు దాటేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 38 శాతం పెరిగింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేసి, దాడులు ఆపకపోతే బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరడం తథ్యమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తుండడం, చమురు మంటలు మరింత పెరగడమే తప్ప ఇప్పట్లో చల్లారే సంకేతాలు లేకపోవడం ప్రపంచ దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్మూజ్‌ను దిగ్బంధించడం ద్వారా ప్రపంచదేశాలపై.. ముఖ్యంగా అమెరికాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వైమానిక దాడుల్లో వందలాది మంది చిన్నారులు సహా సాధారణ ప్రజలు బలైపోవడం పట్ల ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. తమ బిడ్డల మరణాలకు ప్రతీకారం తీర్చుకోక తప్పదని తేల్చిచెప్పారు. శత్రుదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా–ఇజ్రాయెల్‌లకు కొత్త ఆఫర్ ఇచ్చారు. మూడు షరతులకు అంగీకరిస్తే తాము దాడులు ఆపేస్తామని చెప్పారు. ముడి చమురు నౌక షెన్లాంగ్ సూయిజ్‌మ్యాక్స్ హార్మూజ్ నుంచి సాహసోపేతంగా ముంబైకి చేరుకుంది. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలైన ‘సీమైన్స్’కు చిక్కకుండా క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవడం సంచలనాత్మకంగా మారింది. యుద్ధం వల్ల చమురు ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచదేశాలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాయి. చమురు వినియోగంపై పరిమితులు విధిస్తున్నాయి. బుధవారం రాత్రి ఇరాక్‌లో ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న అమెరికా ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. అమెరికా చమురు నౌకలను టార్గెట్ చేశామని, బ్యారెల్ ముడి చమురు ధర త్వరలో 200 డాలర్లకు చేరబోతోందని ఇరాన్ మిలటరీ కమాండ్ ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫాఖారీ స్పష్టంచేశారు. భద్రతా మండలి తీర్మానం బేఖాతర్ ఇరాన్ యుద్ధం గురువారం పదమూడో రోజుకు చేరుకుంది. దాడులు ప్రతిదాడులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ దేశాలే లక్ష్యంగా ఇరాన్ సైన్యం బాంబుల మోత మోగించింది. దుబాయ్ తీరంలో కంటైనర్ నౌకపై దాడికి దిగింది. నౌక మంటల్లో చిక్కుకోగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్న ముహరాఖ్ ద్వీపాన్ని సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. క్షిపణి దాడుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియాలోని అతిపెద్ద షెబా చమురు క్షేత్రంపై డ్రోన్‌ను ప్రయోగించింది. రాజధాని రియాద్‌లో దౌత్యవేత్తల భవనంపై ఇరాన్ ప్రయోగించిన డ్రోన్‌ను మధ్యలోనే ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. పర్షియన్ గల్ఫ్‌లోని బస్రా పోర్టుపైనా ఇరాన్ దాడికి దిగడంతో ఇరాక్‌లోని చమురు కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. గల్ఫ్‌లో దాడులు ఆపాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. కువైట్‌తోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఎప్పటిలాగే క్షిపణులు ప్రయోగించింది. యూఏఈలోని బ్యాంకులపై దాడులు జరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుంచే పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కువైట్‌లో ఓ భవనాన్ని ఇరాన్ క్షిపణి తాకడంతో ఇద్దరు గాయపడ్డారు. 200 రాకెట్లు ప్రయోగించిన హెజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. హెజ్బొల్లా మిలిటెంట్లు లెబనాన్ భూభాగం నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌పై 200 రాకెట్లు ప్రయోగించారు. మరోవైపు ఇరాన్ క్షిపణులను తాము మధ్యలోనే ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. రాజధాని జెరూసలేంలో తెల్లవారుజామున సైరన్లు, భారీ శబ్దాల మోత వినిపించింది. జనం షెల్టర్లలో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై విస్తృత స్థాయి దాడులకు శ్రీకారం చుట్టింది. లెబనాన్‌లో ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా గ్రూప్‌ను క్షిపణులతో టార్గెట్ చేసింది. గురువారం జరిగిన రెండు దాడుల్లో 11 మంది సాధారణ ప్రజలు మరణించారు. లెబనాన్ రాజధాని బీరూట్లోజరిగిన దాడిలో 8 మంది మృతిచెందగా, 31 మంది క్షతగాత్రులయ్యారు. అరామైన్ టౌన్‌పై దాడిలో ముగ్గురు మృతి చెందారు. పేలుళ్ల శబ్దాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ చమురుకు ఆయువుపట్టు లాంటి ఖర్గ్ ఐలాండ్‌పై దాడికి అమెరికా సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే దురాక్రమణదారుల రక్తం పర్షియల్ గల్ఫ్‌లో ఏరులై పారుతుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఖలిబాఫ్ హెచ్చరించారు. తమ దీవుల జోలికి రావొద్దని అన్నారు. లెబనాన్‌లో 634కి చేరిన మృతులుఇజ్రాయెల్ దాడులతో లెబనాన్‌లో మృతుల సంఖ్య 634కు చేరినట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో 7.59 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలియజేసింది. అయితే, లెబనాన్‌లో 1,300 మందికిపైగా మరణించారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో 12 మంది, గల్ఫ్‌లో ఏడుగురు అమెరికా జవాన్లు మృతి చెందారు.పెజెష్కియాన్ మూడు షరతులు పశ్చిమాసియాలో యుద్ధం ఆగాలంటే స్పష్టమైన మార్గం ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. మూడు షరతులకు అంగీకరిస్తే దాడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో శాంతికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతూ ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు తెలిపారు. ఇరాన్ దేశ చట్టబద్ధమైన హక్కులను గౌరవించాలని, ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించాలని, తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణ జరగకుండా అంతర్జాతీయ గ్యారంటీలు కావాలని పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రతీకారానికి సిద్ధం అంటూ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రతిజ్ఞ చేయగా, అధ్యక్షుడు పెజెష్కియాన్ అందుకు భిన్నమైన స్వరం వినిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, యుద్ధంలో ఇరాన్ ఇప్పటికే పరాజయం పాలయ్యిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ఈ యుద్ధాన్ని ముగిస్తానని అన్నారు. ఇరాన్ యుద్ధం అమెరికాకు ఆర్థికంగా మోయలేని భారంగా మారుతోంది. యుద్ధం వల్ల మొదటి వారంలోనే 11.3 బిలియన్ డాలర్లు(రూ.1.04 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ ప్రకటించింది. మొజ్తబా ఖమేనీ యుద్ధ శంఖారావం యుద్ధం ఆపే ప్రసక్తే లేదని, గల్ఫ్ దేశాలపై దాడులు ఉధృతం చేయబోతున్నామని ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా మొజ్తబా ఖమేనీ(56) తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను ఇరాన్లో టీవీ న్యూస్ చానళ్లలో చదివి వినిపించారు. ఖమేనీ మాత్రం తెరపై కనిపించలేదు. తమ ప్రజలను బలి తీసుకున్న అమెరికా, ఇజ్రాయెల్‌లపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుందని సంకేతాలిచ్చారు. హార్మూజ్ జలసంధి నుంచి నౌకలను అనుమతించబోమని ఖమేనీ చెప్పడాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెచ్చరిల్లడం ఖాయమని స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్–అమెరికా వైమానిక దాడిలో తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీతోపాటు తన భార్య, తన సోదరి, మేనకోడలు, మరో సోదరి భర్త మరణించిన సంగతి నిజమేనని తెలిపారు. తన తండ్రి మృతదేహాన్ని చూశానని అన్నారు. తనను సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసిన విషయాన్ని టీవీలో చూశానని వెల్లడించారు. ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజలకు దర్శనమివ్వలేదు. -
కష్టంగా ఉందమ్మా... కాస్త సర్దండి
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో చదువుతున్న పిల్లల నుంచి ఫోన్లు వస్తే సంతోషపడిపోయే మధ్య తరగతి తల్లిదండ్రులు ఇప్పుడు హడలి పోతున్నారు. తీవ్రంగా కలవర పడుతున్నారు. ఏం చెబుతారోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కష్టంగా ఉందని, ఎంతోకొంత సర్దమని బేలగా మాట్లాడు తుండటంతో అల్లాడిపోతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. జీవన వ్యయం భారీగా పెరిగింది. తాత్కాలిక ఉపాధి దొరకడం కూడా కష్టమవుతోందని విద్యార్తులు చెబుతున్నారు. అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని సమాచారం. యుద్ధం కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇంటి అద్దెలూ ఎక్కువగా వసూలు చేస్తున్నారని యూఎస్‌లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యూనివర్సిటీలు, అధికార యంత్రాంగం.. విద్యార్థులపై, వారి సామాజిక మాధ్యమాలపై అనుక్షణం నిఘా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ముమ్మర తనిఖీలు కొనసాగుతుండటంతో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయలేకపోతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. చదువులూ అంతంత మాత్రమే విదేశీ విద్యార్థులు అందిస్తున్న సమాచారం మేరకు యుద్ధం నేపథ్యంలో చదువులు సైతం సరిగా సాగడం లేదు. కొన్ని చోట్ల క్యాంపస్‌లు తాత్కాలికంగా మూసివేశారు. గల్ఫ్ దేశాల్లో ఆన్లైన్ క్లాసులకే పరిమితమవుతున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 2025 డేటా ప్రకారం 150 దేశాల్లో 18.8 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాదాపు 12.5 లక్షల మంది ఉన్నత విద్య చదువుతున్నారు. 6 లక్షల మంది పాఠశాల విద్యలో ఉన్నారు. యుద్ధ వాతావరణంలో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల్లో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. వైద్య విద్య కోసం వెళ్ళిన విద్యార్థులు తమను స్వదేశానికి పంపమంటూ వేడుకుంటున్నారు. అప్పులు తీర్చేదెలా? : లక్షల్లో అప్పు చేసి పిల్లలను విదేశీ చదువులకు పంపిన తల్లిదండ్రుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అప్పులు తీర్చలేక, విదేశాల్లో ఉన్న పిల్లలకు డబ్బులు పంపలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి ఫోన్ వచ్చిందంటే కంగారు పడిపోతున్నారు. క్షేమ సమాచారం తెలుసుకుంటూనే పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని అమ్మేసి పిల్లలకు పంపుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మెడిసిన్ తరగతులు జరగడం లేదు వైద్య విద్య కోసం ఇక్కడికి వచ్చా. తరగతులు జరగడం లేదు. యుద్ధం భయంతో నిద్రచీ కూడా పట్టడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. మా తల్లిదండ్రులూ కంగారు పడుతున్నారు. నిత్యావసరాల కోసం రెట్టింపు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. – పల్లవి సామంతుల (యూఏఈలో వరంగల్ వైద్య విద్యార్థి) ఏం చేయాలో పాలు పోవడం లేదు యుద్ధం కారణంగా ఇక్కడ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. తాత్కాలికంగా ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర్నుంచి డబ్బులు పంపమని అడగాలన్నా ఇబ్బందిగానే ఉంటోంది. ఏం చేయాలో తెలియడం లేదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉంటున్నాం. – నీలేష్ సుకుమార్ (అమెరికాలోని హైదరాబాద్ విద్యార్థి) పొలం అమ్మి డబ్బులు పంపా బాబు అమెరికాలో పడుతున్న అవస్థలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. యూఎస్‌కు పంపడానికి చేసిన అప్పు ఇప్పటికీ కడుతున్నాం. మరోవైపు యుద్ధం కారణంగా అక్కడ ఆర్థిక పరిస్థితి తారుమారైంది. దీంతో కొంత పొలం అమ్మేసి డబ్బులు పంపాల్సి వచ్చింది. – నీలకంఠం రామారావు(విద్యార్థి తండ్రి, మహబూబ్‌నగర్) -
రాష్ట్రంలో సిలిం‘డర్’!
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వల్ల పెట్రో ఉత్పత్తుల సరఫరాకు అంతరాయం కలుగుతుండటం, కేంద్రం ఆంక్షల నేపథ్యంలో.. రాష్ట్రంలో వాణిజ్య ఎల్పీజీ (కమర్షియల్ గ్యాస్) సిలిండర్ల కొరత తీవ్రరూపం దాల్చింది. గ్యాస్ ప్లాంట్లలో కమర్షియల్ సిలిండర్లను నింపే ప్రక్రియ ఆగిపోయింది. స్టార్ హోటళ్లు, పెద్ద రెస్టారెంట్లు, క్లబ్బుల నుంచి చిన్న టీ దుకాణాల వరకు గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఓ పది సిలిండర్లు సర్దండి’అంటూ గ్యాస్ ఏజెన్సీలను వేడుకుంటున్నా స్టాక్ లేదనే సమాధానమే వినిపిస్తోంది. ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా ఫలితం ఉండటం లేదు. దీంతో చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. స్టార్ హోటళ్ల యాజమాన్యాల్లో కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. హోటళ్లతో పాటు పారిశ్రామిక ఉత్పత్తులపై కూడా గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రాష్ట్రంలో వినియోగమయ్యే ఎల్పీజీ గ్యాస్‌లో గృహ వినియోగం, హోటళ్లు, బేకరీలు, స్వీట్ దుకాణాలలో వినియోగించే గ్యాస్‌తో పోలిస్తే పరిశ్రమలకు వినియోగించే గ్యాసే ఎక్కువ. వీటితో పాటు పాలు, వాటి అనుబంధ ఉత్పత్తులు సరఫరా చేసే డెయిరీల్లో కూడా ఎల్పీజీ గ్యాస్ మంటలు రేపుతోంది. ఈ కారణంగా పాల సేకరణ నిలిచిపోతే గ్రామీణ పాడి పరిశ్రమ తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూస్తామనే ప్రకటనలు తప్ప ఇతర వర్గాల గురించి పౌరసరఫరాల శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. హైదరాబాద్ నగర శివారులోని చర్లపల్లి ప్రాంతంలో భారత్, హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన మూడు ప్రధాన ఎల్పీజీ ఫిల్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీ అయిన గ్యాస్ సిలిండర్లన్నింటిలో ఎల్పీజీని ఇక్కడి నుంచే రీ ఫిల్లింగ్ చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీలు ఇచి్చన సూచనలతో చర్లపల్లిలో వాణిజ్య సిలిండర్లను ఫిల్ చేసే ప్రక్రియ దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పటికే ఉన్న స్టాక్‌ను కొద్దికొద్దిగా సర్దుతున్నారు. రోజుకు 2 వేల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు తీసుకునే ఏజెంట్‌కు 100 నుంచి 200 సిలిండర్లు ఇవ్వడం గగనంగా మారిందని అంబర్‌పేటకు చెందిన ఓ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. గృహ అవసరాలకు వాడే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో కమర్షియల్ సిలిండర్ల ఫిల్లింగ్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెపుతున్నారు. దీంతో వందలాది గ్యాస్ లారీలు ప్లాంట్ల వెలుపల కిలోమీటర్ల మేర బారులు తీరాయి. సిలిండర్లతో వచ్చిన ట్రక్కులు రోజుల తరబడి నిలిచిపోవడంతో డ్రైవర్లు, క్లీనర్లు రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగే పరిస్థితి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రోజుకు వేల టన్నుల ఎల్పీజీ వినియోగిస్తుంటాయి. నాచారం, ఉప్పల్, ఐడీఏ బొల్లారం, బాలానగర్, సనత్‌నగర్, కాటేదాన్, పటాన్‌చెరులలోని దాదాపు అన్ని పరిశ్రమలల్లో ఎల్పీజీ గ్యాస్ వినియోగం పెద్ద ఎత్తున ఉంటుంది. 19 కిలోల ఎల్పీజీ నుంచి 33, 47, 425, 450 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. భారీ పరిశ్రమలకు టన్నుల ఎల్పీజీతో కూడిన ట్యాంకర్ (బుల్లెట్)లను వినియోగిస్తారు. నగరంలోని బిస్కట్ కంపెనీలు, చాక్లెట్, పప్పు పాకెట్లు, మిఠాయిలు, తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు కూడా భారీగా గ్యాస్‌ను వినియోగిస్తున్నట్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. మొత్తం ఎల్పీజీ వినియోగంలో పరిశ్రమలు దాదాపు 40 శాతం వాటా కలిగి ఉన్నట్లు ఓ అంచనా. కాగా దీనిపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో నగరంలో సేవారంగం, ఉత్పత్తి, ఆహార రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కొన్ని పరిశ్రమలు ప్రైవేట్ గ్యాస్ కంపెనీలపై ఆధారపడుతున్నా అక్కడ కూడా సరఫరా పరిమితంగా ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. పాడి పరిశ్రమపై ప్రభావం! హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న పరిశ్రమలతో పాటు రాష్ట్రంలోని ప్రధానమైన పాల ఉత్పత్తి కేంద్రాలు, దానా తయారీ కేంద్రాలు చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సహకార రంగంలో ఉన్న విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు డెయిరీ, మదర్ డెయిరీ తదితరాలతో పాటు ప్రైవేటు రంగంలో కొన్ని పదుల సంఖ్యలో డెయిరీలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. గ్రామాల నుంచి పాలు సేకరించి, వాటిని శుద్ధి చేసి లక్షల లీటర్ల పాలను ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. పాల ప్రాసెసింగ్‌లో భాగంగా వేడి చేసేందుకు, పెరుగు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ప్రతిరోజు గ్యాస్ సిలిండర్లు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. కాగా గ్యాస్ అందుబాటులో లేకపోతే డెయిరీల్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రైవేట్ గ్యాస్ కంపెనీలకు బారులు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సరఫరా తగ్గిపోవడంతో హోటల్ యజమానులు, పరిశ్రమల నిర్వాహకులు ప్రైవేట్ ఎల్పీజీ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు రంగంలోని గో గ్యాస్, టోటల్, అజియాస్, సూపర్, స్ఫూర్తి, భాగ్యనగర్ గ్యాస్ వంటి ప్రైవేటు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ ధరను కిలో రూ.140కి పెంచాయి. 7వ తేదీకి ముందు ఇది రూ.104గా ఉంది. ఇక 21 కిలోల ప్రైవేటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.3 వేలు పలుకుతోంది. దీన్ని బ్లాక్‌లో రూ.5 వేలకు కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగంలోని మూడు కంపెనీల ఏజెన్సీలు కూడా బ్లాక్‌లో సిలిండర్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. కాగా దేవాలయాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాల తయారీపై కూడా గ్యాస్ కొరత ప్రభావం పడింది. హాస్పిటళ్లలో, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5కే భోజనం అందించే హరేకృష్ణ ఫౌండేషన్‌కు ప్రతిరోజు దాదాపు 100 సిలిండర్లు అవసరం. సిలిండర్ల సరఫరా లేకపోతే ఆ సంస్థకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. -
ఇరాన్ అదృశ్య ఆయుధం
-
అమెరికాకు ఇరాన్ షాక్: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి
వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 12 రోజులు గడుస్తున్న తరుణంలో, అగ్రరాజ్యానికి భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని అమెరికా మట్టుబెట్టినప్పటికీ, ఆ తర్వాత ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడులు అమెరికా రక్షణ వ్యవస్థలను కలవరపెడుతున్నాయి. గడిచిన 12 రోజుల్లో ఇరాన్ జరిపిన ఎదురుదాడుల్లో 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 140 మంది తీవ్రంగా గాయపడ్డారు.పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న 22కు పైగా సైనిక, విమానయాన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ వేల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. అమెరికాకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, 11 ప్రధాన సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, కువైట్‌లోని అలీ అల్ సలేం, బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఖతార్‌లోని ‘అల్ ఉదైద్’ ఎయిర్ బేస్ సైతం ఇరాన్ ప్రతీకారేచ్ఛ నుంచి తప్పించుకోలేకపోయింది. టర్కీలోని ఇంసిర్లిక్ వైమానిక కేంద్రంపైకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో దళాలు అడ్డుకున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తాము టర్కీపై దాడి చేయలేదని ఖండించడం గమనార్హం.సైనిక కేంద్రాలే కాకుండా, ఇరాన్ తన దాడులను అమెరికా రాయబార కార్యాలయాల వైపు మళ్లించింది. ఇజ్రాయెల్ సహా ఆరు దేశాల్లోని అమెరికా ఎంబసీలపై డ్రోన్ దాడులు జరిగాయి. కువైట్, ఇరాక్‌లోని కార్యాలయాలు స్వల్పంగా దెబ్బతినగా, భద్రతా కారణాల దృష్ట్యా ఆరు దేశాల్లోని దౌత్య కార్యాలయాలను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. ఈ యుద్ధంలో అమెరికా మూడు ఎఫ్-15ఈ (F-15E) స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలను కోల్పోయింది. అయితే ఇవి ఇరాన్ దాడుల్లో కాకుండా, కువైట్ వాయుసేన చేసిన పొరపాటు వల్ల కూలిపోవడం గమనార్హం. ఇరాన్ విమానాలుగా భ్రమపడి కువైట్ ఎఫ్-18 విమానాలు వీటిని పేల్చివేశాయి.వీటితో పాటు 11 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు కూడా ధ్వంసమయ్యాయి. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ. 250 కోట్లు కావడం గమనార్హం. మరోవైపు సుమారు రూ. 22 వేల కోట్ల విలువైన థాడ్ (THAAD) రక్షణ వ్యవస్థల్లోని రాడార్ కేంద్రాలను కూడా ఇరాన్ డ్రోన్లు విజయవంతంగా లక్ష్యం చేసుకున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా ఖజానాపై పెను భారం పడుతోంది. 'పొలిటికో' నివేదిక ప్రకారం, అగ్రరాజ్యం ఈ యుద్ధం కోసం రోజుకు సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 17 వేల కోట్లు) ఖర్చు చేస్తోంది. కేవలం మొదటి వారంలోనే రూ. 51 వేల కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఒకవైపు ఆయుధ సంపత్తి తరిగిపోతుండటం, మరోవైపు పెరుగుతున్న వ్యయం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ ప్రయోగించే చౌకైన 'షాహెద్' డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో నిరాకరించిన ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు అమెరికా కోరుతుండటం గమనార్హం.ఇది కూడా చదవండి: అమెరికాపై ఇరాన్ డ్రోన్ పంజా? -
యుద్ధ భయం.. లిక్విడ్ క్యాష్ దాచుకోవాలా? బ్యాంకులో రూ.40లక్షల కోట్లు మిస్సింగ్..!
-
యుద్ధం ఆపేస్తా అంటున్న కేఏ పాల్
-
సముద్రంలో కదిలే.. అమెరికా యుద్ధ కోట!
-
యుద్ధం మరింత భీకరం.. టార్గెట్ అమెరికా
-
క్షిపణుల వర్షం.. యుద్ధం తీవ్రం.. పశ్చిమాసియాలో సైరన్ల మోత
-
దాడులు ఉదృతం.. నేను రెడీ.. మీరు రెడీనా..?
-
పుతిన్‌కు ట్రంప్ ఫోన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి రష్యా అధినేత పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు సంభాషణ సాగింది. ఇరాన్–అమెరికా, ఉక్రెయిన్–రష్యా సంఘర్షణలపై ఇరువురు నేతలు చర్చించినట్లు రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభంతోపాటు ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం కొనసాగుతున్న మాస్కో–వాషింగ్టన్–కీవ్ చర్చలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు. ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ స్వేచ్ఛాయుతంగా, నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు.ఇరాన్లో జరుగుతున్న యుద్ధం పట్ల పుతిన్ తన అభిప్రాయాలు వ్యక్తంచేశారని, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తోపాటు గల్ఫ్ దేశాల నాయకులతో గతవారం జరిగిన చర్చల సారాంశాన్ని ట్రంప్‌కు పుతిన్ తెలియజేశారని చెప్పారు. ట్రంప్ సైతం తాజా పరిణామాలపై తన మనసులో మాటను పుతిన్‌తో పంచుకున్నారని స్పష్టంచేశారు. ఈ ఏడాది ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడుకోవడం ఇది 11వ సారి కావడం విశేషం. భారత్, చైనాలతోపాటు యూరప్‌లోని మిత్రదేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో ట్రంప్ ఫోన్లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు ఇరాన్‌పై యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందని తాను అంచనా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇరాన్‌పై గత పది రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని ‘స్వల్పకాలిక విహారయాత్ర’గా అభివర్ణించారు. ఆయన తాజాగా ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడారు. ఇరాన్లో ఇప్పటిదాకా 5,000 లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని వెల్లడించారు. త్వరలోనే యుద్ధం ముగిసి, సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న నమ్మకం ఉందన్నారు. చమురు సరఫరాను అడ్డుకుంటే ఖబడ్దార్ హొర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం కలిగిన పాలకులు ప్రపంచ దేశాలకు ఇబ్బందులు సృష్టిస్తామంటే సహించబోమని అన్నారు. చమురు సరఫరాను అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దని సూచించారు. హొర్మూజ్‌లో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా.. ఇప్పటిదాకా ఇరాన్ చేసిన దాడి కంటే 20 రెట్లు బలంగా ఆ దేశాన్ని దెబ్బకొడతామని తేల్చిచెప్పారు. హొర్మూజ్‌లో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, ఇది చైనాకు, ఇతర దేశాలకు తాము ఇస్తున్న బహుమతి అని వ్యాఖ్యానించారు. ఒక్క లీటర్ కూడా రవాణా చేయలేరు: ఇరాన్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) మంగళవారం ఘాటుగా స్పందించింది. హొర్మూజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ చమురు కూడా రవాణా చేయలేరని తేల్చిచెప్పింది. తమదేశంపై దాడులు ఇలాగే కొనసాగితే హొర్మూజ్ నుంచి చమురు రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టంచేసింది. -
తిప్పలు తప్పని యుద్ధం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం పదకొండో రోజుకు చేరుకోగా ‘ఇంకెంత... త్వరలోనే అది పరిసమాప్తమవుతుంద’ంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు మంగళవారం చేసిన ప్రకటనల్ని ఇరాన్ పరిహసించింది. కాల్పుల విరమణకూ, లేదా చర్చల పునఃప్రారంభానికీ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. చరిత్ర చెప్పే పాఠం గ్రహించకుండా దుందుడుకు పోకడలకు పోయిన ట్రంప్... మరిన్ని భీకర దాడులకు దిగితే ఇరాన్ సాష్టాంగపడుతుందని భ్రమపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ స్థావరానికి అరివీర భయంకర యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటున్న బి–52 బాంబర్లు చేరుకున్నాయని బ్రిటన్ మీడియా పతాక శీర్షికలతో గొంతు చించుకుంటోంది. కనుక అది చేసే విధ్వంసం కూడా అసాధారణమైనదే కావొచ్చు. కానీ సంకల్ప బలం దండిగా ఉన్న పక్షాన్ని ఇలాంటి విధ్వంసక శక్తి ఏమాత్రం లొంగదీయలేదు. జయాపజయాలను అంతిమంగా నిర్ణయించేది మనుగడ కోసం పోరాడే మనుషులే తప్ప యుద్ధక్షేత్రంలోని ఆయుధాలు కాదు. రెండు వేల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా ఎదుగుతున్న అప్పటి కార్తేజ్ నగరాన్ని ధ్వంసం చేయటానికి సాకులు వెతికేది. అది క్షీణించినా... అప్పటి రోమన్ సెనెటర్ కాటో ఏ సమస్యపై చర్చ మొదలెట్టినా కార్తేజ్‌పై.. కత్తిదూయటం అవసరమంటూ ప్రసంగం ముగించేవాడంటారు. కనీసం కార్తేజ్కు రోమ్పై దండయాత్ర చేసిన చరిత్రయినా ఉంది. కానీ ఇరాన్‌కు కనీసం ఆ నేపథ్యమైనా లేదు. అయినా అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ అకారణంగా దానిపై విరుచుకుపడటం అలవాటుగా చేసుకున్నాయి. నిరుడు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లకే ట్రంప్ అకారణంగా ఇరాన్‌పై 12 రోజులపాటు యుద్ధం సాగించారు. ఈసారి ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా బృందం ప్రకటించిన మర్నాడే దురాక్రమణకు పూనుకున్నారు. ఇరాన్ తదుపరి అధినేతను తానే నిర్ణయించగలనంటూ ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కష్టం కాకపోవచ్చు. కానీ అవి రెండూ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతినటం ఖాయం. యుద్ధం దుష్ప్రభావం స్టాక్ మార్కెట్ పల్టీలు దాటి సాధారణ జనజీవనంపై పడటం మొదలైంది. మన దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతబడ్డాయని వార్తలందుతున్నాయి. బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయి రైతాంగం నానాకష్టాలూ పడుతోంది. పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు కోటిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెసులుబాటు దొరికినా స్వస్థలాలకు చేరుకోవాలని ఆత్రుత పడుతున్నారు. హోర్మూజ్ జలసంధి దిగ్బంధంతో వందలాది చమురు, గ్యాస్ రవాణా నౌకలు నిలిచిపోగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కోత విధించటంతో బ్యారెల్ చమురు ధర దాదాపు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి... అంటే వంద డాలర్లకు చేరుకుని భయపెడుతోంది. అది 120 డాలర్లకు చేరుకుంటే తప్ప దేశంలో చమురు ధరలు పెరగబోవని కేంద్రం చెప్పటం స్వల్ప ఊరట.యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గుడ్లు తేలేయటం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాన్ని మరింత కుంగదీస్తుంది. పాశ్చాత్య దేశాలతో ఇప్పటికే దానికున్న పొరపొచ్చాలు పెరగటంతోపాటు పశ్చిమాసియ దేశాలు సైతం మునుపటి మాదిరి అమెరికాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చే అవకాశం లేదు. తమ దగ్గరున్న అమెరికా స్థావరాల పరిధులేమిటో, పరిమితులెలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. తాను శత్రువనుకున్న దేశంపై ఏకపక్షంగా దాడులు చేయటానికి అనుమతించబోవు. ‘ఇరాన్‌తో యుద్ధం అంతులేనిదీ, దీర్ఘకాలం సాగేదీ కాదు...’ అంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఆయనకు తెలియాల్సింది ఏమంటే... దాన్ని మొదలెట్టింది తామే అయినా ముగింపు నిర్ణయించేది ఇరాన్ మాత్రమే! -
కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్
-
యుద్ధం ఎఫెక్ట్... గ్యాస్కొరతతో హెటళ్లు బంద్
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు బంద్‌ను సైతం ప్రకటించాయి. ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ పరిస్థితి ఏలా ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుందా అయితే మరెందుకు ఆలస్యం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.ఇరాన్ యుద్దం ఎఫెక్ట్ భారత్‌పై ఇప్పుడిప్పుడే మొదలైంది. ప్రెట్రోల్, డీజీల్ ధరలపై ఈ ప్రభావం ఇప్పటికే పెద్దగా లేకపోయినా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో బెంగళూరులో వ్యాపారులు ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్ల బంద్‌ను పాటిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా 25 శాతానికి పైగా హోటళ్లు మూతపడ్డాయి. రేపటి నుంచి ఈ సంఖ్య 50 శాతానికి పెరిగినా ఆశ్చర్యం లేదని ముంబై హోటల్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖలో కూడా హోటళ్ల పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్ నగరంలో సాధారణంగానే రద్దీ ఉండగా ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది. దీంతో గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, బేకరీలపై పడుతుందనే ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది.గ్యాస్ కొరతపై కేంద్రం స్పందన యుద్ధం ప్రారంభమైన ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని, మన వద్ద 21 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటన చేసింది. అయితే.. తాజాగా హోటళ్లు, రెస్టారెంట్ల బంద్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. అత్యవసర సేవల చట్టం.. ఎస్మా పరిధిలోకి గ్యాస్ సరఫరాను తీసుకువచ్చింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ మేరకు జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే రంగంలోకి దిగారు. తమ పరిధిలోని ఎల్పీజీ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సిలిండర్ల పంపిణీని రేషనలైజేషన్ చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుంది?హోటళ్లు, రెస్టారెంట్లకు, పర్యాటక రంగానికి ముడిపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. పర్యాటక ప్రదేశాల్లో హోటళ్లు మూతపడితే.. ఆ ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. పట్టణ, నగర ప్రాంత పర్యాటక ప్రదేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆటో ఎల్పీజీమహానగరాల్లో ఇప్పుడు ఆటో ఎల్పీజీ స్థానాన్ని అధికస్థాయిలో సీఎన్జీ ఆక్రమించింది. అయినప్పటికీ వేల సంఖ్యలో ఆటోరిక్షాలు ఇప్పటికీ ఆటో ఎల్పీజీపైనే ఆధారపడ్డాయి. గత నెలలో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు 55 రూపాయల వరకు ఉంది. మూడ్రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరను పెంచడంతో ఇప్పుడు ఆటో ఎల్పీజీ ధర 63 రూపాయలకు చేరుకుంది. ఎల్పీజీ బంకుల్లో కూడా షార్టేజీ భయంతో ఆటోరిక్షాలు, కార్లు క్యూకడుతున్న పరిస్థితులు ఎల్పీజీ బంకుల వద్ద కనిపిస్తోంది. మరెంత కాలం సంక్షోభం?పశ్చిమాసియాలో పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ ఇంధన సరఫరా చైన్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద నౌకలు స్తంభించిపోయాయి. అటుగా వచ్చే నౌకలను ఇరాన్ టార్గెట్‌గా చేసుకుంటోంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ ద్వారా పంపిణీపై దృష్టి సారించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ ఎల్పీజీ విషయాన్ని పక్కనపెడితే.. డొమెస్టిక్‌తోపాటు.. ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్ల విషయంలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలకు అవసరమయ్యే ఎల్పీజీ సరఫరాకు సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ఇదివరకే ఎక్స్‌లో ట్వీట్ చేసింది.భారత్‌లో ఎల్పీజీ డిమాండ్ఒకప్పటితో పోలిస్తే.. భారత్‌లో ఎల్పీజీ డిమాండ్ చాలా పెరిగిందని చెప్పవచ్చు. ఉజ్వల వంటి పథకాలతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సిలిండర్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.. అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దీపం పేరుతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి కూడా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేలా పథకాలు కొనసాగాయి. మొత్తానికి కమర్షియల్, డొమెస్టిక్ కలిపి దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో 87 శాతం డొమెస్టిక్ వినియోగమే కావడం గమనార్హం. మిగతా 13 శాతంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆటో ఎల్పీజీ వినియోగం ఉంటుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి ద్వారా కొరతను అధిగమించలేమా?భారతదేశ ఎల్పీజీ అవసరాలు తీరాలంటే 62 శాతం మేర దిగుమతులు తప్పనిసరి. మిగతా 38 శాతం మాత్రమే ప్రస్తుతం మన వద్ద ఉత్పత్తి అవుతుంది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తగ్గితే.. వెను వెంటనే మన దేశానికి దిగుమతి కావాల్సిన ఎల్పీజీ అందుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చెబుతోంది. మన దిగుమతుల్లో 90 శాతం వరకు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నాయి. అయితే.. భారత్‌లో ఇంధన నిల్వలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
అదే జరిగితే సంక్షోభం తప్పదు యుద్ధంపై పుతిన్ వార్నింగ్
-
‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు
వాషింగ్టన్: యుద్ధ క్షేత్రంలో కనిపించే క్షిపణుల హోరు, పేలుళ్లు, ప్రాణనష్టం.. ఇవి అమెరికాకు వినోదాన్ని పంచే ఆటల్లా ఉన్నాయి. ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యను ఒక అద్భుతమైన ‘వీడియో గేమ్’లా చిత్రికరిస్తూ సోషల్ మీడియాలో అమెరికా ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్, ఐరన్ మ్యాన్ వంటి పాప్ కల్చర్ పాత్రలు, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి వీడియో గేమ్ క్లిప్పింగులతో వైట్ హౌస్ విడుదల చేస్తున్న వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. యుద్ధాన్ని వినోదంగా మార్చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా పెంటగాన్, వైట్ హౌస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఎక్స్, టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా విడుదలవుతున్న ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యాలపై విరుచుకుపడుతుంటే, వెనుక నేపథ్య సంగీతం యాక్షన్ సినిమా ట్రైలర్‌ను తలపిస్తోంది. ముఖ్యంగా ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ స్టైల్లో క్షిపణులు తగిలిన వెంటనే స్క్రీన్‌పై ‘కిల్ స్కోర్’ గ్రాఫిక్స్ కనిపిస్తుండటం గమనార్హం. ఈ వీడియోలకు ఇప్పటికే 5.8 కోట్లకు పైగా వ్యూస్ దక్కాయి.కేవలం గేమింగ్ మాత్రమే కాదు, చిన్న పిల్లలు ఇష్టపడే స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ వంటి కార్టూన్ పాత్రలను కూడా అమెరికా తన ప్రచారానికి వాడుకుంటోంది. ఒక క్షిపణి దాడి తర్వాత మరో దాడి చేసే ముందు ‘నేను మళ్ళీ చేయడం చూడాలనుకుంటున్నారా?’ అంటూ వచ్చే డైలాగులను జోడించడంపై అందరూ మండిపడుతున్నారు. టాప్ గన్, గ్లాడియేటర్ వంటి హాలీవుడ్ చిత్రాల క్లిప్పింగులతో యుద్ధ విమానాలను పోలుస్తూ అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించుకుంటోంది. Damn teryata sudah di ramalkan 😂🤣🤣 pic.twitter.com/SEzrodEo9z— Kageyoru (@Kageyoru_) March 8, 2026‘యుద్ధం వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇది. గతంలో యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రజలకు వివరించేవారు. కానీ ఇప్పుడు విధ్వంసాన్ని వినోదంలా చూపిస్తున్నారు’ అని మాజీ అండర్ సెక్రటరీ జేమ్స్ గ్లాస్మాన్ విమర్శించారు. యువతను, ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకోవడానికే ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విమర్శలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. అమెరికా సైనిక సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, ఇరాన్ క్షిపణి కేంద్రాలను ఎంత సమర్థంగా ధ్వంసం చేస్తున్నామో ప్రజలకు ‘రియల్ టైమ్’లో చూపించడమే తమ ఉద్దేశమని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి.. -
వంటగదికి యుద్ధం సెగ పెరిగిన నిత్యావసరాల ధరలు..!
-
పెట్రోల్ ధరలపై జై శంకర్ కీలక ప్రకటన...
-
100 డాలర్లు దాటిన బ్యారెల్ ముడి చమురు భారత్ పరిస్థితేంటి?
-
ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక యుద్ధం ముగింపుపై అనిశ్చితి
-
చమురు కేంద్రాలే లక్ష్యంగా యుద్ధం తీవ్రతరం
-
అమెరికాలో తెలుగు జంట సరదా రీల్.. అమెరికా విడిచి వెళ్లండి..?
-
యుద్ధం ఎఫెక్ట్.. ఆకాశానికి క్రూడ్ ఆయిల్ ధరలు
-
టెహ్రాన్‌పై డైరెక్ట్ ఎటాక్ ఇరాన్ గడ్డపై అమెరికా సైన్యం
-
ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం
-
చిక్కుల్లో ట్రంప్.. ఇరాన్ స్కూల్‌పై దాడి ఇజ్రాయెల్ పనే..
-
గ్యాస్ సంక్షోభం
-
మార్కెట్లో చమురు మంట!
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత క్షీణించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మండుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంటును దెబ్బతీయనున్నట్లు తెలియజేశారు. దీంతో అమ్మకాలదే పైచేయి కానున్నట్లు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ గత వారాంతాన ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం ఎగసి 92.6 డాలర్లను దాటగా.. న్యూయార్క్ నైమెక్స్‌లో లైట్ స్వీట్ క్రూడ్ 12 శాతంపైగా జంప్‌చేసి 91 డాలర్లకు చేరింది. అయితే గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు నిర్వహిస్తుంటే.. ఇరానియన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతున్నట్లు వెలువడుతున్న వార్తలు చమురు ధరలకు మరింత మద్దతివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి దేశీయంగా మార్కెట్లో సెంటిమెంటుకు షాకివ్వనున్నట్లు తెలియజేశారు.దేశీయంగా ముడిచమురు అవసరాలకు 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా సవాళ్లు, ధరల పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయే అవకాశముంది. ఇది ధరలకు ఆజ్యం పోయడంతోపాటు.. రూపాయిని బలహీనపరచనున్నట్లు ఆరి్థకవేత్తలు వివరించారు. వెరసి ఈ వారం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, చమురు ధరలపైనే మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్, ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్‌టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి తెలియజేశారు. క్రూడ్ షాక్.. ముడిచమురు ధరలు ఇప్పటికే దేశీయంగా పలు రంగాల కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఏటీఎఫ్ ధరలతో విమానయానం ఖరీదుగా మారనుంది. మరోపక్క టైర్లు, పెయింట్ల ముడిసరుకుల ధరలకు రెక్కలు రానుండటంతో లాభదాయకత దెబ్బతినే వీలుంది. చమురు శుద్ధి కంపెనీల మార్జిన్లు సైతం బలహీనపడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆయా రంగాల కౌంటర్లలో అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు చెబుతున్నారు. ధరలు బలపడితే ఆర్బీఐ కఠిన పరపతి విధానాలవైపు మొగ్గు చూపవలసివస్తుందని ఆరి్థకవేత్తలు అభిప్రాయపడ్డారు. గణాంకాలు కీలకం.. ఈ వారం దేశీయంగా ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో సీపీఐ అంచనాలకంటే అధికంగా 2.75 శాతంగా నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఫిబ్రవరి నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ బాటలో యూఎస్ ప్రభుత్వం ప్రయివేట్ రంగంలో ఉపాధి కల్పన, జనవరి వాణిజ్య లోటు వివరాలు ప్రకటించనుంది. 2025 డిసెంబర్లో వాణిజ్య లోటు 70.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతేకాకుండా అక్టోబర్–డిసెంబర్(క్యూ4) జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి.నేలచూపులోనే...గత వారం(2–6) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో నిలిచాయి. నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ 2,368 పాయింట్లు(2.9 శాతం) పతనమైంది. 78,919 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 728 పాయింట్లు(2.9 శాతం) కోల్పోయి 24,450 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 3.1 శాతం చొప్పున క్షీణించాయి.టెక్నికల్‌గా వీక్ ⇒ నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగే వీలుంది. ఇంతకంటే బలహీనపడితే.. 23,500 వరకూ క్షీణించవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 24,500 పాయింట్ల ఎగువన 25,000– 25,300 పాయింట్ల వద్ద అమ్మకాలు ఎదురుకావచ్చు. ⇒ బలహీనతలు కొనసాగితే సెన్సెక్స్ 77,000 పాయింట్లకు జారే అవకాశముంది. ఈ స్థాయి దిగువన 76,000–75,500 పాయింట్ల వద్ద మద్దతు లభించే వీలుంది. ఇక్కడినుంచి బలపడితే.. 80,200–80,700 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. -
Stock Markets: ఇన్వెస్టర్లు ఏం చెయ్యాలిపుడు?
గల్ఫ్ అంటేనే చమురు మార్కెట్‌కు హృదయం లాంటిది. అలాంటి గల్ఫ్‌లో పెద్ద దేశంగా చెలామణి అవుతున్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్లనే కాదు... స్టాక్ మార్కెట్లనూ అతలాకుతలం చేస్తున్నాయి. దేశానికి కావలసిన ముడి చమురులో 88 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న భారత్‌పైనా ఈ ప్రభావం పడుతోంది. మార్కెట్లు అనూహ్యంగా కదులుతున్నాయి. సూచీలు రోజూ 1–2 శాతం పడటం... కొంత రికవరీ కావటం జరుగుతోంది. ఇక కొన్ని షేర్లయితే దారుణంగా పడ్డాయి.ఐటీ సహా పలు షేర్లు మూడేళ్ల కనిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. మరిప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ల నుంచి విత్‌డ్రా అయి సురక్షిత సాధనాలవైపు మళ్లాలా? లేక మరికొంత ఇన్వెస్ట్ చేయాలా? సిప్‌లు ఆపేయాలా? కొనసాగించాలా? అసలు యుద్ధ ప్రభావం ఎన్నాళ్లుంటుంది? గతంలో యుద్ధాలు జరిగినపుడు మార్కెట్లు ఎలా స్పందించాయి? ఎన్నాళ్లకు కోలుకున్నాయి? వీటన్నిటిపైనా ఇన్వెస్టర్లకు అవగాహన కలిగించడానికే ఈ ‘వెల్త్’ స్టోరీ...భారత ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లవైపు వెళ్లటం పెరిగిన నాటి నుంచీ... అంటే 1990ల నుంచీ చాలా యుద్ధాలు, సంక్షోభాలు వచ్చాయి. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి ఇప్పటి ఇరాన్– అమెరికా, ఇజ్రాయెల్ వరకూ పలు యుద్ధాలతో పాటు.. కోవిడ్ వంటి అంతర్జాతీయ సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినపుడు మార్కెట్లు తక్షణ స్పందనగా పతనమయ్యాయి. ఆ పతనం కొన్ని సార్లు భారీగా ఉంటే... మరికొన్నిసార్లు తక్కువగానే కనిపించింది. కోలుకోవటానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడితే... కొన్నిసార్లు వేగంగానే రికవరీ అయ్యాయి. మరో అద్భుతం ఏంటంటే ప్రతి యుద్ధం... ప్రతి సంక్షోభం ఓ కొత్త చరిత్రకు మార్గం చూపించింది. 1991 గల్ఫ్ యుద్ధం: సంస్కరణలకు మార్గం గల్ఫ్ యుద్ధ సమయంలో చమురు ధరలు 17 డాలర్ల నుంచి 36 డాలర్లకి ఎగబాకాయి. అంటే రెట్టింపుకన్నా ఎక్కువ. పైపెచ్చు మన దగ్గర చాలినంత విదేశీ కరెన్సీ నిల్వలు లేవు. దీంతో భారత్ తీవ్ర ఒత్తిడికి గురయింది. సెన్సెక్స్ సుమారు 21శాతం పతనమైంది. అయితే ఇదే సమయంలో భారతదేశంలో కొత్త చరిత్ర మొదలైంది. నాటి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు తెచ్చింది. ఆర్థిక సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణతో పెట్టుబడులు పెరిగాయి. ఫలితంగా కొత్త భారతదేశం ఆవిష్కృతమయ్యింది. 1990ల చివరినాటికి మార్కెట్ కొన్ని రెట్లు పెరిగింది. 2000 డాట్‌కామ్ బబుల్: సుదీర్ఘ రికవరీ ఇంటర్నెట్ కంపెనీలు పుట్టగొడుగులుగా వచ్చి... వాటికి సరైన ఆదాయ మార్గాలు లేకపోవటంతో మూతపడాల్సి వచ్చిన సమయమది. డాట్‌కామ్ బుడగ బద్దలయింది. కంపెనీలు మూతపడ్డాయి. ఈ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 6,150 పాయింట్ల నుంచి 2,594 పాయింట్లకి పడిపోయింది. రికవరీకి రెండున్నరేళ్లకు పైగానే (దాదాపు 850 రోజులు) పట్టింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సాగిన రికవరీ ఇది.అయితే ఈ కాలంలో ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవటం... ద్రవ్యపరంగా క్రమశిక్షణ పాటించటం వంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిచ్చాయి. 2004 తర్వాత మళ్లీ బలమైన బుల్ రన్ ప్రారంభమైంది. మార్కెట్ల రికవరీని పక్కనబెడితే... డాట్‌కామ్ విప్లవం వల్ల ప్రపంచాన్ని కనెక్ట్ చేసే బలమైన ఇంటర్నెట్ వ్యవస్థ ఏర్పడింది. సముద్రగర్భ కేబుళ్లతో పాటు విస్తృతమైన నెట్వర్క్ వచ్చింది. అది తరువాతి కాలంలో ప్రపంచ గతినే మార్చేసింది. 2008 ఆర్థిక మాంద్యం: భారీ పతనంఅమెరికాలో సబ్‌ప్రైమ్ సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసిన సమయమది. లేమన్ బ్రదర్స్‌తో మొదలుపెట్టి పలు ఆర్థిక సంస్థలు అప్పులు రికవరీ అయ్యే పరిస్థితి లేక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఆర్థిక దిగ్గజాలు బోర్డు మూసేశాయి. పొదుపుపై నిలబడ్డ భారత వ్యవస్థ దేశంలో ఏ ఆర్థిక సంస్థా కుప్పకూలకుండా కాపాడినా... భారత్‌కు కూడా మాంద్యం తాకిడి తప్పలేదు.ఫలితంగా సెన్సెక్స్ 21,206 పాయింట్ల నుంచి 7,697 పాయింట్లకు పతనమైంది. అంటే దాదాపు 64% పతనం. అప్పట్లో స్టాక్ మార్కెట్ యుగం ముగిసినట్టే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆర్బీఐ లిక్విడిటీ మద్దతు, ప్రభుత్వ ఆరి్ధక ఉద్దీపన ప్యాకేజీలు, ఇన్ఫ్రా పెట్టుబడులు మార్కెట్‌కు మళ్లీ ఊపిరి పోశాయి. 750 రోజుల్లో సెన్సెక్స్ తిరిగి పాత గరిష్ట స్థాయికి చేరింది. ఈ సంక్షోభం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో స్రూ్కటినీని పెంచటంతో పాటు కొత్త పెట్టుబడి సాధనాలకు మార్గం చూపించింది. 2020 కోవిడ్: వేగవంతమైన రికవరీ కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టేయటంతో అంతర్జాతీయంగా స్టాక్‌మార్కెట్లు అతలాకుతలమయ్యాయి. ప్రపంచం లాక్డౌన్ అయింది. సెన్సెక్స్ 39 శాతం పతనమైంది. కానీ కేవలం 230 రోజుల్లోనే తిరిగి పాత గరిష్ఠ స్థాయిని చేరుకుంది. కాకపోతే ఈ సంక్షోభం ప్రపంచాన్ని డిజిటల్‌వైపు నడిపించింది. సోషల్ మీడియాను కొత్త శిఖరాలకు చేర్చింది. పేమెంట్ల వ్యవస్థను, కార్యాలయాల్లో పనిచేసే పద్ధతిని సమూలంగా మార్చేసింది. ఇప్పుడు చూస్తున్న చాలా మార్పులు కోవిడ్ ఫలితమేనంటే అతిశయోక్తి కాదు. 2022 రష్యా– ఉక్రెయిన్ యుద్ధం: ద్రవ్యోల్బణ షాక్ ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు దిగటంతో ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్ల వరకు పెరిగింది. ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు 8 శాతం దాకా పతనమయ్యాయి. అయితే దేశం 6 నెలల్లో ఈ యుద్ధ ప్రభావం నుంచి కోలుకోగలిగింది. ఉక్రెయిన్ ఉద్రిక్తత కారణంగా భారత్ తన సరఫరా వ్యవస్థను సమూలంగా మార్చుకుంది. గ్లోబల్ యుద్ధాల్లో నిలబడే శక్తిని సమకూర్చుకుంది. 2023–2026 అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతలు పది రోజుల కిందట.. అంటే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై దాడులకు దిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయొతుల్లా ఖమేనీని క్షిపణి దాడులతో హతమార్చాయి. ఇరాన్ ప్రతి దాడులకు దిగటంతో పాటు గల్ఫ్ దేశాల్లో అమెరికా రక్షణ వ్యవస్థలను టార్గెట్ చేసింది. ఈ యుద్ధం ఫలితంగా ముడి చమురు ధరలు గడిచిన వారం రోజుల్లోనే 36 శాతం వరకూ పెరిగాయి. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువే కావటంతో స్టాక్ మార్కెట్లు విపరీతంగా ఊగిసలాటకు గురవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతో మదుపరులు అమ్మకాలకు దిగుతున్నారు. ఈ యుద్ధం ఆరంభానికి ముందు 26,300 పాయింట్లను తాకిన నిఫ్టీ... దాదాపు 1,800 పాయింట్లు నష్టపోయింది. అంటే దాదాపు 7 శాతం పతనమైంది. యుద్ధం ఇంకా కొనసాగుతోంది. భారత్‌పై యుద్ధ ప్రభావాలు ఒకప్పటిలా ఉండే అవకాశం తక్కువ, ఎందుకంటే..⇒ సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా భారీ ఫారెక్స్ రిజర్వులున్నాయి. ⇒ పొదుపు ఆధారితం నుంచి వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతోంది. ⇒ రూపాయి కదలికలను – లిక్విడిటీని నియంత్రించే సామర్థ్యం రిజర్వ్‌బ్యాంకుకు ఉండడం. ⇒ దేశీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.ఇన్వెస్టర్లు ఏం చేయాలి?సంక్షోభాల గురించి స్టాక్‌మార్కెట్లు చెబుతున్నదొకటే. పతనం తాత్కాలికం. ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంటే మార్కెట్లూ పెరుగుతాయి. నిపుణుల సూచన ప్రకారం... ఇప్పటికే మార్కెట్లు కొంత పడ్డాయి. భారీగా లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు తాత్కాలికంగా కొంతవరకూ వెనక్కి తీసుకున్నా పర్వాలేదు. కానీ నష్టాల్లో వైదొలగటం అనేది సరైన నిర్ణయం కాదు. మార్కెట్ల పతనం అనేది మరింత పెట్టుబడులకు అవకాశంగానే భావించాలి తప్ప ఉపసంహరణకు కాదు. సిప్ చేస్తున్నవారు మార్కెట్లు మరింత పతనమైతే మరింత పెట్టుబడి పెట్టే మార్గాన్ని పరిశీలించుకోవాలి. దిగువ స్థాయిల్లో సిప్‌ను కొనసాగిస్తేనే మంచి లాభాలు కళ్లచూస్తారు. యుద్ధాలు, సంక్షోభాలు ప్రతికూలం (నష్టపోయే రంగాలు)⇒ ఏవియేషన్⇒ ఆటోమొబైల్స్ ⇒ కెమికల్స్ ⇒ ఆయిల్ ఆధారిత పరిశ్రమలుఅనుకూలం (లాభపడే రంగాలు)⇒ డిఫెన్స్ సంబంధిత కంపెనీలు ⇒ ఎఫ్ఎంసీజీ సంస్థలు ⇒ ఫార్మా కంపెనీలు⇒ చమురు అన్వేషణ సంస్థలు ⇒ గోల్డ్ సంబంధిత పెట్టుబడులు -
అమెరికాకు చేరుకున్న సైనికుల పార్థివదేహాలు ట్రంప్ నివాళి
-
అమెరికాకు భారీ నష్టం.. కొండను తవ్వి ఎలుకను పట్టారా
-
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం సీక్రెట్ ఆపరేషన్
పశ్చిమాసియా మెుత్తం యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దాడులు ప్రతి దాడులతో ఆ ప్రాంతంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత ఉద్రిక్త పరిస్థితుల వేళ ఇజ్రాయెల్ బలగాలు ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నాయి. 1986 యుద్ధంలో మృతిచెందిన ఓ సైనికుడి మృతదేహం కోసం అర్థరాత్రి వేళ గాలింపులు జరిపాయి.ప్రస్తుతం లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకెళ్లింది. ఆ దేశంలోకి చొరబడి హిజ్బుల్లా, హమాస్ స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్కడ టెల్ అవీవ్ ఒక ఆసక్తికర ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 1986లో లెబనాన్‌తో యుద్ధం సమయంలో రాన్ అరాద్ అనే ఇజ్రాయెల్ ఫైలట్ మరణించాడు. హెజ్బొల్లా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్‌పై దాడిచేయగా అది తూర్పు లెబనాన్‌లోని బెక్కా లోయ సమీపంలో నబిట్ అనే గ్రామం వద్ద కూలిపోయింది.అయితే ఆరోజు జరిగిన దాడిలో ఫైలట్ అరాద్ మరణించినట్టు ఇజ్రాయెల్ అప్పుడే నిర్ధారించింది. ఆయన మృతదేహాన్ని వెనక్కితీసుకురావడానికి ప్రయత్నాలు జరుపగా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం దానికి సరైన సమయం అని భావించిన ఇజ్రాయెల్ ప్రత్యేక కమెండోలను రంగంలోకి దించింది. నాలుగు సైనిక హెలికాప్టర్లతో శుక్రవారం రాత్రి వేళ నబిట్ ప్రాంతానికి చేరుకొని గాలింపులు చేపట్టారు.తాజాగా ఆ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని పంచుకున్నారు. "ఇజ్రాయెల్ సైనికులు నాలుగు హెలికాప్టర్లలో వచ్చారు. ఆ లోయ ప్రాంతంలో ఆ సైనికుడి మృత దేహం కోసం తవ్వకాలు జరిపారు. అయితే వారికి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. అయితే అతని డెడ్‌బాడీ కోసం మరోసారి వెతుకతామని వారు తెలిపారు" అని గ్రామస్థులు పేర్కొన్నారు.అయితే అరాద్ అవశేషాలు దొరికే దాకా గాలింపు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ తమ దేశ సైనికులకు ఎంత గౌరవం ఇస్తుందా అనే విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అరాద్ను ఎక్కడ పూడ్చిందీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్.. హెజ్బొల్లా దళాలను విచారించి ఆ ఆధారంగానే ఈ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం. -
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రధాన గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్‌ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్ కొరతను సృష్టిస్తోంది. హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం నగరంలోని ఫుడ్ ఇండస్ట్రీపై గ్యాస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి. డిమాండ్‌కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్‌పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్ యజమానులు వాపోతున్నారు. రోజువారీ గ్యాస్ వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా ఒక మధ్యస్థ రెస్టారెంట్‌కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్‌ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సిలిండర్ల కోసం ‘పానిక్ బుకింగ్’ మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. -
ఇరాన్ దాడులు.. మృతుల వివరాలు ప్రకటించిన యుఏఈ
ఓ వైపు తమ పరిసర దేశాలపై దాడులు చేయమని ప్రకటించిన ఇరాన్... మరోవైపు అటాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దుబాయిపై మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకపడినట్లు యూఏఈ తెలిపింది. ఇప్పటి వరకూ ఇరాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందగా 112 మంది గాయపడ్డట్లు యుఏఈ రక్షణ శాఖ ప్రకటించింది.అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై అటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా దేశాల్లోని యుఎస్ఏ మిలిటరీ స్థావరాలే లక్షంగా దాడులకు తెగబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నిన్న (శనివారం) స్పందించారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరిపినందుకు క్షమాపణలని ఇకపై దాడులు జరపమన్నారు. అయితే వారి దేశం నుంచి అమెరికా దాడులు చేయకుండా చూసుకోవాలని కోరారు. అయితే వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. యుఏఈపై ఇరాన్ దాడులు జరుపుతున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిందియుఏఈ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేస్తూ "7 వతేదీ శనివారం రోజు యుఏఈ పై ఇరాన్ 16 బాలిస్టిక్ క్షిపణులు, 121 డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో 15 క్షిపణులు, 119 డ్రోన్లు గాలిలోనే కూల్చివేయబడ్డాయి. ఇప్పటివరకూ మెుత్తంగా 221 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడగా 205 క్షిపణులను గాలిలోనే కూల్చివేశాము. 14 సముద్రంలో పడ్డాయి. 2 క్షిపణులు మాత్రం యూఏఈ భూభాగాన్ని తాకాయి. అదేవిధంగా 1,305 డ్రోన్లను ప్రయోగించగా 1,229 కూల్చివేశాము. 76 డ్రోన్లు భూభాగాన్ని తాకాయి." అని తెలిపిందికాగా ఇప్పటి వరకూ ఈ దాడులలో ముగ్గురు విదేశీ పౌరులు మృతి చెందారని వారు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ జాతీయులను పేర్కొంది. అయితే ఇరాన్ జరిపిన అటాక్స్ వల్ల 112 మందికి స్వల్ప గాయాలయ్యాయాయని అందులో వివిధ దేశాలకు చెందిన ప్రజలున్నారని యుఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. -
ఇరాన్ యుద్ధంతో భగ్గుమన్న ముడి చమురు ధరలు... వారంలోనే 20 డాలర్లకుపైగా పెరిగిన క్రూడ్
-
యుద్ధ ప్రభావం ఉన్నా గోల్డ్, సిల్వర్ రేట్ పడిపోవడానికి కారణం ఏమిటి..?
-
బలహీనపడుతోన్న ఇరాన్.. యుద్ధం ఆపేది ఎప్పుడో.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్..
-
యుద్ధానికి వారం రోజులు.. ఎంత నష్టం అంటే..
-
ఏ దేశంలో ఎన్ని అణుబాంబులున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా
-
అమెరికా యుద్ధ బాంబర్ యాక్టివ్..B-52తో ఇరాన్ కు హెచ్చరిక
-
యుద్ధం ఇలాగే కొనసాగితే... నిత్యావసరాలపై యుద్ధ దెబ్బ
-
గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ డ్రోన్లు!బంకర్ల లోకి ప్రజలు
-
ఇరాన్ కి అండగా రష్యా, చైనా సూసైడ్ డ్రోన్స్ వెనుక వ్యూహం ఏంటి?
-
ఇరాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌కు వారానికి ఎంత నష్టమంటే..!
జెరూసలేం: జనాలను, జలవనరులను నాశనంచేసే యుద్ధం కారణంగా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్‌పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు రూ.27 వేల కోట్లు నష్టపోతోందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనావేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని లేదంటే ఆర్థికఊబిలో కూరుకుపోతామని ఆర్థికశాఖ హెచ్చరించింది.ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షెయీ క్లాపర్కు ఆర్థికశాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ ఒక లేఖ రాశారు. భద్రతకోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమేగానీ ఆర్థిక స్వావలంభన పైనా దృష్టిసారించాలని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యాసంస్థలు, వ్యాపారసముదాయాలు, పని ప్రదేశాలను మూసేయడంతో వ్యాపారం తగ్గిపోయి ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోంది. ఇకనైనా కఠిన ఆంక్షలను పాక్షికంగా సడలించాలి. రెడ్ లెవల్ అలర్ట్‌ను ఆరెంజ్ స్థాయికి తగ్గించాలి’’ అని ఆయన లేఖలో సూచించారుకాగా, ఇరాన్‌పై దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6,900 కోట్లు) ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్‌పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది. -
రణరంగంలోకి భీకర బాంబర్
అణుచర్చల విషయంలో ‘దౌత్యం’విఫలమై దిగాలుగా కూర్చున్న వేళ ‘యుద్ధం’ఒళ్లువిరిచి రణక్షేత్రంలో కరాళనృత్యం చేస్తుండగా ఆ నృత్యాన్ని మరింత రక్తికట్టించేందుకు అమెరికా తన అమ్ముల పొదిలోని బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ భారీ విమానాలను రంగంలోకి దింపింది. ఏడు దశాబ్దాలకు పైగా ఈ యుద్ధవిమానాలు అమెరికా వాయుసేనలో కీలకభూమిక పోషిస్తున్నాయి. ఒకేసారి 32,000 కేజీల బరువైన బాంబులను జారవిడిచే సత్తా ఉన్న ఈ విమానాల రాకతో రణరీతులు మారనున్నాయని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్నీ భారీస్థాయిలో.. → 1955 ఫిబ్రవరిలో అమెరికా వాయుసేన కోసం బోయింగ్ సంస్థ ఈ విమానాలను తయారుచేసి ఇచి్చంది. ఆనాటి నుంచి పలు మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ అప్పగించిన పనిని అద్భుతంగా పూర్తిచేశాయి. → ప్రచ్ఛన్నయుద్ధకాలంలో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఎనిమిది ఇంజిన్లతో భారీ బాడీతో అధునాతనంగా దీనిని తయారుచేశారు. → ఏకంగా 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ సువిశాల ప్రాంతంపై తమ పట్టు నిలుపుకుని డేగ కన్నుతో పరిశీలిస్తూ అత్యంత ఖచి్చతత్వంతో బాంబులు జారవిడుస్తాయి. → సెన్సార్లు మొదలు, ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్దాకా అన్నిరకాల ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. → ఈ విమానంలో ఒకేసారి 30 భారీ బాంబులను అమర్చవచ్చు. అందుకే దీనిని కింగ్ ఆఫ్ బాంబర్స్ అని కూడా పిలుస్తారు. → ఇంధనం కోసం ఆగకుండా ఏకధాటిగా వేల కిలోమీటర్ల ప్రయాణిస్తాయి. 1991 జనవరిలో ఇరాక్‌పై దాడి కోసం ఈ విమానాలు అమెరికాలోని లూసియానాలోని బార్క్డేల్ స్థావరం నుంచి బయల్దేరి ఎక్కడా ఆగకుండా ఇరాక్‌కు వచ్చి బాంబులేసి మళ్లీ అలాగే వెళ్లిపోయాయి. అలా ఏకధాటిగా 35 గంటలపాటు 23,000 కిలోమీటర్ల ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డ్‌ను సృష్టించాయి. → గగనతలంలో మధ్యస్థాయి వేగంతో ప్రయాణించే ఈ విమానం గగనతలంలో వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దం వినలేనంత కర్ణ కఠోరంగా ఉంటుంది. → గైడెడ్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులు ఇలా వేర్వురు రకాల బాంబులను ఇవి ప్రయోగించగలవు. → 225 కేజీలు, 450 కేజీలు, 900 కేజీలు ఇలా వేర్వేరు బాంబులను వేర్వేరు దిశలో ఒకేసారి ప్రయోగించగలవు. జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునీషన్(జేడ్యామ్) టెక్నాలజీతో ఈ బాంబులు పనిచేస్తాయి. బాంబులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మాదిరి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంపై పడి శత్రువుల స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేస్తాయి. → వేలకిలోల బాంబులతో ప్రయాణించే ఈ విమానాన్ని టేకాఫ్ చేయాలంటే అత్యంత పొడవైన రన్‌వే అవసరం. ప్రస్తుతం ఇరాన్‌పై దాడుల కోసం బ్రిటన్‌లోని గ్లూసిస్టర్షైర్లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. ఈ స్థావరంలో సువిశాలమైన ఏకంగా 9,993 అడుగుల పొడవైన రన్‌వే ఉంది. దీంతో రెక్కలకు ఎలాంటివి అడ్డురాకుండా సులువుగా టేకాఫ్ తీసుకోవచ్చు. → ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా ద్వీపంలోని స్థావరం నుంచి ఇవి రణరంగంలోకి ప్రవేశించాయని వార్తలొచ్చాయి. → ఇరాన్ బలగాల కమాండ్, కంట్రోల్ పోస్ట్‌లపై బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్ విమానం పెద్ద ఎత్తున దాడులు చేస్తోందని తాజాగా యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. → బీ–52హెచ్ వేరియంట్ విమానం ఏకధాటిగా 15,000 కిలోమీటర్లు ప్రయాణించి 70,000 పౌండ్ల బాంబులను ప్రయోగించగలదు → ప్రస్తుతం అమెరికా అమ్ములపొదిలో ఇలాంటివి 76 విమానాలు ఉన్నాయి. → వియత్నాం యుద్ధం మొదలు గల్ఫ్ యుద్ధం, అఫ్గానిస్తాన్, ఇరాక్ దాకా పలు యుద్ధాల్లో పాల్గొన్న బీ–52 బాంబర్లు ఇప్పుడు ఇరాన్ పనిపట్టేందుకు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి → ఈ విమానాలకు ‘పెద్దగా అందవికారంగా బానపొట్టతో ఉన్న మనిషి(బిగ్ అగ్లీ ఫ్యాట్ ఫెలో–బఫ్)’అనే ముద్దుపేరు కూడా ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియా వదిలేస్తా ఇరాన్ వెళ్లిపోతా.. బాలీవుడ్ నటి సంచలన ప్రకటన
దుబాయ్ సహా పశ్చిమాసియాలో చిక్కుకున్న బాలీవుడ్ నటీనటులు కావచ్చు ఇతర సెలబ్రిటీలు అందరూ ఇండియాకు వచ్చేదారులు ఎక్కడా అని వెదుక్కుంటుంటే...హాయిగా ఇండియాలో కూర్చుని సినిమాలు చేసుకుంటున్న ఓ బాలీవుడ్ నటి మాత్రం ఇక తాను ఇక్కడ ఉండలేనంటోంది. ఈ యుద్ధానికి కేంద్ర బిందువైన ఇరాన్‌కే వెళ్లిపోతానంటోంది. ఇంతకీ ఎవరా నటి ఎందుకీ విరక్తి?ఆమె పేరు మందనా కరిమి, ఇరాన్‌కు చెందిన సినీ తార. కొన్నేళ్ల క్రితమే ఫ్యాషన్ రన్ వేలపై అడుగులతో మన దేశంలో ప్రారంభమై అక్కడ నుంచి బాలీవుడ్ దాకా సాగింది. భారత మోడలింగ్ రంగంలో స్థిరపడిన తర్వాత, ఆమె భాగ్ జానీ క్యా కూల్ హై హమ్ 3 వంటి చిత్రాలలో వరుసగా ఛాన్స్‌లు దక్కించుకుంది. ఫ్యాషన్, ప్రకటనలు రియాలిటీ టెలివిజన్ ద్వారా కూడా ఇండియా ఆమెను ఆదరించింది. మరొవైపు ప్రస్తుత ఇరాన్–అమెరికా –ఇజ్రాయెల్ ఉద్రిక్తతల తర్వాత తన చుట్టూ పరిస్థితి మారిపోయింది అంటోందీమె. ఇరాన్ లో జన్మించిన ఈ నటి ఇప్పటిదాకా తన చుట్టూ స్నేహితులుగా ఉన్నవారిలో వచ్చిన మార్పులు తనకు అంతుపట్డడం లేదని వాపోతోంది. ఈ పరిస్థితుల్లో తనకు ఇండియాలో ఉండడం నచ్చడం లేదని, ఇక పెట్టేబేడా సర్ధుకుని ఇరాన్‌కి వెళ్లిపోవడమే శరణ్యం అనీ స్పష్టం చేస్తోంది. తనకు ఇండియా ఎంతో ఇచ్చింది. కానీ...వాయిస్ మాత్రం ఇవ్వలేదంటోంది. అదే విధంగా మరో ఇరాన్ నటి ఎల్నాజ్ నొరౌజీ ఇరాన్ నేత తాజా దాడుల్లో మృతి చెందిన అహ్మద్ ఖొమేని మృతి పట్ల భారత్‌లో కొందరు ముస్లింలు చేపట్టిన నిరసన ప్రదర్శనలను ఆక్షేపిస్తోంది. మతం పేరుతో ఖొమేని సాగించిన అరాచకాల గురించిన అవగాహన లేకపోవడమే దీనికి కారణం కావచ్చునని ఆమె అభిప్రాయపడుతోంది. ఈ నటి దాదాపు దశాబ్దం క్రితం భారతదేశానికి వచ్చింది నెట్‌ఫ్లిక్స్ సేక్రెడ్ గేమ్స్ ద్వారా వేగంగా పాప్యులారిటీ అందుకుంది. వీరు కాకుండా భారత్‌లోని మరికొందరు ఇరానియన్ మూలాలున్న నటీనటులు ఎవరంటే...ఇరానియన్ నటుడు సజ్జాద్ డెలాఫ్రూజ్ సల్మాన్ ఖాన్ సరసన టైగర్ జిందా హైలో శక్తివంతమైన పాత్ర ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. తరువాత గూఢచర్య థ్రిల్లర్ స్పెషల్ ఆప్స్‌లో కనిపిస్తాడు.బాలీవుడ్ యాక్షన్ స్టార్ జాన్ అబ్రహం తన తల్లి, ఇరానియన్ జొరాస్ట్రియన్ ద్వారా ఇరానియన్ మూలాలను కలిగి ఉన్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.ఇడియట్స్ మున్నా భాయ్ ఎంబిబిఎస్ చిత్రాల్లోని పాత్రలతో పేరొందిన ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ కూడా ముంబైలోని ఇరానియన్ జొరాస్ట్రియన్ కుటుంబానికి చెందిన వ్యక్తి.. -
ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం
-
ఖతార్ రాజధానిపై ఇరాన్ దాడి.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
-
ఇరాన్ భవిష్యత్తుపై ట్రంప్ ప్లాన్.. మారనున్న ఇరాన్ ముఖచిత్రం?
-
ఇక చాలు ఆపేయండి... యుద్ధంపై చైనా కీలక ప్రకటన
-
అమెరికా ఇజ్రాయెల్ Vs ఇరాన్.. వార్ స్ట్రాటజీ అనాలిసిస్
-
ఇరాన్ ఆయుధ రహస్యం.. టెహ్రాన్ బయటకు తీయని మిస్సైల్స్ ఇవే..
-
రంగంలోకి కిమ్.. ఇరాన్ కోసం నార్త్ కొరియా మిస్సైల్స్..
-
ఇరాన్‌పై నిప్పుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపు దాలుస్తోంది. ఇరాన్‌తో పాటు లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ బుధవారం ఐదో రోజు అక్షరాలా నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా టెహ్రాన్‌తో పాటు కోమ్, ఉరి్మయా, కెర్మన్షా తదితర నగరాలపై కూడా రోజంతా పలు దఫాలుగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్‌లోని క్షిపణి నిల్వల కేంద్రంపై క్షిపణుల వర్షం కురిపించింది.టెహ్రాన్ సమీపంలోని నూతన అణు ప్రాజెక్టు కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన వైఏకే–130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో కూల్చేసినట్టు సైన్యం వెల్లడించింది. దాడుల ధాటికి తాళలేక దివంగత సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ఇరాన్ వాయిదా వేసుకుంది! ఇప్పటిదాకా ఇరాన్‌కు చెందిన 17 యుద్ధ నౌకలను పేల్చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్లో 2,000కు పైగా లక్ష్యాలను ఛేదించినట్టు అమెరికా సైన్యం సెంట్రల్ కమాండ్ చీఫ్, నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ‘‘వందలాది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నాశనం చేశాం. ఇరాన్ ఇప్పటిదాకా 500కు పైగా బాలిస్టిక్ క్షిపణులు, 2,000కు పైగా డ్రోన్లు ప్రయోగించింది’’అని తెలిపారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1,045 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఇరాన్ సైనిక సామర్థ్యం బాగా క్షీణించిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఎఫీ డెఫ్రిన్ పేర్కొన్నారు. దాంతో దాడుల తీవ్రత కూడా తగ్గిందని చెప్పుకొచ్చారు. బుధవారం ఇరాన్ కూడా దీటుగా ప్రతి దాడులకు దిగింది. జెరూసలేం తదితర నగరాలపైకి భారీగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతర్‌తో పాటు పలు గల్ఫ్ దేశాలపై కూడా దాడులను నిరి్నరోధంగా కొనసాగించింది. దుబాయ్‌లోని యూఎస్ రాయబార కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో కార్యాలయం భారీ మంటల్లో చిక్కింది. అయితే సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అక్కడి రస్ అనూరా చమురు శుద్ధి కేంద్రంపై కూడా మళ్లీ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ ఐదో ఫ్లీట్ వ్యవస్థపైనా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అంతేగాక తన దాడులను టరీ్కకి కూడా విస్తరించింది! ఇరాన్ నుంచి తమ గగనతలంలోకి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్టు టర్కీ ప్రకటించింది. తమపై అకారణ దాడికి దిగిన అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. పశ్చిమాసియాలోని సైనిక, ఆర్థిక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేందుకు సన్నద్ధం అవుతున్నామంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది! లెబనాన్‌లో... లెబనాన్‌పై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ బుధవారం మరింత పెంచింది. ఎడతెరిపి లేకుండా వచి్చపడుతున్న క్షిపణులు, బాంబులతో బీరూట్ దద్దరిల్లిపోతోంది. అరమౌన్, సాదియత్ తదితర నగరాలపైనా దాడులు కొనసాగుతున్నాయి. బలైనట్టు తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామవాసులను ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడుల ధాటికి దక్షిణ లెబనాన్‌లో ఇప్పటికే వేలాది మంది నిర్వాసితులుగా మారారు. బాల్బెక్లో ఓ నివాస సముదాయంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు, సాదియత్లో ఆరుగురు మరణించినట్టు లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. -
యుద్ధ దేవతలు
దశాబ్దాలుగా, పశ్చిమాసియాలోని ఆరోగ్య వ్యవస్థకు భారతీయ నర్సులు వెన్నెముకలా నిలుస్తున్నారు. ‘ఏంజెల్స్ ఇన్ వైట్’గా మన్ననలు పొందుతున్నారు. 1990ల నాటి కువైట్ యుద్ధం నుండి తాజా ఇరాన్ యుద్ధం వరకు.. వైద్య చికిత్సలు, ఆరోగ్య సేవలు అందించటంలో మన నర్సులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్నర్సులదీ ‘పోరాటమే’!ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఇరాన్ యుద్ధం’లో భారతీయ నర్సులు స్థిరచిత్తంతో నిర్భయంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు సైనికుల్లా పోరాడుతున్నారు. అక్కడ వారు చేస్తున్నది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, గొప్ప మానవతా సేవ కూడా.కేరళ నర్సులే ఎక్కువపశ్చిమ ఆసియాలో నర్సులుగా పనిచేస్తున్న భారతీయ మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. వారిలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారు ఉన్నప్పటికీ, ఎక్కువ మంది కేరళ రాష్ట్రానికి చెందినవారే.యుద్ధంలోనూ సంసిద్ధంతాజా యుద్ధంలో భారతీయ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతో ధైర్యంగా, నిలకడగా గాయపడినవారికి వైద్యసేవలు అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి నేరుగా సంబంధం లేని దేశాలలో సైతం ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులలో కూడా మన నర్సులు ఆరోగ్య సేవలకు సంసిద్ధమై ఉన్నారు.దృఢ సంకల్పానికి నిదర్శనంసంక్షోభ సమయాలలో ఎవరి దేశానికి వాళ్లు వెళ్లిపోయేందుకు తొందరపడుతున్నా భారతీయ నర్సులకు మాత్రం అక్కడేఉండి సేవలు అందించినఘన చరిత్ర ఉంది. పశ్చిమ ఆసియాలో గతంలో సంభవించిన ఎన్నో ప్రధాన సంక్షోభాల సమయంలో వారి ఉనికి ఎంతో కీలకంగా నిలిచింది.ప్రాణాలకు తెగించి సేవలుకువైట్, ఇరాక్ వంటి యుద్ధ క్షేత్రాలలో బాంబు దాడులు, క్షిపణి ముప్పులు పొంచి ఉన్నప్పటికీ, భారతీయ నర్సులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన మహోన్నత చరిత్ర ఉంది.వైద్య వ్యవస్థకు వెన్నెముకయుద్ధం కారణంగా స్థానిక వైద్యులు, సిబ్బంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినప్పుడు, భారతీయ నర్సులు అక్కడే ఉండి ఆసుపత్రులు మూతపడకుండావైద్య వ్యవస్థను నిలబెట్టారు.అంతర్జాతీయ గుర్తింపుఅత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పనిచేసే ‘ఫ్రంట్‌లైన్ వారియర్స్’ గా భారతీయ నర్సులు (ముఖ్యంగా కేరళకు చెందిన వారు) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.మానవతా దృక్పథంరాజకీయ అశాంతి, అంతర్యుద్ధాల సమయంలో పౌరులకు, గాయపడిన సైనికులకు ఎటువంటి వివక్ష లేకుండా నిరంతరాయంగా చికిత్స అందించడంలో మనవాళ్లు కీలక పాత్ర పోషించారు.సంక్షోభ నిర్వహణపరిమిత వనరులు, మందుల కొరత ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందిస్తూ వేలాది మంది ప్రాణాలను కాపాడటంలో భారతీయ నర్సులు అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. -
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌక పై దాడి
-
ఇరాన్ తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
-
" నేనే ఒత్తిడి చేసి ఉండవచ్చు"
ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నాయి. టెహ్రాన్ సైతం తగ్గేదిలేదంటూ పెద్ద ఎత్తున ప్రతి దాడులు చేస్తోంది. అయితే మారణహోమం ఎలా మెుదలైందనే విషయంపై ట్రంప్ మాట్లాడారు. తమ మిత్రదేశం కోసమే అమెరికా యుద్ధం ప్రారంభించిందనే వ్యాఖ్యల్ని ఖండించారు. యుద్ధాన్ని తానే ప్రోత్సహించాననే విధంగా సమాధానం ఇచ్చారు.ఇరాన్‌పై అమెరికా "ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ" పేరుతో దాడులు ప్రారంభించింది. టెహ్రాన్‌పై విరుచుకపడుతూ ఆ దేశ సుప్రీం నేత ఆయాతుల్లా ఖమేనీ, ఆయన భార్యతో పాటు ఇతర కీలక నేతలను మట్టుబెట్టింది. ఈ దాడులలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చిన్నాభిన్నం అయ్యింది. అయితే ఈ యుద్ధంపై అమెరికా సెక్రటరీ మార్క్ రుబియో స్పందించారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయబోతుందని తెలిసిన తర్వాతే అమెరికా ఈ దాడులలో పాల్గొందన్నారు.అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం దీనిపై స్పందించారు." నాకు తెలిసి మెుదటగా ఇరాన్ దాడికి ప్రణాళికలు రచించింది. అయితే నేను అది జరగనివ్వకూడదు అనుకున్నా. అయితే ఈ సందర్భంలో నేను ఇజ్రాయెల్‌ని కొంత ఒత్తిడి చేసి ఉండవచ్చు" అన్నారు. అమెరికాలోని ఆయన అధ్యక్ష కార్యాలయంలో జర్మన్ ఛాన్సిలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో ట్రంప్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందన్నారు. ఆ దేశానికి చెందిన నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఏవి ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు. అదే విధంగా ఖమేనీతో పాటు ఇతర కీలక నేతలు ఈ దాడులలో మృతి చెందారని ప్రకటించారు. అయితే ఇరాన్‌తో అణుచర్చలు విఫలమైతే ఈ సారి దాడి మరింతగా పెద్దగా ఉంటుందని తొలుత నుంచి ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు.అయితే ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ గల్ప్ కంట్రీస్లోని అమెరికా స్థావరాలపై విరుచుకపడుతుంది. మరోవైపు ఇజ్రాయెల్‌పైనా బాలిస్టిక్ క్షిపణిలతో దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
భీకర యుద్ధం.. వార్‌లోకి న్యూక్లియర్!?
-
ట్రంప్ సంచలనం! ఇరాన్ ను తుడిచి పెట్టేసాం.. యుద్ధం ముగిసినట్టేనా ?
-
పశ్చిమాసియా భీకర యుద్ధం.. భారీగా ప్రాణనష్టం
-
వార్ లోకి ఇరాన్ డేంజెరస్ మిస్సైల్
-
భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల
కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాల మధ్య మొదలైన ఈ భీకర పోరు వేలాది కుటుంబాలను రోడ్డున పడేయడమే కాకుండా, పదుల సంఖ్యలో పౌరుల ప్రాణాలను బలిగొంటోంది. గత గురువారం నుంచి ప్రారంభమైన ఈ ఘర్షణలు దారుణమైన సైనిక చర్యలకు దారితీశాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాల నుండి సుమారు 20,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా, 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు సైతం ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఇప్పటికే తీవ్ర పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాల్లో అత్యవసర ఆహార పంపిణీ నిలిచిపోవడంతో సుమారు 1.6 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) హెచ్చరించింది. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతిచర్యగా తాము సరిహద్దు వెంబడి దాడులు ప్రారంభించినట్లు అఫ్గాన్ ప్రకటించడంతో ఈ పోరు మరింతగా ముదిరింది. ఇస్లామాబాద్ సైతం వెనక్కి తగ్గకుండా కాబూల్, కందహార్ నగరాలతో పాటు వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది.సరిహద్దులోని కునార్ ప్రాంతంలో క్షిపణి దాడులు, భారీ ఆయుధాల మోతతో ప్రజలు భీతావహ స్థితిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కునార్లోని సిర్కానీ గ్రామంలోని వేలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్లను వదిలి వెళ్ళగా, ఆస్తులను కాపాడుకునేందుకు ఇంటికి ఒక్కరు మాత్రమే మిగిలి ఉన్నారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైనిక పరంగా ఇరు దేశాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నట్లు పరస్పర ప్రకటనలు చేసుకున్నాయి. అఫ్గాన్ సైన్యం తమ వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని చెబుతూనే, సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు పేర్కొంది.ఇది కూడా చదవండి: కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం -
పశ్చిమాసియా పోరు తారాస్థాయి.. చర్చలకు నో అన్న ట్రంప్
-
ఖమేనీని ఎలా చంపారంటే? యుద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్ వాడిన టెక్నాలజీ ఇదే..!
-
ప్రపంచానికే పెను ముప్పు.. కొంపముంచుతున్న యుద్ధం
-
వార్ అక్కడ.. వర్రీ ఇక్కడ!
సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌లోని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్, హోటల్, గోల్డ్ ట్రేడింగ్, మైనింగ్ రంగాల్లో అక్కడ భారీ పెట్టుబడులు పెట్టిన మనోళ్లు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తాజా పరిణామాలు దుబాయ్ ’సేఫ్–హెవెన్’ అనే ఇమేజ్ను దెబ్బతీశాయి. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా తదితర నగరాల్లో పెట్టుబడులు పెట్టిన తెలంగాణకు చెందిన ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. వీరిలో ‘సీక్రెట్’పెట్టుబడులు పెట్టిన పలువురు రాజకీయ నాయకులు, వారి దగ్గరి బంధువులతోపాటు కొందరు సినీ ప్రముఖులు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లెక్కకు మించి పెట్టుబడులు రాజకీయ, సినీ ప్రముఖుల్లో కొందరు బినామీల ద్వారా దుబాయ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఉత్తర తెలంగాణకు చెందిన పలువురు కీలక నేతలు రియల్ ఎస్టేట్ (లగ్జరీ ఫ్లాట్లు, విల్లాలు), హోటల్స్, గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టారని తెలిసింది. అలాగే దక్షిణ తెలంగాణకు చెందిన ఓ జిల్లాలోని కీలక నేతల్లో ఇద్దరికి దుబాయ్‌లో హోటల్, రియల్ ఎస్టేట్, ఐటీ, మైనింగ్ వ్యాపారాలు ఉన్నట్లు గట్టి ప్రచారం ఉంది. రియల్ ఎస్టేట్‌లో తెలుగువాళ్ల పెట్టుబడులు 2025లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రికార్డుస్థాయిలో సుమారు 249 బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిగాయి. ఇందులో భారతీయ పెట్టుబడులే 30 శాతం వరకు ఉన్నట్లు దుబాయ్ ట్రేడ్ వర్గాలను ఉటంకిస్తూ ఓ నివేదిక వెలువడింది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీ, రియల్ రంగంలో ఉన్న వారు పెద్దఎత్తున దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. లగ్జరీ విల్లాలు, అపార్ట్మెంట్లు, ఆఫ్–ప్లాన్ ప్రాజెక్టులు దుబాయ్‌లో బూమ్‌లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు ’వెయిట్ అండ్ వాచ్’ మోడ్‌లోకి వెళ్లారు. ‘పానిక్ లేదు, కానీ డెసిషన్ మేకింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఒక క్లయింట్ డీల్ బ్యాక్ అవుట్ చేశాడు. చాలామంది ఒప్పందాలు జాప్యం చేయమంటున్నారు. సైట్ విజిట్స్ తగ్గాయి. లావాదేవీలు 30–40% పడిపోయే అవకాశం ఉంది. లగ్జరీ సెగ్మెంట్ మరింత దెబ్బతింటోంది. ఇన్వెస్టర్లు ఆస్తుల విలువ పడిపోవడం, ఫోర్స్డ్ సేల్స్ భయంతో ఉన్నారు’అని దుబాయ్‌లో తెలుగు పెట్టుబడుదారులకు సంబంధించి బ్రోకర్‌గా పనిచేసే వ్యక్తి ఒకరు ఫోన్లో చెప్పారు. అలాగే హోటల్, పర్యాటక రంగం మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో అరైవల్స్ తగ్గాయి. పామ్ జుమైరా, దుబాయ్ మెరీనా హోటల్స్ ఆక్యుపెన్సీ రేట్లు దారుణంగా పడిపోయాయి. మైనింగ్, గోల్డ్ బిజినెస్‌లో డైరెక్ట్ డ్యామేజ్ తక్కువే అయినా, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కాంట్రాక్టులు రీ–నెగోíÙయేట్ అవుతున్నాయి. ఇవన్నీ గల్ఫ్‌లో పెట్టుబడిపెట్టిన తెలుగు ప్రముఖులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
అమెరికా అప్రమత్తం.. పశ్చిమాసియాకు మరిన్ని దళాలు..!
పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా మరింత అప్రమత్తమైంది. ఇరాన్ పెద్దఎత్తున దాడులకు దిగడంతో అమెరికా సైతం సైనిక మోహరింపును మరింత పెంచింది. ఈ అత్యవసర చర్య మిత్రదేశాల భద్రత కోసమేనని తెలిపింది. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాలు మరియు యుద్ధనౌకలు ఇప్పటికే మోహరించినప్పటికీ.. కొత్త సైనిక బలగాన్ని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.ఇరాన్‌తో పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగడంతో యూఎస్ రక్షణ శాఖ పెద్ద సంఖ్యలో మరిన్ని దళాలను మోహరించాలని ఆదేశించింది. అంతేకాకుండా గల్ఫ్ ప్రాంతం అంతటా హై అలర్ట్ ప్రకటించింది. ఇరాన్ ఎదురుదాడితో అప్రమత్తమైన అమెరికా సైనిక స్థావరాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసింది. మరోవైపు ప్రస్తుత జరుగుతోన్న యుద్ధంతో ప్రపంచ మార్కెట్లు, చమురు ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనే ఆందోళన నెలకొంది. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు జరుగుతున్నా.. రెండు వైపులా ఎవరు కూడా తగ్గకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఇరాన్- అమెరికా చర్చలు జరిగే పరిస్థతులు ఏ మూలానా కనిపించడం లేదు. -
ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం : జీసీసీ
ఇరాన్ దాడులపై గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ స్పందించింది. ఈ దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. అబుదాబి, రస్ ఆల్ ఖైమాలపై ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అబుదాబిలో గిడ్డంగులు దెబ్బతిన్నాయి. ఇరాన్ దాడి తర్వాత జెబెల్ అ లీ ఓడరేవు నుండి పొగలు ఎగసిపడుతున్నాయి.కాగా.. అబుదాబి, రస్ అల్ ఖైమాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడిలో యుఎఇ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. నిన్న మధ్యాహ్నం ముసాఫా పారిశ్రామిక ప్రాంతంపై ఈ దాడి జరిగింది. ముసాఫా, ఐసిఎడిలోని గిడ్డంగులను క్షిపణి శిథిలాలు తాకాయి. అయితే ఈ దాడుల్లో ఎవరూ గాయపడలేదు. సాయంత్రం జరిగిన దాడిలో ఓ క్షిపణి యూఎస్ సైనిక స్థావరంలోని నిల్వ కేంద్రం దగ్గర పడింది. ఆ సమయంలో భారీ పేలుడు జరిగింది.నిన్న రస్ అల్ ఖైమాలో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. వెంటనే అగ్నిమాపక దళం అదుపులోకి తీసుకొచ్చింది. చమురు, ఇంధన వనరులపై దాడి చేసిన ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని గల్ఫ్ దేశాల సమూహం అయిన జీసీసీ ప్రకటించింది. అయితే అబుదాబి, రస్ అల్ ఖైమాను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను యూఏఈ రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. కొన్ని గిడ్డంగులు శిథిలాల నుండి నష్టపోయినప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
పశ్చిమాసియాలో యుద్ధం.. హైపర్సోనిక్ క్షిపణిని ఇరాన్ ప్రయోగిస్తుందా?
అమెరికా-ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సైతం ఇరాన్‌పై దాడులు ముమ్మరం చేశాయి. అయితే తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన ఫతా-2 హైపర్సోనిక్ క్షిపణిని మోహరించింది. ఫతా-2 క్షిపణిని మోహరించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఫతా బాలిస్టిక్ క్షిపణి అప్‌గ్రేడ్ వెర్షన్ అని ఫతా-2 క్షిపణిగా తెలుస్తోంది. ఈ క్షిపణిని ప్రయోగిస్తున్నట్లు ఇరాన్ ఇంకా ధృవీకరించకపోయినా.. దేశ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ హత్య ఈ ఫతా-2 వంటి క్షిపణులను ఉపయోగించి ఉండవచ్చని ఓ మ్యాగజైన్ కథనం ప్రచురించింది.ఫతా-2 హైపర్సోనిక్ క్షిపణి ప్రభావం..ఈ హైపర్సోనిక్ క్షిపణి ఫతా-2ను నవంబర్ 2023లో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రవేశపెట్టింది. ఇది సంప్రదాయ బాలిస్టిక్ క్షిపణి రీఎంట్రీ వాహనానికి బదులుగా.. హైపర్సోనిక్ గ్లైడ్ వాహనాన్ని ఉపయోగించేందుకు రూపొందించారు. ఇది ఊహించని దిశల నుండి లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడనుందని సమాచారం.ఈ ఫతా-2 క్షిపణి 1,400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. మాక్ 15 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని తెలిపారు. ఈ హైపర్సోనిక్ క్షిపణి శక్తివంతమైన 200 కిలోగ్రాముల వార్‌హెడ్‌ను మోయగలదని వెల్లడించారు.కాగా.. టెహ్రాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులను ప్రారంభించింది. యుఎఇ, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ దాడులు స్థావరాలు, నౌకాదళ ప్రధాన కార్యాలయాలు సహా అమెరికా రాయబార కార్యాలయాలు, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడుల చేస్తోంది. దీనివల్ల గల్ఫ్ వైమానిక రక్షణ వ్యవస్థలకు తీవ్ర అటంకం కలుగుతోంది. ఈ దాడులతో ప్రభావిత ప్రాంతాలలో ప్రాణనష్ట, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. -
ఇరాన్‌ను కాపాడుకుంటాం చైనా కీలక ప్రకటన..
-
అమెరికాకు చైనా చెక్ పెట్టాలా
-
మిస్సైల్, డ్రోన్ దాడులతో గల్ఫ్ గడగడ.. అరబ్ దేశాల ఉనికికి ముప్పు?
-
నాలుగో రోజుకు చేరుకున్న యుద్ధం.. వార్‌లోకి చైనా ఎంట్రీ..!
-
ఇరాన్‌కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు
-
24 గంటల్లో ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం
-
ఇండియన్ రూపాయిపై యుద్ధం ఎఫెక్ట్
-
నెతన్యాహు లక్ష్యంగా క్షిపణుల వర్షం.. ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు
-
ఇజ్రాయెల్ ప్రధాని మృతి? ఇరాన్ కీలక ప్రకటన
-
అమెరికాకు మద్దతుగా యూరప్ ఇరాన్ పని ఖతం
-
యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన.. యుద్ధం మేం ప్రారంభించలేదు
-
టూరిజం స్పాట్ లే టార్గెట్‌గా ఇరాన్ భీకర దాడులు..
-
ఇరాన్ ది అనుకోని.. మూడు US విమానాలను కూల్చేసిన కువైట్
-
ఇరాన్ విదేశాంగ మంత్రి - అరగ్బీ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం వద్దు.. శాంతే కావాలి..!
-
హెచ్చరిక లేకుండా .. ఇరాన్ మిస్సైల్ దాడి.. కువైట్‌లో అమెరికా సైనికులు మృతి
-
అణ్వాయుధాలకు చేరువలో ఇరాన్.. ఆయుధాలు అందితే వినాశనమే?
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా.. ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేశాయి. -
గల్ఫ్ దేశాల గుండెల్లో గుబులు
అమెరికా–ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంతో మూడో రోజు కూడా గల్ఫ్ ప్రాంతం రణరంగంగా మారింది. కువైట్‌లో అమె రికాకు చెందిన రెండు ఎఫ్–15 యుద్ధ విమానాలను ఇరాన్ రెవల్యూ షనరీ గార్డ్స్ క్షిపణులతో కూల్చివేశారు. అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడం ఇటీవల అరుదైన విషయం. ఇరాన్ మిస్సైల్ డ్రోన్ల దాడులకు సౌదీ అరేబియా వణికిపోయి అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని మూసివేసింది. ఇరాన్ క్షిపణులతో గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావ రాలు ఉన్న దేశాలు వణికిపోయాయి. అమెరికా, ఇజ్రాయెళ్లు ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీని హత్య చేసి రెడ్ లైన్ దాటాయనీ, గల్ఫ్‌లో అమెరికాకు కీలకమైన దేన్నీ వదిలిపెట్టమనీ ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఇరాన్లో పరిపాలనను అమెరికా, ఇజ్రాయెళ్ల తొత్తుల చేతుల్లోకి మార్చడం అసాధ్యమని రెండు దేశాలూ గుర్తించి ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్, లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ తదితర అనేక పట్టణాలలో భారీ ప్రదర్శనలు జరిగాయి. పాకిస్తాన్లో వేల మంది ప్రదర్శన కారులపై జరిగిన మిలిటరీ దాడిలో 21 మంది చనిపోయారు.ఇరాన్‌కు 2025 వేసవిలో జరిగిన 12 రోజుల యుద్ధపు గాయాలు, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల వల్ల పెరిగిన ఇటీవలి ధరలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ గాయాలు మాననే లేదు. మళ్లీ యుద్ధం వచ్చిపడింది. ‘పెంటగాన్’ వద్దని చెప్పినా వినకుండా అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నాయి. ఒమన్, స్విట్జర్లాండ్ మధ్యవర్తులుగా అమెరికా–ఇరాన్‌ల మధ్య మూడో దఫా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధాన్ని నివారించడానికి పశ్చిమ ఆసియాలోని అన్ని దేశాలతో కలిసి చైనా ప్రత్యేక రాయబారి ఎడతెరిపి లేని దౌత్య ప్రయత్నాలు చేస్తున్నా అమెరికా–ఇజ్రాయెళ్లు... ఇరాన్‌పై ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధానికి రెండు రోజుల ముందు, భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో పర్యటించడం నివ్వెర పరిచింది. గాజాపై పాలస్తీనా చేసిన జాతి హత్యాకాండతో, ప్రపంచంలో ఏకాకిగా మారిన బెంజిమెన్ నెతన్యాహూతో కలిసి మోదీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ పర్యటన భారత విదేశాంగ విధానంపై గల్ఫ్ దేశాలలో అనేక అనుమానాలకు దారి తీసింది. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కూల్చడానికి చైనా ఆధ్వర్యంలో రష్యా, బ్రెజిల్ తదితర దేశాలతో కలిసి భారత్ బ్రిక్స్ సీబీడీసీ డిజిటల్ కరెన్సీ అనుసంధానాన్ని ప్రపంచ స్థాయిలో కొనసాగిస్తోంది. అనేక రకాలుగా అండనిస్తున్న అరబ్బు మిత్రులను వదిలి భారత్ ఇజ్రాయెల్ వైపు ఎందుకు ఒరుగుతోంది?హోర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైనది. ఇది ఇరాన్ సముద్ర జలాల్లో ఉంది. పర్షియన్ సింధు శాఖ, ఒమన్ సింధు శాఖలను కలిపే అత్యంత ఇరుకైన సముద్ర మార్గమిది. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం (ఐదో వంతు) ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీనిని ‘ప్రపంచ చమురు జీవనాడి’ అని పిలుస్తారు. ఖమేనీ హత్యతో ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. దీంతో ఇప్పుడు ప్రపంచానికి చమురు తిప్పలు పెరిగాయి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 40%ను ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ పార్లమెంట్లో పాలస్తీనా స్వయం నిర్ణయాధికార హక్కును భారత ప్రధాని గుర్తించారు. ‘హమాస్’ దాడిని, హత్యలను ఖండించారు. కానీ 75 వేల గాజా ప్రజలపై ఇజ్రాయెల్ చేసిన హత్యా కాండను ఖండించలేదు. ఇప్పుడు భారత చిరకాల స్నేహితుడైన ఇరాన్‌పై యుద్ధం ఆపమని మోదీ అమెరికా–ఇజ్రాయెళ్లను కోరక పోవడం ఓ విషాదం. గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నంత కాలం నిజమైన శాంతి లేదని ఆ దేశాల ప్రజలలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆర్థిక వ్యవస్థల వినాశనానికి అసలు కారణం ‘అమెరికా సైనిక స్థావరాలే కదా’ అనే ఆలోచన గల్ఫ్ దేశాల అగ్ర నాయకుల గుండెల్లో పాతడంలో ఇరాన్ విజయం సాధించింది.– నైనాల గోవర్ధన్ ‘ సామాజిక విశ్లేషకులు -
ఇరాన్‌పై మరిన్ని దాడులు.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ మాతో చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము చేసిన దాడుల్లో ఇప్పటికే సైనిక ఉన్నతాధికారులు పెద్దసంఖ్యలో మరణించారని తెలిపారు. ఇరాన్‌పై ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుందని అన్నారు. తాము ఇంకా దాడులు ఉధృతం చేయలేదని అన్నారు. త్వరలోనే దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించారు.ఇరాన్ ప్రతిసారి అబద్ధాలు చెబుతోందని ట్రంప్ అన్నారు. ఈ యుద్ధం మరో 4 నుంచి ఐదు వారాల పాటు కొనసాగుతందని స్పష్టం చేశారు. ఇరాన్‌ను మా బలగాలు తరిమికొట్టాయని తెలిపారు. ఇరాన్‌కు చెందిన 10 వార్‌షిప్‌లను అమెరికా ధ్వంసం చేసిందని వెల్లడించారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ట్రంప్ అన్నారు. ఇవాళ రాత్రంతా ఇరాన్‌పై దాడులు జరుపుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
యుద్ధం ఎఫెక్ట్: న్యూఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
న్యూఢిల్లీ : మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో ఇప్పటికే నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.ఆయా దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ పౌరులు మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న విచారణలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అవసరమైన సమన్వయం మరియు సహాయం అందించేందుకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఈ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చు.24×7 కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు(న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పనిచేస్తుంది)వందన బరువా, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్-91 9871999044సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్-91 9958322143 -
న్యూక్లియర్ వాచ్ డాగ్ వార్నింగ్, స్పందించని ఇరాన్
US-Iran War పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (IAEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. IAEA డైరెక్టర్ జనరల్ రఫెల్ మరియానో గ్రాస్సీ (Rafael Mariano Grossi) కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్‌లోని అణుకేంద్రాలపై దాడులు జరిగితే, ప్రమాదకరమైన రేడియోధార్మిక పదార్థాలు వాతావరణంలోకి విడుదలయ్యే ప్రమాదం ఉందని, ఆ అవకాశాన్ని తాము తోసిపుచ్చలేమని ఆయన స్పష్టం చేశారు.ఇరాన్ సరిహద్దు దేశాలలో సాధారణ నేపథ్య స్థాయిలకంటే రేడియేషన్ స్థాయిలు పెరగనప్పటికి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది, ప్రధాన నగరాల కంటే పెద్దవిగా లేదా పెద్దవిగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరంతో సహా తీవ్రమైన పరిణామాలతో కూడిన రేడియోలాజికల్ విడుదల ప్రమాదం ఉందన్నారు. పరిస్థితి మరింత ముదరకుండా ఉండాలంటే గరిష్ట సంయమనం పాటించాలి. తిరిగి దౌత్య చర్చలు జరగాలని కోరారు. (భీకర దాడుల వేళ, దుబాయ్ సంచలన నిర్ణయం)అణు ప్రమాదం లేకపోలేదు ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలపై ప్రభావం పడిందని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఐక్యరాజ్యసమితి అణుశక్తి విభాగం చీఫ్ రాఫెల్ గ్రోసీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం, ఇరాన్‌లోని ఏ అణు కేంద్రం కూడా దెబ్బతినలేదు" అని పునరుద్ఘాటించారు. ఒకవేళ అణు వికిరణం (Radiation) సంభవిస్తే, అది అత్యంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని గ్రోసీ హెచ్చరించారు. దీనివల్ల పెద్ద నగరాలు, పెద్ద ప్రాంతాల నుండి ప్రజలను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇరాన్ అణు నియంత్రణ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ వారి నుండి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని గ్రోసీ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ అనివార్య మైన కమ్యూనికేషన్ ఛానెల్‌ను పునరుద్ధరించగలమని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ముఖ్యంగా బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్, టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ లేదా ఇతర అణు ఇంధన చక్ర సౌకర్యాలు దెబ్బతిన్నట్లు తమకెలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేడియోధార్మిక విడుదల జరిగే అవకాశాన్నికొట్టిపారేయలేం, తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా గ్రోసీ హెచ్చరించారు.ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది! -
ఇజ్రాయిల్ ప్రధాని టార్గెట్‌గా ఇరాన్ మిసైల్ దాడులు
అమెరికా-ఇజ్రాయిల్ లు సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయుతుల్లా ఖమేనీ మృతిచెందిన తర్వాత యుద్ధ తీవ్రత మరింత ముదిరింది. తన శత్రు దేశాలుగా భావిస్తున్న వాటిపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ప్రధానంగా ఇజ్రాయిల్‌ను టార్గెట్ చేసి ఇరాన్ ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఈరోజు(మార్చి 2వ తేదీ) ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ టార్గెట్‌గా ఇరాన్ దాడులు క్షిపణులతో దాడులకు దిగింది. తాము ఇజ్రాయిల్ ప్రధాని టార్గెట్‌గా దాడి చేసిన విషయాన్ని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రకటించింది. ఇజ్రాయిల్ ప్రధాని ఆఫీస్‌పై క్షిపణులతో దాడి చేశామని, కానీ నెతాన్యాహూ ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదని స్పష్టం చేసింది. అయితే తాము జరిపిన దాడుల్లో ఇజ్రాయిల్‌కు చెందిన పలువురు కమాండర్లు హతమయ్యారని ఐఆర్జీసీ వెల్లడించింది. ఒమన్ మా లక్ష్యం కాదు..ఇదిలా ఉంచితే, ఇరాన్ చేస్తున్న యుద్ధంలో పలు దేశాలకు భారీ నష్టం వాటిల్లితోంది. అరబ్ దేశాలపై కూడా ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. దానిలో భాగంగా ఒమన్‌పై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ రెండు డ్రోన్లతో ఒమన్‌లోని డుక్మ్ వాణిజ్య పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఒక డ్రోన్ కార్మికుల నివాస ప్రాంతాన్ని తాకగా, ఒక విదేశీయుడు గాయపడ్డాడు. మరొక డ్రోన్ ఇంధన నిల్వ ట్యాంకుల దగ్గర పడింది కానీ పెద్ద నష్టం జరగలేదు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ మాట్లాడుతూ.. ‘ మా చాయిస్ ఒమన్ కాదు. కానీ దాడులు జరిగాయి. మేము మా సైనికులకు ఇప్పటికే చెప్పాం. మన లక్ష్యం మీద మాత్రమే మన గురి ఉండాలనే విషయం చెప్పాం. కానీ ఒమన్‌పై దాడి జరిగింది. మా సైనిక విభాగాలు ఇప్పుడు, వాస్తవానికి, స్వతంత్రంగా, మరొకవైపు వేరుపడిన స్థితిలో ఉన్నాయి. అవి ముందుగానే ఇచ్చిన సాధారణ సూచనల ఆధారంగా పనిచేస్తున్నాయి’ అని తెలిపారు. వారిని హతమార్చాం: ఇజ్రాయెల్ఇరాన్ ఇండిలిజెన్స్ వ్యవస్థకు సంబంధించిన కీలక అధికారులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఆ దేశ ఇంటిలిజెన్స్ డిప్యూటీ మంత్రి సయ్యద్ యాహ్యా హమీది, ఇంటెలిజెన్స్ చీఫ్ జలాల్ పౌర్ హుస్సేన్‌లతో పాటు ఇతర అధికారులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. -
షార్జా ఎయిర్ పోర్టుపై బాంబుల వర్షం.. భయంతో వణుకుతున్న భారతీయులు
-
భీకర దాడుల వేళ, దుబాయ్ సంచలన నిర్ణయం
US Iran War ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ఇరాన్ ప్రతీకార దాడుల మధ్య మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో వైమానిక సర్వీసులు తీవ్రంగా ప్రభావితమైనాయి. దీంతో ఎక్కడి ప్రయాణీకులు అక్కడే నిలిచి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దుబాయ్, అబుదాబి అధికారులు మానవత్వాన్ని చాటు కున్నారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల కారణంగా బయలుదేరలేని టూరిస్టుల బసలను పొడిగించాలని హోటళ్లను ఆదేశించారు.ఇరాన్ ప్రతీకార దాడులు గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్‌లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడులలో దుబాయ్ ఎయిర్‌పోర్టు, ప్రముఖ బుర్జ్ అల్ అరబ్ హోటళ్లు దెబ్బతిన్నాయి. అనేక విమానాలు నిలిపివేయడంతో, GCC దేశాలలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీంతో దుబాయ్ ఆర్థిక మరియు పర్యాటక శాఖ హోటల్ నిర్వాహకులకు అధికారిక ఆదేశాన్ని జారీ చేసింది, అతిథుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వండి, వసతి కొనసాగించడం, ప్రయాణికులు బయలుదేరలేకపోతే , వారిని ఖాళీ చేయించకుండా ఉండాలని, ఒక వేళ వెంటనే చెల్లించలేకపోతే వారి గదులను ఖాళీ చేయమని కోరవద్దని ఆదేశించింది. ప్రభావిత అతిథులు బసలను పొడిగించడానికి అనుమతించమని వారికి సూచించింది. హోటల్ జనరల్ మేనేజర్లను ఉద్దేశించి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇదీ చదవండి: 82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొంతమంది అతిథుల చెక్-అవుట్ సమయం ముగిసినా, వారు బయలుదేరే వరకు వారి బసను పొడిగించాలని దీనికి సంబంధించిన అదనపు బస ఖర్చులను DCT అబుదాబి భరిస్తుందని వారికి తెలిపింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. Wow. pic.twitter.com/fo7DSPfaXB— Samir Arora (@Iamsamirarora) March 1, 2026చూసి నేర్చుకోండి! పెట్టుబడిదారుడు సమీర్ అరోరా ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. అంతరిక్ష పరిశ్రమ శాస్త్రవేత్త హితేష్ మోదీ ఇలా రాశారు: "ఇది వేరే ప్రదేశం అయితే, అటువంటి అత్యవసర పరిస్థితుల్లో వారు ధరలను మూడు రెట్లు పెంచేవారు." అని వ్యాఖ్యానించారు. ‘‘ఇతర ప్రపంచ నాయకులు UAE నుండి నేర్చుకోవాలి. నేనుప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను, ఈ దేశ పాలన మానవాళి భద్రత కోసం అత్యున్నత స్థాయి శ్రద్దతీసుకుంటున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మీ గురించి దయచేసి ఈ సందేశాన్ని మీ హోటల్ మేనేజర్‌కు చూపించండి" అని కతార్జినా కొమోరోవిచ్ ట్వీట్ చేశారు. I am currently in Dubai, the governance of this country is the highest level of deep care for safety of Humanity. May all other leaders watch and learn. Of you currently in #Dubai please show this message to your hotel Manager. https://t.co/L6CLQLCiLL— Katarzyna Komorowicz (@KasiaKomorowicz) March 2, 2026 -
వాళ్లందరినీ ఇరాన్ పంపించేయండి.. యాంకర్ రష్మి ట్వీట్
పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మొదలైన యుద్ధం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఆ రెండు దేశాలతో పాటు యుద్ధ ప్రభావం.. యూఏఈ, దుబాయి, ఖతార్, బహ్రెయిన్ తదితర దేశాలపై కూడా పడింది. దీంతో ఆయా దేశాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. మరోవైపు తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ చేసిన పలు ట్వీట్స్ ఇప్పుడు షాక్‌కి గురిచేస్తున్నాయి.'మన దేశం.. ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలని గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేం సహించం. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం' అని రష్మి తన ట్విటర్లో రాసుకొచ్చింది. రాడికల్ (అతివాద) ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్లని దయచేసి ఇరాన్‌కి పంపాలని ఏకంగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు తదితర అంతర్గత సమస్యలు ఉన్నాయని, వీటికి తోడుగా ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్నవాళ్ల మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాల్లో ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని, కానీ తాను ఒక స్వతంత దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మి తెలిపింది. ఈ క్రమంలోనే పలువురు రష్మి.. వైవాహిక జీవితం గురించి ప్రశ్నించగా వాటికి కూడా ఘాటుగా సమాధానమిచ్చింది. 'నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నాసరే నా దేశంలో పూర్తి గౌరవంతో వ్యక్తిత్వంతో బతుకుతున్నాను' అని రష్మి చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలని కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. . -
ఇరాన్ వార్ టెన్షన్.. మోదీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్దంతో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయన్నారు. ఈ సమయంలో ఇరువర్గాలు సమన్వయం పాటించాలని చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. భారత్ ఎప్పుడూ శాంతి కోసమే కృషిచేస్తుందని మోదీ తెలిపారు. నిన్న ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో హతమైన సంగతి తెలిసిందే. ఆయన మృతితో ఇరాన్ రెచ్చిపోతుంది. తన సమీప గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ పైనా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ప్రతి దాడులు చేస్తుండడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై నిఘా పెట్టాలని సూచించింది. మత ప్రచారాలను గుర్తించి ముందస్తు చర్యలను తీసుకోవాలంది. ఉద్రిక్త ప్రసంగాలు చేసే వారిపై నిఘా ఉంచాలని తెలిపింది. అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. -
కేంద్రం హెచ్చరిక.. భారత్ లో హింస జరిగే అవకాశం..
-
వార్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
-
కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్
-
‘ఒక్క దెబ్బకు..’ ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు మిన్నంటుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా చేపట్టిన మెరుపు దాడుల్లో ఇరాన్‌కు చెందిన 48 మంది అగ్రశ్రేణి నేతలు ఒకేసారి హతమయ్యారని ట్రంప్ పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ఆపరేషన్ ఊహించిన దానికంటే వేగంగా, అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగిన ఈ దాడులు ఆ దేశ నాయకత్వాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నూతన నాయకత్వం తమతో చర్చలకు సిద్ధమనే సంకేతాలు పంపిందని ట్రంప్ పేర్కొన్నారు.గతంలోనే చర్చలకు రావాల్సింది పోయి మొండిగా వ్యవహరించిన ఇరాన్.. ఇప్పుడు దిగి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకాదళాన్ని అమెరికా బలగాలు నామరూపాల్లేకుండా చేశాయని అన్నారు. ఇరాన్‌కు చెందిన తొమ్మిది భారీ యుద్ధనౌకలను సముద్రంలో ముంచివేశామని, ఆ దేశ నావికాదళ ప్రధాన కార్యాలయాన్ని కూడా దాదాపుగా ధ్వంసం చేశామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన నౌకలను కూడా త్వరలోనే నామరూపాలు లేకండా చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు.. ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్ నగరంపై తమ దాడులు కొనసాగుతాయని, రానున్న రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, మొసాద్ అధిపతితో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ ఉగ్రవాద పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు పునరుద్ఘాటించారు. తమ పోరాటానికి అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ అందిస్తున్న సహకారానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఘర్షణల్లో ప్రాణనష్టం కూడా భారీగా పెరుగుతోంది. ఇరాన్ జరిపిన ఎదురు దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా, టెల్ అవీవ్, బీట్ షెమెష్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పౌరులు కూడా మరణించారు. కాగా ప్రాంతీయ దౌత్యవేత్తలు శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ విదేశాంగ మంత్రి యుద్ధ విరమణను గట్టిగా కోరుతున్నారు. ఇరాన్ కూడా ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. ఇది కూడా చదవండి: వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి -
యుద్ధం పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలు
-
భీకర దాడులు..వైమానిక రంగం కుదేలు
-
వైమానిక దాడి.. ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి
టెహ్రాన్: ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు, కరుడుగట్టిన సిద్ధాంతకర్త మహముద్ అహ్మదీ నెజాద్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ మీడియా సంస్థ ‘మారీవ్’ కథనాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొంతకాలంగా అహ్మదీ నెజాద్ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన నివాసమే లక్ష్యంగా జరిగిన ఈ క్షిపణి దాడిలో నెజాద్ మృతి చెందారు.ఇరాన్ ఆరో అధ్యక్షుడిగా 2005 నుండి 2013 వరకు బాధ్యతలు నిర్వర్తించిన అహ్మదీ నెజాద్.. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేతగా పేరుగాంచారు. టెహ్రాన్ మేయర్ స్థాయి నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2005లో అప్పటి అగ్రనేత అక్బర్ హషీమీ రఫ్సంజానీని ఓడించి, అనూహ్యంగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. తన పదవీ కాలంలో ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతూ, అంతర్జాతీయంగా ఇరాన్‌ను తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణంలోకి నెట్టారని చెబుతుంటారు. ఆయన తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవడమే కాకుండా, ఇరాన్ దౌత్యపరంగా ఏకాకి కావడానికి దారితీశాయని విశ్లేషకులు అంటుంటారు.2023లో అమెరికన్ల అక్రమ నిర్బంధం కేసులో ప్రమేయం ఉన్నందుకు గాన అమెరికా ప్రభుత్వం ఆయనపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఉనికిపై నెజాద్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. 2005లో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్‌ను ‘క్యాన్సర్ గడ్డ’గా అభివర్ణించడమే కాకుండా, ప్రపంచ పటం నుండి ఆ దేశాన్ని తుడిచివేయాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైనప్పటికీ, అహ్మదీ నెజాద్ తన మొండి వైఖరిని వీడలేదు. 2007లో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో నెజాద్ ప్రసంగిస్తూ ఇరాన్లో అసలు స్వలింగ సంపర్కులే లేరని ఆయన చేసిన ప్రకటన అంతర్జాతీయ వేదికలపై విమర్శలకు గురైంది. ఇది కూడా చదవండి: ‘ప్రాణభయంతో పరుగులు’.. వణుకుతూ వివరించిన ‘ఏంజెల్’ -
Hyderabad: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హైదరాబాద్ వాసులపై పడుతోంది. అనేకమంది ప్రయాణికులు, యాత్రికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. గగనతలాలను (ఎయిర్‌స్పేస్) మూసివేయడంతో పాటు ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయిస్తుండడంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఆయా దేశాల్లో ఇక్కట్లు పడుతున్నారు. ట్రాన్సిట్ వీసాలు తీసుకోవడానికీ అవకాశం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అక్కడి ఎంబసీ కార్యాలయాలకు ఫోన్లు చేసినా స్పందన ఉండట్లేదని నగరంలో ఉన్న వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయా దేశాల్లోని అన్ని విమానాశ్రయాలు మూతపడడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అమెరికా, యూకేతో పాటు యూరోప్ దేశాలకు ప్రయాణించే వారు విమాన టిక్కెట్లు నేరుగా తమ గమ్యస్థానానికే తీసుకున్నా... అలా ప్రయాణించడం సాధ్యం కాదు. సింగపూర్‌తో పాటు దుబాయ్, దోహా, అబుదాబి తదితర ప్రాంతాల్లో కొన్ని గంటలు ఆగి ముందుకుసాగాల్సిందే. వీటినే ట్రాన్సిట్ పాయింట్స్ అంటారు. శనివారం నగరం నుంచి వెళ్లినవారు ట్రాన్సిట్ పాయింట్స్‌లో చిక్కుకుపోయారు. హఠాత్తుగా కమ్మేసిన యుద్ధ మేఘాలు, ఎయిర్ స్పేస్‌లు మూసేయడం, వందల అంతర్జాతీయ సరీ్వసుల రద్దు, ప్రయాణికుల లగేజీ దించేయడంతో దుబాయ్, అబుదాబి, దోహా తదితర విమానాశ్రయాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి లగేజీ కుప్పలు కనిపిస్తున్నాయి.హోటల్స్‌లోనూ బసకు అవకాశం లేక... ప్రయాణం మధ్యలో, ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో ఆయా దేశాల్లో కొన్ని రోజులు ఉండాలంటే కచి్చతంగా ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో ఉండే ఈ వీసా కౌంటర్లు సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉంటాయి. ఇక యుద్ధ వాతావరణంలో శనివారం వీటి వద్ద భారీగా క్యూలు పెరిగిపోయాయి. దీంతో అందరికీ ఈ వీసాలు లభించట్లేదు. మరోపక్క విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రికే ప్రయాణికులను విమానాశ్రయం బయటకు పంపేశారు. సాధారణంగా విమానయాన సంస్థలకు హోటల్స్‌కు మ«ధ్య ఒప్పందాలు ఉంటాయి. అనివార్య పరిస్థితుల్లో ప్రయాణికులను ఎయిర్‌లైన్స్‌లు ఒప్పందం ఉన్న హోటల్స్‌కు పంపి బస కల్పిస్తాయి. శనివారం రాత్రి ఓచర్లు ఇచ్చి ఇలానే చేశాయి. అప్పటికే హోటళ్లు ఖాళీ లేకపోవడం, ఆహారం, నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు గదులు ఇవ్వడం లేదు.విహారయాత్రికులది మరో పరిస్థితి... ఆయా ట్రాన్సిట్ కంట్రీస్‌కు టూరిస్టులు సైతం ఎక్కువ సంఖ్యలోనే వెళ్తుంటారు. సాధారణంగా 4నుంచి 15 రోజుల ప్యాకేజీలతో వెళ్లి వస్తుంటారు. ఇందులోనే రాను–పోను చార్జీలు, బస, స్థానికంగా రవాణా తదితరాలు ఉంటాయి. నగరం నుంచి గత వారం రోజుల్లో దుబాయ్ సహా ఇతర ప్రాంతాలకు టూరిస్టులుగా వెళ్లినవాళ్లు హోటళ్లలో ఇరుక్కుపోయారు. ఇలాంటివారిలో పీవీ సింధు, మంచు విష్ణు వంటి సెలబ్రిటీలు సైతం ఉన్నారు. వీరికి ఇబ్బంది లేకపోయినా సాధారణ టూరిస్టులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్యాకేజీ సమయం మీరిన తర్వాత, కొన్ని హోటళ్లలో సమయం ఉన్నప్పటికీ బస చేయడానికి యాజమాన్యాలు అంగీకరించట్లేదు. తాము వసతులు కలి్పంచలేమని, ఆహారం అందించలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కొన్ని హోటల్స్‌లో బస కలి్పంచడానికి భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలిసిన వారు ఎవరూ లేకుంటే ఇబ్బందే గత నెల 22న విహార యాత్ర నిమిత్తం దుబాయ్ వచ్చా. తాజా ఉద్రిక్తతలతో శనివారం నుంచి హోటల్ రూమ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇక్కడ వాట్సాప్ కూడా పని చేయకపోవడంతో కుటుంబీకులతో సంప్రదింపులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడికక్కడ క్షిపణులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియట్లేదు. స్థానికంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఇబ్బంది లేదు. టూరిస్టు, ప్యాసింజర్‌గా వచి్చనవాళ్లు మాత్రం ఇబ్బంది పడాల్సిందే. భయానక పరిస్థితుల మధ్య క్షణమొక యుగంగా గడుపుతున్నాం. అబుదాబి, దోహాల్లోనూ ఇలానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి విమానాశ్రయాలు మూసివేశారు. –వినయ్ కుమార్, మియాపూర్


