ఐదుగురు భారతీయులు మృతి: విదేశాంగ మంత్రిత్వ శాఖ | Us Israel Iran War Live Updates March 14 | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఐదుగురు భారతీయులు మృతి: విదేశాంగ మంత్రిత్వ శాఖ

యుద్ధ నౌకలను పంపండి: ట్రంప్‌

  • యుద్ధనౌకలను పంపండి: ప్రపంచ దేశాలకు ట్రంప్‌ పిలుపు
  • ఇరాన్ హార్ముజ్ జలసంధిని అంతం చేయడానికి ట్రంప్ సందేశం
  •  హార్ముజ్ జలసంధి ఓపెన్‌ అవ్వాలంటే మిగతా దేశాల సాయం అవసరం
2026-03-14 21:22:02

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణుల వర్షం

  • ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భారీగా క్షిపణులతో దాడులు
  • మరికొన్ని దేశాల్లో అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు ఉద్ధృతం చేశాం: ఇరాన్‌ 
  • గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు
  • అబుదాబి, యూఈఏ, బహ్రెయిన్‌పై డ్రోన‍్లతో దాడులు 
  • యూఏఈలోని అతిపెద్ద ఆయిల్‌ టెర్మినల్‌పై దాడి 
  • కోస్టల్‌ సిటీ ఫుజైరాలోని పోర్టులో ఉన్న ఆయిల్‌ టెర్మినల్‌పై దాడి
  • ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యాపించిన పొగ
     
2026-03-14 20:33:51

జెరూసలేం వద్ద గగనతలంలో పేలుళ్ల శబ్దాలు

ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు
ఇరాన్ క్షిపణులు వస్తున్నట్టు గుర్తించిన ఇజ్రాయెల్‌ 
ఆ వెంటనే జెరూసలేం వద్ద గగనతలంలో పేలుళ్ల శబ్దాలు
తమ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయన‍్న ఇజ్రాయెల్‌

2026-03-14 19:38:25

గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఆందోళన వద్దు: కేంద్రం

  •  చాలా మంది అవసరం లేకున్నా గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేస్తున్నారు
  • గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఆందోళన చెందొద్దు
  • వాణిజ్య సిలిండర్ల విషయంలో రాష్ట్రాలతో మాట్లాడనున్నాం
  • వాణిజ్య సిలిండర్లను ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేస్తున్నాం
  • బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కోరాం
2026-03-14 18:29:34

ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 93 వేల కోట్లు

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 93 వేల కోట్లు
  • ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ సీనియర్ అధికారుల ఆచూకీ చెప్పినా రివార్డు
  • యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రకటించిన అమెరికా
  • అమెరికా ‘రివార్డ్ ఫర్ జస్టిస్’ ప్రోగ్రాంలో భాగంగా ప్రకటన
2026-03-14 18:15:28

మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి చర్యలు

  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల్లో ఐదుగురు భారతీయులు మృతి
  • ఘర్షణల వేళ భారత మిషన్లు 24 గంటలు పనిచేస్తున్నాయి
  • ఒమన్, ఇరాక్, యూఏఈలోని అధికారులతో సంప్రదింపులు 
  • మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి చర్యలు  
  • భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన
     
2026-03-14 17:50:05

దెబ్బతిన​ 56 మ్యూజియాలు, చారిత్రక ప్రదేశాలు

  • అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ మ్యూజియాలు, చారిత్రక ప్రదేశాలు ధ్వంసం
  • ఇరాన్‌ చరిత్ర, వారసత్వానికి సంబంధించిన వస్తువులు ఉండే ప్రదేశాల్లో నష్టం 
  •  56 మ్యూజియాలు చారిత్రక ప్రదేశాలు దెబ్బతిన్న వైనం
  • ఇరాన్‌ సాంస్కృతిక, వారసత్వ, పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడి
  • యునెస్కో జాబితాలో ఉన్న గోలెస్టాన్ ప్యాలెస్‌కు కూడా నష్టం
  • ఇజ్రాయెల్, లెబనాన్‌లోనూ చారిత్రక ప్రదేశాలు దెబ్బతిన్నాయన్న యునెస్కో 
2026-03-14 15:17:08

హర్మూజ్‌ జల సంధిని దాటిన భారత ఎల్‌పీజీ కార్గో షిప్‌ నందాదేవి

  • దేశంలో గ్యాస్‌  కష్టాలకు చెక్‌
  • 46,000 మెట్రిక్‌ టన్నుల ఎల్‌పీజీ లోడ్‌తో వస్తున్న భారత నౌక
  • భారత నౌక నందాదేవికి ఎస్కార్ట్‌గా ఇండియన్‌ నేవి
  • రెండురోజుల్లో ముంబై లేదా కాండ్లా పోర్టుకు చేరనున్న భారత నౌక
  • హర్మూజ్‌ జలసంధి ధాటిన భారత రెండో ఎల్‌పీజీ నౌక నందాదేవి
  • ఇప్పటికే భారత్‌ వైపు ప్రయాణిస్తున్న ‘శివాలిక్‌’ కార్గో నౌక
  • రెండు ఎల్‌పీజీ నౌకలతో దేశంలో తీరనున్న గ్యాస్‌ కష్టాలు
2026-03-14 13:14:19

యూఏఈ: అమెరికా ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి

  • యూఏఈలోని షార్జా పోర్ట్‌ సమీపంలో అమెరికా ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి
  • మంటల్లో పూర్తిగా తగలబడిపోయిన ఆయిల్‌ ట్యాంకర్‌
  • ఇరాన్‌ దాడి చేసిందని అనుమానాలు
  • గల్ఫ్‌ తీరాల్లో అమెరికా చమురు నౌకలపై ఇరాన్‌ వరుస దాడులు
     
2026-03-14 11:06:25

అ​మెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌

  • ఖర్గ్‌ ఐలాండ్‌పై అమెరికా దాడిని ఖండించిన ఇరాన్‌
  • మా చమురు కేంద్రాల జోలికొస్తే సహించం
  • తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌ వార్నింగ్‌
  • మా చమురు కేంద్రాలను ధ్వంసం చేస్తే ఊరుకోం
  • గల్ఫ్‌ దేశాల్లోని అన్ని చమురు కేంద్రాలను లేపేస్తాం
  • బూడిద కుప్పలుగా మార్చేస్తామని ఇరాన్‌ హెచ్చరికలు
     
2026-03-14 10:20:56

బాగ్ధాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి

  • ఇరాక్‌: బాగ్ధాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడి
  • దాడిలో ఎంబసీ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌ ధ్వంసం
2026-03-14 10:01:12

ఐక్య రాజ్య సమితి కీలక అప్పీల్

  • లెబనాన్‌ దాడులతో నిరాశ్రయులైన ప్రజలు 
  • ఎమర్జెన్సీ సాయం అందించేందుకు నిధులు కావాలి
  • 308.3 మిలియన్ డాలర్ల ఫండ్ కోరుతూ అప్పీల్
  • మానవతా సాయం కోసం అప్పీల్ చేసిన ఐరాస
2026-03-14 09:36:03

పశ్చిమాసియా: భారీగా అమెరికా బలగాల మోహరింపు

  • హర్మూజ్‌ జలసంధికి చేరుకున్న 2500 మంది యూఎస్‌ నావికాదళం
  • యూఎస్‌ఎస్‌ ట్రిపోలితో పాటు మరిన్ని యుద్ధ నౌకల మోహరింపు
  • హర్ముజ్‌ జలసంధి వద్ద యూఎస్‌ 31వ మెరైన్‌ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌
2026-03-14 09:17:27

ఇరాన్‌పై పట్టు సాధించేందుకు అమెరికా వ్యూహాలు

  • మిడిల్‌ ఈస్ట్‌కు అమెరికా మెరైన్‌ కమాండోలు
  • సముద్ర మార్గంలో మెరైన్‌ దళాల తరలింపు
  • యూఎస్‌ఎస్‌ ట్రిపోలి యుద్ధనౌకలో 2500  మెరైన్‌ కమాండోలు
  • 20 యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్లు తరలింపు
2026-03-14 08:15:32

లెబనాన్‌: బీరట్‌పై ఇజ్రాయెల్‌ బాంబు దాడులు

  • ఇజ్రాయెల్‌ దాడుల్లో 12 మంది వైద్య సిబ్బంది మృతి
  • పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం
  • ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌, అమెరికా
  • గల్ఫ్‌ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్‌ డ్రోన్ల దాడి
  • ఒమన్‌లో డ్రోన్‌ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి
     

2026-03-14 07:53:25

ఖర్గ్‌ ద్వీపంలో లక్ష్యాన్ని తుడిచిపెట్టేశాం: ట్రంప్‌

  • హర్మూజ్‌లో నౌకలను అడ్డుకుంటే ఉపేక్షించం
  • ఇరాన్‌​ దగ్గర ఎ‍ప్పటికీ అణ్వాయుధం ఉండదు
  • ప్రపంచాన్ని బెదిరించే సత్తా ఇరాన్‌కు ఉండదు
  • ఇరాన్‌ సైన్యం ఆయుధాలు  విడిచిపెట్టాలి
     
2026-03-14 07:48:48

కుప్పకూలిన రీఫ్యూయలింగ్‌ విమానం

  • ఆరుగురు సిబ్బంది మృతి
  • పశ్చిమ ఇరాక్‌లో దుర్ఘటన 
  • శత్రువుల దాడి, ఫ్రెండ్లీ ఫైర్‌ కాదన్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ 
  • రెండు విమానాలు ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయని వెల్లడి 
  • మరొకటి ఇజ్రాయెల్‌లో క్షేమంగా ల్యాండైనట్లు స్పష్టీకరణ 
     
2026-03-14 07:21:53

పేలుళ్లతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్‌

  • ర్యాలీపై దాడులు!
  • ఇజ్రాయెల్‌–అమెరికా క్షిపణుల వర్షం
  • భారీ స్థాయిలో ఇరాన్‌ ప్రతీకార దాడులు
  • ఒమన్‌లో ఇద్దరు భారతీయుల మృతి 
  • 11 మంది క్షతగాత్రుల్లో 10 మంది మనోళ్లే
  • దుబాయ్‌ ఎయిర్‌పోర్టుపై దాడి, నలుగురికి గాయాలు 
  • యూఎస్‌ యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై దాడులు
  • భారీగా దెబ్బ తిందన్న ఇరాన్, ఖండించిన అమెరికా 
     
2026-03-14 07:20:33
Advertisement
 
Advertisement
Advertisement