పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్దంతో పరిస్థితులు చాలా ఆందోళనకరంగా మారాయన్నారు. ఈ సమయంలో ఇరువర్గాలు సమన్వయం పాటించాలని చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. భారత్ ఎప్పుడూ శాంతి కోసమే కృషిచేస్తుందని మోదీ తెలిపారు.
నిన్న ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడిలో హతమైన సంగతి తెలిసిందే. ఆయన మృతితో ఇరాన్ రెచ్చిపోతుంది. తన సమీప గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ పైనా దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సైతం ప్రతి దాడులు చేస్తుండడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై నిఘా పెట్టాలని సూచించింది. మత ప్రచారాలను గుర్తించి ముందస్తు చర్యలను తీసుకోవాలంది. ఉద్రిక్త ప్రసంగాలు చేసే వారిపై నిఘా ఉంచాలని తెలిపింది. అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.


