రియాద్: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ డ్రోన్లు సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై విరుచుకుపడ్డాయి. తస్ తనారాలోని ఆరామ్‌కో ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
డ్రోన్‌లతో జరిగిన ఈ దాడుల కారణంగా రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. గల్ఫ్ ప్రాంతానికి ప్రధాన ఆదాయ మూలమైన ఆయిల్ సరఫరా తాత్కాలికంగా దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇరాన్ ఈ దాడులతో గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ–ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, ఈ పరిణామం గల్ఫ్ ప్రాంత భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


