ఇరాన్‌పై దాడులు.. ఆంథ్రోపిక్‌ నెత్తిన పాలు పోసిన డొనాల్డ్‌ ట్రంప్‌! | After Donald Trump banned Anthropic, US Military used Claude in Iran strikes | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై దాడులు.. ఆంథ్రోపిక్‌ నెత్తిన పాలు పోసిన డొనాల్డ్‌ ట్రంప్‌!

Mar 2 2026 12:04 PM | Updated on Mar 2 2026 1:12 PM

After Donald Trump banned Anthropic, US Military used Claude in Iran strikes

వాషింగ్టన్‌: ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూరీ. ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య. మిలటరీ ఆపరేషన్‌లో ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలతో సహా ఇరాన్‌ ప్రభుత్వంలోని ముఖ్య కేంద్రాల్లో భీభత్సం సృష్టించాయి. వెన్నులో వణుకు పుట్టించేలా చేపట్టిన మిలటరీ ఆపరేషన్‌ వెనుక ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ ఏఐ మోడళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో నాడు తన మాట వినలేదని వెళ్లగొట్టిన ఆంథ్రోపిక్ ఇప్పుడు అక్కరకు వచ్చింది’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

యుద్ధంలో ఏఐ మోడళ్లు సైనికుల కళ్లూ, మెదడులా పనిచేస్తాయి. ఇవి నేరుగా ఆయుధం కాకపోయినా.. ఎక్కడ దాడి చేయాలి. ఎలా రక్షించుకోవాలి. శత్రువు కదలికలు ముందుగానే అంచనా వేస్తాయి. సైనికులకు సమాచారం అందిస్తాయి. అందుకు అనుగుణంగానే దాడి చేయొచ్చు. తాజాగా, ఇరాన్‌పై దాడుల సమయంలో అమెరికా,ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఆంథ్రోపిక్ క్లాడ్‌ మోడల్స్‌ను వినియోగించాయి.  

అయితే, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంథ్రోపిక్ సప్లయ్‌ చైన్‌ను ప్రమాదంగా భావించారు. ఆంథ్రోపిక్ సప్లయ్‌ చైన్‌ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనూహ్యంగా కొన్ని గంటల్లో ట్రంప్‌ తన నిర్ణయంపై యూటర్న్‌ తీసుకున్నారు. అమెరికా తన మిలిటరీ కార్యకలాపాల కోసం క్లాడ్‌ను ఉపయోగించింది. ఇరాన్‌లో తాను నిర్ధేశించిన లక్ష్యాల్ని ఛేదించగలిగింది.  

అమెరికా ప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్‌ను ఉపయోగించడం మానేస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. ఈ మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌ అంటే అత్యంత రహస్యమైన, భద్రతా ప్రమాణాలు ఉన్న ప్రభుత్వ,సైనిక కంప్యూటర్ వ్యవస్థలు. వీటిలో సాధారణ సాఫ్ట్‌వేర్ లేదా టూల్స్‌ను సులభంగా అమలు చేయలేరు.

కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై దాడి చేసేందుకు ఆంథ్రోపిక్‌ ఏఐ క్లౌడ్‌ను ఉపయోగిస్తోంది. ఆంథ్రోపిక్‌ ఏఐ క్లౌడ్‌ను మార్చి వాటి స్థానంలో మరో ఏఐ క్లౌడ్‌ను మార్చాలంటే కనీసం ఆరునెలల సమయం పట్టనుంది. ఈలోపు సైనికులకు వాటిపై శిక్షణ, వినియోగం వంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement