Anthropic
-
‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్!
ల్యాప్‌టాప్ అవసరం లేకుండానే ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే చకచకా పూర్తయిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ఇప్పుడు దీన్ని సాకారం చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘క్లాడ్’ (Claude)కు సంబంధించి ఒక విప్లవాత్మకమైన ఫీచర్‌ను ‘ఆంత్రోపిక్’ తాజాగా పరిచయం చేసింది.మనిషిలాగే కంప్యూటర్ వాడకంఇప్పటివరకు మనం ఏఐ సాయంతో ప్రశ్నలు అడగడమో లేదా సమాచారం సేకరించడమో చేసేవాళ్లం. కానీ ఇకపై ‘క్లాడ్’.. మీ కంప్యూటర్ను ఒక మనిషి మాదిరిగా ఆపరేట్ చేయగలదు. మౌస్ కదపడం, కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం, స్క్రీన్‌ను రీడ్ చేయడం లాంటి పనులను ఇది సునాయాసంగా చేస్తుంది. ఫలితంగా మీరు కంప్యూటర్ ముందు లేకపోయినా, మీరు ఇచ్చిన టాస్క్‌లను ‘క్లాడ్’ పూర్తి చేస్తుంది. అంటే మీ పనులను చక్కబెట్టే ఒక నమ్మకమైన ‘రిమోట్ ఉద్యోగి’ మీతో పాటు ఉన్నట్టేనని ‘ఆంత్రోపిక్’ పేర్కొంది.ల్యాప్‌టాప్ అవసరం లేని భవిష్యత్తుఈ కొత్త ఫీచర్ గురించి ఆంత్రోపిక్ పరిశోధకుడు అలెక్స్ ఆల్బర్ట్ మాట్లాడుతూ ‘పని కోసం ల్యాప్‌టాప్ తెరవాల్సిన అవసరం లేని భవిష్యత్తు అత్యంత వేగంగా మనకు చేరువవుతోంది’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆఫీస్ పనుల కోసం ఇకపై డెస్క్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ నుంచే క్లాడ్ ద్వారా అన్నింటినీ చక్కబెట్టవచ్చని ఆయన వెల్లడించారు.ఇది ఎలా పనిచేస్తుంది?క్లాడ్ మీ కంప్యూటర్లోని స్లాక్ (Slack) లేదా క్యాలెండర్ లాంటి అప్లికేషన్లకు కనెక్ట్ అవుతుంది. అవసరమైతే ఇతర యాప్స్ యాక్సెస్ చేయడానికి మీ అనుమతి అడుగుతుంది. ఇటీవలే విడుదలైన 'డిస్పాచ్' (Dispatch) ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచే కంప్యూటర్లో ఉన్న క్లాడ్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చు. మీరు బయట తిరుగుతున్నా, ‘క్లాడ్’ మీ బ్రౌజర్లో సమాచారం వెదకడం, స్ప్రెడ్షీట్లను నింపడం లాంటి పనులను చిటికెలో పూర్తి చేసి పెడుతుంది.ఎవరికి అందుబాటులో ఉంటుంది?ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం రీసెర్చ్ ప్రివ్యూ దశలో మాత్రమే ఉంది. పెయిడ్ వెర్షన్ వాడుతున్న ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork)‘క్లాడ్ కోడ్’ (Claude Code) యూజర్లు మాత్రమే దీనిని వినియోగించగలరు. ముఖ్యంగా ప్రస్తుతం ఇది కేవలం మ్యాక్ ఓఎస్ (macOS) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం క్లాడ్ డెస్క్‌టాప్, మొబైల్ యాప్స్ రెండింటినీ అప్డేట్ చేసి అనుసంధానించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఏఐ పోటీఆటోమేషన్ రంగంలో వస్తున్న ఈ మార్పులు టెక్ ప్రపంచంలో కొత్త యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఇప్పటికే ఎన్విడియా ‘నెమోక్లా’ (NemoClaw)ను అందుబాటులోకి తీసుకురాగా, మెటా, ఓపెన్ ఏఐ సంస్థలు కూడా తమ సొంత ఏఐ ఏజెంట్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ రేసులో ఆంత్రోపిక్ ఒక అడుగు ముందే ఉన్నదని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘ఏఐ’లో చైనా ఫస్ట్.. ప్రమాదంలో భావి భారతం -
ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలేమీ పోలేదు
న్యూఢిల్లీ: కృత్రిమ మేధతో భారీ సంఖ్యలో ఉద్యోగాలేమీ పోలేదని ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ ఒక నివేదికలో వెల్లడించింది. దీని వల్ల టెక్నాలజీ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే నెమ్మదించిన సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. ఏఐ సామర్థ్యం కొండంత ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినియోగించుకుంటున్నది గోరంతేనని పేర్కొంది. కోడింగ్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రొటీన్ డిజిటల్ విధులను నిర్వర్తించే వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కస్టమర్ సర్విస్ రిప్రజెంటేటివ్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, ఫైనాన్షియల్..ఇన్వెస్ట్మెంట్ అనలిస్టుల్లాంటి ఉద్యోగ విధులను ఆటోమేట్ చేసేందుకు భారీగా అవకాశాలు ఉన్నందున, ఆయా ఉద్యోగాలకు రిసు్కలు ఉంటాయని నివేదిక తెలిపింది. మరోవైపు, వంటవాళ్లు, మోటార్‌సైకిల్ మెకానిక్‌లు, లైఫ్‌గార్డ్‌లు, బార్టెండర్లు, డ్రెస్సింగ్ రూమ్ అటెండెంట్స్‌లాంటి మాన్యువల్ సామర్థ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు ఢోకా ఉండదని పేర్కొంది. అమెరికా లేబర్ స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా ప్రకారం 2022 ఆఖరు నుంచి టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉండే విభాగాల్లో యువ ఉద్యోగుల నియామకాలు మాత్రమే తగ్గినట్లు తెలుస్తోందని వివరించింది. ఏఐతో భారీగా ఉద్యోగాల్లో కోత పడుతోందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంథ్రోపిక్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇరాన్‌పై దాడులు.. ఆంథ్రోపిక్ నెత్తిన పాలు పోసిన డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ. ఫిబ్రవరి 28న అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య. మిలటరీ ఆపరేషన్‌లో ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలతో సహా ఇరాన్ ప్రభుత్వంలోని ముఖ్య కేంద్రాల్లో భీభత్సం సృష్టించాయి. వెన్నులో వణుకు పుట్టించేలా చేపట్టిన మిలటరీ ఆపరేషన్ వెనుక ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ ఆంత్రోపిక్ ఏఐ మోడళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో నాడు తన మాట వినలేదని వెళ్లగొట్టిన ఆంథ్రోపిక్ ఇప్పుడు అక్కరకు వచ్చింది’ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో ఏఐ మోడళ్లు సైనికుల కళ్లూ, మెదడులా పనిచేస్తాయి. ఇవి నేరుగా ఆయుధం కాకపోయినా.. ఎక్కడ దాడి చేయాలి. ఎలా రక్షించుకోవాలి. శత్రువు కదలికలు ముందుగానే అంచనా వేస్తాయి. సైనికులకు సమాచారం అందిస్తాయి. అందుకు అనుగుణంగానే దాడి చేయొచ్చు. తాజాగా, ఇరాన్‌పై దాడుల సమయంలో అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆంథ్రోపిక్ క్లాడ్ మోడల్స్‌ను వినియోగించాయి. అయితే, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ ఆంథ్రోపిక్ సప్లయ్ చైన్‌ను ప్రమాదంగా భావించారు. ఆంథ్రోపిక్ సప్లయ్ చైన్‌ను నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనూహ్యంగా కొన్ని గంటల్లో ట్రంప్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. అమెరికా తన మిలిటరీ కార్యకలాపాల కోసం క్లాడ్‌ను ఉపయోగించింది. ఇరాన్లో తాను నిర్ధేశించిన లక్ష్యాల్ని ఛేదించగలిగింది. అమెరికా ప్రభుత్వం, దాని ఏజెన్సీలు ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ మోడల్‌ను ఉపయోగించడం మానేస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఈ మార్పు రాత్రికి రాత్రే సాధ్యం కాదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. క్లాసిఫైడ్ నెట్వర్క్ అంటే అత్యంత రహస్యమైన, భద్రతా ప్రమాణాలు ఉన్న ప్రభుత్వ,సైనిక కంప్యూటర్ వ్యవస్థలు. వీటిలో సాధారణ సాఫ్ట్వేర్ లేదా టూల్స్‌ను సులభంగా అమలు చేయలేరు.కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై దాడి చేసేందుకు ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్‌ను ఉపయోగిస్తోంది. ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్‌ను మార్చి వాటి స్థానంలో మరో ఏఐ క్లౌడ్‌ను మార్చాలంటే కనీసం ఆరునెలల సమయం పట్టనుంది. ఈలోపు సైనికులకు వాటిపై శిక్షణ, వినియోగం వంటి కార్యకలాపాలు చేయాల్సి వస్తుంది. -
టెక్ ప్రపంచంలో ట్రంప్ చిచ్చు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి కఠిన నిర్ణయంతో టెక్ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అగ్రరాజ్యం రక్షణ శాఖ (పెంటగాన్), ప్రముఖ ఏఐ స్టార్టప్ ‘ఆంథ్రోపిక్’ (Anthropic) మధ్య నెలకొన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, చివరకు ఆ సంస్థపై బహిష్కరణ వేటుకు దారితీసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ అభివృద్ధి చేసిన సాంకేతికతను వినియోగించవద్దని అన్ని ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ‘మాకు ఆ టెక్నాలజీ అవసరం లేదు, అది మాకు వద్దు.. ఇకపై ఆ సంస్థతో ఎటువంటి వ్యాపార సంబంధాలు ఉండవు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇప్పటికే మిలిటరీ ప్లాట్‌ఫారమ్‌లలో అంతర్భాగంగా ఉన్న ‘ఆంథ్రోపిక్’ టెక్నాలజీని తొలగించేందుకు పెంటగాన్‌కు ఆరు నెలల గడువు ఇచ్చిన అధ్యక్షుడు, మిగిలిన ప్రభుత్వ సంస్థలు తక్షణమే దీని వాడకాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం సిలికాన్ వ్యాలీలో కలకలం సృస్టిస్తోంది. ఏఐ సాంకేతికతను సైనిక అవసరాల కోసం ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉపయోగించుకోవాలంటూ పెంటగాన్ చేసిన డిమాండ్ ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా తమకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని రక్షణ శాఖ ‘పెంటగాన్’ పట్టుబట్టగా, ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డారియో అమోడెయ్ అందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించారు. తమ ఏఐ మోడల్ ‘క్లాడ్’ (Claude)ను నిఘా కోసమో లేదా మనుషుల ప్రమేయం లేకుండా పనిచేసే మారణాయుధాల తయారీ కోసమో వినియోగించకూడదని ‘ఆంథ్రోపిక్’ డిమాండ్ చేస్తోంది. అయితే రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ విధించిన తుది గడువు ముగియడానికి కొద్ది గంటల ముందే ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఒకవేళ ‘ఆంథ్రోపిక్’ సంస్థ ప్రభుత్వానికి సహకరించకపోతే, తీవ్రమైన సివిల్, క్రిమినల్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఎలాన్ మస్క్‌కు చెందిన 'గ్రోక్' (Grok) ఏఐకి భారీగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గ్రోక్‌ను ఇప్పటికే క్లాసిఫైడ్ మిలిటరీ నెట్‌వర్క్‌లలోకి అనుమతించేందుకు పెంటగాన్ సిద్ధమవుతోంది. కాగా, ఈ వివాదంలో ‘ఆంథ్రోపిక్’ తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా గూగుల్, ఓపెన్ ఏఐ ఉద్యోగులు బహిరంగ లేఖ రాయడం విశేషం. ప్రత్యర్థి సంస్థ అయినప్పటికీ, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం పెంటగాన్ బెదిరింపు ధోరణిని తప్పుపడుతూ ‘ఆంథ్రోపిక్’కు అండగా నిలిచారు.క్లాడ్ వంటి అధునాతన వ్యవస్థలు జాతీయ భద్రతకు అత్యవసరమని ఒకపక్క చెబుతూనే, మరోపక్క ఆ సంస్థను 'సప్లై చైన్ రిస్క్'గా పరిగణించడం విరుద్ధమని ‘ఆంథ్రోపిక్’ సీఈఓ అమోడెయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య రక్షణ అవసరాలు, ఏఐ నైతిక విలువల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.ఇది కూడా చదవండి: కాషాయ దుస్తుల్లో ప్రధాని మోదీ పక్కన.. సారా నెతన్యాహు సంగతులివే.. -
ఆంథ్రోపిక్ మరో సంచలనం.. రూ.90 వేల కోట్లు ఆవిరి!
అమెరికా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) మరోసారి మార్కెట్లలో సంచలనం సృష్టించింది. సంస్థ తన ఏఐ ప్లాట్‌ఫామ్ క్లాడ్ (Claude)లో కొత్తగా ప్రవేశపెట్టిన “క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” ఫీచర్ ప్రభావంతో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో భారీ కలకలం రేగింది. ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ప్రముఖ సైబర్ భద్రతా సంస్థల షేర్లు 5% నుంచి 9% వరకు క్షీణించగా, మార్కెట్ విలువలో దాదాపు 10 బిలియన్ డాలర్లు (రూ.90 వేల కోట్ల వరకు) ఆవిరైనట్లు అంచనాలు సూచిస్తున్నాయి.ఏమిటీ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ?“క్లాడ్ కోడ్ సెక్యూరిటీ” అనేది క్లాడ్ ఏఐ ప్లాట్ఫామ్లో విలీనం చేసిన ఆధునిక భద్రతా సామర్థ్యం. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్‌లను స్కాన్ చేసి లోపాలను గుర్తించడంతో పాటు, వాటికి లక్ష్యిత పరిష్కారాలను సూచిస్తుంది. కోడింగ్ దశలోనే భద్రతా లోపాలను గుర్తించి సరిచేయడానికి డెవలపర్లకు ఇది సహాయపడుతుంది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాధనం భారీ స్థాయిలో కోడ్‌ను విశ్లేషించి, బలహీనతలను గుర్తించి, మానవ సమీక్ష కోసం ప్యాచ్‌లను సూచించగలదు. ప్రస్తుతం ఇది ఎంటర్ప్రైజ్ కస్టమర్లు, ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుల నిర్వాహకులకు పరిమిత రీసెర్చ్ ప్రివ్యూగా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఏ స్టాక్స్ దెబ్బతిన్నాయంటే..ఆంథ్రోపిక్ ప్రకటన తర్వాత ప్రధాన సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో గణనీయమైన అమ్మకపు ఒత్తిడి కనిపించింది. క్రౌడ్‌స్ట్రయిక్ (CrowdStrike) షేర్లు సుమారు 8% పడిపోయాయి. ఓక్టా స్టాక్ 9% పైగా క్షీణించింది. క్లౌడ్‌ఫ్లేర్ (Cloudflare) 7–8% మధ్య తగ్గింది. జెడ్‌స్కేలర్ గణనీయమైన నష్టాలను నమోదు చేసింది. అలాగే గిట్‌ల్యాబ్, జేఫ్రాడ్ షేర్ల కూడా భారీ క్షీణతను చవిచూశాయి. ఇక సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ ఎక్స్ సైబర్‌సెక్యూరిటీ ఈటీఎఫ్ (Global X Cybersecurity ETF) కూడా దాదాపు 5% పడిపోయి, 2023 నవంబర్ తర్వాతి కనిష్ట స్థాయికి చేరింది.మార్కెట్ ఎందుకు షేక్ అయిందంటే..సైబర్ సెక్యూరిటీ సంస్థలు సాధారణంగా లోపాల గుర్తింపు, ముప్పుల పర్యవేక్షణ, డిజిటల్ మౌలిక సదుపాయాల రక్షణ వంటి సేవలను అందిస్తాయి. ఈ విభాగంలో లోపాల గుర్తింపు కీలక అంశం. ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన ఈ ఏఐ-ఆధారిత ఫీచర్ కోడ్ దశలోనే లోపాలను గుర్తించి పరిష్కారాలను సూచించడం ద్వారా సాంప్రదాయ భద్రతా సాధనాలకు సవాలు విసిరినట్టైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి వర్క్‌ఫ్లోలోనే భద్రతా తనిఖీలు ఆటోమేటిక్ కావడం మార్కెట్ ఆందోళనకు కారణమైంది. -
కృత్రిమ మేధ భవిష్యత్తుకు భారత్ దిక్సూచి
ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) ముఖచిత్రంలో భారత్ కేవలం వినియోగదారు మాత్రమే కాదని, రాబోయే కాలంలో ఏఐ భవిష్యత్తును శాసించే ప్రధాన శక్తిగా అవతరించబోతోందని ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డారియో అమోదే ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన భారత్‌లోని సాంకేతిక నైపుణ్యం, ఏఐ రంగంలో దేశం చూపిస్తున్న వేగాన్ని ప్రశంసించారు. అమెరికా వెలుపల ఆంత్రోపిక్ తన ఉనికిని వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.భారత్ - ఆంత్రోపిక్.. వ్యూహాత్మక భాగస్వామ్యంటోక్యో తర్వాత ఆసియాలోనే రెండో కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభించిన కొద్ది రోజులకే అమోదే ఈ సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ వినియోగంలో 5.8% వాటాతో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. టెక్ రంగ నిపుణురాలు ఇరినా ఘోష్‌ను ఆంత్రోపిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎక్స్-స్టెప్ ఫౌండేషన్, ప్రథమ్, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఏఐ వినియోగంపై దృష్టి సారించింది.అపార అవకాశాలు2023 బ్లెచ్లీ పార్క్ సమ్మిట్ నుంచి ఏఐ సాధించిన పురోగతి అద్భుతమని అమోదే అన్నారు. ఏఐ సామర్థ్యం గురించి వివరిస్తూ ‘మనం డేటా సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఉన్నాం. ఇవి మానవాతీత వేగంతో పనిచేయగల ఏఐ ఏజెంట్లు. వేల ఏళ్లుగా పీడిస్తున్న వ్యాధులను నయం చేయగలవు. కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తులను చేయగలవు. ఎన్నో అవకాశాలు సృష్టించగలవు’ అన్నారు.సామర్థ్యంతో పాటు ఏఐ వల్ల కలిగే ప్రమాదాలను కూడా అమోదే స్పష్టం చేశారు. స్వయంప్రతిపత్తిలోని పరివర్తన, ఉద్యోగాల కోత, సాంకేతిక దుర్వినియోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వం వహించాలని ఆయన కోరారు.అమోదే ప్రసంగంలోని ముఖ్యాంశాలుభారత్లో అభివృద్ధి చేసే ఏఐ నమూనాలు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి.భారతీయ భాషల్లో ఏఐ మోడళ్లను పరీక్షించేందుకు స్థానిక సంస్థలతో ఆంత్రోపిక్ సహకరిస్తోంది.ప్రపంచ ఏఐ భద్రతా ప్రమాణాలను రూపొందించడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పాత్ర కీలకం.ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. అయితే ఆటోమేషన్ వల్ల కలిగే సామాజిక మార్పులను ప్రభుత్వం, కంపెనీలు కలిసి సమన్వయం చేసుకోవాలి.ఇదీ చదవండి: ‘భారత్‌లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
చేతులు కలపని సంచలన సీఈవోలు.. వైరల్ సంఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో (#IndiaAIImpactSummit2026) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ టాప్ టెక్ సీఈవోలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో సందర్భంగా చోటుచేసుకున్న ఇద్దరు సంచలన సీఈవోల మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.ఏఐ అభివృద్ధిపై ఐక్యతకు సంకేతంగా వేదికపై భారత ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సహా అందరూ చేతులు కలిపగా ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman), ఆంథ్రోపిక్ (Anthropic) సీఈవో డారియో అమొడెయి (Dario Amodei) మాత్రం చేతులు కలపకుండా పిడికిలి బిగించి పలకరించుకోవడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.ఈ చిన్న సంఘటన సైతం ఏఐ రంగంలోని పోటీ వాతావరణాన్ని మరోసారి గుర్తు చేసింది. తీవ్రంగా పోటీ పడుతున్న రెండు ప్రముఖ ఏఐ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు వేదికపై మొదట క్షణకాలం సంకోచంగా కనిపించినా, అనంతరం పిడికిలితో పరస్పరం అభివాదం చేసుకున్నారు. ఈ దృశ్యం ఆన్లైన్లో హాస్యభరితమైన వ్యాఖ్యలకు దారితీసింది. పుచ్ ఏఐ కో ఫౌండర్ సిద్ధార్థ్ భాటియా తన సోషల్ మీడియా ఖాతాలో “ఏజీఐ ఎప్పుడు? డారియో, సామ్ చేతులు కలిపిన రోజు!” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కాగా డారియో అమొడెయి ఓపెన్ఏఐలో రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2021 ప్రారంభంలో ఆ పదవి నుంచి వైదొలిగి, పలువురు సీనియర్ పరిశోధకులతో కలిసి ఆంథ్రోపిక్ సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు జనరేటివ్ ఏఐ రంగంలో తీవ్రంగా పోటీ పడుతున్నాయి.When AGI?The day Dario and Sam hold hands. pic.twitter.com/bfmqgnTV89— Siddharth Bhatia (@siddharthb_) February 19, 2026 -
కోడ్ నుంచి క్లౌడ్ వరకు.. ఆంత్రోపిక్‌తో ఇన్ఫోసిస్ జట్టు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర రంగ సంస్థల కోసం ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు, వినియోగంలోకి తెచ్చేందుకు అమెరికన్ ఏఐ సంచలనం ఆంత్రోపిక్‌తో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్లాడ్ కోడ్ సహా ఆంత్రోపిక్ క్లాడ్ మోడల్స్‌ని ఇన్ఫోసిస్‌కి చెందిన టొపాజ్ ఏఐ సొల్యూషన్స్‌తో అనుసంధానం చేస్తారు. అలాగే టెలికం రంగ అవసరాల కోసం ఏఐ ఏజెంట్లను తయారు చేసేందుకు ప్రత్యేక ఆంత్రోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు, తదుపరి ఇతర నియంత్రిత రంగాల్లోకి కూడా విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.క్లెయిమ్స్ ప్రాసెసింగ్, కాంప్లయెన్స్ సమీక్షలు, కోడ్ జనరేషన్, టెస్టింగ్‌లాంటి బహుళ దశలు ఉండే పనులను స్వతంత్రంగా హ్యాండిల్ చేయగలిగే ఏజెంటిక్ ఏఐ సిస్టమ్‌లను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న ఇన్ఫీ డెవలపర్లు ఇప్పటికే తమ క్లాడ్ కోడ్‌ని ఉపయోగిస్తున్నట్లు ఆంత్రోపిక్ సీఈవో డేరియో తెలిపారు. భారత్‌లో ఆంత్రోపిక్ కార్యాలయం ఆంత్రోపిక్ దేశీయంగా బెంగళూరులో తమ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఆసియాలో టోక్యో తర్వాత కంపెనీకి ఇది రెండో ఆఫీసు. తమ క్లాడ్.ఏఐ సొల్యూషన్కి భారత్ రెండో అతి పెద్ద మార్కెట్ అని కంపెనీ ఇండియా ఎండీ ఇరినా ఘోష్ తెలిపారు. 2025 అక్టోబర్‌లో విస్తరణను ప్రకటించినప్పటి నుంచి భారత్‌లో తమ ఆదాయ వృద్ధి వేగం రెట్టింపయ్యిందని వివరించారు. వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్థానికంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు వివరించారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు మంగళవారం దాదాపు రెండు శాతం లాభపడింది. బీఎస్ఈలో 1.83 శాతం లాభపడి రూ. 1,391.20 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ఏఐతో ఎటర్నల్ చెట్టాపట్టాల్వివిధ విభాగాలవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) వినియోగాన్ని పెంచుకునే దిశగా ఓపెన్ఏఐతో భాగ స్వామ్య పరిధిని మరింతగా విస్తరించినట్లు ఎటర్నల్ వెల్లడించింది. దీని ప్రకారం జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్ప్యూర్తో పాటు తమ భాగస్వామ్య ప్లాట్‌ఫాంలు, అంతర్గత వ్యవస్థల్లో ఏఐ వాడకాన్ని పెంచనుంది. కస్టమర్లు, భాగస్వాములు తమ ప్లాట్‌ఫాంలను మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు వీలు కలి్పంచే కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు ఓపెన్ఏఐకి చెందిన ఎంటర్ప్రైజ్ ఏపీఐ ప్లాట్‌ఫాంతో కలిసి ఎటర్నల్ పని చేయనుంది. అంతర్గతంగా తమ ఆటోమేషన్ ప్లాట్‌ఫాం స్టిచ్‌తో జీపీటీ–5.3–కోడెక్స్లాంటి లేటెస్ట్ కోడింగ్ మోడల్స్‌ని అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టనుంది. -
ఐటీ కంపెనీలను వణికిస్తున్న ఆ ‘పేరు’ మాదే..
అమెరికా ఆధారిత ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ భారత విస్తరణ ప్రణాళికలు చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదే పేరుతో పనిచేస్తున్న భారతీయ సంస్థ ‘ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్’.. తమ బ్రాండ్‌కు గందరగోళం కలుగుతోందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు భారత కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల, దేశంలో ఆంథ్రోపిక్ వ్యూహాత్మక ప్రణాళికలు క్లిష్టతరం అయ్యే అవకాశముంది.అమెరికా ఆంథ్రోపిక్ Vs ఇండియా ఆంథ్రోపిక్టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ గత నెలలో కర్ణాటక వాణిజ్య కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది. 2017 నుంచే తమ సంస్థ "ఆంథ్రోపిక్" పేరును ఉపయోగిస్తోందని, అమెరికా సంస్థ భారత మార్కెట్లో ప్రవేశించడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడుతోందని కంపెనీ పేర్కొంది.స్థానిక సంస్థ తన ముందస్తు వినియోగాన్ని అధికారికంగా గుర్తించాలని, అలాగే మరింత గందరగోళం నివారించేందుకు తగిన ఉపశమనం ఇవ్వాలని కోరుతోంది. అదనంగా, రూ.1 కోటి నష్టపరిహారం కూడా డిమాండ్ చేసినట్లు సమాచారం.భారతీయ సంస్థ వాదన ఏమిటంటే..ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మొహమ్మద్ అయ్యాజ్ ముల్లా టెక్ క్రంచ్‌తో మాట్లాడుతూ, ఈ ఫిర్యాదు వెనుక ఉద్దేశం ఘర్షణ కాదని, తమ ముందస్తు వినియోగానికి అధికారిక గుర్తింపు పొందడమేనని తెలిపారు. గుర్తింపు లభించకపోతే, చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించవచ్చని ఆయన స్పష్టం చేశారు.భారతీయ సంస్థ తమ వెబ్సైట్లో “ఆంథ్రోపిక్ సాఫ్ట్వేర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అప్లికేషన్ పెండింగ్) ట్రేడ్‌మార్క్” అని పేర్కొంది. ట్రేడ్‌మార్క్ నమోదు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ఇది నేరుగా ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసుగా పరిగణించబడకపోవచ్చు. అయితే కోర్టు భారతీయ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే, అమెరికా సంస్థ భారతదేశంలో తన పేరును మార్చాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది.ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీకేసు ప్రస్తుత స్థితిజనవరి 20న కోర్టు ఆంథ్రోపిక్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. అంటే, సంస్థ తన కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ ఫిబ్రవరి 16న జరగనుంది.ఇదిలా ఉండగా, ఆంథ్రోపిక్ ఏఐ భద్రతా విభాగాధిపతి మృణక్ శర్మ రాజీనామా చేశారు. ఇలీవల ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తన రాజీనామాను ప్రకటించారు. తాను వెంటనే కొత్త వెంచర్ ప్రారంభించడం లేదని, తదుపరి నిర్ణయం తీసుకునే ముందు స్వల్ప విరామం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. -
ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్.. రాజీనామాలో హెచ్చరిక!
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ మరోమారు వార్తల్లో నిలిచింది. కంపెనీలో సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.మృణాంక్ శర్మ తన పోస్టులో.. ఉపయోగించిన భాష, కవులు రిల్కే & విలియం స్టాఫర్డ్‌ల ప్రస్తావనలు, ఈ రాజీనామా వెనుక ఉన్న లోతైన కారణాలపై అనేక అనుమానాలకు తావిచ్చాయి. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.మృణాంక్ శర్మ తన రాజీనామాకు సంబంధించిన స్పష్టమైన కారణాలను నేరుగా వెల్లడించలేదు. కానీ.. నిరంతర ఒత్తిళ్ల కారణంగా తనకు అత్యంత ముఖ్యమైన విలువలను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఒత్తిళ్లు కేవలం తనలోనే మాత్రమే కాకుండా, సంస్థలో కూడా కనిపించాయని, నిర్ణయాలు తీసుకునే సమయంలో విలువల కంటే ఇతర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి తరచూ ఎదురవుతుందని పేర్కొన్నారు.ఆంథ్రోపిక్ సంస్థను ప్రముఖ పరిశోధకులు హర్ష్ మెహతా, బెహ్నామ్ నెయ్షబూర్ వంటి వారు ఇప్పటికే విడిచిపెట్టారు. వీరు కొత్తదేదో ప్రారంభించేందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి సేఫ్‌గార్డ్ రీసెర్చ్ టీమ్ హెడ్ మృణాంక్ శర్మ చేరారు.Today is my last day at Anthropic. I resigned.Here is the letter I shared with my colleagues, explaining my decision. pic.twitter.com/Qe4QyAFmxL— mrinank (@MrinankSharma) February 9, 2026 -
భయంకరమైన భవిష్యత్తు! రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా?
వైట్ కాలర్ ఉద్యోగాలకు గడ్డుకాలం మొదలైందా? రానున్నది ‘ఆకలి రాజ్యం’మేనా? విజృంభిస్తున్న ‘ఏఐ(AI) మహమ్మారి’ మానవ ఉద్యోగాలను మింగేస్తోందన్న భయాలు నిజమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ దిగ్గజాలను సైతం వణికిస్తున్న ‘ఆంథ్రోపిక్’ సీఈవో డారియో అమోడేయి చేసిన తాజా హెచ్చరికలు ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తుపై భయాన్ని రేకెత్తిస్తున్నాయి.ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర పతనంఅమోడేయి వ్యాఖ్యల తర్వాత విడుదలైన యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాలు ఆయన అంచనాలకు అనూహ్యంగా సరిపోలడం ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. తాజా లేబర్ డేటా ప్రకారం.. గత డిసెంబర్ ఆఖరు నాటికి అమెరికాలో ఉద్యోగ ఖాళీలు 65.4 లక్షలకు పడిపోయాయి. 2020 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.ఏఐ వల్ల భారీ ఉద్యోగ నష్టంజనవరి చివరలో అమోడేయి “ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ” అనే పేరుతో సుమారు 20,000 పదాల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇవీ..“రాబోయే 1–5 సంవత్సరాల్లో ఏఐ వల్ల ఎంట్రీ-లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో 50 శాతం వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు, 1–2 సంవత్సరాల్లో మనుషుల కంటే ఎక్కువ సామర్థ్యం గల ఏఐ కూడా సాధ్యమే”2021లో ఆంథ్రోపిక్‌ను సహ-వ్యవస్థాపకుడిగా స్థాపించిన అమోడేయి, ఏఐ అభివృద్ధి వేగం కారణంగా లేబర్ మార్కెట్లో ‘అసాధారణ, బాధాకరమైన షాక్’ తప్పదని హెచ్చరించారు.“ఏఐ పురోగతి వేగం గతంలో వచ్చిన ఇతర సాంకేతిక విప్లవాల కన్నా వేగంగా ఉంది. ఉద్యోగం చేసే విధానం మారడమే కాదు, కొత్త ఉద్యోగాలకు మారాల్సిన అవసరం కూడా ప్రజలకు తీవ్ర సవాల్‌గా మారుతుంది”ఏఐ ఏదో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం కాదు.. ‘మానవ కార్మిక శక్తికే ప్రత్యామ్నాయం’గా మారుతోంది’ అని ఆయన స్పష్టం చేశారు. న్యాయ శాఖ, ఫైనాన్స్, కన్సల్టింగ్ వంటి రంగాలు కూడా దీని ప్రభావానికి లోనవుతాయని హెచ్చరించారు.తరువాత ఎన్బీసీ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ, ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని ఆయన తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.నియామకాలు కనిష్టానికి.. తొగింపులు గరిష్టానికి..ఈ వారం విడుదలైన తాజా డేటా, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని సూచిస్తోంది. 2025 డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగ ఖాళీలు మళ్లీ 65.4 లక్షలకే పరిమితమయ్యాయి. అదే రోజు విడుదలైన ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ నివేదిక ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు కేవలం 5,306 నియామక ప్రణాళికలను మాత్రమే ప్రకటించారు. 2009 నుంచి డేటా సేకరణ ప్రారంభించిన తర్వాత ఇదే అత్యల్ప సంఖ్య.ఇదిలా ఉండగా, జనవరి 31తో ముగిసిన వారంలో 2.31 లక్షల మంది తాము నిరుద్యోగులుగా ఉన్నట్లు క్లెయిమ్ చేశారు. ఇది గత వారంతో పోలిస్తే 22,000 పెరుగుదల. అమెజాన్, యూపీఎస్ వంటి సంస్థలు ప్రకటించిన భారీ తొలగింపులు ఈ జనవరిని గ్రేట్ రిసెషన్ తర్వాత మళ్లీ అంత చెత్త నెలగా మార్చాయని ఛాలెంజర్ నివేదిక పేర్కొంది.నెలవారీ గణాంకాల ప్రకారం.. జనవరిలో యూఎస్ కంపెనీలు 1,08,435 ఉద్యోగ కోతలను ప్రకటించాయి. ఇది డిసెంబర్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కాగా, 2025 జనవరితో పోలిస్తే రెండింతలకుపైగా ఉంది. ఈ తొలగింపుల్లో అమెజాన్, యూపీఎస్ సంస్థల వాటా 40 శాతం. రవాణా, టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఆర్థిక రంగాల్లో ఈ కోతలు ఎక్కువగా నమోదయ్యాయి.ఏఐ పాత్ర ఎంతవరకు?ఏఐ కారణంగా నేరుగా 7,624 ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదిక పేర్కొంది. అయితే, “తొలగింపులపై ఏఐ ప్రభావం ఎంతవరకు ఉందో ఖచ్చితంగా చెప్పడం కష్టం” అని ‘ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్’ ఛీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ చెప్పారు. అయినా, చాలా సంస్థలు ఏఐ అమలుపై దృష్టి పెడుతున్నాయని, మార్కెట్ కూడా ఏఐని ప్రస్తావించే కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
‘ఐటీ వాళ్లు వేరే పని వెతుక్కోవాల్సిందే’
ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుపై ఆన్లైన్లో కొత్త చర్చను రేకిత్తించారు జోహో కోఫౌండర్ శ్రీధర్ వెంబు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లు కోడ్ రాయడంలో వేగంగా పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పాత్రపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఏఐ సహాయంతో భగవద్గీత యాప్‌ను అభివృద్ధి చేసిన విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వచ్చిన ఒక పోస్ట్‌కు స్పందించిన వెంబు, “కోడ్ రాయడంపై ఆధారపడి బతుకుతున్నవారు ప్రత్యామ్నాయ జీవనోపాధుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని అన్నారు. ఇది తనకు కూడా వర్తిస్తుందన్న ఆయన, ఇది భయాందోళనలతో కాకుండా ప్రశాంతంగా అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు.“ఆ పోస్ట్‌లో చెప్పింది కేవలం భగవద్గీత యాప్ మాత్రమే కాదు. ఆంథ్రోరోపిక్ (Anthropic) సంస్థ వారి క్లాడ్ ఏఐ (Claude AI)తో మొత్తం సీ కంపైలర్ను నిర్మించింది. ఇదేదో చిన్న ఇంజినీరింగ్ ఫీట్ కాదు” అని వెంబు రాసుకొచ్చారు.ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఏఐ విప్లవం భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను ఎలా రూపుదిద్దుతుందన్న విషయంపై గూగుల్ జెమినీ చాట్‌బాట్‌తో తాను లోతైన చర్చ నిర్వహించానని వెంబు వెల్లడించారు. ఆ సంభాషణలో, కార్మికుల అవసరం తగ్గిన తర్వాతి ఆర్థిక వ్యవస్థ (post-labor economy)లో సమాజం ఎలా అభివృద్ధి చెందగలదో చర్చించడమే కాకుండా, ఏఐ తన సొంత సమాధానాలను కూడా విమర్శించవచ్చంటూ సవాలు చేసినట్లు చెప్పారు.ఈ సంభాషణల ఆధారంగా, భవిష్యత్తు రెండు విధాలుగా ఉండవచ్చని వెంబు అభిప్రాయపడ్డారు. ఏఐపై యాజమాన్యం ఎవరి చేతిలో ఉంటుందన్నదే కీలకమని పేర్కొంటూ టెక్నాలజీ మానవ జీవితంలో ఒక చిన్న భాగంగా మాత్రమే ఉండి, మనుషులకు కుటుంబం, ప్రకృతి, కళ, సంగీతం, సంస్కృతి, క్రీడలు, పండుగలు, విశ్వాసంపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఇస్తుందని ఆశావాద దృక్కోణంలో చెప్పుకొచ్చారు. ఇక నిరాశావాద దృక్కోణంలో.. ఈ టెక్నాలజీ ‘కేంద్రీకృత నియంత్రణ’కు దారి తీస్తుందని హెచ్చరించారు.శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలు వెంటనే వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వెంబు అంచనాలతో ఏకీభవించగా, మరికొందరు విభేదిస్తూ ఏఐ కోడింగ్ మానవ మేధస్సుకు ముగింపు కాదని వాదించారు.Examples are now pouring in about AI-assisted Code Engineering productivity. The quoted post is a Bhagwad Gita app. Anthropic has built an entire C compiler with their Claude AI. That is not an easy engineering feat at all.At this point, it is best for those of us who… https://t.co/KbgVX8G9nU— Sridhar Vembu (@svembu) February 6, 2026


