కోడ్‌ నుంచి క్లౌడ్‌ వరకు.. ఆంత్రోపిక్‌తో ఇన్ఫోసిస్‌ జట్టు | Anthropic and Infosys to Build Custom AI Agents for Firms | Sakshi
Sakshi News home page

కోడ్‌ నుంచి క్లౌడ్‌ వరకు.. ఆంత్రోపిక్‌తో ఇన్ఫోసిస్‌ జట్టు

Feb 18 2026 1:02 AM | Updated on Feb 18 2026 1:02 AM

Anthropic and Infosys to Build Custom AI Agents for Firms

టెక్‌ మార్కెట్లో టర్నింగ్‌ పాయింట్‌ 

తయారీ, టెలికం రంగాలకు ఏఐ సొల్యూషన్స్‌ అభివృద్ధి

న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం, ఆర్థిక సేవలు, తయారీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ తదితర రంగ సంస్థల కోసం ఎంటర్‌ప్రైజ్‌ ఏఐ సొల్యూషన్స్‌ని రూపొందించేందుకు, వినియోగంలోకి తెచ్చేందుకు అమెరికన్‌ ఏఐ సంచలనం ఆంత్రోపిక్‌తో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని కింద క్లాడ్‌ కోడ్‌ సహా ఆంత్రోపిక్‌ క్లాడ్‌ మోడల్స్‌ని ఇన్ఫోసిస్‌కి చెందిన టొపాజ్‌ ఏఐ సొల్యూషన్స్‌తో అనుసంధానం చేస్తారు. అలాగే టెలికం రంగ అవసరాల కోసం ఏఐ ఏజెంట్లను తయారు చేసేందుకు ప్రత్యేక ఆంత్రోపిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ని ఏర్పాటు చేయనున్నట్లు, తదుపరి ఇతర నియంత్రిత రంగాల్లోకి కూడా విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్‌ తెలిపింది.

క్లెయిమ్స్‌ ప్రాసెసింగ్, కాంప్లయెన్స్‌ సమీక్షలు, కోడ్‌ జనరేషన్, టెస్టింగ్‌లాంటి బహుళ దశలు ఉండే పనులను స్వతంత్రంగా హ్యాండిల్‌ చేయగలిగే ఏజెంటిక్‌ ఏఐ సిస్టమ్‌లను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఈవో సలిల్‌ పరేఖ్‌ చెప్పారు. వివిధ రంగాల్లో అపార అనుభవం ఉన్న ఇన్ఫీ డెవలపర్లు ఇప్పటికే తమ క్లాడ్‌ కోడ్‌ని ఉపయోగిస్తున్నట్లు ఆంత్రోపిక్‌ సీఈవో డేరియో తెలిపారు.  

భారత్‌లో ఆంత్రోపిక్‌ కార్యాలయం 
ఆంత్రోపిక్‌ దేశీయంగా బెంగళూరులో తమ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించింది. ఆసియాలో టోక్యో తర్వాత కంపెనీకి ఇది రెండో ఆఫీసు. తమ క్లాడ్‌.ఏఐ సొల్యూషన్‌కి భారత్‌ రెండో అతి పెద్ద మార్కెట్‌ అని కంపెనీ ఇండియా ఎండీ ఇరినా ఘోష్‌ తెలిపారు. 2025 అక్టోబర్‌లో విస్తరణను ప్రకటించినప్పటి నుంచి భారత్‌లో తమ ఆదాయ వృద్ధి వేగం రెట్టింపయ్యిందని వివరించారు. వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్థానికంగా రిక్రూట్‌ చేసుకోనున్నట్లు వివరించారు. విద్య, వ్యవసాయం తదితర రంగాల్లో సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.  ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు మంగళవారం దాదాపు రెండు శాతం లాభపడింది. బీఎస్‌ఈలో 1.83 శాతం లాభపడి రూ. 1,391.20 వద్ద క్లోజయ్యింది.  

ఓపెన్‌ఏఐతో ఎటర్నల్‌ చెట్టాపట్టాల్‌
వివిధ విభాగాలవ్యాప్తంగా కృత్రిమ మేధ(ఏఐ) వినియోగాన్ని పెంచుకునే దిశగా ఓపెన్‌ఏఐతో భాగ స్వామ్య పరిధిని మరింతగా విస్తరించినట్లు ఎటర్నల్‌ వెల్లడించింది. దీని ప్రకారం జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్, హైపర్‌ప్యూర్‌తో పాటు తమ భాగస్వామ్య ప్లాట్‌ఫాంలు, అంతర్గత వ్యవస్థల్లో ఏఐ వాడకాన్ని పెంచనుంది. కస్టమర్లు, భాగస్వాములు తమ ప్లాట్‌ఫాంలను మరింత మెరుగ్గా ఉపయోగించుకునేందుకు వీలు కలి్పంచే కొత్త మార్గాలను ఆవిష్కరించేందుకు ఓపెన్‌ఏఐకి చెందిన ఎంటర్‌ప్రైజ్‌ ఏపీఐ ప్లాట్‌ఫాంతో కలిసి ఎటర్నల్‌ పని చేయనుంది. అంతర్గతంగా తమ ఆటోమేషన్‌ ప్లాట్‌ఫాం స్టిచ్‌తో జీపీటీ–5.3–కోడెక్స్‌లాంటి లేటెస్ట్‌ కోడింగ్‌ మోడల్స్‌ని అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement