నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్ | Elon Musk Tweet After 849 Billion Dollars Net Worth | Sakshi
Sakshi News home page

నా దగ్గర క్యాష్ లేదు!: ఎలాన్ మస్క్ ట్వీట్

Feb 17 2026 9:01 PM | Updated on Feb 18 2026 12:13 PM

Elon Musk Tweet After 849 Billion Dollars Net Worth

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్.. ఎలాన్ మస్క్ నికర సంపద 849.03 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈయన తరువాత జాబితాలో లారీ పేజ్ (251 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (231.7 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (219.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. వీరి ముగ్గురి నికర సంపద మొత్తం (702.1 బిలియన్ డాలర్లు).. మస్క్ సంపదకు సమానం కాదు. దీన్ని బట్టి చూస్తే.. మస్క్ కుబేరుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోయినట్లు స్పష్టంగా అర్థమైపోతుంది.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ సంపద అక్షరాలా రూ. 70 లక్షల కోట్ల కంటే ఎక్కువే. ఈ సంపదకు కారణం టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలలో వాటాలే కారణమని మస్క్ వెల్లడించారు. నన్ను అందరూ కుబేరుడు అనుకుంటారు. కానీ నా దగ్గర నగదు రూపంలో ఉన్న క్యాష్ 0.1 శాతం కంటే తక్కువ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఈ మాటలు చెప్పాను, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నాను అని వెల్లడించారు. నిజానికి ఆయన సంపద పేపర్ వెల్త్ మాత్రమే. అంటే షేర్ల విలువ ఆధారంగా ఉన్న సంపదన్నమాట.

Advertisement
 
Advertisement
Advertisement