మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్: ధర ఎంతంటే? | Maruti Suzuki e Vitara Launched in India | Sakshi
Sakshi News home page

మారుతి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్: ధర ఎంతంటే?

Feb 17 2026 6:30 PM | Updated on Feb 17 2026 6:45 PM

Maruti Suzuki e Vitara Launched in India

చాలా రోజుల నిరీక్షణ తరువాత మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవిటారాను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని రూ. 21000 చెల్లించి నెక్సా షోరూమ్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారి కనిపించిన ఈ కారు ఏడాది తరువాత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్ & బ్యాటరీ ప్యాక్ రెండింటిపై ఎనిమిది సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ వంటి వాటితో పాటు.. రూ. 50,000 విలువైన ఇన్‌స్టాలేషన్‌తో ఫ్రీ హోమ్ ఛార్జర్ కూడా పొందవచ్చు.

మారుతి సుజుకి ఈవిటారా 49 కిలోవాట్ (440 కిమీ), 61 కిలోవాట్ (543 కిమీ) బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్‌మిషన్‌లను అనుసంధానించే కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థను ఉపయోగిస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుంది. ఇది ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో వంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఇందులో ఉంటుంది. ఇది కొంత ఎక్కువ రేంజ్ పొందటానికి అనుమతిస్తుంది.

మంచి డిజైన్ కలిగిన ఈ కారు 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే & 10.25-అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సెగ్మెంట్-లీడింగ్ 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!

Advertisement
 
Advertisement
Advertisement