స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో.. ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఒక ట్వీట్ చేశారు. ఇందులో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటూనే.. భారీ క్రాష్ మొదలైందని అన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
2013లో ప్రచురించిన రిచ్ డాడ్స్ ప్రాఫసీలో.. భవిష్యత్తులో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ జరుగుతుందని హెచ్చరించాను. నేను చెప్పినట్లే.. ఆ పెద్ద ఆర్థిక సంక్షోభం సమీపంలో ఉంది. మార్కెట్ క్రాష్ అనేది కొందరికి ప్రమాదం అయినా.. స్టాక్స్ కొనుగోలు చేయాలని వేచి చూసేవారికి గొప్ప అవకాశం.
ఈ సందర్భంగా కియోసాకి.. గోల్డ్, సిల్వర్ గురించి చెబుతూనే బిట్‌కాయిన్, ఎథెరియం గురించి కూడా పేర్కొన్నారు. బిట్‌కాయిన్ విలువ తగ్గిపోతున్నప్పుడు, నేను మరింత కొనుగోలు చేస్తానని అన్నారు. నా దృష్టిలో ఇవే (బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియం) నిజమైన ఆస్తులని పేర్కొన్నారు.
I Am Warning You: In Rich Dad’s Prophecy published 2013 I warned of the biggest stock market crash in history still coming.
That giant crash is now imminent.
The good news is those of you who followed my rich dad’s warning and prepared….the coming crash will make you richer…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 17, 2026
ఆర్థిక సంక్షోభాలు ఎప్పుడూ నష్టాలనే కాకుండా.. అవకాశాలను అందిస్తుంది. భయపడే వారు నష్టపోవచ్చు, కానీ ఆర్థిక జ్ఞానం కలిగి, దీర్ఘకాల దృష్టితో పెట్టుబడులు పెట్టే వారు మాత్రం.. తప్పకుండా ధనవంతులు అవుతారు. ఎప్పుడైతే మార్కెట్ నష్టాలను చవి చూస్తుందో.. చాలామంది తమ స్టాక్ అమ్మేయడానికి సిద్ధపడతారు. అలాంటి సమయంలో వాటిని కొనుగోలు చేసేవారు సంపన్నులవుతారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. పెట్టుబడి అనేది ఒక వ్యక్తి ఆర్థిక దృష్టికోణం మాత్రమే. ఇందులో లాభనష్టాలు సహజమే. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరమైతే ఆర్ధిక పరిస్థితిని విశ్లేషించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: డేంజర్‌లో ఉద్యోగాలు!.. 2026లో ఇదే జరుగుతుందా?


