సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 650.39 పాయింట్ల లాభంతో 83,277.15 వద్ద, నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద నిలిచాయి.
భారత్ సీట్స్ లిమిటెడ్, ఆర్.ఎ.సి.ఎల్. గేర్‌టెక్ లిమిటెడ్, ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్, ప్రెసిషన్ వైర్స్ ఇండియా లిమిటెడ్, ఆసియన్ హోటల్స్ (నార్త్) లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. బీటా డ్రగ్స్ లిమిటెడ్, సార్థక్ మెటల్స్ లిమిటెడ్, డెల్ఫీ వరల్డ్ మనీ లిమిటెడ్, టీఐఎల్ లిమిటెడ్, ధ్రువ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.


