బెంగళూరులో అద్దె ‘మంట’ | Bengaluru woman quoted Rs 80K month rent for a flat because gets sunlight | Sakshi
Sakshi News home page

బెంగళూరులో అద్దె ‘మంట’

Feb 16 2026 11:31 AM | Updated on Feb 16 2026 12:13 PM

Bengaluru woman quoted Rs 80K month rent for a flat because gets sunlight

సహజ వనరులైన గాలి, వెలుతురును కూడా వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్న నగర అద్దె పోకడలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బెంగళూరులో ఇల్లు దొరకడం కంటే, దొరికిన ఇంటికి అద్దె కట్టడమే పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో నివాస గృహాల అద్దెలు ఇటీవల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐటీ ఉద్యోగుల రాకతో ఇప్పటికే డిమాండ్ పెరిగిపోగా తాజాగా ఒక ఇంటి యజమాని పెట్టిన వింత నిబంధన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గదుల్లో మెరుగ్గా సూర్యరశ్మి (సన్‌లైట్‌) వస్తుందనే కారణంతో ఒక ఫ్లాట్‌కు రూ.80,000 అద్దె అడగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

అసలేం జరిగింది?

నగరంలో నివాసం కోసం ఇల్లు వెతుకుతున్న అను అనే మహిళకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. బెంగళూరు అద్దెలు ఎప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని, కానీ ఈసారి ఎదురైన అనుభవం షాకింగ్‌గా ఉందని ఆమె పేర్కొన్నారు.

‘ఒక గదిలోకి సహజమైన సూర్యరశ్మి వస్తుందనే కారణంతో దానికి రూ.80,000 అద్దె అడిగారు. కనీస సౌకర్యంగా ఉండాల్సిన సూర్యకాంతి ఇప్పుడు ప్రీమియం ఫీచర్‌గా మారిపోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా స్పందన

అను చేసిన ఈ పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ కావడంతో నెటిజన్లు బెంగళూరు అద్దె మార్కెట్‌పై భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నెలకు రూ.80 వేల అద్దె కట్టడం కంటే ఆ డబ్బుతో హోమ్ లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కోవడం ఉత్తమం’ అని ఒక వినియోగదారుడు సలహా ఇచ్చారు. ‘బెంగళూరు అద్దెలు చూస్తుంటే ముంబై రియల్ ఎస్టేట్ ధరలను తలపిస్తున్నాయి’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలి వస్తుందని మరో రూ.20 వేలు అదనంగా అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.

ఎందుకింత ధర?

గత రెండేళ్లుగా బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, సర్జాపూర్, కోరమంగళ వంటి ప్రాంతాల్లో అద్దెలు 30% నుంచి 50% వరకు పెరిగాయి. దీనికిగల కొన్ని కారణాలు.. ఆఫీసులు పూర్తిస్థాయిలో ప్రారంభం కావడంతో టెక్కీల తాకిడి పెరిగింది. విదేశీ కంపెనీల ప్రతినిధులు, హై-నెట్ వర్త్ వ్యక్తులు అధిక ధరలకు వెనకాడకపోవడంతో యజమానులు అద్దెలను భారీగా పెంచేస్తున్నారు.

ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement