చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టును మట్టికరిపించి భారత్ జయకేతనం ఎగరవేయడంతో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇండియా విజయం సాధించింది. ఒకవైపు మహాశివరాత్రి పండుగ.. మరోవైపు క్రికెట్‌లో భారత్ విజయం.. ఒకేరోజు రెండు పండుగలను తలపించాయి.
సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ చౌరస్తా, అమీర్‌పేట్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,హైటెక్ సిటీ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో అభిమానులు భారత జాతీయ జెండాలతో సందడి చేశారు. రోడ్లపైకి వచ్చి గెలుపు ఆనందాన్ని ఆస్వాదించారు.


