victory
-
భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజయం..
-
ఆఫ్గాన్ చిత్తు చిత్తు.. టెస్టుల్లో భారత్ కు అతిపెద్ద విజయం
-
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా ఆండ్రీవా సంచలనం
-
వరుసగా రెండో సారి IPL ట్రోఫీ గెలిచిన RCB
-
RCB ఫ్యాన్స్ అత్యుత్సాహం.. పరిగెత్తించిన పోలీసులు
-
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై జయకేతనం
-
చరిత్ర సృష్టించిన కోహ్లి.. RCB ఘన విజయం
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!
-
సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ
-
రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
-
గుజరాత్ పై కోల్ కతా ఘన విజయం
-
చెన్నై సూపర్ కింగ్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాక్
-
ప్రభుత్వం నుండి నాకు ఎలాంటి సెక్యూరిటీ వద్దు.. ప్రజలే నా సెక్యూరిటీ
-
పంజాబ్ పై ముంబై విజయం.. ముంబైని ఆదుకున్న తిలక్ వర్మ..
-
ఐపీఎల్ లో ముంబైపై బెంగళూరు విజయం
-
విజయ్ విజయానికి పనిచేసిన సీక్రెట్ టీమ్
-
తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవించింది
-
సింహం సింగిల్.. ఇటు జగన్.. అటు విజయ్
-
ఉత్కంఠ పోరులో బెంగళూరుపై లక్నో విజయం
-
తమిళుల చారిత్రక తీర్పు
-
ఉప్పల్‌లో దుమ్మురేపిన SRH
-
బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం
కోల్‌కతా: మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం.. ఇలాంటి పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇస్తూ, బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలు కాదు.. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం! షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.షేక్ హసీనా పతనం తర్వాత..డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి నిరసనగా కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు, సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులపై మమతా బెనర్జీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీదీ ప్రభుత్వం కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మాత్రమే కొమ్ముకాస్తోందని, బెంగాల్ హిందువుల పక్షాన నిలబడలేదనే వాదనను ఆ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.అక్రమ చొరబాటుదారులపై బీజేపీ అస్త్రంబంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్, ఈసారి ఆ ప్రభావానికి లోనైంది.గేమ్ ఛేంజర్‌గా ‘మతువా’ ఓటుబ్యాంక్ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది ‘మతువా’ సామాజిక వర్గం. 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆవిర్భవించిన ఈ వర్గానికి బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో బలమైన పట్టుంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు స్థానికులను బీజేపీ వైపు నిలబడేలా చేశాయి. తాము మతపరమైన వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో, బీజేపీ మాత్రమే తమకు పౌరసత్వం కల్పిస్తుందన్న ఆశతో వారు బీజేపీ పక్షాన నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి -
విజయ్ గెలుస్తాడని చెప్తే దేశమంతా నవ్వారు..!
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఫలితాలు రానే వచ్చాయి. ఫలితాలన్నే ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్‌కు అనుకూలంగానే ఉన్నాయి. ఒక్క తమిళనాడు తప్ప అక్కడ మాత్రం ఎవరు ఉహించని విధంగా సినీ స్టార్ పార్టీ టీవీకే ఘన విజయం సాధించి లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాగా ఈ ఫలితాల అంచనాను ముందే ఓ ఏజెన్సీ ఊహించింది. అయితే దాని అంచనా చూసి తొలుత అందరూ నవ్వుకున్నారని ఆ సంస్థ చీఫ్ ప్రదీప్ గుప్తా జాతీయ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. బెంగాల్, అస్సాంలలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురవేస్తుండగా కేరళలో విజయకేతనం ఎగురవేస్తుండగా యూడీఎఫ్ విజయదుదుంబి మోగించింది. అయితే్ ఈ ఎన్నికల్లో అందర్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఫలితాలు మాత్రం తమిళనాడువే.. డీఎంకే, ఏఐడీఎంకే లాంటి సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీలను వెనక్కి నెట్టి ఫిలిం స్టార్ విజయ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే ఈ విజయాన్ని తొలుతగా అంచనా వేసింది మాత్రం ఆక్సిస్ ఇండియా మాత్రమే అయితే ఆ సమయంలో ఆసర్వేలను చూసి దేశమంతా నవ్వుకుందని ఆ సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా అన్నారు.ప్రదీప్ గుప్తా వ్యాఖ్యలు డేటా సైన్స్ విజయం: "ఇది డేటా సైన్స్ సాధించిన విజయం. మిగతా సంస్థలు గ్రౌండ్ లెవల్లో ప్రజల నాడిని ఎందుకు పట్టుకోలేకపోయాయో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేసాం కానీ దీనిని ఎవరూ నమ్మలేదుఇదంతా ఒక గాలి వార్త అని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషకులు, ఇతర సంస్థలు మమ్మల్ని చూసి నవ్వుకున్నాయి అన్నారు.విజయ్ టీవీకే పార్టీకి టీవీకేకు తాము చెప్పినట్టే 35 శాతం ఓట్లు లభిస్తున్నాయని డీఎంకేకు మాత్రం 35 శాతం ఓట్లు వస్తాయని తాము అంచనా వేయగా, ప్రస్తుతం 32 శాతంగా ఉందన్నారు. ఏఐఏడీఎంకే (AIADMK) కి 23 శాతం వస్తాయని చెబితే, ప్రస్తుతం 27 శాతంగా ఉందని చెప్పారు. అదే స్థానాల ప్రకారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే రెండో స్థానంలో, ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోని ఏఐఏడీఎంకే మూడో స్థానంలో నిలుస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.టీవీకే విజయానికి కారణాలుప్రదీప్ గుప్తా విశ్లేషణ ..తమిళనాట 18 నుండి 39 ఏళ్ల మధ్య వయస్సు గల అధికంగా 42 శాతం మంది ఉన్నారని వీరంతా విజయ్ వైపు మెుగ్గు చూపారని తెలిపారు. 40 ఏళ్ల పైబడిన వారిలో 25 నుండి 30 శాతం మంది విజయ్‌కు మద్దతు ఇచ్చారు. అదే విధంగా డీఎంకే తరువాత అధికంగా మహిళా ఓటర్లు టీవీకేకే ఓటు వేసినట్లు తాము గుర్తించామని తెలిపారు. కాగా ప్రస్తుతం తమిళనాడులో టీవీకే 40 స్థానాల్లో గెలువగా మరో 60 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. -
బెంగాల్ లో కాషాయ ప్రభంజనం.. మమతా పాలనకు ఎండ్ కార్డ్?
-
244 టార్గెట్ ఊదేశారు.. SRHకి వరుసగా ఐదో విజయం
-
GTపై RCB ఘన విజయం
-
హైదరాబాద్ లో ఢిల్లీ చిత్తు.. శతక్కొట్టిన అభిషేక్
-
ముంబై చిత్తు.. పంజాబ్ ఘనవిజయం..
-
హంగేరీ కొత్త ’హీరో’ పీటర్ మాగ్యార్ ఎవరు?
బుడాపెస్ట్: యూరప్ రాజకీయాల్లో అగ్రదేశమైన హంగేరీలో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా ఏకఛత్రాధిపత్యం వహించిన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్కు అక్కడి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత, 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని ‘తిస్సా’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ఎన్నికయ్యారు.న్యాయశాస్త్రం అభ్యసించిన పీటర్ మాగ్యార్ ఒకప్పుడు ఓర్బన్ కు చెందిన ‘ఫిడెస్జ్’ పార్టీలోనే సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. బ్రస్సెల్స్‌లో దౌత్యవేత్తగా, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టారు. అయితే గతంలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కప్పిపుచ్చిన వ్యక్తికి ఓర్బన్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీటర్ 2024లో ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. అదే ఏడాది ‘తిస్సా’ అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని స్థాపించి, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.హంగేరీ ఎన్నికల ఫలితాలు కేవలం ఈ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం 199 స్థానాలున్న హంగేరీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 77 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి అద్దం పట్టింది. కమ్యూనిస్ట్ పాలన అంతమైన తర్వాత ఇంతటి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు లెక్కించిన 97.35 శాతం ఓట్లలో, టిస్జా పార్టీ ఏకంగా 53.6 శాతం ఓట్లతో 138 సీట్లను కైవసం చేసుకుని, మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకెళ్లింది.మరోవైపు జాతీయవాద నేత ఓర్బన్కు చెందిన ‘ఫిడెజ్’ పార్టీ కేవలం 37.8 శాతం ఓట్లతో 55 సీట్లకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తన ఓటమి అత్యంత బాధాకరమైనప్పటికీ స్పష్టమైనదని అంగీకరించిన ఓర్బన్.. పీటర్ మాగ్యార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది తీరాన వేలాది మంది మద్దతుదారుల మధ్య పీటర్ మాగ్యార్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ, ఈ రాత్రి అబద్ధాలపై నిజం గెలిచిందని వ్యాఖ్యానించారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసి, న్యాయవ్యవస్థకు, ఇతర సంస్థలకు పూర్తి స్వతంత్రతను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఎన్నికల ఫలితం హంగేరీకే కాకుండా యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాన మిత్రుడిగా ఉన్న ఓర్బన్ ఓటమితో, పాశ్చాత్య దేశాలకు మరింత బలం చేకూరింది. ఓర్బన్ అడ్డుకుంటూ వస్తున్న, యుక్రెయిన్ కు ఇవ్వాల్సిన 90 బిలియన్ యూరోల రుణానికి ఇప్పుడు మార్గం సుగమం కానుంది. అలాగే, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన కారణంగా హంగేరీకి యూరోపియన్ యూనియన్ నిలిపివేసిన నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన జేడీ వాన్స్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక మద్దతు ఇస్తామని ప్రకటించినా ఓర్బన్‌ను ప్రజలు గెలిపించకపోవడం గమనార్హం.ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
ఢిల్లీపై చెన్నై అద్భుత విజయం
-
ఉత్కంఠ పోరులో లక్నో విజయం
-
కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం
-
కోల్ కతాపై ముంబై ఇండియన్స్ విజయం
-
ఫైనల్ గెలవడానికి కారణం సంజు కాదు.. టీమిండియాలో అందరికంటే వాడే డేంజర్..
-
చరిత్ర సృష్టించిన భారత్
-
రఫ్పాడించిన భారత్.. టీ20 ఛాంపియన్స్ 2026
-
విశ్వవిజేత భారత్... టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం
-
జింబాబ్వేపై భారత్ విజయం
-
టీ20 వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ విజయం
-
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
కరీంనగర్లో గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చింది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం గొప్ప విషయం అని.. ఈ గెలుపు పట్టరాని సంతోషాన్ని ఇచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని.. ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్‌కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని.. ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు.‘‘హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారు ఓటర్లు. నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. ఒకనాడు రెండు సీట్లతో బీజేపీ ప్రస్థానం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై కోట్ల రూపాయలు వెదజల్లారు. మా పార్టీ కార్యకర్తలకు కూడా ఫోన్లు చేసి లక్షలిస్తామన్నారు. మేం మ్యాజిక్ ఫిగర్ దాటాం ఆల్రెడీ. ఇండిపెండెంట్స్ గా గెల్చినవారు కూడా మాకు మద్దతిస్తారు.ఎంఐఎం పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురేసిన పార్టీ బీజేపీ’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
T20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం
-
చరిత్ర సృష్టించిన యంగిండియా
-
ఈ సాలా కూడా కప్ నమ్దే.. కుమ్మేసిన RCB..
-
ఉతికారేసిన భారత్.. 15.2 ఓవర్లలోనే 208 ఛేజ్
-
ఫస్ట్ టీ20లో భారత్ ఘన విజయం
-
భారత్ సిరీస్ క్లీన్ స్వీప్.. శ్రీలంక చిత్తు..
-
శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..
-
దుఃఖాన్ని దిగమింగుకొని స్మృతి మంధాన విశ్వరూపం
-
మహారాష్ట్ర ఎన్నికలు.. బీజేపీ జోరు
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ సంచలన విజయం సాధించింది. 288 పంచాయతీ పరిషత్ స్థానాలకు గానూ 120 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి ఈ ఎన్నికలలో పెద్దగా ప్రభావితం చూపలేకపోయింది. ఈ విజయంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాషాయ పార్టీ జోరు నడుస్తో్ంది. దేశవ్యాప్తంగా ఏ ఎన్నిక జరిగినా బీజేపీ అధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మెున్నటికి మెున్న కేరళ కమ్యూనిస్టుల కోటైన తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకోగా, తాజాగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలోనూ ఆ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఈ విజయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ "ఎన్నికల ప్రచారంలో నేను ఏ పార్టీని, నాయకుడిని విమర్శించలేదు. నా ప్రణాళికలను వివరించాను. ప్రజలు దానిని అంగీకరించారు. అని ఫడ్నవీస్ అన్నారు. ఈ విజయం పట్ల ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే స్పందించారు. మహాయుతి కూటమి లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిందని దానికి మద్ధతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో బిీజేపీ 120 సీట్లు సాధించగా, శిండే శివసేన 57 స్థానాలు, అజిత్ ఎన్సీపీ 37 సీట్లు గెలిచుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇందులో కాంగ్రెస్ 31, ఉద్దవ్ శివసేన 10, శరద్ పవార్ ఎన్సీపీ 10 సీట్లు గెలిచాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 246 మున్సిపల్ కౌన్సిళ్లు, 46 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ సమరంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. ముంబైతో పాటు మరో 29 మున్సిపల్ కార్పొరేషన్ స్థానాలకు వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి. -
సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ కాంగ్రెస్ దే పై చేయి..
-
కేరళలో బీజేపీ గ్రాండ్ విక్టరీ
కమ్యూనిస్టుల ఖిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడింది. 45 సంవత్సరాలుగా ఎల్డీఎప్ పాలిస్తున్న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజెపీ తొలిసారిగా సంచలన విజయం సాధించింది. కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటింది. ఈ విజయంపై ప్రధాని మోదీ సైతం సంతోషం వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు ధన్యవాదాలని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.కేరళ ఈపేరు వింటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా చెబుతుంటారు. దేశవ్యాప్తంగా లెప్ట్ పార్టీల ప్రభావం క్షీణిస్తున్నా కేరళలో మాత్రం వారి ఉనికి కాపాడుకుంటూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా తన ప్రభంజనం చూపిస్తూ ప్రతిచోట స్వయంగానో లేదా తన కూటమిద్వారానో అధికారం హస్తగతం చేసుకుంటున్న కాషాయదళం ఇంతకాలం కేరళలో మాత్రం తమ ప్రభావం చూపలేక పోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బోణీకొట్టలేకపోయిన ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటుతో సరిపెట్టుకుంది. దీంతో కేరళలో బీజేపీ పోటీలోనే లేనట్లు భావించారు. అయితే ప్రస్తుతం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్య విజయం సాధించింది.ఎన్డీఏ కూటమి తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 101 స్థానాలున్న కార్పొరేషన్లో బీజేపీ ఒంటరిగా 50 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ కూటమి 29 సీట్లు సాధించగా కాంగ్రెస్‌కు చెందిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అంతేకాకుండా బీజేపీ ఎర్నాకులం జిల్లాలోనిత్రిపునితురా మున్సిపాలిటితో పాటు పాలక్కడ్‌లోనూ జయకేతనం ఎగురవేసింది.అయితే ఈ విజయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు ఇది "కేరళలో ఇది అద్భుతమైన రోజు రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. యూడీఎఫ్ కూటమికి హృదయపూర్వక శుభాకాంక్షలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఇది మంచి పరిణామం. కార్యకర్తల కష్టం, అవినీతిపై వ్యతిరేకత వీటన్నిటితో 2020 ఫలితాలతో పోల్చితే మరింత మెరుగయ్యాము. అదే విధంగా తిరువనంతపురంలో సంచలన విజయం సాధించిన బీజేపీకి కృతజ్ఞతలు. ఆ ప్రాంతంలో 45 సంవత్సరాల పాలనకు వ్యతిరేకంగా నేను ప్రచారం నిర్వహించాను. కానీ ప్రజలు అక్కడ వేరే పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే" అని శశిథరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో గత నాలుగు దశాబ్దాలుగా కమ్యూనిస్టుల కూటమే విజయం సాధిస్తూ వస్తుంది. అటువంటి చోట ప్రస్తుతం కాషాయ జెండా ఎగరడం అక్కడ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా ఈ నెల 9,11 తేదీలలో కేరళలో స్థానికసంస్థలకు ఎన్నికలు జరిగాయి. -
జానీ మాస్టర్ భార్య ఘన విజయం
బంజారాహిల్స్: తెలుగు ఫిలిం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి జోసఫ్ ప్రకాష్‌పై 29 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రముఖుల అండదండలు లేకుండానే విజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో సుమలత అలియాస్ అయేషాకు 228 ఓట్లు వచ్చాయి. మొత్తం 510 ఓట్లకుగాను 439 ఓట్లు పోలవగా, జోసఫ్ ప్రకాష్ మాస్టర్‌కు 199 ఓట్లు దక్కాయి జనరల్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, ట్రెజరర్‌గా పి.చిరంజీవి, ఉపాధ్యక్షులుగా ఎ.సురేష్, ఎం.రాజు, జాయింట్ సెక్రటరీలుగా కె.కిరణ్‌కుమార్, ఎ.రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివకృష్ణ, మెంబర్లుగా కె.సతీష్ గౌడ్, సురేష్, బి.సుమన్, ఎల్.కృష్ణ, ఏ.మనోహర్, ఆర్.బోస్, వేదాంత మాస్టర్, ఈసీ మహిళా విభాగంలో కే.శ్రీదేవి, ఎస్.శృతి గెలుపొందారు. -
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
-
ఐపీఎస్‌ను వీడి ఎమ్మెల్యేగా.. బిహార్ లో సూపర్ విక్టరీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్న ఆనంద్ మిశ్రా ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆనంద్ మిశ్రా తన ఫైర్ బ్రాండ్ ఆపరేషన్స్, బైక్ రైడ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ పొందారు.మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బక్సర్ నియోజకవర్గం నుంచి 28 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1951లో బక్సర్ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకూ కాంగ్రెస్ అక్కడ 10 సార్లు విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గంలో మెుదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటిక తన వ్యూహాలతో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తివారీపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 జనవరిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆనంద్ మిశ్రా తొలుత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరారు. అనంతరం పలు కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆనంద్ మిశ్రాకు ఆర్ఎస్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అస్సాంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆనంద్ మిశ్రా నేపథ్యం1981 జూన్ 1న బిహార్ రాష్ట్రంలోని బోజ్పూర్ లో జన్మించారు. 2011లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం క్యాడర్ లో విధులు నిర్వహిస్తూ అక్కడ పలు జిల్లాలలు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. అస్సాంలోని లకీంపూర్, దుబ్రీ జిల్లాలలో ఆయన నిర్వహించిన యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్ ఆనంద్ మిశ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అంతేకాకుండా మేఘాలయ, అస్సాంలలో మిలిటెంట్స్ వ్యతిరేఖ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆనంద్ మిశ్రా ప్రత్యేకమైన శైలిలో విధులు నిర్వహిస్తూ జనాలలో మంచి పాపులారిటీ సంపాదించారు. -
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్ పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో మెుకామా ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా నుండి పోటీ చేసి గెలిచింది. -
2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..
-
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
-
అభివృద్ధి, సంక్షేమానికే పట్టం
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జాతీయ ప్రజా స్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి విజయ ఢంకా మోగించింది. ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయం దక్కించుకుంది. ఈస్థాయి ప్రభంజనాన్ని కూటమి పెద్దలు కూడా అంచనా వేయలేకపోయారు. 243 స్థానాలకు గాను 160 వరకు సీట్లు రావొచ్చని భావించగా, ఏకంగా 200కుపైగా సీట్లను ఎన్డీయే తన ఖాతాలో వేసుకుంది. ఈ అపూర్వమైన గెలుపు వెనుక బహుళ కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక పరిస్థితులు, పదునైన ఎన్నికల మేనేజ్మెంట్ వంటివి ఎన్డీయేకు కలిసొచ్చాయి. అధికార కూటమి విజయానికి దోహదపడిన కొన్ని కీలక అంశాలు ఏమిటంటే.. మహిళలు–ఈబీసీ సమ్మేళనం ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఉత్సాహంగా ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేయడం గమనార్హం. వారు ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు అండగా నిలిచారు. సరిగ్గా ఎన్నికల ముందు పలు మహిళా సంక్షేమ పథకాలను నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. జీవికా దీదీ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) మహిళలకు కూడా సాయం అందజేసింది. రాష్ట్రంలోని 3.51 కోట్ల మహిళా ఓటర్లలో దాదాపు 40 శాతం మందిని ఇది నేరుగా ప్రభావితం చేసింది. మహిళా సాధికారతపై నితీశ్ కుమార్ చాలా రోజులుగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ఫలితంగా ఎన్డీయే పట్ల మహిళా ఓటర్లు ఆకర్శితులయ్యారు. వారి ఆదరణ ఓట్ల రూపంలో బీజేపీ కూటమికి బదిలీ అయ్యింది. కులాల సమీకరణాలు వేర్వేరు కులాలను తమకు అనుకూలంగా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఎన్డీయే సఫలమైంది. అగ్రవర్ణాల ఓటర్లు సంప్రదాయకంగా బీజేపీ వెన్నంటే నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆ ఆనవాయితీ యథాతథంగా కొనసాగింది. మరోవైపు ఓబీసీలు, ఈబీసీలతోపాటు దళితుల్లో గణనీయమైన ఓ వర్గం ఎన్డీయేకు మద్దతు పలకడం విశేషం. కులాల లెక్కలపై విపక్ష మహాగఠ్‌బంధన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. భిన్న సామాజిక వర్గాలు ఎన్డీయే వెనుక సంఘటితమయ్యాయి. అధికార కూటమినే వారు మరోసారి విశ్వసించారు. విపక్షాల్లో చీలికలు బీజేపీ కూటమిలో స్పష్టమైన ఐక్యమత్యం కనిపించగా, కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిలో చీలికలు బహిర్గతమయ్యాయి. చివరి నిమిషం వరకు సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు. కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీలు తప్పలేదు. పొత్తు ధర్మాన్ని విస్మరించి, కూటమి పారీ్టలే పరస్పరం పోటీకి దిగాయి. మరోవైపు ఓట్ల బదిలీ సైతం జరగలేదు. తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యరి్థగా ప్రకటించడం కూటమిలో కొందరికి నచ్చలేదు. ప్రతిపక్షానికి ఒక ఉమ్మడి వ్యూహం లోపించింది. ఎవరికి వారే అన్నట్లుగా ప్రవర్తించారు. మహాగఠ్బంధన్ను బలహీన కూటమిగా ప్రజలు భావించారు. దాంతో ఎన్డీయేకు ఎదురే లేకుండాపోయింది. మొత్తానికి ప్రతిపక్షం స్వీయ తప్పిదాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చీలిన ముస్లిం ఓట్లుకాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ప్రధాన బలం ముస్లిం–యాదవ్ ఓట్లే. కానీ, ఈసారి ముస్లింలు, యాదవులు ఆ కూటమిని అంతగా ఆదరించలేదు. ఈ రెండు వర్గాలను అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉండడం మహాగఠ్‌బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. ముస్లింల ఓట్లు భారీగా చీలిపోయాయి. రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) బలమైన యాదవుల్లోనూ చీలికలు కనిపించాయి. యాదవుల్లో ఓ వర్గం ఎన్డీయేకు అండగా నిలిచింది. గెలిస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ ఆర్జేడీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. ఎన్నికల మేనేజ్మెంట్ చురుకైన ఎన్నికల మేనేజ్మెంట్ ఎన్డీయేకు బలంగా మారింది. 2020 నాటి ఎన్నికల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లను ఆ కూటమి సరిచేసుకుంది. ఈసారి కూటమి పక్షాల మధ్య సమన్వయం బాగా పెరిగింది. వాటి మధ్య చక్కటి సహకారం కనిపించింది. బూత్–స్థాయి మేనేజ్మెంట్ బాగా పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో కూటమి పారీ్టలన్నీ కలిసికట్టుగా పాల్గొన్నాయి. అంతర్గతంగా అక్కడక్కడా అభిప్రాయభేదాలున్నా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాయి. బీజేపీ, జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేశారు. వారంతా నిత్యం ప్రజల్లో ఉండడం, ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడం ఎన్డీయే విజయ తీరాలకు చేర్చింది. కొంపముంచిన ‘జంగిల్‌రాజ్’ జంగిల్‌రాజ్ అనగానే గుర్తొచ్చే పేరు బిహార్. ఆర్జేడీ హయాంలో ఆటవిక పాలన కొనసాగిందని, ప్రతిపక్షానికి ఓటేస్తే ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ వస్తుందని ఎన్డీయే నేతలు పదేపదే హెచ్చరించారు. జంగిల్‌రాజ్ రోజులను జనం ఇప్పటికీ మర్చిపోలేదు. మహాగఠ్‌బంధన్‌కు ఓటేస్తే జరిగేదేమిటో ఊహించుకొని మరోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. అభివృద్ధి కావాలి తప్ప ఆటవిక రాజ్యం వద్దని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవినీతిపరుడు కాకపోయినప్పటికీ అవకాశవాది అనే ముద్ర ఉంది. అధికారం కోసం సులువుగా కూటములు మార్చేస్తారన్న విమర్శలున్నాయి. అయినా సరే ఓటర్లు ఆయన పరిపాలనను ఆదరించారు. నితీశ్ నాయకత్వం, పాలనా సామర్థ్యం కూడా ఎన్డీయేకు అనుకూలంగా మారింది. ఉచిత విద్యుత్.. మధ్యతరగతికి భరోసా రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత పథకాన్ని ఎన్నికల ముందే అమలు చేయడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుంది. సుమారు 5 కోట్ల మంది ఓటర్లు ఈ పథకంతో లబ్ధి పొందారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామంటూ విపక్ష కూటమి హామీ ఇచి్చనా, ’ఇప్పటికే వస్తున్న’ప్రయోజనం ముందు ఆ హామీ నిలవలేకపోయింది. వృద్ధులు, ఆశ్రితులకు ఆదరణ సామాజిక భద్రతా పెన్షన్‌ను రూ.400 నుంచి ఏకంగా రూ.1100కి పెంచడం 1.11 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నేరుగా ప్రయోజనం చేకూర్చింది. ఇది వారి కుటుంబాల్లో ఎన్డీయే పట్ల బలమైన సానుకూలతను నింపింది. యువత, విద్యార్థుల మద్దతు నిరుద్యోగ భృతి(7.6 లక్షల మందికి), స్టూడెంట్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ మాఫీ (4 లక్షల మందికి) పథకాలు యువతను, విద్యార్థులను ఎన్డీయే వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి. సోషల్ ఇంజనీరింగ్ సూపర్ హిట్ గత ఎన్నికల్లో దూరమైన చిరాగ్ పాశ్వాన్, ఉపేంద్ర కుశ్వాహాలను తిరిగి కూటమిలోకి తీసుకురావడం నితీశ్–బీజేపీల రాజకీయ వ్యూహానికి పరాకాష్ట. వీరితోపాటు జీతన్ రామ్ మాంఝీని నిలబెట్టుకోవడం ద్వారా దళిత, అత్యంత వెనుకబడిన, కుశ్వాహా ఓట్లను ఎన్డీయే గంపగుత్తగా సాధించింది. ఈ ముగ్గురూ తమ వర్గాల ఓట్లను ఎన్డీయేకు బదిలీ చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించారు. అభివృద్ధి, హిందుత్వ ఒకవైపు పూరి్ణయా విమానాశ్రయం, బెగుసరాయ్ వంతెన వంటి అభివృద్ధి పనులను చూపిస్తూనే, మరోవైపు సీతామఢిలో జానకీ ఆలయ(సీతాదేవి) నిర్మాణానికి అమిత్ షా, నితీశ్ కుమార్‌లు భూమి పూజ చేయడంతో హిందుత్వ ఓటు బ్యాంకు కూడా బీజేపీని బలపర్చింది. ప్రచారంలో మోదీ స్వయంగా రంగంలోకి దిగడం ఎన్డీయేకు కొండంత బలాన్నిచి్చంది. 16 రోజుల్లో 14 కీలక జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. -
ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బిహార్‌లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బిహార్ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బిహార్ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.బిహార్‌లో ఎన్డీఏ సునామీ సృష్టించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు. Good governance has won. Development has won. Pro-people spirit has won. Social justice has won. Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…— Narendra Modi (@narendramodi) November 14, 2025 -
200 మార్క్ దాటిన NDA సునామీలో కొట్టుకుపోయిన కాంగ్రెస్
-
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం.. నవీన్ యాదవ్ రియాక్షన్
-
గెలుపుపై నవీన్ యాదవ్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. గెలుపుపై నవీన్ యాదవ్ స్పందిస్తూ.. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘నా కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. పదేళ్లలో చేసింది ఏమిలేక...ఏం చెప్పుకోలేక మాపై ఆరోపణలు చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘‘నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అధిక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తా. అభివృద్ధే నా అజెండా. జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం’’ అంటూ నవీన్‌యాదవ్ చెప్పుకొచ్చారు. నన్ను నా కుటుంబం, వ్యక్తిత్వంపై దెబ్బతిస్తూ ఓట్లు ఆడిగారు. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. రిగ్గింగ్,దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు. అధిక బడ్జెట్‌తో జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు. -
బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్
-
రికార్డు సృష్టించనున్న నితీష్ కుమార్..10సారి ముఖ్యమంత్రిగా?
ఈ రోజుల్లో రాజకీయాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కష్టపడడంతోపాటు అదృష్టం సైతం కలిసిరావాలి. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడానికే నేతలు ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. అలాంటిది ఒక ప్రభుత్వ అధినేతగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేయడమంటే ఎంత కష్టమైన వ్యవహారమో ఆలోచించండి. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గెలిస్తే నితిష్ కుమార్ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది ఇదే జరిగితే ఏకంగా పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ రికార్డు సృష్టించనున్నారు. నితీష్ కుమార్ ఈ పేరు వింటే చాలు రాజకీయ ఎత్తుగడలకు, సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తన పదవి కాపాడుకోవడం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా నితీష్ సై అంటారు. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పొత్తుతో అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టిన నితీష్ కుమార్ కొద్దికాలానికే ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమిని వీడి తిరిగి ఎన్డీఏతో జతకట్టారు. 2022లో ఎన్డీఏకు కటీఫ్ చెప్పిన నితిష్ తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కొద్ది కాలం మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయన ఆ కూటమిలో పొసగక తిరిగి కాషాయ దళంతో దోస్తీ చేశారు. తాజాగా ఎన్డీఏతో మరోసారి జతకట్టి బిహార్ లో మరోసారి అధికారం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.2000 సంవత్సరంలో తొలిసారి ముఖమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వ అస్థిరతతో 7 రోజులకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2005లో తిరిగి సీఎంగా పదవి చేపట్టిన ఆయన 2014లో ఎన్డీఏ కూటమితో విభేదాల కారణంగా పదవి కోల్పోయారు. ఆకాలం మినహా 2005 నుంచి నేటి వరకూ ఆయనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఒక రాష్ట్ర మఖ్యమంత్రిగా పది సార్లు ప్రమాణం స్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ కుమార్ రికార్డులెక్కుతారు. -
అమిత్ షా చెప్పిందే జరిగింది..
-
సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్
-
బీహార్ కా షేర్
-
న్యూయార్క్ మేయర్‌గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్‌గా రికార్డు
-
నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్‌గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్‌గానూ పేరొందారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్‌లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ! -
ఫైనల్ కు చేరిన భారత్
-
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం
-
పాక్ కు చెంపదెబ్బ.. ట్రోఫీ నిరాకరించిన భారత్
-
ఆసియా కప్ భారత్‌దే... ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయకేతనం
-
ఫైనల్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత్
-
ఆసియా కప్ లో ఫైనల్ కు టీమిండియా
-
మళ్లీ పాక్ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘనవిజయం సాధించిందని చెబుతూ, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది.పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్‌పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ‘ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్’ అనే పేరుతో, పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో, ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.కాగా పాక్ విషప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర మీడియా, విశ్లేషకులు, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి. ‘వాస్తవాలను వక్రీకరిస్తూ, జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరం’ అని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి. ఉపగ్రహ చిత్రాలు, స్వతంత్ర మీడియా రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమయ్యింది. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర.. విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
-
నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఘన విజయం
-
ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు.. కూటమి ఇచ్చుకున్న రిగ్గింగ్ తీర్పు
-
Big Question: కలెక్టర్ ముందే దొంగ ఓట్లు.. గుద్దేశాం.. గెలిచేశాం
-
KSR Live Show: ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని తలలు పగిలినా.. ఎగిరేది YSRCP జెండానే..!
-
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో YSRCP ఘన విజయం
-
భారత మహిళలదే వన్డే క్రికెట్ సిరీస్
-
బర్మింగ్‌హామ్ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
-
ప్రియాంకకు హైకోర్టు సమన్లు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చిక్కుల్లో పడ్డారు. 2024 నవంబర్‌లో కేరళలోని వయనాడ్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ, బీజేపీ మహిళా నేత నవ్య హరిదాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు సమన్లు జారీ చేసింది.గత వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయాన్ని సవాలు చేస్తూ, నాటి పోల్ రద్దు కోరుతూ నవ్య హరిదాస్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియాంకా గాంధీ ఎన్నికల అఫిడవిట్లో తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం చెల్లదని ప్రకటించాలని నవ్య కోరారు.న్యాయవాది అయిన నవ్య హరిదాస్ సమర్పించిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు న్యాయమూర్తి కె బాబు విచారించారు. ప్రియాంక రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన పెట్టుబడులు, చరాస్తుల వివరాలను దాచిపెట్టారని నవ్య ఆరోపించారు. వయనాడ్ స్థానంలో విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదులుకోవడంతో 2024, నవంబర్ 13న వయనాడ్‌కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె తన సమీ ప్రత్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి చెందిన సత్యన్ మోకేరిని ఓడించారు. నాడు వయనాడ్‌లో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీల మధ్య త్రిముఖపోరు జరిగింది. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా.. -
RCB Vs PBKS: ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి
-
ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల
-
క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం
-
గుజరాత్ పై 20 రన్స్ తేడాతో గెలిచిన ముంబై
-
ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB
-
కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం
-
బెంగళూరుపై హైదరాబాద్ విజయం
-
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం
-
హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్
-
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం
-
ఐపీఎల్ లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం
-
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
-
IPLలో వరుసగా 4 విజయం సొంతం చేసుకున్న ముంబై
-
ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి
-
2 పరుగుల తేడాతో గెలుపొందిన లక్నో సూపర్ జెయింట్స్
-
హైదరాబాద్ పై 4 వికెట్ల తేడాతో ముంబై గెలుపు
-
రాజస్థాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
-
కోల్ కతాపై పంజాబ్ ఘన విజయం
-
చెన్నైపై కోల్ కతా భారీ విజయం
-
RCBపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
-
చెన్నైపై పంజాబ్ ఘన విజయం
-
పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం
-
వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
-
లక్నోపై పంజాబ్ గెలుపు
-
Gunshot: దెబ్బ అదుర్స్ కదూ.. కనుమరుగైన టీడీపీ
-
ఫ్యాన్ సత్తా.. కూటమి చిత్తు
-
చెన్నైపై సత్తా చాటిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
-
Big Question: ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని YSRCP విజయకేతనం
-
కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ.. 32 చోట్ల YSRCP విజయకేతనం
-
ఫ్యాన్ ప్రభంజనం
-
ఐపీఎల్ లో బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో YSRCP విజయకేతనం
-
గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ గెలుపు
-
IPL తొలి మ్యాచ్ లో బెంగళూరు బోణీ
-
ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు..
-
WPL విజేత ముంబై ఇండియన్స్
-
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు
-
సీడీయూ, సీఎస్‌యూ కూటమిదే జర్మనీ
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి. గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్‌యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్‌ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.సంకీర్ణ ప్రభుత్వం దిశగా..ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్‌యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్‌డీ పార్టీకి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన ఎస్డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్‌యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్‌డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు. బలపడనున్న అమెరికాతో మైత్రిరష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్‌కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్‌కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు. ‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. -
దాయాది పాక్ పై భారత్ ఘన విజయం
-
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
-
చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా
-
గుజరాత్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
మహిళల ప్రీమియర్ లీగ్ లో బోణీ కొట్టిన బెంగళూరు
-
బీజేపీ విక్టరీ.. ఆప్ ఓటమి
-
మోదీషా మంత్రాంగంతో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్
-
కమలం అదుర్స్.. అప్ చెదుర్స్.. కాంగ్రెస్ బెదుర్స్
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం... 70 స్థానాలకు గాను బీజేపీకి 48, ఆమ్ ఆదీ పార్టీకి 22 స్థానాలు.. వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్
-
ఆపద నుంచి ప్రజలకు విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(BJP victory) సాధారణ విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. దశాబ్ద కాలం తర్వాత ఆప్ద(ఆపద) నుంచి ఢిల్లీ ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని అన్నారు. బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అవకతవకలపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్నిరకాల అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. జనం సొమ్మును లూటీ చేసినవారి నుంచి తిరిగి కక్కిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇప్పటిదాకా పాలన వెలగబెట్టినవారు పచ్చి అవినీతిపరులు అని మండిపడ్డారు. షార్ట్–కట్ రాజకీయాలు చేసేవారికి ప్రజలు షార్ట్–సర్క్యూట్‌తో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజల రుణం తీర్చుకుంటాం ధూర్త, మూర్ఖ రాజకీయాలు మన దేశానికి అవసరం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆప్, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఎజెండాను చోరీ చేసిందన్నారు. హిందుత్వ వేషంతో ఓట్లు రావడం లేదు కాబట్టి మిత్రపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల ఢిల్లీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని, నగరాన్ని అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని వివరించారు. యమునా నదిలో శుభ్రం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మన ప్రయత్నాలను యమున మాత తప్పకుండా ఆశీర్వదిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి ధూర్త, మూర్ఖ రాజకీయాలు చేసే దుష్టులు దేశ రాజకీయాలను కబ్జా చేయకుండా ఉండాలంటే లక్ష మంది యువత రాజకీయ రంగంలోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు రాజకీయ పరివర్తన అవసరమని తెలిపారు. 21వ శతాబ్దంలో వికసిత్ భారత్‌కు నూతన జీవన శక్తి, నూతన ఆలోచనలు, నూతన ఉత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అర్బన్ నక్సలైట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలను బలిపెట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి నీచ రాజకీయాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభివృద్ధి, సుపరిపాలనతోప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రెండు రెట్ల వేగంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు.ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి తిరుగులేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రాత్మక విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఇది తమ గ్యారంటీ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. -
అమ్మాయిలు అదరహో.. వరల్డ్ విజేతగా భారత్
-
టీ20 అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో జగజ్జేత భారత్
-
భారత్ గ్రాండ్ విక్టరీ
-
ఐర్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్..
-
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది. టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్‌లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడి హరియాణా 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్‌ల్లో నెగ్గి, 8 మ్యాచ్‌ల్లో ఓడింది. 3 మ్యాచ్‌లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
Big Question: మహారాష్ట్రలో కాషాయ ప్రభంజనం
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
-
మహారాష్ట్రలో భారీ మెజార్టీ దిశగా మహాయుతి
-
బిట్ కాయిన్ కి ట్రంప్ కిక్కు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్..! ఇక కోట్లే..!
-
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా
-
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్‌పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్‌ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్‌గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్‌ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్‌్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్‌్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్‌్కకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్‌కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్‌లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్‌ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్‌్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్‌ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్‌ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్‌కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్‌ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్‌కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనం.. ఇప్పటికే 294 ఎలక్టోరల్ ఓట్లు కైవసం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ట్రంప్ గెలిచారు?.. మరి మనకేంటి?


