బంజారాహిల్స్: తెలుగు ఫిలిం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి జోసఫ్ ప్రకాష్‌పై 29 ఓట్ల తేడాతో గెలిచారు. ప్రముఖుల అండదండలు లేకుండానే విజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో సుమలత అలియాస్ అయేషాకు 228 ఓట్లు వచ్చాయి.
మొత్తం 510 ఓట్లకుగాను 439 ఓట్లు పోలవగా, జోసఫ్ ప్రకాష్ మాస్టర్‌కు 199 ఓట్లు దక్కాయి జనరల్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, ట్రెజరర్‌గా పి.చిరంజీవి, ఉపాధ్యక్షులుగా ఎ.సురేష్, ఎం.రాజు, జాయింట్ సెక్రటరీలుగా కె.కిరణ్‌కుమార్, ఎ.రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివకృష్ణ, మెంబర్లుగా కె.సతీష్ గౌడ్, సురేష్, బి.సుమన్, ఎల్.కృష్ణ, ఏ.మనోహర్, ఆర్.బోస్, వేదాంత మాస్టర్, ఈసీ మహిళా విభాగంలో కే.శ్రీదేవి, ఎస్.శృతి గెలుపొందారు.


