బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ప్రధాని మోదీ ట్వీట్‌ | Prime Minister Narendra Modi Tweet On Bihar Victory | Sakshi
Sakshi News home page

బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ప్రధాని మోదీ ట్వీట్‌

Nov 14 2025 6:07 PM | Updated on Nov 14 2025 9:01 PM

Prime Minister Narendra Modi Tweet On Bihar Victory

ఢిల్లీ: బిహార్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బిహార్‌లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బిహార్‌ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘‘ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బిహార్‌ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బిహార్‌ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

బిహార్‌లో ఎన్డీఏ సునామీ సృష్టించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్‌ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్‌ రాజ్‌లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్‌రాజ్‌లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు.
 

  

Advertisement
 
Advertisement
Advertisement